హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 6. హజ్జ్ పుస్తకం, 4వ అధ్యాయం: ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు. ఈ అధ్యాయంలో 14 హదీసులు (హదీసు 593 – 606) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు
باب الإحرام وما يتعلق به
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 593
عَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { مَا أَهَلَّ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِلَّا مِنْ عِنْدِ اَلْمَسْجِدِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం: దైవప్రవక్త ﷺ మస్జిద్ సమీపంలో తప్ప ‘లబ్బైక్’ నినాదం చేయలేదు. (బుఖారీ, ముస్లిం)
English
Ibn 'Umar (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) used to start saying the Talbiyah. (after entering the state of Ihram) from the mosque of Dhul Hulaifa (i.e. from the Miqat of Madinah). Agreed upon.
సారాంశం
ఇక్కడ మస్జిద్ అంటే ‘జుల్ హులైఫా’ స్థానం అని భావం. దైవప్రవక్త ﷺ ‘బైదా’ అనే స్థలంలో ఇహ్రామ్ కట్టుకున్నారని కొంతమందికి కలిగిన అపోహను దూరం చేయడానికి హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధంగా అన్నారు. ఆయన ﷺ మూడుసార్లు ‘లబ్బైక్’ నినాదం చేసినట్లు హదీసులలో వచ్చింది. ఆయన ﷺ మస్జిద్లో ఉండగానే – రెండు రకతుల నమాజ్ చేసి – లబ్బైక్ పలికారని కొన్ని ఉల్లేఖనాలలో ఉండగా, ‘బైదా’ శిఖరానికి చేరుకుని అక్కడినుంచి లబ్బైక్ అని ఎలుగెత్తి చాటారని మరికొన్ని ఉల్లేఖనాల్లో ఉంది. హదీసులలో పరస్పర వ్యాఘాతం పైకి కనిపిస్తున్నప్పటికీ వాటి మధ్య ఈ విధంగా సమన్వయం చేయబడింది – ఆయన ﷺ మస్జిద్లోనే ఇహ్రామ్ కట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని చూచినవారు ఆ స్థితిని మాత్రమే వర్ణించారు. అయితే ఆయన ﷺ బయటికి వచ్చి ఒంటెపై కూర్చుని బిగ్గరగా లబ్బైక్ నినాదం చేసినపుడు ఆ దృశ్యాన్ని చూచినవారు, దైవప్రవక్త ﷺ ఇప్పుడే ఇహ్రామ్ దీక్షబూనారని తలపోశారు. ఇక కాస్త ముందుకు వెళ్ళాక – ‘బైదా’ స్థలంలో ఆయన ﷺ లబ్బైక్ పలకటం విన్న ప్రజలు, బహుశా దైవప్రవక్త ﷺ ఇక్కడే ఇహ్రామ్ దీక్షబూని ఉంటారని భావించారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఈ దృశ్యాన్ని చూచారో వారు ఆ స్థితిని యధాతథంగా చిత్రీకరించారు. అందువల్ల ఈ హదీసులలో వైరుధ్యం కనబడుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 593
హదీసు 594
وَعَنْ خَلَّادِ بْنِ اَلسَّائِبِ عَنْ أَبِيهِ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { أَتَانِي جِبْرِيلُ, فَأَمَرَنِي أَنْ آمُرَ أَصْحَابِي أَنْ يَرْفَعُوا أَصْوَاتَهُمْ بِالْإِهْلَالِ } رَوَاهُ اَلْخَمْسَةُ، وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ حِبَّانَ.
ఖల్లాద్ బిన్ సాయిబ్ తన తండ్రి నుంచి గ్రహించిన హదీసు ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు – “జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా దగ్గరకు వచ్చి ‘లబ్బైక్’ను బిగ్గరగా పలకమని మీ సహచరులను ఆదేశించండి’ అని నన్ను సూచించారు.” (దీనిని ఐదుగురు ఉల్లేఖించారు – ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ధృవీకరించారు)
English
Khallad bin as-Sa’ib narrated on the authority of his father, ‘The Messenger of Allah (ﷺ) said: “Jibril (peace be upon him) came to me and told me: ‘Command your Companions to raise their voices when saying Talbiyah.” Related by the five Imams and rendered authentic by At-Tirmidhi and Ibn Hibban.
