హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 145వ అధ్యాయం: వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 901 – 909) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?

↑ విషయ సూచిక

١٤٥ – باب مَا يُدعى به للمريض

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

901

హదీసు 901

عن عائشة، رضي اللَّه عنها، أَن النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذا اشْتكى الإِنْسانُ الشَّيءَ مِنْهُ، أَوْ كَانَتْ بِهِ قَرْحةٌ أَوْ جُرْحٌ، قَالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، بأُصْبُعِهِ هكَذا، وَوَضَعَ سُفْيانُ بْنُ عُييْنَة الرَّاوي سبابتَهُ بِالأَرْضِ ثُمَّ رَفَعَهَا وقال: "بِسْمِ اللَّهِ، تُربَةُ أَرْضِنا، بِرِيقَةِ بَعْضنَا، يُشْفَى بِهِ سَقِيمُنَا، بِإِذْن رَبِّنَا" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ దగ్గరికి ఏ మనిషయినా తనకు ఒంట్లో నలతగా ఉందని వస్తే లేదా అతనికి పుండుగాని, గాయంగాని ఉంటే దైవప్రవక్త ﷺ తన చూపుడు వ్రేలితో ఇలా చేసేవారు.

హదీసు ఉల్లేఖకులు సుఫ్యాన్ బిన్ ఉయైనా (దైవప్రవక్త ఇలా చేసేవారంటూ) తన చూపుడు వ్రేలిని నేలకు ఆనించి పైకి ఎత్తారు.

ఆ సందర్భంగా దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించేవారు:

"బిస్మిల్లాహి తుర్బతు అర్జినా బిరీఖతి బాజినా, యుష్ఫాబిహీ సఖీమునా బియిజ్ని రబ్బినా"

(అల్లాహ్ పేరుతో, మా నేలమీది మట్టి మాలో కొందరి లాలాజలంతో కలిసి తద్వారా మా ప్రభువు ఆజ్ఞతో మా రోగికి స్వస్థత చేకూరుతుంది.)

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వైద్య ప్రకరణం, సహీహ్ ముస్లింలోని వైద్య ప్రకరణం)

English

`Aishah (radiyallahu anhu) reported: When a person complained to the Prophet ﷺ about an ailment or suffered from a sore or a wound, the Prophet ﷺ would touch the ground with his forefinger and then raise it (Sufyan bin `Uyainah, the narrator, demonstrated this with his forefinger) and would recite: `Bismil-lahi, turbatu ardina, biriqati ba`dina, yushfa bihi saqimuni, bi ‘idhni Rabbina’ (With the Name of Allah, the dust of our ground mixed with the saliva of some of us would cure our patient with the permission of our Rubb.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. దైవప్రవక్త ﷺ తన చూపుడు వ్రేలిని నేలకు తగిలించి దానికి అంటిన మట్టిలో లాలాజలాన్ని కలిపి రోగికి బాధగా ఉన్న చోట, పుండ్లు, గాయాల మీద పూసేవారు. తర్వాత పై దుఆ పఠించేవారు. దాంతో దైవ కృపవల్ల ఆ రోగికి ఉపశమనం కలిగేది. ఈ పద్ధతిని ఎవరయినా పాటించవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 901

902

హదీసు 902

وعنها أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يعُودُ بَعْضَ أَهْلِهِ يَمْسَحُ بيدِهِ اليُمْنى ويقولُ: "اللَّهُمَّ ربَّ النَّاسِ، أَذْهِب الْبَأسَ، واشْفِ، أَنْتَ الشَّافي لاَ شِفَاءَ إِلاَّ شِفَاؤُكَ، شِفاءً لاَ يُغَادِرُ سقَماً" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ తమ ఇంట్లో ఎవరయినా వ్యాధిగ్రస్తులైతే వారిని పరామర్శించి, రోగికి నొప్పిగా ఉన్నచోట తన కుడి చేత్తో నిమురుతూ ఈ విధంగా ప్రార్థించేవారు :

"అల్లాహుమ్మ రబ్బన్నాసి, అజ్‌హిబిల్ బాస, వష్‌ఫి అంతష్షాఫి లా షిఫాఅ ఇల్లా షిఫావుక షిఫాఅన్ లా యుగాదిరు సఖమా"

