హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 6. హజ్జ్ పుస్తకం, 3వ అధ్యాయం: ఇహ్రామ్ రకాలు – వాటి గుణాలు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 592) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
6.3 ఇహ్రామ్ రకాలు – వాటి గుణాలు
باب وجوه الإحرام وصفته
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 592
عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { خَرَجْنَا مَعَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -عَامَ حَجَّةِ اَلْوَدَاعِ, فَمِنَّا مَنْ أَهَلَّ بِعُمْرَةٍ, وَمِنَّا مَنْ أَهَلَّ بِحَجٍّ وَعُمْرَةٍ, وَمِنَّا مَنْ أَهَلَّ بِحَجٍّ, وَأَهَلَّ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -بِالْحَجِّ, فَأَمَّا مَنْ أَهَلَّ بِعُمْرَةٍ فَحَلَّ عِنْدَ قُدُومِهِ, وَأَمَّا مَنْ أَهَلَّ بِحَجٍّ, أَوْ جَمَعَ اَلْحَجَّ وَالْعُمْرَةَ فَلَمْ يَحِلُّوا حَتَّى كَانَ يَوْمَ اَلنَّحْرِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : మేము దైవప్రవక్త ﷺ తో కలసి హజ్జతుల్ విదా (అంతిమ హజ్‌యాత్ర)కై బయలుదేరాము. మాలో కొంతమంది ఉమ్రా కొరకు ‘తల్బియా’ చెప్పారు. కొంతమంది హజ్ మరియు ఉమ్రాల కోసం ‘తల్బియా’ పలికారు. మరికొంతమంది హజ్ కొరకు ‘లబ్బైక్’ చెప్పారు. దైవప్రవక్త ﷺ కేవలం హజ్ కొరకు ‘తల్బియా’ పలికారు. ఉమ్రా కోసం ‘తల్బియా’ పలికిన వారు ‘ఇహ్రామ్’ నిబంధనల నుంచి విముక్తులైపోయారు. హజ్ కోసం లబ్బైక్ నినాదాలు చేసినవారు, హజ్ మరియు ఉమ్రాల కోసం లబ్బైక్ పలికినవారు ఖుర్బానీ దినం వచ్చే వరకూ ‘ఇహ్రామ్’ కు కట్టుబడే ఉన్నారు. (బుఖారీ, ముస్లిం)
English
A’isha (RAA) narrated, ‘We left Madinah with the Messenger of Allah (ﷺ) to perform the Farewell Hajj. Some of us declared Ihram to perform 'Umrah, while others declared their intentions to perform both Hajj and 'Umrah. Yet others declared their lhram to perform Hajj only. The Prophet (ﷺ) declared Ihram for Hajj only. Those who intended 'Umrah terminated their Ihram as soon as they finished the rituals of 'Umrah. Those who intended to perform Hajj only or to combine Hajj with 'Umrah, did not terminate their Ihram until the Day of Slaughtering (i.e. the day of sacrifice or ’Idul Ad-ha).’ Agreed upon.
సారాంశం
హజ్ మూడు రకాలని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది: (1) హజ్జె ఖిరాన్ (2) హజ్జె తమత్తు (3) హజ్జె ఇఫ్రాద్. ఈ మూడింటిలో శ్రేష్ఠమైన హజ్ ఏది? సాధారణంగా హజ్జె ఖిరాన్ను హనఫీలు, అహ్లె హదీసువారు శ్రేష్ఠమైన హజ్‌గా భావిస్తారు. ఎందుకంటే పవిత్రుడైన అల్లాహ్ తన ప్రియప్రవక్త ﷺకై ఈ హజ్నే ఇష్టపడ్డాడు. ఈ హజ్ కాస్త శ్రమతో కూడుకున్నది కూడా అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ‘జాదుల్ మఆద్’లో దీనిపై ఉత్తమమయిన చర్చ జరిపారు. అయితే ఇమామ్ అహ్మద్, ఇమామ్ మాలిక్‌లు హజ్జె తమత్తును అత్యుత్తమమయిన హజ్‌గా భావిస్తున్నారు. ఈ హజ్ సౌలభ్యంతో కూడుకున్నది. ఒకానొక సందర్భంలో దైవప్రవక్త ﷺ ‘ఈ హజ్కై సంకల్పించుకుంటే బావుండేదే’! అని చెప్పారు కూడా. అల్లామా షౌకానీ దృక్పథం కూడా ఇదే. మరికొంతమంది హజ్జె ఇఫ్రాద్ను శ్రేష్ఠ మయినదిగా పేర్కొన్నారు. అయితే ప్రబల నిదర్శనాల దృష్ట్యా చూస్తే ఈ మూడింటిలో మొదటిదే అత్యుత్తమ మయినదిగా చెలామణీ అవుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|6. హజ్జ్ పుస్తకం|6.3 ఇహ్రామ్ రకాలు – వాటి గుణాలు|హదీసు 592
You must be logged in to post a comment.