హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 136. పిల్లలకు సలాం చేయటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 136వ అధ్యాయం: పిల్లలకు సలాం చేయటం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 862) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

136. పిల్లలకు సలాం చేయటం

↑ విషయ సూచిక

باب السلام عَلَى الصبيان

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

862

హదీసు 862

عن أنس رضي الله عنه أنَّهُ مَرَّ عَلى صِبْيان فَسَلَّمَ عَلَيْهمْ وقال: كانَ رسول لله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَفْعلُهُ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఓసారి పిల్లల దగ్గర్నుంచి వెళ్తూ వారికి సలాం చేశారు. ఆ తర్వాత వారితో, "దైవప్రవక్త ﷺ ఈ విధంగా చేసేవారు" అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported that he passed by some children and greeted them. Then he said: “Messenger of Allah ﷺ used to do the same.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

అసలు నియమం ప్రకారం చూస్తే పిల్లలే పెద్దలకు సలాం చేయాలి. కాని అప్పుడప్పుడూ పెద్దలే తొందరపడి పిల్లలకు సలాం చేస్తూ ఉండాలి. దానివల్ల పిల్లలకు ముందుగా సలాం చేసే సదాచారం అలవడుతుంది. పిల్లలు ప్రతి విషయంలోనూ తమ పెద్దల్ని అనుకరిస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|136. పిల్లలకు సలాం చేయటం|హదీసు 862