హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 133వ అధ్యాయం: సలాం నియమాలు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 857 – 858) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
133. సలాం నియమాలు
باب آداب السلام
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 857
عن أَبي هريرة رضي الله عنه أنَّ رسولَ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يُسَلِّمُ الرَّاكبُ عَلَى الْمَاشِي، وَالْماشي عَلَي القَاعِدِ، والقليلُ عَلَى الكَثِيِرِ" متفقٌ عليه. وفي رواية البخاري: "والصغيرُ عَلَى الْكَبِيرِ".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : వాహనం మీద వెళ్తున్న వ్యక్తి కాలి నడకన వెళ్ళేవ్యక్తికి సలాం చెయ్యాలి. అలాగే నడిచి వెళ్ళేవాడు కూర్చున్న వ్యక్తికి, తక్కువ మంది ఎక్కువ మందికి సలాం చెయ్యాలి.
(బుఖారీ – ముస్లిం)
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో అదనంగా "పిల్లలు పెద్దలకు సలాం చేయాలి" అని ఉంది.
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, ‘A rider should greet a pedestrian; a pedestrian should greet one who is sitting; and a small group should greet a large group (of people).”[Al-Bukhari and Muslim].
The narration in Al-Bukhari adds: Messenger of Allah ﷺ said, “The young should greet the elderly.”
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|133. సలాం నియమాలు|హదీసు 857
హదీసు 858
وعن أَبي أُمامة صُديِّ بن عجلان الباهِلِي رضي الله عنه قال: قال رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ أوْلىَ النِّاس باللهِ مَنْ بَدأهم بالسَّلاَم". رواه أَبُو داود بإسنادٍ جيدٍ. ورواه الترمذي عن أَبي أُمامةَ رضي الله عنهُ قِيلَ يارسولَ الله، الرَّجُلانِ يَلْتَقيان أيُّهُمَا يَبْدأُ بالسَّلامِ، قَالَ: "أوْلاهُمَا بالله تعالى" قال الترمذي: حديث حسن.
హజ్రత్ అబూ ఉమామా సుదై బిన్ అజ్లాన్ బాహిలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ముందుగా సలాం చేసేవారు దేవుని దృష్టిలో ప్రజలందరిలోకెల్లా శ్రేష్ఠులు.
(అబూ దావూద్ దీనిని మంచి ఆధారాలతో వెలికితీశారు)
ఇమామ్ తిర్మిజీ కూడా ఈ హదీసుని అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) ఆధారంగా వెలికితీశారు. అందులో ఇలా ఉంది: "దైవప్రవక్తా! ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు వారిలో ఎవరు ముందుగా సలాం చేయాలి?" అని దైవప్రవక్త ﷺను ఎవరో అడిగారు. దానికాయన "వారిరువురిలో దైవానికి అత్యంత నన్నిహితులు నలాం చెయ్యాలి" అని చెప్పారు. (తిర్మిజీ – హసన్)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)
English
Abu Umamah Sudaiy bin `Ajlan Al-Bahili (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The person nearest to Allah is one who is the first to offer greeting.”[Abu Dawud].
The narration in At-Tirmidhi is: The Messenger of Allah ﷺ was asked: “O Messenger of Allah! When two persons meet, who should greet the other first?” The Messenger of Allah ﷺ said, “The person nearest to Allah (i.e., one who is more obedient and therefore closer to Allah will say: As-Salam first.”
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|133. సలాం నియమాలు|హదీసు 858
You must be logged in to post a comment.