హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 12వ అధ్యాయం: దురాక్రమణ. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 755 – 759) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.12 దురాక్రమణ
باب الغصب
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 755
عَنْ سَعِيدِ بْنِ زَيْدٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا-; أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ اِقْتَطَعَ شِبْرًا مِنْ اَلْأَرْضِ ظُلْماً طَوَّقَهُ اَللَّهُ إِيَّاهُ يَوْمَ اَلْقِيَامَةِ مِنْ سَبْعِ أَرَضِينَ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఎవరయినా ఇతరులకు చెందిన ఒక జానెడు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నా, అల్లాహ్ ప్రళయదినాన ఆ భూమికి ఏడురెట్ల పరిమాణం గల గుదిబండను అతని మెడలో వేస్తాడు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Sa'id bin Zaid (RA): Allah's Messenger (ﷺ) said: "If anyone takes a span of land unjustly, on the Day of Resurrection Allah will strangle him with it from seven earths." [Agreed upon].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.12 దురాక్రమణ|హదీసు 755
హదీసు 756
وَعَنْ أَنَسٍ; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ عِنْدَ بَعْضِ نِسَائِهِ، فَأَرْسَلَتْ إِحْدَى أُمَّهَاتِ اَلْمُؤْمِنِينَ مَعَ خَادِمٍ لَهَا بِقَصْعَةٍ فِيهَا طَعَامٌ، فَضَرَبَتْ يَدَهَا فَكَسَرَتِ اَلْقَصْعَةَ، فَضَمَّهَا, وَجَعَلَ فِيهَا اَلطَّعَامَ. وَقَالَ: " كُلُوا " وَدَفَعَ اَلْقَصْعَةَ اَلصَّحِيحَةَ لِلرَّسُولِ, وَحَبَسَ اَلْمَكْسُورَةَ } وَاَلتِّرْمِذِيُّ, وَسَمَّى اَلضَّارِبَةَ عَائِشَةَ, وَزَادَ: فَقَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -{ طَعَامٌ بِطَعَامٍ, وَإِنَاءٌ بِإِنَاءٍ } وَصَحَّحَهُ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తన సతీమణులలో ఎవరో ఒకామె ఇంటనుండగా, అక్కడికి విశ్వాసుల మాతృమూర్తి మరొకామె (రదియల్లాహు అన్హా) తన నౌకరు ద్వారా ఒక పాత్రను పంపించారు. అందులో ఏదో ఆహార పదార్థం ఉంది. అయితే అక్కడున్న సతీమణి చేయి విదిలించారు. ఆ పాత్ర క్రిందపడి పగిలిపోయింది. ఆయన ﷺ ఆ పాత్రను అతికించి, (క్రిందపడిన) వంటకాన్ని అందులో వేశారు. తరువాత తన సతీమణి నుద్దేశ్యించి, “ఇంద, ఇది తిను” అన్నారు. పగిలిపోయిన పాత్రను తానుంచుకుని మంచిపాత్రను నౌకరు ద్వారా పంపించారు (బుఖారీ, తిర్మిజీ). చేయి విదిలించి పాత్రను పగులగొట్టిన ఆమె పేరు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అని అనబడింది. “భోజనానికి బదులు భోజనం – పాత్రకు బదులు పాత్ర” అని దైవప్రవక్త ﷺ చెప్పినట్లుగా కూడా తిర్మిజీ పొందుపరిచారు. (ఈ హదీసును తిర్మిజీ సహీహ్ గా పేర్కొన్నారు)
English
Narrated Anas (RA): The Prophet (ﷺ) was with one of his wives when one of the Mothers of the Believers (another of his wives) sent a bowl containing food with a servant of hers. Then, she (in whose house he was) struck it with her hand and the bowl was broken. He collected the pieces of the bowl and began to collect the follow in it and said, "You eat," and gave an unbroken bowl to the messenger (servant) and kept the broken one. [Reported by al-Bukhari].
at-Tirmidhi named the one who broke it as 'Aishah (RA) and added: The Prophet (ﷺ) then said, "Food for food, and a vessel for a vessel." [at-Tirmidhi graded it Sahih (authentic)].
