మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 20. బానిస విమోచనా ప్రకరణం. ఇందులో 7 హదీసులు (హదీసు 958 – 964), 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.
⬇ డౌన్లోడ్ PDFబానిస విమోచనా ప్రకరణం3 పేజీలు · 0.2 MB
20. బానిస విమోచనా ప్రకరణం
كتاب العتقఅధ్యాయాలు (5)
- 1 బానిస కూలినాలి చేసి ఆ డబ్బుతో తన ధర చెల్లించి స్వేచ్ఛ పొందవచ్చు H 959
- 2 ‘విలా’ (స్వేచ్ఛాపరుడైన బానిస) విముక్తి కలిగించిన వారి కొరకే H 960 – 961
- 3 ‘విలా’ను అమ్మడం, ఇతరులకు కానుకగా కట్టబెట్టడం నిషిద్ధం H 962
- 4 స్వేచ్ఛ ప్రసాదించిన వారిని కాకుండా ఇతరుల్ని సంరక్షకులుగా చేసుకోవడం నిషిద్ధం H 963
- 5 బానిసకు స్వేచ్ఛనిస్తే లభించే పుణ్యం, ఆ సత్కార్యం ఘనత H 964
హదీసు 958
حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَعْتَقَ شِرْكًا لَهُ فِي عَبْدٍ، فَكَانَ لَهُ مَالٌ يَبْلُغُ ثَمَنَ الْعَبْدِ، قُوِّمَ الْعَبْدُ قِيمَةَ عَدْلٍ فَأَعْطَى شُرَكَاءَهُ حِصَصَهُمْ وَعَتَقَ عَلَيْهِ، وَإِلاَّ فَقَدْ عَتَقَ مِنْهُ مَا عَتَقَ
أخرجه البخاري في: 49 كتاب العتق: 4 باب إذا أعتق عبدا بين اثنين
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరైనా ఉమ్మడి యాజమాన్యం క్రింద ఉన్న బానిసకు తన భాగం మేరకు స్వేచ్ఛ నివ్వదలచినపుడు అతని దగ్గర బానిస విమోచనానికి కావలసిన మిగతా ధర అంత పైకం గనక ఉంటే, బానిస ధరను న్యాయవంతంగా నిర్ణయించి ఇతర భాగస్వాములకు రావలసిన మొత్తాన్ని అతనే తన పైకం నుండి చెల్లించి ఆ బానిసకు పూర్తిగా విముక్తి కలిగించాలి. అలా చేయలేకపోతే అతను బానిసకు ఏ మేరకు స్వాతంత్ర్యం ఇస్తాడో ఆ మేరకు ఆ బానిస స్వేచ్ఛాపరుడవుతాడు.”
[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 4వ అధ్యాయం – ఇజా ఇత్ఖ్ అబ్దమ్ బైనస్ నైన్]
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 958
1వ అధ్యాయం – బానిస కూలినాలి చేసి ఆ డబ్బుతో తన ధర చెల్లించి స్వేచ్ఛ పొందవచ్చు
హదీసు 959
باب ذكر سعاية العبد
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَعْتَقَ شَقِيصًا مِنْ مَمْلُوكِهِ فَعَلَيْهِ خَلاَصُهُ فِي مَالِهِ، فَإِنْ لَمْ يَكُنْ لَهُ مَالٌ قُوِّمَ الْمَمْلُوكُ قِيمَةَ عَدْلٍ، ثُمَّ اسْتُسْعِيَ غَيْرَ مَشْقُوقٍ عَلَيْهِ
أخرجه البخاري في: 47 كتاب الشركة: 5 باب تقويم الأشياء بين الشركاء بقيمة عدل
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఒకవేళ ఎవరైనా ఉమ్మడి యాజమాన్యం క్రింద బానిసకు తన భాగం మేరకు స్వేచ్ఛనివ్వదలిస్తే అతను తన సంపద నుండి మిగతా ధర కూడా (ఇతర వాటాదారులకు) చెల్లించి ఆ బానిసకు పూర్తిగా విముక్తి కలిగించాలి. అతని దగ్గర అంత పైకం లేకపోతే, బానిస ధరను న్యాయవంతంగా నిర్ణయించి, కూలినాలి ద్వారా సంపాదించి మిగతా పైకాన్ని చెల్లించి పూర్తిగా స్వేచ్ఛాపరుడయ్యేందుకు బానిసకు వీలు కల్పించాలి. అయితే ఈ విషయంలో బానిసపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు.”(1)
[సహీహ్ బుఖారీ : 47వ ప్రకరణం – షిర్కత్, 5వ అధ్యాయం – తఖ్వీముల్ అష్యాయి బైన ష్షుర్కా]
(1) ఉదాహరణకు:- జైద్, ఉమర్‌లు ఒక బానిసలో సగం సగం వాటాదారులుగా ఉన్నారు. జైద్ తన వాటా మేరకు బానిసకు విముక్తి కలిగించిన పక్షంలో అతను ఉమర్ వాటాను కూడా చెల్లించి బానిసను పూర్తిగా స్వేచ్ఛాపరుడిగా చేయాలి. ఒకవేళ జైద్ దగ్గర అంత డబ్బులేకపోతే బానిసకు సమంజసమైన ధర నిర్ణయించి, అతనితో నీవు కూలినాలి చేసుకొని మిగతా సగం ధరను స్వయంగా చెల్లించి పూర్తి స్వాతంత్ర్యం సంపాదించుకో” అని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని బానిస ఇష్టాయిష్టాలకు వదిలెయ్యాలి. అతనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకు రాకూడదు.
