హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 7వ అధ్యాయం: నమాజ్ చేసే విధానం. ఈ అధ్యాయంలో 52 హదీసులు (హదీసు 210 – 261) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
2.7 నమాజ్ చేసే విధానం
باب صفة الصلاة
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 210
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ : { إِذَا قُمْتُ إِلَى اَلصَّلَاةِ فَأَسْبِغِ اَلْوُضُوءَ , ثُمَّ اِسْتَقْبِلِ اَلْقِبْلَةَ , فَكَبِّرْ , ثُمَّ اِقْرَأْ مَا تَيَسَّرَ مَعَكَ مِنْ اَلْقُرْآنِ , ثُمَّ اِرْكَعْ حَتَّى تَطْمَئِنَّ رَاكِعًا , ثُمَّ اِرْفَعْ حَتَّى تَعْتَدِلَ قَائِمًا , ثُمَّ اُسْجُدْ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا , ثُمَّ اِرْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا , ثُمَّ اُسْجُدْ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا , ثُمَّ اِفْعَلْ ذَلِكَ فِي صَلَاتِكَ كُلِّهَا } أَخْرَجَهُ اَلسَّبْعَةُ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ وَلِابْنِ مَاجَهْ بِإِسْنَادِ مُسْلِمٍ : { حَتَّى تَطْمَئِنَّ قَائِمًا } وَمِثْلُهُ فِي حَدِيثِ رِفَاعَةَ بْنِ رَافِعِ بْنِ مَالِكٍ عِنْدَ أَحْمَدَ وَابْنِ حِبَّانَ وَفِي لَفْظٍ لِأَحْمَدَ : { فَأَقِمْ صُلْبَكَ حَتَّى تَرْجِعَ اَلْعِظَامُ } وَلِلنَّسَائِيِّ , وَأَبِي دَاوُدَ مِنْ حَدِيثِ رِفَاعَةَ بْنِ رَافِعٍ : { إِنَّهَا لَنْ تَتِمُّ صَلَاةُ أَحَدِكُمْ حَتَّى يُسْبِغَ اَلْوُضُوءَ كَمَا أَمَرَهُ اَللَّهُ , ثُمَّ يُكَبِّرَ اَللَّهَ , وَيَحْمَدَهُ , وَيُثْنِيَ عَلَيْهِ }. وَفِيهَا { فَإِنْ كَانَ مَعَكَ قُرْآنٌ فَاقْرَأْ وَإِلَّا فَاحْمَدِ اَللَّهَ , وَكَبِّرْهُ , وهلِّلْهُ } وَلِأَبِي دَاوُدَ : { ثُمَّ اِقْرَأْ بِأُمِّ اَلْقُرْآنِ وَبِمَا شَاءَ اَللَّهُ } وَلِابْنِ حِبَّانَ : { ثُمَّ بِمَا شِئْتَ }
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ఉపదేశించారు – “మీరు నమాజ్ చేయ సంకల్పించినపుడు ముందు సరిగ్గా వుజూ చేసుకుని ఖిబ్లా వైపునకు తిరిగి తక్బీర్ (అల్లాహు అక్బర్) పలకండి. తరువాత దివ్య ఖుర్ఆన్లో ఎంత భాగం మీకు జ్ఞాపకమున్నా అందులో నుంచి సులువుగా చదవగలిగినంత చదవండి. తరువాత ‘రుకూ’ చేయండి. రుకూ సాధ్యమైనంత వరకు తాపీగా చేయండి. తరువాత నిటారుగా నిలబడండి. ప్రశాంతంగా నిలబడండి (హడావిడి వద్దు). ఆ తరువాత ‘సజ్దా’ చేయండి. సజ్దా చాలా నింపాదిగా చేయండి. సజ్దాలోనుంచి తల పైకెత్తి హాయిగా కూర్చోండి. ఆ తరువాత రెండవ సజ్దా చేయండి. ఈ సజ్దా కూడా నింపాదిగా చేయండి. అంతే. ఆ తరువాత మిగిలిన నమాజునంతా ఈ విధంగానే (ప్రశాంతంగా – ఓపికతో – చేయండి). (దీనిని బుఖారీ, ముస్లిం, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ, ఇమామ్ అహ్మద్ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం ఇమామ్ బుఖారీ గారివి)
ఇబ్నె మాజ ముస్లిం ఆధారంగా – ‘రుకూ’ నుండి నిలబడే సమయంపై ఈ పదాలు నకలు చేశారు: “పూర్తిగా స్థిరంగా నిలబడండి” అహ్మద్ మరియు ఇబ్నె హిబ్బాన్లో రిఫా బిన్ రాఫె బిన్ మాలిక్ ఉల్లేఖనంలో కూడా ఇలాగే వుంది. ముస్నద్ అహ్మద్‌లోని ఉల్లేఖనంలో ఇలా వుంది: “మీ నడుమును నిటారుగా – ఎముకలు తమ స్థానాలలోకి వచ్చేలా – నిలబెట్టండి” అని వుంది.
నసాయి మరియు అబూదావూద్లో రిఫా బిన్ రాఫె ద్వారా ఇలా ఉల్లేఖించబడింది: “అల్లాహ్ ఆదేశించిన విధంగా వుజూ సంపూర్ణంగా చేయనంతవరకూ నమాజ్ సంపూర్ణం కాజాలదు. తరువాత తక్బీర్ పలకాలి, దైవస్తోత్రం చేయాలి, ఆయన్ని కొనియాడాలి.” ఈ ఉల్లేఖనంలో ఇంకా ఇలా వుంది: “నీకు ఖుర్ఆన్లోని ఎంత భాగం జ్ఞాపకముంటే అంత పఠించు. లేకుంటే దైవస్తోత్రం చెయ్యి మరియు అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకు.” అబూదావూద్లో “ఫాతిహా సూరా పఠించు. ఇంకా అల్లాహ్ తలచినంతగా (పఠించు)” అని వుంది. ఇబ్నె హిబ్బాన్లో “మరి మీరు కోరినంతగా చదవండి” అని వుంది.
English
Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "When you get up to pray, perform ablution perfectly, then face the Qiblah and say: 'Allahu Akbar' (Allah is the Most Great). Then recite a convenient portion of the Qur'an; then bow and remain calmly in that position for a moment, then rise up and stand erect; then prostrate and remain calmly in that position for a moment, then rise up and sit calmly, then prostrate and remain calmly in that position for a moment; then do that throughout your prayer." [Reported by as-Sab'a and the wording is that of al-Bukhari].
The narration of Ibn Majah through a chain of Muslim has: "Then rise up and stand erect calmly."
And in the narration of Ibn Hibban and Ahmad the Hadith of Rifa'a bin Rafi' bin Malik is similar to the above.
And Ahmad has: "Keep your back straight till the bones return (to their positions)."
And in the narration of an-Nasa'i and Abu Dawud from the Hadith of Rifa'a bin Rafi': "The Salat (prayer) of one of you will not be complete until he performs Wudu' (ablution) properly as Allah commanded him, then he says Allahu Akbar and Alhamdu lillah and praises Him."
It is also mentionmed in the same Hadith, "If you know any portion of the Qur'an, read it or else say: Alhamdu lillah, Allahu Akbar and La ilaha ill-Allah."
And Abu Dawud has "Then read the Ummul-Qur'an (i.e. Surah al-Fatiha) and what ever Allah wishes".
Ibn Hibban also has: "and then (read) whatever you wish."
సారాంశం
ఎంతో ప్రశాంతంగా, ఆగి ఆగి ఒక్కో ‘రుకున్’ను చక్కగా, పరిపూర్ణంగా నెరవేరుస్తూ మరీ నమాజ్ చేయాలని హదీసులో తాకీదు చేయబడింది. నమాజ్‌లో ఏ అంశం తరువాత ఏ అంశం వస్తుందో – క్రమపద్ధతిలో తెలుపబడింది. నమాజ్ చేసేవారు – వారు ఇమాములయినా, ఇమాములను అనుసరించే ముఖ్తదీలయినా, లేక ఒంటరిగా నమాజ్ చేసే వారయినా – తాము నమాజ్‌లో ఏం పలుకుతున్నారో, ఏం చేయబోతున్నారో బాగా ఆలోచించి, అర్థం చేసుకుని చేస్తే అందలి మధురిమను తనివితీరా ఆస్వాదించవచ్చు. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా చేస్తే మనిషి జీవితంపై దాని ప్రభావం కనిపించదు. హడావిడిగా చేసే నమాజ్ అసలు నమాజే కాదు. ఇటువంటి వారిని దైవప్రవక్త ﷺ నమాజ్ దొంగలుగా, కపట నమాజీలుగా పేర్కొన్నారు.