సారాంశం
దైవప్రవక్త ﷺ ఉన్న కుటీరంలోకి వంటకాన్ని పంపించిన విశ్వాసుల మాతృమూర్తి పేరు హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా)అనీ, కోపంతో చేయి విదిలించిన విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అనీ వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామానికి దైవప్రవక్త ﷺ ఏమాత్రం ఆగ్రహించలేదు సరికదా, ఆ వంటపాత్రను అతికించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రిందపడిపోయిన వంటకాన్ని స్వయంగా లేపారు. ఆయన ﷺ గారి ఈ సకారాత్మక స్పందనకు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నివ్వెరపోయారు. సిగ్గుపడ్డారు. వెంటనే తన తప్పిదాన్ని గ్రహించి, “దైవప్రవక్తా! నేను చేసిన తప్పుకు పరిహారం ఏమిటీ?” అని సందేహపడ్డారు. “ఏముందీ, భోజనానికి బదులు అలాంటి భోజనమే తయారుచేసి పంపాలి. పగిలిన వంటపాత్రకు బదులుగా పగలని పాత్ర ఇచ్చి పంపాలి” అని అన్నారు.
దైవప్రవక్త ﷺ సతీమణులుగా ఉన్నవారు ఇలా ప్రవర్తించటం భావ్యమేనా? అన్న ప్రశ్న పాఠకులలో ఈ సందర్భంగా జనించవచ్చు. కాని మనం ఎంతసేపటికీ దైవప్రవక్త ﷺ సతీమణులనే కోణం నుంచే ఎందుకు చూడాలి? వారినీ ఒక స్త్రీగా, ఒక భర్తకు భార్యగా ఎందుకు చూడకూడదు? మానవ సహజమైన దౌర్బల్యాలకు ప్రవక్త సతీమణులు కూడా అతీతులు కారన్న సంగతిని ఈ సందర్భంగా విస్మరించకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.12 దురాక్రమణ|హదీసు 756
హదీసు 757
وَعَنْ رَافِعِ بْنِ خَدِيجٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ زَرَعَ فِي أَرْضِ قَوْمٍ بِغَيْرِ إِذْنِهِمْ, فَلَيْسَ لَهُ مِنْ اَلزَّرْعِ شَيْءٌ, وَلَهُ نَفَقَتُهُ } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيَّ, وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ. وَيُقَالُ: إِنَّ اَلْبُخَارِيَّ ضَعَّفَهُ.
హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఎవరయినా ఇతరుల భూమిలో వారి అనుమతి లేకుండా వ్యవసాయం చేస్తే అతనికి ఆ వ్యవసాయోత్పత్తినుండి ఎలాంటి వాటా లభించదు. కేవలం అతను వెచ్చించిన ఖర్చులు మాత్రం అతనికి ఇవ్వబడతాయి.”(ఈ హదీసును అహ్మద్ మరియు ‘నలుగురి’లో నసాయి తప్ప మిగిలినవారు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేయగా, బుఖారీ మాత్రం ‘జయీఫ్’గా నిర్ధారించారని అనబడుతోంది)
English
Narrated Rafi' bin Khadij (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever sows in the land of a people without their permission, he has no right to any of the crop. However, he is entitled to what he spent on it." [Reported by Ahmad and al-Arba'a except an-Nasa'i. at-Tirmidhi graded it Hasan (good).
It has been said that al-Bukhari graded it Da'if (weak).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.12 దురాక్రమణ|హదీసు 757
హదీసు 758
وَعَنْ عُرْوَةَ بْنِ اَلزُّبَيْرِ قَالَ: قَالَ رَجُلٌ مِنْ أَصْحَابِ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِنَّ رَجُلَيْنِ اِخْتَصَمَا إِلَى رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -فِي أَرْضٍ, غَرَسَ أَحَدُهُمَا فِيهَا نَخْلًا, وَالْأَرْضُ لِلْآخَرِ, فَقَضَى رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -بِالْأَرْضِ لِصَاحِبِهَا, وَأَمَرَ صَاحِبَ اَلنَّخْلِ أَنْ يُخْرِجَ نَخْلَهُ. وَقَالَ: " لَيْسَ لِعِرْقٍ ظَالِمٍ حَقٌّ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَإِسْنَادُهُ حَسَنٌ. وَآخِرُهُ عِنْدَ أَصْحَابِ " اَلسُّنَنِ " مِنْ رِوَايَةِ عُرْوَةَ, عَنْ سَعِيدِ بْنِ زَيْدٍ. وَاخْتُلِفَ فِي وَصْلِهِ وَإِرْسَالِهِ, وَفِي تَعْيِين صَحَابِيِّهِ.
