హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 101వ అధ్యాయం: అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, పైగా అన్నం బాగుంటే పొగడాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 736 – 737) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
101. అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, పైగా అన్నం బాగుంటే పొగడాలి
باب لا يعيب الطعام واستحباب مدحه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 736
عن أبي هُريرة رضيَ اللَّهُ عنهُ قَالَ:"مَا عَابَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم طَعَاماً قَطُّ، إِن اشْتَهَاه أَكَلَهُ، وإِنْ كَرِهَهُ تَرَكَهُ" متفقٌ عليه.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఎన్నడూ ఏ అన్నంలోనూ లోపం ఎత్తిచూపలేదు. ఆయనకు అది ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానుకునేవారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ never found fault with food. If he had inclination to eating it, he would eat; and if he disliked it, he would leave it. Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో కూడా దైవప్రవక్త ﷺ గారి ఉత్తమ నడవడిక బోధించబడింది. అందులో మనందరికి మంచి ఆదర్శం ఉంది. మన విధానం దైవప్రవక్త ﷺ విధానానికి పూర్తిగా విరుద్ధమైనది. భోజన రుచుల్లో ఒక్కపూట ఏ చిన్న తేడావచ్చినా మనం పెద్ద గలాటా చేస్తాం. దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడతాం. దైవప్రవక్త ఆదర్శ విధానానికి అనుగుణంగా నేడు మన జీవితాల్లో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|101. అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, పైగా అన్నం బాగుంటే పొగడాలి|హదీసు 736
హదీసు 737
وعن جابرٍ رضيَ اللَّه عنه أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سَأَلَ أَهْلَهُ الأُدْمَ فقالوا: مَا عِنْدَنَا إِلاَّ خَلٌّ، فَدَعَا بِهِ، فَجَعل يَأْكُلُ ويقول: "نِعْمَ الأُدْمُ الخلُّ نِعْمَ الأُدُمُ الخَلُّ" رواه مسلم.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఓసారి తమ ఇంటి వారిని కూరపెట్టమని అడిగారు. ఒక్క సిర్కా తప్ప ఇంట్లో మరే కూరా లేదని చెప్పారు ఇంటివాళ్ళు. అప్పుడాయన అదే తెప్పించుకొని తినడం మొదలుపెట్టారు. తింటూ తింటూ, "ఆహా… సిర్కా కూర ఎంత రుచిగా ఉంది! ఆహా…. సిర్కా కూర ఎంత రుచిగా ఉంది!!" అని అనసాగారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Prophet ﷺ asked for sauce and was told that there was nothing except vinegar. He asked for it and began to eat from it saying, “How excellent is vinegar when eaten as sauce! How excellent is vinegar when eaten as Udm!” Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు కూడా అన్నపానీయాల విషయంలో దైవప్రవక్త ﷺ ఎంతటి నిరాడంబరులో, ఎంతటి సాధుప్రియులో వివరించబడింది. ఏ విధంగానైతే వస్త్రధారణ మొదలగు విషయాల్లో ఆయన రాచరికపు తీవిని, డాబు దర్పాన్ని ప్రదర్శించలేదో అదేవిధంగా భోజనాది విషయాల్లోనూ ఆయన పరమాన్నాలు తినడానికి మోజుపడలేదు. పైగా తనకు ఏది వడ్డిస్తే అది ఆరగించి సంతృప్తి చెందేవారు. దైవప్రవక్త జీవితంలోని ప్రతి సందర్భం మనకు ఆదర్శప్రాయమేనని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|101. అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, పైగా అన్నం బాగుంటే పొగడాలి|హదీసు 737
You must be logged in to post a comment.