సారాంశం
‘లబ్బైక్’ను బిగ్గరగా పలకాలన్న దానికి ఈ హదీసు బహిరంగ నిదర్శనం. దైవప్రవక్త ﷺ సహచరులు ఎంత బిగ్గరగా ఈ ‘తల్బియా’ పలికేవారంటే, ఒక్కోసారి వారి గొంతు బొంగురు పోయేది. మెజారిటీ ధర్మవేత్తలు కూడా దీంతో ఏకీభవించారు. అయితే ‘తల్బియా’ కేవలం మినా మరియు మస్జిదె హరామ్ వద్దనే బిగ్గరగా పలకాలని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అంటారు.
హదీసు ఉల్లేఖకులు
(1) ఖల్లాద్ : ఖల్లాద్ బిన్ సాయిబ్ అన్సార్ వర్గానికి చెందినవారు. ఖజ్రజ్ తెగతో ఈయనకు సంబంధం ఉంది. ప్రముఖ తాబయి. నమ్మదగ్గ ఉల్లేఖకులు. ఈయన సహాబీ అని తలపోసిన వారు పొరబడ్డారు.
(2) సాయిబ్ (రదియల్లాహు అన్హు). ఖల్లాద్ తండ్రిగారు. ప్రముఖ సహాబీలలో ఒకరు. మారుపేరు అబూ సలమా. బద్ర్ యుద్ధ మైదానంలో వీరమరణం పొందారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 594
హదీసు 595
وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -تَجَرَّدَ لِإِهْلَالِهِ وَاغْتَسَلَ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ.
హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ కట్టిన సందర్భంలో బట్టలు విడిచి స్నానం చేశారు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు – ‘హసన్’గా నిర్ధారించారు)
English
Zaid bin Thabit (RAA) narrated, ‘When the Messenger of Allah (ﷺ) intended to make Ihram for Hajj, he would wash, and take off his ordinary clothes (and put on his white Ihram)." Related by At-Tirmidhi who declared it to be Hadith-Hasan.
సారాంశం
ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును ‘హసన్’గా నిర్ధారించగా ఇమామ్ ఉఖైలీ (రహిమహుల్లాహ్) దీనిని ‘జయీఫ్’గా ఖరారు చేశారు. అయితే ఈ విషయమై అసంఖ్యాకంగా హదీసులు వచ్చాయి. కనుక ఇహ్రామ్ సందర్భంగా స్నానం చేయటం ‘మస్నూన్’ అనటంలో సందేహానికి తావులేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 595
హదీసు 596
وَعَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -سُئِلَ: مَا يَلْبَسُ اَلْمُحْرِمُ مِنْ اَلثِّيَابِ? قَالَ: " لَا يَلْبَسُ الْقَمِيصََ, وَلَا اَلْعَمَائِمَ, وَلَا السَّرَاوِيلَاتِ, وَلَا اَلْبَرَانِسَ, وَلَا اَلْخِفَافَ, إِلَّا أَحَدٌ لَا يَجِدُ نَعْلَيْنِِ فَلْيَلْبَسْ اَلْخُفَّيْنِ وَلْيَقْطَعْهُمَا أَسْفَلَ مِنَ اَلْكَعْبَيْنِ, وَلَا تَلْبَسُوا شَيْئًا مِنْ اَلثِّيَابِ مَسَّهُ اَلزَّعْفَرَانُ وَلَا اَلْوَرْسُ" } مُتَّفَقٌ عَلَيْهِ وَاللَّفْظُ لِمُسْلِمٍ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “ఇహ్రామ్ కట్టుకునేవారు ఏం ధరించాలి?” అని దైవప్రవక్త ﷺ ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన ﷺ ఇలా వివరించారు: “చొక్కా, తలపాగా, జుబ్బా, పాజమా, ట్రౌజర్, తోలు మేజోళ్ళు తొడగరాదు. ఒకవేళ చెప్పులు లేని పక్షంలో మేజోళ్ళు ధరించ వచ్చుగాని మోకాళ్ళ క్రిందినుంచి వాటిని కత్తిరించాలి. కాషాయరంగు బట్టలు గానీ, పసుపు రంగరించిన వస్త్రాలుగానీ ధరించరాదు.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లిం లోనివి)
English
Ibn 'Umar (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) was asked about what the person who is in a state of Ihram (Muhrim) should wear. He answered, "A person in the state of Ihram. is not allowed to wear a sewn shirt, a turban, trousers, a hooded robe, shoes or sewn slippers (Khuff), unless one is unable to find unsown slippers, then he may wear his Khuff or shoes provided one cuts them below the ankles, and you must not wear clothing that has been dyed with sweet smelling fragrance (such as saffron).” Agreed upon, and the wording is from Muslim.
