హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 11వ అధ్యాయం: పోరాట పటిమ. ఈ అధ్యాయంలో 6 ఖుర్ఆన్ ఆయతులు, 17 హదీసులు (హదీసు 95 – 111) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
11. పోరాట పటిమ
بابُ المجاهدة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ} [العنكبوت:٦٩]
అల్లాహ్ సెలవిచ్చాడు : "మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసే వారికి మేము మా మార్గాలను చూపుతాము, నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులతో పాటే ఉంటాడు." (అల్ అన్ కబూత్ ، 69)
{وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ} [الحجر:٩٩]
మరొకచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "అవశ్యంగా వచ్చే చివరి గడియవరకూ నీ ప్రభువు దాస్యం చేస్తూ ఉండు." (అల్ హిజ్ర్ : 99)
{وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلاً} [المزمل:٨]
ఇంకొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు, అన్నిటినీ వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో. (అంటే అన్నిటినీ త్యజించి ఆయన వైపునకే దృష్టిని మరల్చు). (అల్ ముజ్జమ్మిల్ : 8)
{فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْراً يَرَهُ} [الزلزلة:٧]
వేరొకచోట సెలవీయబడింది : "ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు." (అజ్ జిల్ జాల్ : 8)
{وَمَا تُقَدِّمُوا لِأَنْفُسِكُمْ مِنْ خَيْرٍ تَجِدُوهُ عِنْدَ اللَّهِ هُوَ خَيْراً وَأَعْظَمَ} [المزمل: ٢٠]
మరొకచోట పరమప్రభువు ఇలా అంటున్నాడు: "మీరు ఏ సత్కార్యాన్ని మీ కోసం ముందుగా పంపించుకుంటారో, దానిని మీరు అల్లాహ్ వద్ద చూసుకుంటారు. అదే చాలా శ్రేష్ఠమైనది మరియు దాని ప్రతిఫలం చాలా పెద్దది. అల్లాహ్ను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, కరుణామయుడూను." (అల్ ముజ్జమ్మిల్ : 20)
{وَمَا تُنْفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ} [البقرة: ٢٧٣]
ఇంకొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "మీరు ఏమి ఖర్చుచేసినా, అది అల్లాహ్కు తెలియకుండా ఉండదు." (అల్ బఖర : 273)
ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక సుప్రసిద్ధ సూక్తులు ఉన్నాయి.
English
“As for those who strive hard in Us (Our Cause), We will surely, guide them to Our paths (i.e., Allah’s religion – Islamic Monotheism). And verily, Allah is with the Muhsinun (gooddoers)”. [Al-‘Ankabūt 29:69]
“And worship your Rubb until there comes unto you the certainty (i.e., death)”. [Al-Ḥijr 15:99]
“And remember the Name of your Rubb and devote yourself to Him with a complete devotion.” [Al-Muzzammil 73:8]
“So whosoever does good equal to the weight of an atom (or a small ant), shall see it”. [Az-Zalzalah 99:7]
“And whatever good you send before you for yourselves (i.e., Nawafil – non-obligatory acts of worship: prayers, charity, fasting, Hajj and Umrah, etc.), you will certainly find it with Allah, better and greater in reward.” [Al-Muzzammil 73:20]
“And whatever you spend in good, surely, Allah knows it well.” [Al-Baqarah 2:273]
హదీసు 95
فالأَول: عن أبي هريرةَ رضي اللَّه عنه. قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه تَعَالَى قَالَ: منْ عادى لي وَلِيّاً. فقدْ آذنتهُ بالْحرْب. وَمَا تقرَّبَ إِلَيَ عبْدِي بِشْيءٍ أَحبَّ إِلَيَ مِمَّا افْتَرَضْت عليْهِ: وَمَا يَزالُ عَبْدِي يتقرَّبُ إِلى بالنَّوافِل حَتَّى أُحِبَّه، فَإِذا أَحبَبْتُه كُنْتُ سمعهُ الَّذي يسْمعُ بِهِ، وبَصره الَّذِي يُبصِرُ بِهِ، ويدَهُ الَّتي يَبْطِش بِهَا، ورِجلَهُ الَّتِي يمْشِي بِهَا، وَإِنْ سأَلنِي أَعْطيْتَه، ولَئِنِ اسْتَعَاذَنِي لأُعِيذَّنه "رواه البخاري. "آذنتُهُ"أَعلَمْتُه بِأَنِّي محارِب لَهُ"استعاذنِي"رُوى بالنون وبالباءِ.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : అల్లాహ్ అన్నాడు: ఎవడైతే నా స్నేహితునితో శత్రుత్వం పెట్టుకుంటాడో నేనతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను నా దాసుడిపై విధిగా చేసిన విషయాలను ఆచరించి అతను నాకు దగ్గరయితే అంతకన్నా నాకు ప్రీతికరమైన విషయం మరొకటి లేదు (అంటే విధులను ఆచరించి నా సామీప్యాన్ని పొందటం అంటే నాకు అత్యంత యిష్టం). ఇంకా నా దాసుడు నవాఫిల్ (స్వచ్ఛంద సత్కార్యాల) ద్వారా కూడా నాకు దగ్గరవుతూ ఉంటాడు. క్రమంగా నేనతణ్ణి ప్రేమిస్తాను. నేనతణ్ణి ప్రేమించడం మొదలుపెడితే, (క్రమక్రమంగా) నేను అతను వినే చెవినైపోతాను, అతను చూసే కంటినైపోతాను, అతను పట్టుకునే చేయినైపోతాను, ఇంకా అతను నడిచే కాలునైపోతాను, అతను నాతో ఏదైనా అడిగితే నేనతనికి తప్పకుండా ఇస్తాను. దేని నుండి అయినా శరణువేడితే నేనతనికి తప్పకుండా శరణు ఇస్తాను. (బుఖారీ)
'ఆజన్తుహూ' అంటే నేను నీతో యుద్ధానికి తలపడుతున్నానని అతనికి తెలియజేస్తున్నాను అని అర్థం. హదీసులో ప్రస్తావించబడిన 'ఇస్తఆజనీ' అనే పదం 'ఇస్తఆజబీ'గా కూడా ఉల్లేఖించబడింది.
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah the Exalted has said: ‘I will declare war against him who shows hostility to a pious worshipper of Mine. And the most beloved thing with which My slave comes nearer to Me is what I have enjoined upon him; and My slave keeps on coming closer to Me through performing Nawafil (prayer or doing extra deeds besides what is obligatory) till I love him. When I love him I become his hearing with which he hears, his seeing with which he sees, his hand with which he strikes, and his leg with which he walks; and if he asks (something) from Me, I give him, and if he asks My Protection (refuge), I protect him”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
- వినూత్న పోకడలను అనుసరించేవారు, బహుదైవారాధకులు కొందరు తమ మిధ్యాభావాలకు ఈ హదీసును నిదర్శనంగా చూపెడుతున్నారు. వాస్తవానికి పై హదీసు భావం వారనుకుంటున్నది కాదు. వారు హదీసుకు వక్రభాష్యం చెబుతూ తప్పులపై తప్పులు చేస్తున్నారు. పై హదీసుకు స్పష్టమైన, ఖచ్చితమైన వివరణ ఏమిటంటే, మనిషి దేవుని విధులను నిర్వర్తించడంతోపాటు నఫిల్ (స్వచ్ఛంద) సత్కార్యాలు కూడా చేస్తూ ఉంటే అతను దేవునికి ప్రియతముడైపోతాడు. ఫలితంగా అతనికి దైవసహాయం లభిస్తూ ఉంటుంది, దేవుడు అతణ్ణి తన రక్షణలోకి తీసుకుంటాడు, అతని శరీరావయవాలను పర్యవేక్షిస్తుంటాడు, కాబట్టి అటువంటి వ్యక్తి దైవవిధేయతకు, ఇతర చెడుగులకు దూరంగా ఉంటాడు. ఆ విధంగా ఆ దాసుడు తన చెవులతో ఏది విన్నా, తన కళ్ళతో ఏది చూసినా, తన చేతులతో ఏది పట్టుకున్నా దేవుని అభీష్టం ప్రకారమే చేస్తాడు. అతని కాళ్ళు ఎటు నడిచి వెళ్ళినా అందులో దైవప్రసన్నత దాగి ఉంటుంది. ఈ రకమైన దైవప్రియత్వం, దైవవిధేయతల స్థానానికి దాసుడు చేరుకుంటే దేవుడు అతని ప్రార్థనలను తప్పకుండా స్వీకరిస్తాడు.
