హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 13. మంచి పనులకు మార్గాలు అనేకం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 13వ అధ్యాయం: మంచి పనులకు మార్గాలు అనేకం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 25 హదీసులు (హదీసు 117 – 141) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

13. మంచి పనులకు మార్గాలు అనేకం

↑ విషయ సూచిక

باب في بَيان كثرةِ طرق الخير

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ} [البقرة: ٢١٥]

అల్లాహ్ సెలవిచ్చాడు : "మీరు ఏ మేలు చేసినా, దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు.' (అల్ బఖర : 215)

{وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ} [البقرة: ١٩٧]

మరొకచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహ్‌కు తెలుస్తుంది." (అల్ బఖర : 197)

{فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْراً يَرَهُ} [الزلزلة:٧]

ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : "ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నాసరే దాన్ని అతను చూసుకుంటాడు." (అల్ జిల్‌జాల్ : 7)

{مَنْ عَمِلَ صَالِحاً فَلِنَفْسِهِ} [الجاثية:١٥]

వేరొకచోట ఇలా సెలవీయబడింది : "సత్కార్యం చేసేవాడు దానిని తనకోసమే చేసుకుంటాడు." (అల్ జాసియహ్ : 15)

ఈ అధ్యాయం క్రింద ఇటువంటి సూక్తులు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు కూడా లెక్కకు మించి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మేము ప్రస్తావించబోతున్నాం.

English

“… and whatever you do of good deeds, truly, Allah knows it well.” [Al-Baqarah 2:215]

“And whatever good you do, (be sure) Allah knows it.” [Al-Baqarah 2:197]

“So whosoever does good equal to the weight of an atom (or a small ant), shall see it.” [Az-Zalzalah 99:7]

“Whosoever does a good deed, it is for his ownself…” [Al-Jāthiyah 45:15]

117

హదీసు 117

الأوَّل: عن أَبِي ذرٍّ جُنْدَبِ بنِ جُنَادَةَ رضي اللَّه عنه قَالَ: قُلْتُ يَا رسولَ اللَّه، أيُّ الأعْمالِ أفْضَلُ؟ قَالَ: "الإِيمانُ بِاللَّهِ، وَالجِهَادُ فِي سَبِيلِهِ ". قُلْتُ: أيُّ الرِّقَابِ أفْضَلُ؟ قَالَ: "أنْفَسُهَا عِنْد أهْلِهَا، وأكثَرُهَا ثَمَناً". قُلْتُ: فَإِنْ لَمْ أفْعلْ؟ قَالَ:"تُعينُ صَانِعاً أوْ تَصْنَعُ لأخْرَقَ"قُلْتُ: يَا رَسُول اللَّه أرَأيتَ إنْ ضَعُفْتُ عَنْ بَعْضِ الْعملِ؟ قَالَ:"تَكُفُّ شَرَّكَ عَن النَّاسِ فَإِنَّها صدقةٌ مِنْكَ عَلَى نَفسِكَ". متفقٌ عليه. "الصانِعُ"بالصَّاد المهملة هَذَا هُوَ المشهور، ورُوِى"ضَائعاً"بالمعجمة: أيْ ذَا ضِياع مِنْ فقْرِ أوْ عِيالٍ، ونْحو ذلكَ"والأخْرَقُ": الَّذي لا يُتقنُ مَا يُحاوِلُ فِعْلهُ.

హజ్రత్ అబూజర్ర్ జుందుబ్ బిన్ జునాదా (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్తను, "దైవప్రవక్తా! అన్నిటికన్నా ఉత్తమమైన సత్కార్యం ఏది?" అని అడిగాను. దానికి ఆయన "అల్లాహ్‌ను విశ్వసించడం, ఇంకా ఆయన మార్గంలో పోరాడటం" అని సమాధానమిచ్చారు. తిరిగి నేను "ఎలాంటి బానిసకు స్వేచ్ఛ ప్రసాదించడం ఉత్తమం?" అని అడిగాను. అందుకు ఆయన "తన యజమాని దృష్టిలో అందరికన్నా యోగ్యుడూ, బాగా ఖరీదైనవాడికి స్వేచ్ఛ నొసగటం" అని అన్నారు. అప్పుడు నేను "అది నావల్ల కాకపోతే ఏం చేయాలి?" అని అడగ్గా, "అయితే ఏ పనివాడికైనా సహాయపడు లేకపోతే ఏ పనిరానివాడికైనా అతని పనిచేసి పెట్టు" అని ఆయన అన్నారు. "ఓ దైవప్రవక్తా! నేను ఈ మాత్రం పని కూడా చేయలేకపోతేనో?!" అని నేను మళ్ళీ సందేహపడగా, అందుకు ఆయన "ప్రజలను నీ కీడు నుండి రక్షించు. అదే నీ పాలిట 'సదఖా' (మంచిపని) అవు తుంది" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

'సానీ' అన్న పదానికే బహుళప్రచారం ఉంది. అయితే జాయిఅన్ అని కూడా ఉల్లేఖించబడింది. 'జాయీ' అంటే పేదరికం, సంతానభారం వంటి కష్టాలతో బాధపడుతున్నవాడు. 'అఖ్‌రఖ్' అంటే తన పని తాను సక్రమంగా చేసుకోలేనివాడు.

(సహీహ్ బుఖారీలోని 'బానిస విమోచన' ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Dharr (radiyallahu anhu) reported: I asked: “O Messenger of Allah! Which action is the best?” He ﷺ said, “Faith in Allah and Jihad in the way of Allah.” I asked: “Which neck (slave) is best (for emancipation)?” He said, “That which is dearest of them in price and most valuable of them to its masters”. I asked: “If I cannot afford (it)?” He said, “Then help a labourer or work for one who is disabled”. I asked: “If I cannot do (it)?” He said, “You should restrain yourself from doing wrong to people, because it (serves as) charity which you bestow upon yourself”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా దైవమార్గంలో పోరాడటం, బానిసలకు విముక్తి నొసగి స్వేచ్ఛాయుత జీవితాన్ని ప్రసాదించడం లాంటి ఉత్తమ సత్కార్యాల మహత్యం వెల్లడౌతోంది. అదేవిధంగా ఇతరుల పట్ల సానుభూతి, సహకార భావంతో మెలగాలని కూడా ఈ హదీసు చెబుతోంది. అంతేకాదు, మన మాటల వల్లగాని, చేతలవల్ల గాని సాటి మానవులకు బాధకలగకుండా జాగ్రత్తపడటం కూడా ఓ మహత్తర పుణ్యకార్యమేనని అంటోంది. సత్కర్మలు స్వీకృతిని పొందాలంటే దైవంపై విశ్వాసం ఉండటం అవసరం. విశ్వాసానికి ఫలితమే సదాచరణ. కనుక ఆ విశ్వాసమే లేకపోతే దైవసమక్షంలో ఏ సత్కార్యమూ స్వీకృతిని పొందజాలదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 117

118

హదీసు 118

الثاني: عن أَبِي ذرٍّ رضي اللَّه عنه أيضاً أنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يُصْبِحُ عَلَى كلِّ سُلاَمَى مِنْ أَحَدِكُمْ صدقَةٌ، فَكُلٌ تَسبِيْحةٍ صَدقةٌ، وكُلُّ تحْمِيدَةٍ صدقَةٌ، وكُلُّ تهْلِيلَةٍ صَدَقةٌ، وكلُّ تَكْبِيرةٍ صَدَقَةٌ، وأمْرٌ بالمعْرُوفِ صدقَةٌ، ونَهْيٌ عَنِ المُنْكَرِ صدقَةٌ. ويُجْزِئُ مِنْ ذَلكَ رَكعَتَانِ يرْكَعُهُما مِنَ الضُّحى"رواه مسلم."السُّلاَمَى"بضم السين المهملة وتخفيف اللام وفتح الميم: المفْصِلُ.

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలోని ప్రతి ఒక్కరిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ఉదయం పూట ఒక సదఖా (సత్కార్యం) చేయటం తప్పనిసరి. అయితే ప్రతి తస్బీహ్ పలుకు (సుబ్‌హా నల్లాహ్ అనడం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌మీద్ పలుకు (అల్ హమ్దులిల్లాహ్ అనడమూ) ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తక్బీర్ (అల్లాహు అక్బర్ అనడమూ) ఒక సత్కార్యమే. మంచిని గురించి ఆజ్ఞాపించడం సత్కార్యం. అలాగే చెడు నుంచి వారించడమూ సత్కార్యమే. అయితే సూర్యోదయం తరువాత మనిషి చేసే రెండు రకతుల నమాజు వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాగలదు. (ముస్లిం)

హదీసులో ప్రస్తావించబడిన పదం "సులామా" అంటే కీలు.

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When you get up in the morning, charity is due from every one of your joints. There is charity in every ascription of glory to Allah; there is charity in every declaration of His Greatness; there is charity in every utterance of praise of Him; there is charity in every declaration that He is the only true God (worthy of worship); there is charity in enjoining good; there is charity in forbidding evil. Two Rak`ah of Duha (Forenoon prayer) is equal to all this (in reward)”.[Muslim].

ముఖ్యాంశాలు

మనిషి దేహంలో మూడు వందల అరవై కీళ్ళు ఉంటాయి. ఈ కీళ్ల ఆధారంగానే మనిషి నడవటం, పని చేయటం, అటూ ఇటూ కదలటం మొదలగు చర్యలు చేస్తాడు. ఈ కీళ్ళే లేకపోతే మనిషి కదల్లేడు, మెదల్లేడు. నించోటం, పడుకోవటం లాంటి కదలికలు కీళ్ళు లేకుండా సాధ్యం కావు. ఈ విధంగా చూస్తే మానవ శరీరంలోని ప్రతి కీలూ దేవుని వరమే. అందుకు ప్రతి మానవుడూ తప్పకుండా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

ఈ వరాలపై కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం అతి సులువైన మార్గాన్ని సూచించడం – దేవుడు తన దాసులపై అనుగ్రహించిన మరొక వరం. ఒక సామాన్య మానవుడు కూడా ఈ మార్గాన్ని అనుసరించి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొగలడు. సుబ్‌హానల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం, తోటి మనుషులకు మంచిని గురించి బోధిస్తూ, చెడు పనుల నుండి వారించటం లాంటి పనులు దైవానుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అతి సులువైన మార్గాలు. అదీ చేయలేకపోతే సూర్యోదయం అయిన తరువాత నుంచి సూర్యుడు నడినెత్తినుండి వాలక ముందు వరకు – ఈ మధ్య కాలంలో – ఎప్పుడైనా రెండు రకాతుల నమాజు చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే రెండేసి రకాతుల చొప్పున ఎనిమిది రకాతుల వరకూ చేయవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 118

119

హదీసు 119

الثَّالثُ عنْهُ قَالَ: قَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عُرِضَتْ عَلَيَّ أعْمالُ أُمَّتي حسَنُهَا وسيِّئُهَا فوجَدْتُ في مَحاسِنِ أعْمالِهَا الأذَى يُماطُ عَنِ الطَّرِيقِ، وَوجَدْتُ في مَساوَىءِ أعْمالِها النُّخَاعَةُ تَكُونُ فِي المَسْجِدِ لاَ تُدْفَنُ" رواه مسلم.

