హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 155. జనాజా నమాజ్ చేయటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 155వ అధ్యాయం: జనాజా నమాజ్ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని ఖనన సంస్కారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట స్త్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 929 – 931) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

155. జనాజా నమాజ్ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని ఖనన సంస్కారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట స్త్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి…..

↑ విషయ సూచిక

باب الصلاة عَلَى الميت وتشييعه وحضور دفنه وكراهة اتباع النساء الجنائز وَقَدْ سَبَقَ فَضْلُ التَّشْييعِ.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

జనాజా వెంట నడవటానికున్న ఔన్నత్యం గురించి ఇంతకు ముందే వివరించటం జరిగింది.

929

హదీసు 929

عن أَبي هُريرةَ رضيَ اللَّهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ شَهِدَ الجنَازَةَ حَتَّى يُصَلَّي عَلَيها فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهدَهَا حَتَّى تُدْفَنَ فَلَهُ قِيراطَانِ"قيلَ وَمَا القيراطَانِ؟ قَالَ:"مِثْلُ الجَبلَيْنِ العَظِيمَيْنِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఎవరయినా మృతుని అంత్యక్రియల్లో పాల్గొని నమాజ్ ముగిసేవరకు జనాజా వెంట ఉంటే అతనికి ఒక ఖీరాతు పుణ్యం లభిస్తుంది. ఎవరయినా ఖనన సంస్కారాలు ముగిసేవరకూ జనాజా వెంట ఉంటే అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభిస్తుంది. "రెండు ఖీరాతు లంటే ఎంత?" అని ఎవరో అడగ్గా, దానికి దైవప్రవక్త ﷺ "రెండు పెద్ద పర్వతాల అంత" అని సమాధాన మిచ్చారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whoever follows the funeral procession and offers the funeral prayer for it, will get a reward equal to one Qirat, and whoever attends it till burial, will get a reward equal to two Qirat.” It was asked, “What are two Qirat?” He ﷺ replied, “Equal to two huge mountains.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|155. జనాజా నమాజ్ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని ఖనన సంస్కారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట స్త్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి…..|హదీసు 929

930

హదీసు 930

وعنه أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنِ اتَّبعَ جَنَازَةَ مُسْلمٍ إيمَاناً واحْتِسَاباً، وَكَانَ مَعَهُ حَتَّى يُصَلَّي عَلَيها ويَفْرُغَ مِنْ دَفنِها، فَإِنَّهُ يَرْجعُ مِنَ الأَجرِ بقِيراطَين كُلُّ قيرَاط مِثلُ أُحُدٍ، ومَنْ صَلَّى عَلَيهَا، ثُمَّ رَجَعَ قَبْلَ أَن تُدْفَنَ، فَإِنَّهُ يرجعُ بقِيرَاط" رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : సంపూర్ణ విశ్వాసంతో, పుణ్యాన్ని ఆశిస్తూ ఒక ముస్లిం జనాజా వెంట నడిచి జనాజా నమాజు చేసి, ఆ తర్వాత ఖనన సంస్కారాలు ముగిసేవరకు శవం వెంట ఉండే వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు రెండు ఖీరాతుల పుణ్యం వెంట తీసుకొని వెళ్తాడు. అందులో ఒక్కొక్క ఖీరాతు ఉహుద్ పర్వతమంత ఉంటుంది. అయితే మృతుణ్ణి ఖననం చేయక ముందే కేవలం జనాజా నమాజ్ మటుకు చేసి తిరిగి వెళ్ళే వ్యక్తి ఒక ఖీరాతు పుణ్యం వెంట తీసుకొని వెళ్తాడు.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whosoever attends the funeral of a Muslim believing and hoping for the reward from Allah and remains with it until the prayer is offered over it and the burial is completed, he will return with a reward of two Qirat; each Qirat is equivalent to Mount Uhud; and whosoever offers his prayer over it and returns before its burial, he will come back with one Qirat.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

దేవుని మీద విశ్వాసంతో, ఆయన ప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో జనాజాలో (అంత్యక్రియల్లో) పాల్గొన్నవారికి మాత్రమే పైన పేర్కొనబడిన పుణ్యం లభిస్తుంది. అలాగాకుండా చనిపోయినవాడు కేవలం తమ పొరుగువాడు అనో లేక పెద్ద ఆఫీసరు అనో లేక తమ బంధువు అనో తలచి అతని జనాజాలో పాల్గొంటే అప్పుడు దేవుడు తమకు పుణ్యం ప్రసాదిస్తాడని ఆశించనక్కర్లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|155. జనాజా నమాజ్ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని ఖనన సంస్కారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట స్త్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి…..|హదీసు 930

931

హదీసు 931

وعن أُمِّ عطِيَّةَ رضي اللَّه عنها قَالَتْ: "نُهينَا عنِ اتِّبَاعِ الجَنائز، وَلم يُعزَمْ عَليْنَا"متفقٌ عليه. "ومعناه"ولَمْ يُشدَّد في النَّهي كَمَا يُشدَّدُ في المُحَرَّمَات.

హజ్రత్ ఉమ్మె అతియ్యా (రదియల్లాహు అన్హా) కథనం : మమ్మల్ని జనాజాల వెంట వెళ్ళకుండా వారించటం జరిగేది. అయితే మరీ అంత తీవ్రంగా వారించటం జరిగేది కాదు.

(బుఖారీ – ముస్లిం)

'మరీ అంత తీవ్రంగా వారించటం జరిగేది కాద'ంటే, నిషిద్ధ విషయాల్లో తీవ్రవైఖరి అవలంబించినట్లు ఈ విషయంలో తీవ్రంగా వ్యవహరించటం జరిగేది కాదని అర్థం.

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణాలు)

English

Umm Atiyyah (radiyallahu anha) reported: We (womenfolk) were prohibited from accompanying a funeral procession, but we were not compelled (not to do so).[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

జనాజా వెంట స్త్రీలు కూడా బయలుదేరితే స్త్రీ పురుషుల కలయిక వల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదముంటుందన్న భయంతో స్త్రీలను జనాజా వెంట వెళ్ళకుండా వారించటం జరిగింది. ఇంకో విషయమేమిటంటే స్త్రీలు సాధారణంగా సున్నిత మనస్కులై ఉంటారు. శ్మశానాలు, శవాల్లాంటి భయంకరమైన దృశ్యాల్ని చూసి వారు తట్టుకోలేరు. స్త్రీలను శ్మశానానికి వెళ్ళకుండా వారించటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. అయితే అలాంటి అనర్థాలు జరగవన్న నమ్మకముంటే జనాజా వెంట స్త్రీలు కూడా వెళ్ళవచ్చు. దైవప్రవక్త ﷺ కాలంలో ఈ విషయంలో తీవ్రవైఖరి అవలంబించబడలేదంటే సమాజ పరిస్థితులను బట్టి కాలానుగుణంగా షరీఅత్ నిర్దేశించిన నియమాలను ఆచరిస్తూ స్త్రీలు కూడా జనాజా వెంట వెళ్ళవచ్చని భావం. అందుకే అత్యధికమంది విద్వాంసులు ఈ వారింపును 'నహీయె తన్‌జీహి'గా పేర్కొంటూ జనాజాల వెంట స్త్రీలు వెళ్ళకుండా ఉండటమే అన్ని విధాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. (ఫత్‌హుల్ బారీ)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|155. జనాజా నమాజ్ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని ఖనన సంస్కారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట స్త్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి…..|హదీసు 931