- 'వలీ' అంటే ప్రత్యేకమైన వేషధారణతో సాధువుగా ఉండేవాడనో, సన్యాసి బైరాగిఅనో, ప్రాపంచిక ధ్యాస లేనివాడనో, సగం పిచ్చివాడనో, ఆరాధన విషయంలో తనదైన ఒక ఒరవడిని సృష్టించుకున్నవాడనో అర్థం కాదు. పైగా 'వలీ' అంటే ఇస్లామీయ విధులను ఖచ్చితంగా నిర్వర్తించేవాడనీ, స్వచ్ఛంద ఆరాధనలపట్ల సయితం ఎంతో మక్కువ గలవాడనీ, జీవితపు అన్ని రంగాలలో, సమస్త విభాగాలలో దైవవిధేయతకు కట్టుబడి ఉండేవాడనీ, తన ఉనికి ద్వారా సాటి మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, హద్దులు అతిక్రమించకుండా ఉండేవాడనీ భావం.
- అలాంటి దేవుని ప్రియదాసులను ప్రేమించేవారిపట్ల అల్లాహ్ కూడా ప్రసన్నుడౌతాడు. వారితో శత్రుత్వం పెట్టుకునేవారు దైవాగ్రహానికి గురౌతారు.
- నఫిల్ (స్వచ్ఛంద)సత్కార్యాలను పాటిస్తే దేవుని సామీప్యం పొందుతారన్నమాట నిజమే. అయితే దేవుని విధులు (ఫర్జ్లు) ప్రవక్త సున్నతులను ఆచరించడంతోపాటు నఫిల్ సత్కార్యాలు చేస్తే లాభముంటుందిగాని ఫర్జ్లను (విధులను), సున్నతులను విడిచిపెట్టి, నఫిల్ కార్యాలు చేస్తే ఒరిగేదేమీ ఉండదు. ఫర్జ్లు, సున్నత్లతో నిమిత్తం లేకుండా కేవలం నఫిల్ కార్యాలతోనే దైవసామీప్యాన్ని పొందవచ్చునన్నది ఓ అభూతకల్పన, పసలేని వాదన.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 95
హదీసు 96
الثاني: عن أَنس رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فيمَا يرْوِيهِ عنْ ربهِ عزَّ وجَلَّ قَالَ: "إِذَا تَقَربَ الْعبْدُ إِليَّ شِبْراً تَقرَّبْتُ إِلَيْهِ ذِراعاً، وإِذَا تقرَّب إِلَيَّ ذِرَاعاً تقرَّبْتُ مِنهُ بَاعاً، وإِذا أَتانِي يَمْشِي أَتيْتُهُ هرْوَلَة" رواه البخاري.
తన ప్రభువు ఇలా అన్నాడంటూ దైవప్రవక్త ﷺ ఉల్లేఖించిన విషయాన్ని గురించి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు : "దాసుడు నాకు జానెడు దూరం దగ్గరయితే నేనతనికి మూరెడు దగ్గరవుతాను. అతను మూరెడు దూరం దగ్గరైతే నేను బారెడు దగ్గరవుతాను. అతను నా వైపుకు నడుచుకుంటూ వస్తే నేనతని వైపుకు పరుగెత్తుకుంటూ వస్తాను." (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ఏకేశ్వరోపాసన ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah says: ‘ When a slave of Mine draws near to Me a span, I draw near to him a cubit; and if he draws near to Me a cubit, I draw near to him a fathom. And if he comes to Me walking, I go to him running.”’.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దాసులపై దేవుని దయాదాక్షిణ్యాలు, కరుణాకటాక్షాలు వివరించబడ్డాయి. దాసులు చేసే చిన్న చిన్న సత్కార్యాలను దేవుడు ఇంతలంతలు చేసి పుణ్యం ప్రసాదిస్తాడని చెప్పబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 96
హదీసు 97
الثالث: عن ابن عباس رضي اللَّه عنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "نِعْمتانِ مغبونٌ فيهما كثير من الناس: الصحة والفراغ "رواه مسلم.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు : రెండు వరాలున్నాయి. వాటి దుర్వినియోగం వల్ల అనేక మంది నష్టానికి గురవుతారు. అవి : ఆరోగ్యం, తీరిక. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Ibn Abbas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “There are two blessings in which many people incur loss. (They are) health and free time (for doing good)”.[Al-Bukhari]
ముఖ్యాంశాలు
1. హదీసులో 'ఘబన్' అనే పదం వచ్చింది. ఘబన్ అంటే నష్టం. తన వస్తువుని అతి తక్కువ ధరకు అమ్మటం లేదా ఇతరుల నుండి ఒక వస్తువును దాని అసలు ధరకంటే రెండు మూడు రెట్లు అధిక ధరకు కొనటాన్ని ఘబన్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పరిస్థితుల్లోనూ మనిషికి నష్టమే వాటిల్లుతుంది. తనకు నష్టం జరిగినప్పుడు మనిషి చాలా విచారపడ్తాడు.
పై హదీసులో మనిషిని ఒక వ్యాపారిగా మరియు ఆరోగ్యం, తీరికలను పెట్టుబడిగా అభివర్ణించడం జరిగింది. పెట్టుబడిని జాగ్రత్తగా ఉపయోగించుకున్న వ్యాపారి లాభాన్ని పొందుతాడు. దీనికి విరుద్ధంగా పెట్టుబడిని దుర్వినియోగం చేసుకుంటే నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం, తీరిక లాంటి ప్రకృతి వరాలను సరిగ్గా వినియోగించుకోకపోతే మనిషి ప్రళయదినం నాడు చాలా విచారపడ్తాడనీ, బాధపడతాడని ఈ హదీసు హెచ్చరిస్తోంది.
2. మనుషుల్లో అనేకమంది ఈ రెండు భాగ్యాల విలువను గుర్తించరు. అందుకే వాళ్ళు తమ సమయాన్ని నిష్ప్రయోజనకరమైన పనుల్లో దుబారాగా వెచ్చిస్తుంటారు. తమ శరీర సత్తువను, దైవ అవిధేయతకు దారితీసే పనుల్లో వినియోగిస్తుంటారు. ప్రళయదినాన దేవుడు ఒక్కో విషయం గురించి లెక్క అడిగినప్పుడు మనిషి తన్ను తాను నిందించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 97
హదీసు 98
الرابع: عن عائشة رَضي اللَّه عنها أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَان يقُومُ مِنَ اللَّيْلِ حتَّى تتَفطَرَ قَدمَاهُ، فَقُلْتُ لَهُ، لِمْ تصنعُ هَذَا يَا رسولَ اللَّهِ، وقدْ غفَرَ اللَّه لَكَ مَا تقدَّمَ مِنْ ذَنبِكَ وَمَا تأخَّرَ؟ قَالَ: "أَفَلاَ أُحِبُّ أَنْ أكُونَ عبْداً شكُوراً؟ "متفقٌ عَلَيهِ. هَذَا لفظ البخاري، ونحوه في الصحيحين من رواية المُغيرة بن شُعْبَةَ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ రాత్రిళ్ళు తన పాదాలపై వాపు వచ్చేంతవరకూ నమాజులో నిలబడేవారు. అది చూసి నేను "మీకు ఇంత శ్రమ దేనికీ? అల్లాహ్ గతంలో మీవల్ల జరిగిన పాపాలను, జరగబోయే పాపాలను కూడా మన్నించేశాడు కదా?!" అని అడిగాను. దానికి ఆయన "నేను దైవానికి కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదా?" అని అనేవారు,
(బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీలోనివి. బుఖారీ – ముస్లింలలో ఇలాంటిదే ముగీరా బిన్ షోబా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం కూడా ఉంది.)