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : నా సమాజపు సత్కర్మలూ, దుష్కర్మలూ అన్నీ నాకు చూపబడ్డాయి. ఆ సత్కర్మల (జాబితా)లో (జనులు నడిచే) దారి నుంచి (రాళ్ళు ముళ్ళవంటి) బాధాకరమైన వస్తువులను తొలగించడం కూడా ఉంది. ఇంకా, దాని దుష్కర్మల (జాబితా)లో మస్జిదులో ఉమ్మివేసి దానిపై మట్టిపోయకుండా వదిలేసే అసహ్యకరమైన చేష్ట కూడా ఉంది.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The deeds of my people, good and bad, were presented before me, and I found the removal of harmful objects from the road among their good deeds, and phlegm which might be in a mosque left unburied among their evil deeds”.[Muslim].

ముఖ్యాంశాలు

  1. ప్రజలకు మేలు చేకూర్చే పని అది ఎంత చిన్నదైనప్పటికీ అల్లాహ్ దాన్ని సత్కార్యంగా పరిగణిస్తాడు. దీనికి విరుద్ధంగా ప్రజలకు హాని కలిగించే పని అది ఎంత తేలికపాటిదైనప్పటికీ దాన్ని దుష్కార్యాల్లో జమచేస్తాడు. కనుక మనిషి దైవప్రసన్నతను బడయటం కోసం ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తుండాలనీ, ఆయన ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే చెడు పనులకు బహుదూరంగా ఉండాలని పై హదీసులో పురికొల్పడం జరిగింది.
  2. మస్జిదులను శుభ్రంగా ఉంచడం అవసరం. కనుక అక్కడ ఉమ్మివేయడం, ముక్కు చీదడం లాంటి అవాంఛనీయ, అసభ్యకరమైన చేష్టలు కూడా పాపాలుగానే పరిగణించబడతాయి. పైగా అటువంటిదేదైనా కనబడితే వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 119

120

హదీసు 120

الرابع عَنْهُ: أنَّ ناساً قالوا: يَا رسُولَ اللَّهِ، ذَهَب أهْلُ الدُّثُور بالأجُورِ، يُصَلُّونَ كَمَا نُصَلِّى، وَيَصُومُونَ كَمَا نَصُومُ، وَيَتَصَدَّقُونَ بَفُضُولِ أمْوَالهِمْ قال: "أوَ لَيْس قَدْ جَعَلَ لَكُمْ مَا تَصَدَّقُونَ بِهِ: إنَّ بِكُلِّ تَسْبِيحَةٍ صَدقَةً، وكُلِّ تَكبِيرةٍ صَدَقَةً، وكلِّ تَحْمِيدةٍ صَدَقَةً، وكلِّ تِهْلِيلَةٍ صَدقَةً، وأمرٌ بالمعْرُوفِ صدقةٌ، ونَهْىٌ عنِ المُنْكر صدقةٌ وفي بُضْعِ أحدِكُمْ صدقةٌ"قالوا: يَا رسولَ اللَّهِ أيَأتِي أحدُنَا شَهْوَتَه، ويكُونُ لَه فِيهَا أجْر؟، قَالَ:"أرأيْتُمْ لَوْ وضَعهَا في حرامٍ أَكَانَ عليهِ وِزْرٌ؟ فكذلكَ إِذَا وضَعهَا في الحلاَلِ كانَ لَهُ أجْرٌ" رواه مسلم. "الدُّثُورُ": بالثاءِ المثلثة: الأموالُ، واحِدُها: دَثْرٌ.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం కొంతమంది దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి "దైవప్రవక్తా! ధనవంతులు పుణ్యంలో మమ్మల్ని మించిపోయారు. వాళ్ళు కూడా మాలాగే నమాజు చేస్తారు. మాలాగే ఉపవాసాలూ పాటిస్తారు. అయితే వాళ్ళు (మాకంటే ఎక్కువగా) తమ మిగులుధనం నుంచి సదఖాలు (దానధర్మాలు) చేస్తారు. (ఆ విధంగా మాకంటే ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించగల్గుతున్నారు. మాకు ఆ అవకాశం లేదు)" అని విన్నవించుకున్నారు. దానికి ఆయన "సదఖాలు చేయటం కోసం అల్లాహ్ మీకు కూడా వేరే మార్గాలను సూచించాడే? నిస్సందేహంగా సుబ్‌హానల్లాహ్ (అల్లాహ్ పవిత్రుడు) అనడం కూడా ఒక సదఖాయే (పుణ్యకార్యమే). అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు) అనడం కూడా ఒక పుణ్యకార్యమే. అల్‌హమ్దులిల్లాహ్ (ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే) అనటం కూడా ఒక పుణ్యకార్యమే. లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు) అని పలకటం కూడా ఒక పుణ్యకార్యమే. మంచిని ఆదేశించటం ఒక సత్కార్యం. అలాగే చెడును నిరోధించడమూ ఒక సత్కార్యమే. ఆఖరికి మీరు (మీ భార్యతో) సంభోగించడం కూడా ఒక పుణ్యకార్యమే!" అని అన్నారు. ఇది విని వారు (ఆశ్చర్యంతో) "ఏమిటి…. మాలో ఎవరైనా తన లైంగిక కోరికను తీర్చుకుంటే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుందా దైవప్రవక్తా!" అని సందేహపడగా, దానికి ఆయన, "మీరే చెప్పండి. ఆ వ్యక్తి తన కోరికను అధర్మమైన మార్గంలో తీర్చుకుంటే అతని పాలిట అది పాపమా కాదా? (పాపమే). అలాగే అతను ధర్మసమ్మ తమైన రీతిలో తన వాంఛను తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది" అని విడమరచి చెప్పారు.

(ముస్లిం)

'దుసూర్' అంటే సిరిసంపదలు అని అర్థం. 'దస్ర్' అన్నది ఏకవచనం.

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Some people said to Messenger of Allah ﷺ: “O Messenger of Allah, the rich have taken away (all the) reward. They observe Salat (prayers) as we do; and give Sadaqah (charity) out of their surplus wealth.” Upon this he (the Prophet ﷺ) said, “Has Allah not prescribed for you (a course) following which you can (also) give Sadaqah? In every declaration of the glorification of Allah (i.e., saying Subhan Allah) there is a Sadaqah, and in every Takbir (i.e., saying Allahu Akbar) is a Sadaqah, and in every celebration of praise (saying Al-hamdu lillah) is a Sadaqah, and in every declaration that He is One (La ilaha illallah) is a Sadaqah, and in enjoining of good is a Sadaqah, and in forbidding evil is a Sadaqah, and in man’s sexual intercourse (with his wife) there is a Sadaqah.” They (the Companions) said: “O Messenger of Allah, is there reward for him who satisfies his sexual need among us?” He said, “You see, if he were to satisfy it with something forbidden, would it not be a sin on his part? Similarly, if he were to satisfy it legally, he should be rewarded”.[Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా బోధపడే మొదటి విషయం ఏమిటంటే, ప్రవక్త ﷺ గారి ప్రియసహచరుల్లో సత్కార్యాల విషయమై ఒండొకరిని మించిపోయే పోటీతత్వం ఉండేది. అదేవిధంగా మంచిపనులు చేసే అవకాశాలు చేజారినప్పుడు వారు విపరీతమైన మనస్తాపానికి గురయ్యేవారు.

ఇకపోతే ఈ హదీసులో వివరించబడిన రెండో విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మంలో 'సత్కార్యం' అనే దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. దేవుని అవిధేయత పొడసూపకుండా చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో చేసే ప్రతి పనీ సత్కార్యం క్రిందికే వస్తుంది. ఆఖరికి మనిషి తన లైంగిక కోరికలు, మనోవాంఛల్ని తీర్చుకోవడమూ పుణ్యకార్యమే. అంతేకాదు; దైవానికి విధేయత చూపాలన్న లక్ష్యంతో చెడుపనులకు దూరంగా ఉంటే అది కూడా సత్కార్యాల పరిధిలోకే వస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 120

121

హదీసు 121

الخامس: عَنْهُ قَالَ: قَالَ لي النبيُّ صلى اللَّه عليه وآله وسلم: "لاَ تَحقِرنَّ مِن المعْرُوفِ شَيْئاً ولَوْ أنْ تلْقَى أخَاكَ بِوجهٍ طلِيقٍ" رواه مسلم.

దైవప్రవక్త ﷺ తనతో ఇలా అన్నారని హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు : ఏ మంచి పనినీ నీవు చులకనగా చూడకు. ఆఖరికి నీవు నీ సోదరుణ్ణి నగుమోముతో కలవటాన్ని అయినా సరే." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Do not belittle any good deed, even meeting your brother (Muslim) with a cheerful face”.[Muslim].

