హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 103వ అధ్యాయం: అతిథి తనతోపాటు మరెవరినయినా విందుకు తీసుకెళ్ళదలచినప్పుడు ఆతిథ్యకర్త నుండి అనుమతి తీసుకోవాలి. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 739) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
103. అతిథి తనతోపాటు మరెవరినయినా విందుకు తీసుకెళ్ళదలచినప్పుడు ఆతిథ్యకర్త నుండి అనుమతి తీసుకోవాలి
باب مَا يقوله من دُعي إِلَى طعام فتبعه غيره
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 739
عن أَبي مسعودِ البَدْرِيِّ رضيَ اللَّه عنه قَالَ: دَعا رجُلٌ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لِطعَامٍ صَنعَهُ لَهُ خَامِس خَمْسَةٍ، فَتَبِعهُمْ رَجُلٌ، فَلمَّا بَلَغَ البَابَ، قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ هَذَا تَبِعَنا، فإِنْ شِئْتَ أَنْ تَأْذنَ لَهُ، وإِنْ شِئتَ رَجَعَ" قَالَ: بل آذَنُ لهُ يَا رسولَ اللَّهِ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ మస్వూద్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ కోసం భోజనం తయారుచేసి ఆయనతో పాటు మరో నలుగురిని విందుకు ఆహ్వానించాడు. విందుకు ఆహ్వానించబడినవారు మొత్తం ఐదుగురు. ఆ ఐదుగురితో పాటు ఇంకో వ్యక్తి కూడా బయలుదేరాడు. అందరూ కలిసి ఆతిథ్య కర్త ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తరువాత దైవప్రవక్త ﷺ ఆతిథ్యకర్తతో మాట్లాడుతూ, "ఈ వ్యక్తి మాతోపాటు అదనంగా వచ్చేశాడు. మీకిష్టమయితే అతన్ని అనుమతించండి. లేదంటే తిరిగి వెళ్ళిపోతాడు" అని అన్నారు.
అందుకు ఆతిథ్యకర్త, "(ఫర్వాలేదు), దైవప్రవక్తా! నేను ఇతన్ని కూడా అనుమతిస్తున్నాను" అని అన్నాడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని భోజనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)
English
Abu Mas`ud Al-Badri (radiyallahu anhu) reported: A man prepared some food especially for the Prophet ﷺ and invited him along with four others. But a man accompanied him. Having arrived at the door, Messenger of Allah ﷺ said to the host, “This person has followed us. You may allow him, if you like, and if you like he will return.” He said: “O Messenger of Allah, I allow him, too.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
తమకు ఆహ్వానం లేని విందుకు వెళ్ళటం సభ్యత కాదు. ఒకవేళ భోజనానికి ముందు విందుచేస్తున్న వ్యక్తి అనుమతి తీసుకుంటే అప్పుడు ఆ విందుకు హాజరు కావటంలోనూ తప్పు లేదు. అందుకే దైవప్రవక్త ﷺ తన వెంటవచ్చిన వ్యక్తి కోసం ఆతిథ్యకర్త దగ్గర అనుమతి తీసుకున్నారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|103. అతిథి తనతోపాటు మరెవరినయినా విందుకు తీసుకెళ్ళదలచినప్పుడు ఆతిథ్యకర్త నుండి అనుమతి తీసుకోవాలి|హదీసు 739
You must be logged in to post a comment.