హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 102వ అధ్యాయం: ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే అతను ఏం చేయాలి?. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 738) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
102. ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే అతను ఏం చేయాలి?
باب ما يقوله من حضر الطعام وهو صائم إذا لم يفطر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 738
عن أبي هُريرة رضيَ اللَّه عنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا دُعِيَ أَحَدُكُمْ، فَلْيُجِبْ، فَإِنْ كَانَ صَائِماً فَلْيُصلِّ، وَإنْ كانَ مُفْطَراً فَلْيَطْعَمْ" رواه مسلم. قَالَ العُلَمَاءُ: مَعْنى."فَلْيُصَلِّ"فلْيدْعُ ومعنى"فَلْيطْعَمْ"فلْيَأْكُلْ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరినయినా విందుకు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని వారు (తప్పకుండా) అంగీకరించాలి. ఒకవేళ పిలువబడే వ్యక్తి ఉపవాసి అయితే అతను పిలిచేవారి కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. కాని పిలువబడే వ్యక్తి ఉపవాసి కాకపోతే (లేదా నఫిల్ ఉపవాసముండి ఆ ఉపవాసాన్ని విరమించుకుంటే మాత్రం) ఆ విందుని ఆరగించాలి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నికాహ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When any of you is invited to a meal, he should accept the invitation. If he is observing Saum (fasting), he should supplicate for the betterment of the host and if he is not fasting, he should eat.” Muslim].
ముఖ్యాంశాలు
నఫిల్ ఉపవాసాలు విరమించుకోవటానికి షరీఅత్ అనుమతినిస్తోంది. వాటిని తిరిగి నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉండదు. అనేక హదీసుల్లో వివరించబడిన దైవప్రవక్త ﷺ విధానం ద్వారా ఈ విషయం బోధపడుతోంది. కనుక ఎవరయినా విందుకు ఆహ్వానించినప్పుడు నఫిల్ ఉపవాసాన్ని విరమించుకొని విందు ఆరగించటం ధర్మసమ్మతమే కాని ఎవరికయినా నఫిల్ ఉపవాసం విరమించుకోవటం ఇష్టం లేకపోతే కనీసం విందుకు ఆహ్వానించిన వ్యక్తికి శుభం ప్రాప్తించాలని ప్రార్థన అయినా చేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|102. ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే అతను ఏం చేయాలి?|హదీసు 738
You must be logged in to post a comment.