ముఖ్యాంశాలు

సాటి మనిషిని నవ్వుతూ పలకరించడం కూడా ఒక సత్కార్యమేనని పై హదీసు ద్వారా బోధపడుతోంది. అలా పలకరించడం మనిషిలోని మంచినడవడికకు తార్కాణం. పైగా దీనివల్ల ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. ప్రజలు మానసికంగా దగ్గరై ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఫలితంగా వారిలో ఆత్మీయతా భావం జనించి పరస్పర విభేదాలను మరచిపోతారు. ఇస్లాం ధర్మం ఆశించేది కూడా అదే!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 121

122

హదీసు 122

السادس: عن أَبِي هريرةَ رضي اللَّه عنه قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كُلُّ سُلاَمَى مِنَ النَّاسِ علَيْهِ صدَقةٌ كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ: تعدِلُ بيْن الاثْنَيْنِ صدَقَةٌ، وتُعِينُ الرَّجُلَ في دابَّتِهِ، فَتحْمِلُهُ عَلَيْهَا، أوْ ترْفَعُ لَهُ علَيْهَا متَاعَهُ صدقةٌ، والكلمةُ الطَّيِّبةُ صدَقةٌ، وبِكُلِّ خَطْوَةٍ تمْشِيها إِلَى الصَّلاَةِ صدقَةٌ، وَتُميطُ الأذَى عَن الطرِيق صَدَقةٌ" متفق عليه. ورواه مسلم أيضاً من رواية عائشة رَضي اللَّه عنها قالت: قالَ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّهُ خُلِقَ كُلُّ إنْسانٍ مِنْ بني آدم علَى سِتِّينَ وثلاثمائَةِ مَفْصِلٍ، فَمنْ كَبَّر اللَّه، وحمِدَ اللَّه، وَهَلَّلَ اللَّه، وسبَّحَ اللَّه واستَغْفَر اللَّه، وعَزلَ حَجراً عنْ طَرِيقِ النَّاسِ أوْ شَوْكَةً أوْ عظْماً عَن طَرِيقِ النَّاسِ، أوْ أمَرَ بمعرُوفٍ أوْ نهى عنْ مُنْكَرٍ، عَددَ السِّتِّينَ والثَّلاَثمائة، فَإِنَّهُ يُمْسي يَوْمئِذٍ وَقَد زَحزحَ نفْسَهُ عنِ النَّارِ".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : సూర్యుడు ఉదయించే ప్రతిరోజూ ప్రజల (దేహంలోని) ప్రతి కీలు తరఫునుంచి తప్పకుండా ఒక సదఖా (సత్కార్యం) చేయాలి. (సదఖా అంటే కేవలం డబ్బు దానం చేయటమనే కాదు). పైగా ఇద్దరి వ్యక్తుల మధ్య నువ్వు న్యాయం చేస్తే, అది కూడా సదఖాయే (పుణ్యకార్యమే) అవుతుంది. ఎవరికయినా అతని వాహనంపై కూర్చోబెట్టడంలోగాని లేదా అతని సామానును ఎత్తి దానిపై ఉంచడంలోగాని అతనికి సహాయపడితే అది కూడా సత్కార్యమే అవుతుంది. ఒక మంచి మాట చెప్పటం కూడా పుణ్యకార్యమే. నువ్వు నమాజు కోసం నడిచివెళ్ళే ప్రతి అడుగులోనూ నీకు పుణ్యం ఉంది. జనులు నడిచే దారినుంచి బాధాకరమైన వస్తువులను తొలగించడం కూడా పుణ్యకార్యమే.

(బుఖారీ – ముస్లిం)

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ హదీసును హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆధారంగా కూడా ఉల్లేఖించారు. అందులో దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారని ఉంది: ఆదం సంతతిలోని ప్రతి మనిషీ మూడువందల అరవై కీళ్ళతో పుట్టించ బడ్డాడు. కనుక అల్లాహు అక్బర్ అని దేవుని గొప్పదనాన్ని చాటుతూ, అల్ హమ్దులిల్లాహ్ అని దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకుతూ, సుబ్‌హానల్లాహ్ అని దేవుని పవిత్రతను కొనియాడుతూ, అస్తగ్‌ఫిరుల్లాహ్ అని దైవాన్ని క్షమాభిక్ష కోసం వేడుకుంటూ, జనులు నడిచే దారిలో ఏదైనా రాయిగాని, ముల్లుగాని లేక ఎముకగాని పడివుంటే దానిని తొలగించినా లేక మంచిని గురించి ఆదేశించినా లేక చెడునుంచి ఇతరుల్ని ఆపినా, ఈ విధంగా మూడు వందల అరవై సంఖ్యకు సమానంగా పైన పేర్కొనబడిన మంచిపనులు చేసుకుంటే అటువంటి వ్యక్తి ఆ రోజు సాయంత్రానికల్లా తన్ను తాను నరకాగ్ని నుంచి కాపాడుకుంటాడు."

(సహీహ్ బుఖారీలోని ఒడంబడికల ప్రకరణంలోనూ, జిహాద్ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

ముఖ్యాంశాలు:

సదఖాలు, దానధర్మాలు చేసే స్థోమత లేని వారు పైన పేర్కొనబడిన మంచిపనులను ఆచరించి తద్వారా దానధర్మాల వల్ల వచ్చే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చునీ, పైగా తమ దేహంలోని మూడు వందల అరవై కీళ్ళపైఉన్న 'సదఖా' బాధ్యతను నెరవేర్చవచ్చునీ పై హదీసు ద్వారా బోధపడుతోంది.

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Every day the sun rises charity (Sadaqah) is due on every joint of a person: you administer justice between two men is a charity; and assisting a man to mount his beast, or helping him load his luggage on it is a charity; and a good word is a charity; and every step that you take (towards the mosque) for Salat (prayer) is a charity and removing harmful things from the road is a charity”.[Al-Bukhari and Muslim].

In Muslim, it is reported on the authority of `Aishah (radiyallahu anha) that Messenger of Allah ﷺ said, “Everyone of the children of Adam has been created with three hundred and sixty joints; so he who declares the Glory of Allah (i.e., saying Allahu Akbar), praises Allah (i.e., Al-hamdu lillah), declares Allah to be One (i.e., La ilaha illallah), glorifies Allah, and seeks forgiveness from Allah (i.e., Astaghfirullah), and removes stone, or thorn, or bone from people’s path, and enjoins good and forbids evil, to the number of those three hundred and sixty, will walk that day having rescued himself from Hell”.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 122

123

హదీసు 123

السابع: عَنْهُ عن النَبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "منْ غدَا إِلَى المَسْجِدِ أَوْ رَاحَ، أعدَّ اللَّهُ لَهُ في الجنَّةِ نُزُلاًكُلَّمَا غَدا أوْ رَاحَ" متفقٌ عَلَيهِ. "النُّزُل": القُوتُ والرِّزْقُ ومَا يُهَيَّأ للضَّيفِ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే తెలియజేశారు : ఉదయం, సాయంత్రం మస్జిద్‌కు వెళ్ళే వ్యక్తికోసం- అతను ఉదయం పూటగాని, సాయంత్రం వేళగాని మస్జిద్‌కు వెళ్ళినప్పుడల్లా దేవుడు స్వర్గంలో అతని ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తాడు. (బుఖారీ – ముస్లిం)

'నుజుల్' అంటే భోజనం, ఆహారం. అతిథికోసం తయారుచేసేది.

(సహీహ్ బుఖారీలోని 'అజాన్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది).

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who goes to the mosque at dawn or dusk (for Salat), Allah prepares a hospitable abode for him in Jannah, every time when he walks to it or comes back from it”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మస్జిద్‌కు వెళ్ళి సామూహికంగా నమాజు చేయాలని పురికొల్పడం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 123

124

హదీసు 124

الثامن: عَنْهُ قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا نِسَاء المُسْلِماتِ لاَ تَحْقِرنَّ جارَةٌ لِجارتِهَا ولَوْفِرْسِنَ شاةٍ" متفقٌ عَلَيهِ. قَالَ الجوهري: الفِرْسِنُ مِنَ الْبعِيرِ: كالحافِرِ مِنَ الدَّابَّةِ، قَالَ: ورُبَّمَا اسْتُعِير في الشَّاةِ

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : విశ్వాసులైన మహిళల్లారా! ఏ ఇంటి స్త్రీ కూడా తన పొరుగింటి స్త్రీ (ఇచ్చే కానుక)ని అల్పమైనదిగా భావించరాదు. ఆమె ఇచ్చే కానుక మేక కాలిగిట్ట అయినా సరే. (అంటే ఎంత సామాన్యమైన కానుక ఇచ్చినప్పటికీ దానిపై నొసలు చిట్లించరాదని భావం). (బుఖారీ – ముస్లిం)

ఇతర జంతువుల గిట్టలను 'హాఫిర్' అన్నట్లు వాస్తవానికి 'ఫిర్‌సన్' అనే పదం ఒంటె కాలిగిట్ట కోసం వాడబడుతుంది. అయితే అప్పుడప్పుడూ మేక కాలి గిట్ట కోసం కూడా ఈ పదం ఉపయోగించబడుతుందని జౌహరి అభిప్రాయపడ్డారు.

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణంలోనూ, సంస్కార ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: O Muslim women, never belittle any gift you give your neighbour even if it is a hoof of a sheep”.

[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇతరులు ఇచ్చే కానుకలు ఎంత సామాన్యమైనవి అయినప్పటికీ వాటిని తుచ్ఛమైనవిగా భావించకూడదు. ఎందుకంటే చిత్తశుద్ధితో ఇచ్చే చిన్న కానుక కూడా దేవుని దృష్టిలో పెద్దదిగా భావించబడుతుంది. లేదా ఈ హదీసు భావం ఏ స్త్రీ కూడాను తన పొరుగింటి స్త్రీకి ఒక మేక గిట్ట అయినా సరే కానుకగా పంపించడాన్ని అల్పంగా భావించరాదు అని కూడా కావచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 124

125

హదీసు 125

التاسع: عَنْهُ عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الإِيمَانُ بِضْعٌ وَسبْعُونَ، أوْ بِضْعٌ وَسِتُّونَ شَعْبَةً: فَأفْضلُهَاقوْلُ لاَ إلَهَ إلاَّ اللَّهُ، وَأدْنَاهَا إمَاطَةُ الأذَى عنِ الطَّرِيقِ، وَالحيَاءُ شُعْبةٌ مِنَ الإِيمانِ" متفقٌ عَلَيهِ. "البضْعُ"من ثلاثة إِلَى تسعةٍ، بكسر الباءِ وقد تفْتَحُ."والشُّعْبةُ": القطْعة.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు: విశ్వాసానికి (ఈమాన్‌కు) డెబ్బై లేక అరవైకన్నా ఎక్కువ భాగాలున్నాయి. వాటిలో అత్యున్నత భాగం "లా ఇలాహ ఇల్లల్లాహ్" (అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు) అని పలకటం. కాగా జనం నడిచే దారిలోనుంచి (రాళ్ళు, ముళ్ళవంటి) బాధాకరమైన వస్తువులను తొలగించడం అట్టడుగున వున్న భాగం. ఇంకా వ్రీడ (లజ్జ) కూడా ఈమాన్ (విశ్వాసం)లో అంతర్భాగమే.