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 959
2వ అధ్యాయం – ‘విలా’ (స్వేచ్ఛాపరుడైన బానిస) విముక్తి కలిగించిన వారి కొరకే
హదీసు 960
باب إِنما الولاء لمن أعتق
حديث عَائِشَةَ أَنَّ بَرِيرَةَ جَاءَتْ تَسْتَعِينُهَا فِي كِتَابَتِهَا، وَلَمْ تَكُنْ قَضَتْ مِنْ كِتَابَتِهَا شَيْئًا قَالَتْ لَهَا عَائِشَةُ: ارْجِعِي إِلَى أَهْلِكِ فَإِنْ أَحَبُّوا أَنْ أَقْضِيَ عَنْكِ كِتَابَتَكِ وَيَكُونَ وَلاَؤُكِ لِي فَعَلْتُ فَذَكَرَتْ ذلِكَ بَرِيرَةُ َلأهْلِهَا فَأَبَوْا، وَقَالُوا: إِنْ شَاءَتْ أَنْ تَحْتَسِبَ عَلَيْكِ فَلْتَفْعَلْ وَيَكُونَ وَلاَؤُكِ لَنَا؛ فَذَكَرَتْ ذَلِكَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ لَهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: ابْتَاعِي فَأَعْتِقِي، فَإِنَّمَا الْوَلاَءُ لِمَنْ أَعْتَقَ قَالَ، ثُمَّ قَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: مَا بَالُ أُنَاسٍ يَشْتَرِطُونَ شُرُوطًا لَيْسَتْ فِي كَتَابِ اللهِ، مَنِ اشْتَرَطَ شَرْطًا لَيْسَ فِي كِتَابِ اللهِ فَلَيْسَ لَهُ، وَإِنْ شَرَطَ مِائَةَ شَرْطٍ، شَرْطُ اللهِ أَحَقُّ وَأَوْثَقُ
أخرجه البخاري في: 50 كتاب المكاتب: 2 باب ما يجوز من شروط المكاتب
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా) నా దగ్గరకు వచ్చి “ముకాతబత్”(2) (బానిస ఒప్పందం)లో నా సహాయాన్ని అర్థించింది. ఆమె అప్పటిదాకా ఒప్పందానికి సంబంధించిన నిర్ణీతపైకాన్ని చెల్లించలేకపోయింది. అప్పుడు నేను ఆమెతో “నీ యజమానులతో మాట్లాడు. వారు గనక ఒప్పుకుంటే నేను నీ బానిస ఒప్పందం పైకం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీ ‘విలా’★ హక్కు నాకు చెందాలని చెప్పు” అని అన్నాను.
హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా) వెళ్ళి ఈ విషయాన్ని తన యజమానులకు విన్పించింది. కాని వారు అందుకు అంగీకరించకుండా “హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)గారు పుణ్యఫలాపేక్షతో నీ దాస్య ఒప్పందం పైకం చెల్లించదలచుకుంటే చెల్లించుకోమను. కాని నీ ‘విలా’ హక్కు మాకు దక్కాలి” అని అన్నారు.