హదీసు ఉల్లేఖకులు
రిఫా బిన్ రాఫె బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు). ఈయన మారుపేరు అబూ ముఆజ్. జుర్ఖీ అన్సారీ మదనీగా పేరు మోశారు. సుప్రసిద్ధ సహాబీలలో ఒకరు. ఈయన తన తండ్రితో కలసి ‘ఉఖబా ప్రమాణా’నికి హాజరయ్యారు. ఈయన తండ్రిగారు అన్సార్లలో అందరికన్నా ముందు ఇస్లాం స్వీకరించారు. రిఫా బిన్ రాఫె బద్ర్ యుద్ధం మినహా మిగిలిన యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. జమల్ మరియు సిఫ్ఫీన్ యుద్ధాలలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి మద్దతునిచ్చారు. అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో – హిజ్రీ 41లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 210
హదీసు 211
وَعَنْ أَبِي حُمَيْدٍ اَلسَّاعِدِيِّ - رضى الله عنه - قَالَ : { رَأَيْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا كَبَّرَ جَعَلَ يَدَيْهِ حَذْوَ مَنْكِبَيْهِ , وَإِذَا رَكَعَ أَمْكَنَ يَدَيْهِ مِنْ رُكْبَتَيْهِ , ثُمَّ هَصَرَ ظَهْرِهِ , فَإِذَا رَفَعَ رَأْسَهُ اِسْتَوَى حَتَّى يَعُودَ كُلُّ فَقَارٍ مَكَانَهُ , فَإِذَا سَجَدَ وَضَعَ يَدَيْهِ غَيْرَ مُفْتَرِشٍ وَلَا قَابِضِهِمَا , وَاسْتَقْبَلَ بِأَطْرَافِ أَصَابِعِ رِجْلَيْهِ اَلْقِبْلَةَ , وَإِذَا جَلَسَ فِي اَلرَّكْعَتَيْنِ جَلَسَ عَلَى رِجْلِهِ اَلْيُسْرَى وَنَصَبَ اَلْيُمْنَى , وَإِذَا جَلَسَ فِي اَلرَّكْعَةِ اَلْأَخِيرَةِ قَدَّمَ رِجْلَهُ اَلْيُسْرَى وَنَصَبَ اَلْأُخْرَى , وَقَعَدَ عَلَى مَقْعَدَتِهِ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ
అబూ హుమైద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నేను దైవప్రవక్త ﷺ ను తక్బీర్ (తక్బీరె ఊలా) చేస్తుండగా చూశాను. అప్పుడాయన రెండు చేతులనూ భుజాలకు సమానాంతరంగా లేపేవారు. రుకూ చేసినపుడు తన రెండు చేతులతో తన మోకాళ్ళను గట్టిగా పట్టుకునేవారు. ఆ సమయంలో తన వీపును వంచేవారు. రుకూనుండి తలను ఎత్తినపుడు నిటారుగా – కీళ్ళన్నీ యధాస్థానంలోకి వచ్చేలా-నిలబడేవారు. సజ్దా చేసినపుడు తన రెండు చేతులనూ నేలపై ఉంచేవారు. ఆ సమయంలో (చేతుల్ని) మరీ ముడుచుకోవటంగానీ, మరీ చాపటంగానీ చేసేవారు కాదు. సజ్దా స్థితిలో రెండు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా వైపునకు ఉండేవి. ఆయన రెండు రకతులు పూర్తి చేసి ఖాయిదాలో కూర్చున్నపుడు ఎడమ పాదాన్ని నేలపై పరచుకునేవారు. కుడిపాదాన్ని నిలిపి ఉంచేవారు. చివరి ఖాయిదాలో ఎడమ పాదాన్ని కాస్త ముందుకు జరిపి కుడి పాదాన్ని నిలిపి ఉంచేవారు. పిరుదుపై (బరువు మోపి) కూర్చునేవారు.” (బుఖారీ)
English
Narrated Abu Humaid As-Sa'idi (RA): "I saw Allah's Messenger (ﷺ) when he uttered the Takbir, he placed his hands parallel to his shoulders; and when he bowed down, he rested his hands on his knees, then bent his back. When he raised his head up, he stood erect until the bones of his spine became straight. When he prostrated, he placed his arms such that they were neither spread out nor drawn in, and the tips of his toes were facing the Qiblah; when he sat up, at the end of two Rak'a, he sat on his left foot and put erect the right one; and when he sat up after the last Rak'a he put forward the left foot, put erect the other one and sat on his buttock." [Reported by al-Bukhari].
సారాంశం
ఈ హదీసులో దైవప్రవక్త ﷺ గారి నమాజ్ చేసే విధానం విశదీకరించబడింది. ఆయన ﷺ అనుయాయులయిన ముస్లింలు కూడా సాధ్యమైనంతవరకూ ఈ విధానాన్నే అనుసరించాలి. ‘నేను నమాజ్ చేస్తుండగా మీరు చూసిన విధంగానే మీరు కూడా నమాజ్ చేయండి’ అని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు. దైవప్రవక్త ﷺ వారి ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని నమాజీలు ఎంతో నింపాదిగా, ప్రశాంతంగా, ఒక్కో అంశాన్ని సజావుగా నెరవేరుస్తూ, ఖుర్ఆన్ వాక్యాలను బాగా ఆగి ఆగి పఠిస్తూ నమాజ్ చేయాలి. త్వరత్వరగా రుకూ, సజ్దాలు చేసి నమాజ్‌ను చెడగొట్టకూడదు. కొద్ది సమయంలో ఆదరాబాదరాగా నమాజ్ చేసేవానిని కోడి ముక్కుతో పోల్చటం జరిగింది. ఇంకా అటువంటి నమాజ్ ‘కపట నమాజ్’గా ఖరారు చేయబడింది. అటువంటి నమాజులతో చేకూరే ప్రయోజనం ఏముంటుంది?
హదీసు ఉల్లేఖకులు
అబూ హుమైద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) గారి నామాంతరం అమ్ర్. ముంజిర్ బిన్ సాద్ బిన్ ముంజిర్ అని కొందరంటారు. మాలిక్ అన్సారీ ఖజ్రజీ మదనీ అని మరికొందరు వాదిస్తారు. ఉహద్ మరియు ఆ తరువాత జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రీ 61లో అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలం చరమదశలోనో, లేక యజీద్ పరిపాలనా కాలం తొలిదశలోనో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 211
హదీసు 212
وَعَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - رضى الله عنه - عَنْ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَنَّهُ كَانَ إِذَا قَامَ إِلَى اَلصَّلَاةِ قَالَ : "وَجَّهْتُ وَجْهِي لِلَّذِي فَطَّرَ اَلسَّمَوَاتِ وَالْأَرْضَ "… إِلَى قَوْلِهِ : "مِنْ اَلْمُسْلِمِينَ , اَللَّهُمَّ أَنْتَ اَلْمَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ , أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ… } إِلَى آخِرِهِ. رَوَاهُ مُسْلِمٌ وَفِي رِوَايَةٍ لَهُ : أَنَّ ذَلِكَ فِي صَلَاةِ اَللَّيْلِ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ కొరకు నిలబడినపుడు మొదట ఈ దుఆ పఠించేవారు – “నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకుంటున్నాను. నేను బహుదైవారాధకులలోని వాణ్ణి కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వలోక ప్రభువైన అల్లాహ్‌కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాణ్ణి. ఓ అల్లాహ్! నీవే యజమానివి (చక్రవర్తివి). నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుణ్ణి……” (ముస్లిం)
English
Narrated 'Ali bin Abi Talib (RA): Whenever Allah's Messenger (ﷺ) stood for Salat (prayer), he used to say: "I have turned my face (as a monotheist) towards Him who created the heavens and the earth and I am not from the polytheists. My prayer and my devotion, my life and my death belong to Allah, the Lord of the universe, Who has no partner. That is what I have been commanded, and I am a Muslim. O Allah, You are the King. There is nothing which deserves to be worshipped but You. You are my Rabb (Lord) and I am Your slave. I have wronged myself, but I acknowledge my sin, so forgive me all my sins, You alone can forgive sins; and guide me to the best qualities, You alone can guide to the best of them: and turn me from evil ones, You alone can turn from evil qualities. I come to serve and please You. All good is in Your Hands and evil does not pertain to You. I seek refuge in You and turn to You, You are the Blessed and the Exalted. I ask Your forgiveness and turn to You in repentance." [Reported by Muslim].
