హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 12. చరమ ఘడియల్లో సత్కార్యాలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 12వ అధ్యాయం: చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 112 – 116) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..

↑ విషయ సూచిక

بابُ الحثِّ عَلَى الازدياد من الخير في أواخِر العُمر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{أَوَلَمْ نُعَمِّرْكُمْ مَا يَتَذَكَّرُ فِيهِ مَنْ تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ} [فاطر: ٣٧]

అల్లాహ్ సెలవిచ్చాడు : "గుణపాఠం నేర్చుకోదలచినవాడు గుణపాఠం నేర్చుకోవడానికి సరిపడిన ఆయుష్షును మేము మీకు ఇవ్వలేదా? మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా!" (ఫాతిర్ : 37)

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) మరియు ఇతర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పై సూక్తి భావం : "మేము నీకు అరవై ఏళ్ళ ఆయుష్షునొసగలేదా?" అని. ఇన్షాఅల్లాహ్ (రానున్న పేజీల్లో) మేము ప్రస్తావించబోతున్న హదీసు కూడా ఈ భావాన్ని సమర్థిస్తుంది. కొంతమంది పండితులు దీనర్థం పద్దెనిమిది సంవత్సరాలని, మరికొంతమంది నలభై నంవత్సరాలని అన్నారు. చివరి సంఖ్య హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) కల్బీ, మరియు ఇమామ్ మస్రూఖ్‌లు అన్నది. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) నుంచి కూడా ఈ విధంగానే ఉల్లేఖించబడింది. మదీనా ప్రజలు నలబై ఏళ్ళ వయస్సు రాగానే ఆరాధన నిమిత్తం తీరుబడిగా ఉండేవారని కూడా వారు ఉల్లేఖించారు. అసలు దీనికి అర్థం ప్రాజ్ఞ వయస్సని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. (చాలామంది ఇమాముల దృష్టిలో ప్రాజ్ఞవయస్సు పదిహేమ వంవత్సరాలు. కాగా మరికొంతమంది; స్వప్నస్థలనం జరిగినప్పటి నుంచి ప్రాజ్ఞతగా పరిగణించడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.)

ఇంకా "మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చివున్నాడు కదా!" అన్న సూక్తిపై వ్యాఖ్యానిస్తూ హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) మరియు మెజారిటీ విద్వాంసులు, "ఇక్కడ హెచ్చరిక చేసేవాడంటే దైవప్రవక్త ﷺ" అని అన్నారు. అయితే ఇక్రిమా, ఇబ్నె ఉయైనా తదితరులు 'హెచ్చరిక చేసేవాడంటే మనిషి ముసలితనం' అని అభిప్రాయపడ్డారు. – వల్లాహు ఆలము

English

“Did We not give you lives long enough, so that whosoever would receive admonition, – could receive it? And the warner came to you.” [Fāṭir 35:37] Ibn `Abbas and others said that “long enough” in the Verse means sixty years. The Hadith which follows supports this. Others said it means eighteen years; Al-Hasan Al-Basri, Al-Kalbi and Masruq said it means forty years, it has also been reported by Ibn Abbas and others that whenever the people of Al-Madinah turned forty years of age, they would devote themselves completely to worship. “Long enough” in the Verse has also been interpreted to mean the age of puberty. Ibn `Abbas and the majority of Muslim scholars said that the “warner” in the Verse refers to the Prophet ﷺ. `Ikrimah bin `Umaiyyah and others interpreted this word as the grayness or whiteness of hair”. Allah knows better.

112

హదీసు 112

وأمَّا الأحاديث فالأوَّل: عن أَبِي هريرةَ رضي اللَّه عنه، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أعْذَرَ اللَّهُ إِلَى امْرِىءٍ أخَّرَ أجلَه حَتَّى بلَغَ سِتِّينَ سَنَةً" رواه البخارى. قَالَ العلماءُ معناه: لَمْ يتْركْ لَه عُذْراً إِذْ أمْهَلَهُ هذِهِ المُدَّةَ. يُقال: أعْذَرَ الرَّجُلُ إِذَا بلغَ الغايَةَ في الْعُذْرِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : దేవుడు మనిషి అరవైయేండ్ల దాకా బ్రతికుండేటట్లు అతని మరణాన్ని వాయిదావేస్తే ఇక అతని కోసం ఎలాంటి సాకులు వదలనట్లే. (అంటే ఇక అతను చూపెట్టే ఏ సాకునూ దేవుడు అంగీకరించడని అర్థం). దేవుడు మనిషికి ఇంత గడువు ఇచ్చాడంటే అతని కొరకు ఇక ఎలాంటి సాకులూ వదల్లేదనే దీని భావమని విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

