హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 18వ అధ్యాయం: హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా. ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 788 – 798) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా
باب الهبة والعمرى والرقبى
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 788
عَنْ اَلنُّعْمَانِ بْنِ بَشِيرٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- أَنَّ أَبَاهُ أَتَى بِهِ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -فَقَالَ : { إِنِّي نَحَلْتُ اِبْنِي هَذَا غُلَامًا كَانَ لِي، فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" أَكُلُّ وَلَدِكَ نَحَلْتَهُ مِثْلَ هَذَا" ?. فَقَالَ : لَا. فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" فَارْجِعْهُ" }. وَفِي لَفْظٍ : { فَانْطَلَقَ أَبِي إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -لِيُشْهِدَهُ عَلَى صَدَقَتِي. فَقَالَ : " أَفَعَلْتَ هَذَا بِوَلَدِكَ كُلِّهِمْ"?. قَالَ : لَا. قَالَ: " اِتَّقُوا اَللَّهَ , وَاعْدِلُوا بَيْنَ أَوْلَادِكُمْ " فَرَجَعَ أَبِي, فَرَدَّ تِلْكَ اَلصَّدَقَةَ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ : { فَأَشْهِدْ عَلَى هَذَا غَيْرِي" ثُمَّ قَالَ : " أَيَسُرُّكَ أَنْ يَكُونُوا لَكَ فِي اَلْبِرِّ سَوَاءً"? قَالَ : بَلَى. قَالَ : " فَلَا إِذًا }.
హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : మా నాన్నగారు నన్ను దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకువచ్చి, “నేను నా బానిసను నా ఈ కుమారునికి హిబా చేశాను (సమర్పించాను)” అని అన్నారు. దైవప్రవక్త ﷺ ఇది విని, “మరి నీ కుమారులందరికీ ఇలాగే (బానిసలను) హిబా చేశావా?” అని దర్యాప్తు చేయగా ‘లేద’ని సమాధానమిచ్చారాయన. “మరయితే (బానిసను) ఇతని నుండి వాపసు తీసుకో” అని దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : “మా నాన్నగారు దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, నాకు చేసిన ‘హిబా’ పై ఆయన్ని ﷺ సాక్షిగా ఉండమని కోరారు. ‘నీవు నీ కొడుకులందరి విషయంలో ఇలాగే వ్యవహరించావా?’ అని ఆయన ﷺ వాకబు చేశారు. ‘లేదు’ అని ఆయన (నా తండ్రి) చెప్పారు. అప్పుడు ఆయన ﷺ ‘దైవానికి భయపడు. నీ కొడుకులందరికీ న్యాయం చేకూర్చు’ అని ఉపదేశించారు. ఆఖరికి మా నాన్నగారు ఈ హిబాను (కానుకను) వాపసు తీసుకున్నారు.” (బుఖారీ, ముస్లిం)
ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో “మరయితే నా బదులు వేరొకరిని సాక్షిగా పెట్టుకో” అని దైవప్రవక్త ﷺ అన్నారు. – “నీ సంతానమంతా నీ యెడల – సమానంగా- ఉత్తమంగా వ్యవహరించడాన్ని నువ్వు ఇష్టపడవా?” అని కూడా ఆయన ﷺ ఆ వ్యక్తిని ప్రశ్నించగా “ఎందుకు ఇష్టపడను?!”అని అతనన్నాడు. “మరయితే ఇలా చేయకు” అని ఆయన ﷺ ఉపదేశించారు.
English
Narrated an-Nu'man bin Bashir (RA): His father brought him to Allah's Messenger (ﷺ) and said, "I have given this son of mine a slave, who was belonging to me." Allah's Messenger (ﷺ) asked, "Have you given all your children the like of him?" He replied, "No." Allah's Messenger (ﷺ) then said, "Take him back then."
A narration has: My father went then to the Prophet (ﷺ) to call him as a witness to my Sadaqah (i.e. gift) and he asked, "Have you done the same with all your children?" He replied, "No." He said, "Fear Allah and treat your children equally." My father then returned and took back that gift. [Agreed upon].
A narration by Muslim has: He said, "Call someone other than me as a witness to this." He then said, "Would you like them to be equal in their kind treatment of you?" He replied, "Yes." He said, "Don't do it, then."