(సహీహ్ బుఖారీలోని 'తహజ్జుద్' ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని 'కపటుల' ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)
English
`Aishah (radiyallahu anha) said: The Prophet ﷺ would stand (in prayer) so long that the skin of his feet would crack. I asked him, “Why do you do this while your past and future sins have been forgiven?” He said, “Should I not be a grateful slave of Allah?”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- దైవప్రవక్తలందరూ దురలవాట్ల వల్ల జరిగే ఘోర పాపాల (కబీరా గునాహ్)కు అతీతంగా ఉంటారన్న విషయమై యావత్తు ముస్లిం సమాజం ఏకాభిప్రాయంతో ఉంది. అయితే చిన్న చిన్న తప్పులు – మానవ సహజమైన దౌర్బల్యాల మూలంగా – దైవప్రవక్తల వల్ల కూడా జరగవచ్చని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతున్నారు. కాని దైవప్రవక్తలు ఇలాంటి చిన్న తప్పుల నుండి కూడా పునీతులని అత్యధిక మంది విద్వాంసులు వాదిస్తున్నారు. మరి దేవుడు దైవప్రవక్తను మన్నించాడన్న దానికి అర్థం ఏమిటన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతుంది. వాస్తవం ఏమిటంటే సజ్జనులకు ఫర్వాలేదనిపించే పనులే దేవుని ప్రియదాసులకు మహాపాతకాలుగా తోస్తాయి. దైవప్రవక్త ﷺ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉత్తమంగా లేకపోవటం చేత వాటిని తప్పులుగా, పొరపాట్లుగా అభివర్ణించడం జరిగింది. అయితే దేవుడు వాటిని కూడా క్షమించేశానని ప్రకటించాడు.
- దేవుడు ఎవరికి ఎంతగా అనుగ్రహిస్తే వారు అంతగానే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దానికోసం దేవుని విధులను నిర్వర్తిస్తూ, దైవవిధేయతను పాటించడంతోపాటు వీలైనంత ఎక్కువగా స్వచ్ఛంద సత్కార్యాలు (నవాఫిల్) కూడా చేస్తూ ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 98
హదీసు 99
الخامس: عن عائشة رضي اللَّه عنها أنَّها قَالَتْ:"كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إذَا دَخَلَ الْعشْرُ أَحْيَا اللَّيْلَ، وَأيْقَظَ أهْلهْ، وجدَّ وشَدَّ المِئْزَرَ"متفقٌ عليه. والمراد: الْعشْرُ الأواخِرُ من شهر رمضان:"وَالمِئْزَر": الإِزارُ وهُو كِنايَةٌ عن اعْتِزَال النِّساءِ، وقِيلَ: المُرادُ تشْمِيرهُ للعِبادَةِ. يُقالُ: شَددْتُ لِهذا الأمرِ مِئْزَرِي، أيْ: تشمرتُ وَتَفَرَّغتُ لَهُ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ (రమజాన్ నెలలోని చివరి) దశకం ప్రారంభం కాగానే రాత్రిళ్ళు జాగారం చేసేవారు. తన ఇంటివారిని కూడా (రాత్రి ఆఖరి జాములో) మేల్కొలిపేవారు. (దైవారాధనలో) బాగా శ్రమించేవారు. నడుం బిగించేవారు. (బుఖారీ – ముస్లిం)
'అల్ అష్రుల్ అవాఖిర్' అంటే రమజాన్ నెలలోని చివరి దశకం. 'మీజర్' అంటే క్రిందివస్త్రం. ఆయన ఈ కాలంలో భార్యలకు దూరంగా ఉండేవారన్న విషయాన్ని ఈ పదం ద్వారా చూచాయగా చెప్పడం జరిగింది. మరికొంతమంది అభిప్రాయంలో దీనర్థం దైవారాధన కోసం నడుం బిగించడం. సాధారణంగా నేను ఈ పనికోసం నడుం కట్టుకున్నాను అని అంటారు. అంటే ఈ పనికోసం నేను సిద్ధమయ్యానని, తీరిగ్గా ఉన్నానని భావం.
(సహీహ్ బుఖారీలోని 'తరావీహ్ నమాజు' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని 'ఏతెకాఫ్' ప్రకరణంలోనూ ఈ హదీసును పొందుపరచడం జరిగింది.)
English
`Aishah (radiyallahu anha) said: With the start of the last ten days of Ramadan, Messenger of Allah ﷺ would pray all the night, and would keep his family awake for the prayers. He tied his lower garment (i.e., avoided sleeping with his wives) and devoted himself entirely to prayer and supplication.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
శుభప్రదమైన ఘడియలలో వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలి, సత్కార్యాలు చేయాలి. దైవప్రవక్త ﷺ విధానం కూడా ఇదే.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 99
హదీసు 100
السادس: عن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "المُؤمِن الْقَوِيُّ خيرٌ وَأَحبُّ إِلى اللَّهِ مِنَ المُؤْمِنِ الضَّعِيفِ وَفي كُلٍّ خيْرٌ. احْرِصْ عَلَى مَا ينْفَعُكَ، واسْتَعِنْ بِاللَّهِ وَلاَ تَعْجَزْ. وإنْ أصابَك شيءٌ فلاَ تقلْ: لَوْ أَنِّي فَعلْتُ كانَ كَذَا وَكذَا، وَلَكِنْ قُلْ: قدَّرَ اللَّهُ، ومَا شَاءَ فَعَلَ، فَإِنَّ لَوْ تَفْتَحُ عَمَلَ الشَّيْطَان ". رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికన్నా మెరుగైనవాడు, దేవునికి ప్రీతిపాత్రుడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ (బలవంతుడైనా, బలహీనుడైనా) మంచి ఉంటుంది. మీకు ప్రయోజనం చేకూర్చే దానికోసమే ఆశపడండి. దైవ సహాయాన్ని అర్థించండి. లొంగిపోకండి. మీకేదైనా నష్టం కలిగితే ఇలా చేసినట్లైతే ఆ విధంగా జరిగేదే! అని అనకండి. దానికి బదులు దైవ నిర్ణయం ఇదేనేమో! ఆయన తాను కోరినది చేశాడు అని అనండి. ఎందుకంటే 'అయితే గీతే' అన్న పదాలు షైతాన్ పోకడలకు దారితీస్తాయి.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని 'విధివ్రాత' ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “A strong believer is better and dearer to Allah than a weak one, and both are good. Adhere to that which is beneficial for you. Keep asking Allah for help and do not refrain from it. If you are afflicted in any way, do not say: `If I had taken this or that step, it would have resulted into such and such,’ but say only: `Allah so determined and did as He willed.’ The word `if’ opens the gates of satanic thoughts”.[Muslim].
ముఖ్యాంశాలు
- బలవంతుడైన విశ్వాసి, బలహీనుడైన విశ్వాసి – ఇరువురిలోనూ మంచి ఉంటుందని పై హదీసులో చెప్పబడింది. ఈమాన్ (విశ్వాసం) అనేది వారిరువురిలోనూ ఉమ్మడిగా వున్న ధర్మం. అయితే బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికన్నా యోగ్యుడనీ, అల్లాహ్కు ప్రియమైనవాడని చెప్పబడింది. ఎందుకంటే విశ్వాసి బలంగలవాడైతే ఆరాధనలు, విధులు, సున్నతులు చక్కగా నిర్వర్తించగలడు. ఇంకా దైవమార్గంలో పోరాడటానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
- కష్టాల వలయంలో చిక్కుకున్నప్పుడు సహనాన్ని, స్థైర్యాన్ని, దైవ నిర్ణయాల పట్ల తన అంగీకారభావాల్ని ప్రదర్శించాలి. అంతేగాని ఇలా చేసినట్లయితే అలా జరిగేది కాదేమో! అని అనకూడదు. ఎందుకంటే అయితే, గీతే అంటూ కాకిలెక్కలు వేసినప్పుడు షైతాన్కు మనిషిని సన్మార్గం నుండి తప్పించడానికి అవకాశం దొరుకుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 100
హదీసు 101
السابع: عَنْهُ أَنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "حُجِبتِ النَّارُ بِالشَّهَواتِ، وحُجِبتْ الْجَنَّةُ بَالمكَارِهِ" متفقٌ عَلَيهِ. وفي رواية لمسلم: "حُفَّت"بَدلَ"حُجِبتْ"وَهُوَ بمعناهُ: أيْ: بينهُ وبيْنَهَا هَذا الحجابُ، فإذا فعلَهُ دخَلها.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: నరకం మనోవాంఛలతో ఆవరించబడి ఉన్నది. స్వర్గం అవాంఛనీయమైన పనులతో కప్పబడి ఉన్నది. (బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో 'హుజిబత్'కు బదులు 'హుప్ఫత్' అన్న పదం ఉంది. రెండింటికీ అర్థం ఒక్కటే. మనిషికీ మరియు స్వర్గనరకాలకు మధ్య ఈ అడ్డుతెర ఉంది. మనిషి ఆయా పనులు చేస్తే స్వర్గంలోనో లేక నరకంలోనో ప్రవేశిస్తాడని భావం అన్నమాట.
