హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 14వ అధ్యాయం: పోషణ – సంరక్షణ. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 987 – 992) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
8.14 పోషణ – సంరక్షణ
باب الحضانة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 987
عَنْ عَبْدِ اَللَّهِ بْنِ عَمْرِوٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اِمْرَأَةً قَالَتْ: { يَا رَسُولَ اَللَّهِ! إِنَّ اِبْنِي هَذَا كَانَ بَطْنِي لَهُ وِعَاءً, وَثَدْيِي لَهُ سِقَاءً, وَحِجْرِي لَهُ حِوَاءً, وَإِنَّ أَبَاهُ طَلَّقَنِي, وَأَرَادَ أَنْ يَنْتَزِعَهُ مِنِّي. فَقَالَ لَهَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم - "أَنْتِ أَحَقُّ بِهِ, مَا لَمْ تَنْكِحِي". } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక స్త్రీ దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నా ఈ చంటిపిల్లవాణ్ణి చూడండి, నా కడుపే వీడికి కంచంగా ఉండేది. నా చను(బా)లు వీడి పాలిట నీళ్ళ తిత్తిలా ఉండేవి. నా వెచ్చని ఒడి ఇతని నివాస స్థలంగా ఉండేది. కాని ఇప్పుడు ఇతని తండ్రి నాకు విడాకులిచ్చేశాడు. ఈ పసివాణ్ణి కూడా నా నుండి లాక్కోవాలని ఆయన చూస్తున్నాడు (ఇప్పుడు నేనేం చేసేది?) అని మొరపెట్టుకుంది. దానికి ఆయన ﷺ “నువ్వు రెండో వివాహం చేసుకునే వరకూ నువ్వే ఈ పసివాడిని నీ దగ్గర ఉంచుకోవడానికి ఎక్కువ హక్కుదారువి” అని చెప్పారు. (దీనిని అహ్మద్ మరియు అబూదావూద్ ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated 'Abdullah bin 'Amr (RA): A woman said, "O Allah's Messenger, this son of mine: my womb was a receptacle for him, my breasts were a source of suckling for him, and my lap was a place for him to curl up in, yet his father has divorced me and wants to take him away from me." Allah's Messenger (ﷺ) replied to her, "You have more right to him as long as you do not remarry." [Reported by Ahmad and Abu Dawud. al-Hakim graded it Sahih (authentic)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 987
హదీసు 988
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - أَنَّ اِمْرَأَةً قَالَتْ: { يَا رَسُولَ اَللَّهِ! إِنَّ زَوْجِي يُرِيدُ أَنْ يَذْهَبَ بِابْنِي, وَقَدْ نَفَعَنِي, وَسَقَانِي مِنْ بِئْرِ أَبِي عِنَبَةَ فَجَاءَ زَوْجُهَا, فَقَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم - "يَا غُلَامُ! هَذَا أَبُوكَ وَهَذِهِ أُمُّكَ, فَخُذْ بِيَدِ أَيُّهُمَا شِئْتَ" فَأَخَذَ بِيَدِ أُمِّهِ, فَانْطَلَقَتْ بِهِ. } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక మహిళ వచ్చి, “ఓ దైవ ప్రవక్తా ﷺ! నా భర్త నా అబ్బాయిని నా నుండి లాక్కోవాలనుకుంటున్నాడు. మరేమో ఈ అబ్బాయి నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. అబూ ఇనబా బావి నుండి నా కోసం నీళ్ళు తోడుకుని వస్తాడు” అని చెప్పుకోసాగింది. అంతలోనే ఆమె భర్త కూడా వచ్చాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఆ అబ్బాయినుద్దేశ్యించి, “అబ్బాయి! ఈయన నీ తండ్రి. ఈమె నీ తల్లి. వీరిరువురిలో నీవు కోరిన వారి చేయి పట్టుకోవచ్చు” అని సూచించారు. ఆ అబ్బాయి తన తల్లి చేయిపట్టుకున్నాడు. ఆమె అతన్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమని పేర్కొన్నారు)
English
Narrated Abu Hurairah (RA): A woman said, "O Allah's Messenger, my husband wants to take away my son, while he has benefited me and provided me with drinking water from the well of Abu 'Inabah." Then her husband came and the Prophet (ﷺ) said: "Young man, this is your father and this is your mother, so take whoever of them you wish by the hand." He took his mother's hand and she went off with him. [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసులో పిల్లవాడికి తన తల్లిదండ్రులిరువురిలో తాను కోరినవారి వద్ద ఉండే స్వేచ్ఛ ఇవ్వబడింది. కాని ఇంతకు ముందు వచ్చిన హదీసులో పిల్లవాడు తల్లి దగ్గరే ఉండాలని అనబడింది.
