హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 151. మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్థించాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 151వ అధ్యాయం: మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్థించాలి?. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 919) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

151. మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్థించాలి?

↑ విషయ సూచిక

باب مَا يقوله بعد تغميض الميت

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

919

హదీసు 919

عن أُمِّ سَلمةَ رضيَ اللَّهُ عنها قالت: دَخَلَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عليّ أَبي سلَمة وَقَدْ شَقَّ بصَرُهُ، فأَغْمضَهُ، ثُمَّ قَال: "إِنَّ الرُّوح إِذا قُبِضَ، تبِعَه الْبصَرُ" فَضَجَّ نَاسٌ مِنْ أَهْلِهِ فَقَالَ: "لاَ تَدْعُوا عَلى أَنْفُسِكُم إِلاَّ بِخَيْرٍ، فإِنَّ المَلائِكَةَ يُؤمِّنُون عَلى مَا تَقُولونَ" ثمَّ قالَ:"اللَّهُمَّ اغْفِر لأَبِي سَلَمَة، وَارْفَعْ درَجَتهُ في المَهْدِيِّينَ، وَاخْلُفْهُ في عَقِبِهِ في الْغَابِرِين، واغْفِرْ لَنَا ولَه يَاربَّ الْعَالمِينَ، وَافْسحْ لَهُ في قَبْرِهِ، وَنَوِّرْ لَهُ فِيهِ "رواه مسلم.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ అబూ సలమా (మరణవార్త విని ఆయన) ఇంటికి వచ్చారు. అప్పటికి అబూ సలమా కళ్ళు బిగుసుకుపోయాయి. దైవప్రవక్త ﷺ ఆయన కనురెప్పలు మూస్తూ, "ప్రాణం (దేహాన్ని) వీడుతున్నప్పుడు కళ్ళు దాన్ని వెంబడిస్తాయి" అన్నారు. ఆ మాట వినగానే అబూ సలమా ఇంటివాళ్ళు గొల్లుమన్నారు. అప్పుడు దైవప్రవక్త ﷺ (వారిని సముదాయిస్తూ) "మీరు చెప్పే మాటలకు దైవదూతలు 'ఆమీన్' అని అంటుంటారు. కనుక మీ మృతుల విషయంలో మంచి మాటలే పలకండి" అని అన్నారు. తర్వాత ఆయన అబూ సలమా (రదియల్లాహు అన్హు) కొరకు ఈ విధంగా ప్రార్థించారు:

దేవా! అబూ సలమాను క్షమించు. సన్మార్గం పొందినవారిలో ఇతనికి పదోన్నతి కల్పించు. ఇతని సంబంధీకుల సంతానంలో నుంచి ఇతనికి తగిన వారసుణ్ణి నిలబెట్టు. ఓ సకలలోక ప్రభువా! మమ్మల్నీ ఇంకా మరణించే వారందర్నీ క్షమించు. ఇతని సమాధిని విశాలపరచు. అందులో అతని కొరకు వెలుగుని ప్రసాదించు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Umm Salamah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ visited Abu Salamah (radiyallahu anhu) when his eyes were open soon after he died. He closed them (the eyes) for him and said, “When the soul is taken away, the sight follows it.” Some members of his family began to weep. He ﷺ said: “Do not supplicate for yourselves anything but good, for the angels say `amin’ to what you say.” Then he ü said, “O Allah! Forgive Abu Salamah, raise his rank among those who are rightly-guided and grant him a successor from his descendants who remain behind. Grant him pardon and us, too. O Rubb of the worlds. Make his grave spacious for him and give him light in it.”[Muslim].

ముఖ్యాంశాలు

చనిపోయినవారి శ్రేయస్సును కాంక్షిస్తూ దుఆ చేస్తే, దానివల్ల మృతులకు ప్రయోజనం కలుగుతుందని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఇతర అనేక హదీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కనుక మరణించినవారి పట్ల సంతాపాన్ని ప్రకటించటం, వారి బంధుమిత్రుల్ని, ఆత్మీయుల్ని ఓదార్చటం, మృతుల శ్రేయస్సు కొరకు ప్రార్థించటం ధర్మసమ్మతమే. అంతేకాదు, అది మస్నూన్ పద్ధతి కూడా. దైవప్రవక్త ﷺ స్వయంగా అలా చేసేవారని హదీసుల ద్వారా తెలుస్తోంది.

దీనికి భిన్నంగా చనిపోయినవారి ఇంటి ముంగిట మూడ్రోజుల వరకు జనం బారులు తీరి కూర్చోవటం, ఫాతిహా ఖానీలు చేయటం లాంటి చేష్టలన్నీ అధర్మమైనవి. ధర్మంలో తలెత్తే ఇలాంటి కొత్త పోకడలకు దూరంగా ఉండటం చాలా అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|151. మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్థించాలి?|హదీసు 919