హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 135. మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 135వ అధ్యాయం: మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 861) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

135. మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి

↑ విషయ సూచిక

باب استحباب السلام إِذَا دخل بيته

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{فَإِذَا دَخَلْتُمْ بُيُوتاً فَسَلِّمُوا عَلَى أَنْفُسِكُمْ تَحِيَّةً مِنْ عِنْدِ اللَّهِ مُبَارَكَةً طَيِّبَةً} [النور: ٦١]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "మీరు ఇళ్ళల్లోకి ప్రవేశించేటప్పుడు మీ వాళ్ళకు సలాం చేయండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన. అల్లాహ్ తరపు నుండి నిర్ణయించబడింది. (అన్ నూర్ : 61)

English

“But when you enter the houses, greet one another with a greeting from Allah (i.e., say: As-Salamu `Alaikum – may you be safe from evil), blessed and good.” [An-Nūr 24:61]

861

హదీసు 861

وعن أنسٍ رضي الله عنه قَالَ: قَالَ لي رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "يابُنَّي، إِذَا دَخَلْتَ عَلى أهْلِكَ فَسَلِّمْ يَكُنْ بَركةً عَلَيْكَ وَعَلَى أهلِ بَيْتِكَ" رواه الترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నాకు హితబోధ చేస్తూ, "అబ్బాయీ! నువ్వు నీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చెయ్యి. దానివల్ల నీకూ, నీ ఇంటివారికి శుభం ప్రాప్తిస్తుంది" అని అన్నారు.

(తిర్మిజీ – హసన్, సహీహ్)

(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said to me, “Dear son, when you enter your house, say As-Salamu `Alaikum to your family, for it will be a blessing both to you and to your family.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|135. మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి|హదీసు 861