హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 142వ అధ్యాయం: తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 878 – 884) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు
باب استحباب تشميت العاطس إِذَا حمد الله تَعَالَى وكراهة تشميته إذا لَمْ يحمد الله تَعَالَى وبيان آداب التشميت والعطاس والتثاؤب.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 878
عن أَبي هريرة رضي الله عنه أن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: " إنَّ الله يُحِبُّ الُعطاسَ وَيَكْرَهُ التَّثاُؤبَ، فَإذَا عَطَس أحَدكُم وَحَمِدَ الله تَعَالَى كانَ حقَّا عَلَى كُلِّ مُسْلِمٍ سمعهُ أنْ يَقُولَ لَهُ يَرْحَمُكَ اللهُ وأما التّثاوب فَإنَّمَا هُوَ مِنَ الشَّيْطَانِ، فَإذَا تَثَاءبَ أحَدُكُمْ فليردُّهُ مَا اسْتَطَاعَ، فَإنَّ أحَدَكُمْ إِذَا تَثَاءبَ ضَحِكَ مِنْهُ الشَّيْطَانُ" رواه البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : నిశ్చయంగా దేవుడు తుమ్మును యిష్టపడతాడు. ఆవులింతను ఆయన యిష్టపడడు. కనుక మీలో ఎవరయినా తుమ్మి 'అల్‌హమ్దులిల్లాహ్' అన్నప్పుడు, అది విన్న ప్రతి ముస్లిం దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి. ఇకపోతే ఆవులింత షైతాన్ మూలంగా వస్తుంది. కనుక మీలో ఎవరికయినా ఆవులింత వస్తే వీలైనంతవరకు దాన్ని ఆపటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు ఆవులించినప్పుడు షైతాన్ మిమ్మల్ని చూసి నవ్వుతాడు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah likes sneezing and dislikes yawning. When any one of you sneezes and says `Al-hamdu lillah (praise be to Allah)’, it becomes obligatory upon every Muslim who hears him to respond with `Yarhamuk-Allah (may Allah have mercy on you)’. Yawning is from the devil. When one of you feels like yawning, he should restrain it as much as possible, for the devil laughs when one of you yawns.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
మనిషి తుమ్మినప్పుడు అతని మెదడు తేలికపడుతుంది. ఒళ్ళు నెమ్మదిస్తుంది. కనుక ఇది ఉత్సాహకర విషయమే. అందుకని తుమ్ము వచ్చినప్పుడు, 'అల్‌హమ్దు లిల్లాహ్' అంటూ దైవాన్ని స్తుతించాలని చెప్పబడింది. దీనికి భిన్నంగా ఆవులింత సోమరితనానికి, అలసత్వానికి ఆనవాలు. అందుకే దాన్ని అవాంఛనీయమైన పనిగా చెప్పబడింది. వీలైనంతవరకు దాన్ని ఆపుకోవటానికి ప్రయత్నించాలని తాకీదు చేయబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 878
హదీసు 879
وعنه عن النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا عَطَسَ أحَدُكُمْ فَلْيَقُلْ: الحَمْدُ للهِ، وَلْيَقُلْ لَهُ أخُوهُ أَوْ صَاحِبُهُ: يَرْحَمُكَ الله، فإذَا قَالَ لَهُ: يَرْحَمُكَ اللهُ فَليَقُلْ: يَهْدِيكُمُ اللهُ وَيُصْلِحُ بالكم "رواه البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరయినా తుమ్మినప్పుడు 'అల్‌హమ్దులిల్లాహ్' అనాలి. అది విన్న అతని సోదరుడు లేక మిత్రుడు అతనికోసం 'యర్‌హముకల్లాహ్' (అల్లాహ్ నీపై దయజూపుగాక!) అని ప్రార్థించాలి. ఎదుటి వ్యక్తి 'యర్‌హముకల్లాహ్' అనగానే, తుమ్మినవ్యక్తి అతణ్ణి, 'యహ్‌దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్' (అల్లాహ్ నీకు సన్మార్గం చూపుగాక! నీ స్థితిని చక్కదిద్దుగాక!!) అని దీవించాలి.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When one of you sneezes he should say: `Al-hamdu lillah (praise be to Allah),’ and his brother or his companion should say to him: `Yarhamuk-Allah (may Allah have mercy on you).’ When he says this he should reply: `Yahdikum-ullah wa yuslihu balakum (may Allah guide you and render sound your state of affairs).”’[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ప్రజలు ఒకర్నొకరు ఏవిధంగా దీవించుకోవాలో, ఉపకారానికి బదులుగా ఏవిధంగా ఉపకారం తలపెట్టాలో ఈ హదీసులో వివరించబడింది. చూడటానికి ఇవి చాలా చిన్న విషయాలే అయినా ఆచరణలో మాత్రం ఇవి కొండంత ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని ఆచరించేవారి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. ముస్లింలు ఈ పసిడిపలుకులకు ప్రతిరూపాలుగా మారితే ఎంతబావుండు!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 879
హదీసు 880
وعن أَبي موسى رضي الله عنه قالَ: سَمِعتُ رَسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ "إِذَا عَطَس أحدُكُم فَحَمِدَ اللهَ فَشَمِّتُوهُ، فإنْ لَمْ يَحْمَدِ الله فَلاَ تُشمتوه" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : మీలో ఎవరయినా తుమ్మి, 'అల్‌హమ్దులిల్లాహ్' అని అంటే దానికి మీరు అతని శ్రేయస్సుకోసం ప్రార్థిస్తూ, 'యర్‌హముకల్లాహ్' అని అనండి. ఒకవేళ తుమ్మినవ్యక్తి, 'అల్‌హమ్దు లిల్లాహ్' అనకపోతే మీరు కూడా 'యర్‌హముకల్లాహ్' చెప్పకండి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Abu Musa (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When one of you sneezes and praises Allah (i.e., says Al-hamdu lillah), you should invoke Allah’s Mercy upon him (i.e., say Yarhamuk-Allah); but if he does not praise Allah, you should not make a response.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 880
హదీసు 881
وعن أنس رضي الله عنه قَالَ: عَطَسَ رَجُلانِ عِنْدَ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَشَمَّتَ أَحَدَهُمَا وَلَمْ يُشَمِّتِ الآخَرَ، فَقَالَ الَّذِي لَمْ يُشَمِّتْهُ: عَطَسَ فُلانٌ فَشَمَّتهُ وَعطستُ فَلَم تُشَمتني؟ فَقَالَ: "هَذَا حَمِدَ الله، وإنَك لَمْ تَحْمَدِ الله". متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ సమక్షంలో ఇద్దరు వ్యక్తులు తుమ్మారు. ఆయన వారిలో ఒకరి కోసం ప్రార్థిస్తూ, 'యర్‌హముకల్లాహ్' అన్నారు. రెండో వ్యక్తి కోసం ప్రార్థించలేదు. అప్పుడు రెండో వ్యక్తి, "అతను తుమ్మితే తమరు అతని కోసం ప్రార్థించారు. మరి నేను తుమ్మినప్పుడు నా కోసం ఎందుకు ప్రార్థించలేదు?" అని దైవప్రవక్త ﷺను ప్రశ్నించాడు. అందుకాయన, 'ఆ వ్యక్తి అల్‌హమ్దులిల్లాహ్ అంటూ దైవాన్ని స్తుతించాడు. కాని నువ్వు దైవాన్ని స్తుతించలేదుగా!' అని బదులిచ్చారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: When two men sneezed in the presence of the Prophet ﷺ, he responded to one with “Yarhamuk-Allah (may Allah have mercy on you)” and did not respond to the other. The latter said to him: “You invoked a blessing on this man but did not do so in my case.” The Prophet ﷺ replied, “He praised Allah (i.e., he said `Al-hamdu lillah’) but you did not.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 881
హదీసు 882