(బుఖారీ – ముస్లిం)

'జిజ్‌వున్' అన్న పదం మూడు నుంచి తొమ్మిది అంకెల వరకు సూచించడం కోసం వాడబడుతోంది. ఈ పదాన్ని 'బ'కు అకారమిచ్చి (బజ్‌వున్)అని కూడా చదువవచ్చు. 'షోబా' అంటే భాగం, శాఖ అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణంలో, ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలో కూడా ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Abu Hurairah (radiyallahu anhu): The Prophet ﷺ said, “Iman has over seventy branches, the uppermost of which is the declaration: `None has the right to be worshipped but Allah’; and the least of which is the removal of harmful object from the road, and modesty is a branch of Iman.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఆచరణల పరంగా ఈమాన్ (విశ్వాసం)లో అనేక విభాగాలున్నాయి. ఇంకా విశ్వాసం మరియు ఆచరణ – ఈ రెండూ పరస్పరం విడదీయరానివి. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
  2. ఈ హదీసు ద్వారా వ్రీడ (లజ్జ) యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. వ్రీడ వల్లనే మనిషి చెడు పనులకు దూరంగా ఉండి, మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 125

126

హదీసు 126

العاشر: عَنْهُ أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بَيْنمَا رَجُلٌ يَمْشِي بطَريقٍ اشْتَدَّ علَيْهِ الْعَطشُ، فَوجد بِئراً فَنزَلَ فِيهَا فَشَربَ، ثُمَّ خَرَجَ فإِذا كلْبٌ يلهثُ يَأْكُلُ الثَّرَى مِنَ الْعَطَشِ، فَقَالَ الرَّجُلُ: لَقَدْ بلَغَ هَذَا الْكَلْبُ مِنَ العطشِ مِثْلَ الَّذِي كَانَ قَدْ بَلَغَ مِنِّي، فَنَزَلَ الْبِئْرَ فَملأَ خُفَّه مَاءً ثُمَّ أَمْسَكَه بِفيهِ، حتَّى رقِيَ فَسَقَى الْكَلْبَ، فَشَكَرَ اللَّهُ لَه فَغَفَرَ لَه. قَالُوا: يَا رسولَ اللَّه إِنَّ لَنَا في الْبَهَائِم أَجْراً؟ فَقَالَ:"في كُلِّ كَبِدٍ رَطْبةٍ أَجْرٌ "متفقٌ عليه. وفي رواية للبخاري: "فَشَكَر اللَّه لهُ فَغَفَرَ لَه، فَأدْخَلَه الْجنَّةَ ". وفي رواية لَهُما: "بَيْنَما كَلْبٌ يُطيف بِركِيَّةٍ قَدْ كَادَ يقْتُلُه الْعطَشُ إِذْ رأتْه بغِيٌّ مِنْ بَغَايا بَنِي إِسْرَائيلَ، فَنَزَعَتْ مُوقَهَا فاسْتَقت لَهُ بِهِ، فَسَقَتْهُ فَغُفِر لَهَا بِهِ". "الْمُوقُ": الْخُفُّ."وَيُطِيفُ": يَدُورُ حَوْلَ"رَكِيَّةٍ"وَهِيَ الْبِئْرُ.

దైవప్రవక్త ﷺ తెలియజేసిన వృత్తాంతాన్ని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే ఈ విధంగా ఉటంకించారు: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ఓ దారిగుండా నడచివెళుతుండగా అతనికి విపరీతంగా దాహం వేసింది. ఒకచోట బావి కనబడితే అందులోకి దిగి నీళ్ళు త్రాగి తిరిగి బయటికొచ్చాడు. అంతలోనే అక్కడ అతనికి ఒక కుక్క కనిపించింది. అది దప్పికతో నాలుక వెళ్ళబెట్టి (రొప్పుతూ) బురదమట్టిని నాకసాగింది. అది చూసి ఆ మనిషి "నేను దప్పికతో అల్లాడి పోయినట్లే ఈ కుక్క కూడా బాధపడుతుందేమో!" అనుకొని మళ్ళీ బావిలోకి దిగాడు. తన కాలి జోడును నీటితో నింపి, దాన్ని నోటితో పట్టుకొని పైకి తెచ్చాడు. ఆ నీరు కుక్కకు త్రాపించాడు. అప్పుడు అల్లాహ్ అతను చేసిన పనిని మెచ్చుకొని అతన్ని క్షమించాడు.

ఈ వృత్తాంతం విని అనుచరులు "దైవప్రవక్తా! భూత దయపై కూడా మాకు పుణ్యం లభిస్తుందా!" అని సందేహపడగా "అవును. తడి కాలేయం (ప్రాణం)గల ఏ జీవికి సహాయం చేసినా మీకు పుణ్యం లభిస్తుంది" అన్నారు దైవప్రవక్త ﷺ. (బుఖారీ – ముస్లిం)

బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో, అల్లాహ్ అతను చేసిన పనిని స్వీకరించి అతణ్ణి క్షమించేశాడు. ఇంకా అతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు అని వుంది.

ఉభయులూ (బుఖారీ – ముస్లిం) ఉల్లేఖించిన వేరొక హదీసులో ఇలా ఉంది : ఒక కుక్క ఓ బావి చుట్టూ తారట్లాడుతుంది. దాహంతో దాని ప్రాణం పోయేటట్లుంది. అంతలోనే ఇస్రాయీల్ జాతికి చెందిన ఓ వ్యభిచారిణి ఆ కుక్కను చూసి (జాలిపడింది), తన కాలి జోడును తీసి దానితో బావి నుండి నీరు చేది, ఆ కుక్కకు త్రాపించింది. ఆమె చేసిన ఈ సత్కార్యం వల్ల ఆమెను క్షమించివేయడం జరిగింది.

'మూఖ్' అంటే కాలిజోడు. యుతీపు అంటే తారట్లాడటం, చుట్టూ తిరగడం. 'రకియ్యా' అంటే బావి.

(సహీహ్ బుఖారీలోని పానీయాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని 'సలాం' ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “While a man was walking on his way he became extremely thirsty. He found a well, he went down into it to drink water. Upon leaving it, he saw a dog which was panting out of thirst. His tongue was lolling out and he was eating moist earth from extreme thirst. The man thought to himself: `This dog is extremely thirsty as I was.’ So he descended into the well, filled up his leather sock with water, and holding it in his teeth, climbed up and quenched the thirst of the dog. Allah appreciated his action and forgave his sins”. The Companions asked: “Shall we be rewarded for showing kindness to the animals also?” He ﷺ said, “A reward is given in connection with every living creature”.[Al-Bukhari and Muslim].

In the narration of Al-Bukhari, the Prophet ﷺ is reported to have said: “Allah forgave him in appreciation of this act and admitted him to Jannah”.

Another narration says: “Once a dog was going round the well and was about to die out of thirst. A prostitute of Banu Israel happened to see it. So she took off her leather sock and lowered it into the well. She drew out some water and gave the dog to drink. She was forgiven on account of her action”.

ముఖ్యాంశాలు

  1. మానవులు భూతదయను కలిగి ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తుంది. భూతదయ కనబరిచే వారి పట్ల అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు.
  2. దేవుని కరుణాకటాక్షాలు ఎంతో విస్తృతమైనవి. ఆయన తలచుకుంటే ఓ చిన్న పనిని అంగీకరించి కూడా తన దాసులను క్షమించగలడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 126

127

హదీసు 127

الْحادي عشَرَ: عنْهُ عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَقَد رأَيْتُ رَجُلاً يَتَقَلَّبُ فِي الْجنَّةِ فِي شَجرةٍ قطَعها مِنْ ظَهْرِ الطَّريقِ كَانَتْ تُؤْذِي الْمُسلِمِينَ". رواه مسلم. وفي رواية: "مرَّ رجُلٌ بِغُصْنِ شَجرةٍ عَلَى ظَهْرِ طرِيقٍ فَقَالَ: واللَّهِ لأُنَحِّينَّ هَذَا عنِ الْمسلِمِينَ لا يُؤْذِيهُمْ، فأُدْخِلَ الْجَنَّةَ". وفي رواية لهما: "بيْنَما رجُلٌ يمْشِي بِطريقٍ وَجَدَ غُصْن شَوْكٍ علَى الطَّرِيقِ، فأخَّرُه فشَكَر اللَّهُ لَهُ، فغَفر لَهُ".

దైవప్రవక్త ﷺ తెలియ జేశారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే ఉటంకించారు : నేను స్వర్గంలో ఒక వ్యక్తి సంచరిస్తుండటం చూశాను. దారికి అడ్డంగా ఉండి, ముస్లింలకు ఇబ్బందికరంగా మారిన ఒక చెట్టును అతను నరికివేశాడు (అందుకు దేవుడు ప్రసన్నుడై అతనికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించాడు). (ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి దారికి అడ్డంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ దగ్గర్నుంచి వెళుతూ, "దైవసాక్షి! ఇది ముస్లింలకు బాధ కలిగించకుండా, నేను దీన్ని ఇక్కడి నుండి దూరం చేస్తాను" అని అన్నాడు. (అతను చేసిన ఈ చిన్నపనికి) అతణ్ణి స్వర్గంలోకి ప్రవేశింపజేయడం జరిగింది.

ఉభయుల (బుఖారీ – ముస్లింల) ఇంకొక ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి దారిలో నడుస్తుండగా అతనికి ఓ ముండ్ల కంప కనబడింది. అతడు దాన్ని తీసిపారేశాడు. అల్లాహ్ అతడు చేసిన ఈ పనిని ఆమోదించి అతణ్ణి క్షమించాడు.