And in another narration of Muslim: "he used to say that in the night prayer…"
సారాంశం
పై హదీసులోని దుఆ ఇంకావుంది. మిగిలిన భాగం యొక్క అనువాదం ఇది: “……. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక (ఓ స్వామీ) నా పాపాలన్నింటినీ మన్నించు. (వాస్తవమేమిటంటే) నీవు తప్ప పాపాలను మన్నించగల వాడెవడూ లేడు. నన్ను ఉత్తమ నైతికత వైపునకు, సత్ప్రవర్తన వైపునకు నడిపించు. నీవు తప్ప మంచినడవడిక వైపునకు ఎవరూ మార్గదర్శకత్వం వహించలేరు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. వాస్తవమేమిటంటే నీవు తప్ప మరెవరూ దుర్గుణాలను దూరం చెయ్యలేరు. మాటిమాటికీ నీ సమక్షంలో హాజరవుతున్నాను. నీ విధేయుణ్ణి. మేళ్ళన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరపునుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వెంటవున్నాను. నీ వైపున ఉన్నాను. నీవు మాత్రమే శుభప్రదమయిన వాడవు మరియు ఘనత, ఆధిపత్యం కలవాడవు. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను. పశ్చాత్తాపభావంతో నీ వైపునకే మరలుతున్నాను.” దీనిని ముస్లిం ఉల్లేఖించారు. ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఈ దుఆ రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో చేసేవారని ఉంది. ఫర్జ్ నమాజ్‌లో దైవప్రవక్త ﷺ ఈ దుఆ చేసేవారన్న దానికి అనేక ఆధారాలున్నాయి. (వివరాల్లోకి పోయే అవకాశం లేకపోవటం వల్ల ఈ చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 212
హదీసు 213
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا كَبَّرَ لِلصَّلَاةِ سَكَتَ هُنَيَّةً , قَبْلِ أَنْ يَقْرَأَ , فَسَأَلْتُهُ , فَقَالَ : "أَقُولُ : اَللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ اَلْمَشْرِقِ وَالْمَغْرِبِ , اَللَّهُمَّ نقِّنِي مِنْ خَطَايَايَ كَمَا يُنَقَّى اَلثَّوْبُ اَلْأَبْيَضُ مِنْ اَلدَّنَسِ , اَللَّهُمَّ اِغْسِلْنِي مِنْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ } مُتَّفَقٌ عَلَيْهِ
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: తక్బీరె తహ్రీమా తరువాత దైవప్రవక్త ﷺ కొద్దిసేపు ఆగి ఖుర్ఆన్ పారాయణం మొదలెట్టేవారు. ‘దైవప్రవక్తా ﷺ! ఈ విరామ సమయంలో మీరేం చదువుతారు?’ అని నేను ప్రశ్నించాను. “ఈ దుఆ పఠిస్తాను” అని ఆయన ﷺ సెలవిచ్చారు: (దుఆ అనువాదం ఇది) “ఓ అల్లాహ్! తూర్పు – పడమరలకు మధ్య ఎంత అంతరం ఉందో నాకు – నా పాపాలకు మధ్య అంత దూరాన్ని ఉంచు. ఓ దేవా! ఏ విధంగా తెల్లని వస్త్రం మాలిన్యాల నుండి పరిశుభ్రం చేయబడుతుందో ఆ విధంగా నన్ను పాపాలు, అపరాధాల నుండి పరిశుద్ధపరచు. ఓ ప్రభూ! నా పాపాలను నీటితో, మంచుతో, వడగళ్ళతో ప్రక్షాళనం చెయ్యి.” (ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA) Allah's Messenger (ﷺ) used to keep silent – between the opening Takbir of the prayer and the recitation of the Qur'an – for a short while. Then, I asked him (about that) and he replied, "I say, 'O Allah! Keep me apart from my sins (faults) as you have kept apart the east and west. O Allah clean me from my sins as a white garment is cleaned from dirt. O Allah wash me of my sins with water, snow and hail." [Agreed upon].
సారాంశం
‘తక్బీరె తహ్రీమా’ తరువాత – ఖుర్ఆన్ పారాయణం మొదలెట్టక ముందు – ఈ ‘దుఆ’ చేయటం దైవప్రవక్త విధానమని ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతున్నది. దుఆ బిగ్గరగా గాకుండా, మెల్లగా చదవాలని కూడా హదీసు ద్వారా విదితమవుతోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 213
హదీసు 214
وَعَنْ عُمَرَ - رضى الله عنه - أَنَّهُ كَانَ يَقُولُ : { سُبْحَانَكَ اَللَّهُمَّ وَبِحَمْدِكَ , وَتَبَارَكَ اِسْمُكَ , وَتَعَالَى جَدُّكَ , وَلَا إِلَهُ غَيْرُكَ } رَوَاهُ مُسْلِمٌ بِسَنَدٍ مُنْقَطِعٍ , وَاَلدَّارَقُطْنِيُّ مَوْصُولاً وَهُوَ مَوْقُوفٌ وَنَحْوُهُ عَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ مَرْفُوعًا عِنْدَ اَلْخَمْسَةِ. وَفِيهِ : وَكَانَ يَقُولُ بَعْدَ اَلتَّكْبِيرِ : { أَعُوذُ بِاَللَّهِ اَلسَّمِيعِ اَلْعَلِيمِ مِنَ اَلشَّيْطَانِ اَلرَّجِيمِ , مِنْ هَمْزِهِ , وَنَفْخِهِ , وَنَفْثِهِ }
హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) (విరామ సమయంలో) “సుబ్హాన కల్లాహుమ్మ…” పఠించేవారు – (అర్థం) దేవా! నీవు పవిత్రుడవు. ప్రశంసలన్నీ నీకు మాత్రమే తగును. నీ నామం శుభప్రదం. నీ ఘనత ఎంతో ఉన్నతమైనది. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. (ముస్లిం దీనిని ‘మున్ఖతీ’గాను, దారె ఖుత్నీ ‘మౌసూల్’గాను ఉల్లేఖించారు. ఈ హదీసు మౌఖూఫ్)
అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా ఐదుగురూ హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) సౌజన్యంతో ఈ విధంగానే ఉల్లేఖించారు. ఇందులో “అవుజుబిల్లాహి స్సమీయిల్ అలీమ్, మినష్షయితా నిర్రజీమ్ మిన్ హమ్జిహీ, వ నఫ్ఖిహీ, వ నఫ్సిహీ” అని కూడా ప్రస్తావించబడింది (అర్థం: నేను శాపగ్రస్తుడైన షైతాన్ బారినుండి, వాడి పైశాచిక ప్రేరణలనుండి, వాడి కవ్వింపు నుండి, వాడి గర్వాహంకారం నుండి సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను).
English
Narrated 'Umar (RA): He (ﷺ) used to say, "How perfect You are O Allah, and Praise is for You, Blessed is Your Name and Exalted is Your Majesty and there is nothing which deserves to be worshipped besides You." [Reported by Muslim with a Munqati' (broken) chain. And in the version of ad-Daraqutni, it is Mawsul (unbroken chain), and it is Mawquf (saying of a companion ('Umar)].
Abu Sa'id al-Khudri (RA) narrated a similar report Marfu' [reaching back to the Prophet (ﷺ)] collected by al-Khamsah.
Containing the words: He (ﷺ) used to say after the (opening) Takbir (for prayer), "I seek refuge in Allah, the All-Hearing and the All-Knowing from the accursed devil, from his madness or evil suggestion (Hamz), from his puffing up (Nafkh), and from his witchcraft (Nafth)."
