హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 14. ఆరాధనలో మధ్యే మార్గం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 14వ అధ్యాయం: ఆరాధనలో మధ్యేమార్గం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 142 – 152) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

14. ఆరాధనలో మధ్యేమార్గం

↑ విషయ సూచిక

باب في الاقتصاد في العبادة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{طه مَا أَنْزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَى} [طه:٢]

అల్లాహ్ సెలవిచ్చాడు : మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురిచేయడానికి కాదు. (తాహ్ : 1,2)

{يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلا يُرِيدُ بِكُمُ الْعُسْرَ} [البقرة: ١٨٥]

మరొకచోట ఆయన ఇలా సెలవిచ్చాడు: "అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగజేయాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు." (అల్ బఖర : 185)

English

“Ta-Ha. We have not sent down the Qur’an unto you (O Muhammad ﷺ) to cause you distress”. [Ṭā Hā 20:1–2]

“Allah intends for you ease, and He does not want to make things difficult for you”. [Al-Baqarah 2:185]

142

హదీసు 142

وعن عائشةَ رضي اللَّهُ عنها أَن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم دخَلَ عليْها وعِنْدها امْرأَةٌ قَالَ: منْ هَذِهِ؟ قَالَتْ: هَذِهِ فُلانَة تَذْكُرُ مِنْ صَلاتِهَا قالَ: "مَهُ عليكُمْ بِما تُطِيقُون، فَوَاللَّه لاَ يَمَلُّ اللَّهُ حتَّى تَمَلُّوا وكَانَ أَحَبُّ الدِّينِ إِلَيْهِ ماداوَمَ صَاحِبُهُ علَيْهِ "متفقٌ عليه. "ومهْ"كَلِمة نَهْى وزَجْرٍ. ومَعْنى"لاَ يملُّ اللَّهُ"أي: لاَ يَقْطَعُ ثَوابَهُ عنْكُمْ وَجَزَاءَ أَعْمَالِكُمْ، ويُعَامِلُكُمْ مُعاملَةَ الْمالِّ حَتَّى تَملُّوا فَتَتْرُكُوا، فَينْبَغِي لكُمْ أَنْ تَأْخُذُوا مَا تُطِيقُونَ الدَّوَامَ علَيْهِ لَيَدُومَ ثَوَابُهُ لَكُمْ وفَضْلُه عَلَيْكُمْ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త ﷺ తన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆమె దగ్గర ఒక స్త్రీ కూర్చొని ఉంది. దైవప్రవక్త ﷺ "ఎవరీమె?' అని అడిగారు.

దానికి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) "ఒక ఆవిడ (నఫిల్) నమాజులు ఎక్కువగా చేస్తుందంటూ జనం చెప్పుకుంటున్నారే! ఈమే ఆవిడ" అని తెలిపారు. అది విని దైవప్రవక్త ﷺ "ఇక ఆపు (ఈమె పొగడ్తలు)! మీ శక్తిమేరకే పనులు చేయండి. దైవసాక్షి! దేవుడు విసుగు చెందడు. కాని ఆఖరికి మీరే విసుగెత్తిపోవచ్చు (అంటే అతి ఎక్కువగా ఆరాధనలు చేయటం వల్ల మీకు విసుగు రావచ్చేమోగాని దానిపై పుణ్యం ప్రసాదించే విషయంలో ఆయన మాత్రం విసుగుచెందడు). (దానికి బదులు) మనిషి చేసే ధర్మకార్యాలలో శాశ్వతంగా పాటించే ఆరాధనే దేవునికి అత్యంత ప్రీతికరమైనది. (బుఖారీ – ముస్లిం)

'మహ్' అనేది వారింపు, గద్దింపు కోసం వాడే శబ్దం. 'లా యమల్లుల్లాహు' అంటే దాని పుణ్యం, ప్రతిఫలం అంతం కాదు. దేవుడు మీపట్ల విసుగెత్తిపోయిన వానిలా వ్యవహరించడు. పైగా మీరే విసుగు చెంది చేస్తున్న పనిని వదలిపెట్టవచ్చు. కాబట్టి మీరు శాశ్వతంగా చేస్తూ ఉండగలిగే పనిని ఎంచుకోవడమే మంచిది. ఇలాచేస్తే దాని పుణ్యం, దాని ఘనత సదా మీకు లభిస్తూ ఉంటాయి అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని 'తహజ్జుద్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది).

English

Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ came in when a woman was sitting beside me. He asked me, “Who is she?” I said: “She is the one whose performance of Salat (prayer) has become the talk of the town.” Addressing her, he ﷺ said, “(What is this!) You are required to take upon yourselves only what you can carry out easily. By Allah, Allah does not withhold His Mercy and forgiveness of you until you neglect and give up (good works). Allah likes the deeds best which a worshipper can carry out constantly”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. శక్తికి మించిన ఆరాధన చేయడాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనిషి కొన్ని రోజుల తర్వాత దానిపై విసుగు చెంది, అసలు ఆరాధననే మానేసే ప్రమాదముంది. కనుక, ఆరాధనలు, వినయవిధేయతల్లో మధ్యేమార్గాన్ని అవలంబించడం అవసరం.
  2. దాసుడు ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా చేసే పనినే అల్లాహ్ ఎక్కువగా యిష్టపడతాడు – ఆ పని ఎంత చిన్నదైనా సరే ఎందుకంటే ఎల్లప్పుడూ చేస్తూ ఉండే ఆచరణకు పుణ్యం కూడా ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొన్ని రోజులపాటు చేసి వదలిపెట్టే పనులకు లభించే పుణ్యం కూడా అంతటితో ఆగిపోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 142

143

హదీసు 143

وعن أَنسٍ رضي اللَّه عنه قَالَ: جاءَ ثَلاثةُ رهْطِ إِلَى بُيُوتِ أَزْواجِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يسْأَلُونَ عنْ عِبَادَةِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَلَمَّا أُخبِروا كأَنَّهُمْ تَقَالَّوْها وقالُوا: أَين نَحْنُ مِنْ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَدْ غُفِر لَهُ مَا تَقَدَّم مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ. قالَ أَحَدُهُمْ: أَمَّا أَنَا فأُصلِّي اللَّيلَ أَبداً، وَقالَ الآخَرُ: وَأَنا أَصُومُ الدَّهْرَ أَبَداً وَلا أُفْطِرُ، وقالَ الآخرُ: وأَنا اعْتَزِلُ النِّساءَ فَلاَ أَتَزوَّجُ أَبداً، فَجاءَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إلَيْهمْ فَقَالَ:"أَنْتُمُ الَّذِينَ قُلْتُمْ كَذَا وكذَا؟، أَما واللَّهِ إِنِّي لأَخْشَاكُمْ للَّهِ وَأَتْقَاكُم لَهُ لكِني أَصُومُ وَأُفْطِرُ، وَأُصلِّي وَأَرْقُد، وَأَتَزَوّجُ النِّسَاءَ، فمنْ رغِب عَنْ سُنَّتِي فَلَيسَ مِنِّى" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ముగ్గురు వ్యక్తులు దైవప్రవక్త సతీమణుల ఇండ్లకు వచ్చి, దైవప్రవక్త ఆరాధన విషయమై వారిని ప్రశ్నించసాగారు. వారికి ఆయన ﷺ ఆరాధన విధానం బోధించబడింది. వారు దాన్ని తక్కువగా భావించి, "ఆయనెక్కడా? మేమెక్కడా? ఆయన వల్ల గతంలో జరిగిన పాపాలు, జరగబోయే పాపాలన్నీ క్షమించబడ్డాయి. (కనుక మేము ఆయనకంటే ఎక్కువగా ఆరాధన చేయాలి)" అని అనుకున్నారు. వారిలో ఒకడు, "ఇక నుంచి నేను ఎల్లప్పుడూ రాత్రంతా నమాజుల్లో గడుపుతాను" అని అన్నాడు. రెండవవాడు, "నేను ఇకపై ఎల్లప్పుడూ ఉపవాసముంటాను. ఉపవాసాన్ని విరమించను" అని అన్నాడు. మూడో వ్యక్తి, "నేనైతే స్త్రీలకు దూరంగా ఉంటాను. ఎన్నటికీ వివాహం చేసుకోను" అని ప్రతిన బూనాడు.