మనిషి సాకులు చూపెట్టడంలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు 'ఆజరర్రజులు' అని వ్యవహరిస్తారు.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah excuses and grants forgiveness to a person until he attains the age of sixty years”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. ఏదైనా కారణాన్ని పూర్తిచేయనంతవరకూ దేవుడు ఏ మనిషినీ, ఏ జాతినీ శిక్షకు గురిచేయడని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఒక మనిషికి అరవైయేండ్ల ఆయుష్షు లభించినప్పటికీ అతను విశ్వాస స్థితిలో చేయవలసిన పనులు చేయకుండా ఏమరుపాటులో జీవితాన్ని గడిపితే ఇక అతడు దైవశిక్ష నుంచి బయటపడటానికి దైవం ముందు ఎలాంటి సాకులూ చూపెట్టలేడని కూడా ఈ హదీసు బోధపరుస్తోంది.
  2. మనిషి కనీసం అరవైయేండ్ల ప్రాయంలోనైనా ఏమరుపాటునుంచి తేరుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత మరణ సమయం ఆసన్నమవుతుంది. మరణమైతే యవ్వనంలో కూడా వస్తుందనుకోండి. కాని యవ్వనంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి జీవితంపై ఆశ ఉండవచ్చు. అయితే అరవై సంవత్సరాల తరువాత కూడా ఇంకా జీవితంపై ఆశపెట్టుకొని మునుపటిలాగే పాపాలు చేయటం, దైవ అవిధేయతకు ఒడిగట్టడం ఎంతో శోచనీయం. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక!)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..|హదీసు 112