సారాంశం
‘తక్బీరె తహ్రీమా’కి – సూరె ఫాతిహాకి మధ్య నున్న విరామ సమయంలో “అల్లాహుమ్మ బాయిద్ బైనీ…..” అనే దుఆ పఠించాలని ఇంతకు ముందు వచ్చిన సహీహ్ హదీసులో ఉంది. కొన్ని ఉల్లేఖనాలలో “ఇన్నీవజ్జహ్తు….” దుఆ చదవాలని, దీంతోపాటు “సుబ్హానకల్లాహుమ్మ….” కూడా కలుపుకోవచ్చని ఉంది. “సుబ్హానకల్లాహుమ్మ” ప్రస్తావన ఉన్న హదీసు ‘మౌఖూఫ్’ అయినప్పటికీ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లాంటి గొప్ప సహాబీ బిగ్గరగా దాన్ని పఠించటమేగాక, ప్రజలకు దానిని నేర్పేవారు. అందువల్ల దీనిని ఉపేక్షించలేము. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) కూడా దీనిని అవలంబించారు. మరో ముఖ్య విషయం – ఫాతిహా సూరా ప్రారంభించే ముందు ‘తఅవ్వుజ్’ మరియు ‘తస్మియ’ చదవటం అవసరం అని దైవప్రవక్త ﷺ గారి ఆదేశం వల్ల తెలుస్తోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 214
హదీసు 215
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَسْتَفْتِحُ اَلصَّلَاةَ بِالتَّكْبِيرِ , وَالْقِرَاءَةَ : بِـ (اَلْحَمْدُ لِلَّهِ رَبِّ اَلْعَالَمِينَ ) وَكَانَ إِذَا رَكَعَ لَمْ يُشْخِصْ رَأْسَهُ , وَلَمْ يُصَوِّبْهُ , وَلَكِنْ بَيْنَ ذَلِكَ. وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنْ اَلرُّكُوعِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ قَائِمًا. وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنْ اَلسُّجُودِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ جَالِسًا. وَكَانَ يَقُولُ فِي كُلِّ رَكْعَتَيْنِ اَلتَّحِيَّةَ. وَكَانَ يَفْرِشُ رِجْلَهُ اَلْيُسْرَى وَيَنْصِبُ اَلْيُمْنَى. وَكَانَ يَنْهَى عَنْ عُقْبَةِ اَلشَّيْطَانِ , وَيَنْهَى أَنْ يَفْتَرِشَ اَلرَّجُلُ ذِرَاعَيْهِ اِفْتِرَاشَ اَلسَّبُعِ. وَكَانَ يُخْتَمُ اَلصَّلَاةَ بِالتَّسْلِيمِ } أَخْرَجَهُ مُسْلِمٌ , وَلَهُ عِلَّةٌ
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ ‘అల్లాహు అక్బర్’ అంటూ నమాజ్‌ను ఆరంభించేవారు. ‘అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ (ఫాతిహా సూరా) తో ఖుర్ఆన్ పఠనం మొదలెట్టేవారు. రుకూ చేసినపుడు తన తలను మరీ పైకిగానీ, మరీ క్రిందికిగానీ ఉంచేవారు కారు. ఆ రెండింటికీ మధ్య స్థితిలో తల ఉంచేవారు. రుకూ స్థితినుండి తల పైకెత్తిన తరువాత అప్పటికప్పుడే సజ్దాలోకి వెళ్ళకుండా నిటారుగా నిలబడేవారు. సజ్దానుండి తలపైకెత్తిన మీదట ప్రశాంతంగా కూర్చొననిదే రెండవ సజ్దాలోకి వెళ్ళేవారు కాదు. ప్రతి రెండు రకతుల తరువాత తషహ్హుద్ (అత్తహియ్యాత్) పఠించేవారు. ఆ సమయంలో ఎడమ కాలిని క్రిందపరచుకుని కుడి పాదాన్ని నిలిపి ఉంచేవారు. షైతాన్ తరహాలో కూర్చోవటాన్ని వారించేవారు. క్రూరమృగాల వలె భుజాలను (చేతులను) ముందుకు జరిపి కూర్చోవడాన్ని కూడా వారించేవారు. సలాం చేయడంతో నమాజ్‌ను ముగించేవారు.” (ముస్లిం – దీని పరంపర లోపభూయిష్టంగా ఉంది)
English
Narrated 'Aishah (RA) Allah's Messenger (ﷺ) used to begin the Salat (prayer) with Takbir (Allahu Akbar – Allah is the Most Great) and the recitation with Alhamdu lillahi Rabbil' alamin (praise is to Allah, the Rabb of the universe)." And when he bowed down, he neither kept his head up nor bent it down, but kept it between that (two positions). When he raised his head from the bowing position, he did not prostrate till he had stood erect; and when he raised his head after a prostration, he did not prostrate again till he had sat up. And at the end of every two Rak'ah he said the Tahiyyah, and he used to sit on his left foot and position he right one vertically, and he prohibited the devil's way of sitting on the buttocks. He forbade people to spread out their arms like a wild beast. And he used to finish the prayer with the Taslim (i.e. saying As-Salamu 'alaikum). [Reported by Muslim and it has an 'illa (defect)].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 215
హదీసు 216
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ يَرْفَعُ يَدَيْهِ حَذْوَ مَنْكِبَيْهِ إِذَا اِفْتَتَحَ اَلصَّلَاةَ , وَإِذَا كَبَّرَ لِلرُّكُوعِ , وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنْ اَلرُّكُوعِ } مُتَّفَقٌ عَلَيْهِ وَفِي حَدِيثِ أَبِي حُمَيْدٍ , عِنْدَ أَبِي دَاوُدَ : { يَرْفَعُ يَدَيْهِ حَتَّى يُحَاذِيَ بِهِمَا مَنْكِبَيْهِ, ثُمَّ يُكَبِّرَ } وَلِمُسْلِمٍ عَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ - رضى الله عنه - نَحْوُ حَدِيثِ اِبْنِ عُمَرَ , وَلَكِنْ قَالَ : { حَتَّى يُحَاذِيَ بِهِمَا فُرُوعَ أُذُنَيْهِ }.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్‌ను ఆరంభించినపుడు తన రెండు చేతులను భుజాలకు సమానాంతరంగా ఎత్తేవారు. రుకూ చేసినపుడు, రుకూ నుండి తల పైకెత్తినపుడు కూడా తన రెండు చేతుల్ని భుజాలకు సమానాంతరంగా లేపేవారు. (అంటే ‘రఫె యదైన్’ చేసేవారు). (బుఖారీ, ముస్లిం)
అబూదావూద్లో అబూ హుమైద్చే ఉల్లేఖించబడిన హదీసులో ఉంది: “తన రెండు చేతుల్ని భుజాలకు సమానంగా ఎత్తి అల్లాహు అక్బర్ అని పలికేవారు.”
ఇంకా ముస్లింలో మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) చేత ఉల్లేఖించబడిన హదీసులో కూడా ఇబ్నెఉమర్ ఉల్లేఖనంలో ఉన్నట్లే చెప్పబడింది. కాని ఇందులో ‘తన భుజాలకు సమానాంతరంగా’ అనే బదులు ‘చెవులవరకు’ అని ఉంది.
English
Narrated Ibn 'Umar (RA): The Prophet (ﷺ) used to raise his hands parallel to his shoulders when he started the prayer (by saying Allahu Akbar), when he uttered the Takbir to bow and when he raised his head from the Ruku' (bowing posture). [Agreed upon].
Abu Dawud reported a Hadith narrated by Abu Humaid (RA) to the effect that he [Allah's Messenger (ﷺ)] used to raise his hands and bring them parallel to his shoulders, and then utter the Takbir.
Muslim has a Hadith narrated by Malik bin Huwairith (ﷺ) similar to the Hadith narrated by Ibn 'Umar (RA). But he (Malik bin Huwairith) mentioned: "He [the Prophet (ﷺ)] raised his hands parallel to the end of his ears."
సారాంశం
తక్బీరె తహ్రీమా చెప్పే సమయంలోనూ, రుకూలోకి వెళ్ళే సందర్భంలోనూ, రుకూ నుండి నిలబడే సమయంలోనూ ‘రఫెయదైన్’ చేయటం దైవప్రవక్త సంప్రదాయం (మస్నూన్) అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. మరికొన్ని హదీసులలో రెండు రకతుల తరువాత మూడవ రకత్ ఆరంభానికి ముందు కూడా రఫెయదైన్ చేయాలని ఉంది. అత్యధిక సహాబీలు, వారి శిష్యులు ఈ విధానాన్నే పాటించారు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అహ్మద్ (రహిమహుల్లాహ్), అబూసూర్ (రహిమహుల్లాహ్), ఇబ్నె ముబారక్ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ బిన్ రాహ్వే (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ద్వారా కూడా ఇదే ఉటంకించబడింది. దైవప్రవక్త ﷺ జీవితాంతం ‘రఫెయదైన్’ చేసేవారని, ధర్మ ఖలీఫాలు కూడా ఈ పద్ధతిని అనుసరించారన్న దానికి చారిత్రక ఆధారాలున్నాయి.