సారాంశం
కానుకలను పిల్లలకు ఇచ్చేటప్పుడు సమానంగా – న్యాయంగా – ఇవ్వాలనీ, హెచ్చు తగ్గులను పాటించటం గానీ, కొందరికి అసలేమీ ఇవ్వకపోవటం గానీ చేయకూడదని పై హదీసు ద్వారా నిరూపితమవుతోంది. సమభావం కనబరచకపోతే అది అధర్మంతో కూడుకున్న కానుకగా పరిగణించబడుతుంది. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), సౌరీ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్)ల దృక్పథం కూడా ఇదే. సయీద్ బిన్ మన్సూర్ మరియు బైహఖీలలో వచ్చిన హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం మగ పిల్లలకు, ఆడ పిల్లలకు కూడా కానుకలను సమానంగా ఇవ్వవలసిందే. అయితే; సమానంగా ఇవ్వటం ఉత్తమమైన పద్ధతి మాత్రమేగానీ, తప్పనిసరి మాత్రం కాదని అత్యధికమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 788
హదీసు 789
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -{ اَلْعَائِدُ فِي هِبَتِهِ كَالْكَلْبِ يَقِيءُ, ثُمَّ يَعُودُ فِي قَيْئِهِ" } مُتَّفَقٌ عَلَيْه ِ. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ : { لَيْسَ لَنَا مَثَلُ اَلسَّوْءِ, اَلَّذِي يَعُودُ فِي هِبَتِهِ كَالْكَلْبِ يَقِيءُ ثُمَّ يَرْجِعُ فِي قَيْئِهِ }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఎవరికయినా ఏదైనా వస్తువును కానుకగా ఇచ్చి, దాన్ని వాపసు తీసుకునేవాడు స్వయంగా కక్కి దాన్ని నాక్కునే కుక్క లాంటివాడు.” (బుఖారీ, ముస్లిం)
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది: “మా దృష్టిలో ‘హిబా’ను తిరిగి తీసుకునేవానికన్నా చెడ్డవాడు మరొకడు లేడు. అతని ఉపమానం స్వయంగా కక్కి దాని వైపునకే మరలే కుక్క లాంటిది.”
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said: "The one who repossesses a gift is like a dog which vomits and then returns to its vomit." [Agreed upon].
A narration by al-Bukhari has: "An evil example does not apply to us, one who repossesses a gift is like a dog which vomits and then returns to its vomit."
సారాంశం
ఒక వస్తువును ఎవరికయినా దానంగా గానీ, కానుక రూపేణగానీ ఇచ్చి దాన్ని తిరిగి తీసేసుకోవటం అధర్మం అని ఈ హదీసు చెబుతోంది. పైగా ఈ చేష్ట ఎంత నీచమైనదో, జగుప్సాకరమైనదో చెప్పడానికి కుక్క చేష్టతో పోల్చటం జరిగింది. దానధర్మాలు చేసి గ్రహీత మనసు నొప్పించేవారికి, ఆత్మీయుల పట్ల సద్వ్యవహారం చేసి దెప్పిపొడిచే వారికి కూడా ఈ హదీసు పరోక్షంగా హెచ్చరిస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 789
హదీసు 790
وَعَنْ اِبْنِ عُمَرَ ، وَابْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمْ- , عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { لَا يَحِلُّ لِرَجُلٍ مُسْلِمٍ أَنْ يُعْطِيَ اَلْعَطِيَّةَ , ثُمَّ يَرْجِعَ فِيهَا ; إِلَّا اَلْوَالِدُ فِيمَا يُعْطِي وَلَدَهُ" } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ , وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ , وَابْنُ حِبَّانَ , وَالْحَاكِم ُ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా), ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)లు తెలిపారు – “ఇచ్చిన కానుకను తిరిగి తీసేసుకోవటం ఏ ముస్లిం పురుషునికీ ధర్మసమ్మతం కాదు – ఒక్క తండ్రికి తప్ప. తండ్రి మాత్రం తన సంతానానికి ఇచ్చిన కానుకను తిరిగి తీసుకోగలడు.” (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్లు ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Narrated Ibn 'Umar and Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) said: "It is not lawful for a Muslim man to give a gift and then take it back, except a father regarding what he gives a child." [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi, Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఇస్లామీయ సమాజంలో కానుకల ఇచ్చిపుచ్చుకోవడాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానుకల ద్వారా పరస్పరం ప్రేమ పెంపొందుతుంది. కానుకను ఇచ్చిన తరువాత దాన్ని తిరిగి తీసుకోవటం ఒక్క తండ్రికి మాత్రమే సమ్మతం. ఇతరులు అలా చేయకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 790
హదీసు 791
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقْبَلُ اَلْهَدِيَّةَ , وَيُثِيبُ عَلَيْهَا } رَوَاهُ اَلْبُخَارِيّ ُ.
హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ కానుకలను స్వీకరించేవారు. వాటికి బదులుగా ఏదైనా ఇచ్చి పంపటం కూడా చేసేవారు.” (బుఖారీ)
English
Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) would accept a gift and give something in return for it. [Reported by al-Bukhari].
సారాంశం
కానుకలను స్వీకరించటం, కానుకలకు బదులుగా ఏదైనా ఇచ్చి పంపటం దైవప్రవక్త ﷺ సంప్రదాయమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఆయన ﷺ కానుకలకు ‘బదులు’ను అత్యంత ఉత్తమమైన రీతిలో ఇచ్చేవారని ఇబ్నె అబీ షైబాలో ఉంది. కానుకకు బదులు ఇచ్చేందుకు ఏమీలేకపోతే కృతజ్ఞతా పూర్వకమయిన మాటనైనా చెప్పాలి. “జజాకల్లాహు ఖైర” (అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇవ్వుగాక!) అనే శ్రేయోదాయకమైన వచనాలను పలకాలి. అవతలి వ్యక్తి నుంచి కూడా తనకు ఏదైనా కానుకగా ముడ్తుంది అనే సంకల్పంతో ఎవరైనా కానుకను పంపిస్తే అట్టి కానుక ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృష్టిలో ధర్మసమ్మతమైనది కాదు. ఇతర ఇమాముల దృష్టిలో మాత్రం ధర్మసమ్మతమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 791
హదీసు 792
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { وَهَبَ رَجُلٌ لِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -نَاقَةً، فَأَثَابَهُ عَلَيْهَا , فَقَالَ : " رَضِيتَ" ? قَالَ : لَا. فَزَادَهُ , فَقَالَ : "رَضِيتَ"? قَالَ : لَا. فَزَادَهُ , فَقَالَ : "رَضِيتَ" ? قَالَ : نَعَمْ. } رَوَاهُ أَحْمَدُ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺకు ఒక ఆడ ఒంటెను కానుకగా ఇచ్చాడు. దైవ ప్రవక్త ﷺ ఆ వ్యక్తికి ఏదో ఇచ్చి, “నీవు సంతృప్తి చెందావా?” అని అడిగారు. దానికా వ్యక్తి ‘లేదు’ అని అన్నాడు. అతనికి మరికొంత ఇచ్చి, “ఇప్పుడు సంతోషం కలిగిందా!” అని అడిగారు. అప్పటికీ అతను ‘లేద’నే బదులిచ్చాడు. ఆయన ﷺ అతనికి ఇంకొంత కూడా ప్రసాదించి, “ఇప్పటికైనా నీకు సంతోషం కలిగిందా!” అని దర్యాప్తు చేశారు. అప్పుడతను ‘అవును’ అన్నాడు. (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ ప్రామాణికమైందిగా పేర్కొన్నారు)
English
Narrated Ibn 'Abbas (RA): A man gave away a she-camel to Allah's Messenger (ﷺ). So he gave him something in return for it and asked, "Are you pleased?" He replied, "No." So he gave him more and asked, "Are you pleased?" He replied, "No." Again he gave him more and asked, "Are you pleased?" He replied, "Yes." [Reported by Ahmad and Ibn Hibban graded it Sahih (authentic)].