113

హదీసు 113

الثاني: عن ابن عَبَّاسٍ، رضي اللَّه عنهما، قَالَ: كَانَ عمر رضي اللَّه عنه يُدْخِلُنى مَع أشْياخ بْدرٍ، فَكأنَّ بعْضَهُمْ وجدَ فِي نفسِهِ فَقَالَ: لِمَ يَدْخُلُ هَذِا معنا ولنَا أبْنَاء مِثْلُه،؟ فَقَالَ عمرُ: إِنَّهُ منْ حيْثُ علِمْتُمْ، فدَعَانى ذاتَ يَوْمٍ فَأدْخلَنى معهُمْ، فما رأَيْتُ أنَّه دعاني يوْمئِذٍ إِلاَّ لِيُرِيهُمْ قَالَ: مَا تقُولُون في قول اللَّه تعالى: {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} [النصر:١] فَقَالَ بَعضُهُمْ: أمِرْنَا نَحْمَدُ اللَّهَ ونَسْتَغْفِره إذَا نَصرنَا وفَتَحَ علَيْنَا. وسكَتَ بعضهُمْ فَلَمْ يقُلْ شَيئاً فَقَالَ لي: أكَذلك تقُول يَا ابنَ عباسٍ؟ فقلت: لا. قَالَ فما تقول؟ قُلْتُ: هُو أجلُ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، أعْلمَه لَهُ قَالَ {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} [: وذلك علامةُ أجلِك {فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّاباً} [النصر:٣] فَقَالَ عمر رضي اللَّه عنه: مَا أعْلَم مِنْهَا إلاَّ مَا تَقُول. رواه البخاري.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు బద్ర్ యుద్ధంలో పాల్గొన్న పెద్దవాళ్ళతోపాటు నన్ను కూడా తన సమావేశాల్లో కూర్చోబెట్టుకునేవారు. దీనిపై కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. "ఈ అబ్బాయి వయస్సుగల మా పిల్లలు కూడా ఉండగా, మన సమావేశాల్లో ఇతన్నే ఎందుకు కూర్చోబెట్టుకోవాలి?" అని కొందరు అడగనే అడిగారు. అందుకు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) "ఇబ్నె అబ్బాస్ ప్రతిభ గురించి తెలిసిందేగా!" అని అన్నారు వారితో. ఆ తరువాత ఒకరోజు ఆయన నన్ను పిలిచి బద్ర్ యుద్ధంలో పాల్గొన్న ఆ పెద్ద మనుషులతో పాటు నన్నూ తన సమావేశంలో కూర్చోబెట్టుకున్నారు. బహుశా ఆ రోజు ఆయన వారికి నా గురించి తెలియజేయడానికే నన్ను పిలిచి ఉంటారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సమావేశంలోని సభ్యులను "అల్లాహ్ సహాయం వచ్చి, విజయభాగ్యం లభించినప్పుడు….." అన్న దైవసూక్తి భావం గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగారు. దానికి ఆ సభలోని కొందరు "ఇందులో అల్లాహ్ సహాయం అవతరించి ఆయన మమ్మల్ని గెలిపించినప్పుడు (అందుకు కృతజ్ఞతగా)మనం ఆయన్ని స్తుతించాలని, పాపాల మన్నింపుకోసం వేడుకోవాలని ఆదేశించబడింది" అని జవాబు చెప్పారు. కొందరయితే అసలేమీ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) "ఇబ్నె అబ్బాస్! నువ్వేమంటావ్!" అని ప్రశ్నించారు. అప్పుడు నేను "ఇందులో దైవప్రవక్త మరణ ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఆయనకు (ఈ సూరాలో) దాని గురించే సూచించాడు. (దీని తాత్పర్యం ఏమిటంటే) "అల్లాహ్ సహాయం వచ్చి, విజయభాగ్యం లభించినప్పుడు… ఇది నీ మరణానికి సూచన. కనుక ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు స్తోత్రంతోపాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా మన్నింపుకై ఆయన్ని వేడుకో. నిస్సందేహంగా ఆయన అమితంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు" అంటూ ఈ సూరా తాత్పర్యాన్ని వివరించాను. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) "ఈ సూరాపై నువ్వు వివరించిన అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను" అని అన్నారు.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ, ఇంకా సుననె తిర్మిజీలోని వ్యాఖ్యానాల అధ్యాయములలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Ibn `Abbas (radiyallahu anhuma) said: `Umar (radiyallahu anhu) used to make me sit with the noble elderly men who had participated in the battle of Badr. Some of them disliked it and said to `Umar: “Why do you bring in this boy to sit with us when we have sons like him?” `Umar replied: “Because of the status he has, which you already know about (i.e., belongs to the source of knowledge and the house of the Prophet ﷺ).” One day, `Umar called me and seated me in the gathering of those people; and I think that he called me just to show them (of my religious knowledge). `Umar then questioned them (in my presence). “How do you interpret the ayah of Allah: `When there comes the Help of Allah (to you, O Muhammad ﷺ against your enemies) and the Conquest (of Makkah).”‘ Someone said that when Allah’s Help and the Conquest (of Makkah) came to us, we were called upon to celebrate the Praise of Allah and ask for His forgiveness. Some others remained silent and did not utter a word. Thereupon `Umar asked me: “Ibn `Abbas! Do you say the same.” I replied: “No”. He said: “What do you say then?” I replied: “That is the sign of the Prophet’s death about which he had been informed. Allah, the Exalted, says:

‘When there comes the help of Allah (to you, O Muhammad ﷺ against your enemies) and the Conquest (of Makkah)’.

So declare the remoteness of your Rubb from every imperfection, and ask for His forgiveness. Verily, He is the One Who accepts the repentance and Who forgives”.

