హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 107. పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 107వ అధ్యాయం: పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి, మధ్యలో నుండి తీసుకొని తినకూడదు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 744 – 745) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

107. పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి, మధ్యలో నుండి తీసుకొని తినకూడదు

↑ విషయ సూచిక

باب الأمر بالأكل من جانب القصعة والنهي عن الأكل من وسطها فِيهِ: قَوْله صلى الله عليه وسلم: "وَكُلْ مِمَّا يَلِيكَ". متفق عليه كما سبق.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మీకు దగ్గరలో ఉన్నవాటిని తినండి. (బుఖారీ – ముస్లిం) ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది.

744

హదీసు 744

عن ابن عباس رضيَ اللَّه عنهما عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الْبَرَكَةُ تَنْزِلُ وَسَطَ الطَّعَام فَكُلُوا مِنْ حَافَّتَيْهِ ولاَ تَأْكُلُوا مِن وَسَطِهِ" رواه أَبُو داود، والترمذي، وقال: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : శుభం అన్నం మధ్యలో అవతరిస్తుంది. కనుక మీరు దాని ఇరు ప్రక్కల నుంచి తినండి. మధ్యలో నుండి తినకండి. (అబూదావూద్, తిర్మిజీ – హసన్, సహీహ్)

(సుననె అబూ దావూద్‌లోని భోజనాల ప్రకరణం, సుననె తిర్మిజీలోని భోజనాల అధ్యాయాలు)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “Blessing descends upon food in its middle, so eat from the sides of the vessel and do not eat from its middle.”[At-Tirmidhi and Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|107. పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి, మధ్యలో నుండి తీసుకొని తినకూడదు|హదీసు 744

745

హదీసు 745

وعن عبدِ اللَّه بن بُسْرٍ رضيَ اللَّه عنه قَالَ: كَانَ لِلنبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَصْعَةٌ يُقالُ لَهَا: الْغَرَّاءُ، يحْمِلُهَا أَرْبَعَةُ رِجالٍ، فَلمَّا أَضْحوا وَسَجَدُوا الضُّحى أُتِي بتَلْكَ الْقَصْعَةِ، يعني وَقَدْ ثُرِدَ فِيهَا، فالتَفُّوا عَلَيْهَا، فَلَمَّا كَثُرُوا جَثَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالَ أَعرابيٌّ: ما هذه الجلْسةُ؟ قال رسولُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: إِنَّ اللَّه جَعَلني عَبْداً كَرِيماً، ولَمْ يجْعَلْني جَباراً عَنيداً، ثمَّ قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كُلُوا مِنْ حَوَالَيْهَا، وَدَعُوا ذِرْوَتَهَا يُبَارَكْ فِيهَا" رواه أَبُو داودٍ بإِسناد جيد. "ذِرْوَتَهَا"أَعْلاَهَا: بكسر الذال وضمها.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ దగ్గర ఒక పళ్లెం ఉండేది. దాన్ని 'గర్రా' అనేవారు. దాన్ని నలుగురు (నాలుగు వైపుల నుండి) పట్టుకొని తీసుకెళ్ళేవారు.

సాధారణంగా బాగా ప్రొద్దెక్కి, దైవప్రవక్త అనుచరులు 'చాష్త్' నమాజ్ చేసుకున్న తర్వాత ఆ పళ్లాన్ని తీసుకొచ్చేవారు. అందులో సరీద్ (పలుచటి కూరలో రొట్టె ముక్కలు నానబెట్టి తయారుచేసే ఒక రకమైన వంటకం) తయారుచేయబడి ఉండేది. ప్రజలు ఆ పళ్లెం చుట్టూ కూర్చొనేవారు. ఎక్కువ మంది జనం రావటం వల్ల (స్థలం చాలకపోతే) దైవప్రవక్త ﷺ మోకాళ్ళు మడచి కూర్చొనేవారు.

అది చూసి ఒక పల్లెటూరి వ్యక్తి, "అదేంటి, అలా కూర్చున్నారు?" అని అడిగాడు. దానికాయన "నిశ్చయంగా దేవుడు నన్ను దయామయుడైన దాసునిగా పుట్టించాడు. ఆయన నన్ను అహంకారిగా, తలబిరుసువానిగా పుట్టించలేదు" అని అన్నారు.

తరువాత ఇలా ఉపదేశించారు : పళ్లెం పై (అంటే మధ్య) భాగాన్ని వదలిపెట్టి ప్రక్కల నుండి తినండి. ఎందుకంటే మధ్యలో శుభం అవతరిస్తుంది.

(అబూ దావూద్ దీన్ని మంచి ఆధారాలతో ఉల్లేఖించారు)

English

`Abdullah bin Busr (radiyallahu anhu) reported: The Prophet ﷺ had a large bowl called Al-Gharra’, which would be carried by four men. One day, when the Companions finished their Duha (forenoon optional) prayer, Al-Gharra’ was brought full of sopped bread, meat and broth, and they sat down around it. When their number increased, Messenger of Allah ﷺ sat down on his knees and rested on the soles of his feet. A bedouin said to him: “What sort of sitting is that?” Thereupon Messenger of Allah ﷺ said, “Verily, Allah has made me a courteous slave not a fierce tyrant.” Then he said, “Eat from the sides of the bowl and leave the central part of it so that your food will be blessed.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

కలిసి భుజించటం, కంచంలో ఒక ప్రక్క నుంచి ఆహారం తీసుకొని తినటం శుభప్రదమని ఈ హదీసులో చెప్పబడింది. మోకాళ్ల ఆధారంగా కూర్చొని తినటం పుణ్యప్రదమని కూడా ఇందులో వివరించబడింది. ఇంకా ఇందులో దైవప్రవక్త ﷺ మహిమోన్నతులు, ఆయన వినమ్రత, అణకువ భావాలు కూడా పొందుపరచబడ్డాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|107. పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి, మధ్యలో నుండి తీసుకొని తినకూడదు|హదీసు 745