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, ఇంకా సహీహ్ ముస్లింలోని స్వర్గభాగ్యాల వర్ణన ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said. “The (Hell) Fire is surrounded with all kinds of desires and passions, while Jannah is surrounded with adversities.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసుకు భావం ఏమిటంటే, మనిషికీ – నరకానికి మధ్య మనోవాంఛలు, ప్రాపంచిక సుఖాలు అడ్డంగా ఉన్నాయి. మనిషి తన మనోవాంఛలు, ప్రాపంచిక సుఖాల్లో చిక్కుకుంటే క్రమంగా అతను నరకంలోకి ప్రవేశిస్తాడు. దీనికి విరుద్ధంగా మనిషికీ – స్వర్గానికి మధ్య కష్టాలు, ఆపదలు లేదా ఇస్లాం ధర్మాదేశాలు, విధులు అడ్డంగా ఉన్నాయి. అలాంటి ఆపత్సమయాల్లో సహనాన్ని ప్రదర్శించడం, ఇస్లాం ధర్మ విధులను నిర్వర్తించడం మనిషికి ఒకింత కష్టంగా తోచినప్పటికీ పుణ్యఫలాపేక్షతో ఓర్చుకుంటే అతను స్వర్గప్రవేశానికి అర్హతను సంపాదిస్తాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 101
హదీసు 102
الثامن: عن أبي عبد اللَّه حُذَيْفةَ بنِ اليمانِ، رضي اللَّهُ عنهما، قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ذَاتَ ليَْلَةٍ، فَافَتَتَحَ الْبقرة، فقُلْت يرْكَعُ عِندَ المائة، ثُمَّ مَضَى، فَقُلْت يُصلِّي بِهَا في رَكْعةٍ، فَمَضَى فَقُلْت يَرْكَع بهَا، ثمَّ افْتتَح النِّسَاءَ، فَقَرأَهَا، ثمَّ افْتتح آلَ عِمْرانَ فَقَرَأَهَا، يَقْرُأُ مُتَرَسِّلاً إذَا مرَّ بِآيَةٍ فِيها تَسْبِيحٌ سَبَّحَ، وإِذَا مَرَّ بِسْؤالٍ سَأل، وإذَا مَرَّ بِتَعَوذٍ تَعَوَّذَ، ثُمَّ رَكَعَ فَجعل يقُول: "سُبحانَ رَبِّيَ الْعظِيمِ "فَكَانَ ركُوعُه نحْوا مِنْ قِيامِهِ ثُمَّ قَالَ: "سمِع اللَّهُ لِمن حمِدَه، ربَّنا لك الْحمدُ" ثُم قَام قِياماً طوِيلاً قَريباً مِمَّا ركَع، ثُمَّ سَجَدَ فَقالَ: "سُبْحَانَ رَبِّيَ الأعلَى" فَكَانَ سُجُوده قَرِيباً مِنْ قِيامِهِ". رواه مسلم.
హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒకరాత్రి నేను దైవప్రవక్త ﷺ వెంట నమాజు చేశాను. నమాజులో ఆయన బఖర సూరా చదవటం ప్రారంభించారు. నేను (మనసులో) ఆయన నూరు వాక్యాల తరువాత రుకూ చేస్తారని అనుకున్నాను. కాని (నూరు వాక్యాలు అయిపోయిన తరువాత కూడా) ఆయన పారాయణాన్ని కొనసాగించారు. నేను (మనసులో) ఒక రకాతులో దీనిని చదువుతారేమో అనుకున్నాను. కాని ఆ తరువాత కూడా ఆయన ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను ఈ సూరా పూర్తవగానే రుకూ చేస్తారేమో అనుకున్నాను. కాని (బఖరా సూరా పూర్తవగానే) ఆయన నిసా సూరా మొదలెట్టారు. అది కూడా పూర్తిగా చదివి ఆలి ఇమ్రాన్ సూరా చదవటం ప్రారంభించారు. అదీ పూర్తిగా చదివారు. నిదానంగా చదువుతూనే ఏదైనా వాక్యంలో దేవుని పవిత్రతను గురించిన ప్రస్తావన వస్తే అక్కడ దేవుని పవిత్రతను కొనియాడేవారు. దైవాన్ని అర్థించమనే వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ ఆగి దైవాన్ని అర్థించేవారు, దేవుని శరణు వేడే ప్రస్తావన వస్తే దైవాన్ని శరణువేడుకునేవారు. (ఈ విధంగా ఆలి ఇమ్రాన్ సూరా పూర్తయిన తరువాత) ఆయన రుకూ చేశారు. రుకూలో 'సుబ్హాన రబ్బియల్ అజీం' అని పలికారు. ఆయన రుకూ దాదాపు ఆయన ఖియామ్ (నిలబడి) నంతసేపు పట్టింది. తరువాత ఆయన 'సమియల్లాహు లిమన్ హమిదా' అంటూ రుకూ నుంచి లేచి నిలబడ్డారు. అప్పుడు కూడా ఇంచుమించు రుకూ చేసినంతసేపు నిలబడ్డారు (ఖౌమా చేశారు.) ఆ తరువాత సజ్దా చేశారు. సజ్దాలో 'సుబ్హాన రబ్బియల్ ఆలా' అని చదివారు. ఆయన సజ్దా కూడా ఆయన నిలబడినంతసేపు పట్టింది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని 'ప్రయాణీకుల నమాజు' ప్రకరణం)
English
Hudhaifah (radiyallahu anhu) reported: I offered Salat (Tahajjud – optional night prayer) with the Prophet ﷺ one night, and he started reciting (Surat) Al-Baqarah. I thought that he would bow at the end of one hundred Verses, but he continued reciting; I, then, thought that he would perhaps recite the whole (Surah) in a Rak`ah, but he proceeded on, and I thought he would perhaps bow on completing (this Surah); he then started (reciting Surat) An-Nisa’; he then started (Surat) Al-`Imran and his recitation was unhurried. And when he recited the Verses which referred to the Glory of Allah, he glorified Him (by saying Subhan Allah – My Rubb, the Supreme is far removed from every imperfection), the Great, and when he recited the Verses that mention supplication, he supplicated, and when he recited the Verses that mention seeking Refuge of the Rubb, he sought (His) Refuge. Then he bowed and said: “My Rubb, the Supreme is far removed from every imperfection (Subhana Rabbiyal-Azim);” his bowing lasted about the same length of time as his standing (and then on returning to the standing posture after Ruku`) he said: “Allah listened to him who praised Him (Sami` Allahu liman hamidah, Rabbana wa lakal hamd).” Then he stood about the same length of time as he had spent in bowing. He then prostrated himself and said: “My Rubb, the Supreme is far removed from every imperfection (Subhana Rabbiyal-A`la),” and his prostration lasted nearly the same length of time as his standing.[Muslim].
ముఖ్యాంశాలు
- నఫిల్ నమాజులను సామూహికంగా చేయవచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.
- నమాజులో ఖుర్ఆన్ పారాయణం చేసినప్పుడు సూరాల వరుస క్రమాన్ని పాటిస్తూ చదవాలన్న నియమం లేదు. కొంతమంది వరుసక్రమాన్ని పాటించడం అవసరమని తలపోస్తున్నారు. కాని హదీసులో దైవప్రవక్త ﷺ ముందుగా సూరె నిసాను పఠించి ఆ తరువాత ఆలి ఇమ్రాన్ సూరాను పఠించడం గమనార్హం!
- నఫిల్ నమాజులను సుదీర్ఘంగా చేయడం అభిలషణీయం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 102
హదీసు 103
التاسع: عن ابن مسعودٍ رَضِيَ اللَّهُ عنه قَالَ: صلَّيْت مَعَ النَبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَيلَةً، فَأَطَالَ الْقِيامَ حتَّى هممْتُ أَنْ أجْلِسَ وَأدعَهُ. متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక రాత్రి నేను దైవప్రవక్త ﷺతో పాటు నమాజ్ చేశాను. ఆ నమాజులో దైవప్రవక్త ﷺ చాలా సేపు నిలబడి ఉన్నారు. నేను (ఆయనతో పాటు నిలబడలేక) ఒక చెడుపని చేద్దామని సంకల్పించుకున్నాను.
