హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 140. అనుమతి కోరటం – దాని పద్ధతి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 140వ అధ్యాయం: అనుమతి కోరటం – దాని పద్ధతి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 870 – 873) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

140. అనుమతి కోరటం – దాని పద్ధతి

↑ విషయ సూచిక

باب الاستئذان وآدابه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لاَ تَدْخُلُوا بُيُوتاً غَيْرَ بُيُوتِكُمْ حَتَّى تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَى أَهْلِهَا} [النور: ٢٧]

"విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ళల్లోకి తప్ప ఇతరుల ఇళ్ళల్లోకి, ఇంటివారి అంగీకారం పొందనంతవరకు, ఇంట్లోవారికి నలాం చేయనంత వరకు (లోనికి) ప్రవేశించకండి." (అన్ నూర్ : 27)

{وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنْكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ} [النور: ٥٩]

"మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు, తమ పెద్దలు అనుమతి తీసుకునే విధంగా తాము కూడా అనుమతి తీసుకొని మరీ లోనికి రావాలి." (అన్ నూర్ : 59)

English

“O you who believe! Enter not houses other than your own, until you have asked permission and greeted those in them.” [An-Nūr 24:27]

“And when the children among you come to puberty, then let them (also) ask for permission, as those senior to them (in age).” [An-Nūr 24:59]

870

హదీసు 870

وعن أَبي موسى الأشعري رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الاستِئْذاُن ثَلاَثٌ، فَإِنْ أُذِنَ لَكَ وَإلاَّ فَارْجِع" متفق عليه.

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మూడుసార్లు అనుమతి కోరాలి. అనుమతి లభిస్తే సరి; లేకపోతే తిరిగి వెళ్ళిపోవాలి.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఇస్తీజాన్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Permission is to be sought thrice. If it is accorded, you may enter; otherwise, go back.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|140. అనుమతి కోరటం – దాని పద్ధతి|హదీసు 870

871

హదీసు 871

وعن سهلِ بنِ سعد رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "إنَّمَا جُعِلَ الاستئذاُن منْ أَجْلِ البَصَر" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఇతరుల ఇండ్లలోని స్త్రీల మీద దృష్టి పడరాదన్న ఉద్దేశ్యంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించటం జరిగింది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఇస్తీజాన్ ప్రకరణం)

English

Sahl bin Sa`d (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Seeking permission to enter (somebody’s house) has been prescribed in order to restrain the eyes (from looking at something we are not supposed to look at).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇతరుల "ఏకాంతపు హక్కు"ని హరించటం కూడా పాపమే అవుతుంది. ఏకాంతంలో ఉన్నప్పుడు సాధారణంగా మనిషి తన వ్యక్తిగతమైన పనుల్లో నిమగ్నుడై ఉంటాడు. ఆ సమయంలో అతని ఏకాంతానికి భంగం కలగజేస్తే అతను చాలా మనస్తాపానికి గురౌతాడు. అనుమతి తీసుకోకుండా హఠాత్తుగా ఇతరుల ఇళ్ళల్లోకి ప్రవేశించటం వల్ల అక్కడ చూడరాని దృశ్యమేదయినా కంటపడవచ్చు లేక ఆ ఇంట్లో ఉన్న స్త్రీల మీద దృష్టి పడవచ్చు. దానివల్ల ఆ ఇంటివారు తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు. ఒక నాగరిక సమాజంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటానికి, సమాజంలో చెడు ప్రబలటానికి దోహదపడే కారణాలను నిర్మూలించటానికి అనుమతి తీసుకునే ఆజ్ఞ జారీ చేయబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|140. అనుమతి కోరటం – దాని పద్ధతి|హదీసు 871

872

హదీసు 872

وعن رِبْعِيِّ بن حِرَاشٍ قَالَ حدَّثّنا رَجُلٌ مِنْ بَنِي عَامرٍ أنَّهُ استأذَنَ عَلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهو في بيتٍ فَقَالَ: أألِج؟ فَقَالَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لخادِمِهِ: "أُخْرُج إِلَى هَذَا فَعَلِّمْهُ الإستئذَانَ فَقُل لَهُ قُل: السَّلامُ عَلَيكُم، أأدْخُلُ؟ "فَسَمِعهُ الرَّجُلُ فَقَالَ: السَّلام عَلَيكم، أأدخُلُ؟ فَأذن لَهُ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَدَخَلَ. رواه أَبُو داود بإسناد صحيح.