On that `Umar (radiyallahu anhu) said: “I do not know anything about it other than what you have said”.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

  1. మనిషికి కేవలం వయసు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రాధాన్యత లభించాలన్న నియమం లేదు. పైగా బుద్ధీజ్ఞానాల, విజ్ఞతా వివేచనాల ఆధారంగా అతనికి విలువ, ప్రాధాన్యతలు లభించాలి. ఆ విధంగా ఒక పిన్న వయస్కుడైన బాలుడు కూడా తన అసామాన్య తెలివి తేటలు, ప్రతిభాపాటవాల ద్వారా పెద్దవారిని మించిపోవచ్చు.
  2. మరణ ఘడియలు ఆసన్నమయినప్పుడు మనిషి వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి కీర్తిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ, గతంలో తనవల్ల జరిగిన పాపాలకు క్షమాభిక్షను వేడుకుంటూ కాలం గడపాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..|హదీసు 113

114

హదీసు 114

الثالث: عن عائشةَ رضي اللَّه عنها قَالَتْ: مَا صَلَّى رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صلاةً بعْد أَنْ نزَلَت علَيْهِ {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} إلاَّ يقول فِيهَا: "سُبْحانك ربَّنَا وبِحمْدِكَ، اللَّهُمَّ اغْفِرْ لي" متفقٌ عَلَيهِ. وفي رواية الصحيحين عنها: كَانَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُكْثِر أنْ يَقُول فِي ركُوعِه وسُجُودِهِ: "سُبْحانَكَ اللَّهُمَّ ربَّنَا وَبحمْدِكَ، اللَّهمَّ اغْفِرْ لِي" يتأوَّل الْقُرْآن. معنى:"يتأوَّل الْقُرُآنَ"أيْ: يعْمل مَا أُمِرَ بِهِ في الْقُرآنِ في قولِهِ تَعَالَى: {فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ} . وفي رواية لمسلم: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُكْثِرُ أنْ يَقولَ قبْلَ أَنْ يَمُوتَ: "سُبْحانَكَ اللَّهُمَّ وبِحْمدِكَ، أسْتَغْفِركَ وأتُوبُ إلَيْكَ". قَالَتْ عائشةُ: قُلْتُ: يَا رسولَ اللَّه مَا هذِهِ الكلِمَاتُ الَّتي أرَاكَ أحْدثْتَها تَقولها؟ قَالَ: "جُعِلَتْ لِي علامةٌ في أمَّتي إِذَا رَأيتُها قُلتُها {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} [إِلَى آخِرِ السورة". وفي رواية لَهُ: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُكْثِرُ مِنْ قَوْلِ: "سُبْحانَ اللَّهِ وبحَمْدِهِ. أسْتَغْفِرُ اللَّه وَأَتُوبُ إلَيْه". قَالَتْ: قُلْتُ: يَا رسولَ اللَّه، أَرَاكَ تُكْثِرُ مِنْ قَوْل: سُبْحَانَ اللَّهِ وبحمْدِهِ، أسْتغْفِر اللَّه وأتُوبُ إليْهِ؟ فَقَالَ: "أخْبرني ربِّي أنِّي سَأرَى علاَمَةً فِي أُمَّتي فَإِذَا رأيْتُها أكْثَرْتُ مِن قَوْلِ: سُبْحانَ اللَّهِ وبحَمْدِهِ، أسْتَغْفِرُ اللَّه وَأتُوبُ إلَيْهِ: فَقَدْ رَأَيْتُها: {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} فَتْحُ مَكَّةَ، {وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجاً، فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّاباً}

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: "అల్లాహ్ సహాయం వచ్చి విజయభాగ్యం లభించినప్పుడు….." అన్న దైవసూక్తి అవతరించిన తరువాత దైవప్రవక్త ﷺ తన ప్రతి నమాజులోనూ "సుబ్‌హానక రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మగ్ఫిర్‌లీ – (నీవు పవిత్రుడవు, ఓ మా ప్రభువా! నీ స్తోత్రంతోపాటు, దేవా! నన్ను మన్నించు)" అని వేడుకునేవారు. (బుఖారీ – ముస్లిం)

బుఖారీ – ముస్లింలలోని ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దివ్య ఖుర్‌ఆన్ భావం నుండి స్ఫూర్తిని పొందుతూ దైవప్రవక్త ﷺ తన రుకూల్లో, సజ్దాల్లో ఎక్కువగా "సుబ్‌హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక, అల్లా హుమ్మగ్ఫిర్‌లీ" అని ప్రార్థించేవారు.

