హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 146వ అధ్యాయం: రోగి బాపతువారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ ఉండటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 910) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
146. రోగి బాపతువారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ ఉండటం అభిలషణీయం
بابُ استحباب سؤالِ أهلِ المريضِ عَنْ حاِلهِ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 910
عن ابن عباسٍ، رضي اللَّه عنهما، أَنَّ عليَّ بنَ أَبي طالبٍ، رضي اللَّهُ عنهُ خرجَ مِنْ عِنْدِ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في وجَعِهِ الذِي تُوُفيِّ فِيهِ، فقالَ النَّاسُ: يَا أَبَا الحسنِ، كَيفَ أَصْبَحَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: أَصْبحَ بِحمْد اللَّهِ بَارِئاً. رواه البخاري.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ తమ నిర్యాణానికి కారణమైన వ్యాధికి గురైఉన్నప్పుడు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఆయన దగ్గరి నుండి బయటికి వచ్చారు. ఆయన బయటకు రాగానే ప్రజలు (ఆయన్ని చుట్టుముట్టి), "అబుల్ హసన్! దైవప్రవక్త ﷺ ఉదయం మేల్కొన్నప్పుడు ఎలా ఉన్నారు?" అని అడగటం ప్రారంభించారు. దానికి సమాధానమిస్తూ అలీ (రదియల్లాహు అన్హు), "దైవకృప వల్ల ఆయన బాగానే ఉన్నారు" అని అన్నారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: When `Ali (radiyallahu anhu) came out after visiting the Messenger of Allah ﷺ during his last illness, the people asked: “How is Messenger of Allah ﷺ, O Abul-Hasan?” He replied: “Praise be to Allah, he ﷺ is feeling better.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
వ్యాధిగ్రస్తులను పరామర్శించటం పుణ్యప్రదమైన కార్యమే కాని వ్యాధి తీవ్రరూపం దాల్చి వ్యాధిగ్రస్తుడు సున్నితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువమంది పరామర్శించటానికి వెళితే రోగికి ఇబ్బంది కలగవచ్చు. అలాంటప్పుడు ఇద్దరు, ముగ్గురు చొప్పున వెళ్ళి రోగిని పరామర్శించి రావాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని గురించి అతని ఇంటివారిని అడిగి తెలుసుకుంటూ ఉంటే మరీ మంచిది. రోగుల్ని పరామర్శించటానికి వెళ్ళేవారు ఈ విషయంలో వైద్యులతో సహకరించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|146. రోగి బాపతువారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ ఉండటం అభిలషణీయం|హదీసు 910
You must be logged in to post a comment.