హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 105వ అధ్యాయం: బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా ఖర్జూరాలు, ఇతర తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 742) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
105. బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా ఖర్జూరాలు, ఇతర తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు
باب النهي عن القران بين تمرتين ونحوهماإذا أكل جماعة إِلاَّ بإذن رفقته
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 742
عن جبَلَةَ بن سُحَيْم قَالَ: أَصابَنا عامُ سَنَةٍ معَ ابْنِ الزُّبَيْرِ، فرُزقْنَا تَمْراً، وَكانَ عَبْدُ اللَّه بنُ عمر رضي اللَّه عنهما يمُر بنا ونحْنُ نأْكُلُ، فيقولُ: لاَ تُقَارِنُوا، فإِن النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهى عنِ الإقرانِ، ثُمَّ يقولُ: "إِلاَّ أَنْ يَسْتَأْذِنَ الرَّجُلُ أَخَاهُ" متفقٌ عليه.
హజ్రత్ జబలా బిన్ సుహైమ్ (రదియల్లాహు అన్హు) కథనం : అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఖిలాఫత్ కాలంలో ఒకసారి కరువు వచ్చింది. ఆ కాలంలో మాకు కొన్ని ఖర్జూర పండ్లు ఇవ్వబడ్డాయి. మేమా ఖర్జూర పండ్లు తింటుండగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మా సమీపం నుండి వెళ్తూ, "ఒకేసారి రెండేసి ఖర్జూరాలు తినకండి. దైవప్రవక్త ﷺ మాకు ఒకేసారి రెండేసి తినుబండారాలు తినకూడదని చెప్పారు. అయితే బంతిలోని సహచరుల అనుమతితో అలా తినవచ్చని చెప్పారు" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని భోజనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)
English
Jabalah bin Suhaim reported: We were with `Abdullah bin Az-Zubair (radiyallahu anhuma) in a time of famine, then we were provided with dates. (Once) when we were eating, `Abdullah bin `Umar (radiyallahu anhuma) passed by us and said: “Do not eat two dates together, for Messenger of Allah ﷺ prohibited it, unless one seeks permission from his brother (partner).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సభ్యతా సంస్కారాలకు స్వస్తిపలికిన నేటి ముస్లింలకు ఈ హదీసులో గొప్ప గుణపాఠముంది. బంతి భోజనాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక్కో వ్యక్తి ప్రక్కన ఉన్నవారందరినీ మర్చిపోయి వడ్డించబడిన మంచి మంచి ఆహార పదార్థాలన్నీ తన పళ్లెంలో కుమ్మరించుకుంటుంటాడు. తిండి విషయంలో ఈ ఆత్రం దైవప్రవక్త హితోపదేశాలకు పూర్తిగా విరుద్ధమైనది. ఆయన బోధనలు చెప్పేదేమిటంటే మనం అన్నం తినేటప్పుడు కేవలం మన కడుపు నింపుకోవడంలోనే ఉండిపోకూడదు. ప్రక్కనున్నవారి గురించి కూడా ఆలోచించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|105. బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా ఖర్జూరాలు, ఇతర తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు|హదీసు 742
You must be logged in to post a comment.