హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 152. మృతుని దగ్గర ఏమని ప్రార్థించాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 152వ అధ్యాయం: మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 920 – 924) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?

↑ విషయ సూచిక

باب ما يقال عند الميت وَمَا يقوله من مات له ميت

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

920

హదీసు 920

عن أُمِّ سلَمَةَ رضي اللَّه عنها قالت: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا حَضرْتُمُ المرِيضَ، أَوِ المَيِّتَ، فَقُولُوا خيْراً، فَإِنَّ الملائِكَةَ يُؤمِّنونَ عَلى مَا تقُولُونَ" قالت: فلمَّا مَاتَ أَبُو سَلَمَة، أَتَيْتُ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقُلْتُ: يَا رسُولَ اللَّه، إِنَّ أَبَا سلَمَة قَدْ مَاتَ، قالَ: "قُولي: اللَّهُمَّ اغْفِرْ لِي وَلَهُ، وَأَعْقِبْني مِنْهُ عُقبى حَسَنَةً" فقلتُ: فأَعْقَبني اللَّهُ منْ هُوَ خَيْرٌ لِي مِنْهُ: مُحمَّداً صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواه مسلم هكَذا:"إِذا حَضَرْتُمُ المَرِيضَ" أَو"الميِّت"عَلَى الشَّكِّ، رواه أبو داود وغيره:"الميِّت"بلا شَكٍّ.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు వ్యాధిగ్రస్తుని దగ్గర గాని లేదా మృతుని దగ్గర గాని కూర్చొని ఉన్నప్పుడు (వారి గురించి) పలికితే మంచిమాటలే పలకండి. ఎందుకంటే మీరు చెప్పే మాటలకు దైవదూతలు 'ఆమీన్' అని అంటుంటారు.

ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు: "నా భర్త అబూ సలమా మరణించినప్పుడు నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి 'దైవప్రవక్తా! అబూ సలమా చనిపోయారు. (ఇక నా గతేం కాను?)' అని (బాధతో విలపిస్తూ) అడిగాను. అందుకాయన ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు: 'దేవా! నన్నూ, మా ఆయన్నీ క్షమించు. ఆయన తర్వాత నాకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు'.

నేనావిధంగా దుఆ చేస్తే నిజంగా దేవుడు ఆయన కంటే మంచి వ్యక్తి – ముహమ్మద్ ﷺను నాకు ప్రసాదించాడు."

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Umm Salamah (radiyallahu anha): The Messenger of Allah ﷺ said, “When you visit a sick or a dying person, you should utter good words because the angels say `Amin’ at what you say.” She added: When Abu Salamah (radiyallahu anhu) died, I came to the Prophet ﷺ and said: “O Messenger of Allah, Abu Salamah has died.” He ﷺ directed me to supplicate thus: “Allahummaghfir li wa lahu, wa a`qibni minhu `uqba hasanatan [O Allah, forgive me and him, and bestow upon me a better future (give me a better substitute)].” So I supplicated as he directed, and Allah gave me a man who was better for me than Abu Salamah (i.e., the Prophet Muhammad ﷺ). (The Prophet ﷺ married Umm Salamah afterwards.)[Muslim].

ముఖ్యాంశాలు

తమ సంబంధీకులు ఎవరైనా చనిపోతే వారు లేని లోటుని పూరించటానికి పై విధంగా ప్రార్థించటం దైవప్రవక్త సంప్రదాయం. అలా ప్రార్థిస్తే అల్లాహ్ తప్పకుండా మంచి ప్రత్యామ్నాయాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆయన శక్తికి మించిన పని ఏదీ లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?|హదీసు 920