'దివ్య ఖుర్‌ఆన్ భావం నుండి స్ఫూర్తిని పొందుతూ' అంటే "నీ ప్రభువు స్తోత్రంతోపాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఇంకా మన్నింపుకై ఆయన్ని వేడుకో" అన్న దివ్య సూక్తిని పాటిస్తూ అని అర్థం.

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవప్రవక్త ﷺ తన మరణానికి ముందు ఎక్కువగా "సుబ్‌హానకల్లాహుమ్మ వబిహమ్దిక అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్" అని ప్రార్థించేవారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ఇలా అంటున్నారు: "దైవప్రవక్తా! మీరు కొన్ని వాక్యాలు పఠించడం నేను గమనిస్తున్నాను. ఆ వాక్యాలు ఏమిటి?" అని నేను అడిగాను. దానికి ఆయన "నా కొరకు నా సమాజంలో ఒక సూచన ఉంచబడింది. నేను దానిని చూసినప్పుడు ఆ వాక్యాలు చదువుతాను. (ఆ నిదర్శనం ఇది) "ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్‌హు….." (సూరా ఆఖరి వరకు).

ముస్లింలోనే ఇంకో ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవప్రవక్త ﷺ ఎక్కువగా 'సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్" అని పఠించేవారు. (హజ్రత్ ఆయిషా ఇలా అంటున్నారు) : "ఓ దైవప్రవక్తా! మీరు ఎక్కువగా "సుబ్‌హానల్లాహి, వ బిహమ్దిహీ అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్" అని చదువుతున్నారేమిటి?" అని నేనాయన్ని అడగ్గా, "నేను నా సమాజంలో ఒక సూచన చూస్తానని నా ప్రభువు నాకు తెలియజేశాడు. అది చూసినప్పుడు నేను ఆ వాక్యాలు చదవాలి. అదిగో! నేను ఆ సూచనను చూశాను" అని ఆయన ఇలా సమాధానమిచ్చారు.

"దైవ సహాయం అవతరించి, విజయం లభించినప్పుడు – అంటే మక్కా విజయభాగ్యం వరించినప్పుడు – ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు (ప్రవక్తా!) నీవు నీ ప్రభువు స్తోత్రంతోపాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా మన్నింపుకై ఆయన్ని వేడుకో! నిస్సందేహంగా ఆయన అమితంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. (అన్ నస్ర్ సూరా)

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ, అజాన్ ప్రకరణంలోనూ, యుద్ధాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

‘ Aishah (radiyallahu anha) said: After the revelation of (the Surah) “When the Help of Allah comes (to you, O Muhammad ﷺ against your enemies) and the Conquest (of Makkah)” (110:1), Messenger of Allah ﷺ used to recite in every prayer: “Subhanaka Rabbana wa bihamdika, Allahum-maghfir li (Far removed You are from every imperfection, our Rubb, and all praise is for You, forgive me, O Allah)”.[Al-Bukhari and Muslim].

Another narration is: Messenger of Allah ﷺ recited frequently in bowing and prostration: “Subhanaka Rabbana wa bihamdika, Allahum-maghfir li. (Far removed You are from every imperfection, our Rubb, and all praise is for You, forgive me, O Allah)”. He elucidated that it has been commanded in the Noble Qur’an to recite: “So glorify the Praises of your Rubb, and ask for His forgiveness. Verily, He is the One Who accepts the repentance and Who forgives”. (V.110:1) And he (the Messenger of Allah) acted upon it.

According to the narration in Muslim, Messenger of Allah ﷺ frequently recited these words just before he passed away: “Subhanaka Rabbana wa bihamdika. Astaghfiruka wa atubu ilaika.” I (`Aishah (radiyallahu anha) asked him: “O Messenger of Allah! What are these new words which I hear from you repeatedly.” He replied, “A sign has been appointed for me relating to my people that I should repeat these words at the sight of that sign”. Then he recited Surat An-Nasr.