సారాంశం
‘ఇహ్రామ్’ కొరకు చొక్కా, పాజమా, జుబ్బా, టోపీ వంటివి ఉపయోగించరాదనీ, ఎవరి వద్దయినా చెప్పులు లేకపోయినట్లయితే వారు తమ తోలు మేజోళ్ళను మోకాళ్ళ క్రింది భాగం వరకు కత్తిరించి – పాదం కనిపించేలా – తొడుక్కోవాలని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఈ వ్యవహారంపై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 596
హదీసు 597
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كُنْتُ أُطَيِّبُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -لِإِحْرَامِهِ قَبْلَ أَنْ يُحْرِمَ, وَلِحِلِّهِ قَبْلَ أَنْ يَطُوفَ بِالْبَيْتِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “నేను దైవప్రవక్త ﷺ కు ఇహ్రామ్ కట్టక పూర్వం, ఇహ్రామ్ సమయంలో, ఇహ్రామ్ ను విడిచిన సమయంలో సువాసన పూసే దానిని. ఆయన ﷺ దైవగృహ ప్రదక్షిణ చేయకమునుపు కూడా.” (బుఖారీ, ముస్లిం)
English
A’ishah (RAA) narrated, ‘I used to apply perfume to the Prophet (ﷺ) when he intended to enter the state of Ihram, before he put on his Ihram (garments). And again when he ended his state of Ihram, but before he had made Tawaf around the Ka’bah.' Agreed upon.
సారాంశం
ఇహ్రామ్ కట్టకపూర్వం సువాసన పూసుకోవటం మంచిది. ఇహ్రామ్ స్థితిలో ఆ సువాసన వస్తూ ఉంటుంది. కాని ఇహ్రామ్ దీక్షబూనిన తరువాత దాన్ని విరమించేవరకూ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించకూడదు.
‘కాబా గృహ ప్రదక్షిణ చేయకమునుపు’ అని హదీసులో వచ్చింది. ‘తవాఫె జియారత్’ నేపథ్యంలో ఇలా అనబడింది. ఈ తవాఫ్ జిల్హజ్ 10వ తేదీన ఖుర్బానీ ఇచ్చి, (హల్ఖ్) క్షవరం చేసుకున్న మీదట చేయబడుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 597
హదీసు 598
وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { لَا يَنْكِحُ اَلْمُحْرِمُ, وَلَا يُنْكِحُ, وَلَا يَخْطُبُ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు- “ఇహ్రామ్ స్థితిలో వివాహం చేసుకోరాదు, వివాహం చేయించరాదు, సంబంధం నిశ్చయించరాదు.” (ముస్లిం)
English
'Uthman bin ’Affan (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: “A Muhrim (one in the state of Ihram) must not contract marriage, nor help others contract marriage, nor get engaged to marry." Related by Muslim.
సారాంశం
అంటే ‘ఇహ్రామ్’ దీక్షబూనిన తరువాత ఆ స్థితిలో తన నికాహ్ చేసుకోవటంగానీ, ఇంకొకరి నికాహ్ జరిపించటంగానీ, ఎవరికయినా వివాహ సందేశం పంపి పెళ్ళి ఖాయం చేసుకోవటంగానీ నిషిద్ధం (హరామ్). దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ స్థితిలో హజ్రత్ మైమూనా (రదియల్లాహు అన్హా)ను నికాహ్ చేసుకున్నారన్న ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఒక భ్రమ మాత్రమే. హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ‘జాదుల్ మఆద్’లో దీనిపై క్షుణ్ణంగా చర్చించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 598
హదీసు 599
وَعَنْ أَبِي قَتَادَةَ اَلْأَنْصَارِيِّ - رضى الله عنه - { فِي قِصَّةِ صَيْدِهِ اَلْحِمَارَ اَلْوَحْشِيَّ, وَهُوَ غَيْرُ مُحْرِمٍ, قَالَ: فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -لِأَصْحَابِهِ, وَكَانُوا مُحْرِمِينَ: " هَلْ مِنْكُمْ أَحَدٌ أَمَرَهُ أَوْ أَشَارَ إِلَيْهِ بِشَيْءٍ ? " قَالُوا: لَا. قَالَ: " فَكُلُوا مَا بَقِيَ مِنْ لَحْمِهِ " } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ ఖతాదా అన్సారీ (రదియల్లాహు అన్హు), తానింకా ఇహ్రామ్ దీక్షబూనని సమయంలో అడవి గాడిద (జీబ్రా)ను వేటాడిన వృత్తాంతానికి సంబంధించి ఇలా అన్నారు : దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ స్థితిలోవున్న తన సహచరుల నుద్దేశ్యించి “మీలో ఎవరయినా ఇతనికి ఈ మేరకు ఆజ్ఞాపించారా? లేక ఇతని వైపునకు ఎవరయినా ఈ మేరకు సంజ్ఞ చేశారా?” అని అడిగారు. ‘లేదు’ అని వాళ్ళంతా సమాధానమిచ్చారు. “అయితే మిగిలివున్న దాని మాంసాన్ని తినండి” అని ఆయన ﷺ సెలవిచ్చారు. (బుఖారీ, ముస్లిం)