(దేవా! మానవుల ప్రభువా! ఇతని బాధను దూరం చెయ్యి. ఇతనికి స్వస్థత చేకూర్చేవాడవు నీవే. నీవు తప్ప మరెవ్వరూ స్వస్థత చేకూర్చలేరు. వ్యాధి ఏమాత్రం మిగలకుండా పూర్తి స్వస్థత చేకూర్చు.) (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వైద్య ప్రకరణం, సహీహ్ ముస్లింలోని వైద్య ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: When the Prophet ﷺ visited any ailing member of his family, he would touch the sick person with his right hand and would supplicate: “Allahumma Rabban-nasi, adhhibil-ba’sa, washfi, Antash-Shafi, la shifa’a illa shifa’uka, shifaan la yughadiru saqaman [O Allah! the Rubb of mankind! Remove this disease and cure (him or her)! You are the Great Curer. There is no cure but through You, which leaves behind no disease].”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 902

903

హదీసు 903

وعن أَنسٍ رضي اللَّه عنه أَنه قَالَ لِثابِتٍ رحمه اللَّه: أَلا أَرْقِيكَ بِرُقْيَةِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ قَالَ: بَلى. قَالَ:"اللَّهُمَّ رَبَّ النَّاسِ، مُذْهِبَ البَأسِ، اشْفِ أَنتَ الشَّافي، لاَ شَافِيَ إِلاَّ أَنْتَ، شِفاءً لاَ يُغادِر سَقَماً". رواه البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం తను సాబిత్ (రహిమహుల్లాహ్)తో మాట్లాడుతూ, "దైవప్రవక్త ﷺ ఏమని చెప్పి మంత్రించేవారో నేను మీకు తెల్పనా?" అన్నారు. 'తప్పకుండా తెల్పండి' అన్నారు సాబిత్ (రహిమహుల్లాహ్). అప్పుడు అనస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ వ్యాధిగ్రస్తుల మీద ఈ విధంగా మంత్రించి ఊదేవారని తెలిపారు:

"అల్లాహుమ్మ! రబ్బన్నాసి ముజ్‌హిబల్ బాసి, ఇష్ఫీ అంతష్షాఫీ లా షాఫియ ఇల్లా అంత, షిఫాఅన్ లా యుగాదిరు సఖమా."

(దేవా! మానవుల ప్రభువా! బాధల నుండి విముక్తిని ప్రసాదించేవాడా! ఇతనికి స్వస్థత చేకూర్చు. స్వస్థత చేకూర్చేవాడవు నీవే. నీవు తప్ప స్వస్థత మరెవరూ చేకూర్చలేరు. వ్యాధి ఏ మాత్రం మిగలకుండా పూర్తి స్వస్థత నొసగు.)

English

Anas (radiyallahu anhu) reported: I said to Thabit (May Allah had Mercy upon him) Should I not perform Ruqyah (i.e., recite supplication or Quranic Ayat and blow) over you, such supplication as was practised by the Messenger of Allah ﷺ?” He said: “Please do so.” Anas (radiyallahu anhu) supplicated: “Allahumma Rabban-nasi, mudh-hibal-ba’si, ishfi Antash-Shafi, la shafiya illa Anta, shifa’an la yughadiru saqaman [O Allah! the Rubb of mankind! Take away this disease and cure (him or her). You are the Curer. There is no cure except through You. Cure (him or her), a cure that leaves no disease].”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

పై హదీసుల ద్వారా దైవప్రవక్త ﷺ ఆయన అనుచరులు రోగగ్రస్తుల మీద దుఆలు మంత్రించి ఊదేవారని తెలుస్తోంది. కనుక రోగగ్రస్తుల మీద మంత్రించి ఊదే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే దానికోసం దైవప్రవక్త ﷺ ద్వారా నిరూపితమైన దుఆలు, దేవుని గుణగణాలతో కూడిన వాక్యాలు మాత్రమే మంత్రించాలన్నది నియమం. షిర్క్‌కు, దైవతిరస్కారానికి సంబంధించిన వాక్యాలు మంత్రించటం నిషిద్ధం. అదేవిధంగా ముఅవ్వజాత్ సూరాలు, ఫాతిహా సూరా, ఇంకా ఇతర దివ్య ఖుర్‌ఆన్ సూక్తులు పఠించి ఊదటం కూడా ధర్మసమ్మతమే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 903