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాల పుస్తకంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “I saw a man going about in Jannah (and enjoying himself) as a reward for cutting from the middle of the road, a tree which was causing inconvenience to the Muslims”.[Muslim].

Another narration says: “A man who passed by a branch of a tree leaning over a road and decided to remove it, saying to himself, `By Allah! I will remove from the way of Muslims so that it would not harm them.’ On account of this he was admitted to Jannah”.

According to the narration in Al-Bukhari and Muslim: Messenger of Allah ﷺ said, “While a man was walking, he saw a thorny branch on the road, so he removed it and Allah appreciated his action and forgave him”.

ముఖ్యాంశాలు

ప్రజల్ని బాధల నుండి రక్షిస్తే అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు. ఆఖరికి నలుగురూ నడిచే దారి నుండి రాళ్ళు, ముళ్ళ వంటి బాధాకరమైన వస్తువులను తొలగించడం కూడా అల్లాహ్‌కు ఎంతో ప్రియమైన ఆచరణే. దీనికి భిన్నంగా దారుల్ని ఇరుకుగా చేసి జనాల్ని ఇబ్బందిపెట్టడం లేక నిష్కారణంగా దారులను మూసివేసి ప్రజలను అడ్డుకోవడం మొదలగు చర్యలు దైవాగ్రహానికి గురిచేస్తాయి. ఉదాహరణకు వివాహాది వేడుకల సందర్భంగా కొంతమంది ముష్కరులు మొండి ధైర్యంతో రోడ్లపైనే బైఠాయించి ఎన్నో అవాంఛనీయ చేష్టలకు పాల్పడుతుంటారు. కొంతమంది దుకాణందారులు, గృహస్తులు కాలిబాటల స్థలాలను కబ్జాలు చేస్తుంటారు. వీటివల్ల ప్రజలు ఎంతో అవస్థపడాల్సి వస్తుంది. ప్రజలు నైతికంగా ఎంత దిగజారిపోయారంటే ఇట్లాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతూనే తామేదో గొప్ప పని చేస్తున్నట్లు బీరాలు పోతారు. ఒక ప్రక్క ధర్మబోధనలను ఉల్లంఘిస్తూనే, దైవాగ్రహానికి గురిచేసే పనులు చేస్తూనే వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంతకన్నా నైతిక దుష్థితి ఇంకేముంటుంది చెప్పండి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 127

128

హదీసు 128

الثَّاني عشَر: عنْه قالَ: قَال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ توضَّأ فأحَسَنَ الْوُضُوءَ، ثُمَّ أتَى الْجُمعةَ، فَاستمع وأنْصتَ، غُفِر لَهُ مَا بيْنَهُ وبيْنَ الْجُمعةِ وزِيادةُ ثَلاثَةِ أيَّامٍ، ومَنْ مسَّ الْحصا فَقد لَغَا" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవడైనా చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు కోసం వచ్చి అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా ఉండి జుమా ఖుత్బా (ఉపన్యాసం) వింటే వెనకటి జుమా నుంచి ఈ జుమా వరకు (మధ్యకాలంలో) అతని వల్ల జరిగిన (చిన్న చిన్న) పాపాలన్నీ మన్నించబడతాయి. ఇంకా అదనంగా మూడు రోజుల పాపాలు కూడా మన్నించబడతాయి. మరెవడైతే కంకరరాళ్ళు ముట్టుకున్నాడో (అంటే ఉపన్యాసం జరుగుతున్నప్పుడు వాటితో ఆడుకున్నాడో) అతడు వ్యర్థమైన పనిచేశాడు (అంటే తన జుమా పుణ్యాన్ని నాశనం చేసుకున్నాడని అర్థం). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who performs his Wudu’ perfectly and comes to Jumu`ah prayer and listens (to the Khutbah) silently, the sins which he has committed since the previous Friday plus three more days (i.e., 10 days) will be forgiven for him. One who distracts himself with pebbles during the Khutbah will not get the (Jumu`ah) reward”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి. మొదటిది : ఇందులో వుజూను చక్కగా – అంటే ప్రవక్త పద్ధతిననుసరించి చేయాలని ఉపదేశించబడింది. రెండోది : ఈ హదీసులో జుమా ఆరాధన యొక్క ఘనతను గురించి తెలియజేయడం జరిగింది. ప్రాజ్ఞుడు, వయోజనుడు, స్థానికుడు, ఆరోగ్యవంతుడైన ప్రతి ముస్లిం; అతడు నగరంలో ఉన్నా లేక కుగ్రామంలో ఉన్నా ఈ జుమా నమాజును మాత్రం తప్పకుండా చేయాలి. ఇంకా ఈ జుమా నమాజును మస్జిద్‌లో సామూహికంగానే నెరవేర్చవలసి ఉంటుంది. ఇంట్లో వ్యక్తిగతంగా చేయడానికి వీలు లేదు. మూడోది : ప్రతి సత్కార్యానికి కనీసం పదిరెట్ల పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా చూస్తే ఒక జుమా ఆరాధన చేయటం వల్ల పదిరోజుల వరకు జరిగిన దేవుని హక్కులకు సంబంధించిన పాపాలు మన్నించబడతాయన్నమాట. నాల్గోది : జుమా ప్రసంగం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అవసరం. లేకపోతే జుమా పుణ్యం నీరుగారిపోయే ప్రమాదముంది. ఇక ఐదోది : జుమా నమాజు సందర్భంగా చేసే ప్రసంగం కూడా తప్పకుండా వినాలి. ఈ ప్రసంగం రెండు రకాతుల నమాజుకు సమానం. ఖతీబ్ (ఉపన్యాసకుడు) జుమా ప్రసంగం ముక్తసరిగా ఇవ్వడానికి ప్రయత్నించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 128

129

హదీసు 129

الثَّالثَ عَشر: عنْه أنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إذَا تَوضَّأَ الْعبْدُ الْمُسْلِم، أَو الْمُؤْمِنُ فغَسلَ وجْههُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خطِيئةٍ نظر إِلَيْهَا بعينهِ مَعَ الْماءِ، أوْ مَعَ آخِر قَطْرِ الْماءِ، فَإِذَا غَسَل يديهِ خَرج مِنْ يديْهِ كُلُّ خَطِيْئَةٍ كانَ بطشتْهَا يداهُ مَعَ الْمَاءِ أَو مَعَ آخِرِ قَطْرِ الْماءِ، فَإِذَا غسلَ رِجليْهِ خَرجَتْ كُلُّ خَطِيْئَةٍ مشَتْها رِجْلاُه مَعَ الْماءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ حَتَّى يخْرُج نقِياً مِنَ الذُّنُوبِ" رواه مسلم.

దేహంగా దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉటంకించారు :

ముస్లిం లేక విశ్వాసి అయిన దాసుడు వుజూ చేస్తూ ముఖం కడుక్కున్నప్పుడు, ఆ నీళ్ళతోపాటు లేక ఆ నీటి చివరి బొట్టుతోపాటు అతను తన కళ్ళతో చేసిన అతని పాపాలన్నీ కొట్టుకుపోతాయి. తరువాత చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళతోపాటు లేక నీటి చివరి బొట్టుతో పాటు అతని చేతులు చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఇంకా అతను కాళ్ళు కడుక్కున్నప్పుడు నీళ్ళతోపాటు లేక ఆఖరి బొట్టుతో పాటు తన కాళ్ళతో నడిచి చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఆ విధంగా అతను పాపాల నుండి పరిశుద్ధుడై పోతాడు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని 'శుచీశుభ్రతల' ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When a Muslim or a believer washes his face (in the course of Wudu’), every sin he has committed with his eyes is washed away from his face along with water, or with the last drop of water; when he washes his hands, every sin they wrought is erased from his hands with the water, or with the last drop of water; and when he washes his feet, every sin towards which his feet walked is washed away with water, or with the last drop of water, with the result that he comes out cleansed of all sins”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో వుజూ మహత్మ్యం వివరించబడింది. రోజూ ఐదుపూటలా వుజూ చేసేవ్యక్తి పాపాల మాలిన్యం నుండి ఎలా కడిగివేయబడతాడో చూశారా? వుజూ వల్ల కేవలం శరీర అవయవాలే కాదు, మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వుజూ చేయటం వల్ల చిన్న చిన్న పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 129

130

హదీసు 130

الرَّابعَ عشرَ: عنه عن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الصَّلواتُ الْخَمْسُ، والْجُمُعَةُ إِلَى الْجُمُعةِ، ورمضانُ إِلَى رمضانَ مُكفِّرَاتٌ لِمَا بينَهُنَّ إِذَا اجْتنِبَت الْكَبائِرُ" رواه مسلم

ఆయన (అబూ హురైరా – రజి) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: (మనిషి) ఘోర (కబీరా) పాపాలకు దూరంగా ఉంటే, ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరొక జుమా, ఒక రమజాన్ మాసం నుండి మరొక రమజాన్ మాసం వరకు మధ్య జరిగిన పాపాలకు పరిహారమవుతాయి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The five (daily) Salat (prayers), and from one Jumu`ah prayer to the (next) Jumu`ah prayer, and from Ramadan to Ramadan are expiations for the (sins) committed in between (their intervals); provided the major sins are not committed”.[Muslim].

ముఖ్యాంశాలు

ఒక విశ్వాసి ఘోరపాపాలకు పాల్పడకుండా, సాటి మానవుల హక్కులను కొల్లగొట్టకుండా జాగ్రత్తగా మసలుకుంటే పైన పేర్కొనబడిన ఆరాధనలవల్ల అతను పూర్తిగా పాపాల నుండి పవిత్రుడయిపోతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 130

131

హదీసు 131

الْخَامسَ عشر: عَنْهُ قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ألا أدلُّكَم عَلَى مَا يَمْحُو اللَّهُ بِهِ الْخَطايا، ويرْفَعُ بِهِ الدَّرجاتِ؟ "قَالُوا: بَلَى يَا رسُولَ اللَّهِ، قَالَ:"إِسْبَاغُ الْوُضوءِ عَلَى الْمَكَارِهِ وكَثْرةُ الْخُطَا إِلَى الْمسَاجِدِ، وانْتِظَارُ الصَّلاةِ بعْدِ الصَّلاةِ، فَذلِكُمُ الرّبَاطُ "رواه مسلم.