పూర్వరంగం
ఈ వృత్తాంతం యొక్క పూర్వరంగం ఇలా వుంది : హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺతో కలిసి బయలుదేరారు. కాని ఈయన తన కొంతమంది సహచరులతోపాటు వెనుక ఉండిపోయారు. హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) అప్పటికింకా ఇహ్రామ్ కట్టుకోలేదు. కాని ఆయన వెంటనున్నవారు మాత్రం ఇహ్రామ్ కట్టుకున్నారు. వాళ్ళంతా అడవి గాడిద (జీబ్రా)ను చూచీ చూడనట్లుగా వదిలేశారు. కాని అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) దృష్టి దానిపై పడగానే గుఱ్ఱమెక్కి దాన్ని వెంబడించసాగారు. తనకు తన కర్ర నివ్వమని ఆయన సహచరులను కోరారు. కాని వాళ్ళంతా అందుకు నిరాకరించారు. అయినాసరే అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) అడవిగాడిదను వెంబడించి, గాయ పరిచారు. తరువాత దాన్ని జిబహ్ చేసి అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) కొంత మాంసం తిన్నారు. సహచరులు కూడా తిన్నారు. కాని తరువాత వాళ్ళంతా సందిగ్ధంలో పడిపోయారు.
దైవప్రవక్త ﷺ ను సమీపించిన తరువాత జరిగినదంతా చెప్పారు. దాని సమాధానం హదీసు రూపంలో వచ్చింది.
ఇహ్రామ్ కట్టుకోని వ్యక్తి గనక అడవి జంతువును వేటాడితే, ఆ వేటలో ఇహ్రామ్ కట్టుకున్న వ్యక్తులు ఏవిధంగానూ సహకరించకుండా ఉంటే – అట్టి పరిస్థితిలో ఆ మాంసాన్ని వాళ్ళంతా తినవచ్చు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే హదీసులో ఉన్నాయి.
English
Abu Qatadah Al-Ansari (RAA) narrated concerning his hunting a zebra while he is not in a state of Ihram, that ‘Allah’s Messenger (ﷺ) said to Abu Qatada’s companions -who were in a state of Ihram, "Did any one of you ask Abu Qatadah to attack the herd, or point it out to him?" They said, ‘No.’ The Prophet then said, "Then, you may eat what is left of the quarry." Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 599
హదీసు 600
وَعَنْ اَلصَّعْبِ بْنِ جَثَّامَةَ اَللَّيْثِيِّ - رضى الله عنه - { أَنَّهُ أَهْدَى لِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -حِمَارًا وَحْشِيًّا, وَهُوَ بِالْأَبْوَاءِ, أَوْ بِوَدَّانَ، فَرَدَّهُ عَلَيْهِ, وَقَالَ: " إِنَّا لَمْ نَرُدَّهُ عَلَيْكَ إِلَّا أَنَّا حُرُمٌ " } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ సాబ్ బిన్ జస్సామ లైసీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ఆయన ఒక అడవి గాడిద (జీబ్రా)ను కానుకగా దైవప్రవక్త ﷺ వద్దకు పంపించారు. ఆ సమయంలో ఆయన ﷺ ‘అబ్వా’ లేక ‘వద్దాన్’ అనే స్థలంలో వున్నారు. ఆయన ﷺ దాన్ని తిరిగి పంపిస్తూ, “మేము ఇహ్రామ్ స్థితిలో ఉండటం వల్ల దీన్ని వాపసు చేస్తున్నాము” అని సెలవిచ్చారు. (బుఖారీ, ముస్లిం)
English
As-Sa'b bin Jath-thamah al-Laithi (RAA) narrated, ‘He presented to the Prophet (ﷺ) the meat of a zebra while he was in the area known as al-Abwa’ or Waddan. The Prophet (ﷺ) declined it, and said to him, “We declined your present only because we are in the state of Ihram." Agreed upon.
