హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 150. మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్ కలిమా పఠించమని ప్రోత్సహించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 150వ అధ్యాయం: మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్ కలిమా పఠించమని ప్రోత్సహించాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 917 – 918) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

150. మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్ కలిమా పఠించమని ప్రోత్సహించాలి

↑ విషయ సూచిక

باب تلقين المحتضر: لا إله إِلاَّ اللهُ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

917

హదీసు 917

عن معاذٍ رضي اللَّه عنه قالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ كَانَ آخِرَ كلاَمِهِ لاَ إِلهَ إِلاَّ اللَّه دَخَلَ الجنَّةَ" رواه أَبُو داود والحاكم وقال: صحيح الإِسناد.

హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : తన జీవితపు తుది పలుకు 'లా యిలాహ ఇల్లల్లాహు' అయిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. (అబూ దావూద్, హాకిమ్ – హాకిమ్ ఈ హదీసు ప్రామాణికమైన ఆధారం కలదని పేర్కొన్నారు).

(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)

English

Mu`adh bin Jabal (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He whose last words are: `La ilaha illallah’ (There is no true god except Allah) will enter Jannah.” [Abu Dawud].

ముఖ్యాంశాలు

మృత్యువు దాపురించినప్పుడు నోటినుంచి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడు) అనే పలుకులు వెలువడటం మృతుని విశ్వాసానికి చిహ్నం. విశ్వాసి అయినవాడు తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు. అయితే అలాంటి వ్యక్తి కూడా తొలిదశలోనే స్వర్గానికి వెళ్తాడో లేక కొంతకాలం చేసిన తప్పులకు శిక్ష అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తాడో మనం చెప్పలేము. అది దేవుని అభీష్టం మీద, ఆ తర్వాత వారి ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను తౌహీద్ కర్తవ్యాలను అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తూ 'షిర్క్' (బహుదైవారాధన)కు దూరంగా జీవితం గడిపినవాడై ఉండాలి సుమా! అప్పుడే అతను స్వర్గానికి వెళ్ళగల్గుతాడు. ఒట్టి పేరుకు మాత్రమే ముస్లింలుగా ఉండి బహుదైవారాధనకు ఒడిగట్టేవారు స్వర్గానికి ఎలా వెళ్ళగల్గుతారు?!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|150. మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్ కలిమా పఠించమని ప్రోత్సహించాలి|హదీసు 917

918

హదీసు 918

وعن أَبي سعيد الخُدْرِيِّ رضي اللَّه عنهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَقِّنُوا موْتَاكُمْ لاَ إِله إِلاَّ اللَّهُ" رواه مسلم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : మీలో మృత్యువు దాపురించిన వారికి 'లా యిలాహ ఇల్లల్లాహ్' (కలిమా పఠించమని) బోధించండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Exhort your dying men to recite: `La ilaha illallah’ (There is no true god except Allah).”[Muslim].

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో "మీ మృతులకు బోధించండి" అని చెప్పబడింది. ఇక్కడ మృతులంటే మృత్యువు దాపురించిన వారని భావం. జీవితపు చరమ ఘడియల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి దగ్గర జనం కూర్చొని 'లా యిలాహ ఇల్లల్లాహు' అని పఠిస్తూ ఉండాలి గాని, చదవమని రోగికి బోధించరాదనీ, దానివల్ల రోగి కళవళపాటుతో కలిమా పఠించడానికి నిరాకరిస్తే దైవతిరస్కారానికి ఒడిగట్టినట్లవుతుందని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. కాని షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) గారు ఈ భావనను ఖండించారు. పై హదీసు ప్రకారం మృత్యువు దాపురించిన వారికి కలిమా గురించి బోధించడమంటే 'లా యిలాహ ఇల్లల్లాహ్' అని పలకమంటూ వారిని ప్రోత్సహించటమేనని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|150. మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్ కలిమా పఠించమని ప్రోత్సహించాలి|హదీసు 918