హజ్రత్ వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) గారి సాక్ష్యం ఈ విషయంలో ప్రబల తార్కాణంగా నిలిచింది. వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) తబూక్ యుద్ధానంతరం హిజ్రీ 9లో ఇస్లాం స్వీకరించారు. మరుసటి సంవత్సరం ఆయన (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త ﷺ సన్నిధిలోకి వచ్చినపుడు మదీనాలో చలి తీవ్రంగా ఉంది. ఆయన ప్రవక్త ప్రియ సహచరులను (చలి కారణంగా) దుస్తుల లోపలినుంచే ‘రఫెయదైన్’ చేయటం గమనించారు. అవి హిజ్రీ 10వ సంవత్సరం ఆఖరి మాసాలు. ఆ తరువాత హిజ్రీ 11వ ఏట దైవప్రవక్త ﷺ పరమపదించారు. దీన్నిబట్టి తెలిసేదేమంటే ‘రఫెయదైన్’ ఆచరణ ఆయన ﷺ జీవితం ఆఖరి ఘడియ వరకూ కొనసాగింది. కొంతమంది చెబుతున్నట్లు ఈ ఆచరణ రద్దవటంగానీ, మానివేయబడటంగానీ జరగలేదు. ప్రవక్త ప్రియసహచరులలో అత్యధికులు దీనిని అవలంబించారు. కూఫా నగరంతో సహా అరేబియాలోని ప్రముఖ పట్టణాలన్నింటిలోనూ దీనిపై అమలు జరిగింది. ఇస్లామీయ ధర్మవేత్తలలో అత్యధికులు ఈ ‘రఫెయదైన్’ పద్ధతిని అభిలషించారు. బుఖారీ, ముస్లింలతో పాటు క్రింద పేర్కొనబడిన గ్రంథాలలో కూడా ఈ హదీసు పొందుపరచబడి ఉంది : –
సుననె అబూదావూద్, జామె తిర్మిజీ, సునన్ నసాయి, సునన్ ఇబ్నెమాజ, సునన్ దారిమీ, మువత్తా ఇమామ్ మాలిక్, ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్, అల్ ముసన్నఫ్, లి ఇబ్నె అబీ షైబ, ముస్నద్ అహ్మద్, సహీహ్ ఇబ్నె ఖుజైమ, సహీహ్ ఇబ్నె హిబ్బాన్, ముస్నద్ అబీ అవానా, సునన్ దారె ఖుత్నీ, సుననె కుబ్రా, బైహఖీ మొదలగునవి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 216
హదీసు 217
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍ - رضى الله عنه - قَالَ : { صَلَّيْتُ مَعَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَوَضَعَ يَدَهُ اَلْيُمْنَى عَلَى يَدِهِ اَلْيُسْرَى عَلَى صَدْرِهِ } أَخْرَجَهُ اِبْنُ خُزَيْمَةَ
హజ్రత్ వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నేను దైవప్రవక్త ﷺతో కలిసి నమాజ్ చేశాను. ఆయన ﷺ తన కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచి రొమ్ముపై చేతులు కట్టుకున్నారు.” (ఇబ్నె ఖుజైమ)
English
Narrated Wa'il bin Hujr (RA): I prayed with the Prophet (ﷺ) and he put his right hand on his left (and then placed them) on his chest. [Reported by Ibn Khuzaimah].
సారాంశం
ఈ హదీసు ద్వారా రెండు అంశాలు మన దృష్టికి వస్తున్నాయి. ఒకటి: నమాజులో చేతులు కట్టుకుని నిలబడటం సరైన విధానం (మస్నూన్). చేతులు వదలి నమాజ్ చేయటం సరైన విధానం కాదు. షాఫయీలు, హనఫీలు, హంబలీలు – అందరూ ఈ అంశంపై ఏకీభవించారు. అత్యధికమంది ప్రవక్త సహచరులు, వారి శిష్యుల ఉవాచ కూడా ఇదే. ఇబ్నె ముంజిర్ తదితరులు ఇమామ్ మాలిక్ నుండి సంగ్రహించిన నకలులో కూడా ఇదే ఉంది. ఆఖరికి మువత్తా ఇమామ్ మాలిక్లో కూడా చేతులు కట్టుకోవడం గురించిన ఉల్లేఖనమే ఉంది. మరలాంటప్పుడు ఈ పద్ధతినే పాటించాలి. దీనికి భిన్నంగా – చేతులు వదలి నమాజ్ చేయాలన్న ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖనం సరైనది కాదు.
రెండు: చేతులు ఎక్కడ కట్టాలి? అన్న విషయానికి వద్దాం. చేతులు రొమ్ముపై కట్టుకోవాలా? నాభిక్రింద కట్టుకోవాలా? కొంతమంది నాభిక్రింద చేతులు కట్టుకుంటారు. దీన్ని సమర్థిస్తున్న హదీసు బలహీనమైనది, ప్రామాణికమైనది కాదు. పైన పేర్కొనబడిన హదీసును ఇబ్నె ఖుజైమ తన సహీహ్‌లో లిఖించగా ముస్నద్ అహ్మద్‌లో హజ్రత్ హల్బ్ హదీసు ద్వారా దీనికి మద్దతు లభిస్తున్నది. దైవప్రవక్త ﷺ తన చేతులను రొమ్ముపై కట్టుకునే వారని అందులో చెప్పబడింది. అహ్లె హదీస్ ఉలమాలు, రొమ్ముపై చేతులు కట్టుకోవటమే సరైనదని, నాభి క్రింద చేతులు కట్టుకోవాలన్న ఉల్లేఖనం బలహీనమైనదని ప్రబలమైన నిదర్శనాల ద్వారా నిరూపిస్తున్నారు.
హదీసు ఉల్లేఖకులు
వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ హునైద లేక అబూ హింద. సుప్రసిద్ధ సహాబీలలో ఒకరు. హజర్మోత్ చక్రవర్తులలో ఒకరు. ఈయన తన మిత్ర బృందంతో కలిసి దైవప్రవక్త ﷺ సన్నిధిలోకి వచ్చినపుడు ఈయన గౌరవార్థం దైవప్రవక్త ﷺ తన శాలువాను క్రిందపరచి కూర్చోబెట్టారు. ఈయన కొరకు, ఈయన సంతతి కొరకు ప్రార్థించారు. హజర్మోత్ తెగలపై ఈయన్ని పర్యవేక్షకునిగా నియమించారు. ఎట్టకేలకు ఈయన కూఫాలో స్థిరపడ్డారు. అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో ఈయన మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 217
హదీసు 218
وَعَنْ عُبَادَةَ بْنِ اَلصَّامِتِ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِأُمِّ اَلْقُرْآنِ } مُتَّفَقٌ عَلَيْهِ وَفِي رِوَايَةٍ , لِابْنِ حِبَّانَ وَاَلدَّارَقُطْنِيِّ : { لَا تَجْزِي صَلَاةٌ لَا يُقْرَأُ فِيهَا بِفَاتِحَةِ اَلْكِتَابِ } وَفِي أُخْرَى , لِأَحْمَدَ وَأَبِي دَاوُدَ , وَاَلتِّرْمِذِيِّ , وَابْنِ حِبَّانَ : { لَعَلَّكُمْ تَقْرَءُونَ خَلْفَ إِمَامِكُمْ ? " قُلْنَا : نِعْمَ. قَالَ : "لَا تَفْعَلُوا إِلَّا بِفَاتِحَةِ اَلْكِتَابِ , فَإِنَّهُ لَا صَلَاةِ لِمَنْ لَمْ يَقْرَأْ بِهَا }
హజ్రత్ ఉబాద బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచించారు: “ఎవరయితే (నమాజ్‌లో) ఉమ్ముల్ ఖుర్ఆన్ పఠించలేదో అతని నమాజ్ నెరవేరదు.” (బుఖారీ, ముస్లిం)
ఇబ్నె హిబ్బాన్, దారె ఖుత్నీ ఉల్లేఖనాలలో ఇలా వుంది: “ఏ నమాజులో ఫాతిహా సూరా పఠించబడలేదో ఆ నమాజ్ అసంపూర్ణంగా ఉంటుంది.” అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ల మరో ఉల్లేఖనంలో ఉంది- “బహుశా మీరు ఇమామ్ వెనుక (ఏదో) చదువుతారనుకుంటాను” అని ఆయన ﷺ చెప్పగా ‘అవును’ అని మేమన్నాము. “అలా చేయకండి – ఒక్క ఫాతిహా సూరా తప్ప. ఎందుకంటే ఎవరు ఫాతిహా సూరా చదవలేదో అతని నమాజే కాదు” అని ఆయన ﷺ సెలవిచ్చారు.
English
Narrated 'Ubada bin As-Samit (ﷺ): Allah's Messenger (ﷺ) said: "There is no Salat (prayer) for him who does not recite Ummul-Qur'an (Surat al-Fatiha)". (Agreed upon].