(వారి మాటల గురించి తెలుసుకొని) దైవప్రవక్త ﷺ వారివద్దకు వెళ్ళి, "మీరు ఇలా అన్నారా?" అని ప్రశ్నించారు. (వారు అవునని సమాధానమివ్వగా) ఆయన, "జాగ్రత్త! దైవసాక్షి! నేను మీ అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడేవాడ్ని, అందరికంటే ఎక్కువగా ఆయనపట్ల భీతిగలవాడ్ని. కాని నేను ఉపవాసాలూ ఉంటాను, (అప్పుడప్పుడూ) వాటిని వదలుతాను కూడా. (రాత్రి పూట) నమాజూ చేస్తాను. పడుకుంటాను కూడా. ఇంకా నేను స్త్రీలను వివాహం కూడా చేసుకుంటాను. (కనుక ఈ పనులన్నీ నా సంప్రదాయాలే). ఎవడైతే నా విధానం పట్ల విముఖత చూపుతాడో అతడు నా వాడు కాదు (అంటే నాకు అతనితో ఎలాంటి సంబంధం లేదు)" అని హెచ్చరించారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని 'నికాహ్' ప్రకరణంలో, ఇంకా సహీహ్ ముస్లింలోని 'నికాహ్' ప్రకరణంలో కూడా ఈ హదీసు పొందుపరచబడి ఉంది).

English

Anas (radiyallahu anhu) reported: Three men came to the houses of the wives of the Prophet ﷺ to inquire about the worship of the Prophet ﷺ. When they were informed, they considered their worship insignificant and said: “Where are we in comparison with the Prophet ﷺ while Allah has forgiven his past sins and future sins”. One of them said: “As for me, I shall offer Salat all night long.” Another said: “I shall observe Saum (fasting) continuously and shall not break it”. Another said: “I shall abstain from women and shall never marry”. The Prophet ﷺ came to them and said, “Are you the people who said such and such things? By Allah, I fear Allah more than you do, and I am most obedient and dutiful among you to Him, but still I observe fast and break it; perform Salat and sleep at night and take wives. So whoever turns away from my Sunnah does not belong to me”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో ఆరాధనలో మధ్యేమార్గాన్ని అనుసరించాలని బోధించబడింది. మనిషి నికాహ్ (వివాహం) చేసుకోవాలని, దైవప్రవక్త జీవన విధానాన్ని అనుసరించాలని పురికొల్పడం జరిగింది. అంతేకాదు, ఎల్లప్పుడూ ఉపవాసాలుండటం, నిత్యం రాత్రిళ్ళు పడుకోకుండా జాగారం చేసి ఆరాధనలు చేయడం అవాంఛనీయమైనదని కూడా చెప్పబడింది.
  2. ధర్మంలో కొత్తపోకడలను సృష్టించుకోవడం వల్ల ఒరిగే మేలు ఏమీ లేదు. దానివల్ల ఎలాంటి పుణ్యమూ లభించదు. పైగా అది వినాశానికి దారితీస్తుంది. వాస్తవానికి శుభశ్రేయాలు, పుణ్య ఫలాలన్నీ కేవలం దైవప్రవక్త ﷺ విధానంలోనే ఇమిడి ఉన్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 143

144

హదీసు 144

وعن ابن مسعودٍ رضي اللَّه عنه أن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "هَلَكَ الْمُتَنَطِّعُونَ" قالَهَا ثَلاثاً، رواه مسلم. "الْمُتَنطِّعُونَ": الْمُتعمِّقونَ الْمُشَدِّدُون فِي غَيْرِ موْضَعِ التَّشْدِيدِ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: "ధర్మంలో తమకు తాముగా కాఠిన్యతను సృష్టించుకున్నవారు నాశనమయిపోయారు". ఆయన ఇదేమాట మూడుసార్లు అన్నారు.

(ముస్లిం)

'ముతనత్తివూన్' అంటే షరీఅత్‌లో కాఠిన్యత లేనిచోట కాఠిన్యతను ప్రదర్శించటం, అనవసరంగా కూపీలు లాగటం అని భావం.

(సహీహ్ ముస్లింలోని విద్యా ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Ruined are those who insist on hardship in matters of the Faith.” He repeated this three times.[Muslim]

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా వేదాంతికులు (అహ్లె తసవ్వుఫ్) తమకు తాముగా సృష్టించుకున్న కఠోరమైన ఆరాధనాభ్యాసాలు, కసరత్తులన్నీ అవాంఛనీయమైనవని తెలుస్తోంది. అలాంటి ఆరాధనా పద్ధతులన్నీ దైవప్రవక్త విధానానికి భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా ఈ హదీసు ధార్మిక విషయాల్లో అనవసరంగా లోతుల్లోకి పోయేవారికి, వెంట్రుక తోలు ఒలవడానికి ప్రయత్నించేవారికి కూడా వర్తిస్తుంది. దైవప్రవక్త సంప్రదాయాన్ని పాటించనివారు, ఆయన పట్ల విధేయత కనబరచని సందేహాల స్వాములే సాధారణంగా ఇలాంటి పనులు చేస్తుంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 144

145

హదీసు 145

عن أَبِي هريرة رضي اللَّه عنه النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: " إِنَّ الدِّينَ يُسْرٌ، ولنْ يشادَّ الدِّينُ إلاَّ غَلَبه فسدِّدُوا وقَارِبُوا وَأَبْشِرُوا، واسْتعِينُوا بِالْغدْوةِ والرَّوْحةِ وشَيْءٍ مِن الدُّلْجةِ "رواه البخاري. وفي رواية لَهُ"سدِّدُوا وقَارِبُوا واغْدوا ورُوحُوا، وشَيْء مِنَ الدُّلْجةِ، الْقَصْد الْقصْد تَبْلُغُوا". قوله:"الدِّينُ"هُو مرْفُوعٌ عَلَى مَا لَمْ يُسَمَّ فَاعِلُهُ. وروِي مَنْصُوباً، وروِيَ: "لَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ"وقوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إِلاَّ غَلَبَهُ": أَيْ: غَلَبَه الدِّينُ وَعَجزَ ذلكَ الْمُشَادُّ عنْ مُقَاومَةِ الدِّينِ لِكَثْرةِ طُرقِهِ."والْغَدْوةُ"سيْرُ أَوَّلِ النَّهَارِ."وَالرَّوْحةُ": آخِرُ النَّهَارِ"والدُّلْجَةُ": آخِرُ اللَّيْلِ. وَهَذا استَعارةٌ، وتَمْثِيلٌ، ومعْناهُ: اسْتَعِينُوا عَلَى طَاعةِ اللَّهِ عز وجلَّ بالأَعْمالِ فِي وقْتِ نشاطِكُمْ، وفَراغِ قُلُوبِكُمْ بحيثُ تًسْتلذُّونَ الْعِبادَةَ ولا تسأَمُونَ وتبلُغُونَ مقْصُودَكُمْ، كَما أَنَّ الْمُسافِرَ الْحاذِقَ يَسيرُ في هَذهِ الأَوْقَاتِ وَيستَريِحُ هُو ودابَّتُهُ فِي غَيْرِهَا، فيصِلُ الْمقْصُود بِغَيْرِ تَعبٍ، واللَّهُ أَعلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : నిస్సందేహంగా ధర్మం సులువైనది. ఎవడైనా ధర్మావలంబనలో అనవసరంగా కాఠిన్యాన్ని కోరితెచ్చుకుంటే ధర్మమే అతనిపై ఆధిక్యతను సాధిస్తుంది (అంటే అలాంటి వ్యక్తి తాను సృష్టించుకున్న కాఠిన్యాన్ని భరించలేక ధర్మాన్ని ఆచరించడమే వదలిపెడతాడు). కనుక మీరు సన్మార్గంపై నడవండి. మధ్యేమార్గాన్ని అనుసరించండి. మీ ప్రభువు తరపునుండి లభించే పుణ్యానికి సంబరపడండి. ఉదయం, సాయంత్రం ఇంకా రాత్రిపూట కొంతసేపు (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి. (బుఖారీ)

బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : సన్మార్గంపై నడవండి. మధ్యేమార్గాన్ని అనుసరించండి. ఇంకా ఉదయం, సాయంత్రం మరియు రాత్రిపూట కొంతసేపు (ఆరాధనకై) వెళ్ళండి! మధ్యేమార్గాన్ని అనుసరించండి! మీరు గమ్యానికి చేరుకుంటారు.