బనూ ఆమిర్‌కు చెందిన ఒకాయన తన సొంత సంఘటన గురించి వివరించారని రిబ్‌యీ బిన్ హిరాష్ తెలియజేశారు : దైవప్రవక్త ﷺ ఒక గృహంలో ఉండగా ఆయన వెళ్ళి, "నేను లోనికి జొరబడవచ్చా?" అంటూ లోపలికి రావటానికి దైవప్రవక్త ﷺను అనుమతి కోరాడు. దైవప్రవక్త ﷺ అది విని తన సేవకునితో, "నువ్వెళ్ళి ఆ వ్యక్తికి అనుమతి ఎలా కోరాలో చెప్పు. 'అస్సలాము అలైకుం. లోపలికి రావచ్చా?' అని అడగాలని చెప్పు" అన్నారు. ఆ మాటలు విని ఆయన, "అస్సలాము అలైకుం, లోపలికి రావచ్చా?" అని అడిగాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఆయనకు అనుమతినివ్వగా, ఆయన లోపలికి వచ్చాడు. (అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికి తీశారు.

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Rib`i bin Hirash (radiyallahu anhu) reported: A man of Banu `Amir tribe has told us that he had asked the Prophet ﷺ for permission to enter when he was at home. He said: “May I enter?” Messenger of Allah ﷺ said to the servant, “Go out and instruct him about the manner of seeking permission. Tell him to say: As-Salamu `Alaikum (may you be safe from evil). May I come in?” The man heard this and said: “As-Salamu `Alaikum (may you be safe from evil). May I come in?” The Prophet ﷺ then accorded permission to him and he entered in.[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఇతరుల ఇండ్లల్లోకి వెళ్ళదలచుకున్నప్పుడు ముందు వారి గుమ్మం దగ్గర నిలబడి సలాం చేయాలి. సలాంకు జవాబురాగానే లోపలికి వెళ్ళటానికి అనుమతి కోరాలి. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే షరీఅత్ ఆదేశించే విషయాల గురించి తెలియనివారికి కూడా వాటిని బోధించాలి. దానివల్ల వారు కూడా షరీఅత్‌కు అనుగుణంగా ఆచరిస్తారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|140. అనుమతి కోరటం – దాని పద్ధతి|హదీసు 872

873

హదీసు 873

عن كِلْدَةَ بن الحَنْبل رضي الله عنه قَالَ: أتَيْتُ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَدَخَلْتُ عَلَيْه وَلَمْ أُسَلِّم فَقَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ارْجعْ فَقُلْ السَّلامُ عَلَيكُم أَأَدْخلُ؟ " رواه أَبُو داود، والترمذي وقال: حديث حسن.

హజ్రత్ కిల్‌దా బిన్ హంబల్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఆయనకు సలాం చేయకుండానే ఆయనింట్లోకి ప్రవేశించాను. అప్పుడాయన (చిరుకోపంతో), "బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళి 'అస్సలాము అలైకుం' నేను లోపలికి రావచ్చా?' అని అడిగిరా" అన్నారు.

(అబూ దావూద్, తిర్మిజీ – హసన్)

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)

English

Kildah bin Al-Hanbal (radiyallahu anhu) reported: I visited the Prophet ﷺ and I entered his house without seeking permission. So he said, “Go back and say: `As-Salamu `alaikum (may you be safe from evil). May I come in?”’[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|140. అనుమతి కోరటం – దాని పద్ధతి|హదీసు 873