'అప్పుడు మీరేమి చేయదలచుకున్నారు?' అని ఎవరో అడగ్గా, "నేను ఆ నమాజులో దైవప్రవక్తను అనుసరించకుండా కూర్చుందామనుకున్నాను" అని ఆయన చెప్పారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని 'తహజ్జుద్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: One night I joined the Prophet ﷺ in his (optional) Salat. He prolonged the standing so much that I thought of doing something evil. He was asked: “What did you intend to do?” He replied: “To sit down and leave him”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- నమాజులో ఇమామ్ను అనుసరించకుండా దానికి వ్యతిరేకమైన పనులు చేయటం చెడ్డ పని అని ఈ హదీసు చెబుతోంది. ఎందుకంటే ముఖ్తదీలు (అనుయాయులు) తప్పకుండా ఇమామ్ను అనుసరించాలని ఆదేశించబడింది.
- సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ప్రశ్నించడం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 103
హదీసు 104
العاشر: عن أنس رضي اللَّه عنه عن رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يتْبعُ الميْتَ ثلاثَةٌ: أهلُهُ ومالُه وعمَلُه، فيرْجِع اثنانِ ويبْقَى واحِدٌ: يرجعُ أهلُهُ ومالُهُ، ويبقَى عملُهُ" متفقٌ عَلَيهِ.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : మృతుని వెంట మూడు వస్తువులు వెళతాయి – అతని పరివారం, అతని సంపత్తి, అతని కర్మలు. వాటిలో రెండు వస్తువులు వెనక్కి తిరిగి వస్తాయి. ఒక్కటి మాత్రం అతనికి తోడుగా ఉంటుంది. అతని పరివారం, అతని ధనసంపదలు తిరిగి వస్తాయి. అతను చేసుకున్న కర్మలు మాత్రం తోడుగా ఉంటాయి. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)
English
Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Three follow a dead body: members of his family, his possessions and his deeds. Two of them return and one remains with him. His family and his possessions return; his deeds remain with him”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషి వీలైనంత ఎక్కువగా సత్కర్మలు చేసుకోవాలని ఈ హదీసులో పురికొల్పడం జరిగింది. మనిషి చనిపోయిన తరువాత అతని బంధుమిత్రులందరూ అతణ్ణి సమాధిలో పూడ్చిపెట్టి అతణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు. అలాంటి భయంకరమైన సమాధి చీకట్లలో అతని సదాచరణ ఒక్కటే తోడుగా ఉండి, అతణ్ణి అక్కడి యాతనల నుంచి కాపాడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 104
హదీసు 105
الحادي عشر: عن ابن مسعودٍ رضيَ اللَّهُ عنه قَالَ: قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الجَنَّةُ أقَربُ إِلَى أَحدِكُم مِنْ شِراكِ نَعْلِهِ والنَّارُ مِثْلُ ذلِكَ" رواه البخاري.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : స్వర్గం మీ పాదుక పట్టీకన్నా మీకు దగ్గరలో ఉంది. అదేవిధంగా నరకం కూడా అంతే సమీపంలో ఉంది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Jannah is nearer to anyone of you than your shoe-lace, and so is the (Hell) Fire”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
స్వర్గమైనా, నరకమైనా మనిషి చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా లభించేదే కాబట్టి ఈ రెండూ మనిషికి అత్యంత సమీపంలో ఉన్నాయని, చేతికందినంత దగ్గరలో ఉన్నాయని హదీసులో అభివర్ణించడం జరిగింది. మనిషి సత్కర్మలు చేస్తే స్వర్గానికి పోతాడు, దుష్కర్మలు చేస్తే నరకాగ్నికి ఆహుతి అవుతాడు. మనిషికీ, స్వర్గ నరకాలకు మధ్య ఒక్క మరణమే అడ్డుగోడగా ఉంది. అది తొలగిపోయిననాడు అతడు స్వర్గ సుఖాలకు అర్హుడవుతాడో లేక నరక జ్వాలలకు ఆహుతి అవుతాడో తేల్చేయడం జరుగుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 105
హదీసు 106
الثاني عشر: عن أبي فِراس رَبِيعةَ بنِ كَعْبٍ الأسْلَمِيِّ خادِم رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ومِنْ أَهْلِ الصُّفَّةِ رضي اللَّهُ عنه قَالَ: كُنْتُ أبيتُ مَعَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فآتِيهِ بِوَضوئِهِ، وحاجتِهِ فَقَالَ: "سلْني"فقُلْت: أسْألُكَ مُرافَقَتَكَ في الجنَّةِ. فقالَ:"أوَ غَيْرَ ذلِك؟ "قُلْت: هُوَ ذَاك. قَالَ:"فأَعِنِّي عَلَى نَفْسِكَ بِكَثْرةِ السجُودِ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ సేవకులు మరియు సుప్ఫా విద్యార్థుల్లో ఒకరైన హజ్రత్ అబూ ఫిరాస్ రబీయా బిన్ కాబ్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం : నేను రాత్రిపూట దైవప్రవక్త ﷺ వెంట ఉండేవాడిని. ఆ సమయంలో నేనాయనకు వుజూ చేసుకోవటానికి నీళ్ళు, ఇతర అవసరమైన వస్తువులు అందించేవాణ్ణి. (ఒకరోజు ఆయన నా పట్ల ప్రసన్నులై) "నానుండి నీకేం కావాలో కోరుకో" అన్నారు. అందుకు నేను "స్వర్గంలో మీకు తోడుగా ఉండే భాగ్యాన్ని కోరుకుంటున్నాను" అని విన్నవించుకున్నాను. తిరిగి ఆయన "ఇంకా ఏమైనా కోరుకుంటున్నావా" అని అడిగారు. దానికి నేను "అది చాలు" అని అన్నాను. అప్పుడు ఆయన "మరయితే దానికోసం ఎక్కువగా సజ్దాలు చేస్తూ నాకు చేదోడుగా ఉండు" అని అన్నారు. (అంటే ఎక్కువగా నఫిల్ నమాజులు చేస్తూ ఉండు. ఈ విధంగా కోరిక సిద్ధించే మార్గంలో నాకు చేదోడుగా ఉండు. ఎందుకంటే నా ప్రార్థనతోపాటు నీ శ్రమ కూడా దానికి మరింత బలం చేకూర్చుతుంది.)
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)
English
Rabi`ah bin Ka`b Al-Aslami (radiyallahu anhu) (a servant of the Messenger of Allah and also one of the people of As-Suffah) said: I used to spend my night in the company of Messenger of Allah ﷺ and used to put up water for his ablutions. One day he said to me, “Ask something of me.” I said: “I request for your companionship in Jannah”. He inquired, “Is there anything else?” I said, “That is all.” He said, “Then help me in your request by multiplying your prostrations”.[Muslim].
ముఖ్యాంశాలు
- మస్జిదె నబవీ ప్రాంగణంలో ఒక అరుగు ఉండేది. అరబీ భాషలో అరుగును "సుప్ఫా" అంటారు. ఇస్లాంలో ఇది ప్రప్రథమ విద్యాపీఠం. దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారే ఈ విద్యాపీఠానికి గురువుగా, బోధకునిగా వ్యవహరించేవారు. దైవప్రవక్త దగ్గర ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చే నిరుపేదలు, అభాగ్యులైన విద్యార్థులు ఈ అరుగు దగ్గరే కాలం గడిపేవారు.
- ఈ హదీసు ఆచరణలోని ప్రాముఖ్యతను, దైవప్రవక్త విధానాన్ని అనుసరించవలసిన ఆవశ్యకతను తేటతెల్లం చేసింది. ఈ రెండూ లేకపోతే రేయింబవళ్ళు దైవప్రవక్తతో పాటు గడిపిన ఆయన ప్రియసహచరులకు కూడా స్వర్గంలో ఆయన సాంగత్యం లభించదని హెచ్చరిస్తోంది. మరలాంటప్పుడు ఆచరణకు, దైవప్రవక్త ﷺ విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వని వారికి ఆ భాగ్యం లభిస్తుందనడం సరైనదేనా?!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 106
హదీసు 107
الثالث عشر: عن أبي عبد اللَّه ويُقَالُ: أبُو عبْدِ الرَّحمنِ ثَوْبانَ موْلى رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: سمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "عليكَ بِكَثْرةِ السُّجُودِ، فإِنَّك لَنْ تَسْجُد للَّهِ سجْدةً إلاَّ رفَعكَ اللَّهُ بِهَا دَرجَةً، وحطَّ عنْكَ بِهَا خَطِيئَةً "رواه مسلم.