In the narration of Ibn Hibban and ad-Daraqutni is mentioned: "The Salat (prayer) is not complete if one does not recite (Surat) Fatiha al-Kitab."
And in another narration of Ahmad, Abu Dawud, at-Tirmidhi, and Ibn Hibban is: "Perhaps you recite behind your Imam?" We replied, "Yes." He [the Prophet (ﷺ)] said, "Do not do so except when it is (Surat) Fatiha al-Kitab, for the Salat (prayer) of the one who does not recite it, is not accepted."
సారాంశం
సూరె ఫాతిహా చదవనిదే నమాజ్ కాదన్న దానికి ఈ హదీసు స్పష్టమయిన ఆధారం. ఇమామ్ అయినా, ముఖ్తదీ అయినా, ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి అయినా ఫాతిహా సూరా పఠనం తప్పనిసరి. ప్రామాణిక హదీసుల వెలుగులో సిసలయిన విధానం ఇదే. షాఫయిలు, అహ్లెహదీసువారు ఈ విధానాన్నే అవలంబించారు. ప్రతి నమాజీ, ప్రతి రకతులో ఫాతిహా సూరా పఠించటం తప్పనిసరియని వీరంతా వక్కాణిస్తారు. ప్రవక్త ప్రియసహచరుల, తాబయీన్ల, అధికసంఖ్యాక ఉలమాల మస్లక్ (పద్ధతి) ఇదే. ముస్లింలో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ద్వారా కూడా – ఇమామ్ వెనుక ఫాతిహా సూరా పఠించటం అనివార్యం అని విదితమవుతున్నది.
మౌలానా అబ్దుల్ హై లక్నోవీ హనఫీ “ఉమ్ముల్ కలామ్”లో ఇలా అంటున్నారు: “ఇమామ్ వెనుక ఫాతిహా సూరా పఠించరాదన్న వాదనను సమర్థించే బలమైన హదీసు ఏదీ లేదు. ఈ సందర్భంగా ఉదాహరించబడేవేవీ ప్రామాణికమైనవి కావు. సిర్రీ నమాజుల్లోనూ, జహ్రీ నమాజులలోనూ ఇమామ్ వెనకనున్నవారు (ముఖ్తదీలు) ఫాతిహా సూరా పఠించాలన్నదే ప్రామాణికమైనది. హదీసువేత్తల (ముహద్దిసీన్)లోని ఒక సమూహం అవలంబన కూడా ఇదే.”
ఈయనే కాదు, హనఫీ పండితులలోని పూర్వికులు, తరువాతి తరంలో కూడా కొంతమంది తాము జరిపిన పరిశోధన ఆధారంగా, ఇమామ్ వెనుక ఫాతిహా సూరా పఠించేవారు. షాహ్ వలియుల్లాహ్ ముహద్దిస్ దహెల్వీ (రహిమహుల్లాహ్), షాహ్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) కూడా ఈ కోవకు చెందినవారిలో ఉన్నారు. కడకు మౌలానా రషీద్ అహ్మద్ గంగోహీ (రహిమహుల్లాహ్) వంటివారు సయితం సిర్రీ నమాజులలోనే గాక, జహ్రీ నమాజులలోనూ ఇమామ్ వెనుక సూరె ఫాతిహా పఠించడాన్ని ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకై “అల్కలామ్” మొదటి సంపుటిని చూడవచ్చు.
హదీసు ఉల్లేఖకులు
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) అన్సారీ సహాబీ. ఖజ్రజ్ తెగకు చెందినవారు. అన్సార్ సర్దారులలో ప్రముఖ వ్యక్తిగా పేరుమోసారు. ప్రథమ, ద్వితీయ అఖబా ఒప్పందాలలో పాల్గొన్నారు. బద్ర్తో పాటు ఇతర యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయన్ని సిరియా వైపునకు ఖాజీగా, అధ్యాపకునిగా నియమించి పంపారు. తొలుత హిమ్స్లో స్థిరపడ్డారు. తరువాత పాలస్తీనా వైపునకు ప్రస్థానం చేశారు. ‘రమ్ల’లో కన్నుమూశారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం హిజ్రీ 34లో బైతుల్ మఖ్దిస్‌లో మరణించారు. అప్పటికి ఆయనకు 72 సంవత్సరాలు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 218
హదీసు 219
وَعَنْ أَنَسٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -وَأَبَا بَكْرٍ وَعُمَرَ كَانُوا يَفْتَتِحُونَ اَلصَّلَاةِ بِـ (اَلْحَمْدُ لِلَّهِ رَبِّ اَلْعَالَمِينَ ) } مُتَّفَقٌ عَلَيْهِ زَادَ مُسْلِمٌ: { لَا يَذْكُرُونَ : (بِسْمِ اَللَّهِ اَلرَّحْمَنِ اَلرَّحِيمِ ) فِي أَوَّلِ قِرَاءَةٍ وَلَا فِي آخِرِهَا }. وَفِي رِوَايَةٍ لِأَحْمَدَ , وَالنَّسَائِيِّ وَابْنِ خُزَيْمَةَ : { لَا يَجْهَرُونَ بِبِسْمِ اَللَّهِ اَلرَّحْمَنِ اَلرَّحِيم ِ } وَفِي أُخْرَى لِابْنِ خُزَيْمَةَ : { كَانُوا يُسِرُّونَ }. وَعَلَى هَذَا يُحْمَلُ اَلنَّفْيُ فِي رِوَايَةِ مُسْلِمٍ , خِلَافًا لِمَنْ أَعَلَّهَا. .
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ, అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు) అందరూ “అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్”తో నమాజ్‌ను ఆరంభించేవారు. (బుఖారీ, ముస్లిం)
ముస్లింలో అదనంగా ఇలా అనబడింది: “పఠనం మొదట్లోగానీ, ఆఖరిలోగానీ – రెండు సందర్భాలలో కూడా బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీమ్ చదివేవారు కారు.”
ముస్నద్ అహ్మద్, నసాయి, ఇబ్నె ఖుజైమాలలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ హెచ్చు స్వరంతో పఠించేవారు కాదు.”
ఇబ్నె ఖుజైమాలోని వేరొక ఉల్లేఖనంలో “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ నెమ్మదిగా పఠించేవారు” అని వుంది.
English
Narrated Anas (RA): "The Prophet (ﷺ), Abu Bakr and 'Umar used to begin the Salat (prayer) with Al-hamdu lillahi Rabbil-'alamin." [Agreed upon].
And Muslim added: "They would not recite Bismillahir-Rahmanir-Rahim, neither in the beginning of the recitation nor at the end of it."
In another narration from Ahmad, an-Nasa'i and Ibn Khuzaimah: "They never used to recite Bismillahir-Rahmanir-Rahim aloud."
And in another report from Ibn Khuzaimah: "They used to recite Bismillahir-Rahmanir-Rahim silently."
The negation (of recitation of the Bismillah) in the report of Muslim can be understood in light of this report (i.e. it was recited silently), as opposed to those who declared Muslim's report as being defective.