ఈ హదీసులో ప్రస్తావనకు వచ్చిన పిల్లవాడు మరీ పసివాడు కాదు. కాస్త పెద్దవాడయ్యాడు. ఆలోచించే శక్తి అతనికుంది. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం గైకొనే అవకాశం ఈ పిల్లవానికి ఇవ్వటం జరిగింది. దీనిబట్టి తెలిసేదేమిటంటే పిల్లవాడు పెద్దవాడై, తన రక్షణకై తల్లిదండ్రులపై ఆధారపడవలసిన అగత్యం లేనపుడు – వారిద్దరిలో తాను కోరిన వారి వద్ద ఉండేందుకు షరీయత్ అతనికి అనుమతినిస్తోంది. ఎన్నేళ్ళ అబ్బాయికి ఈ నిర్ణయాధికారం ఇవ్వబడుతుంది? అంటే ఏడు లేక ఎనిమిదేళ్ళు అని ధర్మవేత్తలంటున్నారు. అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : ఆ పిల్లవాడి శ్రేయస్సు ఎందులో ఇమిడి ఉంటుందో ఆ మేరకు నిర్ణయం గైకొనాలి. తండ్రికన్నా తల్లి ఎక్కువ శ్రద్ధతో పోషించగలదనుకుంటే తల్లికే ప్రాధాన్యతనివ్వాలి. ఈ సందర్భంగా చీటీలు వేసి అదృష్టాన్ని పరీక్షించుకోవటంగానీ, స్వేచ్ఛాధికారాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవటంగానీ సమంజసం కాదు. ఎందుకంటే పసివాడు పసివాడే. అతనిలో విజ్ఞతా వివేచనలుగానీ, దూరదృష్టిగానీ ఉండవు. కాబట్టి తల్లిదండ్రులిరువురిలో ఎవరు ఆ పసివానిపట్ల ఎక్కువ శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నారో వారికే ఆ పిల్లవాణ్ణి అప్పగించాలి. ఒకవేళ తల్లికన్నా తండ్రిలోనే ఈ శ్రద్ధాసక్తులు అధికంగా ఉన్నట్లయితే పిల్లవాణ్ణి తండ్రికే అప్పగించటం జరుగుతుంది.
ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా – ఇద్దరూ తల్లి దగ్గరే ఉండాలని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అన్నారు.
అమ్మాయి అయితే తల్లి దగ్గర, అబ్బాయి అయితే తండ్రి దగ్గర ఉండాలని హనఫీ పండితులు అభిప్రాయపడ్డారు.
అయితే మొత్తమ్మీద అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) గారి అభిప్రాయం న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా కనిపిస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 988
హదీసు 989
وَعَنْ رَافِعِ بْنِ سِنَانٍ; { أَنَّهُ أَسْلَمَ, وَأَبَتِ اِمْرَأَتُهُ أَنْ تُسْلِمَ. فَأَقْعَدَ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -اَلْأُمَّ نَاحِيَةً, وَالْأَبَ نَاحِيَةً, وَأَقْعَدَ اَلصَّبِيَّ بَيْنَهُمَا. فَمَالَ إِلَى أُمِّهِ, فَقَالَ: "اَللَّهُمَّ اِهْدِهِ". فَمَالَ إِلَى أَبِيهِ, فَأَخَذَهُ. } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصححه الْحَاكِمُ.
