హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 134. మాటిమాటికీ సలాం చేసుకోవటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 134వ అధ్యాయం: మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం. ఒకసారి సలాం చేసుకున్నాక లోపలికి వెళ్ళివచ్చినా లేక ఇరువురి మధ్య ఏదయినా వస్తువు అడ్డం వచ్చినా మళ్ళీ సలాం చేసుకుంటే మంచిది. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 859 – 860) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

134. మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం. ఒకసారి సలాం చేసుకున్నాక లోపలికి వెళ్ళివచ్చినా లేక ఇరువురి మధ్య ఏదయినా వస్తువు అడ్డం వచ్చినా మళ్ళీ సలాం చేసుకుంటే మంచిది

↑ విషయ సూచిక

باب استحباب إعادة السلام عَلَى من تكرَّر لقاؤه عَلَى قرب بأن دخل ثم خرج ثُمَّ دخل في الحال، أَو حال بينهما شجرة ونحوها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

859

హదీసు 859

عن أَبي هريرة رضي اللَّه عنه في حديثِ المسِيءِ صَلاتُه أنَّهُ جَاءَ فَصَلَّى ثُمَّ جَاءَ إِلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَسَلَّمَ عَلَيْهِ فَرَدَّ عَلَيْهِ السَّلام فَقَالَ: "ارْجِعْ فَصَلِّ فَإنَّكَ لَمْ تُصَلِّ"فَرَجَعَ فَصَلَّى، ثُمَّ جَاءَ فَسَلَّمَ عَلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حَتّى فَعَل ذلكَ ثَلاثَ مَرَّاتٍ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) అధ్వాన్నంగా నమాజ్ చేసిన ఒక వ్యక్తి గురించి తెలియజేస్తూ ఇలా అన్నారు : ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి ఆయనకు సలాం చేశాడు. దైవప్రవక్త ﷺ అతనికి ప్రతి సలాం చేసి, "వెళ్ళి ఇంకోసారి నమాజ్ చెయ్యి. నువ్వసలు నమాజ్ చెయ్యలేదు" అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి నమాజ్ చేశాడు. నమాజ్ చేసుకొని వచ్చి దైవప్రవక్త ﷺకు మళ్ళీ సలాం చేశాడు. (దైవప్రవక్త ﷺ అతనికి ప్రతి సలాం చేసి మళ్లీ నమాజ్ చేయమని ఆదేశించారు). ఆ వ్యక్తి ఆ విధంగా మూడుసార్లు చేశాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported in the Hadith in respect of the person who was at fault in performing his Salat (prayer): He came to the Prophet ﷺ and greeted him. The Prophet ﷺ responded to the greeting and said, “Go back and repeat your Salat because you have not performed the Salat (properly).” He again performed Salat as he had prayed before and came to the Prophet ﷺ and greeted him. The Prophet ﷺ responded to the greetings (and repeated his words to him). This act of repeating (the Salat and the Salam) was done thrice.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

కొద్ది కొద్ది సేపటికి సలాం చేసుకుంటూ ఉండాలని పై హదీసు ద్వారా నిరూపించబడింది. ఈ విషయాన్నే గ్రంథకర్త సదరు అధ్యాయానికి శీర్షికగా పెట్టారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|134. మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం. ఒకసారి సలాం చేసుకున్నాక లోపలికి వెళ్ళివచ్చినా లేక ఇరువురి మధ్య ఏదయినా వస్తువు అడ్డం వచ్చినా మళ్ళీ సలాం చేసుకుంటే మంచిది|హదీసు 859

860

హదీసు 860

وعنه عن رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا لقيَ أَحَدَكُمْ أخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ، فَإنْ حالَتْ بَيْنَهُمَا شَجَرَةٌ أَوْ جِدَارٌ أوْ حَجَرٌ ثُمَّ لَقِيَهُ فَلْيُسَلِّمْ عَلَيْه" رواه أَبُو داود.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరయినా తమ సోదరుణ్ణి కలుసుకున్నప్పుడు అతనికి సలాం చేయాలి. ఆ తర్వాత తమ మధ్య చెట్టు, గోడ, రాయి (లాంటిది) అడ్డు వచ్చి తిరిగి కలుసుకుంటే మళ్ళీ (ఇంకోసారి) సలాం చేసుకోవాలి. (అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When one of you meets a brother (in Faith) he should greet him. Then if a tree or a wall or a stone intervenes between them and then he meets him again, he should greet him.”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|134. మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం. ఒకసారి సలాం చేసుకున్నాక లోపలికి వెళ్ళివచ్చినా లేక ఇరువురి మధ్య ఏదయినా వస్తువు అడ్డం వచ్చినా మళ్ళీ సలాం చేసుకుంటే మంచిది|హదీసు 860