హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 11వ అధ్యాయం: అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 751 – 754) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి

↑ విషయ సూచిక

باب العارية

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

751

హదీసు 751

عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ عَلَى اَلْيَدِ مَا أَخَذَتْ حَتَّى تُؤَدِّيَهُ } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధనం – “(అరువుగా) పుచ్చుకున్న చెయ్యి తిరిగి ఇచ్చే వరకూ రుణపడి ఉంటుంది.” (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని సహీహ్ గా ఖరారు చేశారు)

English

Narrated Samura bin Jundub (RA): Allah's Messenger (ﷺ) said: "The hand (which takes) is responsible for what it has taken till it returns it." [Reported by Ahmad and al-Arba'a. al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే ఎవరయినా ఏ వస్తువునైనా ఒకరి నుంచి అరువుగా తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి ఇవ్వవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఈ బాధ్యతను నెరవేర్చటం అనివార్యం. అరువుగా తీసుకున్న వస్తువు జమానతు ఎవరిది? ఈ జమానతు అరువుగా తీసుకున్న వ్యక్తిపై ఉంటుందా? లేదా? దీనిపై మూడు అభిప్రాయాలున్నాయి. (1) ఎట్టి పరిస్థితిలోనూ ఈ జమానతు అరువు తీసుకున్న వానిపై ఉంటుంది. దానికి సంబంధించి షరతు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అతనే బాధ్యుడు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా), జైద్ బిన్ అలీ (రహిమహుల్లాహ్), అతా (రహిమహుల్లాహ్), అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్‌హాఖ్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం కూడా ఇదే. (2) జమానతుకు సంబంధించిన షరతు విధించబడకుండా ఉంటే అరువుగా తీసుకున్న వ్యక్తిపై ఆ బాధ్యత లేదు. (3) ఒకవేళ షరతు పెట్టినప్పటికీ అతడు ఆ వస్తువు (అప్పగింత) పట్ల స్వామి ద్రోహానికి పాల్పడకుండా ఉన్నంతవరకూ అతనిపై జమానతు బాధ్యత ఉండదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి|హదీసు 751

752

హదీసు 752

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أَدِّ اَلْأَمَانَةَ إِلَى مَنْ اِئْتَمَنَكَ, وَلَا تَخُنْ مَنْ خَانَكَ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ, وَاسْتَنْكَرَهُ أَبُو حَاتِمٍ اَلرَّازِيُّ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచనం – “ఎవరయినా నీ దగ్గర ఏదైనా అప్పగింత (అమానతు)గా పెడితే ఆ అప్పగింతను అతనికి తిరిగి ఇచ్చివెయ్యి. ఒకవేళ ఎవరయినా నీ పట్ల ద్రోహానికి పాల్పడితే (ఖయానత్ చేస్తే) నీవు మాత్రం అతనిపట్ల అలా చేయకు.” (దీనిని అబూదావూద్, తిర్మిజీ ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు. హాకిమ్ ప్రామాణికమైనదిగా పేర్కొనగా, అబూహాతిమ్ రాజీ మాత్రం దీనిని ఆక్షేపణీయమైనదిగా తలపోశారు)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Give back what has been entrusted (to you) to him who has entrusted you, and do not violate the trust of him who violates your trust." [Reported by at-Tirmidhi and Abu Dawud; at-Tirmidhi graded it Hasan (good) and al-Hakim graded it Sahih (authentic). Abu Hatim ar-Razi considered it Munkar (rejected)].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి|హదీసు 752

753

హదీసు 753

وَعَنْ يَعْلَى بْنِ أُمَيَّةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ لِي رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا أَتَتْكَ رُسُلِي فَأَعْطِهِمْ ثَلَاثِينَ دِرْعاً ", قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ ! أَعَارِيَةٌ مَضْمُونَةٌ أَوْ عَارِيَةٌ مُؤَدَّاةٌ? قَالَ: بَلْ عَارِيَةٌ مُؤَدَّاةٌ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ యాల బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నాకు, “నీ దగ్గరికీ నా తరపున దూతలు వచ్చినప్పుడు వారికి ముప్పయి కవచాలు ఇవ్వు” అని సూచించారు. “దైవప్రవక్తా ﷺ! అప్పుగా ఇవ్వాలా? లేక వస్తువును వాపసు చేసే షరతుపై ఇవ్వాలా?” అని నేను సందేహపడగా “వస్తువును తిరిగి ఇచ్చే నిబంధనపై ఇవ్వు” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు)