హజ్రత్ రాఫె బిన్ సినాన్ (రదియల్లాహు అన్హు) కథనం : ఆయన స్వయంగా ఇస్లాం స్వీకరించారు. కాని ఆయన సతీమణి ఇస్లాం స్వీకరించేందుకు నిరాకరించారు. అందుచేత దైవప్రవక్త ﷺ తల్లిని ఒక మూలన, తండ్రిని ఒక మూల కూర్చోబెట్టారు. పిల్లవాణ్ణి మాత్రం వారిద్దరి మధ్య కూర్చోబెట్టారు. పిల్లవాడు తల్లివైపు మొగ్గేలా ఉన్నాడు. (ఆ సమయంలో) దైవప్రవక్త ﷺ, “దేవా! ఈ అబ్బాయికి సన్మార్గం చూపు” అని ప్రార్థించారు. ఆ తర్వాత ఆ అబ్బాయి తండ్రి వైపునకు వెళ్ళిపోయాడు. తండ్రి ఆ అబ్బాయిని పట్టుకున్నాడు. (అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated Rafi' bin Sinan (RA): He accepted Islam but his wife refused to accept it. The Prophet (ﷺ) then made the mother sit down to a side and the father to another side and made the son sit down between them. He (the son) then inclined to his mother, so the Prophet (ﷺ) then said. "O Allah, give him guidance." Then he inclined to his father and he took him. [Abu Dawud and an-Nasa'i reported it. al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఆ పిల్లవాడు పసివాడనీ, మంచీచెడుల అవగాహన అతనికి ఇంకా రాలేదనీ ఈ హదీసును బట్టి అర్థమవుతున్నది. ఈ వివాదం ఒక పసిపిల్లవాడికి సంబంధించినదని అబూదావూద్లో స్పష్టంగా చెప్పటం కూడా జరిగింది. ఆ స్త్రీ ఆ కాలంలో ఆ పిల్లవాడికి పాలు విడిపించే ప్రయత్నంలో వున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
హదీసు ఉల్లేఖకులు
రాఫె బిన్ సినాన్ (రదియల్లాహు అన్హు) : అబుల్ హకమ్ అన్సారీ ఔసీ. మదీనావాసులు. ప్రముఖ సహాబీ. ‘అల్ అన్సాబ్’లో అబుల్ ఖాసిమ్ బిన్ సలామ్ ఈయన గురించి చెబుతూ, ఈయన అత్బూన్ సంతతికి చెందినవారనీ, ఆయన అసలు పేరు ఆమిర్ బిన్ సాలబ అనీ అన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 989
హదీసు 990
وَعَنْ اَلْبَرَاءِ بْنِ عَازِبِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَضَى فِي اِبْنَةِ حَمْزَةَ لِخَالَتِهَا, وَقَالَ: اَلْخَالَةُ بِمَنْزِلَةِ اَلْأُمِّ. } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ. وَأَخْرَجَهُ أَحْمَدُ: مِنْ حَدِيثِ عَلَيٍّ قَالَ: { وَالْجَارِيَةُ عِنْدَ خَالَتِهَا, فَإِنَّ اَلْخَالَةَ وَالِدَةٌ }
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ హమ్జా కుమార్తె వ్యవహారంలో ఆమె పిన్నమ్మ పక్షాన తీర్పునిస్తూ “పిన్ని స్థాయి తల్లిలాంటిది” అని అన్నారు. (బుఖారీ)
అహ్మద్ ఈ ఉల్లేఖనాన్ని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) హదీసు ఆధారంగా చేస్తూ ఇలా అన్నారు: “పిన్న వయస్సురాలైన ఆడపిల్ల తన పినతల్లి వద్ద ఉంటుంది. ఎందుకంటే పినతల్లి తల్లిలాంటిది.”
English
Narrated al-Bara bin 'Azib (RA): The Prophet (ﷺ) gave a ruling regarding Hamza's daughter in favor of her maternal aunt, saying, "The maternal aunt is in the position of the mother." [al-Bukhari reported it].
Ahmad reported it from the Hadith of 'Ali (RA), he said, "The little girl must be with her maternal aunt for the maternal aunt is (the same as) a mother."
సారాంశం
పై హదీసులో ప్రస్తావనకు వచ్చిన పినతల్లి పేరు అస్మా బిన్తె ఉమైస్. ఆడ పిల్ల పేరు అమ్మారా. ఉమామ అని కూడా అనబడుతోంది. మారుపేరు ఉమ్ముల్ ఫజల్. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హా), హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు), జైద్ల మధ్య తగవు వచ్చినపుడు దైవప్రవక్త ﷺ తీర్పు ఇచ్చిన సందర్భం ఇది.
