హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 153వ అధ్యాయం: ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మసమ్మతమే. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 925 – 927) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
153. ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మసమ్మతమే
باب جواز البكاء عَلَى الميت بغير ندب وَلاَ نياحة أمَّا النِّيَاحَةُ فَحَرَامٌ وَسَيَأتِي فِيهَا بَابٌ فِي كِتابِ النَّهْيِ، إنْ شَاءَ اللهُ تعالى. وأما البكاء فجاءت أحاديث كثيرة بِالنَّهْيِ عَنْهُ، وَأنَّ المَيِّتَ يُعَذَّبُ بِبُكَاءِ أهْلِهِ، وَهِيَ مُتَأَوَّلَةٌ ومَحْمُولَةٌ عَلَى مَنْ أوْصَى بِهِ، وَالنَّهْيُ إنَّمَا هُوَ عَن البُكَاءِ الَّذِي فِيهِ نَدْبٌ أَوْ نِيَاحَةٌ والدَّليلُ عَلَى جَوَازِ البُكَاءِ بغير ندب ولا نياحة أحاديث كيثرة مِنْهَا:
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
మనిషి మరణించినప్పుడు అతని గురించి పెడబొబ్బలు పెట్టటం నిషిద్ధం. దానిపై (ప్రత్యేకంగా) 'కితాబున్నహీ'లో ఇన్షాఅల్లాహ్ ఒక అధ్యాయం రాబోతోంది. మనిషి మరణం పట్ల రోదించటాన్ని వారించే హదీసులు కూడా అనేకం ఉన్నాయి. "మృతునికి అతని కుటుంబ సభ్యులు ఏడ్వటం వల్ల సమాధిలో యాతన కలుగుతుంది" అన్న హదీసు భావం ఏమిటంటే, మృతుడు చనిపోయేముందు తన మృతిపట్ల ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టమని చెప్పిపోతే అప్పుడు అతను సమాధిలో యాతనకు గురవుతాడు. రోదిస్తూ, పెడబొబ్బలు పెడ్తూ ఏడ్వకూడదు. రోదించకుండా, పెడబొబ్బలు పెట్టకుండా విలపించటం ధర్మసమ్మతమేనన్న విషయాన్ని ఎన్నో హదీసులు ధృవీకరిస్తున్నాయి.
English
Wailing is unanimously forbidden (Haram) as will be mentioned later on. There are some Ahadith which forbid us from crying over somebody’s death, and which inform us that the dead will be tormented in their graves as a result of their relatives crying over their death. This prohibition applies only to those cases where crying is accompanied with lamenting and wailing. Weeping without these two is, permissible; and the Ahadith in support of this are many, including the following:
హదీసు 925
عن ابنِ عُمرَ رضي اللَّه عنهما أَنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عاد سَعْدَ بنَ عُبَادَةَ، وَمَعَهُ عبْدُ الرَّحمنِ بنُ عَوفٍ، وسعْدُ بْنُ أَبي وَقَّاصٍ، وعبْدُ اللَّهِ بْنُ مَسْعُودٍ رضي اللَّه عنهم، فَبكى رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فلمَّا رَأَى القوْمُ بُكاءَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، بَكَوْا، فَقَالَ: "أَلا تَسْمعُونَ؟ إِنَّ اللَّه لاَ يُعَذِّبُ بِدمْعِ العَيْنِ، وَلا بِحُزْنِ القَلْبِ، وَلكِنْ يُعَذّبُ بِهذاَ أَوْ يَرْحَمُ" وَأَشَارَ إِلى لِسَانِهِ. متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) రోగగ్రస్తులయితే దైవప్రవక్త ﷺ ఆయన్ని పరామర్శించటానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త ﷺ వెంట అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబూ వఖ్ఖాస్, అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రజిలు) కూడా ఉన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత దైవప్రవక్త ﷺ (సాద్ అనారోగ్య పరిస్థితి చూసి అప్రయత్నంగానే) కంట తడిపెట్టారు. ఆయన్ని చూసి మిగతా వారందరూ కూడా దుఃఖించటం మొదలుపెట్టారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : "చూడండి! కన్నీళ్ళ వల్లగాని, హృదయావేదన వల్లగాని దేవుడు మనిషిని శిక్షించడు. అయితే దీనివల్ల (దైవప్రవక్త తన నాలుక వైపు చూపిస్తూ అన్నారు) (మనిషి పెడబొబ్బలు పెడితే మాత్రం) దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ visited Sa`d bin `Ubadah during his illness. He was accompanied by `Abdur-Rahman bin `Auf, Sa`d bin Abu Waqqas and `Abdullah bin Mas`ud (radiyallahu anhum). The Messenger of Allah ﷺ began to weep. When his Companions saw this, their tears also started flowing. He ﷺ said, “Do you not hear, Allah does not punish for the shedding of tears or the grief of the heart, but punishes or bestows mercy for the utterances of this (and he pointed to his tongue).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
తీవ్రమైన దుఃఖం మూలంగా బాధపడటం, ఆ బాధను కన్నీళ్ల ద్వారా వ్యక్తం చేయటం మానవ సహజమైన విషయం. మనిషి దాన్ని ఎంత ఆపుకోవాలన్నా ఆపుకోలేడు. కాని ఆ బాధను వ్యక్తీకరించటంలో హద్దుమీరి ప్రవర్తించటం, ఏడ్చి పెడబొబ్బలు పెట్టటం మాత్రం ధర్మసమ్మతం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|153. ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మసమ్మతమే|హదీసు 925
