హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 106. ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఏం చేయాలి?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 106వ అధ్యాయం: ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఏం చేయాలి?. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 743) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

106. ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఏం చేయాలి?

↑ విషయ సూచిక

باب مَا يقوله ويفعله من يأكل وَلاَ يشبع

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

743

హదీసు 743

عن وَحْشيِّ بنِ حرب رضيَ اللَّه عنه أَن أَصحابَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالُوا: يَا رسولَ اللَّهِ، إِنَّا نَأْكُلُ وَلاَ نَشْبَعُ؟ قَالَ: "فَلَعَلَّكُمْ تَفْترِقُونَ"قالُوا: نَعَمْ. قَالَ: فَاجْتَمِعُوا عَلى طَعَامكُمْ، وَاذْكُرُوا اسْمَ اللَّهِ، يُبَارَكْ لَكُمْ فِيهِ" رواه أَبُو داود

హజ్రత్ వహ్షీ బిన్ హర్బ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త సహచరులు ఒకసారి ఆయనతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! మేము తినడానికి తింటున్నాము గాని, మా కడుపులు నిండటంలేదు" అని అన్నారు. "బహుశా మీరు విడివిడిగా తింటున్నారేమో!" అన్నారు దైవప్రవక్త ﷺ. దానికి సహచరులు 'అవున'న్నారు. అప్పుడాయన "మీరందరూ కలిసి అన్నం తినండి. తినే ముందు బిస్మిల్లాహ్ పఠించండి. దానివల్ల మీకు అందులో శుభం ప్రాప్తిస్తుంది" అని వారికి హితోపదేశం చేశారు. (అబూ దావూద్)

(సుననె అబూదావూద్‌లోని భోజనాల ప్రకరణం)

English

Wahshi bin Harb (radiyallahu anhu) reported: Some of the Companions of Messenger of Allah ﷺ said: “We eat but are not satisfied.” He ﷺ said, “Perhaps you eat separately.” The Companions replied in affirmative. He then said: “Eat together and mention the Name of Allah over your food. It will be blessed for you.”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|106. ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఏం చేయాలి?|హదీసు 743