సారాంశం
దైవప్రవక్త ﷺ ఫాతిహా సూరాతో దైవగ్రంథ పారాయణాన్ని మొదలెట్టేవారనీ, ‘బిస్మిల్లాహ్’ మెల్లగా పఠించేవారనీ ఈ హదీసుద్వారా అవగతమవుతున్నది. మరికొన్ని ఉల్లేఖనాలలో బిస్మిల్లాహ్ బిగ్గరగా చెప్పేవారని కూడా ఉంది. కాబట్టి రెండు విధాలుగా పఠించినప్పటికీ అది అనుచితం కాదుగానీ ప్రామాణిక ఉల్లేఖనాల దృష్ట్యా ‘బిస్మిల్లాహ్’ను నెమ్మదిగా పలకటమే సమంజసం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 219
హదీసు 220
وَعَنْ نُعَيْمٍ اَلْمُجَمِّرِ - رضى الله عنه - قَالَ : { صَلَّيْتُ وَرَاءَ أَبِي هُرَيْرَةَ فَقَرَأَ : (بِسْمِ اَللَّهِ اَلرَّحْمَنِ اَلرَّحِيمِ). ثُمَّ قَرَأَ بِأُمِّ اَلْقُرْآنِ , حَتَّى إِذَا بَلَغَ : (وَلَا اَلضَّالِّينَ) , قَالَ : "آمِينَ" وَيَقُولُ كُلَّمَا سَجَدَ , وَإِذَا قَامَ مِنْ اَلْجُلُوسِ : اَللَّهُ أَكْبَرُ. ثُمَّ يَقُولُ إِذَا سَلَّمَ : وَاَلَّذِي نَفْسِي بِيَدِهِ إِنِّي لَأَشْبَهُكُمْ صَلَاةً بِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -} رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ خُزَيْمَةَ
హజ్రత్ నుఐమ్ ముజ్మిర్ (రహిమహుల్లాహ్) వివరించారు: నేను హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) నేతృత్వంలో నమాజ్ చేశాను. ఆయన మొదట బిస్మిల్లాహ్ పఠించారు. తరువాత ఉమ్ముల్ ఖుర్ఆన్ (సూరె ఫాతిహా) పారాయణం చేశారు. ‘వలజ్జాల్లీన్’ వరకూ వచ్చిన తరువాత ఆయన ‘ఆమీన్’ పలికారు. సజ్దాలోకి వెళ్ళినప్పుడు, సజ్దా తరువాత కూర్చుని నిలబడినప్పుడు ‘అల్లాహు అక్బర్’ అనేవారు. సలాం చేసిన తరువాత ఆయన ఇలా పలికారు: “ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను! నిశ్చయంగా నేను మీకన్నా ఎక్కువగా నమాజ్ నెరవేర్చటంలో దైవప్రవక్త ﷺను పోలి వున్నాను.” (నసాయి, ఇబ్నె ఖుజైమ)
English
Narrated Nu'aim Mujmir (RA): "I prayed behind Abu Hurairah (RA) and he recited Bismillahir-Rahmanir-Rahim, and then recited Umm-ul-Qur'an (Al-Fatiha) and when he reached walad-dallin, he said Amin; and then said Allahu Akbar, when he prostrated and when he stood up from his sitting position. And when he uttered the Taslim (i.e. As-Salamu 'Alaikum), he said, "I swear by the One (i.e. Allah) in Whose Hand my soul is, my Salat (prayer) resembles most that of Allah's Messenger (ﷺ) than that of anyone among you." [Reported by an-Nasa'i and lbn Khuzaimah].
సారాంశం
ఈ హదీసు ‘బిస్మిల్లాహ్’ మరియు ‘ఆమీన్’లను బిగ్గరగా పలకాలన్న దానికి ఆధారంగా నిలిచింది. అయితే అత్యధిక ప్రామాణిక ఆధారాల దృష్ట్యా ‘బిస్మిల్లాహ్’ నెమ్మదిగానూ, ‘ఆమీన్’ బిగ్గరగానూ పలకటం సమంజసం. ఎన్నో సమయాల్లో (జహ్రీ నమాజులలో) బిస్మిల్లాహ్ నెమ్మదిగా చదవబడింది. కొన్ని సమయాల్లోనే బిగ్గరగా పఠించబడింది.
ఫాతిహా సూరా ముగింపుపై ‘ఆమీన్’ పలకటం ‘మస్నూన్’అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇమామ్ అయినా, ముఖ్తదీ అయినా, ఒంటరిగా నమాజ్ చేసేవారైనా – అందరూ ఆమీన్ చెప్పవలసిందే. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో ఆమీన్ పలకటం తప్పనిసరి. ఆమీన్ పలకనివాడు పాపాత్ముడవుతాడు. “ఓ అల్లాహ్! నా ప్రార్థనను స్వీకరించు” అని ఆమీన్ భావం.
హదీసు ఉల్లేఖకులు
నుఐమ్ ముజ్మిర్ (రహిమహుల్లాహ్) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)చే స్వేచ్ఛ నొసగబడిన బానిస. ఈయన మారు పేరు అబూ అబ్దుల్లాహ్. హజ్రత్ ఉమర్ ఆదేశాన్ని శిరసావహిస్తూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మస్జిదె నబవీని సుగంధ నీటితో కడిగేవారు. ఈ కారణంగానే ఈయన ముజ్మిర్గా ఖ్యాతి గడించారు. ప్రసిద్ధ తాబయీలలో ఒకరు. అబూ హాతిమ్, ఇబ్నె ముయీన్, ఇబ్నె సాద్, నసాయి తదితరులు ఈయన్ని విశ్వసనీయమయిన వ్యక్తిగా నిర్ధారించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 220
హదీసు 221
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا قَرَأْتُمْ اَلْفَاتِحَةِ فَاقْرَءُوا : ( بِسْمِ اَللَّهِ اَلرَّحْمَنِ اَلرَّحِيمِ ) , فَإِنَّهَا إِحْدَى آيَاتِهَا } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ , وَصَوَّبَ وَقْفَهُ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచనం – “మీరు ఫాతిహా సూరా పఠించినపుడు బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీమ్ కూడా దాంతోపాటే పఠించండి. ఎందుకంటే అది కూడా ఫాతిహా సూరాలోని ఒక వచనమే.” (దారె ఖుత్నీ దీనిని ‘మౌఖూఫ్’గా నిర్ధారించారు)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Whenever you recite Surat Al-Fatiha, recite Bismillahir-Rahmanir-Rahim, for it is one of its Ayat (Verses)." [Reported by ad-Daraqutni who verified it as Mawquf – the saying of Abu Hurairah (RA)].
సారాంశం
‘బిస్మిల్లాహ్’ ఫాతిహా సూరాలోని ఒక ఆయత్ అని ఈ హదీసు వక్కాణిస్తోంది. అయితే ఈ హదీసు మౌఖూఫ్ అన్న విషయాన్ని విస్మరించారు. ముస్లింలోని సహీహ్ హదీసు దీనికి విరుద్ధంగా ఉంది. ఈ హదీసులో దైవప్రవక్త ఈ సూరాను విభజించారు. ‘అల్ హమ్దులిల్లాహ్’ను మొదటి భాగంగా ఖరారు చేశారు – ‘బిస్మిల్లాహ్’ను ఇందులో చేర్చలేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 221
హదీసు 222
وَعَنْهُ قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا فَرَغَ مِنْ قِرَاءَةِ أُمِّ اَلْقُرْآنِ رَفَعَ صَوْتَهُ وَقَالَ : "آمِينَ". } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ وَحَسَّنَهُ , وَالْحَاكِمُ وَصَحَّحَهُ. وَلِأَبِي دَاوُدَ وَاَلتِّرْمِذِيِّ مِنْ حَدِيثِ وَائِلِ بْنِ حُجْرٍ نَحْوُهُ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ ఉమ్ముల్ ఖుర్ఆన్ (ఫాతిహా సూరా) పఠనం పూర్తి కాగానే బిగ్గరగా ఆమీన్ పలికేవారు.” (దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. ‘హసన్’గా నిర్ధారించారు. హాకిమ్ మాత్రం దీనిని ప్రామాణికమైనదిగా ఖరారుచేశారు. అబూ దావూద్, తిర్మిజీలలో వాయల్ బిన్ హుజ్ర్ – రజి – ఉల్లేఖనం కూడా ఇలాగే ఉంది)
English
Narrated [Abu Hurairah (RA)]: When Allah's Messenger (RA) completed the recitation of Surat Al-Fatiha, he raised his voice and said Amin. [Reported by ad-Daraqutni who graded it Hasan (good) and Al-Hakim who graded it Sahih (authentic)).
The narrations of Abu Dawud and at-Tirmidhi from the Hadith of Wa'il bin Hujr (RA) are similar to this one.
సారాంశం
సూరె ఫాతిహా చివరిలో దైవప్రవక్త ﷺ ‘ఆమీన్’ని బిగ్గరగా పలికేవారని ఈ హదీసులో వుంది. అయితే బిగ్గరగా పలకటం – నెమ్మదిగా పలకటం గురించి భేదాభిప్రాయం ఉంది. ఆమీన్ పలికే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. హనఫీలు ఆమీన్ నెమ్మదిగా పలకాలంటారు. కాగా; మిగిలిన ఇమాములు ముగ్గురూ, హదీసువేత్తలు, అహ్లెహదీసు విద్వాంసులు ఆమీన్ బిగ్గరగా పలకాలంటారు.
అనేక ప్రామాణిక హదీసుల ద్వారా ఆమీన్ బిగ్గరగా పలకడానికే ఎక్కువ సమర్థన లభిస్తోంది. తిర్మిజీ, అబూదావూద్, దారిమీలలో దైవప్రవక్త ﷺ ఆమీన్ పలికారనీ, ఆ సమయంలో తన గొంతును పెంచారని వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం చెబుతోంది.