ఆ పిల్ల తన బాబాయి కూతురైనందువల్ల ఆ అమ్మాయి సంరక్షణా బాధ్యత తనదేనని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వాదించారు. ఈ పిల్ల నా బాబాయి కూతురు మాత్రమే గాకుండా, ఈమె పినతల్లి నా భార్య కూడా కావటం వల్ల ఈ పిల్లను పోషించే బాధ్యత తనపై ఎక్కువగా ఉందని హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు) వాదించసాగారు. ఆ పిల్ల తన అన్న కూతురైనందువల్ల తనకే దక్కాలని హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) పట్టుబట్టారు. కేసును పలు కోణాల నుంచి పరిశీలించిన పిదప దైవప్రవక్త ﷺ, పినతల్లికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 990
హదీసు 991
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ, فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ, فَلْيُنَاوِلْهُ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరి సేవకుడైనా భోజనం సమర్పిస్తే, అతడు ఆ సేవకుణ్ణి తనతో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించలేకపోయినప్పటికీ కనీసం ఒకటి లేక రెండు ముద్దలైనా అతనికి పెట్టాలి.” (బుఖారీ, ముస్లిం – వాక్యాలు బుఖారీలోనివి)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When one's servant serves him with his food, if he does not make him sit down with him (and eat) he should give him one or two morsels (of it)." [Agreed upon, and the wording is al-Bukhari's].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 991
హదీసు 992
وَعَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { عُذِّبَتْ اِمْرَأَةٌ فِي هِرَّةٍ سَجَنَتْهَا حَتَّى مَاتَتْ, فَدَخَلْتِ اَلنَّارَ فِيهَا, لَا هِيَ أَطْعَمَتْهَا وَسَقَتْهَا إِذْ هِيَ حَبَسَتْهَا, وَلَا هِيَ تَرَكَتْهَا, تَأْكُلُ مِنْ خَشَاشِ اَلْأَرْضِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఒక స్త్రీ పిల్లిని బంధించి ఉంచినందుకు శిక్ష విధించబడింది. ఆమె పిల్లిని చాలా సేపు కట్టి ఉంచటంవల్ల అది చనిపోయింది. ఆమె ఆ పిల్లికి అన్నపానీయాలు పెట్టనూ లేరు, అది బయట ఎక్కడైనా ఏవైనా జంతువులను వేటాడి తినేందుకు దాన్ని వదలిపెట్టనూ లేరు. ఈ కారణంగా ఆ స్త్రీని నరకానికి ఆహుతి చేయటం జరిగింది. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Ibn 'Umar (RA): The Prophet (ﷺ) said: "A woman was punished on account of a cat which she held captive till it died. Hence, she entered the Hell-Fire due to (her mistreatment of) the cat. She did not feed it or give it water while she held it captive, nor did she let it out so that it may eat the things that creep on the earth." [Agreed upon].
సారాంశం
సంకలనకర్త (రహిమహుల్లాహ్) ఈ హదీసును, ఇంతకు ముందు వచ్చిన హదీసును ఈ అధ్యాయం క్రింద తీసుకోవటంలోని అంతరార్థం ఏమిటంటే పోషణా బాధ్యత అనేది చాలా ముఖ్యమైనది. తన అధీనంలో ఉన్నవారి గురించి పోషకుడు లేక సంరక్షకుడు ప్రశ్నించబడతాడు. తన సేవకుల విషయంలోనూ, తన అజమాయిషీలో వున్న పశువుల విషయంలోనూ అతడు ఎంతో బాధ్యతగా మసలుకోవలసి ఉంటుంది. యజమాని అయినవాడు తన సేవకుల అవసరాలను, భావావేశాలను దృష్టిలో పెట్టుకుని వారి మనసుకు గాయం తగలకుండా ప్రవర్తించాలి. వారి మానమర్యాదలను లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం, తన అధీనంలో వున్న జంతువుల ప్రాణం పోయేటంతటి దురవస్థను తీసుకురావటం మహాపరాధం క్రిందికి వస్తుంది. దీనికి సంబంధించి అతడు దైవసమక్షంలో శిక్షను అనుభవించవలసి ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.14 పోషణ – సంరక్షణ|హదీసు 992
You must be logged in to post a comment.