904

హదీసు 904

وعن سعدِ بن أَبي وَقَّاصٍ رضي اللَّه عنه قَالَ: عَادَني رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "اللَّهُمَّ اشْفِ سعْداً، اللَّهُمَّ اشْفِ سَعْداً، اللَّهُمْ اشْفِ سَعداً" رواه مسلم.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను వ్యాధికి గురయినప్పుడు దైవప్రవక్త ﷺ నన్ను పరామర్శించి, "దేవా! సాద్‌కు స్వస్థత చేకూర్చు. దేవా! సాద్‌కు స్వస్థత చేకూర్చు. దేవా! సాద్‌కు స్వస్థత చేకూర్చు" అని (మూడుసార్లు) ప్రార్థించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని వసియ్యత్ ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ visited me during my illness and supplicated, “O Allah! Cure Sa`d. O Allah! Cure Sa`d. O’ Allah! Cure Sa`d.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 904

905

హదీసు 905

وعن أَبي عبد اللَّهِ عثمانَ بنِ العَاصِ، رضي اللَّه عنه أَنه شَكا إِلى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَجعاً يجِدُهُ في جَسدِهِ، فَقَالَ لَهُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ضَعْ يَدَكَ عَلى الَّذِي يَأْلَمُ مِن جَسَدِكَ وَقلْ: بِسمِ اللَّهِ ثَلاثاً وَقُلْ سَبْعَ مَرَّاتٍ: أَعُوذُ بِعِزَّةِ اللَّهِ وَقُدْرَتِهِ مِن شَرِّ مَا أَجِدُ وَأُحاذِرُ" رواه مسلم.

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన ఒకసారి తనకు ఒంట్లో నొప్పిగా ఉందని దైవప్రవక్త ﷺకు చెప్పారు. దానికి దైవప్రవక్త ﷺ, "నొప్పిగా ఉన్నచోట చెయ్యిపెట్టి మూడుసార్లు 'బిస్మిల్లాహ్' అని పలికి, ఏడుసార్లు "అవూజు బి యిజ్జతిల్లాహి వ ఖుద్‌రతిహీ మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు" అని పఠించమని ఉపదేశించారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Abu `Abdullah bin Abul-`as (radiyallahu anhu) reported: I complained to the Messenger of Allah ﷺ about a pain I had in my body. The Messenger of Allah ﷺ said, “Place your hand where you feel pain and say: `Bismillah (With the Name of Allah)’ three times; and then repeat seven times: `A`udhu bi`izzatillahi wa qudratihi min sharri ma ajidu wa `uhadhiru (I seek refuge with Allah and with His Power from the evil that afflicts me and that which I apprehend).”’ [Muslim].

ముఖ్యాంశాలు

మనిషి ఇతరుల చేత కాకుండా తను స్వయంగా కూడా మస్నూన్ దుఆలు పఠించి ఊదుకోవచ్చని పై హదీసు ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 905

906

హదీసు 906

وعن ابن عباسٍ، رضي اللَّه عنهما، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ عَادَ مَرِيضاً لَمْ يَحْضُرْهُ أَجَلُهُ، فقالَ عِنْدَهُ سَبْعَ مَرَّات: أَسْأَلُ اللَّه الْعَظِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَشفِيَك: إِلاَّ عَافَاهُ اللَّه مِنْ ذلكَ المَرَضِ" رواه أَبُو داود والترمذي وقال: حديث حسن، وقال الحاكِم: حديث صحيح عَلَى شرطِ البخاري.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించి అతని దగ్గర ఏడుసార్లు, "అస్ అలుల్లాహల్ అజీమ రబ్బల్ అర్షిల్ అజీమి అంయ్యష్‌ఫియక" అని ప్రార్థిస్తే ఆ రోగి మరణం సమీపించని పక్షంలో దేవుడు అతనికి ఆ వ్యాధి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్. హాకిమ్ ఈ హదీసు బుఖారీ షరతులను అనుసరించి ఉల్లేఖించబడిందని పేర్కొన్నారు.)

