హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 143వ అధ్యాయం: పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 885 – 893) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం

↑ విషయ సూచిక

باب استحباب المصافحةِ عندَ اللقاء وبشاشةِ الوجهِ وتقبيل يد الرجل الصالح وتقبيل ولده شفقة ومعانقة القادم من سفر وكراهية الانحناء.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

885

హదీసు 885

عن أَبي الخطاب قتادة قَالَ: قلُت لأَنَسٍ: أكَانتِ المُصافَحةُ في أصْحابِ رسولِ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ قَالَ: نَعَمْ. رواه البخاري.

హజ్రత్ అబుల్ ఖత్తాబ్ ఖతాదా (రహిమహుల్లాహ్) కథనం : నేను అనస్ (రదియల్లాహు అన్హు)ని 'దైవప్రవక్త సహచరుల్లో కరచాలనం చేసుకునే ఆచారం ఉండేదా?' అని అడిగాను. దానికాయన ఉండేదని సమాధానమిచ్చారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం)

English

Abu Khattab Qatadah (radiyallahu anhu) reported: I asked Anas: “Did the Companions of Messenger of Allah ﷺ use to shake hands?” He said: “Yes.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

కరచాలనాన్ని అరబీ భాషలో 'ముసాఫహా' అంటారు. ఈ పదం 'ముఫాఅలా'కు సమతుల్య పదం. కనుక దాని ప్రకారం ముసాఫహా అంటే ఒకని అరచేతిని మరొకతని అరచేత్తో కలపటం. ముసాఫహా ఒకే చేత్తో చేయాలని ఆ పదమే చెబుతోంది. దైవప్రవక్త ﷺ విధానం కూడా అదే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 885

886

హదీసు 886

وعن أنس رضي الله عنه قَالَ: لَمَّا جَاءَ أهْلُ اليَمنِ قَالَ رسولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "قَدْ جَاءَكُمْ أهْلُ الْيَمَنِ، وَهُمْ أولُ مَنْ جَاءَ بالمُصَافَحَة" رواه أَبُو داود بإسناد صحيح.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : యమన్‌వాసులు వచ్చినప్పుడు దైవప్రవక్త ﷺ తన అనుచరులతో, "మీ దగ్గరకు యమన్ వాసులు వచ్చారు. మొట్టమొదటగా కరచాలనం చేసే పద్ధతిని మీ దగ్గరకు తీసుకువచ్చింది వీరే!" అని అన్నారు.

(అబూ దావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో ఉల్లేఖించారు)

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: When the people of Yemen came, the Messenger of Allah ﷺ said, “The people of Yemen have visited you. They are the first to introduce the tradition of handshaking.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

యమన్‌లో కరచాలనం చేసుకునే ఆచారం ఉండేది. అక్కణ్ణుంచి కొంతమంది మదీనాకు వచ్చినప్పుడు దైవప్రవక్త ﷺ సమక్షంలో తమ ఆనవాయితీ ప్రకారం పరస్పరం కరచాలనం చేసుకోసాగారు. దైవప్రవక్త ﷺకు వారి ఆచారం నచ్చింది. ఆయన ముస్లింలు కూడా దాన్ని ఆచరించాలని ఆదేశించారు. ప్రపంచంలో మంచి అనేది ఎక్కడున్నా ఇస్లాం ధర్మం దాన్ని గ్రహిస్తుందని, దానికి విరుద్ధంగా రవ్వంత చెడుని కూడా తీవ్రంగా ఖండిస్తుందని ఈ హదీసు చాటిచెబుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 886

887

హదీసు 887

وعن البراءِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْ مُسْلِمْيِن يَلْتَقِيَانِ فَيَتَصافَحَانِ إِلاَّ غُفر لَهما قَبْلَ أنْ يَفْتَرِقَا" رواه أَبُو داود.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఏ ఇద్దరు ముస్లింలయినా కలుసుకొని కరచాలనం చేసుకుంటే, వారు పరస్పరం విడిపోకముందే వారిరువురిని మన్నించటం జరుగుతుంది. (అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Al-Bara’ (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Two Muslims will not meet and shake hands without having their sins forgiven (by Allah ) before they depart.”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 887