ఈ సంగతి నేను దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావించాను. అప్పుడాయన “నీ వామెను కొని స్వతంత్రురాలిని చెయ్యి. బానిస విముక్తి కలిగించిన వారిదే ‘విలా’ హక్కు అవుతుంది” అని అన్నారు.
ఆ తర్వాత దైవప్రవక్త ﷺ మస్జిదులో నిల్చొని ప్రసంగిస్తూ “జనం దైవ గ్రంథంలో లేని షరతులు విధిస్తున్నారు, ఏమయింది వారికి? ఎవరైనా దైవగ్రంథంలో లేని షరతులు గనక విధిస్తే అవి ఏ మాత్రం చెల్లవు. అలాంటి వంద షరతులు విధించినా సరే ప్రయోజనం లేదు. అల్లాహ్ అనుమతించిన షరతులు మాత్రమే సరయినవి, పటిష్టమైనవి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 50వ ప్రకరణం – ముకాతిబ్, 2వ అధ్యాయం – మాయజూజ మిన్ షురూతిల్ ముకాతిబ్]
(2) బానిస కూలినాలి చేసి తన నిర్ణీత ధరకు సమానమైన పైకం సంపాదించి యజమానికి చెల్లించాలని, యజమాని దాన్ని స్వీకరించి అతడ్ని బానిసత్వం నుండి విముక్తి కలిగించాలని వారిద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. దీన్నే “ముకాతబత్” అంటారు. ఆ ఒప్పందంలోని యజమాని, బానిస ఇద్దర్నీ “ముకాతిబ్”గా వ్యవహరిస్తారు.
★ ‘విలా’ అంటే స్వేచ్ఛ పొందిన బానిసపై స్వేచ్ఛ ప్రసాదించిన బానిసకు లభించే షరీఅత్ పరమైన హక్కు అని అర్థం. అంటే స్వాతంత్ర్యం ప్రసాదించినవాడు స్వాతంత్ర్యం పొందిన వ్యక్తికి (అతని మరణానంతరం అతని ఆస్తికి) వారసుడు అవుతాడన్నమాట. అసలు ‘విలా’ అంటే సహాయం, స్నేహం, ప్రేమ, బంధుత్వం వగైరా శాబ్దిక అర్థాలున్నాయి. అయితే ఈ పదం బానిసకు స్వేచ్ఛనిచ్చే వ్యవహారానికి మాత్రమే ప్రత్యేకించబడింది.
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 960
హదీసు 961
حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: كَانَ فِي بَرِيرَةَ ثَلاَثُ سُنَنٍ: إِحْدَى السُّنَنِ أَنَّهَا أُعْتِقَتْ فَخُيِّرَتْ فِي زَوْجِهَا، وَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الْوَلاَءُ لِمَنْ أَعْتَقَ وَدَخَلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالْبُرْمَةُ تَفُورُ بِلَحْمٍ، فَقُرِّبَ إِلَيْهِ خُبْزٌ وَأُدْمٌ مِنْ أُدْمِ الْبَيْتِ؛ فَقَالَ: أَلَمْ أَرَ الْبُرْمَةَ فِيهَا لَحْمٌ قَالُوا: بَلَى، وَلكِنْ ذَلِكَ لَحْمٌ تُصُدِّقَ بِهِ عَلَى بَرِيرَةَ، وَأَنْتَ لاَ تَأْكُلُ الصَّدَقَةَ؛ قَالَ: عَلَيْهَا صَدَقَةٌ وَلَنَا هَدِيَّةٌ
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 14 باب لا يكون بيع الأمة طلاقا
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా) వ్యవహారం కారణంగా మూడు చట్టాలు ఉనికిలోని వచ్చాయి. ఒకటి: ఆమె స్వతంత్రురాలయిపోతే ఆమెకు తన వివాహ బంధం కొనసాగించడానికి లేదా త్రెంచి వేయడానికి అధికారం ఇవ్వబడింది. రెండు: దైవప్రవక్త ﷺ ఈ విషయంలో బానిసకు స్వేచ్ఛనిచ్చిన వారికే ‘విలా’ హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చారు. మూడు: దైవప్రవక్త ﷺ నా ఇంటికి వచ్చినపుడు కుండలో మాంసం కుతకుత ఉడకసాగింది. అయితే ఆయన ముందు రొట్టె, ఇంట్లో వండిన మామూలు కూర మాత్రమే ఉంచాను. దైవప్రవక్త ﷺ అది చూసి “కుండలో మాంసం కూర ఉడకడం నేను చూడలేదనుకున్నావా?” అని అన్నారు. “అది ఉందండీ! కాని అది బరీరా (రదియల్లాహు అన్హా)కు ఎవరో దానంగా ఇచ్చిన మాంసం. మీరు దానం స్వీకరించరు కదా!” అన్నాను నేను. దానికి దైవప్రవక్త ﷺ “దానం ఆమె కోసం, కాని ఇప్పుడిది (ఆమె తరపున మనకు లభించింది కనుక) మనకు కానుక అవుతుంది” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 14వ అధ్యాయం – లాయకూన బైవుల్ అమత తలాఖా]