సారాంశం
ఈ హదీసు ఇంతకు ముందు వచ్చిన హదీసుకు భిన్నంగా కనిపిస్తుంది. ముహ్రమ్ కొరకు (ఇహ్రామ్ కట్టుకున్నవారి కొరకు) వేటాడిన జంతుమాంసం నిషిద్ధం. ఆ వేటలో ఇహ్రామ్ కట్టుకున్నవారు పాల్గొన్నా పాల్గొనకపోయినాసరే ఆ మాంసాన్ని వారు తినకూడదు. కాని మొదటి హదీసులో తినవచ్చని ఉంది. ఈ రెండు హదీసులను ఈ విధంగా క్రమబద్ధం చేయవచ్చు –
వేట ఇహ్రామ్ స్థితిలో వున్న వారి కోసమే చేయబడితే అట్టి జంతువుల మాంసం ముమ్మాటికీ నిషిద్ధమే. ముస్నద్ అహ్మద్, ఇబ్నె మాజాలోని ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి, ‘అయ్యా! మీ కోసమే నేను ఈ జంతువును వేటాడాను’ అని అంటారు. కాని ఆయన ﷺ ఆ జంతుమాంసాన్ని ముట్టుకోనయినా లేదు.
ఇక తిర్మిజీలోని వేరొక హదీసును గమనించండి – హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన ﷺ ఇలా అన్నారు: “ఇహ్రామ్ స్థితిలో నేలపై చేయబడిన వేట మీ కొరకు ధర్మసమ్మతమే. అయితే మీరు దాన్ని వేటాడటంగానీ, మీ కోసమని ప్రత్యేకంగా వేటాడి ఉండటంగానీ జరగరాదు.”
దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే వేటలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఇహ్రామ్ కట్టుకున్నవారి ప్రమేయం ఉంటే, లేదా వాళ్ళ విందుకోసం ఆ జంతువు వేటాడబడి ఉంటే దాని మాంసం తినటం అధర్మం. ఇట్టి పరిస్థితి గనక లేకుంటే ‘ముహ్రిమ్’ వ్యక్తి వేటాడిన జంతు మాంసాన్ని తినవచ్చు.
హదీసు ఉల్లేఖకులు
సాబ్ బిన్ జస్సామ (రదియల్లాహు అన్హు). లైస్ తెగకు చెందినవారు. అందువల్ల లైసీగా పిలువబడ్డారు. ‘వద్దాన్’ మరియు ‘అల్ అబ్వా’లలో ఉండేవారు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో ఈయన మరణించారు. ఖిలాఫతె ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) వరకూ జీవించి ఉన్నారని ఇంకొక కథనం ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 600
హదీసు 601
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ خَمْسٌ مِنَ اَلدَّوَابِّ كُلُّهُنَّ فَاسِقٌ, يُقْتَلْنَ فِي [ اَلْحِلِّ وَ ] اَلْحَرَمِ: اَلْعَقْرَبُ, وَالْحِدَأَةُ, وَالْغُرَابُ, وَالْفَأْرَةُُ، وَالْكَلْبُ اَلْعَقُورُ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు : “ఐదు రకాల జంతువులు హానికరమైనవి. వాటిని ఇహ్రామ్ స్థితిలో ఉన్నా లేకున్నా (కనబడిన చోటల్లా) చంపివేయాలి. అవేమంటే: (1) తేలు (2) గ్రద్ద (3) కాకి (4) ఎలుక (5) కరిచే (పిచ్చి) కుక్క. (బుఖారీ, ముస్లిం)
English
A’ishah (RAA) narrated ‘The Messenger of Allah (ﷺ) said: "Five kinds of animals are vicious and harmful, and they may be killed outside or inside the sacred area of Ihram (Sanctuary). These are: the scorpion, the kite, the crow, the mouse, and the rabid dog.” Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 601
హదీసు 602
وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -{ اِحْتَجَمَ وَهُوَ مُحْرِمٌ } مُتَّفَقٌ عَلَيْهِ.
