హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 141వ అధ్యాయం: అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 874 – 877) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
141. అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి
باب بيان أنَّ السنة إِذَا قيل للمستأذن: من أنت؟ أن يقول: فلان فيسمي نفسه بما يعرف به من اسم أَوْ كنية وكراهة قوله"أنا"ونحوها.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 874
عن أنس رضي الله عنه في حديثه المشهور في الإسراءِ قَالَ: قَالَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، "ثُمَّ صَعِدَ بي جِبْريلُ إِلَى السَّمَاءِ الدُّنيا فَاسْتَفْتَحَ"فقِيلَ: منْ هذَا؟ قَالَ: جبْريلُ، قِيلَ: وَمَنْ مَعَك؟ قَالَ: مُحمَّدٌ. ثمَّ صَعِدَ إلى السَّماء الثّانية وَالثَّالِثَةِ والرَّابعة وَسَائرهنَّ وَيُقالُ فِي بَابِ كُلِّ سَمَاءٍ: مَنْ هَذَا؟ فَيقُولُ: جِبْريلُ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ మేరాజ్ సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు: జిబ్రయీల్ (అలైహి) నన్ను వెంటబెట్టుకొని పైకి వెళ్తూ మొదటి ఆకాశం దగ్గరికి చేరుకున్నారు. అక్కడున్న ద్వారపాలకుణ్ణి ద్వారం తెరువమని కోరారు. లోపలి నుంచి 'ఎవరూ?' అని అడిగారు. దానికాయన, 'నేను (దైవదూత) జిబ్రయీల్‌ని' అని సమాధానమిచ్చారు. 'మీ వెంట మరెవరైనా ఉన్నారా?' అని మళ్ళీ ప్రశ్నించటం జరిగింది. 'నా వెంట ముహమ్మద్ ﷺ ఉన్నారు' అని చెప్పారు జిబ్రయీల్. ఆ తర్వాత ఆయన నన్ను రెండవ, మూడవ, నాల్గవ, ఇంకా మిగిలిన ఆకాశాల మీదికి తీసుకొని వెళ్ళారు. ప్రతి ఆకాశపు ద్వారం దగ్గర 'ఎవరు మీరు?' అని అడగటం జరిగింది. దానికాయన, 'జిబ్రయీల్‌ని' అని సమాధానమిస్తూ వెళ్ళారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported in the course of his famous Hadith pertaining to Al-Isra’ (the Ascension) that Messenger of Allah ﷺ said, “Then Jibril (Gabriel) ascended along with me to the nearest heaven and requested for the gate to be opened. He was asked: `Who is there?’ He replied: `Jibril.’ He was asked: `Who is with you?’ He said: `Muhammad.’ Then he ascended to the second heaven and requested for the opening of the gate. He was asked: `Who is there?’ He said: `Jibril.’ He was asked: `Who is with you?’ He replied: `Muhammad.’ In the same way he ascended to the third, fourth and all the heavens (i.e., until the seventh). At all of the gates he was asked: `Who is there?’ He replied: Jibril.”’[Al-Bukhari and Muslim]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|141. అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి|హదీసు 874
హదీసు 875
وعن أَبي ذرِ رضي الله عنه قَالَ: خَرجَتُ لَيْلة مِنَ اللَّيَالِي فَإذَا رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَمْشِي وحْدَهُ، فجَعلتُ أمْشِي فِي ظلِّ القمَر، فَالْتَفَتَ فَرَآنِي فَقَالَ: "مَنْ هذا؟ "فقلت ُ أبو ذَرٍ، متفق عليه
హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకానొక రోజు రాత్రి నేను ఇంటి నుండి బయలుదేరాను. దారిలో నాకు దైవప్రవక్త ﷺ కనిపించారు. ఆయన ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు. నేను (ఆయనకు కనపడకుండా ఆయన వెనకే) వెన్నెల ఛాయల్లో నడవసాగాను. కాని ఆయన వెనక్కి తిరిగి నన్ను చూసి 'ఎవరూ?' అన్నారు. 'నేనండీ! అబూ జర్ర్‌ని' అన్నాను నేను.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Dharr (radiyallahu anhu) reported: I stepped out one night and saw Messenger of Allah ﷺ walking by himself. I began to walk in the moonlit night. He turned round and saw me and asked, “Who is there?” I replied: “Abu Dharr.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|141. అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి|హదీసు 875
హదీసు 876
وعن أُمَّ هانئ رضي الله عنها قالت: أتيت النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُوَ يَغْتَسِلُ وفاطمةُ تسْتُرُهُ فقال: "مَنْ هذه،"فقلت: أنا أُم هَانئ. متفق عليه.
హజ్రత్ ఉమ్మె హానీ (రదియల్లాహు అన్హా) కథనం : ఒకసారి నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన స్నానం చేస్తున్నారు. ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఆయనకు ఓ గుడ్డ అడ్డం ఉంచారు. (ఎవరో వచ్చినట్టు అలికిడి విని) ఆయన 'ఎవరూ?' అన్నారు. 'నేనండీ ఉమ్మె హానీని' అన్నాను నేను.
(బుఖారీ – ముస్లిం)
English
Umm Hani (radiyallahu anha) reported: I went to the Prophet ﷺ who was taking a bath while Fatimah was screening him. He asked, “Who is there?” I replied: “I am Umm Hani.’‘[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|141. అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి|హదీసు 876
హదీసు 877
وعن جابر رضي الله عنه قَالَ: أتَيتُ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَدَقَقْتُ البَابَ فقال: " من ذا؟ "فَقُلتُ، أَنَا، فَقَالَ:"أنَا أنَا؟ "كأنهُ كَرهَهَا، متفق عليه.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. లోపలినుంచి ఆయన, 'ఎవరూ?' అని అడిగారు. నేను 'నేనండీ!' అన్నాను. దానికాయన, "నేను, నేనేంటి?" అన్నారు నేను పేరు చెప్పకపోవటం తనకు నచ్చలేదన్నట్లుగా.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఇస్తీజాన్ ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: I went to the Prophet ﷺ and knocked at the door (to seek permission). He asked, “Who is there?” I said: “I”. He repeated, ” I, I?!” as if he disliked it.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
'నేను నేను' అనంటే ఇంట్లో ఉన్నవారికి అనుమతి అడుగుతున్నదెవరో ఎలా అర్థమవుతుంది? అందుకని అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే తమ పేరు తెలియజేయాలి. 'నేను' అని అనకూడదు. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, తలుపు తట్టడం, కాలింగ్ బెల్ నొక్కటం కూడా అనుమతి తీసుకోవటం క్రిందికే వస్తుంది. ఆ శబ్దం విని ఇంట్లోవున్నవారు తలుపు దగ్గరికి రాగానే ముందుగా వారికి సలాం చేసి ఆ తర్వాత సంభాషణ మొదలెట్టాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|141. అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే 'నేను' అని అనరాదు, తమ పేరు తెలియజేయాలి|హదీసు 877
You must be logged in to post a comment.