దైవప్రవక్త ﷺ చేత స్వేచ్ఛనొసగబడిన బానిస, హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ (కొంతమంది అబూ అబ్దుర్రహ్మాన్ అంటారు) సౌబాన్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త ఈ విధంగా ఉపదేశిస్తుండగా తాను విన్నానని తెలియజేశారు: "సౌబాన్! నీవు ఎక్కువగా సజ్దాలు చేస్తూ ఉండు. ఎందుకంటే నీవు చేసే ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీకు ఒకింత పదోన్నతి కల్పిస్తాడు. మరియు ఒక పాపాన్ని తొలగిస్తాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Thauban (radiyallahu anhu) said: I heard Messenger of Allah ﷺ saying, “Perform Salah more often. For every prostration that you perform before Allah will raise your position one degree and will remit one of your sins”.[Muslim].
ముఖ్యాంశాలు
సజ్దాలు ఎక్కువగా చేయడమంటే నమాజులు పాటించడమని అర్థం. ఫర్జ్ నమాజులే గాకుండా నఫిల్ నమాజులు కూడా చేస్తూ ఉంటే అవి విశ్వాసి స్థానాలను ఉన్నతం చేయటంతోపాటు పాపాలకు పరిహారంగా కూడా దోహదపడతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 107
హదీసు 108
الرابع عشر: عن أَبي صَفْوانَ عبدِ اللَّه بنِ بُسْرٍ الأسلَمِيِّ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "خَيْرُ النَّاسِ مَن طالَ عمُرُه وَحَسُنَ عملُه" رواه الترمذي، وَقالَ حديثٌ حسنٌ. "بُسْر": بضم الباءِ وبالسين المهملة.
హజ్రత్ అబూ సఫ్వాన్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : దీర్ఘాయుషుతో పాటు సదాచరణ కలిగిన వ్యక్తి ప్రజలందరిలోకెల్లా ఉత్తముడు.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు.)
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయములు)
English
`Abdullah bin Busr Al-Aslami (radiyallahu anhu) said: Messenger of Allah ﷺ said, “The best of people is one whose life is long and his conduct is good”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
విశ్వాసం (ఈమాన్), సదాచరణలతోపాటు దీర్ఘాయుషు లభించడం కూడా ఒక వరమే. దీనికి విరుద్ధంగా ఈ రెండింటిలో ఏది లోపించినా ఆయువు పెరిగిన కొద్దీ జీవితం పాపాల పుట్టగా తయారవుతుంది. ఇటువంటి దీర్ఘాయుషు మనిషి పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది.
2. ఈ వరం విలువను గుర్తించనివారు చాలా నష్టపోతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 108
హదీసు 109
الخامس عشر: عن أنسٍ رضي اللَّه عنه، قَالَ: غَاب عمِّي أَنَسُ بنُ النَّضْرِ رضي اللَّهُ عنه، عن قِتالِ بدرٍ، فَقَالَ: يَا رسولَ اللَّه غِبْت عَنْ أوَّلِ قِتالٍ قَاتلْتَ المُشرِكِينَ، لَئِنِ اللَّهُ أشْهَدَنِي قتالَ المُشركِينَ لَيُرِيَنَّ اللَّهُ مَا أصنعُ، فَلَمَّا كانَ يومُ أُحدٍ انْكشَفَ المُسْلِمُون فَقَالَ: اللَّهُمَّ أعْتَذِرُ إليْكَ مِمَّا صنَع هَؤُلاءِ يَعْني أصْحَابَه وأبرأُ إلَيْكَ مِمَّا صنعَ هَؤُلاَءِ يَعني المُشْرِكِينَ ثُمَّ تَقَدَّمَ فَاسْتَقْبَلَهُ سعْدُ بْنُ مُعاذٍ، فَقالَ: يَا سعْدُ بْنَ معُاذٍ الْجنَّةُ ورَبِّ الكعْبةِ، إِنِى أجِدُ رِيحَهَا مِنْ دُونِ أُحُدٍ. قَالَ سعْدٌ: فَمَا اسْتَطعْتُ يا رسول اللَّه ماصنَعَ، قَالَ أنسٌ: فَوجدْنَا بِهِ بِضْعاً وثمانِينَ ضَرْبةً بِالسَّيفِ، أوْ طَعْنَةً بِرُمْحٍ، أَوْ رمْيةً بِسهْمٍ، ووجدْناهُ قَد قُتِلَ وَمثَّلَ بِهِ المُشرِكُونَ فَما عرفَهُ أَحدٌ إِلاَّ أُخْتُهُ بِبنَانِهِ. قَالَ أنسٌ: كُنَّا نَرى أوْ نَظُنُّ أنَّ هَذِهِ الآيَة نزلَتْ فيهِ وَفِي أشْباهِهِ: {مِنَ الْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا مَا عَاهَدُوا اللَّهَ عَلَيْهِ} [الأحزاب:٢٣] إِلَى آخِرها. متفقٌ عَلَيهِ. قوله:"لَيُريَنَّ اللَّهُ"رُوى بضم الياءِ وكسر الراءِ، أي لَيُظْهِرنَّ اللَّهُ ذَلِكَ لِلنَّاسِ، ورُوِى بفتحهما، ومعناه ظاهر، واللَّه أعلم.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : నా బాబాయి అనస్ బిన్ నజర్ బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. (అందుకు ఆయన ఎంతగానో విచారపడేవారు). ఒకసారి ఆయన దైవప్రవక్త ﷺతో ఇలా అన్నారు – "దైవప్రవక్తా! మీరు బహుదైవారాధాకులతో చేసిన తొలి యుద్ధంలో నేను పాల్గొనలేదు. ఒకవేళ దేవుడు భవిష్యత్తులో నాకు బహుదైవారాధకులతో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించినట్లయితే అప్పుడు నేనేం చేస్తానో అల్లాహ్ చూస్తాడు (లేక చూపిస్తాడు)."