ఆయన (అబూ హురైరా – రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన సహచరులతో "దైవం (మానవుల) పాపాలను ప్రక్షాళనంచేసి, వారి స్థానాలను ఉన్నతం చేసేందుకు దోహదపడే విషయాలు ఏమిటో నేను మీకు చెప్పనా?" అని అన్నారు. దానికి ఆయన సహచరులు "తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా!" అని విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన "మనసు ఒప్పకపోయినా పూర్తిగా వుజూ చేయటం, మస్జిద్‌ల వైపు ఎక్కువగా అడుగులు వేయటం (అంటే దూరం నుంచి రావటం), ఒక నమాజు ముగిసిన పిదప తరువాతి నమాజు కోసం ఎదురు చూడటం ఇంకా ఇది (పుణ్యపరంగా) సరిహద్దుపై కాపలా కాయటం (తో సమానం)" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Should I not direct you to something by which Allah obliterates the sins and elevates (your) ranks.” They said: “Yes, O Messenger of Allah”. He said, “Performing Wudu’ properly, even in difficulty, frequently going to the mosque, and waiting eagerly for the next Salat (prayer) after a Salat is over; indeed, that is Ar-Ribat”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'రిబాత్' అన్న పదం వాడబడింది. రిబాత్ అంటే సరిహద్దుపై కాపలా కాయటం. ఒక దేశ సరిహద్దుల వద్ద కాపలా కాయడమనేది ఎప్పుడూ జరుగుతుండే పని. అందుకే ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తూ ఉండటాన్ని, నిరంతరం ఆరాధనలు చేస్తూ ఉండటాన్ని సరిహద్దుపై కాపలాతో పోల్చడం జరిగింది. మనసు ఒప్పుకోకపోయినా పూర్తిగా వుజూ చేయడమంటే, విపరీతంగా చలివేస్తున్నప్పుడు గాని లేక అనారోగ్యానికి గురై వున్నప్పుడుగాని నీళ్ళతో వుజూ చేయడం భారంగా తోస్తుంది. అయితే ఒక విశ్వాసి దైవప్రసన్నత కోసం ఆ బాధను సహిస్తూ సరైన రీతిలో ప్రవక్త పద్ధతిననుసరించి వుజూ చేస్తే అతని సహనానికి తగిన పుణ్యం అతనికి లభిస్తుంది.

అదేవిధంగా ఇల్లు మస్జిద్‌కు దగ్గరగా ఉండటం కొన్ని విధాలుగా సౌకర్యంగానూ, ప్రయోజనకరంగానూ ఉన్నప్పటికీ, మస్జిద్‌కు నడిచివెళ్ళినందుకు లభించే పుణ్యాన్ని బట్టి చూస్తే ఇల్లు మస్జిద్‌కు దూరంగా ఉండటమే మంచిది. మనిషి ఆరాధనా సంకల్పంతో మస్జిద్ వైపు ఎన్ని అడుగులు వేస్తాడో అతనికి అంత పుణ్యం లభిస్తుంది. సమీప ఇండ్లవారు ఆ పుణ్యాన్ని పొందలేరు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 131

132

హదీసు 132

السَّادسَ عشرَ: عن أَبِي موسى الأشعرِيِّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ صلَّى الْبَرْديْنِ دَخَلَ الْجنَّةَ "متفقٌ عَلَيهِ. "البرْدَانِ": الصُّبْحُ والْعَصْرُ.

హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : రెండు శీతల నమాజులను చేసేవాడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు." (బుఖారీ – ముస్లిం)

'బర్‌దాన్' (రెండు శీతల నమాజులు) అంటే ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులని భావం.

(సహీహ్ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడింది).

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who observes the Fajr and `Asr (prayers) will enter Jannah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సాధారణంగా ప్రజలు 'ఫజ్ర్' మరియు 'అస్ర్' నమాజుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఫజ్ర్ వేళకు నిద్రనుండి మేల్కొని నమాజు కోసం మస్జిద్‌కు రావటం మనసుకు భారంగా తోస్తుంది. అదేవిధంగా అస్ర్‌వేళ సాధారణంగా ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో తలమునకలై ఉండి, నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తారు. అందుకే పై హదీసులో ఆ నమాజుల మహత్యాన్ని వివరిస్తూ, వాటిని క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఉండమని తాకీదు చేయటం జరిగింది. ఈ రెండు నమాజులను నిత్యం క్రమం తప్పకుండా చేసేవాడికి మిగిలిన మూడు నమాజులు చేయడం ఏమంత కష్టం కాదు. మనిషి ఈ రెండు నమాజులను కాపాడుకుంటే అవి అతని స్వర్గప్రవేశానికి దోహదకారి అవుతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 132

133

హదీసు 133

السَّابِعَ عشَر: عَنْهُ قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا مرِضَ الْعبْدُ أَوْ سافَر كُتِب لَهُ مَا كانَ يعْملُ مُقِيماً صحيِحاً" رواه البخاري.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు: దాసుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు అతను స్థానికుడై ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే (సత్) కర్మలు అతని పేర రాయబడ తాయి.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When a slave of Allah suffers from illness or sets on a journey, he is credited with the equal of whatever good works he used to do when he was healthy or at home”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇక్కడ 'సత్కర్మలు' అంటే విధులు (ఫరాయెజ్) కావు. మనిషి నిత్యం చేస్తూ ఉండే అభిలషణీయమైన స్వచ్ఛంద కార్యాలని భావం. షరీఅత్ పరమైన తగు కారణం వల్ల అతను ఆ పనులు చేయలేకపోయినా వాటి పుణ్యం మాత్రం అతని ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈ అవకాశం ఫర్జ్ (విధి) కార్యకలాపాలకు లేదు. ఫర్జ్ కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలటానికి వీల్లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 133

134

హదీసు 134

الثَّامنَ عشَرَ: عنْ جابرٍ رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كُلُّ معرُوفٍ صدقَةٌ "رواه البخاري، ورواه مسلم مِن رواية حذَيفَةَ رضي اللَّه عنه.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "ప్రతి మంచి పనీ పుణ్యమే." (బుఖారీ – ముస్లిం (రహిమహుల్లాహ్) గారు ఈ హదీసునే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ఆధారంగా వెలికితీశారు).

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని 'జకాత్' ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Jabir (radiyallahu anhu) reported that he heard Messenger of Allah ﷺ saying, “Every good deed is charity”.[Al-Bukhari].

Muslim has reported the same on the authority of Hudhaifah (radiyallahu anhu).

ముఖ్యాంశాలు

విశ్వాసి మంచితో, మేలుతో కూడుకున్న పని ఏదయినా చేస్తే అందుకు అతనికి 'సదఖా' చేసినంత పుణ్యం లభిస్తుందని ఈ హదీసు తెలియపరుస్తోంది. అన్ని రకాల సత్కార్యాలను, మేలుతో కూడుకున్న పనులను 'మారూఫ్' అంటారు. పైగా నేరాలకు, పాపాలకు దూరంగా ఉండటం కూడా 'మారూఫ్' (పుణ్యకార్యం) గానే భావించడం జరుగుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 134

135

హదీసు 135

التَّاسع عشر: عنْهُ قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْساً إلاَّ كانَ مَا أُكِلَ مِنْهُ لهُ صَدَقَةً، وَمَا سُرِقَ مِنْه لَه صدقَةً، وَلاَ يرْزؤه أَحَدٌ إلاَّ كَانَ لَهُ صَدَقَةً "رواه مسلم. وفي رواية لَهُ: "فَلا يغْرِس الْمُسْلِم غَرْساً، فَيَأْكُلَ مِنْهُ إِنسانٌ وَلاَ دابةٌ وَلاَ طَيرٌ إلاَّ كانَ لَهُ صدقَةً إِلَى يَوْمِ الْقِيَامة ". وفي رواية لَهُ: "لاَ يغْرِس مُسلِم غرْساً، وَلاَ يزْرعُ زرْعاً، فيأْكُل مِنْه إِنْسانٌ وَلا دابَّةٌ وَلاَ شَيْءٌ إلاَّ كَانَتْ لَه صَدَقَةً"، ورويَاه جميعاً مِنْ رواية أَنَسٍ رضي اللَّه عنه. قولُهُ:"يرْزَؤُهُ"أي: يَنْقُصهُ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవడైనా ముస్లిం ఒక చెట్టు నాటితే (దాని ఫలాలు పక్షులు, పందికొక్కులు, తదితర జంతువులు, కీటకాలవల్ల) తినేయబడినా అది అతని తరపునుండి 'సదఖా' (పుణ్యకార్యం) అవుతుంది. అలాగే అందులోనుంచి దొంగిలించబడినా దాన్ని అతని తరపు నుండి 'సదఖా'గానే భావించడం జరుగుతుంది. ఎవడైనా దానికి నష్టం కలిగిస్తే, అది కూడా సదఖాగానే పరిగణించబడుతుంది. (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ముస్లిం ఏదైనా చెట్టు నాటగా, దాన్ని (అంటే దాని ఆకులను, ఫలాలను) ఏ మానవుడైనా లేక జంతువైనా లేక పక్షి అయినా తినేస్తే, దానిపై అతనికి ప్రళయం వరకూ పుణ్యం లభిస్తూనే ఉంటుంది.

ముస్లింలోని ఇంకొక ఉల్లేఖనం ప్రకారం ముస్లిం ఏదైనా చెట్టునాటగా లేక చేను పండించగా ఏ మానవుడైనా లేక జంతువైనా లేక మరేదైనా దాన్ని తినేస్తే అందులో అతనికి పుణ్యమే లభిస్తుంది.

(బుఖారీ, ముస్లింలిరువురూ ఈ హదీసును హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా కూడా ఉల్లేఖించారు).

'యర్‌జవుహూ' అంటే దాన్ని నష్టపరచటం లేదా దాంట్లో లోటు కల్పించడం అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని 'సేద్యం, కౌలు వ్యవసాయాల' ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని పండ్లు, పంటల వాటాల వ్యవహారం (ముసాఖాత్) ప్రకరణంలోనూ ఈ హదీసును పేర్కొనటం జరిగింది).