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 961
3వ అధ్యాయం – ‘విలా’ను అమ్మడం, ఇతరులకు కానుకగా కట్టబెట్టడం నిషిద్ధం
హదీసు 962
باب النهى عن بيع الولاء وهبته
حديث ابْنِ عُمَرَ، قَالَ: نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ الْوَلاَءِ وَعَنْ هِبَتِهِ
أخرجه البخاري في: 49 كتاب العتق: 10 باب بيع الولاء وهبته
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ‘విలా’ (స్వేచ్ఛాపరుడయిన బానిస)ను అమ్మివేయడాన్ని, ఇతరులకు కానుకగా కట్టబెట్టడాన్ని నిషేధించారు.
[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 10వ అధ్యాయం – బైవుల్ విలా వ హిబ]
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 962
4వ అధ్యాయం – స్వేచ్ఛ ప్రసాదించిన వారిని కాకుండా ఇతరుల్ని సంరక్షకులుగా చేసుకోవడం నిషిద్ధం
హదీసు 963
باب تحريم تولى العتيق غير مواليه
حديث عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ رضي الله عنه، خَطَبَ عَلَى مِنْبَرٍ مِنْ آجُرٍّ وَعلَيْهِ سَيْفٌ فِيهِ صَحِيفَةٌ مُعَلَّقَةٌ، فَقَالَ: وَاللهِ مَا عِنْدَنَا مِنْ كِتَابٍ يُقْرَأُ إِلاَّ كِتَابُ اللهِ وَمَا فِي هذِهِ الصَّحِيفَةِ، فَنَشَرَهَا؛ فَإِذَا فِيهَا: أَسْنَانُ الإِبِلِ، وَإِذَا فِيهَا: الْمَدِينَةُ حَرَمٌ مِنْ عَيْرٍ إِلَى كَذَا فَمَنْ أَحْدَثَ فِيهَا حَدَثًا فَعَلَيْهِ لَعْنَة اللهِ وَالْمَلاَئِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ، لاَ يَقْبَلُ اللهُ مِنْهُ صَرْفًا وَلاَ عَدْلاً، وَإِذَا فِيهِ: ذِمَّةُ الْمُسْلِمينَ وَاحِدَةٌ، يَسْعى بِهَا أَدْنَاهُمْ، فَمَنْ أَخْفَرَ مُسْلِمًا فَعَلَيْهِ لَعْنَةُ اللهِ وَالمَلاَئِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ، لاَ يَقْبَلُ اللهُ مِنْهُ صَرْفًا وَلاَ عَدْلاً، وَإِذَا فِيهَا: مَنْ وَالَى قَوْمًا بِغَيْرِ إِذْنِ مَوَالِيهِ فَعَلَيْهِ لَعْنَةُ اللهِ وَالمَلاَئِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ، لاَ يَقْبَلُ اللهُ مِنْهُ صَرْفًا وَلاَ عَدْلاً
أخرجه البخاري في: 96 كتاب الاعتصام: 5 باب ما يكره من التعمق والتنازع في العلم
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కాల్చిన ఇటుకలతో కట్టిన వేదిక (మెంబర్)పై నిలబడి ప్రసంగిస్తున్నారు. అప్పుడు ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉంది. దానికి ఓ చిరుపుస్తకం వ్రేలాడదీయబడి ఉంది. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ప్రసంగిస్తూ “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మన దగ్గర చదవడానికి దైవగ్రంథం (ఖుర్ఆన్) లేదా ఈ చిరు పుస్తకం తప్ప మరేమీ లేదు” అని అన్నారు. ఆ తర్వాత ఆ చిరు పుస్తకాన్ని తెరిచారు. అందులో ఒంటెల వయస్సుల ప్రస్తావన ఉంది. (అంటే రక్తపరిహారం, జకాత్‌ల క్రింద ఇవ్వవలసిన ఒంటెల సంఖ్య, వాటి వయస్సులు అందులో పేర్కొనబడ్డాయి) ఇంకా అందులో ఈ విధంగా రాయబడి ఉంది.