English

Narrated Ya'la bin Umaiya (RA): Allah's Messenger (ﷺ) said to me, "When my messengers come to you, give them thirty coats of armor." I asked, "O Allah's Messenger, is it a loan with a guarantee (of its return), or a borrowed object that must be returned?" He replied, "No, it is a borrowed object that must be returned." [Reported by Ahmad, Abu Dawud and an-Nasa'i. Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

అరబీలో ‘ఆరియా మజ్ మూన’, ‘ఆరియా ముఅద్ద’ అనే రెండు రకాల అరువులు ఉన్నాయి. ‘ఆరియా మజ్ మూన’ ప్రకారం అరువుగా తీసుకున్న వస్తువుపోయినా, దెబ్బతిన్నా దాని వెలను చెల్లించవలసి ఉంటుంది. ‘ఆరియా ముఅద్ద’ ప్రకారం వస్తువు యథారూపంలో ఉంటే దాన్ని తిరిగి ఇవ్వాలి. ఒకవేళ తీసుకున్న వస్తువు చెడిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా దాని మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి|హదీసు 753

754

హదీసు 754

وَعَنْ صَفْوَانَ بْنِ أُمَيَّةَ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِسْتَعَارَ مِنْهُ دُرُوعاً يَوْمَ حُنَيْنٍ.‏ فَقَالَ: أَغَصْبٌ يَا مُحَمَّدُ? قَالَ: بَلْ عَارِيَةٌ مَضْمُونَةٌ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِمُ. وَأَخْرَجَ لَهُ شَاهِدًا ضَعِيفًا عَنْ اِبْنِ عَبَّاسٍ.

హజ్రత్ సఫ్వాన్ బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ హునైన్ యుద్ధ సందర్భంగా తన (సఫ్వాన్) వద్ద కొన్ని కవచాలు తీసుకున్నారు. “తమరు వీటిని బలవంతంగా తీసుకుంటున్నారా?” అని అతను సందేహం వ్యక్తపరచగా “లేదు, వీటిని తిరిగి వాపసుచేసే గ్యారంటీ (ఆరియా మజ్ మూనా)పై తీసుకుంటున్నాను” అని ఆయన ﷺ అన్నారు. (దీన్ని అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. హాకిమ్ దీన్ని ప్రామాణికంగా ఖరారు చేశారు. ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారి ఒక బలహీన ఉల్లేఖనం కూడా దీనికి సాక్షిగా ఉంది)

English

Narrated Safwan bin Umaiya (RA): At the battle of Hunain, the Prophet (ﷺ) borrowed coats of mail from him and he asked, "Are you taking them by force, O Muhammad (ﷺ)?" He replied, "No, it is a loan with a guarantee of their reutrn." [Reported by Abu Dawud and an-Nasa'i; al-Hakim graded it Sahih (authentic)].

He also reported for this Hadith a Shahid (supporting narration) which is weak, from Ibn 'Abbas.

సారాంశం

ఒక్క ముస్లిములనుండే కాదు, ముస్లిమేతరుల నుండి కూడా అరువుగా వస్తువులు తీసుకోవచ్చని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. తిరిగి ఇచ్చే షరతుపై (ఆరియా మజ్ మూనాపై) వస్తువును తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వటం తప్పనిసరి. ఒకవేళ ఆ వస్తువు పాడైపోతే తగు మూల్యం చెల్లించటం అనివార్యమవుతుంది. వస్తువును “ఆరియా ముఅద్ద” షరతుపై తీసుకున్న వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా వస్తువును చెడగొడితేమటుకు అతడు సయితం వస్తువు వెలను చెల్లించాల్సిందే.

హదీసు ఉల్లేఖకులు

సఫ్వాన్ బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) : వంశపరంపరను చూస్తే సఫ్వాన్ బిన్ ఉమయ్య బిన్ ఖలఫ్ బిన్ వహ్బ్ ఖురషీ అనబడతారు. మక్కావాసి. జుమహీ తెగకు చెందినవారు. సద్వ్యవహారం ద్వారా హృదయాలు జయించబడిన వారిలో ఈయన ఒకరు. మక్కా కురైషుల్లో మర్యాదస్తులుగా పేరుపొందారు. ‘మక్కా విజయం’నాడు మక్కానుండి పారిపోయారు. అభయం ఇచ్చిన మీదట తిరిగి వచ్చారు. హునైన్ యుద్ధం ఆరంభమయ్యేనాటికి కూడా అవిశ్వాసిగానే ఉన్నారు. ఆ తరువాత ఇస్లాం స్వీకరించారు. ముస్లిం అయిన తరువాత మొక్కవోని సహనస్థయిర్యాలను కనబరిచారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన రోజుల్లో ఈయన కూడా మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి|హదీసు 754