Another narration in Muslim related from `Aishah (radiyallahu anha) is: Messenger of Allah ﷺ often recited, “Glory be to Allah and praise be to Him; I seek forgiveness of Allah and turn to Him in repentance.” I said to him: “O Messenger of Allah, I hear you recite frequently: `O Allah, You are free from every imperfection our Rubb and all praise is for You; I seek forgiveness of Allah and turn to Him in repentance.”’ He replied, “My Rubb has informed me that I would soon see a sign regarding my people, whenever I see it, I repeat this statement more often (of His Glorification and Praise and beg pardon of Him and turn to Him). Now I have witnessed the sign. The revelation of Surat An-Nasr and the victory is the conquest of Makkah.”

“When there comes the Help of Allah (to you, O Muhammad ﷺ against your enemies) and the Conquest (of Makkah). And you see that the people enter Allah’s religion (Islam) in crowds. So glorify the Praises of your Rubb, and ask His forgiveness. Verily, He is the One Who accepts the repentance and Who forgives.” (110:1-3)

ముఖ్యాంశాలు

  1. రుకూ మరియు సజ్దాల్లో 'సుబ్‌హాన రబ్బియల్ అజీం' మరియు 'సుబ్‌హాన రబ్బియల్ ఆలా'కు బదులుగా, 'సుబ్‌హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్‌లీ' అని పలకటం కూడా అభిలషణీయమే.
  2. దేవుని తరపునుంచి ఏదైనా అనుగ్రహం లభించినప్పుడు అందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..|హదీసు 114

115

హదీసు 115

الرابع: عن أنسٍ رضي اللَّهُ عنه قَالَ: إنَّ اللَّه عزَّ وجلَّ تَابعَ الوحْيَ عَلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَبْلَ وَفَاتِهِ، حتَّى تُوُفِّى أكْثَرَ مَا كَانَ الْوَحْيُ. متفقٌ عَلَيهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మరణానికి (కొంత కాలం) ముందు వరకూ ఆయనపై దేవుడు అప్పుడప్పుడూ తన వాణి (వహీ)ని అవతరింపజేసేవాడు. అయితే మరణ కాలం సమీపించినప్పుడు మాత్రం మునుపటికన్నా చాలా ఎక్కువగా ఆయనపై దైవవాణి అవతరించింది. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని 'దివ్య ఖుర్‌ఆన్ ఘనతా విశిష్ఠతల' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని వ్యాఖ్యానాల ప్రకరణం ఆరంభంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Anas (radiyallahu anhu) said: Allah the Rubb of honour and glory sent Revelation to His Messenger ﷺ more frequently before his death than at any other time.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ గారి జీవితంలోని ఆఖరి దినాల్లో ఎక్కువగా వహీ (దైవవాణి) అవతరించడం, త్వరలోనే ఆయన ఇహలోకాన్ని వీడిపోనున్నారన్న దానికి నిదర్శనం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..|హదీసు 115

116

హదీసు 116

الخامس: عن جابر رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يُبْعثُ كُلُّ عبْدٍ عَلَى مَا مَاتَ علَيْهِ" رواه مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : (ప్రళయదినాన) ప్రతి దాసుడూ, తాను మరణించిన స్థితిలోనే లేపబడతాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని "స్వర్గ" ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Every one will be raised in the condition in which he dies”.[Muslim].

ముఖ్యాంశాలు

'ఇన్నమల్ ఆమాలు బిల్ ఖవాతీమ్' (ఆచరణలు ముగింపునుబట్టి పరిగణించబడతాయి) అన్న హదీసు లాంటిదే పై హదీసు భావం కూడాను. మనిషి మంచి పనులు చేస్తూ చనిపోతే అతని పర్యవసానం కూడా బాగానే ఉంటుంది. దీనికి విరుద్ధంగా చెడుపనులు చేస్తున్నప్పుడు మరణం సంభవిస్తే దాని పర్యవసానం కూడా చెడుగానే పరిణమిస్తుంది. కాబట్టి మనిషి ఎల్లప్పుడూ ముఖ్యంగా వృద్ధాప్యంలో లేక వ్యాధిగ్రస్తుడైనప్పుడు దైవ అవిధేయతకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి. మృత్యువు ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో చెప్పలేం!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|12. చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేయమని పురికొల్పడం గురించి…..|హదీసు 116