"అద్దీను" కర్త పేర్కొనబడని కర్మ అయినందువల్ల ఇక్కడ ఇది ఉకారాంతం. అయితే ఈ పదం అకారాం తంగా కూడా ఉల్లేఖించబడింది. 'ఇల్లా గలబహూ' అంటే ధర్మం అతనిపై ఆధిక్యత వహిస్తుంది. ధర్మంలో పలు విభాగాలు, మార్గాలు ఉన్నందువల్ల అనవసరంగా కఠోరాన్ని ప్రదర్శించేవాడు ధర్మావశ్యమైన పనులను నిర్వర్తించలేక లొంగిపోతాడు. 'ఘద్వా' అంటే తొలి పగటివేళ నడవటం. 'రౌహ్' అంటే పగలు చివరి భాగంలో నడవటం. 'దుల్‌జా' అంటే రాత్రి ఆఖరి ఘడియలు. ఇదో ఉపమానం, ఉదాహరణ. దీని భావం ఏమిటంటే, మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు, (ఏ చీకూ చింతా లేకుండా) మీ హృదయాలు నిమ్మళంగా ఉన్నప్పుడే మీరు మంచి పనులు చేసుకొని దైవవిధేయతకు కట్టుబడి ఉండటం కోసం సహాయాన్ని అర్థించండి. అలాచేస్తే మీరు ఆరాధనలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆరాధనలో విసుగుచెందరు. లక్ష్యానికి చేరుకుంటారు. అనుభవంగల ఒక బాటసారి చేసినట్లు – అతను పైన పేర్కొనబడిన వేళల్లోనే ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మిగతా వేళల్లో తనూ విశ్రాంతి తీసుకుంటాడు. ఇంకా తన జంతువు (వాహనాని)కి కూడా విశ్రాంతి తీసుకోనిస్తాడు. ఆ విధంగా అతను అలుపూసొలుపూ లేకుండా (నిక్షేపంగా) గమ్యానికి చేరుకుంటాడు. – వల్లాహు ఆలము –

(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణంలోనూ, ఇంకా ప్రేమైక వచనాల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The religion (of Islam) is easy, and whoever makes the religion a rigour, it will overpower him. So, follow a middle course (in worship); if you can’t do this, do something near to it and give glad tidings and seek help (of Allah) at morn and at dusk and some part of night”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మధ్యేమార్గాన్ని అనుసరించమని చెప్పడంతో పాటు మనిషి ఆరాధనల కోసం తాజాగా, ఉత్సాహంగా ఉండే వేళల్ని ఎంచుకోవాలని చెప్పబడింది. దానివల్ల అతను దైవారాధనలో కమ్మటి అనుభూతిని, హాయిని ఆస్వాదించగలడు. అయితే ఇలా వేళల్ని నిర్ణయించుకోవడం అన్నది ఒక్క నఫిల్ ఆరాధనలకోసమే సుమా! ఫర్జ్ ఆరాధనల్ని షరీఅత్ నిర్ధారించిన వేళల్లోనే చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 145

146

హదీసు 146

وعن أَنسٍ رضي اللَّهُ عنه قَالَ: دَخَلَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الْمسْجِدَ فَإِذَا حبْلٌ مَمْدُودٌ بَيْنَ السَّارِيَتَيْنِ فقالَ:"مَا هَذَا الْحبْلُ؟ قالُوا، هَذا حبْلٌ لِزَيْنَبَ فَإِذَا فَترَتْ تَعَلَقَتْ بِهِ فَقَالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "حُلّوهُ، لِيُصَلِّ أَحدُكُمْ نَشَاطَهُ، فَإِذا فَترَ فَلْيرْقُدْ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ మస్జిద్‌లోకి ప్రవేశించగా అక్కడ రెండు నిట్టాడుల మధ్య ఒక పొడువాటి త్రాడు కట్టి ఉండటం ఆయనకు కనిపించింది. అది చూసి ఆయన "ఈ త్రాడు ఏమిటీ?" అని అడిగారు. అక్కడున్న వారు "ఈ త్రాడు జైనబ్ (రదియల్లాహు అన్హా) గారిది. ఆమె (నించొని ఆరాధనచేస్తూ) అలసిపోయినప్పుడు (అలసటను) దూరం చేయటానికి దీని ఆధారంగా వ్రేలాడతారు" అని ఆయనకు తెలియ జేశారు. అది విని ఆయన ﷺ, "దాన్ని విప్పదీయండి. మీలో ఎవరైనా సరే, ఉత్సాహంగా ఉన్నప్పుడే నమాజు చేయండి. అలసట అనిపిస్తే పడుకోండి" అని ఆదేశించారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ came into the mosque and noticed a rope stretched between two poles. He enquired, “What is this rope for?” He was told: “This is Zainab’s rope. When during her voluntary prayer, she begins to feel tired, she grasps it for support”. The Prophet ﷺ said, “Untie it. You should perform prayers so long as you feel active. When you feel tired, you should go to sleep”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో కూడా ఆరాధన పేరుతో తమ ఆత్మలను ఒత్తిడికి లోనుచేసుకోవటం, నమాజు చేస్తున్నప్పుడు ఏ వస్తువునైనా ఊతంగా చేసుకొని నిలబడటం లాంటి చేష్టలు చేయరాదని చెప్పబడింది.
  2. కళ్లముందు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు చేత్తో దాన్ని ఆపగలిగే శక్తి గనక ఉంటే, వెంటనే దానిని ఆపటానికి ప్రయత్నించాలి.
  3. ఆరాధనల్లో మధ్యేమార్గాన్ని అనుసరించాలి. ఓపిక, ఉత్సాహం ఉన్నప్పుడే ఆరాధన చేయటానికి పూనుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 146

147

హదీసు 147

وعن عائشة رضي اللَّه عنها أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا نَعَسَ أَحدُكُمْ وَهُوَ يُصَلِّي، فَلْيَرْقُدْ حَتَّى يَذْهَبَ عَنْهُ النَّوْمُ، فإِن أَحدَكم إِذَا صلَّى وهُو نَاعَسٌ لا يَدْرِي لعلَّهُ يذهَبُ يسْتَغْفِرُ فيَسُبُّ نَفْسَهُ ". متفقٌ عليه.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియ జేశారు : మీలో ఎవరికైనా నమాజు చేస్తున్న సమయంలో కునికిపాటు వస్తే అతను (నమాజును వదిలిపెట్టి) నిద్ర దూరమయ్యేవరకూ పడుకోవాలి. ఎందుకంటే అలా కునికిపాట్లు పడుతూ నమాజు చేస్తున్నప్పుడు అతను మన్నింపు కోసం వేడుకోబోయి తన్ను తానే దూషించుకోవచ్చు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “When one of you feels drowsy during prayer, let him lie down till drowsiness goes away from him, because when one of you performs prayers while feeling sleepy, he does not know whether he seeks forgiveness or abuses himself”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

కునుకు తీస్తూ నమాజు చేసే వ్యక్తి, "ఓ దేవా! నన్ను క్షమించు" అని అనబోయి నిద్రలో "ఓ దేవా! నన్ను క్షమించకు" అని కూడా నోరుజారే ప్రమాదముంది. అందుకే నిద్ర ముంచుకొస్తున్నప్పుడు నమాజు చేయడం ఆపి ముందు ఆ కునికిపాట్లు దూరమయ్యే వరకు పడుకోవాలని ఆదేశించబడింది. సాధారణంగా ఈ ఆదేశం నఫిల్ నమాజులకే వర్తిస్తుంది. ఎందుకంటే ఫర్జ్ నమాజులలో రకాతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాక, ఫర్జ్ నమాజును వీలైనంత తొందరగా ముగించాలని ఇమామ్‌కు తాకీదు చేయబడింది. కనుక ఫర్జ్ నమాజుల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం అరుదు. అంటే ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో చెప్పబడినట్లుగా మనసు ఉత్సాహంగా, దైవభక్తిలో లగ్నమై ఉన్నప్పుడే ఆరాధన చేయాలనేదే ఈ హదీసు భావం కూడాను.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 147

148

హదీసు 148

وعن أَبِي عبد اللَّه جابر بن سمُرَةَ رضي اللَّهُ عنهما قَالَ:" كُنْتُ أُصَلِّي مَعَ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الصَّلَوَاتِ، فَكَانَتْ صلاتُهُ قَصداً وخُطْبَتُه قَصْداً"رواه مسلم. قولُهُ: قَصْداً: أَيْ بَيْنَ الطُّولِ وَالْقِصَرِ.

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ సమురా (రదియల్లాహు అన్హుమా) కథనం : నేను దైవప్రవక్త ﷺ వెంట (ఆయన సారథ్యంలో) నమాజు చేసేవాడిని. ఆయన నమాజు మధ్యస్థంగా ఉండేది. ఇంకా ఆయన ప్రసంగం కూడా మధ్యస్థంగా ఉండేది. (ముస్లిం)

'ఖస్దన్' అంటే సుదీర్ఘానికి, సంక్షిప్తానికి మధ్యస్థమైనదని భావం.