888

హదీసు 888

وعن أنس رضي الله عنه قَالَ: قَالَ رَجُلٌ: يَا رسولَ اللهِ، الرَّجُلُ مِنَّا يَلْقَى أخَاُه أوْ صَديقَهُ أينْحني لَهُ؟ قَالَ: "لاَ"قَالَ: أفَيَلتزمه وَيُقَبِّلُهُ؟ قَالَ:"لاَ"قَالَ: فَيَأْخُذُ بِيَده وَيُصَافِحُهُ؟ قال:"نَعَم َ" رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! మాలో ఎవరయినా తమ సోదరుణ్ణిగాని, మిత్రుణ్ణిగాని కలుసుకున్నప్పుడు అతని ముందు ఒంగవచ్చా?" అని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ ఒంగకూడదని సమాధానమిచ్చారు. "మరి అతన్ని కౌగిలించుకోవటంగాని, చుంబించటం గాని చేయవచ్చా?" అని అడిగాడా వ్యక్తి. 'అది కూడా చేయకూడదు' అని సమాధానమిచ్చారు దైవప్రవక్త ﷺ. "అతని చేయిపట్టుకొని కరచాలనమయినా చేయవచ్చా?" ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. అందుకాయన సమాధానమిస్తూ "అది చేయవచ్చు" అన్నారు. (తిర్మిజీ – హసన్)

(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)

English

Anas (radiyallahu anhu) reported: A man asked: “O Messenger of Allah! When a man meets a brother or a friend, should he bow to him?” He said, “No.” The man asked whether he should embrace and kiss him? The Messenger of Allah ﷺ replied, “No.” He asked whether he should hold his hand and shake it? The Messenger of Allah ﷺ replied, “Yes.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారికి ఒంగి మరీ సలాములు చెప్పటం, వారి ముందు మోకరిల్లటం, పాదాభివందనం చేయటం ధర్మవిరుద్ధమైన చేష్టలని పై హదీసు ద్వారా బోధపడుతోంది. కొంతమంది ఈ హదీసు భావం రుకూ లాగా వంగకూడదని, ఎదుటి వ్యక్తి గౌరవార్థం కాస్తంత వంగటంలో తప్పులేదని అంటారు. కానీ ఇవన్నీ నిరాధారమైన మాటలు. హదీసులో అసలు ఒంగటమే వారించబడిందన్న విషయం గమనార్హం.

రెండో విషయం : కరచాలనం ఒంటి చేత్తో చేయాలన్న దానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ఇందులో చూచాయగా కరచాలనం చేసే పద్ధతి వివరించబడింది. పృచ్ఛకుడు చేయిపట్టుకొని కరచాలనం చేయవచ్చా? అని అడిగాడు గాని చేతులు పట్టుకొని చేయవచ్చా? అని అడగలేదు. దైవప్రవక్త ﷺ కూడా అతను చెప్పిన ప్రకారం కరచాలనం చేసుకోవటానికి అనుమతినిచ్చారు. దీన్నిబట్టి ఒంటి చేత్తో కరచాలనం చేయటం మస్నూన్ పద్ధతి అని తేటతెల్లమవుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 888

889

హదీసు 889

وعن صَفْوان بن عَسَّال رضي الله عنه قَالَ: قَالَ يَهُودي لِصَاحبه اذْهب بِنَا إِلَى هَذَا النَّبيِّ فَأتَيَا رسولَ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَسَألاه عَنْ تسْع آياتٍ بَينات فَذَكرَ الْحَديث إِلَى قَوْله: فقَبَّلا يَدَهُ وَرِجْلَهُ وقالا: نَشْهَدُ أنَّكَ نَبِيٌّ. رواه الترمذي وغيره بأسانيد صحيحةٍ.

