హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 104వ అధ్యాయం: కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి, అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, అవసరమైతే మందలించాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 740 – 741) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
104. కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి, అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, అవసరమైతే మందలించాలి
باب الأكل مِمَّا يليه ووعظه وتأديبه من يُسيء أكله
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 740
عن عمر بن أَبي سَلَمَةَ رضي اللَّه عنهما قَالَ: كُنتُ غُلاماً في حِجْرِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وكَانتْ يَدِي تَطِيشُ في الصَّحْفَةِ فَقَالَ لي رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا غُلامُ سَمِّ اللَّه تَعَالَى وَكُلْ بيمينِكَ وكلْ مِمَّا يَلِيكَ" متفقٌ عليه. قَوْله:"تَطِيشُ"بكسرِ الطاءِ وبعدها ياءٌ مثناة من تَحْت، معناه: تتحرك وتمتد إِلى نَوَاحِي الصَّحْفَةِ.
హజ్రత్ ఉమర్ బిన్ అబూ సలమా (రదియల్లాహు అన్హుమా) కథనం : నేను బాల్యంలో దైవప్రవక్త ﷺ పోషణలో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో నేను అన్నం తిన్నప్పుడు నా చేయి పళ్లెంలో అటూ ఇటూ తిరుగాడుతూ ఉండేది. అది చూసి దైవప్రవక్త ﷺ, "అబ్బాయీ! (అన్నం తినే ముందు) దైవనామాన్ని పఠించు. కుడిచేత్తో తిను. నీకు దగ్గరలో ఉన్న వాటిని తీసుకొని తిను" అని నాకు హితోపదేశం చేశారు. (బుఖారీ – ముస్లిం)
English
`Umar bin Abu Salamah (radiyallahu anhuma) reported: I was a boy under the care of Messenger of Allah ﷺ, and as my hand used to wander around in the dish, he ﷺ said to me once, “Mention Allah’s Name (i.e., say Bismillah), eat with your right hand, and eat from what is in front of you.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|104. కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి, అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, అవసరమైతే మందలించాలి|హదీసు 740
హదీసు 741
وعن سَلَمَةَ بنِ الأكوعِ رضيَ اللَّه عنه أَن رَجُلاً أَكلَ عِنْدَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بشِماله فَقَالَ: "كُلْ بِيَمِينكَ"قَالَ: لا أَسْتطِيعُ قالَ:"لا اسْتَطَعْتَ،"مَا مَنَعَهُ إِلاَّ الكِبْرُ، فَمَا رَفَعَهَا إِلى فِيهِ. رواه مسلم.
హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గర ఎడమ చేత్తో తింటున్నాడు. దైవప్రవక్త ﷺ అది చూసి కుడిచేత్తో తినమని అతనికి ఉపదేశించారు. అందుకా వ్యక్తి తాను కుడిచేత్తో తినలేనని బదులిచ్చాడు. దానికి ఆయన "నువ్వు (నిజంగానే కుడిచేత్తో) తినలేకపోదువు గాక!" అని శపించారు. "అతని గర్వం అతణ్ణి మాట వినకుండా చేస్తోంది" అని అన్నారు. (ఇక ఆ తరువాత నుంచి) ఆ వ్యక్తి తన కుడిచేతిని నోటిదాకా లేపలేకపోయేవాడు. (ముస్లిం)
English
Salamah bin Al-Akwa` (radiyallahu anhu) reported on the authority of his father: A man ate with his left hand in the presence of Messenger of Allah ﷺ, whereupon he said, “Eat with your right hand.” The man said: “I cannot do that.” Thereupon he (the Prophet ﷺ) said, “May you not be able to do that.” It was vanity that prevented him from doing it and he could not raise it (the right hand) up to his mouth afterwards.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|104. కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి, అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, అవసరమైతే మందలించాలి|హదీసు 741
You must be logged in to post a comment.