English

Jabir (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When a Muslim plants a tree, whatever is eaten from it is charity from him and whatever is stolen is charity and whatever is subtracted from it is charity”.[Muslim].

Another narration says: “If a Muslim plants a tree, or sows a field and men and beasts and birds eat from it, all of it is charity from him”.

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా వ్యవసాయం, తోటల పెంపకం యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. పంటలు పండిన తరువాత ప్రకృతి వైపరీత్యాలకు గురై నాశనమవడం గాని, దురాక్రమణకు గురవడం గాని, లేదా దొంగిలించబడడం గాని జరిగినప్పుడు ముస్లిం అయిన వ్యక్తి దానిపై సహనం వహిస్తే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుందని చెప్పబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 135

136

హదీసు 136

العْشْرُونَ: عنْهُ قالَ: أَراد بنُو سَلِمَة أَن ينْتَقِلوا قُرْبَ المَسْجِدِ فبلَغَ ذلِكَ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ لَهُمْ: "إِنَّه قَدْ بَلَغَنِي أَنَّكُمْ تُرِيدُونَ أَنْ تَنْتَقِلُوا قُربَ الْمَسْجِدِ؟ "فَقَالُوا: نَعَمْ يَا رسولَ اللَّهِ قَدْ أَرَدْنَا ذلكَ، فَقالَ:"بَنِي سَلِمةَ ديارَكُمْ، تكْتبْ آثَارُكُمْ، دِياركُم، تُكْتَبْ آثارُكُمْ" رواه مسلم. وفي روايةٍ: "إِنَّ بِكُلِّ خَطْوةٍ دَرَجَةً "رواه مسلم. ورواه البخاري أيضاً بِمعنَاهُ مِنْ روايةِ أَنَسٍ رضي اللَّه عنه. وَ"بنُو سَلِمَةَ"بكسر اللام: قبيلة معروفة مِنَ الأَنصار رضي اللَّه عنهم، وَ"آثَارُهُمْ"خُطاهُمْ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) గారే ఇలా తెలిపారు : బనూ సలిమా తెగవారు మస్జిద్ సమీప ప్రాంతానికి తరలివెళదామని నిశ్చయించుకున్నారు. ఈ విషయం దైవప్రవక్త ﷺ గారికి తెలిసింది. అప్పుడు ఆయన వారితో "ఏమిటీ, మీరందరూ మస్జిద్ సమీప ప్రాంతానికి తరలివెళదామను కుంటున్నారట?" అని అడిగారు. దానికి వారు "ఔను దైవప్రవక్తా! మేము నిజంగానే వెళదామనుకుంటున్నాము" అని సమాధానమిచ్చారు.

అందుకు ఆయన "బనూ సలిమా తెగవారలారా! మీరు మీ ఇండ్లలోనే ఉండండి. మీ అడుగు ముద్రలు లిఖించబడతాయి. మీరు మీ ఇండ్లలోనే ఉండండి. మీ అడుగుల ముద్రలు లిఖించబడతాయి" అని వారికి ఉపదేశించారు. (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో "మీరు (మస్జిద్ వైపు) వేసే ప్రతి అడుగుకీ ఒకింత (ఉన్నత) స్థానం లభిస్తుంది" అని ఉంది. బుఖారీ కూడా హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఈ భావంలోనే ఉల్లేఖించారు.

'బనూ సలిమా' అనేది అన్సార్‌కు చెందిన ఒక పేరెన్నికగన్న తెగ. 'ఆసారుహుమ్' అంటే అడుగులు (అడుగుల ముద్రలు).

(సహీహ్ బుఖారీలోని 'అజాన్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది).

English

Jabir (radiyallahu anhu) reported: The tribe Banu Salimah wanted to move nearer to the mosque. On learning this Messenger of Allah ﷺ said to them, “I heard that you intend to move nearer to the mosque”. They said, “That is so, O Messenger of Allah, we do want to do that”. He said, “O Banu Salimah, keep to your homes, your steps (to the mosque) are recorded”.[Muslim].

Another narration says: “There is for every step (towards the mosque) a degree (of reward) for you“. [Muslim].

ముఖ్యాంశాలు

  1. సత్కార్యం ఎంత కష్టమైనదయితే దానిపై లభించే పుణ్యం అంతే ఎక్కువగా ఉంటుంది.
  2. మస్జిద్ నుండి ఇల్లు ఎంత దూరం ఉన్నప్పటికీ, మస్జిద్‌కు వెళ్ళి సామూహిక నమాజులో పాల్గొనాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 136

137

హదీసు 137

الْحَادي والْعِشْرُونَ: عنْ أَبِي الْمُنْذِر أُبيِّ بنِ كَعبٍ رضي اللَّه عنه قَالَ: كَان رجُلٌ لا أَعْلمُ رجُلا أَبْعَدَ مِنَ الْمَسْجِدِ مِنْهُ، وكَانَ لاَ تُخْطِئُهُ صلاةٌ فَقِيل لَه، أَوْ فقُلْتُ لهُ: لَوْ اشْتَريْتَ حِماراً ترْكَبُهُ في الظَّلْماءِ، وفي الرَّمْضَاءِ فَقَالَ: مَا يسُرُّنِي أَن منْزِلِي إِلَى جنْب الْمسْجِدِ، إِنِّي أُرِيدُ أَنْ يُكْتَب لِي ممْشَايَ إِلَى الْمَسْجد، ورُجُوعِي إِذَا رجعْتُ إِلَى أَهْلِي، فقالَ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "قَدْ جَمَعَ اللَّهُ لكَ ذلِكَ كُلَّهُ" رواه مسلم. وفي روايةٍ: "إِنَّ لَكَ مَا احْتسَبْت". "الرمْضَاءُ"الأَرْضُ الَّتِي أَصَابَهَا الْحرُّ الشَّديدُ.

హజ్రత్ అబూ ముంజిర్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి ఉండేవాడు. నాకు తెలిసినంతవరకు మస్జిద్ నుండి అతని ఇల్లుకన్నా దూరంగా ఎవరి ఇల్లూ లేదు. అయినా అతను ఒక్క నమాజును కూడా వదిలేవాడు కాదు. అతనితో ఎవరో అన్నారు లేక నేనే అన్నాననుకుంటా, "ఒక గాడిదను కొనుక్కొని చీకటి పడినప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు దానిపై ఎక్కి రావచ్చుగదా?" అని. దానికి అతను, "నా ఇల్లు మస్జిద్ చెంతనుండటం నాకిష్టం లేదు. నేను (దూరం నుండి) మస్జిద్‌కు నడిచి రావడం, తిరిగి మస్జిద్ నుండి ఇంటికి తిరిగి వెళ్ళడం నా కర్మల పత్రంలో వ్రాయబడాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు. (అతని మాటలు విని) దైవప్రవక్త ﷺ "అల్లాహ్ నీవు కోరుకున్నదంతా (నీ ఖాతాలో) జమ చేశాడు" అని అన్నారు.

వేరొక ఉల్లేఖనంలో "నీకు నీవు ఆశించిన పుణ్యం లభిస్తుంది" అని ఉంది.

'అర్రమ్‌జా' అంటే ఎండకు కాలుతున్న నేల.

(సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)

English

Ubayy bin Ka`b (radiyallahu anhu) reported: There was a man, and I do not know of any other man whose house was farther than his from the mosque, and he never missed Salat (in congregation). It was said to him (or I said to him): “If you buy a donkey you could ride it in the dark nights and in the burning sand.” He said: “I do not like my house to be by the side of the mosque, for I (eagerly) desire that my steps towards the mosque and back from it should be recorded when I return to my family.” Upon this Messenger of Allah ﷺ said, “Allah has granted you all the rewards for you”.[Muslim].

Another narration says: “You will get the reward for what you have anticipated“.

ముఖ్యాంశాలు

  1. ప్రవక్త ﷺ సహచరులు పరలోక పుణ్యాన్ని సంపాదించడం కోసం ఎలా పరితపించిపోయేవారో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.
  2. మనిషికి లభించే పుణ్యం అతని సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇల్లు మస్జిద్‌కు దూరంలో ఉండటం కూడా శుభకరమే అని తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 137

138

హదీసు 138

الثَّاني والْعشْرُونَ: عنْ أَبِي محمدٍ عبدِ اللَّهِ بنِ عمرو بن العاص رضي اللَّه عنهما قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَرْبعُونَ خَصْلةً أَعلاها منِيحةُ الْعَنْزِ، مَا مِنْ عامَلٍ يعملَ بِخَصْلَةٍ مِنْها رجاءَ ثَوَابِهَا وتَصْدِيقَ موْعُودِهَا إِلاَّ أَدْخلَهُ اللَّهُ بِهَا الْجنَّةَ" رواه البخاري. "الْمنِيحةُ": أَنْ يُعْطِيَهُ إِيَّاهَا ليأْكُل لبنَهَا ثُمَّ يَردَّهَا إِليْهِ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు : నలభై (సద్) గుణాలున్నాయి. వాటిలో అత్యుత్తమమైన గుణం మేకపాలను (ఇతరులకు కానుకగా) ఇచ్చివేయడం. ఏ సదాచారి అయినా పుణ్యాన్ని ఆశిస్తూ, దేవుని తరపునుండి చేయబడిన వాగ్దానాలను ధృవీకరిస్తూ వాటిలోని ఏ ఒక్క సద్గుణాన్ని ఆచరించినా దేవుడు తప్పకుండా అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. (బుఖారీ)

ఒక వ్యక్తి తన పశువును ఇతరులకెవరికైనా ఇచ్చి, దాని పాలను కానుకగా సేవించమని చెప్పి, పశువును తిరిగి వాపసు చేయమంటాడు. అలాంటి పశువునే 'మనీహా' అని అంటారు.