(కొంతకాలం తరువాత) ఉహుద్ యుద్ధం జరిగిన నాడు (ప్రారంభంలో) ముస్లింలు చెల్లాచెదరై ఓడిపోయారు. అప్పుడు ఆయన (నా బాబాయి) ఇలా అన్నారు – "ఓ దేవా! వీరి (వెనక్కి తగ్గిపోయిన నా స్నేహితుల) చేతకానితనానికి, ఇంకా ఈ బహుదైవారాధకుల నిర్వాకానికి నేను అతీతుణ్ణి" (ఇలా అన్న తరువాత) ఆయన ముందుకు నడిచారు. అప్పుడు ఆయనకు సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఎదురయ్యారు. ఆయన సాద్ (రదియల్లాహు అన్హు) నుద్దేశించి "ఓ సాద్ బిన్ ముఆజ్! కాబాగృహపు ప్రభువుతోడు! ఉహుద్ కొండలకన్నా దగ్గర్లో నుంచి నాకు స్వర్గసువాసన వస్తోంది" అంటూ (శత్రువుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి వీరోచితంగా పోరాడుతూ అమరగతినొందారు.) అప్పుడు హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) "దైవప్రవక్తా! ఆయన చేసినది నా వల్ల కాలేకపోయింది" అని విచారం వ్యక్తం చేశారు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అంటున్నారు : మేము ఆయన శరీరంపై ఎనభై కంటే ఎక్కువ ఖడ్గం వేటులు, ఈటె పాడుపులు మరియు బాణాల గాయాలు చూశాము. మేము చూసేటప్పటికే ఆయన హత్యచేయబడి వున్నారు. హత్యచేయబడిన తరువాత బహుదైవారాధకులు ఆయన మృతదేహాన్ని చీల్చి చెండాడారు. (ఆగ్రహావేశాలతో ఆయన శరీరావయవాలను ముక్కలు ముక్కలుగా నరికారు. ముఖాన్ని పాడు చేశారు). అందువల్ల ఎవరూ ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. చివరికి ఆయన చెల్లెలు ఆయన్ని వ్రేళ్ళ చిగుళ్ళ ఆధారంగా గుర్తుపట్టింది. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు : బహుశా ఈ దివ్య ఖుర్ఆన్ సూక్తి ఈయన మరియు ఈయన లాంటివారి గురించే అవతరించిందని మేమనుకుంటున్నాము- "విశ్వాసులలో కొందరు అల్లాహ్కు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపినవారు ఉన్నారు……" (పూర్తి ఆయతు) (అల్ అహ్జాబ్ : 23)
(బుఖారీ – ముస్లిం)
'లయురియన్నల్లాహు' అంటే అల్లాహ్ దానిని ప్రజలముందు బహిరంగపరుస్తాడు. ఇది 'లయరయన్నల్లాహు' అని కూడా ఉల్లేఖించబడుతోంది. అప్పుడు దీనికి అల్లాహ్ చూస్తాడు అని అర్థం. (వల్లాహు ఆలము)
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)
English
Anas (radiyallahu anhu) said: My uncle Anas bin An-Nadr (radiyallahu anhu) was absent from the battle of Badr and he said: “O Messenger of Allah! I was absent from the first battle you fought against the pagans, and if Allah let me participate in a battle against the pagans, Allah will see what I do.” So he encountered the day of Uhud Battle. The Muslims left the positions (the Prophet ﷺ told them to keep) and were defeated, he said: “O Allah! excuse these people (i.e., the Muslims) for what they have done, and I am clear from what the pagans have done“. Then he went forward with his sword and met Sa`d bin Mu`adh (fleeing) and said to him: “By the Rubb of the Ka`bah! I can smell the fragrance of Jannah from a place closer than Uhud Mount“. Sa`d said: “O Messenger of Allah, what he did was beyond my power”. Anas said: “We saw over eighty wounds on his body caused by stabbing, striking and shooting of arrows and spears. We found that he was killed, and mutilated by the polytheists. Nobody was able to recognize him except his sister who recognized him by the tips of his fingers.” Anas (radiyallahu anhu) said: “We believe that the Ayah `Among the believers are men who have been true to their covenant with Allah [i.e., they have gone out for Jihad (holy fighting), and showed not their backs to the disbelievers]…’ (33:23), refers to him and his like”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- దైవమార్గంలో అమరగతినొంది స్వర్గంలోకి ప్రవేశించాలని ప్రవక్త సహచరులు ఎంతగా పరితపించిపోయేవారో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది.
- మనిషి స్వచ్ఛందంగా మంచిపనులు చేయాలని భావించి దాని కోసం స్వయంగా కట్టుబడి ఉండటం ఎంతో అభిలషణీయమని కూడా ఈ హదీసు బోధపరుస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 109
హదీసు 110
السادس عشر: عن أبي مسعود عُقْبَةَ بن عمروٍ الأنصاريِّ البدريِّ رضي اللَّهُ عنه قَالَ: لمَّا نَزَلَتْ آيةُ الصَّدقَةِ كُنَّا نُحَامِلُ عَلَى ظُهُورِنا. فَجَاءَ رَجُلٌ فَتَصَدَّقَ بِشَيْءٍ كَثِيرٍ فَقَالُوا: مُراءٍ، وجاءَ رَجُلٌ آخَرُ فَتَصَدَّقَ بِصَاعٍ فقالُوا: إنَّ اللَّه لَغَنِيٌّ عَنْ صاعِ هَذَا، فَنَزَلَتْ {الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لا يَجِدُونَ إِلاَّ جُهْدَهُمْ} الآية [التوبة: ٧٩] متفقٌ عليه. "ونُحَامِلُ"بضم النون، وبالحاءِ المهملة: أَيْ يَحْمِلُ أَحَدُنَا على ظَهْرِهِ بِالأجْرَةِ، وَيَتَصَدَّقُ بها.
హజ్రత్ అబూ మస్వూద్ ఉఖబా బిన్ అమ్ర్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం: సదఖా (దానధర్మాల) సూక్తి అవతరించిన కాలంలో మేము వీపులపై మోపులు మోసేవాళ్ళం (అంటే కాయకష్టం చేసుకొని బ్రతికేవాళ్ళం). అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో దానధర్మాలు చేశాడు. దానికి కపటులు ఇతను పరుల మెప్పుకోసం దానధర్మాలు చేస్తున్నాడని నిరుత్సాహపరచారు. మరో వ్యక్తి ఒక 'సా' (దాదాపు రెండున్నర కిలోల) ధాన్యం దానం చేయగా దేవుడికి ఈ రెండున్నర కిలోల ధాన్యం అక్కర్లేదంటూ కపటులు అతణ్ణి హేళన చేశారు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది : "సంతోషంతో, ఇష్టంతో విశ్వాసులు చేసే ధన త్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడతారు. దేవుని మార్గంలో ఇచ్చేందుకు తాము శ్రమకోర్చి ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేనివారిని వారు హేళన చేస్తారు." (అత్ తౌబా:79)
(బుఖారీ – ముస్లిం)
వాక్యాలు మాత్రం బుఖారీలోనివి.
'నుహామిలు' అంటే మాలోని ఒక వ్యక్తి తన వీపుపై మోపులు మోసి దానివల్ల వచ్చిన కూలిని దానం చేసేవాడని భావం.
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణంలోనూ, మరియు సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)
English
Abu Mas`ud `Uqbah bin `Amr Al-Ansari (radiyallahu anhu) said: When the Ayah enjoining Sadaqah (charity) was revealed,* we used to carry loads on our backs to earn something that we could give away in charity. One person presented a considerable amount for charity and the hypocrites said: “He has done it to show off.” Another one gave away a few Sa` of dates and they said: “Allah does not stand in need of this person’s dates”. Thereupon, it was revealed:
“Those who defame such of the believers who give charity (in Allah’s Cause) voluntarily, and such who could not find to give charity (in Allah’s Cause) except what is available to them…” (9:79)[Al-Bukhari and Muslim].
* This is the A’yah in which Allah says! “Take Sadaqah (alms) from their wealth in order to purify them and sanctify them with it, and suppliate Allah for them…” (9:103)
ముఖ్యాంశాలు
ప్రతి మనిషీ తన శక్తిమేరకు దైవమార్గంలో ఖర్చుపెట్టాలని ఈ హదీసు బోధపరుస్తోంది. ఉంటే ఏదైనా ఇవ్వొచ్చు, లేకుంటే కొంతైనా దైవమార్గంలో ఖర్చుపెట్టవచ్చు. ఎక్కువగా దానధర్మాలు చేసేవారిని పరుల మెప్పుకోసం చేస్తున్నారని నిరుత్సాహపరచటం, తక్కువగా దానధర్మాలు చేసేవారిని హేళన చేయడం కపటుల లక్షణం అని కూడా పై హదీసు ద్వారా తెలుస్తోంది. విశ్వాసులు ఇలాంటి కపటాచారుల హేళనలకు నొచ్చుకోకుండా, తాము కూడా ఇతరులతో ఈ విధమైన దుర్భాషలాడకుండా జాగ్రత్తగా మసలుకోవాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 110
హదీసు 111
السابَع عشر: عن سعيدِ بنِ عبدِ العزيزِ، عن رَبيعةَ بنِ يزيدَ، عن أَبِي إدريس الخَوْلاَنيِّ، عن أَبِي ذَرٍّ جُنْدُبِ بنِ جُنَادَةَ، رضي اللَّهُ عنه، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فيما يَرْوِى عَنِ اللَّهِ تباركَ وتعالى أنَّهُ قَالَ: "يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّماً فَلاَ تَظالمُوا، يَا عِبَادِي كُلُّكُم ضَالٌّ إِلاَّ مَنْ هَدَيْتُهُ، فَاسْتَهْدُوني أهْدكُمْ، يَا عِبَادي كُلُّكُمْ جائعٌ إِلاَّ منْ أطعمتُه، فاسْتطْعموني أطعمْكم، يَا عِبَادي كُلُّكُمْ عَارٍ إلاَّ مِنْ كَسَوْتُهُ فَاسْتَكْسُوني أكْسُكُمْ، يَا عِبَادِي إنَّكُمْ تُخْطِئُونَ بِاللَّيْلِ وَالنَّهَارِ وَأَنَا أغْفِرُ الذُّنُوبَ جَمِيعاً، فَاسْتَغْفِرُوني أغْفِرْ لَكُمْ، يَا عِبَادِي إِنَّكُمْ لَنْ تَبْلُغُوا ضُرِّي فَتَضُرُّوني، وَلَنْ تَبْلُغُوا نَفْعِي فَتَنْفَعُوني، يَا عِبَادِي لَوْ أَنَّ أوَّلَكُمْ وآخِركُمْ، وَإنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوا عَلَى أتقَى قلبِ رجلٍ واحدٍ مِنْكُمْ مَا زادَ ذلكَ فِي مُلكي شيئاً، يَا عِبَادِي لَوْ أَنَّ أوَّلكم وآخرَكُم وإنسَكُم وجنكُمْ كَانوا عَلَى أفْجَرِ قَلْبِ رَجُلٍ وَاحِدٍ مِنْكُمْ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِي شَيْئاً، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِركُمْ وَإنْسَكُمْ وَجِنَّكُمْ، قَامُوا فِي صَعيدٍ وَاحدٍ، فَسألُوني فَأعْطَيْتُ كُلَّ إنْسانٍ مَسْألَتَهُ، مَا نَقَصَ ذَلِكَ مِمَّا عِنْدِي إِلاَّ كَمَا َيَنْقُصُ المِخْيَطُ إِذَا أُدْخِلَ البَحْرَ، يَا عِبَادِي إنَّما هِيَ أعْمَالُكُمْ أُحْصِيهَا لَكُمْ، ثُمَّ أوَفِّيكُمْ إيَّاهَا، فَمَنْ وَجَدَ خَيْراً فَلْيَحْمِدِ اللَّه، وَمَنْ وَجَدَ غَيْرَ ذَلِكَ فَلاَ يَلُومَنَّ إلاَّ نَفْسَهُ ". قَالَ سعيدٌ: كَانَ أَبُو إدريس إِذَا حدَّثَ بهذا الحديث جَثَا عَلَى رُكبتيه. رواه مسلم. وروينا عن الإمام أحمد بن حنبل رحمه اللَّه قَالَ: لَيْسَ لأهل الشام حديث أشرف من هذا الحديث.