(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని శుచీశుభ్రతల అధ్యాయాలు)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “He who visits a sick person who is not on the point of death and supplicates seven times: As’alullahal-`Azima Rabbal-`Arshil-`Azimi, an yashfiyaka (I beseech Allah the Great, the Rubb of the Great Throne, to heal you), Allah will certainly heal him from that sickness.”[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 906

907

హదీసు 907

وعنه أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم دَخَل عَلَى أَعَرابيٍّ يَعُودُهُ، وَكانَ إِذَا دَخَلَ عَلى مَن يَعُودُهُ قَالَ: "لاَ بَأْس، طَهُورٌ إِن شَاء اللَّه" رواه البخاري.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ ఓ పల్లెవాసిని పరామర్శించటానికి వెళ్ళారు. ఆయన ఎవరిని పరామర్శించినా వారితో, "మీరేమీ చింతించకండి. దైవం తలిస్తే ఈ వ్యాధి మిమ్మల్ని పాపాల నుండి ప్రక్షాళనం చేస్తుంది" అని వారికి ధైర్యం చెప్పేవారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ visited a bedouin who was sick. Whenever he visited an ailing person, he would say, “La ba’sa, tahurun in sha’ Allah [No harm, (it will be a) purification (from sins), if Allah wills].”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

పై హదీసులో దైవప్రవక్త ﷺ రోగిని 'తహూరున్' అని దీవించారు. తహూరున్ అంటే ఈ రోగం నీ మనసును పాపాల నుంచి ప్రక్షాళనం చేస్తుందని భావం. రోగి దగ్గర కూర్చొని ఈ విధంగా ఉత్సాహపరిచే, ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడటం సున్నత్ (దైవప్రవక్త సంప్రదాయం).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 907

908

హదీసు 908

وعن أَبي سعيد الخُدْرِيِّ رضي اللَّه عنه أَن جِبْرِيلَ أَتَى النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: يَا مُحَمدُ اشْتَكَيْتَ؟ قَالَ:"نَعَمْ"قَالَ: بِسْمِ اللَّهِ أَرْقِيكَ، مِنْ كُلِّ شَيْءٍ يُؤْذِيكَ، مِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عيْنِ حَاسِدٍ، اللَّهُ يشْفِيك، بِسْمِ اللَّهِ أَرْقِيكَ" رواه مسلم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : జిబ్రయీల్ దూత దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "ఓ ముహమ్మద్ ﷺ! మీరు అనారోగ్యంగా ఉన్నారా?" అని పరామర్శించారు. దానికి దైవప్రవక్త ﷺ అవునన్నారు. అప్పుడు జిబ్రయీల్ (అలైహి) ఆయన కోసం ఈ విధంగా ప్రార్థించారు :

"బిస్మిల్లాహి అర్‌ఖీక, మిన్ కుల్లి షైయిన్ యూజీక, మిన్ షర్రి కుల్లి నఫ్‌సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్ అల్లాహు యష్‌ఫీక, బిస్మిల్లాహి అర్‌ఖీక."

(అల్లాహ్ పేరుతో మీపై ఊదుతున్నాను. అన్ని రకాల బాధల నుండి, ప్రతి ప్రాణి కీడు నుండి, అసూయాపరుని దిష్టి నుండి, దేవుడు మీకు ఉపశమనాన్ని ప్రసాదించుగాక! అల్లాహ్ పేరుతోనే మీపై ఊదుతున్నాను) (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Jibril (Gabriel) came to the Prophet ﷺ and said: “O Muhammad ﷺ! Do you feel sick?” He ﷺ said, “Yes.” Jibril supplicated thus (i.e., he performed Ruqyah): “Bismillahi arqika, min kulli shay’in yu’dhika, min sharri kulli nafsin aw `ayni hasidi, Allahu yashfika, bismillahi arqika. [With the Name of Allah. I recite over you (to cleanse you) from all that troubles you, and from every harmful mischief and from the evil of the eyes of an envier. Allah will cure you; and with the Name of Allah, I recite over you].”[Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ కూడా మానవ మాత్రులే. ఇతర మానవుల్లాగానే ఆయన కూడా అనారోగ్యం పాలవుతుండేవారు. సాధారణంగా మానవులకొచ్చే వ్యాధులు, రోగాలు ఆయనక్కూడా వచ్చేవి. అందుకే ఈ హదీసులో వాటి బారి నుండి ఆయన రక్షణ కోసం ప్రార్థించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 908