(సహీహ్ బుఖారీలోని 'కానుకల' ప్రకరణం)

English

Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “There are forty kinds of virtue; the uppermost of them is to lend a (milch) she-goat (to someone in order to benefit from it and then return it). He who practices any of these virtues expecting its reward and relying on the truthfulness of the promise made for it, shall enter Jannah.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

పై హదీసులో చెప్పబడిన విధంగా ఒక వస్తువుని తమ యాజమాన్యంలో ఉంచుకొని, తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం దాన్ని ఇతరులకు ఇచ్చివేస్తే దానివల్ల కూడా పుణ్యం లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 138

139

హదీసు 139

الثَّالثُ والْعشْرونَ: عَنْ عدِيِّ بنِ حاتِمٍ رضي اللَّه عنه قَالَ: سمِعْتُ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "اتَّقُوا النَّارَ وَلوْ بِشقِّ تَمْرةٍ" متفقٌ عَلَيهِ. وفي رواية لهما عَنْهُ قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلاَّ سيُكَلِّمُه ربُّه لَيْس بَيْنَهُ وبََينَهُ تَرْجُمَان، فَينْظُرَ أَيْمنَ مِنْهُ فَلا يَرى إِلاَّ مَا قَدَّم، وينْظُر أشأمَ مِنْهُ فَلاَ يَرَى إلاَّ مَا قَدَّمَ، وَينْظُر بَيْنَ يدَيْهِ فَلا يَرى إلاَّ النَّارَ تِلْقَاءَ وَجْهِهِ، فاتَّقُوا النَّارَ ولوْ بِشِقِّ تَمْرةٍ، فَمَنْ لَمْ يَجدْ فَبِكَلِمَة طيِّبَةٍ.

దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : మిమ్మల్ని మీరు అగ్ని నుండి కాపాడుకోండి! ఒక్క ఖర్జూరపు ముక్క (దానం)తోనైనా సరే; (బుఖారీ – ముస్లిం)

ఉభయులూ (బుఖారీ – ముస్లింలు), అదీ (రదియల్లాహు అన్హు) ఆధారంగా వెలికితీసిన వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని ఉంది : మీలోని ప్రతి ఒక్కరితోనూ అతని ప్రభువు (నేరుగా) సంభాషిస్తాడు. అప్పుడు అతనికి – అతని ప్రభువుకు మధ్య ఏ అనువాదకుడూ ఉండడు. (ఆ రోజు) మానవుడు తన కుడివైపు చూస్తాడు. అక్కడ అతనికి తాను అంతకుముందు చేసిన ఆచరణే కనిపిస్తుంది. ఆ తరువాత ముందువైపు చూస్తాడు. అక్కడ నరకాగ్ని మండుతూ కనిపిస్తుంది. కనుక ఒక్క ఖర్జూరపు ముక్కతోనైనా సరే మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి; అదీ చేయలేకపోతే ఒక్క మంచిమాట చెప్పి అయినా సరే;

(మొదటి ఉల్లేఖనం సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ, జకాత్ తదితర ప్రకరణాల్లోనూ వచ్చింది. ఇంకా సహీహ్ బుఖారీలోని తౌహీద్ మొదలగు ప్రకరణాల్లోనూ, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ రెండవ ఉల్లేఖనం పొందుపరచబడి ఉంది.)

English

`Adi bin Hatim (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “Protect yourself from (Hell) Fire, by giving of half of a date (in charity)”.[Al-Bukhari and Muslim].

In another narration `Adi bin Hatim (radiyallahu anhu) reported Messenger of Allah ﷺ as saying: “Allah will surely speak with everyone of you without an interpreter. He (the man) will look at his right side and will see nothing but (the deeds) which he had done before, and he will look to his left side and will see nothing but (the deeds) which he had done before. Then he will look in front of him and will find nothing but Hell-fire facing him. So protect (yourselves) from (Hell) Fire, by giving in charity even half a date; and if he does not finds it, then with a kind word”.

ముఖ్యాంశాలు

  1. ప్రళయదినాన మనిషి దైవసన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు అతనికి ఇరుప్రక్కలా తాను అంతకుముందు లోకంలో చేసుకున్న కర్మలుంటాయనీ, ఆ సమయంలో అతను పరమప్రభువుతో ప్రత్యక్షంగా మాట్లాడి తాను చేసిన కర్మలకు జవాబుదారీ వహించవలసి ఉంటుందని పై హదీసు తీవ్రంగా హెచ్చరిస్తోంది. రెండో విషయం ఏమిటంటే, ప్రతి వ్యక్తీ తన స్థోమతకు తగ్గట్టుగా దైవమార్గంలో ఖర్చుపెట్టడానికి, దానధర్మాలు చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఇతరులను నవ్వుతూ పలకరించడం, వారిపట్ల మృదువుగా మెలగడం లాంటి సద్వర్తనాలను అవలంబించడం కూడా ముక్తికి సోపానం కావచ్చు.
  2. ప్రళయం రోజు మనిషికి పనికివచ్చేవి అతను చేసుకున్న సత్కర్మలే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 139

140

హదీసు 140

الرَّابِعِ والْعشرونَ: عنْ أَنَسٍ رضي اللَّه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه لَيرْضَى عَنِ الْعَبْدِ أَنْ يَأْكُلَ الأَكْلَةَ فيحْمدَهُ عليْهَا، أَوْ يشْربَ الشَّرْبَةَ فيحْمدَهُ عليْهَا"رواه مسلم. "وَالأَكْلَة"بفتح الهمزة: وَهيَ الْغَدوة أَوِ الْعشوة.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : భోజనం చేసి దానిపై దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునేవాడి పట్ల, నీళ్ళు త్రాగి దానిపై దైవాన్ని కొని యాడే దాసుడి పట్ల అల్లాహ్ అమితంగా ప్రసన్నుడౌతాడు. (ముస్లిం)

'అక్‌లా' అంటే ఉదయం లేక రాత్రి భోజనం.

(సహీహ్ ముస్లింలోని దైవధ్యాన ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah will be pleased with His slave who praises Him (i.e., says Al-hamdu lillah) when he eats and praises Him when he drinks”.[Muslim].

ముఖ్యాంశాలు

మనిషికి రుచినీ, తృప్తినీ, ఆహ్లాదాన్ని ఇచ్చే భోజనం తినడం, నీళ్ళు త్రాగడం లాంటి వాటిపై దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటే అందులోనూ పుణ్యం దొరుకుతుందని, ఆ విధంగా తినడం, త్రాగడం కూడా ముక్తికి దోహదపడవచ్చని పై హదీసు ద్వారా తెలుస్తోంది. (సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ సుబ్‌హానల్లాహిల్ అజీం).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 140

141

హదీసు 141

الْخَامِسُ والْعشْرُونَ: عن أَبِي موسى رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "عَلَى كُلِّ مُسْلِمٍ صدقةٌ"قَالَ: أَرَأَيْتَ إِنْ لَمْ يَجدْ؟ قالَ:"يعْمَل بِيَديِهِ فَينْفَعُ نَفْسَه وَيَتَصدَّقُ": قَال: أَرَأَيْتَ إِنْ لَمْ يسْتطِعْ؟ قَالَ: يُعِينُ ذَا الْحَاجَةِ الْملْهوفَ"قالَ: أَرأَيْت إِنْ لَمْ يسْتَطِعْ قالَ:"يَأْمُرُ بِالمَعْرُوفِ أَوِ الْخَيْرِ"قالَ: أَرأَيْتَ إِنْ لَمْ يفْعلْ؟ قالْ:"يُمْسِكُ عَنِ الشَّرِّ فَإِنَّهَا صدَقةٌ" متفقٌ عليه.

హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ఇలా అన్నారు: "ప్రతి ముస్లిం తప్పనిసరిగా 'సదఖా' చేయాలి." అందుకు అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) "అతని దగ్గర అంత స్థోమత లేకపోతేనో?!" అని సందేహపడ్డారు. దానికి దైవప్రవక్త "అతను తన స్వహస్తాలతో (కష్టపడి) పనిచేసి (వచ్చిన జీతాన్ని) తన స్వయం కోసం ఉపయోగించుకోవాలి. ఇంకా సదఖా కూడా చేయాలి" అని చెప్పారు. "అతనిలో ఆ శక్తి కూడా లేకపోతే?" అని అబూమూసా (రదియల్లాహు అన్హు) మళ్ళీ సందేహపడగా, దానికి ఆయన ﷺ, "ఎవడైనా అవసరాల్లో ఉన్న వ్యక్తి ఏదైనా ఆపదలో చిక్కుకొని ఉంటే అతణ్ణి ఆదుకోవాలి" అని జవాబు చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆయన "అదీ చేయలేకపోతే" అని అడగ్గా, దైవప్రవక్త ﷺ "అప్పుడు అతను మంచిని లేదా మేలును గురించి ఆదేశిస్తూ ఉండాలి" అని అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) గారు "మరి అదీ చేయలేకపోతేనో?" అని మళ్ళీ సందేహపడగా అప్పుడు ఆయన ﷺ, "అటువంటప్పుడు అతను పరులకు కీడు తలపెట్టకుండానైనా జాగ్రత్తపడాలి. నిస్సందేహంగా ఇది కూడా సదఖాయే (ఒక రకంగా దానమే)" అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణంలోనూ, సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది).

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Giving in charity is an obligation upon every Muslim”. It was said (to him): “What about one who does not find (the means) to do so?” He ﷺ said, “Let him work with his hands, thus doing benefit to himself and give in charity.” It was said to him: “What if he does not have (the means) to do so?” He ﷺ said, “Then let him assist the needy, the aggrieved.” It was said: “What about if he cannot even do this?” He ﷺ said, “Then he should enjoin good.” He was asked: “What if he cannot do that?” He (the Prophet ﷺ) said, “He should then abstain from evil, for verily, that is a charity from him”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. మనిషి కష్టపడి, చెమటోడ్చి డబ్బు సంపాదించాలని ఈ హదీసు బోధిస్తోంది. తద్వారా అతను తన అవసరాలను తీర్చుకోవటంతో పాటు దైవమార్గంలో సదఖా (దానం) కూడా చేయగలడు.
  2. సదఖా భావం చాలా విస్తృతమైనది. పుణ్యప్రదమైన, మేలుతో కూడిన అనేక రకాల సత్కార్యాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆఖరికి చెడు పనులు చేయకుండా ఉండటం కూడా 'సదఖా' క్రిందికే వస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|13. మంచి పనులకు మార్గాలు అనేకం|హదీసు 141