హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 148. రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 148వ అధ్యాయం: రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని, అతని మూలంగా కలిగే ఇబ్బందులపై సహనం వహించాలని రోగి ఇంటివారికి, అతని సేవకులకు హితవు చెప్పాలి. అలాగే మరణ దండన విధించబడిన వారిపట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేయాలి. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 913) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

148. రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని, అతని మూలంగా కలిగే ఇబ్బందులపై సహనం వహించాలని రోగి ఇంటివారికి, అతని సేవకులకు హితవు చెప్పాలి. అలాగే మరణ దండన విధించబడిన వారిపట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేయాలి

↑ విషయ సూచిక

باب استحباب وصية أهل المريض ومن يخدمه بالإحسان إليه والصبر عَلَى مَا يشق من أمره وكذا الوصية بمن قرب سبب موته بحد أَوْ قصاص ونحوهما.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

913

హదీసు 913

عن عِمران بن الحُصَين رضي اللَّه عنهما أَن امرأَةً مِنْ جُهَيْنَةَ أَتَتِ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهِي حُبْلَى مِنَ الزِّنَا، فَقَالَتْ: يَا رسول اللَّهِ، أَصبتُ حَدّاً فَأَقمْهُ علَيَّ، فَدعا رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وليَّهَا، فقالَ: "أَحْسِنْ إِلَيْهَا، فَإِذا وضَعتْ فَأْتِني بِهَا"فَفعلَ فَأَمر بِها النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فشُدَّتْ علَيها ثِيابُها، ثُمَّ أَمر بِها فَرُجِمتْ، ثُمَّ صَلَّى عَلَيْهَا. رواه مسلمٌ.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : వ్యభిచారం మూలంగా గర్భవతి అయిన జుహైనా తెగకు చెందిన ఒక స్త్రీ స్వయంగా దైవప్రవక్త ﷺ దగ్గరకు వెళ్ళి, "దైవప్రవక్తా! నేను (వ్యభిచార పాపం చేసి) శిక్షార్హురాలిని అయ్యాను. కనుక నాకు శిక్ష విధించండి" అని విన్నవించుకున్నది. అప్పుడు దైవప్రవక్త ﷺ ఆమె సంరక్షకుణ్ణి పిలిపించి, "(ఈమెను నీ వెంట తీసుకు వెళ్ళు). ఈమె పట్ల ఉత్తమంగా మెలగు. ప్రసవానంతరం ఈమెను తిరిగి నా దగ్గరికి తీసుకురా" అని చెప్పి పంపించారు.

ప్రసవానంతరం ఆ వ్యక్తి ఆమెను తిరిగి దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకు వచ్చాడు. అప్పుడామె శరీరాన్ని బట్టలతో గట్టిగా చుట్టి దైవప్రవక్త ఆజ్ఞ మేరకు ఆమెకు శిలాశిక్ష విధించటం జరిగింది. ఆ తర్వాత దైవప్రవక్త ﷺ ఆమె భౌతికకాయానికి జనాజా నమాజ్ కూడా చేయించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శిక్షల ప్రకరణం)

English

`Imran bin Husain (radiyallahu anhuma) reported: A woman belonging to the Juhainah tribe came to the Messenger of Allah ﷺ after having conceived from Zina. She submitted: “O Messenger of Allah! I am liable to Hadd (punishment ordained by Allah), so execute it.” The Messenger of Allah ﷺ called her guardian and said, “Treat her well and bring her to me after delivery.” He acted accordingly. Then the Messenger of Allah ﷺ commanded to tie her clothes firmly around her and then stoned her to death. He ﷺ then offered funeral prayer for her.[Muslim].

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయానికి పెట్టిన పేరును పై హదీసు రుజువు చేస్తోంది. దీనిద్వారా బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే, వ్యభిచారం మూలంగా గర్భం దాల్చిన స్త్రీని వెంటనే శిక్షించరాదు. ఆమెను ప్రసవానంతరం శిక్షించాలి. ఎందుకంటే అందులో పిల్లవాడి తప్పు ఏమీ లేదు. అదేవిధంగా అటువంటి స్త్రీకి విధించబడే శిక్ష ఆమె చేసిన పాపానికి పరిహారం అవుతుంది. కనుక ఆమె జనాజా నమాజు కూడా చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|148. రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని, అతని మూలంగా కలిగే ఇబ్బందులపై సహనం వహించాలని రోగి ఇంటివారికి, అతని సేవకులకు హితవు చెప్పాలి. అలాగే మరణ దండన విధించబడిన వారిపట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేయాలి|హదీసు 913