(సహీహ్ ముస్లింలోని 'జుమా' ప్రకరణం)

English

Jabir bin Samurah (radiyallahu anhu) reported: I used to perform prayer with the Prophet ﷺ and his Salat was of a moderate length and his Khutbah too was moderate in length.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా సామూహికంగా చేసే నమాజులో ఇమామ్ సుదీర్ఘ పారాయణం చేయటం, అదేవిధంగా జుమా మరియు పండుగ సందర్భాల్లో సుదీర్ఘ ఉపన్యాసాలివ్వడం ప్రవక్త విధానానికి విరుద్ధమని తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 148

149

హదీసు 149

وعن أَبِي جُحَيْفَةَ وَهبِ بْنِ عبد اللَّه رضي اللَّهُ عنه قَالَ: آخَى النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَيْن سَلْمَانَ وأَبِي الدَّرْدَاءِ، فَزَارَ سلْمَانُ أَبَا الدَّرْدَاءِ، فَرَأَى أُمَّ الدَّرْدَاء مُتَبَذِّلَةً فقالَ: مَا شَأْنُكِ؟ قالَتْ: أَخْوكَ أَبُو الدَّرداءِ ليْسَ لَهُ حَاجةٌ فِي الدُّنْيَا. فَجَاءَ أَبُو الدرْدَاءِ فَصَنَعَ لَه طَعَاماً، فقالَ لَهُ: كُلْ فَإِنِّي صَائِمٌ، قالَ: مَا أَنا بآكلٍ حَتَّى تأْكلَ، فَأَكَلَ، فَلَّمَا كانَ اللَّيْلُ ذَهَبَ أَبُو الدَّرْداءِ يقُوم فَقَالَ لَه: نَمْ فَنَام، ثُمَّ ذَهَبَ يَقُوم فقالَ لَه: نَمْ، فَلَمَّا كَانَ من آخرِ اللَّيْلِ قالَ سلْمانُ: قُم الآنَ، فَصَلَّيَا جَمِيعاً، فقالَ لَهُ سَلْمَانُ: إِنَّ لرَبِّكَ عَلَيْكَ حَقًّا، وَإِنَّ لنَفْسِكَ عَلَيْكَ حَقّاً، ولأهلِك عَلَيْكَ حَقًّا، فَأَعْطِ كُلَّ ذِي حَقٍّ حَقَّه، فَأَتَى النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَذَكر ذلكَ لَه، فقالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "صَدَقَ سلْمَانُ" رواه البخاري.

హజ్రత్ అబూ జుహైఫా వహబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ సల్మాన్ (రదియల్లాహు అన్హు)కు మరియు అబూ దర్దా (రదియల్లాహు అన్హు)కు మధ్య (హిజ్రత్ అనంతరం) సోదరత్వాన్ని ఏర్పరచారు. సల్మాన్ (రదియల్లాహు అన్హు) (ఒక రోజు తన ఇస్లామీయ సోదరుడు) అబూ దర్దాను కలవటం కోసం (ఆయన ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆయన (అబూ దర్దాగారి భార్య) ఉమ్మె దర్దా (ర.అన్‌హా) మురికిగా ఉన్న బట్టలు తొడుక్కొని ఉండటం గమనించారు. అది చూసి ఆయన కుశల ప్రశ్నలువేస్తూ "ఏమిటి మీరు ఇలాగైపోయారు?" అని అడిగారు. అందుకు ఆమె "మీ సోదరుడు అబూ దర్దాకు ఈ ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు" అని (బాధపడుతూ) అన్నారు. (అంతలోనే) అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కూడా వచ్చేశారు. తన సోదరుడు సల్మాన్ (రదియల్లాహు అన్హు) కోసం అన్నం వండించారు. (భోజనం వడ్డించిన తరువాత) ఆయనతో "మీరు తినండి, నేను ఉపవాసమున్నాను" అన్నారు. దానికి సల్మాన్ (రదియల్లాహు అన్హు) "మీరు (నాతోపాటు) తిననంతవరకు నేనూ తినను" అన్నారు. అప్పుడు ఆయన కూడా (తన నఫిల్ ఉపవాసాన్ని విరమించుకొని ఆయనతోపాటు కూర్చొని) భోజనం చేశారు.

రాత్రి అయిన తరువాత అబూ దర్దా (రదియల్లాహు అన్హు) నఫిల్ నమాజులు చేయటానికి ఉపక్రమించారు. అప్పుడు సల్మాన్ (రదియల్లాహు అన్హు) "(ముందు) పడుకో (తరువాత లేచి నమాజు చేసుకోవచ్చు)" అని అన్నారు. దాని ప్రకారమే అబూదర్దా (రదియల్లాహు అన్హు) నిద్రపోయారు. కొంతసేపటికి నిద్రనుండి మేల్కొని తిరిగి నఫిల్ నమాజులు చేయటం ప్రారంభించారు. సల్మాన్ (రదియల్లాహు అన్హు) (అప్పుడు కూడా ఆయన్ని ఆపి) "ఇంకాస్సేపు నిద్రపో" అన్నారు. ఆ తరువాత రాత్రి ఆఖరి సమయం రాగానే సల్మాన్ (రదియల్లాహు అన్హు) (మేల్కొని) ఆయనతో "ఇప్పుడు లేచి నమాజు చెయ్యి" అన్నారు. ఇద్దరూ కలసి నమాజు చేశారు. (నమాజు ముగించుకున్న తరువాత) ఆయన అబూదర్దా (రదియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు:

నిస్సందేహంగా నీపై నీ ప్రభువు హక్కు ఉంది (నిజమే!). కాని నీపై నీ ప్రాణానికి కూడా హక్కు ఉంది. నీ ఇంటివారికి (భార్యాపిల్లలకు)కూడా హక్కు ఉంది. కనుక ప్రతి హక్కుదారుని హక్కునూ నెరవేర్చు!

తరువాత సల్మాన్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ సన్నిధిలో హాజరై జరిగినదంతా ఆయనకు వివరించారు. అది విని దైవప్రవక్త ﷺ "సల్మాన్ నిజం పలికాడు" అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణంలోనూ, ఇంకా సంస్కార ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Abu Juhaifah (radiyallahu anhu) reported: The Prophet ﷺ made a bond of brotherhood between Salman and Abud-Darda’. Salman paid a visit to Abud-Darda’ and found Umm Darda’ (his wife) dressed in shabby clothes and asked her why she was in that state. She replied: “Your brother Abud-Darda’ is not interested in (the luxuries of) this world. In the meantime Abud-Darda’ came in and prepared a meal for Salman. Salman requested Abud-Darda’ to eat (with him) but Abud-Darda’ said: “I am fasting.” Salman said: “I am not going to eat unless you eat.” So, Abud-Darda’ ate (with Salman). When it was night and (a part of the night passed), Abud-Darda’ got up (to offer the night prayer) but Salman asked him to sleep and Abud-Darda’ slept. After some time Abud-Darda’ again got up but Salman asked him to sleep. When it was the last hours of the night, Salman asked him to get up and both of them offered (Tahajjud) prayer. Then Salman told Abud-Darda’: “You owe a duty to your Rubb, you owe a duty to your body; you owe a duty to your family; so you should give to every one his due. Abud-Darda’ came to the Prophet ﷺ and reported the whole story. Prophet ﷺ said, “Salman is right”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. రాత్రిపూట నిద్రనుండి మేల్కొని నమాజు చేయటం దైవానికి ఎంతో ప్రీతికరమైన ఆచరణే అయినప్పటికీ, దానివల్ల ఇతరుల హక్కులకు భంగం కలిగితే మాత్రం అది అవాంఛనీయమైనదిగా ఖరారు చేయబడుతుంది.
  2. రాత్రి నమాజు (అంటే తహజ్జుద్)కు సరైన సమయం రాత్రి చివరి మూడవ భాగం. కనుక రాత్రిపూట తొలి రెండు భాగాల్లో మనిషి నిద్రపోవటం, దాంపత్య హక్కులను నెరవేర్చటం వంటివి చేసుకోవాలి.
  3. నఫిల్ ఉపవాసాలను అవసరమనుకుంటే విరమించుకోవచ్చు. వాటికి ఖజా లేదు.
  4. ధర్మం ప్రాతిపదికపై పరస్పరం సోదర సంబంధాన్ని ఏర్పరచటం, ఆ తరువాత ఆ ఇస్లామీయ సోదరులు ఒకరినొకరు కలనుకోవటం కోసం ఇండ్లకు వెళ్ళడం ధర్మసమ్మతమే.
  5. ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తిని సరైన మార్గంలో నడిపించటానికి ప్రయత్నించాలి.
  6. అనివార్య పరిస్థితుల్లో అపరిచిత స్త్రీతో మాట్లాడటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 149