921

హదీసు 921

وعنها قَالَتْ: سمعتُ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "مَا مِنْ عبدٍ تُصِيبُهُ مُصِيبَةٌ، فيقولُ: إِنَّا للَّهِ وَإِنَّا إِليهِ رَاجِعُونَ: اللَّهمَّ أُجِرْنِي في مُصِيبَتي، وَاخْلُف لِي خَيْراً مِنْهَا، إِلاَّ أَجَرَهُ اللَّهُ تعَالى في مُصِيبتِهِ وَأَخْلَف لَهُ خَيْراً مِنْهَا". قالت: فَلَمَّا تُوُفِّيَ أَبُو سَلَمَة، قلتُ كَمَا أَمَرني رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَخْلَفَ اللَّهُ لِي خَيْراً منْهُ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) తెలియజేశారు: ఏ దాసుడయినా తనకు ఆపద కలిగినప్పుడు, "మేమంతా అల్లాహ్‌కే చెందినవారము. మేము తిరిగి ఆయన వద్దకే మరలిపోవలసిన వారము. దేవా! నాకు ఈ ఆపదలో పుణ్యాన్ని ప్రసాదించు. నేను పోగొట్టుకున్న దానికంటే మంచి ప్రతిఫలాన్ని నాకు అనుగ్రహించు" అని ప్రార్థిస్తే దేవుడు అతనికి ఆ ఆపద తర్వాత మంచి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు : నా భర్త అబూ సలమా చనిపోయినప్పుడు నేను దైవప్రవక్త ﷺ నాకు ఆదేశించినట్లుగానే ప్రార్థించాను. ఫలితంగా దేవుడు నాకు ఆయన కన్నా మంచి వ్యక్తి దైవప్రవక్త ﷺను నాకు ప్రసాదించాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Umm Salamah (radiyallahu anha) reported: I heard the Messenger of Allah ﷺ saying, “When a person suffers from a calamity and utters: `Inna lillahi wa inna ilaihi raji`un. Allahumma ujurni fi musibati, wakhluf li khairan minha (We belong to Allah and to Him we shall return. O Allah! Compensate me in my affliction, recompense my loss and give me something better in exchange for it), then Allah surely compensates him with reward and better substitute.” Umm Salamah (radiyallahu anha) said: When Abu Salamah (radiyallahu anhu) died, I repeated the same supplication as the Messenger of Allah ﷺ had commanded me (to do). So Allah bestowed upon me a better substitute than him (I was married to Muhammad, the Messenger of Allah ﷺ).[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?|హదీసు 921

922

హదీసు 922

وعن أَبي موسى رضي اللَّه عنه أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا ماتَ وَلدُ العبْدِ قَالَ اللَّهُ تَعَالَى لملائِكَتِهِ: قَبضْتُم وَلدَ عَبْدِي؟ فيقولُونَ: نعَم، فيقولُ: قَبَضتُم ثمَرَةَ فُؤَادِهِ؟ فيقولونَ: نَعم. فَيَقُولُ: فَمَاذَا قَالَ عبْدِي؟ فيقُولُونَ: حمِدكَ واسْتَرْجعَ، فيقولُ اللَّهُ تَعَالَى: ابْنُوا لعبدِي بَيتاً في الجَنَّة، وَسَمُّوهُ بيتَ الحمدِ "رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దాసుని బిడ్డ చనిపోయినప్పుడు దేవుడు తన దూతలతో, "మీరు నా దాసుని బిడ్డ ప్రాణాలు తీశారా?" అని అడుగుతాడు. దానికి దూతలు 'అవున'ంటారు. "మీరు నా దాసుని గారాలపట్టిని చంపారా?" అని మళ్ళీ అడుగుతారు దేవుడు. దైవదూతలు అవునంటారు. అప్పుడు దేవుడు, "మరి దానికి నా దాసుడు ఏమన్నాడు?" అని అడుగుతాడు. "(దేవా! అంతటి కఠోర పరిస్థితిలో కూడా) అతను నిన్ను స్తుతించి, 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్' అని పఠించాడు" అని చెబుతారు దైవదూతలు. అది వినగానే దేవుడు ప్రసన్నుడై, "అయితే నా దాసుని కొరకు స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించండి. దానికి 'స్తోత్ర నిలయం' అని పేరు పెట్టండి" అని తన దూతల్ని ఆజ్ఞాస్తాడు. (తిర్మిజీ – హసన్)