హదీసు 926
وعن أُسَامة بنِ زَيْدٍ رضي اللَّه عنهما أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رُفِعَ إِلَيهِ ابْنُ ابْنَتِهِ وَهُوَ فِي المَوْتِ، فَفَاضَتْ عَيْنا رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ لَهُ سعدٌ: مَا هَذَا يَا رسولَ اللَّهِ؟، قَالَ: "هَذِهِ رحمةٌ جَعَلها اللَّهُ تَعالى في قلوبِ عبادِهِ، وَإِنما يَرْحَمُ اللَّهُ مِنْ عبَادِهِ الرُّحَمَاءَ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త కూతురి కొడుకు చావుబతుకుల్లో ఉన్నప్పుడు, అతణ్ణి దైవప్రవక్త దగ్గరకు తీసుకురావటం జరిగింది. (ఆ పసివాడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు). అతని పరిస్థితి చూసి దైవప్రవక్త ﷺ కంట తడిపెట్టారు. అప్పుడు సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), "ఇదేమిటి దైవప్రవక్తా! (మీరు దుఃఖిస్తున్నారు)?" అని అడిగారు. దానికి దైవప్రవక్త ﷺ "ఇది దేవుడు తన దాసుల గుండెల్లో ఉంచిన కారుణ్యం. తోటివారిని కరుణించే దాసుల్నే దేవుడు కరుణిస్తాడు" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణం)
English
Usamah bin Zaid (radiyallahu anhu) reported: A grandson (child of the daughter) of the Messenger of Allah ﷺ was presented to him while the child was at his last breath. Tears began to flow from the eyes of the Messenger of Allah ﷺ. Sa`d said to him: “What is this, O Messenger of Allah?’‘ He ﷺ said, “It is mercy which Allah has placed in the hearts of his salves. Allah bestows His Mercy on the merciful among His slaves.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|153. ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మసమ్మతమే|హదీసు 926
హదీసు 927
وعن أَنسٍ رضيَ اللَّهُ عنه أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم دَخَلَ عَلى ابْنه إِبَراهِيمَ رضيَ اللَّهُ عنْه وَهُوَ يَجودُ بَنفسِه فَجعلتْ عَيْنا رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم تَذْرِفَانِ. فقال له عبدُ الرَّحمن بنُ عوفٍ: وأَنت يَا رسولَ اللَّه؟، فَقَالَ:"يَا ابْنَ عوْفٍ إِنَّها رَحْمةٌ"ثُمَّ أَتْبَعَها بأُخْرَى، فقال صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ الْعَيْنَ تَدْمَعُ والقَلْب يَحْزَنُ، وَلا نَقُولُ إِلا ما يُرضي رَبَّنا وَإِنَّا بفِرَاقِكَ يَا إِبْرَاهيمُ لمَحْزُونُونَ". رواه البخاري، وروى مُسلمٌ بعضَه. والأَحاديث في الباب كثيرة في الصحيح مشهورة، واللَّه أعلم.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకరోజు దైవప్రవక్త ﷺ తన కొడుకు ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళారు. అప్పుడతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొడుకు పరిస్థితి చూసి దైవప్రవక్త ﷺ కంట తడిపెట్టారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (ఆశ్చర్యపోయి చూస్తూ) "దైవప్రవక్తా! మీరు కూడా దుఃఖిస్తున్నారా?" అని అడిగారు. దైవప్రవక్త ﷺ, "ఇబ్నె ఔఫ్! ఇది వాత్సల్యం" అంటూ మళ్ళీ విలపించసాగారు. ఆ తర్వాత, ఆయన తన అనుచరులతో, "నిశ్చయంగా కళ్ళు కన్నీరు కారుస్తాయి. హృదయం ఆవేదనకు గురవుతుంది. అయితే మా నోటి నుండి మా ప్రభువుకు ప్రీతికరమైన పలుకులే వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ యెడబాటు వల్ల మేము తీవ్రమైన దుఃఖానికి గురయ్యామురా!" అని అన్నారు.
(బుఖారీ. ఈ హదీసులోని కొంతభాగాన్ని ముస్లిం కూడా వెలికితీశారు. ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రామాణికమైన సుప్రసిద్ధ హదీసులు ఇంకా ఎన్నో ఉన్నాయి).
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ came to his son Ibrahim (radiyallahu anhu) when he was breathing his last. The eyes of the Messenger of Allah ﷺ began shedding tears. `Abdur-Rahman bin `Auf (radiyallahu anhu) said, “O Messenger of Allah, you too weep?” He ﷺ said, “O Ibn `Auf! It is mercy.” Then he began to weep and said, “The eyes are shedding tears and the heart is grieved, and we will not say except what pleases our Rubb. O Ibrahim! Indeed we are grieved by your departure.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺకు హజ్రత్ మారియా ఖిబ్తియా (రదియల్లాహు అన్హా) ద్వారా ఇబ్రాహీమ్ అనే పిల్లవాడు కలిగాడు. అబూ యూసుఫ్ అనే ఒక కమ్మరి భార్య ఆ పిల్లవాడికి పాలు పట్టేది. అయితే పుట్టిన కొన్నాళ్ళకే హి.శ. 10వ సంవత్సరంలో ఆ పిల్లవాడు అసువులు బాసాడు. దైవప్రవక్త ﷺ గారి మగ సంతానమంతా బాల్యంలోనే చనిపోయారన్న విషయం గమనార్హం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|153. ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మసమ్మతమే|హదీసు 927
You must be logged in to post a comment.