నిశ్చయంగా దైవప్రవక్త ﷺ ఇహ్రామ్ స్థితిలో నుండగా శరీరానికి సూది గ్రుచ్చి రక్తం తీశారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు. (బుఖారీ, ముస్లిం)
English
Ibn 'Abbas (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) had himself cupped while he was in the state of Ihram Agreed upon.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 602
హదీసు 603
وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةَ - رضى الله عنه - قَالَ: { حُمِلْتُ إِلَى رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَالْقَمْلُ يَتَنَاثَرُ عَلَى وَجْهِي, فَقَالَ: " مَا كُنْتُ أَرَى اَلْوَجَعَ بَلَغَ بِكَ مَا أَرَى, تَجِدُ شَاةً ? قُلْتُ: لَا. قَالَ: " فَصُمْ ثَلَاثَةَ أَيَّامٍ, أَوْ أَطْعِمْ سِتَّةَ مَسَاكِينَ, لِكُلِّ مِسْكِينٍ نِصْفُ صَاعٍ " } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం : (ఇహ్రామ్ స్థితిలో వున్న) నన్ను దైవప్రవక్త ﷺ సమక్షంలోకి ఎత్తుకురావటం జరిగింది. పేలు నా ముఖంపై పడుతున్నాయి. ఆయన ﷺ నా పరిస్థితిని చూచి, “వ్యాధి నిన్ను నేను చూస్తున్న ఈ స్థితికి చేరుస్తుందని అనుకోలేదు. నీ దగ్గర మేక ఉందా?” అని అడిగారు. ‘లేదు’ అని నేను జవాబిచ్చాను. “మూడు రోజులు ఉపవాసం పాటించు లేదా ఆరుగురు పేదవాళ్ళకు తలో అర్ధ ‘సా’ చొప్పున అన్నంపెట్టు” అని ఆయన ﷺ బోధించారు. (బుఖారీ, ముస్లిం)
English
Ka'b bin 'Ujrah (RAA) narrated, ‘I was carried to the Prophet (ﷺ) and the lice were falling over my face. He said, “I did not know that your disease is hurting you as much as what I see. Can you sacrifice a sheep?” I said, ‘No.’ He then said. “Fast for three days or feed six poor people, half a Sa’ each.” Agreed upon.
సారాంశం
ఉపవాసం ఉండటం లేదా పేదవాళ్ళకు అన్నం పెట్టడం అన్నది ‘పరిహారం’ గా అన్నమాట! ఇహ్రామ్ స్థితిలో ఉండటం మూలంగా కాబ్ బిన్ ఉజ్రా తలలోని పేలను కూడా చంపలేదు. దైవప్రవక్త ﷺ ఈయనకు శిరోముండనం చేయించుకోమని కూడా సలహా ఇచ్చారు.
హదీసు ఉల్లేఖకులు
కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) గొప్ప సహాబీలలో ఒకరు. అల్ బలీ తెగకు చెందినవారు. అన్సార్ వర్గానికి మద్దతుదారులు. కొంతకాలం ‘కూఫా’లో గడిపారు. ఎట్టకేలకు మదీనాలోనే హిజ్రీ 51లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 603
హదీసు 604
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: { لَمَّا فَتَحَ اَللَّهُ عَلَى رَسُولِهِ - صلى الله عليه وسلم -مَكَّةَ, قَامَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فِي اَلنَّاسِ، فَحَمِدَ اَللَّهَ وَأَثْنَى عَلَيْهِ, ثُمَّ قَالَ: " إِنَّ اَللَّهَ حَبَسَ عَنْ مَكَّةَ اَلْفِيلَ, وَسَلَّطَ عَلَيْهَا رَسُولَهُ وَالْمُؤْمِنِينَ, وَإِنَّهَا لَمْ تَحِلَّ لِأَحَدٍ كَانَ قَبْلِي, وَإِنَّمَا أُحِلَّتْ لِي سَاعَةٌ مِنْ نَهَارٍ, وَإِنَّهَا لَنْ تَحِلَّ لِأَحَدٍ بَعْدِي, فَلَا يُنَفَّرُ صَيْدُهَا, وَلَا يُخْتَلَى شَوْكُهَا, وَلَا تَحِلُّ سَاقِطَتُهَا إِلَّا لِمُنْشِدٍ, وَمَنْ قُتِلَ لَهُ قَتِيلٌ فَهُوَ بِخَيْرِ اَلنَّظَرَيْنِ " فَقَالَ اَلْعَبَّاسُ: