హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 147. జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్థించాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 147వ అధ్యాయం: జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్థించాలి?. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 911 – 912) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

147. జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్థించాలి?

↑ విషయ సూచిక

باب مَا يقوله مَن أيس من حياته

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

911

హదీసు 911

عن عائشة رضيَ اللَّهُ عنها قالت: سَمِعْتُ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهُوَ مُسْتَنِدٌ إِليَّ يَقُولُ: "اللَّهُمَّ اغفِرْ لِي وَارْحمْني، وَأَلحِقني بالرَّفِيقِ الأَعْلَى "متفق عليه.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ నిర్యాణ సమయంలో నా దేహానికి తన వీపుని ఆనించి కూర్చున్నారు. ఆ సమయంలో తను ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను విన్నాను : "దేవా! నన్ను క్షమించు. నాపై దయజూపు. నన్ను సర్వోన్నత మిత్రునితో కలుపు." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: While the Prophet ﷺ was reclining against me (during his last illness) I heard him saying: “Allahumma-ghfir li, warhamni, wa alhiqni bir Rafiqil-A`la (O Allah, forgive me, bestow Your Mercy on me and let me join with the exalted companions.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సర్వోన్నత మిత్రుడంటే దేవుడేనని అత్యధికమంది పండితులు భావిస్తున్నారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం దైవదూతలు, దైవప్రవక్తలు, అమరవీరులు, సదాచార సంపన్నులు కూడా సర్వోన్నత మిత్రులు కావచ్చు. హజ్రత్ యూసుఫ్ (అలైహి) దేవుడు తనను సదాచార సంపన్నులలో కలపాలని ప్రార్థించారు. దైవప్రవక్త ﷺ కూడా ఆ విధంగానే ప్రార్థించి ఉంటారని వారి అభిప్రాయం. ఏది ఏమైనా జీవితపు చివరి ఘడియల్లో మనిషి ఐహిక భవబంధాలన్నిటితో తెగత్రెంపులు చేసుకొని పరలోక జీవితం కోసం శ్రమిస్తూ ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|147. జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్థించాలి?|హదీసు 911

912

హదీసు 912

وعنها قالت: رأَيْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهُوَ بِالموتِ، عِندهُ قدحٌ فِيهِ مَاءٌ، وهُو يدخِلُ يدهُ في القَدَحِ، ثُمَّ يمسَحُ وجهَهُ بالماءِ، ثُمَّ يَقُولُ: "اللَّهُمَّ أَعِنِّي على غمرَاتِ الموْتِ وَسَكَراتِ المَوْتِ" رواه الترمذي.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ మరణ వ్యాధికి గురయి ఉన్నప్పుడు నేనాయన్ని చూశాను. ఆ సమయంలో ఆయన దగ్గర నీళ్ళతో నిండి ఉన్న ఓ పాత్ర ఉండేది. ఆయన ఆ పాత్రలో చేతిని ముంచి తీసి, తడి చేత్తో ముఖాన్ని తుడుచుకుంటూ, "దేవా! మరణ కాలపు కాఠిన్యంలో, అపస్మారక ఘడియల్లో నాకు సహాయపడు" అని ప్రార్థించేవారు.

(తిర్మిజీ)

(సుననె తిర్మిజీలోని జనాయెజ్ అధ్యాయం)

English

`Aishah (radiyallahu anha) reported: I saw the Messenger of Allah ﷺ when he was at the point of death. He had a drinking bowl with water in it. He would dip his hand into the bowl, and wipe his face. Then he would supplicate, “O Allah! Help me over pangs and agony of death.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ మానవమాత్రులేనని పై హదీసు ద్వారా బోధపడుతోంది. సాధారణంగా మానవులకు వచ్చేవిధంగా ఆయనకు కూడా తీవ్రమైన వ్యాధివచ్చింది. ఆ వ్యాధి తాలూకు బాధను కూడా ఆయన అనుభవించారు. జీవితపు చివరి రోజుల్లో ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది. తీవ్రమైన ఆ జ్వరం వేడి కారణంగానే ఆయన మాటిమాటికీ చేతులు నీటిలో ముంచి తడిచేతులతో ముఖం తుడుచుకునేవారు. అదేవిధంగా ప్రాణం పోతున్నప్పుడు సాధారణంగా మనుషులకు ఎలాంటి బాధ అయితే కలుగుతుందో దాన్ని కూడా ఆయన అనుభవించారు. మరణ బాధను తగ్గించమని కూడా ఆయన అల్లాహ్‌ను వేడుకున్నారు.

షేఖ్ అల్ బానీ ఈ హదీసును బలహీనకోవకు చెందిన హదీసుగా నిర్ధారించి 'జయీఫ్ సుననె తిర్మిజీ' క్రింద పేర్కొన్నారు. అయితే దైవప్రవక్తకు మరణావస్థలో అపస్మారక స్థితి ఆవరించిందని ప్రామాణికమైన హదీసుల ద్వారా కూడా రుజువు అవుతోంది (బుఖారీ గ్రంథంలోని మగాజీ ప్రకరణం చూడండి).

పైన పేర్కొనబడిన రెండు హదీసుల ద్వారానూ మనిషి, ముఖ్యంగా జీవితపు అంతిమ దశలో దైవసహాయాన్ని కోరుకుంటూ ఉండాలని బోధించబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|147. జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్థించాలి?|హదీసు 912