హజ్రత్ ఉర్వ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ సహచరులొకరు ఇలా తెలియజేశారు – ఇద్దరు వ్యక్తులు దైవప్రవక్త ﷺ దగ్గరికి ఒక భూమి తగాదాను తీసుకువచ్చారు. భూమి ఒకరిదై ఉండగా, అందులో ఖర్జూర చెట్లను మరొకరు నాటారు. అప్పుడాయన ﷺ ఇలా తీర్పు ఇచ్చారు : “భూమి యజమానిదే. ఖర్జూర మొక్కలను నాటినవాడు తన మొక్కలను పెకలించాలి.” ఇంకా, “అన్యాయంతో కూడిన శ్రమకు ప్రతిఫలం ఏమీ ఇవ్వబడదు” అని కూడా ఆయన ﷺ అన్నారు. (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఈ హదీసు ‘హసన్’ కోవకు చెందినది. దీని చివరి భాగాన్ని సునన్ గ్రంథాల రచయితలు ఉర్వ బిన్ సయీద్ బిన్ జైద్ ఆధారంగా పొందుపరచారు. ఈ ఉల్లేఖనాన్ని ‘ముర్సల్’ అనాలా? లేక ‘మౌసూల్’ గా పరిగణించాలా? మొట్టమొదటిసారిగా దీన్ని అందజేసిన సహాబీ ఎవరు? అనే అంశాలపై భిన్నాభిప్రాయం వ్యక్తమైంది)
English
Narrated 'Urwa bin az-Zubair (RA): A man among the Companions of Allah's Messenger (ﷺ) said: "Two men brought a dispute before Allah's Messenger (ﷺ) concerning a land in which one of them had planted palm trees and the land belonged to the other. So, Allah's Messenger (ﷺ) ruled that the land belongs to its owner, and commanded the owner of the palm trees to uproot his palm trees. He said, "The labor of an unjust person has no right." [Reported by Abu Dawud and its chain of narrators is Hasan (good). The last (quoted) part of the aforesaid Hadith is found in the books of the collections of as-Sunan, from 'Urwa's narration on the authority of Sa'id bin Zaid.
However, there is disagreement regarding whether it is Mawsul (an unbroken chain) or Mursal (missing link after the Tabi'i) as well as the determination of the name of the Companion who heard it from the Prophet (ﷺ).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.12 దురాక్రమణ|హదీసు 758
హదీసు 759
وَعَنْ أَبِي بَكْرَةَ; - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: فِي خُطْبَتِهِ يَوْمَ اَلنَّحْرِ بِمِنًى { إِنَّ دِمَاءَكُمْ وَأَمْوَالَكُمْ [ وَأَعْرَاضَكُمْ ] عَلَيْكُمْ حَرَامٌ, كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا، فِي بَلَدِكُمْ هَذَا، فِي شَهْرِكُمْ هَذَا } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఖుర్బానీ దినాన ‘మినా’లో ప్రసంగిస్తూ ఇలా అన్నారు – “ఈ రోజు, ఈ నగరం, ఈ నెల మీ కొరకు ఎలా పవిత్రం (నిషిద్ధం) గావించబడ్డాయో అలాగే మీ రక్తం, మీ ఆస్తిపాస్తులు, మీ పరువు ప్రతిష్టలు పవిత్రం (నిషిద్ధం) గావించబడ్డాయి (అన్యాయంగా మీరు వాటిని కబళించకూడదు). (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Bakra (RA): In his Khutbah (religious talk – sermon) on the Day of Sacrifice at Mina, the Prophet (ﷺ) said: "Your blood and your property and your honor are forbidden for you to violate, like the sacredness of this day of yours, in this month of yours, in this city of yours." [Agreed upon].
సారాంశం
రచయిత ఈ హదీసును ఈ అధ్యాయం మొదట్లోనే తీసుకుని ఉంటే చాలా బాగుండేది. మొత్తమ్మీద ఒక ముస్లిం ఆస్తిని అక్రమంగా, అన్యాయంగా స్వాధీనం చేసుకోవటం నిషిద్ధమని చెప్పటం ఇక్కడ ప్రధానోద్దేశ్యం. ఈ నిషేధంపై అందరిమధ్యా ఏకాభిప్రాయం ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.12 దురాక్రమణ|హదీసు 759
You must be logged in to post a comment.