إِلَّا اَلْإِذْخِرَ, يَا رَسُولَ اَللَّهِ, فَإِنَّا نَجْعَلُهُ فِي قُبُورِنَا وَبُيُوتِنَا, فَقَالَ: " إِلَّا اَلْإِذْخِرَ " } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : అల్లాహ్ తన సందేశహరుని ﷺ కి మక్కా విజయం ప్రసాదించగా దైవప్రవక్త ﷺ ప్రజలమధ్య నిలబడి దైవస్తోత్రం చేశారు. అనంతరం ఆయన ﷺ ఇలా అన్నారు : “నిశ్చయంగా అల్లాహ్ ఏనుగుల (బారి) నుండి మక్కాను కాపాడాడు. అయితే తన సందేశహరుని ﷺకి, విశ్వాసులకు దీనిపై ఆధిక్యతను వొసగాడు. నిస్సందేహంగా నాకు పూర్వం మక్కా ఎవరికొరకు కూడా హలాల్ (ధర్మసమ్మతం) గావించబడలేదు. కాని నా కోసం ఒక దినములో ఒక ఘడియ ‘హలాల్’ గావించబడింది. నిశ్చయంగా నా తదనంతరం ఇది ఎవరి కొరకూ హలాల్ అయి ఉండదు. అంటే ఇక్కడ దేనినయినా వేటాడటంగానీ, ఇక్కడి ముళ్ళ వృక్షాలను నరకటంగానీ, క్రిందపడిన వస్తువును – దాన్ని పోగొట్టుకున్నవాడు గుర్తుపడితే తప్ప – ఎత్తుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. తమ మనిషి ఎవరైనా చంపబడితే వారు తమ ముందున్న రెండు మార్గాలలో ఏదో ఒకదానిని ఎన్నుకునే స్వేచ్ఛాధికారం కలిగి ఉంటారు.” హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా విన్నవించుకున్నారు : ‘దైవప్రవక్తా ﷺ! ఇజ్ఖిర్ (గడ్డి) తప్ప! ఎందుకంటే దాన్ని మేము సమాధులలో, ఇండ్లలో ఉపయోగిస్తాము’ అని అన్నారు. అప్పుడాయన ﷺ, “సరే. ఇజ్ఖిర్ తప్ప (అంటే దాన్ని కోసుకునేందుకు అనుమతి ఇవ్వబడుతోంది)!” అన్నారు. (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated, ‘When Allah, the Most High granted His Messenger (ﷺ) victory on the conquest of Makkah, the Prophet (ﷺ) addressed the people, so he glorified Allah and praised Him, and said, "Allah withheld the elephant from Makkah and empowered His Messenger and the believers over it. It has not been made lawful (i.e. fighting in it) for anyone before me, but it has been lawful for me only for a few hours on that day (of the conquest), and it will not be made lawful to anyone after me (to enter it lighting). Its wild game must not be frightened, its thorns are not to be cut. No one is allowed to pick up lost articles (Luqatah) unless he announces it (what he has found) publicly (in order to return it to the owner). If anyone has someone murdered inside its boundaries, then he has the choice of the best of two options (i.e. either to accept compensation, i.e. blood money or to retaliate). Al-'Abbas then said, ‘Except for the Idhkhar (a kind of nice smelling grass, which is used by goldsmiths and burnt in households.)
సారాంశం
తమ ముందున్న రెండు మార్గాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవటమంటే అర్థం వారు నేరస్థుణ్ణి శిక్షించడానికయినా అంగీకరించాలి, లేదా రక్తపరిహారమున్నా వసూలు చేయాలి. రెండూ నెరవేరాలంటే అది కుదిరేపని కాదు. పైగా ఇది కూడా మరో అన్యాయం అవుతుంది.
‘ఇజ్ఖిర్’ అనేది ఒక రకమయిన సువాసనతో కూడుకున్న గడ్డి. దాన్ని అరబ్బులు ఇండ్ల పైకప్పులపై వేసుకునేవారు. సమాధులను పూడ్చిపెట్టడానికి కూడా ఈ గడ్డిని ఉపయోగించేవారు.