(సుననె తిర్మిజీలోని జనాయెజ్ అధ్యాయాలు)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When a man’s child dies, Allah, the Exalted, asks His angels, `Have you taken out the life of the child of My slave?’ and they reply in the affirmative. He (SWT) then asks, `Have you taken the fruit of his heart?’ and they reply in the affirmative. Thereupon He asks, `What did my slave say?’ They say: `He praised You and said: Inna lillahi wa inna ilaihi raji’un (We belong to Allah and to Him we shall return).’ Allah says: `Build a house for my slave in Jannah and name it Baitul-Hamd (the House of Praise).”’[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?|హదీసు 922

923

హదీసు 923

وعن أَبي هُريرةَ رضي اللَّهُ عنه أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يقُولُ اللَّهُ تَعَالَى: مَا لعَبْدِي المؤْمِن عِنْدي جزَاءٌ إِذا قَبَضْتُ صَفيَّه مِنْ أَهْلِ الدُّنْيَا، ثُمَّ احْتَسَبهُ، إِلاَّ الجَنَّةَ "رواه البخاري.

దేవుడు ఇలా సెలవిచ్చాడంటూ దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: విశ్వాసి దగ్గరి నుంచి నేను తను గాఢంగా ప్రేమించే ప్రాపంచిక వస్తువుని లాక్కున్నప్పుడు అతను పుణ్యఫలాపేక్షతో సహనం వహిస్తే, నా దగ్గర స్వర్గమే అతనికి బహుమానం. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “Allah, the Exalted says: `I have no reward except Jannah for a believing slave of Mine who shows patience and anticipates My reward when I take away his favourite one from the inhabitants of the world.”’[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?|హదీసు 923

924

హదీసు 924

وعن أُسامةَ بنِ زيدٍ رضي اللَّه عنهما قَالَ: أَرْسَلَتْ إِحْدى بَناتِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِلَيهِ تَدْعُوهُ وتُخْبِرُهُ أَنَّ صَبِيَّاً لهَا أَوْ ابْناً في المَوتِ فَقَالَ للرَّسول:"ارْجِعْ إِلَيْهَا، فَأَخْبِرْهَا أَنَّ للَّهِ تَعَالَى مَا أَخذَ ولَهُ مَا أعطَى، وَكُلُّ شَيْء عِنْدَهُ بِأَجْلٍ مُسَمَّى، فَمُرْهَا، فلْتَصْبِرْ ولْتَحْتسِبْ" وذكر تمام الحديث، متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ కుమార్తెలలో ఒకామె తన బిడ్డ చావుబ్రతుకుల్లో ఉన్నాడనీ, తమరు వెంటనే రావాలని (ఒక వ్యక్తి ద్వారా) దైవప్రవక్త ﷺకు కబురంపారు. దానికి దైవప్రవక్త ﷺ కబురు తెచ్చిన వ్యక్తితో, "నువ్వు తిరిగి ఆమె వద్దకు వెళ్ళు. దేవుడు వెనక్కి తీసుకుంది ఆయనదేననీ, తాను ప్రసాదించినది కూడా ఆయనదేననీ, ప్రతి వనస్తువుకూ ఆయన ఒక గడువు నిర్ణయించి ఉంచాడని ఆమెతో చెప్పు. ఇంకా ఆమెను సహనం వహించమనీ, పుణ్యాన్ని ఆశిస్తూ ఉండమని ఆజ్ఞాపించు" అని చెప్పి పంపించారు. (సశేషం) (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణం)

English

Usamah bin Zaid (radiyallahu anhuma) reported: A daughter of the Prophet ﷺ sent a message to him that her son was at his last breath, and requested him to come to her. The Messenger of Allah ﷺ sent back the informer saying: “To Allah belongs what He takes and what He gives, and everything has a limited period (in this world). So ask her to endure patiently, and expect the reward of Allah.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|152. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబికులు ఏమని ప్రార్థించాలి?|హదీసు 924