909

హదీసు 909

وعن أَبي سعيد الخُدْرِيِّ وأَبي هريرة رضيَ اللَّه عنهما، أَنهُما شَهِدَا عَلَى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنه قالَ:"مَنْ قَالَ: لاَ إِلهَ إِلاَّ اللَّهُ واللَّهُ أَكْبَرُ، صدَّقَهُ رَبَّهُ، فَقَالَ: لاَ إِله إِلاَّ أَنَا وأَنا أَكْبرُ. وَإِذَا قَالَ: لاَ إِلهَ إِلاَّ اللَّهُ وحْدهُ لاَ شَرِيكَ لَهُ، قَالَ: يقول: لاَ إِله إِلا أَنَا وحْدِي لا شَرِيك لِي. وَإِذَا قَالَ: لاَ إِلهَ إِلاَّ اللَّهُ لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ، قَالَ: لاَ إِلهَ إِلاَّ أَنَا ليَ المُلْك وَلىَ الحَمْدُ. وإِذا قَالَ: لاَ إله إِلاَّ اللَّهُ وَلا حَوْلَ وَلاَ قَوَّةِ إِلاَّ بِاللَّهِ، قَالَ لاَ إِله إِلاَّ أَنَا وَلا حَوْلَ وَلاَ قوَّةَ إِلاَّ بي" وَكانَ يقولُ:"مَنْ قالهَا في مَرَضِهِ ثُمَّ ماتَ لَمْ تَطْعَمْهُ النَّارُ" رواه الترمذي وقال: حديث حسن.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ, అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా)లు సాక్ష్యం చెప్పారు : ఎవరయినా "లా యిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్" అని అంటే, దాన్ని ధృవీకరిస్తూ అతని ప్రభువు, "ఔను, నేను తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడు, నేను అందరికన్నా గొప్పవాణ్ణి" అనంటాడు. మనిషి 'లా యిలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ' అని అంటే, దానికి దేవుడు, 'నేను తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. నేను ఒక్కణ్ణే. నాకు భాగస్వాములెవరూ లేరు' అని అంటాడు. మనిషి 'లా యిలాహ ఇల్లల్లాహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు' అని అంటే, దానికి దేవుడు, 'ఔను, నేను తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. విశ్వ సార్వభౌమాధికారం నాదే. సకల స్తోత్రాలూ నాకే చెల్లుతాయి' అని జవాబు పలుకుతాడు. మనిషి, 'లా ఇలాహ ఇల్లల్లాహు వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్' అని అంటే దానికి సమాధానంగా దేవుడు, 'ఔను, నేను తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. పాపాల నుండి రక్షించటం, సత్కార్యాల కొరకు ప్రోత్సహించటం నా వల్లే జరుగుతుంది' అని అంటాడు.

దైవప్రవక్త ﷺ ఇలా అనేవారు : ఎవరయినా వ్యాధికి గురయి ఈ వాక్యాలు పఠిస్తూ మరణిస్తే, నరకాగ్ని అతన్ని దహించజాలదు. (తిర్మిజీ – హసన్)

(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు)

English

Abu Sa`id Al-Khudri and Abu Hurairah (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “If a person says: `La ilaha illallahu wallahu Akbar (There is no true god except Allah and Allah is Greatest)’, his Rubb responds to him and affirms: `(Yes!) There is no true god except I, and I am the Greatest.’ When he says: `La ilaha illallahu Wahdahu la sharika Lahu (There is no true god except Allah, the One, He has no partner).’ Allah (SWT) affirms: `(Yes!) There is no true god except I. I have no partner.’ When he says: `La ilaha illallahu Lahul mulku wa Lahul-hamdu (the sovereignty belongs to Him and all the praise is due to Him).’ He (SWT) affirms: `(Yes!) There is no true god except I, Mine is the praise and to Me belongs the sovereignty.’ When he says: `La ilaha illallahu wa la hawla wa la quwwata illa Billah (There is no true god except Allah, and there is no might and power but with Allah).’ He (SWT) affirms: `(Yes!) There is no true god except I, and there is no might and power but with Me.”’ The Messenger of Allah ﷺ added, “He who recites this during his illness and dies, will not be touched by the Fire (Hell).”[At-Tirmidhu].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|145. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్థించాలి?|హదీసు 909