150

హదీసు 150

وعن أَبِي محمد عبدِ اللَّهِ بنِ عَمْرو بنِ العاص رضي اللَّه عنهماقال: أُخْبرَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنِّي أَقُول: وَاللَّهِ لأَصومَنَّ النَّهَارَ، ولأَقُومنَّ اللَّيْلَ مَا عشْتُ، فَقَالَ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَنْتَ الَّذِي تَقُول ذلِكَ؟ فَقُلْت لَهُ: قَدْ قُلتُه بأَبِي أَنْتَ وأُمِّي يَا رسولَ اللَّه. قَالَ:"فَإِنكَ لاَ تَسْتَطِيعُ ذلِكَ، فَصُمْ وأَفْطرْ، ونَمْ وَقُمْ، وَصُمْ مِنَ الشَّهْرِ ثَلاثَةَ أَيَّامٍ فَإِنَّ الْحسنَةَ بعَشْرِ أَمْثَالهَا، وذلكَ مثْلُ صِيامٍ الدَّهْرِ قُلْت: فَإِنِّي أُطيق أفْضَلَ منْ ذلكَ قالَ: فَصمْ يَوْماً وَأَفْطرْ يَوْمَيْنِ، قُلْت: فَإِنِّي أُطُيق أفْضَلَ مِنْ ذلكَ، قَالَ:"فَصُم يَوْماً وَأَفْطرْ يوْماً، فَذلكَ صِيَام دَاوود صلى الله عليه وسلم، وَهُو أَعْدَل الصِّيَامِ ". وَفي رواية: "هوَ أَفْضَلُ الصِّيامِ "فَقُلْتُ فَإِنِّي أُطِيقُ أَفْضَلَ مِنْ ذلكَ، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا أَفْضَلَ منْ ذلِكَ" وَلأنْ أَكْونَ قَبلْتُ الثَّلاثَةَ الأَيَّامِ الَّتِي قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَحَبُّ إِليَّ منْ أَهْلِي وَمَالِى. وفي روايةٍ: "أَلَمْ أُخْبَرْ أَنَّكَ تَصومُ النَّهَارَ وتَقُومُ اللَّيْلَ؟ "قُلْتُ: بلَى يَا رَسُول اللَّهِ. قَالَ:"فَلا تَفْعل: صُمْ وأَفْطرْ، ونَمْ وقُمْ فَإِنَّ لجَسَدكَ علَيْكَ حَقّاً، وإِنَّ لعيْنَيْكَ عَلَيْكَ حَقًّا وَإِنَّ لزَوْجِكَ علَيْكَ حَقًّا، وَإِنَّ لزَوْركَ عَلَيْكَ حَقًّا، وإِنَّ بحَسْبكَ أَنْ تَصْومَ فِي كُلِّ شَهْرٍ ثَلاثَةَ أَيَّامٍ، فَإِنَّ لَكَ بِكُلِّ حَسَنةٍ عشْرَ أَمْثَالِهَا، فَإِن ذلِكَ صِيَامُ الدَّهْرِ"فشَدَّدْتُ فَشُدِّدَ عَلَيَّ، قُلْتُ: يَا رَسُول اللَّه إِنّي أَجِدُ قُوَّةً، قَالَ:"صُمْ صِيَامَ نَبِيِّ اللَّهِ داوُدَ وَلا تَزدْ عَلَيْهِ"قُلْتُ: وَمَا كَان صِيَامُ داودَ؟ قَالَ:"نِصْفُ الدهْرِ "فَكَان عَبْدُ اللَّهِ يقول بعْد مَا كَبِر: يالَيْتَنِي قَبِلْتُ رُخْصةَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. وفي رواية: "أَلَمْ أُخْبَرْ أَنَّك تصُومُ الدَّهْرِ، وَتْقَرَأُ الْقُرْآنَ كُلَّ لَيْلَة؟ "فَقُلْتُ: بَلَى يَا رسولَ اللَّهِ، ولَمْ أُرِدْ بذلِكَ إِلاَّ الْخيْرَ، قَالَ:"فَصُمْ صَوْمَ نَبِيِّ اللَّهِ داودَ، فَإِنَّه كَانَ أَعْبَدَ النَّاسِ، واقْرأْ الْقُرْآنَ في كُلِّ شَهْرٍ"قُلْت: يَا نَبِيِّ اللَّهِ إِنِّي أُطِيق أَفْضل مِنْ ذلِكَ؟ قَالَ:"فَاقْرَأه فِي كُلِّ عِشرِينَ"قُلْت: يَا نبيِّ اللَّهِ إِنِّي أُطِيق أَفْضَل مِنْ ذَلِكَ؟ قَالَ:"فَاقْرَأْهُ فِي كُلِّ عَشْر"قُلْت: يَا نَبِيَّ اللَّهِ إِنِّي أُطِيق أَفْضلَ مِنْ ذلِكَ؟ قَالَ:"فَاقْرَأْه في كُلِّ سَبْعٍ وَلاَ تَزِدْ عَلَى ذَلِكَ"فَشَدَّدْتُ فَشُدِّدَ عَلَيَّ، وقَالَ لِي النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إِنَّكَ لاَ تَدْرِي لَعلَّكَ يَطُول بِكَ عُمُرٌ قالَ: فَصِرْت إِلَى الَّذِي قَالَ لِي النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَلَمَّا كَبِرْتُ وَدِدْتُ أنِّي كُنْتُ قَبِلْت رخْصَةَ نَبِيِّ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. وفي رواية:"وَإِنَّ لوَلَدِكَ علَيْكَ حَقًّا"وفي روايةٍ: لاَ صَامَ مَنْ صَامَ الأَبَدَ"ثَلاثاً. وفي روايةٍ: "أَحَبُّ الصَّيَامِ إِلَى اللَّه تَعَالَى صِيَامُ دَاوُدَ، وَأَحَبُّ الصَّلاةِ إِلَى اللَّهِ تَعَالَى صَلاةُ دَاوُدَ: كَانَ يَنَامُ نِصْفَ اللَّيلِ، وَيَقُومُ ثُلُثَهُ، وَيَنَامُ سُدُسَهُ، وَكَانَ يَصُومُ يوْماً ويُفْطِرُ يَوْماً، وَلا يَفِرُّ إِذَا لاقَى". وفي رواية قَالَ: أَنْكَحَنِي أَبِي امْرَأَةً ذَاتَ حسَبٍ، وكَانَ يَتَعَاهَدُ كَنَّتهُ أي: امْرَأَة ولَدِهِ فَيسْأَلُهَا عَنْ بَعْلِهَا، فَتَقُولُ لَهُ: نِعْمَ الرَّجْلُ مِنْ رجُل لَمْ يَطَأْ لنَا فِرَاشاً ولَمْ يُفتِّشْ لنَا كَنَفاً مُنْذُ أَتَيْنَاهُ فَلَمَّا طالَ ذَلِكَ عَلَيهِ ذكَرَ ذلِكَ لِلنَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فقَالَ: "الْقَني بِهِ" فلَقيتُهُ بَعْدَ ذلكَ فَقَالَ: "كيفَ تَصُومُ؟ "قُلْتُ كُلَّ يَوْم، قَالَ:"وَكيْفَ تَخْتِم؟ "قلتُ: كُلَّ لَيلة، وذَكَر نَحْوَ مَا سَبَق وكَان يقْرَأُ عَلَى بعْض أَهْلِه السُّبُعَ الَّذِي يقْرؤهُ، يعْرضُهُ مِن النَّهَارِ لِيكُون أَخفَّ علَيِهِ بِاللَّيْل، وَإِذَا أَراد أَنْ يَتَقَوَّى أَفْطَر أَيَّاماً وَأَحصَى وصَام مِثْلَهُنَّ كَراهِيةَ أَن يتْرُك شَيئاً فارقَ علَيهِ النَّبِي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. كُلُّ هذِه الرِّوَايات صحيِحةٌ مُعْظَمُهَا فِي الصَّحيحيْنَ وقليلٌ منْهَا في أَحَدِهِما.

హజ్రత్ అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం : "దైవసాక్షి! నేను జీవితాంతం పగలంతా ఉపవాసముంటూ రాత్రంతా నమాజులు చేయటంలో గడుపుతూ ఉంటాను" అని నేను శపథం చేసినట్టు దైవప్రవక్త ﷺకు ఎవరో తెలియ జేశారు. అప్పుడు ఆయన ﷺ, "నువ్విలా శపథం చేశావా?" అని నన్ను అడిగారు. దానికి నేను, "నా తల్లి దండ్రులు మీకోసం అర్పితమవుగాక! నేను ఆ విధంగా శపథం చేసిన మాట నిజమే" అని అన్నాను. దానికి ఆయన "ఈ పని చేసే శక్తి నిలో లేదు. కనుక నీవు కొన్నాళ్ళపాటు ఉపవాసాలు ఉండి, మరికొన్ని రోజులపాటు వాటిని వదిలెయ్యి. అదేవిధంగా (రాత్రిపూట) కొంతసేపు పడుకొని (ఆ తరువాత) నమాజు చెయ్యి. ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించు (చాలు). ఒక్క సత్కార్యానికి పదిరెట్లు పుణ్యం లభిస్తుంది కాబట్టి (మూడు రోజుల ఉపవాసానికి ముప్ఫై రోజులు ఉపవాసాలు పాటించినంత పుణ్యం లభిస్తుంది). ఆ లెక్కన నీవు పాటించే (మూడు దినాల ఉపవాస) ఆచరణతో నీవు ఎల్లకాలం ఉపవాసాలు పాటించినట్లవుతుంది" అని నాకు హితబోధ చేశారు.