హజ్రత్ సఫ్వాన్ బిన్ అస్సాల్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి ఓ యూదుడు తన యూద మిత్రునితో మాట్లాడుతూ, "మనిద్దరం ఆ ప్రవక్త దగ్గరికి వెళదాం పద" అన్నాడు. ఆ తర్వాత వారిరువురూ బయలుదేరి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి, ఆయన్ని తొమ్మిది స్పష్టమైన సూచనల గురించి అడిగారు. (ఉల్లేఖకుడు మొత్తం హదీసుని వివరించాడు. దాని చివర్లో ఇలా ఉంది:) వారిరువురూ దైవప్రవక్త చేతిని, కాలిని ముద్దాడి, "తమరు నిజంగా దైవప్రవక్త అని మేము ధృవీకరిస్తున్నాం" అన్నారు.

(తిర్మిజీ తదితరులు దీన్ని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు)

(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు – సుననె నసాయిలోని విహార ప్రకరణం)

English

Safwan bin `Assal (radiyallahu anhu) reported: A Jew asked his companion to take him to the Prophet ﷺ; and when they came to the Messenger of Allah ﷺ, they asked him about the nine clear signs (given to Prophet Musa). Safwan narrated the long Hadith which concludes: They kissed the hands and feet of the Messenger of Allah ﷺ and said: “We testify that you are a Prophet.” [At-Tirmidhi] (Unapproved Hadith).

ముఖ్యాంశాలు

ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా మూడు గ్రంథాల్లోనూ పొందుపరచబడి ఉంది. అయితే మూడింటి ఆధారాలూ ఒక్కటేనన్న విషయం కూడా గమనార్హం. ఈ హదీసుకు సంబంధించిన ఆధారాల్లో అబ్దుల్లాహ్ బిన్ సలమా మురాదీ అనే వ్యక్తి ఉన్నాడు. హదీసు పరిశోధకులు ఇతన్ని బలహీన ఉల్లేఖకునిగా ఖరారు చేశారు. అందుకే ప్రముఖ ఆధునిక హదీసువేత్త షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) ఈ హదీసుని బలహీనమైన హదీసుల జాబితాలో పొందుపరిచారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 889

890

హదీసు 890

وعن ابن عمر رضي الله عنهما قِصَّة قَالَ فِيهَا: فَدَنَوْنا مِنَ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَّبلْنا يَدَه. رواه أَبُو داود.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఒక వృత్తాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నారు : మేము దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని ముద్దాడాము.

(అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

In a narration of Ibn Umar (radiyallahu anhuma) at the end of the narration of the Hadith ) he said: “We came near the Prophet ﷺ and kissed his hand.” [Abu Dawud] (Weak Hadith).

ముఖ్యాంశాలు

ఈ హదీసుకు సంబంధించిన ఆధారాల్లో యజీద్ బిన్ అబూ జియాద్ హాష్మీ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన కూడా బలహీనమైన ఉల్లేఖకుడే. అందుకే షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) ఈ హదీసుని కూడా బలహీనమైన హదీసుల జాబితాలో పొందుపరచారు. అయితే ఈ అధ్యాయానికి సంబంధించిన ఇతర అనేక హదీసులు దైవప్రవక్త సహచరులు కొన్ని సందర్భాల్లో ఆయన చేతిని ముద్దాడారన్న విషయాన్ని సమర్థిస్తున్నాయి. కనుక మహాత్ముల, దైవభక్తి పరాయణులైన పండితుల చేతుల్ని అప్పుడప్పుడూ ముద్దాడుతూ ఉండటంలో తప్పులేదు. అయితే దాన్ని ఆచారంగా చేసుకోకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 890

891

హదీసు 891

وعن عائشة رضي الله عنها قَالَتْ: قَدم: زَيْدُ بُن حَارثة المَدِينَةَ وَرسولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في بَيْتي فأتَاهُ فَقَرَعَ البَابَ. فَقَام إليهْ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَجُرُّ ثوْبَهُ فَاعْتَنَقَهُ وَقَبَّلَهُ"رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : హజ్రత్ జైద్ బిన్ హారిసా (రదియల్లాహు అన్హు) మదీనా నగరానికి వచ్చినప్పుడు దైవప్రవక్త ﷺ నా ఇంట్లోనే ఉన్నారు. జైద్ మా ఇంటికొచ్చి తలుపు తట్టారు. (వచ్చింది జైద్ బిన్ హారిసా అని తెలియగానే) దైవప్రవక్త ﷺ పట్టరాని సంతోషంతో తన అంగవస్త్రాన్ని ఈడ్చు కుంటూ ఎదురెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకొని చుంబించారు. (తిర్మిజీ – హసన్)