وعن أبي هريرةَ رضي الله عنه قَالَ: كَانَ رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إذَا عَطَسَ وَضَعَ يَدَهُ أوْ ثَوبَهُ عَلى فيهِ وَخَفَضَ أوْ غَضَّ بَها صَوْتَهُ. شك الراوي رواه أَبُو داود، والترمذي وقال حديث حسن صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తుమ్మినప్పుడు ఎక్కువ శబ్దం రాకుండా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునేవారు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ sneezed, he would cover his mouth with his hand or a piece of cloth, suppressing the sound this way.[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో బోధించబడినది మామూలు విషయం కాదు. చాలా ముఖ్యమైన విషయం. నలుగురిలో ఉన్నప్పుడయితే దీని ప్రాముఖ్యం మరింత పెరిగిపోతుంది. తుమ్ము వచ్చినప్పుడు నోటికి, ముక్కుకి చెయ్యిగాని గుడ్డగాని అడ్డం పెట్టుకోవాలి. దానివల్ల తుమ్ము మూలంగా వచ్చే శబ్దం తగ్గిపోతుంది. అంతేకాదు ఆ సమయంలో నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపరలు జనం మీద పడకుండా ఉంటాయి. అదే గుడ్డ అడ్డం లేకుండా తుమ్మితే తుంపరలు మీదపడితే జనం అసహ్యించుకుంటారు. ఆ సమయంలో వెలువడే భయంకర శబ్దానికి ప్రక్కనున్నవారు వింతగా చూస్తారు. అలాంటి అవాంఛనీయ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే పై హదీసుని ఆచరించటం తప్పనిసరి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 882
హదీసు 883
وعن أَبي موسى رضي الله عنه قَالَ:" كَانَ الْيَهُودُ يَتَعَاطسُونَ عْندَ رسول اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَرْجُونَ أنْ يَقولَ لهْم يَرْحَمُكُم الله، فيقولُ: يَهدْيكمُ اللهُ ويُصلحُ بالكم" رواه أَبو داود، والترمذي وَقالَ حديث حسن صحيح.
హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం : యూదులు దైవప్రవక్త ﷺ చేత 'యర్‌హముకల్లాహ్' అని చెప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన సమక్షంలో తుమ్మేవారు. కాని దైవప్రవక్త ﷺ మాత్రం 'యహ్‌దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్' (అల్లాహ్ మీకు సన్మార్గాన్ని ప్రసాదించుగాక! మీ పరిస్థితుల్ని చక్కదిద్దుగాక!) అని ప్రార్థించేవారు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని సంస్కార అధ్యాయం)
English
Abu Musa (radiyallahu anhu) reported: The Jews used to intentionally sneeze in the presence of the Messenger of Allah ﷺ hoping that he would say to them: `Yarhamukum-ullah (may Allah have mercy on you),’ but he would respond with: “Yahdikum-ullahu wa yuslihu balakum (may Allah guide you and render sound your state of affairs).”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 883
హదీసు 884
وعن أَبي سعيد الخدري رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " إذَا تَثاءَبَ أحَدُكُمْ فَلْيُمسكْ بَيده عَلَى فِيهِ فإنَّ الشَّيْطَانَ يدْخل" رواه مسلم.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఎవరయినా ఆవులించేటప్పుడు షైతాన్ వారి నోట్లోకి జొరబడతాడు. కనుక మీకు ఆవులింత వస్తే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోండి.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When one yawns, he should put his hand over his mouth, otherwise the devil will enter.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|142. తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్దులిల్లాహ్' అంటే దానికి సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' అనాలి, 'అల్‌హమ్దులిల్లాహ్' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్' చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు|హదీసు 884
You must be logged in to post a comment.