పవిత్ర మక్కా ఇతరులకు హరాం (నిషిద్ధం) గావించబడటంలోని మర్మం ఏమిటంటే ఈ నగరంలో హత్య చేయటం, రక్తపాతం సృష్టించటం హరామ్. ఈ నగరంలో ప్రవేశించిన వ్యక్తికి ఒక విధంగా అభయం లభించినట్లే. అక్కడి జంతువులను వేటాడటం, వృక్షాలను నరకటం సయితం నిషిద్ధం. ఆఖరికి ఏదైనా వస్తువు నేలపై పడి వున్నా దాని యజమాని వచ్చే వరకూ ముట్టుకోరాదు. ఇన్ని విధాలుగా మక్కా నగరం ప్రజల కొరకు హరామ్ గావించబడింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 604
హదీసు 605
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدِ بْنِ عَاصِمٍ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ: { إِنَّ إِبْرَاهِيمَ حَرَّمَ مَكَّةَ وَدَعَا لِأَهْلِهَا, وَإِنِّي حَرَّمْتُ اَلْمَدِينَةَ كَمَا حَرَّمَ إِبْرَاهِيمُ مَكَّةَ، وَإِنِّي دَعَوْتُ فِي صَاعِهَا وَمُدِّهَا بِمِثْلِ مَا دَعَا بِهِ إِبْرَاهِيمُُ لِأَهْلِ مَكَّةَ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) మక్కాకు పవిత్రతను కల్పించారు. ఇక్కడ నివసించే వారికై ప్రార్థించారు. ఏ విధంగానయితే ఇబ్రాహీం (అలైహిస్సలాం) మక్కాను పవిత్రంగా ఖరారు చేశారో నిస్సందేహంగా (అదేవిధంగా) నేనూ మదీనాకు పవిత్రతను ఒసగాను. మక్కాలో నివసించే వారికొరకు ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఏ విధంగా ప్రార్థించారో అదే విధంగా నేనునూ మదీనా (కొలతలు, తూనికలైన) ‘సా’ మరియు ‘ముద్’ల గురించి ప్రార్థించాను.” (బుఖారీ, ముస్లిం)
English
'Abdullah bin Zaid bin ’Asim (RAA) narrated that the Messenger of Allah said, "Ibrahim declared Makkah as a Haram (Sanctuary) and made supplication for its people, and I declare Madinah to be a Haram just as Ibrahim declared Makkah as a Haram, and I made supplication for its Mudd and Sa’ (refer to hadith no. 650), just as Ibrahim made supplication for the people of Makkah." Agreed upon.
సారాంశం
మక్కా ముకర్రమా మాదిరిగా మదీనా తయ్యిబా కూడా పవిత్రమైనదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అంటే మదీనా నగరంలో కూడా జంతువులవేట, నరమేధం నిషేధించబడ్డాయి. అక్కడి చెట్లు నరకటం, దురాచారాలను సృష్టించటం కూడా నిషిద్ధమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 605
హదీసు 606
وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمَدِينَةُ حَرَامٌٌ مَا بَيْنَ عَيْرٍ إِلَى ثَوْرٍ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “ఐర్ నుండి సౌర్ వరకు గల మదీనా ప్రదేశమంతా పవిత్రమైనది (నిషిద్ధమైనది).” (ముస్లిం)
English
’Ali bin Abi Talib (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Madinah is a Haram (Sanctuary) and its Sacred Precincts extend from ’Air to Thawr (the names of two mountains).” Related by Muslim.
సారాంశం
‘ఐర్’ ఒక పర్వతం పేరు. ఇది మదీనా నగరానికి దక్షిణాన ఉంది. ‘సౌర్’ అనేది ఒక చిన్న పర్వత గుట్ట. ఇది మదీనాకు ఉత్తరాన ఉహుద్ పర్వతం వెనుక ఉంది. సూర్ పర్వతం ఒకటి మక్కాలో కూడా ఉంది. దివ్య ఖుర్ఆన్లో ప్రస్తావనకు వచ్చిన ఆ ‘సూర్’ వేరు. ఈ ‘సౌర్’ వేరు. మక్కాలో ఉన్న సూర్ గుహలో దైవప్రవక్త ﷺ హిజ్రత్ సందర్భంగా తలదాచుకున్న సంగతి విదితమే.
ఈ హదీసు ప్రకారం ఐర్ – సౌర్ల మధ్య గల మదీనా ప్రాంతం అంతా పవిత్రమైనదనీ, అక్కడ నరమేధం, వేట, చెట్లు నరకటం వంటివన్నీ నిషేధించబడ్డాయనీ తెలుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.4 ఇహ్రామ్ తత్సంబంధిత విషయాలు|హదీసు 606
You must be logged in to post a comment.