(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)

English

`Aishah (radiyallahu anha) reported: Zaid bin Harithah came to the Messenger of Allah ﷺ when he was in my house. Zaid knocked at the door. The Prophet ﷺ rose to receive him, trailing his garment. He embraced and kissed him.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

షేఖ్ అల్ బానీ గారు ఈ హదీసుని బలహీనకోవకు చెందిన హదీసుగా నిర్ధారించారు. ఈ హదీసు పరంపరలో ముహమ్మద్ బిన్ ఇస్‌హాఖ్ అనే ఒకతనున్నాడు. ఇతను తద్‌లీస్ చేస్తాడని ప్రతీతి. ఇతనే గాకుండా బలహీనకోవకు చెందిన ఉల్లేఖకులు ఇంకా ఇద్దరు ఈ హదీసు ఆధారాల్లో ఉన్నారు.

ఏమైనప్పటికీ 'చుంబనా'నికి సంబంధించిన ఉల్లేఖనాలన్నీ కూడా హదీసు పరిశోధకులు, హదీసువేత్తల దృష్టిలో బలహీనమైనవిగా భావింపబడుతున్నాయి. కనుక పరస్పరం కలుసుకున్నప్పుడు కేవలం ఒంటిచేత్తో కరచాలనం చేసుకుంటే చాలు. వీలైతే ఆలింగనం కూడా చేసుకోవచ్చు. కొంతమంది పండితులు ఆలింగనాన్ని అభిలషణీయమైన ఆచరణగా భావిస్తారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 891

892

హదీసు 892

وعن أَبي ذرٍْ رضي الله عنه قَالَ: قَالَ لي رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لاتَحقِرَنَّ مِنَ المعْرُوف شَيْئاً وَلَو أنْ تَلقَى أخَاكَ بوجه طليق" رواه مسلم.

దైవప్రవక్త ﷺ తనకు ఈ విధంగా ఉపదేశించారని హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : "ఏ మంచి పనినీ అల్పమైనదిగా తలపోయకు. ఆఖరికి నీ సోదరుణ్ణి నగుమోముతో పలకరించటాన్నయినా సరే. (ముస్లిం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Do not belittle any good deed, even your meeting with your brother (Muslim) with a cheerful face.” [Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 892

893

హదీసు 893

وعن أبي هُريرةَ رضي الله عنه قَالَ: قبَّل النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الحَسَنَ بْنَ عَليٍّ رضي الله عنهما، فَقَالَ، الأقْرَعُ بن حَابس: إنَّ لِي عَشَرةًَ مِنَ الْوَلَد ماَقَبَّلتُ مِنهُمْ أحَداَ. فَقَالَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم."مَنْ لاَيَرْحَمْ لا يُرْحَمْ، َ" متفق عليه. [كتاب عيادة المريض وتشييع الميت] [باب عيادة المريض] …

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ (తన మనుమడయిన) హసన్‌ను ముద్దాడుతుండగా, అఖ్రా బిన్ హాబిస్ అనే వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోతూ, "నాకు పదిమంది పిల్లలున్నారు. కాని నేను ఇప్పటివరకు వారిలో ఎవర్నీ ముద్దాడి ఎరుగను" అన్నాడు. అందుకాయన, "ఇతరుల మీద దయజూపని వ్యక్తి దయాదాక్షిణ్యాలకు పాత్రుడు కాజాలడు" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ kissed his grandson Hasan bin `Ali in the presence of Aqra` bin Habis. Thereupon Aqra` remarked: “I have ten children and I have never kissed any one of them.” The Messenger of Allah ﷺ cast a glance upon him and said, “He who does not show mercy to others, will not be shown mercy.” [Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|143. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం చేసుకోవటం లాంటి పనులు అభిలషణీయమైనవి, ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం అవాంఛనీయం|హదీసు 893