సారాంశం
కానుకను స్వీకరించి, దానికి బదులుగా ఏదైనా వస్తువును ఇవ్వటం సమంజసమేనని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. అయితే కానుకను ఇచ్చిన వ్యక్తి, పుచ్చుకున్న వ్యక్తి నుంచి అతిగా ఆశించటం మాత్రం ఉత్తమం అనిపించుకోదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 792
హదీసు 793
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْعُمْرَى لِمَنْ وُهِبَتْ لَهُ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلِمُسْلِمٍ : { أَمْسِكُوا عَلَيْكُمْ أَمْوَالَكُمْ وَلَا تُفْسِدُوهَا , فَإِنَّهُ مَنْ أَعْمَرَ عُمْرَى فَهِيَ لِلَّذِي أُعْمِرَهَا حَياً وَمَيِّتًا، وَلِعَقِبِهِ }. وَفِي لَفْظٍ : { إِنَّمَا اَلْعُمْرَى اَلَّتِي أَجَازَهَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -أَنْ يَقُولَ: هِيَ لَكَ وَلِعَقِبِكَ، فَأَمَّا إِذَا قَالَ: هِيَ لَكَ مَا عِشْتَ، فَإِنَّهَا تَرْجِعُ إِلَى صَاحِبِهَا }. وَلِأَبِي دَاوُدَ وَالنَّسَائِيِّ : { لَا تُرْقِبُوا , وَلَا تُعْمِرُوا، فَمَنْ أُرْقِبَ شَيْئًا أَوْ أُعْمِرَ شَيْئًا فَهُوَ لِوَرَثَتِهِ }.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఉమ్రా (శాశ్వత కానుక) గురించి చెబుతూ, “ఒకరికి ఇవ్వబడిన ఉమ్రా (శాశ్వత కానుక) ఇక అతనిదే అవుతుంది” అని అన్నారు. (బుఖారీ, ముస్లిం)
ముస్లింలోని ఉల్లేఖనంలో ఇలా వుంది: “మీరు మీ సొమ్ములను మీ వద్ద భద్రంగా ఉంచండి. వాటిని వృధా చేయకండి. ఎవరయినా ఒకరికి ఒక వస్తువును ఉమ్రా (శాశ్వత కానుక) గా ఇస్తే ఇక అది ఇవ్వబడిన వ్యక్తిదే అవుతుంది. బ్రతికి ఉండగానే కాకుండా మరణించిన తరువాత కూడా (అతనిదే). మరణానంతరం అది అతని వారసులకు చెందుతుంది.
వేరొక ఉల్లేఖనంలోని వాక్యాలు ఇలా ఉన్నాయి – “ఏ ఉమ్రా (శాశ్వత కానుక) ను దైవప్రవక్త ﷺ సమ్మతించారో, ఆ ఉమ్రా అర్థమేమిటంటే, ఉమ్రా ఇచ్చేవాడు, ‘ఇది నీది. నీ తదనంతరం నీ సంతానానిది’ అని స్పష్టంగా చెప్పి ఇస్తే అప్పుడది తీసుకున్న వ్యక్తికి ఆ విధంగానే దక్కుతుంది. ఒకవేళ ఇచ్చేవాడు, ‘నీవు బ్రతికి ఉన్నంత కాలం ఇది నీది’ అని చెబితే మాత్రం అతని తదనంతరం ఆ వస్తువు ఇచ్చిన వాని వైపునకు మళ్ళించబడుతుంది.”
అబూదావూద్, నసాయి ఉల్లేఖనంలో ఉంది : మీరు రుఖ్బా గానీ, ఉమ్రాగానీ చేయకండి. ఎవరయినా ఏదయినా వస్తువును రుఖ్బా చేస్తే లేదా ఉమ్రాగా ఇస్తే అది అతని వారసులకు చెందుతుంది.”
English
Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "What is given in life-tenancy belongs to the one to whom it is given." [Agreed upon].
Muslim has: "Keep your properties for yourselves and do not squander them, for if anyone gives a life-tenancy it goes to the one to whom it is given, both during his life and after his death, and to his descendants."
A narration has: "The life-tenancy which Allah's Messenger (ﷺ) allowed was only that in which one says, 'It is for you and your descendants.' However, if he says, 'It is yours as long as you live', it returns to its owner."
Abu Dawud and an-Nasa'i have: "Do not give property "to go to the survivor" and do not give "life-tenancy", for if anyone is given either, the property goes to his heirs."
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 793
హదీసు 794
وَعَنْ عُمَرَ - رضى الله عنه - قَالَ : { حَمَلْتُ عَلَى فَرَسٍ فِي سَبِيلِ اَللَّهِ , فَأَضَاعَهُ صَاحِبُهُ , فَظَنَنْتُ أَنَّهُ بَائِعُهُ بِرُخْصٍ، فَسَأَلْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -عَنْ ذَلِكَ. فَقَالَ : " لَا تَبْتَعْهُ , وَإِنْ أَعْطَاكَهُ بِدِرْهَمٍ … } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొక గుర్రాన్ని దైవమార్గంలో స్వారీ కోసం ఒక వ్యక్తికి ఇచ్చాను. అయితే అతనా గుర్రాన్ని దుర్భర స్థితికి చేర్చాడు. అతనా గుర్రాన్ని తక్కువ ధరకు అమ్మేస్తాడేమోనని కూడా నేను భావించాను. దీని గురించి దైవప్రవక్త ﷺను అడిగి తెలుసుకుందామని తలంచి, ‘నేనా గుర్రాన్ని కొనవచ్చా!’ అని అడిగాను. దానికి ఆయన ﷺ, “అతనా గుర్రాన్ని ఒక్క దిర్హంకు అమ్మినా సరే నీవు దాన్ని కొనకు” అని చెప్పారు – సశేషం –
(బుఖారీ, ముస్లిం)
English
Narrated 'Umar (RA): I provided a man with a horse to ride in Allah's Cause, but as he did not look after it well, I thought he would sell it at a cheap price. I therefore asked Allah's Messenger (ﷺ) about that and he said, "Do not buy it even if he gives it to you for a Dirham…" The narrator reported the rest of the Hadith. [Agreed upon].