ఈ హితవు విని నేను "నాకు ఇంతకంటే ఎక్కువ శక్తి ఉంది" అన్నాను. దానికి ఆయన ﷺ, "అయితే ఒకరోజు ఉపవాసం ఉండి, ఆ తరువాత రెండు రోజులు మానెయ్యి" అని అన్నారు. "నాకు అంతకంటే కూడా ఎక్కువ శక్తి ఉంది" అని నేను మళ్ళీ అన్నాను. "మరయితే నీవు ఒకరోజు ఉపవాసం పాటించి తరువాత ఒకరోజు మానేస్తూ ఉండు. ఇది హజ్రత్ దావూద్ (అలైహి) పాటించే ఉపవాస విధానం. ఇంకా ఇది ఉపవాసాలు పాటించే పద్ధతుల్లో అన్నిటికన్నా ఉత్తమమైనది మరియు సమంజసమైనదీను" అన్నారు దైవప్రవక్త ﷺ.

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : "ఉపవాసాలు పాటించే అతి శ్రేష్ఠమైన విధానం ఇదే" అని దైవప్రవక్త ﷺ అన్నారు. "నేను ఇంతకన్నా ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాను" అని విన్నవించుకోగా ఆయన "దీనికన్నా ఉత్తమమైన పద్ధతి మరొకటి లేనేలేదు" అన్నారు. (హదీసు ఉల్లేఖకులు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా తెలియజేస్తున్నారు) : "నెలకు మూడు రోజులు ఉపవాసాలుంటే చాలని దైవప్రవక్త ﷺ చేసిన సూచనను నేను ఒప్పుకుని ఉంటే అది నాకు నా భార్యాపిల్లలు, సిరిసంపదలకన్నా ప్రీతికరంగా ఉండేది" (అని వృద్ధాప్యం వచ్చిన తరువాత నాకు అర్థమయింది)."

మరొక ఉల్లేఖనం ప్రకారం : "నీవు (ప్రతిరోజూ) పగలంతా ఉపవాసముండి, రాత్రంతా నఫిల్ నమాజులు చేస్తున్నావట, నిజమేనా?" అని నన్ను దైవప్రవక్త ﷺ అడిగారు. దానికి నేను "(మీరు విన్నది) నిజమే దైవప్రవక్తా! కాని అలా చేయటంలో నాకు మంచి ఉద్దేశ్యమే తప్ప మరో (చెడు) ఉద్దేశ్యం లేదు" అని అన్నాను. అందుకు ఆయన ﷺ, "నీవు దైవప్రవక్త హజ్రత్ దావూద్ (అలైహి) ఉపవాస విధానాన్ని పాటించు (చాలు). ఆయన ప్రజలందరిలోకెల్లా ఎక్కువగా దైవారాధన చేసేవారు. ఇంకా నీవు నెలలో ఒక (సారి) ఖుర్‌ఆన్ (పూర్తిగా) పఠనం చెయ్యి" అని ఉపదేశించారు. దానికి నేను "నాకు ఇంతకన్నా ఎక్కువ శక్తి ఉంది" అన్నాను. అప్పుడు ఆయన "మరయితే ఇరవై రోజుల్లో దాన్ని పూర్తిగా పఠించు" అని సలహా ఇచ్చారు. "నాకు అంతకన్నా ఎక్కువ శక్తి ఉంది" అని నేను మళ్ళీ అన్నాను. అప్పుడు ఆయన "సరే, అయితే నీవు దానిని ఏడు రోజుల్లో (పూర్తిగా) పఠించు. అంతకన్నా ఎక్కువగా పఠించకు" అని నాకు హితోపదేశం చేశారు. నేను మొండిగా ప్రవర్తించాను కనుక నా పట్ల కఠినంగా వ్యవహరించటం జరిగింది. (తరువాత) ఆయన "నీకు తెలియదు. బహుశా నీవు ఎక్కువ కాలం బ్రతికి ఉండగలుగుతావేమో!" అని నాతో అన్నారు. (హజ్రత్ అబ్దుల్లాహ్ ఇలా అంటున్నారు) ఆఖరికి నేను దైవప్రవక్త ﷺ సూచించిన (వయో) స్థితికి చేరుకున్నాను. అప్పుడు "అయ్యో! దైవప్రవక్త ﷺ ఇచ్చిన సౌలభ్యాన్ని వినియోగించుకుని ఉంటే ఎంత బాగుండేది!" అని నాకు అనిపించేది.

ఇంకొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ "నీపై నీ సంతానానికి కూడా హక్కు ఉంది" అని అన్నారు.

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నిర్విరామంగా ఉపవాసాలను పాటించే వాని ఉపవాసం – అసలు ఉపవాసమే కాదు. దైవప్రవక్త ﷺ ఈ మాటను మూడుసార్లు అన్నారు.

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన ఉపవాసం హజ్రత్ దావూద్ (అలైహి) ఉపవాసం. ఇంకా అత్యంత ప్రియతమమయిన నమాజు (కూడా) హజ్రత్ దావూద్ (అలైహి) నమాజే. ఆయన అర్ధరాత్రి వరకు పడుకునేవారు. రాత్రి ఆఖరి భాగంలో నమాజ్ చేసేవారు. ఇంకా దాని ఆరవవంతు సమయం విశ్రమించేవారు. ఆయన ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఇంకా శత్రువుతో తలపడవలసి వచ్చినప్పుడు ఆయన (వెన్ను చూపి) పారిపోయేవారు కాదు.

మరొక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) అంటున్నారు : మా నాన్నగారు నా వివాహం ఒక గొప్పింటి స్త్రీతో జరిపించారు. ఆయన తన కోడల్ని చాలా బాగా చూసుకునేవారు. ఆమెను ఆమె భర్త (అంటే నా) గురించి అడిగేవారు. దానికి ఆమె "ఆయన జనులందరిలోకీ చాలా మంచివారు. ఆయన ఎన్నడూ నా పడకను తొక్కలేదు (అంటే నాప్రక్కన పడుకోలేదు) నా మర్మస్థానాన్ని ఏనాడూ అన్వేషించలేదు (నాతో సమాగమం జరుపలేదు)" అని సమాధానం చెప్పేది. చాలా కాలంపాటు పరిస్థితి ఇలాగే ఉండటం చూసి మా నాన్నగారు ఈ విషయం దైవప్రవక్త ﷺకు తెలియ జేశారు. "మీ అబ్బాయిని ఒకసారి నా దగ్గరకు పంపండి" అని ఆయన మా నాన్నగారికి చెప్పారు. ఆ తరువాత నేను దైవప్రవక్త ﷺను కలవగా, "నీవు ఉపవాసాలు ఏవిధంగా పాటిస్తావు?" అని ఆయన ప్రశ్నించారు. దానికి నేను 'ప్రతిరోజూ ఉపవాసాలుంటాను' అని అన్నాను. తరువాత ఆయన "నీవు ఖుర్‌ఆన్‌ను ఎలా (పఠించి) పూర్తి చేస్తావు?" అని అడిగారు. "ప్రతిరోజూ రాత్రి ఒక ఖుర్‌ఆన్ పూర్తిగా పఠిస్తాను" అన్నాను. ఆ తరువాత ఇంతకుముందు ప్రస్తావించబడిన మాటలే అన్నారు.

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (దివ్య ఖుర్‌ఆన్‌లో) తాను (రాత్రిపూట నఫిల్ నమాజులో పారాయణం చేసే) ఏడవవంతు ఖుర్‌ఆన్‌ను తన ఇంటివారికి చదివి వినిపించేవారు. రాత్రిపూట దానిని అవలీలగా పారాయణం చేయగలిగేందుకు వీలుగా పగటి వేళ దానినే నెమరువేసుకునేవారు. సత్తువ క్షీణించిందని అనుకున్నప్పుడు కొన్ని రోజులపాటు ఉపవాసాలుండటం మానేస్తారు. మానేసిన దినాలను లెక్కపెట్టుకొని తరువాత పూర్తిచేస్తారు. ఎందుకంటే దైవప్రవక్త ﷺ తనను వీడిపోయినప్పుడు తాను చేస్తున్న ఆచరణను వదలిపెట్టటానికి ఆయన యిష్టపడేవారు కాదు.

