హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 137. పురుషులు, స్త్రీలు పరస్పరం సలాం చేయటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 137వ అధ్యాయం: పురుషుడు తన భార్యకు, మహ్రమ్ స్త్రీలకు, చెడుకు తావు లేని పక్షంలో పర స్త్రీలకు, అలాగే స్త్రీలు పురుషులకు సలాం చేయటం ధర్మసమ్మతమే. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 863 – 865) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

137. పురుషుడు తన భార్యకు, మహ్రమ్ స్త్రీలకు, చెడుకు తావు లేని పక్షంలో పర స్త్రీలకు, అలాగే స్త్రీలు పురుషులకు సలాం చేయటం ధర్మసమ్మతమే

↑ విషయ సూచిక

باب سلام الرجل على زوجته والمرأة من محارمه وعلى أجنبية وأجنبيات لا يخاف الفتنة بهن وسلامهن بهذا الشرط

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

863

హదీసు 863

عن سهل بن سعدٍ رضي الله عنه قال: كانَتْ فِينَا امْرَأَةٌ وفي رواية: – كانَتْ لَنا عَجُوزٌ تأْخُذُ منْ أَُصُولِ السِّلْقَ فتطْرَحُهُ فِي القِدْرِ وَتُكَرْكِرُ حَبَّاتٍ منْ شَعِيرٍ، فَإذَا صَلَّيْنا الجُمُعَةَ وانْصَرَفْنَا نُسَلِّمُ عَلَيْها فَتُقدِّمُهُ إليْنَا رواه البخاري. قَوْله"تُكَرْكِرُ"أي تَطحَنُ.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం : మా వీధిలో ఒకావిడ ఉండేది. (వేరొక ఉల్లేఖనంలో ఒక వృద్ధురాలు ఉండేది అని ఉంది). ఆమె కుండలో బీట్‌రూట్ మూలికలను వేసి ఉడకబెట్టేది. ఇంకా కొన్ని బార్లీ గింజలు నూరి పెట్టేది. మేము జుమా నమాజ్ చేసుకొని తిరిగొచ్చేటప్పుడు ఆమెకు సలాం చేసేవాళ్ళం. ఆమె (మమ్మల్ని పిలిచి) మాకు ఆ అన్నం వడ్డించేది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జుమా ప్రకరణం)

English

Sahl bin Sa`d (radiyallahu anhu) reported: There was a woman among us who would put beet root in a pot and add to it some ground barley. She used to cook them together. On returning from the Friday prayer, we would greet her and she would offer it to us.[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|137. పురుషుడు తన భార్యకు, మహ్రమ్ స్త్రీలకు, చెడుకు తావు లేని పక్షంలో పర స్త్రీలకు, అలాగే స్త్రీలు పురుషులకు సలాం చేయటం ధర్మసమ్మతమే|హదీసు 863

864

హదీసు 864

وعن أُم هانئ فاخِتَةَ بِنتِ أَبي طَالب رضي الله عَنْهَا قَالت: أتيت النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَوْمَ الفَتْح وَهُو يَغْتسِلُ وَفاطِمةُ تَسْتُرهُ بِثَوْبٍ فَسَلَّمْتُ. وذَكَرَت الحديث. رواه مسلم.

అబూ తాలిబ్ కుమార్తె ఉమ్మె హానీ ఫాఖ్తా (రదియల్లాహు అన్హా) కథనం : మక్కా విజయం నాడు నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన స్నానం చేస్తున్నారు. ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఆయనకు ఓ గుడ్డ అడ్డం ఉంచారు. ఆ సందర్భంగా నేనాయనకు సలాం చేశాను. ( తర్వాత ఆమె మిగతా హదీసు వివరించారు). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Umm Hani (radiyallahu anha), the daughter of Abu Talib reported: I went to the Prophet ﷺ on the day of the conquest of Makkah. He was taking a bath and Fatimah was screening him with a cloth. I greeted him. And she mentioned the rest of the Hadith.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|137. పురుషుడు తన భార్యకు, మహ్రమ్ స్త్రీలకు, చెడుకు తావు లేని పక్షంలో పర స్త్రీలకు, అలాగే స్త్రీలు పురుషులకు సలాం చేయటం ధర్మసమ్మతమే|హదీసు 864

865

హదీసు 865

وعن أسماءَ بنتِ يزيدَ رضي الله عنها قالت: مَرّ عَلَيْنَا النّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فِي نِسْوَةٍ فَسَلَّمَ عَلَيْنَا. رواه أَبُو داود، والترمذي وقال: حديث حسن، وهذا لفظ أَبي داود، ولفظ الترمذي: أنَّ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَرَّ في المْسْجِدِ يوْماً وعُصْبَةٌ مِنَ النِّسَاءِ قُعُود فَأَلْوَى بِيَدِهِ بالتَّسليمِ.

హజ్రత్ అస్మా బిన్తె యజీద్ (రదియల్లాహు అన్హా) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ ఓ మహిళా సమూహం దగ్గర్నుంచి వెళ్ళారు. (ఆ సమూహంలో నేను కూడా ఉన్నాను). అప్పుడాయన మాకు సలాం చేశారు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్)

పై వాక్యాలు అబూ దావూద్‌వి. తిర్మిజీ వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి : ఒక రోజు మస్జిద్ దగ్గర ఓ మహిళా సమూహం కూర్చొని ఉండగా దైవప్రవక్త ﷺ అటువైపు నుంచి వెళ్తూ వారికి చేతి సంజ్ఞతో సలాం చేశారు.

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)

English

Asma bint Yazid (radiyallahu anha) reported: The Prophet ﷺ passed by us when we were with a party of women, and he greeted us.[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|137. పురుషుడు తన భార్యకు, మహ్రమ్ స్త్రీలకు, చెడుకు తావు లేని పక్షంలో పర స్త్రీలకు, అలాగే స్త్రీలు పురుషులకు సలాం చేయటం ధర్మసమ్మతమే|హదీసు 865