సారాంశం
దానంగా ఇచ్చిన వస్తువును డబ్బు చెల్లించి కొనటం కూడా ధర్మసమ్మతం కాదని ఈ హదీసు చెబుతోంది. కొంతమంది విద్వాంసులు ఇలాంటి కొనుగోలును ‘హరామ్’ (నిషిద్ధం)గా ఖరారు చేయగా, మరికొంతమంది ‘వారింపు’గా భావించారు. దైవప్రవక్త ﷺ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను ఆ గుర్రం కొనేందుకు వారించటంలోని అంతర్యం ఏమిటంటే; వస్తువును దానంగా ఇచ్చిన వ్యక్తికే తిరిగి అమ్మవలసివచ్చినపుడు అమ్మేవాడు మొహమాటపడతాడు. అమ్మవలసిన ధరకన్నా తక్కువ ధరకే అమ్మేస్తాడు. ఒక విధంగా ఇది అమ్మకందారునికి నష్టం చేకూరుస్తుంది. అదే సమయంలో ఒకప్పుడు దానంగా ఇచ్చి ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి చాలా తక్కువ ధరకు ఆ వస్తువును చేజిక్కించుకుంటాడు. అంటే ఇచ్చిన దానాన్ని తిరిగి పుచ్చుకున్నట్టు అవుతుంది. దానంగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసేసుకోవటం కక్కిన దాన్ని నాకటంతో సమానమని లోగడ హదీసులో చెప్పబడటం ఈ సందర్భంగా గమనార్హం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 794
హదీసు 795
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنِ النَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { تَهَادُوْا تَحَابُّوا } رَوَاهُ اَلْبُخَارِيُّ فِي " اَلْأَدَبِ اَلْمُفْرَدِ " وَأَبُو يَعْلَى بِإِسْنَادٍ حَسَن ٍ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “పరస్పరం కానుకల్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. దీనివల్ల ఒండొకరి మధ్య ప్రేమ పెంపొందుతుంది.” (ఈ హదీసును బుఖారీ అదబుల్ ముఫ్రిద్లో ఉల్లేఖించారు. అబూ యాలా దీనిని ఎన్నదగ్గ రీతిలో నకలు చేశారు)
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "Give gifts to one another and you will love one another." [al-Bukhari reported it in al-Adab al-Mufrad; Abu Ya'la reported it with a Hasan (good) chain of narrators].