“మదీనా సరిహద్దు అయిన ఐర్ కొండ నుండి ఇక్కడి (అంటే సౌర్ కొండ) దాకా గల నేల నిషిద్ధ ప్రదేశంగా నిర్ణయించబడింది. అందువల్ల ఇక్కడ (మదీనా) ఎవరైతే ఇస్లాంలో లేని కొత్త మత సంప్రదాయాన్ని పాటిస్తాడో అతడ్ని అల్లాహ్, దైవదూతలు, యావత్తు మానవులు శపిస్తారు. పైగా అతని ఫర్జ్ ఆరాధన గాని, నఫిల్ ఆరాధన గాని స్వీకరించబడదు.★ మాటకు కట్టుబడి ఉండటం, ఇతరులకు ఆశ్రయమివ్వడం ముస్లింల ఉమ్మడి బాధ్యత. ఒక సాధారణ ముస్లిం కూడా ఇతరులకు (అంటే ముస్లిమేతరులకు) ఆశ్రయమిస్తే దాన్ని గౌరవించడం జరుగుతుంది. అందువల్ల ఒక ముస్లిం (ఎవరికైనా) ఆశ్రయమిస్తానని వాగ్దానం చేసినపుడు, అతని వాగ్దానాన్ని కాలరాసే చర్యకు ఎవరైనా పాల్పడితే అలాంటి వ్యక్తిని అల్లాహ్, దైవదూతలు, యావత్తు మానవులు శపిస్తారు. అల్లాహ్ అతని ఫర్జ్ ఆరాధనల్ని స్వీకరించడు. నఫిల్ ఆరాధనల్ని స్వీకరించడు. అలాగే ఎవరైనా తన యజమానుల అనుమతి లేకుండా ఏదైనా జాతితో తన సంరక్షణ కోసం ఒప్పందం చేసుకుంటే అలాంటి వ్యక్తిని కూడా అల్లాహ్, దైవదూతలు, యావత్తు మానవులు శపిస్తారు. అల్లాహ్ అతని ఫర్జ్, నఫిల్ ఆరాధనల్లో వేటినీ స్వీకరించడు.”
[సహీహ్ బీఖారీ : 96వ ప్రకరణం – ఏతెసామ్, 5వ అధ్యాయం – మాయుక్రహ మినత్తాముఖి వతనాజ ఫిల్ ఇల్మ్]
★ మూలభాషలో వచ్చిన పదాలను బట్టి ఒక అర్థంపైన అనువాదంలోనిది అయితే, మరొక అర్థం ఇది కూడా కావచ్చు. “అల్లాహ్ అతను పశ్చాత్తాపంతో చేసిన వేడుకోలును స్వీకరించడు, అతను పాప పరిహారం ఇచ్చుకున్నా ప్రాణం దక్కించుకోలేడు.”
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 963
5వ అధ్యాయం – బానిసకు స్వేచ్ఛనిస్తే లభించే పుణ్యం, ఆ సత్కార్యం ఘనత
హదీసు 964
باب فضل العتق
حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّمَا رَجُلٍ أَعْتَقَ امْرَءًا مُسْلِمًا اسْتَنْقَذَاللهُ بِكُلِّ عُضْوٍ مِنْهُ عُضْوًا مِنْهُ مِنَ النَّارِ
أخرجه البخاري في: 49 كتاب العتق: 1 باب ما جاء في العتق وفضله
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరైనా వ్యక్తి ముస్లిం (స్త్రీ లేక పురుషునికి) దాస్య విముక్తి కలిగిస్తే ఆ బానిసకున్న ప్రతి అవయవానికి బదులుగా అల్లాహ్ ఆ స్వేచ్ఛా ప్రదాతకు నరకం నుంచి విముక్తి కలిగిస్తాడు”.
[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 1వ అధ్యాయం – మాజాఫిల్ ఇత్ఖి వఫజ్లిహీ]
మహా ప్రవక్త మహితోక్తులు|20. బానిస విమోచనా ప్రకరణం|హదీసు 964
You must be logged in to post a comment.