(పైన పేర్కొనబడిన ఉల్లేఖనాలన్నీ ప్రామాణికమైనవే. వీటిలో చాలా భాగం బుఖారీ-ముస్లిం రెండింటిలోనూ ఉంది. కొంత భాగం మాత్రం ఆ రెండింటిలో ఏదో ఒకదానిలోనే ఉంటుంది.)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని ఉపవాస ప్రకరణాల్లో ఈ హదీసు పేర్కొనబడింది.)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: The Prophet ﷺ was informed that I said that I would perform prayers the whole night and observe fasting every day as long as I live. Messenger of Allah ﷺ said, “Is it you who said this?” I said to him, “O Messenger of Allah! I ransom you with my parents, it is I who said that.” Messenger of Allah ﷺ said, “You will not be able to do that. Observe fast and break it; sleep and get up for prayer, and observe fast for three days during the month; for every good is multiplied ten times and that will be equal to fasting the whole year.” I said, “O Messenger of Allah! I can do more than that.” He said, “Observe fast one day and leave off the next two days.” I said, “O Messenger of Allah! I have strength to do more than that.” Messenger of Allah ﷺ said, “Observe fast every other day, and that is the fasting of Dawud ﷺ and that is the most moderate fasting”.

According to another narration: Messenger of Allah ﷺ said, “That is the best fasting.” I said, “But I am capable of doing more than this”. Thereupon, Messenger of Allah ﷺ said, “There is nothing better than this.” `Abdullah bin `Amr (radiyallahu anhuma) said (when he grew old): “Had I accepted the three days (fasting during every month) as the Messenger of Allah had said, it would have been dearer to me than my family and my property”.

In another narration `Abdullah is reported to have said: Messenger of Allah ﷺ said to me, “O `Abdullah! Have I not been informed that you observe fast during the day and offer prayer all the night.” I replied, “Yes, O Messenger of Allah!” Messenger of Allah ﷺ said, “Don’t do that. Observe fast for few days and then leave off for few days, perform prayers and also sleep at night, as your body has a right upon you, and your eyes have a right upon you; and your wife has a right upon you; your visitors have a right upon you. It is sufficient for you to observe fast three days in a month, as the reward of good deeds is multiplied ten times, so it will be like fasting the whole year.” I insisted (on fasting) and so I was given a hard instruction. I said, “O Messenger of Allah! I have strength.” Messenger of Allah ﷺ said, “Observe fast like the fasting of Prophet Dawud ﷺ; and do not fast more than that.” I said: “How was the fasting of Prophet Dawud?” He ﷺ said, “Half of the year (i.e., he used to fast on every alternate day).”

Afterwards when `Abdullah (radiyallahu anhu) grew old, he used to say: “Would that I had availed myself of the concession granted to me by Messenger of Allah.”

In another narration `Abdullah is reported to have said: Messenger of Allah ﷺ said, “I have been informed that you observe fast continuously and recite (the whole of the Qur’an) every night.” I said, “Messenger of Allah! It is right, but I covet thereby nothing but good,” whereupon he ﷺ said, “Then observe fasts like the fasting of Prophet Dawud ﷺ as he was the most ardent worshipper of Allah; recite the Qur’an once every month.” I said, “O Prophet of Allah! I am capable of doing more than that.” He said, “Then recite it (the complete Qur’an) in every twenty days.” I said, “O Prophet of Allah I am capable of reciting more than that.” He said, “Then recite it once in every ten days.” I said, “O Prophet of Allah! I am capable of reciting more than that.” He said, “Then recite it once in every seven days, but not recite more than that.” The Prophet of Allah also said to me, “You do not know, you may have a longer life”. When I grew old I wished I had availed myself of the concession (granted to me by) the Prophet of Allah.

In another narration `Abdullah is reported to have said: Messenger of Allah ﷺ said, “The best fasting with Allah is that of (Prophet) Dawud, and the best prayer with Allah is that of Dawud ﷺ for he would sleep half of the night and stand for prayer for the third of it and (then) would sleep sixth part of it; he observed fast one day and leave off the other. He would not flee on meeting the enemy”.

In another narration `Abdullah is reported to have said: My father helped me marry a noble woman and he used to inquire of his daughter-in-law regarding her husband. She would say: “He is, indeed, a fine man. Since I have come to him, he has neither stepped on my bed nor he has had sexual intercourse with me”. When this state of affairs lasted for some time, my father mentioned the matter to Messenger of Allah ﷺ who directed my father saying, “Send him to me”. I went to him accordingly. He asked me, “How often do you observe fast?” I replied; “Daily”. He asked me, “How long do you take in reading the Noble Qur’an completely.” I said, “Once every night”. Then he narrated the whole story. He (in his old age) would recite one seventh of his nightly recitation to some members of his family during the day to lighten his task at night. Whenever he wished to have a relief from his fast on alternate days, he would give up fasting for a few days and make up deficiency later by observing the number of fasts he had missed. He would not give up the number of fasts altogether because he did not like to abandon what he had settled with Messenger of Allah ﷺ.

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో ప్రవక్త ప్రియసహచరుల ఐహిక అనాసక్తత, ఆరాధనా తత్పరత, దైవభక్తి పరాయణతలు పొందుపరచబడి ఉన్నాయి. వాటితో పాటు దైవప్రవక్త ﷺ గారు సూచించిన మార్గదర్శక సూత్రాలు, హితోపదేశాలు కూడా ఉన్నాయి. మానవుడు అన్ని విషయాల్లోనూ మధ్యేమార్గాన్ని అనుసరించాలని, సంతులన విధానాన్ని అవలంబించాలని, ధర్మనియమాలను ఆచరించటంతోపాటు, ప్రాపంచిక జీవన కార్యకలాపాలను కూడా నిర్వర్తించాలని అవి ప్రబోధిస్తున్నాయి.
  2. ఇంకా దైవప్రవక్త ﷺ సహచరిణుల సౌశీల్యం, వ్రీడా భావాల ప్రస్తావన కూడా ఈ హదీసులో ఉంది. తమ భర్తలు తమపట్ల అశ్రద్ధ వహించినా వారు ఎంతో సహనంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. హదీసులో పేర్కొనబడిన మహిళను ఆమె మామ,భర్తను గురించి అడిగినప్పుడు ఆమె ఎంతో నేర్పుతో సంస్కారవంతంగా చూచాయగా విషయాన్ని ఆయనకు తెలియజేసింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 150

151

హదీసు 151

وعن أَبِي ربْعِيٍّ حنْظَلةَ بنِ الرَّبيع الأُسيدِيِّ الْكَاتِب أَحدِ كُتَّابِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: لَقينَي أَبُو بَكْر رضي اللَّه عنه فَقَالَ: كَيْفَ أَنْتَ يَا حنْظلَةُ؟ قُلْتُ: نَافَقَ حنْظَلَةُ، قَالَ: سُبْحانَ اللَّه مَا تقُولُ؟،: قُلْتُ: نَكُونُ عِنْد رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُذكِّرُنَا بالْجنَّةِ والنَّارِ كأَنَّا رأْيَ عَيْنٍ، فَإِذَا خَرجنَا مِنْ عِنْدِ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عافَسنَا الأَزْوَاجَ وَالأَوْلادَ وَالضَّيْعاتِ نَسينَا كَثِيراً قَالَ أَبُو بكْر رضي اللَّه عنه: فَواللَّهِ إِنَّا لنَلْقَى مِثْلَ هَذَا فانْطلقْتُ أَنَا وَأَبُو بَكْر حَتَّى دخَلْنَا عَلى رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فقُلْتُ نافَقَ حنْظَلةُ يَا رَسُول اللَّه، فقالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ومَا ذَاكَ؟ " قُلْتُ: يَا رسولَ اللَّه نُكونُ عِنْدكَ تُذَكِّرُنَا بالنَّارِ والْجنَةِ كَأَنَّا رأْيَ العَيْنِ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِكَ عَافَسنَا الأَزوَاج والأوْلاَدَ والضَّيْعاتِ نَسِينَا كَثِيراً. فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"وَالَّذِي نَفْسِي بِيدِهِ أن لَوْ تَدُومُونَ عَلَى مَا تَكُونُونَ عِنْدِي وَفِي الذِّكْر لصَافَحتْكُمُ الملائِكَةُ عَلَى فُرُشِكُم وَفي طُرُقِكُم، وَلَكِنْ يَا حنْظَلَةُ سَاعَةً وسَاعَةً" ثَلاثَ مرَّاتٍ، رواه مسلم. قوله:"رِبْعِيٌّ"بكسر الراء."الأسيِّدي"بضم الهمزة وفتح السين وبعدها ياء مكسورة مشدَّدة, وقوله:"عَافَسْنَا"هُوَ بِالعينِ والسينِ المهملتين, أي: عالجنا ولاعبنا."الضَّيْعاتُ": المعايش.