దైవప్రవక్త ﷺ అల్లాహ్ నుండి విన్న వృత్తాంతాన్ని సయీద్ బిన్ అబ్దుల్ అజీజ్, రబీయా బిన్ యజీద్ నుండి, ఆయన అబూ ఇద్రీస్ ఖౌలానీ నుండి, మరి ఆయన హజ్రత్ అబూజర్ జుందుబ్ బిన్ జునాదా (రదియల్లాహు అన్హు) నుండి సేకరించారు : (అల్లాహ్ ఇలా అన్నాడు) "ఓ నా దాసులారా! నేను నాపై అన్యాయాన్ని నిషేధించుకున్నాను. అదే విధంగా మీ మధ్య కూడా దానిని నిషేధించాను. కనుక మీరు పరస్పరం అన్యాయానికి ఒడిగట్టకండి. నా దాసులారా! నేను సన్మార్గం చూపించినవాడు తప్ప మీరందరూ మార్గభ్రష్టులే. కనుక మార్గం చూపెట్టమని నన్ను అడగండి. నేను మీకు సన్మార్గం చూపిస్తాను. దాసులారా! నేను తినిపించినవాడు తప్ప మీరందరూ ఆకలిగొన్న వారే. కనుక అన్నం పెట్టమని నన్నడగండి. నేను మీకు అన్నం తినిపిస్తాను. దాసులారా! నేను బట్టలు తొడిగించిన వాడు తప్ప మీరంతా నగ్నంగా ఉన్నవారే. కనుక బట్టలకోసం నన్ను అర్థించండి, నేను మీకు బట్టలు తొడిగిస్తాను. నా దాసులారా! మీరు రాత్రింబవళ్ళు తప్పులు చేస్తుంటారు. నేను పాపాలన్నింటినీ తుడిచిపెట్టగలవాడను. కనుక క్షమాభిక్ష కోసం నన్ను మొరపెట్టుకోండి. మిమ్మల్ని నేను మన్నిస్తాను. నా దాసులారా! మీరు నాకు కీడు తలపెట్టే స్థానానికి చేరుకోలేరు. నాకు మేలు చేసే స్థాయికీ ఎదగలేరు.
ఓ నా దాసులారా! మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు, జిన్నాతులందరూ కూడా మీలో అత్యంత దైవభక్తిపరాయణుడైన ఒక వ్యక్తిలా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసుమంత ప్రయోజనం ఉండదు. (అంతేకాదు) నా దాసులారా! మొదటి నుంచీ చివరిదాకా మీ మానవులు, జిన్నాతులందరూ కూడా మీలో అందరికన్నా పరమ అవిధేయిలాగా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసుమంత లోటు ఉండదు. ఓ నా దాసులారా! మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు, జిన్నాతులందరూ ఒక స్థలంలో నిలబడి (తమ కోరికలు) నాతో అడిగితే, నేను వారందరికీ కోరుకున్నది ఇచ్చినప్పటికీ దానివల్ల నా దగ్గరున్న సంపదలో ఒక సూదిని సముద్రంలో ముంచి తీసినంతైనా లోటు ఏర్పడదు. నా దాసులారా! మీ కర్మలను నేను లెక్కపెట్టి ఉంచుతాను. ఆ తరువాత వాటికి పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాను. కనుక ఎవరికైనా మేలు కలిగితే అందుకు అతను దైవాన్ని స్తుతించాలి. ఎవరికైనా ఇతరత్రా ఏమైనా (కీడు) కలిగితే అందుకతను తన స్వయాన్నే నిందించుకోవాలి.
సయీద్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) ఉవాచ : అబూ ఇద్రీస్ ఖౌలానీ గారు ఎప్పుడు ఈ హదీసును వివరించినా తన మోకాళ్ళ ఆధారంగా పడిపోయేవారు. (దీనిని ముస్లిం ఉల్లేఖించారు. మేము దీనిని ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) నుండి ఉల్లేఖించాము. ఆయన "సిరియా వాసుల దృష్టిలో దీనికన్నా విశిష్టత కలిగిన హదీసు మరొకటి లేదు" అని అన్నారు.)
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)
English
Abu Dharr (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Allah, the Exalted, and Glorious, said; ‘O My slaves, I have prohibited Myself injustice; and have made oppression unlawful for you, so do not oppress one another. O My slaves, all of you are liable to err except the one whom I guide on the Right Path, so seek guidance from Me so that I will guide you to the Right Path. O My slaves, all of you are hungry except the one whom I feed, so ask food from Me, I will feed you. O My slaves, all of you are naked except those whom I clothe, so ask clothing of Me and I shall clothe you. O My slaves, you commit sins night and day and I forgive all sins, so seek My forgiveness and I shall forgive you. O My slaves, you can neither do Me any harm nor can you do Me any good. O My slaves, were the first of you and the last of you, the human of you and jinn of you to be as pious as the most pious heart of any man of you, that would not increase My domain a thing. O My slaves, were the first of you, and the last of you, the human of you and the jinn of you to be as wicked as the most wicked heart of any man of you, that would not decrease My domain in a thing. O My slaves, were the first of you and the last of you, the human of you and the jinn of you to stand in one place and make a request of Me, and were I to give everyone what he requested, that would not decrease what I have, any more than a needle decrease the sea if put into it. O My slaves, it is but your deeds that I reckon for you and then recompense you for, so let him who finds good (i.e., in the Hereafter) praise Allah and let him who finds other than that blame no one but himself.”’.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దేవుని శక్తిసామర్థ్యాలు, తిరుగులేని ఆయన ఆధిపత్యం విశదీకరించబడ్డాయి. కాబట్టి దాసులు ఏది అడగదలచుకున్నా ఆయన్నే అడగాలి. సన్మార్గం నుండి ఆహారం వరకు అన్నిరకాల భాండాగారాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ భాండాగారాలు కూడా ఏనాటికీ అంతం కానివి. విశ్వమంతా ఏకమై వ్యతిరేకించినా లేక సమర్థించినా ఎలాంటి మార్పులకూ గురికాని పటిష్టమైన రాజ్యాధికారం ఆయనది. అందుకే మనిషి అల్లాహ్ వాడై, క్షమాభిక్ష కోసం ఆయన్నే వేడుకుంటూ, తన అవసరాలు తీర్చమని ఆయన్ని మొరపెట్టుకోవడంలోనే అతని శ్రేయం ఇమిడివుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|11. పోరాట పటిమ|హదీసు 111
You must be logged in to post a comment.