సారాంశం
ఒకరు మరొకరికి కానుకను ఇవ్వటం ప్రేమకు సోపానం. కాగా; ఇస్లాం సభ్యసమాజ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందాలనీ, అంతరాల అగాధాలు, అసూయా ద్వేషాలు సమసిపోవాలని కాంక్షిస్తోంది. కాబట్టి ప్రజలు ఇతోధికంగా ఈ రివాజును కొనసాగించాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 795
హదీసు 796
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ تَهَادَوْا , فَإِنَّ اَلْهَدِيَّةَ تَسُلُّ اَلسَّخِيمَةَ } رَوَاهُ اَلْبَزَّارُ بِإِسْنَادٍ ضَعِيف ٍ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “పరస్పరం కానుకల మార్పిడి చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ కానుక కాపట్యాన్ని, కార్కశ్యాన్ని తొలగిస్తుంది.” (దీనిని బజ్జార్ బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)
English
Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) said: "Give gifts to one another, for (giving) gifts gently extracts resentment and ill-will." [al-Bazzar reported it through a Da'if (weak) chain of narrators].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 796
హదీసు 797
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ يَا نِسَاءَ اَلْمُسْلِمَاتِ ! لَا تَحْقِرَنَّ جَارَةٌ لِجَارَتِهَا وَلَوْ فِرْسِنَ شَاةٍ } مُتَّفَقٌ عَلَيْه ِ.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తాకీదు చేశారు- “ఓ ముస్లిం మహిళల్లారా! ఏ ఇరుగు స్త్రీ కూడా తన పొరుగింటి స్త్రీకి కానుక పంపటాన్ని అల్పంగా భావించకూడదు – ఆఖరికి ఆ కానుక మేక కాలి గిట్ట అయినాసరే!” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "O Muslim women, a woman neighbor should not consider even a goat's hoof too insignificant a gift to give to her neighbor." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 797
హదీసు 798
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- , عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { مَنْ وَهَبَ هِبَةً , فَهُوَ أَحَقُّ بِهَا , مَا لَمْ يُثَبْ عَلَيْهَا } رَوَاهُ اَلْحَاكِمُ وَصَحَّحَهُ , وَالْمَحْفُوظُ مِنْ رِوَايَةِ اِبْنِ عُمَرَ, عَنْ عُمَرَ قَوْلُه ُ
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచించారు : “ఎవరయినా ఏదైనా వస్తువును హిబా చేయగా (కానుకగా ఇవ్వగా) దానికి బదులు ఇవ్వబడకుండా ఉంటే ఆ వస్తువుకు అతనే ఎక్కువ హక్కుదారుడు అవుతాడు.” (దీనిని హాకిమ్ ఉల్లేఖించి, ప్రామాణికమైనదిగా నిర్ధారించారు. వాస్తవానికి ఇది ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) సౌజన్యంతో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) పలికిన పలుకులు)
English
Narrated Ibn 'Umar (RA): The Prophet (ﷺ) said: "If anyone gives away a gift, he has most right to it as long as he is given nothing in return for it." [al-Hakim reported and graded it Sahih (authentic). However, the stronger narration is Ibn 'Umar's narration on the authority of 'Umar (RA) as a saying of 'Umar].
సారాంశం
ఇదే అర్థాన్నిచ్చే రెండు ఉల్లేఖనాలు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు), ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)లచే కూడా ఉల్లేఖించబడ్డాయి. కొంతమంది ఈ ఉల్లేఖనాల ఆధారంగానే, కానుకకు బదులు తీసుకుని ఉన్న పరిస్థితుల్లో, ఆ కానుకను తిరిగి తీసుకోవటం హరామ్ (నిషిద్ధం) అవుతుందన్న ఆంక్ష విధించారు. అయితే అల్లామా షౌకానీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా), అబూహురైర (రదియల్లాహు అన్హు), సముర (రదియల్లాహు అన్హు)ల ఈ ఉల్లేఖనాలు బలహీనమైనవనీ, వాటిలో ప్రామాణికంగా ఖరారు చేయదగ్గ ఉల్లేఖనం ఏదీ లేదనీ ఇబ్నె జౌజీ అంటున్నారు. తబ్రానీ గారు తన “మోజముల్ కబీర్”లో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)చే చెప్పబడిన ఉల్లేఖనాన్ని ఉదాహరించారు. దాని ప్రకారం ఎవరయినా ఏదైనా వస్తువును కానుకగా ఇవ్వగా అతనికి బదులు ఇవ్వబడకుండా ఉన్నంతకాలం అతను మాత్రమే ఆ వస్తువు యెడల అందరికన్నా ఎక్కువ హక్కుదారుడై ఉంటాడు. ఒకవేళ అతడు కానుకగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసేసుకుంటే అతని ఉపమానం స్వయంగా కక్కి తరువాత దాన్ని నాకిన వానిలాంటిది. ఒకవేళ ఈ హదీసులు ప్రామాణికమైనవైతే ఈ వ్యవహారంలో మొదటి హదీసుకు విరుద్ధంగా పరిణమిస్తాయి. అంటే; బదులు తీసుకున్న కానుకలను తిరిగి తీసేసుకోవటాన్ని ఇవి హరామ్ (నిషిద్ధం)గా ఖరారు చేస్తున్నాయి. కాబట్టి బదులు తీసుకోకముందే హిబాగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోవటం సమ్మతమేనన్న మాట! అల్లామా షౌకానీ (రహిమహుల్లాహ్) గారి ఈ చర్చనుబట్టి ఆయన ఈ హదీసుల ప్రామాణికతపై సంతృప్తి చెందలేదనిపిస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా|హదీసు 798
You must be logged in to post a comment.