దైవప్రవక్త ﷺ గారి ఒకానొక లేకరి అయిన హజ్రత్ అబూ రిబ్‌యీ హంజలా బిన్ రబీ అల్ ఉసయ్యిది కథనం : ఒకసారి హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) నన్ను కలుసుకొని 'బాగున్నావా హంజలా?" అని కుశల ప్రశ్న వేశారు. దానికి నేను "హంజలా కపటి అయిపోయాడు" అని సమాధానమిచ్చాను. అది విని ఆయన ఆశ్చర్యపోతూ "సుబ్‌హానల్లాహ్! ఏమిటి నువ్వనేది?" అని అన్నారు. అందుకు నేను "(ఏం చెప్పమంటారు?) మనం దైవప్రవక్త ﷺ సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మన ముందు స్వర్గనరకాల గురించి చెబుతూ ఉంటే (నిజంగానే మనం వాటిని మన కళ్ళతో చూస్తున్నట్లనిపిస్తుంది. తీరా ఆయన సమావేశం నుంచి బయటికి రాగానే ఆలుబిడ్డల్లో ప్రాపంచిక పనిపాటల్లో మునిగిపోయి చాలా విషయాలు మరచిపోతుంటాము. (అందుకని నేను కూడా కపటినయిపోయాననిపిస్తోంది)" అంటూ నా బాధను వ్యక్తం చేశాను. అది విని ఆయన "దైవసాక్షి! మాక్కూడా అలాగే అనిపిస్తోంది (నిజంగా ఇది కాపట్యమే అయితే మేము కూడా ఈ కాపట్యానికి లోనై వున్నాము. కనుక ఇది ఎంతో ఆందోళనకరమైన విషయం)" అని తన మనోగతాన్ని కూడా వెలిబుచ్చారు.

ఆ తరువాత అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) మరియు నేను ఇద్దరం కలిసి దైవప్రవక్త ﷺ సన్నిధికి చేరుకున్నాము. అక్కడికి చేరుకున్నాక నేను "దైవప్రవక్తా! హంజలా కపటి అయిపోయాడు" అని అన్నాను. అందుకు ఆయన "అదెలాగు?" అని ప్రశ్నించారు. "దైవప్రవక్తా! మేము మీ దగ్గరున్నప్పుడు మీరు మా ముందు స్వర్గనరకాల గురించి చెబుతూ ఉంటే నిజంగానే మేము వాటిని మా కళ్ళతో చూస్తున్నట్లనిపిస్తుంది. తీరా మీ సమావేశం నుంచి బయటికి రాగానే భార్యాపిల్లల్లో, పనిపాటల్లో మునిగిపోయి (మీరు చెప్పిన) చాలా విషయాలు మరచిపోతుంటాము" అంటూ నేను కారణం ఏకరువుపెట్టాను. నేను చెప్పినదంతా విని దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : "ఎవరి చేతిలోనయితే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు నా సమక్షంలో ఉండే స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటే, (నిత్యం) దైవధ్యానంలో నిమగ్నులై ఉంటే దైవదూతలు మీ పడకలపై ఇంకా మీరు (నడిచే) దారుల్లో కూడా మీతో కరచాలనం చేస్తూ ఉంటారు. కాని ఓ హంజలా! కాలమంతా ఒకే విధంగా ఉండదు." ఆయన ఇదే మాట మూడుసార్లు అన్నారు. (అంటే, అనునిత్యం మనిషి ఒకేవిధంగా ఉండడు. సమయం, సందర్భాన్ని బట్టి అతని స్థితిలో మార్పు రావటమనేది సహజం).

'ఆఫస్‌నా' అంటే మేము పనుల్లో, ఆటపాటల్లో మునిగిపోతూ ఉంటాం. 'జైఅత్' అంటే జీవనం కొనసాగించే మార్గాలు. ఉదా: చేతివృత్తులు, వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, సిరిసంపదలు వగైరా.

(సహీహ్ ముస్లింలోని 'పశ్చాత్తాప' ప్రకరణం)

English

Hanzalah Al-Usayyidi (radiyallahu anhu) who was one of the scribes of Messenger of Allah ﷺ, reported: I met Abu Bakr (radiyallahu anhu) he said: “How are you O Hanzalah?” I said, “Hanzalah has become a hypocrite”. He said, “Far removed is Allah from every imperfection, what are you saying?” I said, “When we are in the company of Messenger of Allah ﷺ and he reminds us of Hell-fire and Jannah, we feel as if we are seeing them with our very eyes, and when we are away from Messenger of Allah ﷺ, we attend to our wives, our children, our business, most of these things (pertaining to life hereafter) slip out of our minds.” Abu Bakr (radiyallahu anhu) said, “By Allah, I also experience the same thing”. So Abu Bakr (radiyallahu anhu) and I went to Messenger of Allah ﷺ and I said to him, “O Messenger of Allah ﷺ, Hanzalah has turned hypocrite.” Thereupon Messenger of Allah ﷺ said, “What has happened to you?” I said, “O Messenger of Allah, when we are in your company, and are reminded of Hell-fire and Jannah, we feel as if we are seeing them with our own eyes, but when we go away from you and attend to our wives, children and business, much of these things go out of our minds.” Thereupon Messenger of Allah ﷺ said, “By Him in Whose Hand is my life if your state of mind remains the same as it is in my presence and you are always busy in remembrance (of Allah), the angels will shake hands with you in your beds and in your roads; but Hanzalah, time should be devoted (to the worldly affairs) and time should be devoted (to prayer)”. He (the Prophet ﷺ) said this thrice.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కూడా ప్రవక్త గారి ప్రియసహచరుల దైవభీతి, ధర్మపరాయణతలు వివరించబడటంతో పాటు మనిషి మానసిక స్థితిగతుల్లో మార్పులు సంభవించటం మానవసహజ ధర్మమని తెలియజేయడం జరిగింది. అయితే ఇది కాపట్యం కాదు. మనస్సు ఏమరుపాటుకు లోనై ఉన్నప్పుడు ఇలాంటి స్థితి ఆవరిస్తుంది. మనిషి ఈ చిత్తచాంచల్యాన్ని పూర్తిగా నిరోధించలేడు గాని ఎక్కువగా దైవనామస్మరణం చేయటంతో చాలావరకు దీనిని అదుపులో పెట్టుకోగలడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 151

152

హదీసు 152

وعنِ ابن عباس رضي اللَّه عنهما قَالَ: بيْنما النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَخْطُبُ إِذَا هُوَ بِرجُلٍ قَائِمٍ، فسأَلَ عَنْهُ فَقَالُوا: أَبُو إِسْرائيلَ نَذَر أَنْ يَقُومَ فِي الشَّمْس وَلا يقْعُدَ، وَلاَ يستَظِلَّ وَلاَ يتَكَلَّمَ، ويصومَ، فَقالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"مُرُوهُ فَلْيَتَكَلَّمْ ولْيَستَظِلَّ وَلْيَقْعُدْ ولْيُتِمَّ صوْمَهُ "رواه البخاري.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ ఖుత్బా (ఉపన్యాసం) ఇస్తుండగా, అకస్మాత్తుగా ఆయన దృష్టి (ఎండలో) నిలబడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది. ఆయన ఆ వ్యక్తి గురించి అడగ్గా, "ఇతనిపేరు అబూ ఇస్రాయీల్. తను ఎండలో నించుంటాననీ, కూర్చోకుండా, నీడలోకి రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటానని, ఇంకా ఉపవాసం పాటిస్తానని మొక్కుకున్నాడు" అని అక్కడున్న వారు ఆయనకు తెలియజేశారు. అది విని ఆయన "మాట్లాడమని, నీడలోకి వచ్చి కూర్చోమని అతనికి చెప్పండి, అయితే ఉపవాసాన్ని మాత్రం పూర్తిచేయమనండి" అని ఆదేశించారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: While the Prophet ﷺ was delivering Khutbah (religious talk), he noticed a man who was standing, so he asked about him and was told that he was Abu Israel who had taken a vow to remain standing and not sit, or go into the shade, or speak while observing fasting. Thereupon Messenger of Allah ﷺ said, “Tell him to speak, to go into the shade, to sit and to complete his fast”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. తమకు తాముగా సృష్టించుకున్న ఆరాధనా పద్ధతులు, స్వయం కల్పిత పోకడలతో దైవసామీప్యాన్ని పొందలేమని, పైగా ఖుర్‌ఆన్, హదీసుల ద్వారా రుజువైన మార్గాల ద్వారానే అది సాధ్యమని పై హదీసు బోధపరుస్తోంది.
  2. షరీఅత్ ఆదేశించనటువంటి మొక్కుబడులను ఇంకా దైవ అవిధేయతకు దారితీసే మొక్కుబడులను నెరవేర్చకూడదు. హదీసులో పేర్కొనబడిన మొక్కుబడులు కొన్ని ఆ కోవకు చెందినవే.
  3. దేవుని అవిధేయతకు దారితీసే మొక్కుబడిని నెరవేర్చకపోయినా దానికి పరిహారం చెల్లించవలసిన అవసరం లేదని వాదించే అత్యధిక విద్వాంసులకు ఈ హదీసు ప్రబల నిదర్శనం. ఎందుకంటే సదరు హదీసులో దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తికి పరిహారం చెల్లించమని ఆదేశించలేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|14. ఆరాధనలో మధ్యేమార్గం|హదీసు 152