సహీహ్ ఇబ్నె హిబ్బాన్, దారె ఖుత్నీ, హాకిమ్లలో – దైవప్రవక్త ﷺ ఉమ్ముల్ ఖుర్ఆన్ను ముగించిన తరువాత హెచ్చు స్వరంతో ‘ఆమీన్’ చెప్పేవారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ద్వారా స్పష్టమవుతున్నది.
సహీహ్ ఇబ్నె ఖుజైమాలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ గురించి ఇలా ఉంది: ఆయన ఇమామ్ వెనక నమాజ్ చేసినపుడు జనులు కూడా ఆమీన్ పలికేవారు. ఇబ్నె ఉమర్ కూడా ఆమీన్ పలికేవారు. దీనిని ‘సున్నత్’గా భావించేవారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆమీన్ను వదిలేవారు కారనీ, ఆమీన్ పలకమని మమ్మల్ని ప్రోత్సహించేవారని ఆయన శిష్యులు నాఫె తెలిపారు.
ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గురువర్యులైన హజ్రత్ అతా బిన్ రిబాహ్ ఇలా అంటున్నారు: “మక్కాలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) బిగ్గరగా ఆమీన్ పలికేవారు. ఆయన వెనుకనున్న వారు కూడా బిగ్గరగా ఆమీన్ అనేవారు. దీంతో మస్జిద్ ప్రతిధ్వనించేది.” (బుఖారీ)
హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు: “యూదులు ముస్లింలపై మూడు విషయాలలో ఈర్ష్య చెందుతారు: (1) సలాంకు బదులు ఇవ్వటంపై (2) పంక్తుల్ని తీర్చిదిద్దటంపై (నమాజ్‌లో వరుసలు తీరి నిలబడటంపై) (3) ఇమామ్ వెనక నిలబడి ‘ఆమీన్’ అనటంపై”
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు- “యూదులు మీలోని ‘సలాం’ మరియు ‘ఆమీన్’లపై అసూయ చెందినంతగా మరేవిషయంలోనూ అసూయ చెందరు.” (సునన్ ఇబ్నె మాజ)
ఈ విధంగా ఉదాహరించసాగితే మరెన్నో హదీసులు వస్తాయి. ఇక భారత ఉపఖండానికి చెందిన కొంతమంది సుప్రసిద్ధ విద్వాంసులు దీని గురించి ఏమంటున్నారో చూద్దాం –
షేఖ్ అబ్దుల్ హఖ్ ముహద్దిస్ దహెల్వీ ఇలా అంటున్నారు – “దైవప్రవక్త ﷺ జహ్రీ నమాజులలో ఆమీన్ బిగ్గరగా పలికేవారు. వెనుకనున్న అనుయాయులు కూడా ఆయన్ను అనుసరించేవారు. బిగ్గరగా ఆమీన్ పలకాలన్న హదీసులు అధికంగానూ, బలవత్తరంగానూ ఉన్నాయి.”
హజ్రత్ షాహ్ ఇస్మాయీల్ షహీద్ (రహిమహుల్లాహ్) ఇలా వ్యాఖ్యానించారు: “బిగ్గరగా ఆమీన్ పలకాలన్న హదీసులు ఎక్కువగానూ, సుస్పష్టంగానూ ఉన్నాయి.”
మౌలానా అబ్దుల్ హై లక్నోవి (ఈయన హనఫీ ఆలిమ్) ఇలా అభిప్రాయపడ్డారు: “ప్రమాణబద్ధమైన ఆధారాల వెలుగులో చూసినపుడు ఆమీన్ను బిగ్గరగా పలకమని అనటమే న్యాయం.” ఆ మాటే ఆయన ‘సఅయ’లో మరింత స్పష్టంగా విడమరచి చెప్పారు. ఆయన ఇలా అన్నారు – “నెమ్మదిగా ఆమీన్ పలకాలి అని అంటున్న ఉల్లేఖనాలు బలహీనమైనవి (జయీఫ్). బిగ్గరగా ఆమీన్ పలకాలంటున్న ఉల్లేఖనాలతో ఇవి పోటీపడలేవు.”
ఇంత చర్చ జరిగాక ఈ విషయమై ఇంకా వ్యాఖ్య అనవసరం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 222
హదీసు 223
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ أَبِي أَوْفَى -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَقَالَ : إِنِّي لَا أَسْتَطِيعُ أَنْ آخُذَ مِنْ اَلْقُرْآنِ شَيْئًا , فَعَلِّمْنِي مَا يُجْزِئُنِيٌ]مِنْهُ]، فَقَالَ : قُلْ : سُبْحَانَ اَللَّهِ , وَالْحَمْدُ لِلَّهِ , وَلَا إِلَهَ إِلَّا اَللَّهُ وَاَللَّهُ أَكْبَرُ , وَلَا حَوْلٌ وَلَا قُوَّةً إِلَّا بِاَللَّهِ اَلْعَلِيِّ اَلْعَظِيمِ… } اَلْحَدِيثَ. رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ , وَاَلدَّارَقُطْنِيُّ, وَالْحَاكِمُ.
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, ‘నేను దివ్య ఖుర్ఆన్లోని ఏ భాగాన్నీ జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాను. కనుక దీనికి ప్రత్యామ్నాయం కాగల మరేదయినా నాకు ఉపదేశించండి’ అని విన్నవించుకున్నాడు. దీనికి ఆయన ﷺ, “సుబ్హానల్లాహి వల్ హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్” పఠించమని సూచించారు. (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్, దారె ఖుత్నీ, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Narrated 'Abdullah bin Abi Aufa (RA): A man came to the Prophet (ﷺ) and said, "I cannot memorize anything from the Qur'an, so teach me something which can be a substitute for me." He said, "Say Subhan Allah (Allah is Free of Imperfections) walhamdu lillah (and praise is to Allah), wa la ilaha illa-Allah (and there is nothing worthy of worship except Allah), wallahu akbar (and Allah is the Most Great), wa la hawla wa la quwwata illa billah al-'Ali al-'Adheem (and there is no might and no strength but in Allah, the Most High, the Supreme)" [Reported by Ahmad, Abu Dawud and An-Nasa'i; and Ibn Hibban, ad-Daraqutni and Al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
ఎవరికయినా ఖుర్ఆన్లో ఏ కొంత భాగం కూడా (చిన్న చిన్న సూరాలు కూడా) జ్ఞాపకం లేకపోతే వారు గత్యంతరం లేని స్థితిలో పై వచనాలను పఠించినా నమాజ్ నెరవేరుతుంది అని ఈ హదీసు చెబుతోంది. ఇక ఎవరయినా దీనిని ఒక ఆధారంగా తీసుకుని ‘నమాజ్‌లో సూరె ఫాతిహా చదవటం విధి కాద’ని వాదిస్తే ఇది మరీ చాదస్తం అనిపించుకుంటుంది. ఎందుకంటే ఇది గత్యంతరం లేని పరిస్థితి. ఒక వ్యక్తికి ఏమీ జ్ఞాపకం లేని స్థితిలో ప్రవక్త అతనికి అతి సులభమయిన ఒక ‘కలిమా’ నేర్పారు. ఇదొక తాత్కాలిక స్థితి. ఇలాంటి వారికోసం షరీయత్ రాయితీ కల్పిస్తుంది. కొత్తగా కలిమా పఠించి ఇస్లాంలోకి ప్రవేశించిన వ్యక్తికి ఆ క్షణం నుంచే నమాజ్ చేయవలసి ఉంటుంది. మరి అతనికి నమాజ్‌లో ఏం చదవాలో తెలీదు. ఈ కారణంచేత అతన్ని నమాజ్ చేయరాదని అంటామా? నమాజ్‌ను పూర్తిగా నేర్చుకునేంతవరకూ ఆ వ్యక్తి మౌనంగా నిలబడినా, వచ్చినమటుకే చదివినా దైవసన్నిధిలో అతని నమాజ్ స్వీకారయోగ్యమవుతుంది.
ఇంతకీ చెప్పవచ్చిందేమంటే గత్యంతరం లేని స్థితి అందరికీ వర్తించదు. ఆ స్థితి వర్తించవలసిన వారికే వర్తిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఆసరాగా తీసుకుని అందరూ అసలు విషయం నుండి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయకూడదు. నమాజ్‌లో – దివ్య గ్రంథ పారాయణం అన్నప్పుడు ఫాతిహా సూరా పఠనం కూడా అందులో ఇమిడి ఉందని మరువరాదు.
హదీసు ఉల్లేఖకులు
అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు). మారుపేరు అబూ ముహమ్మద్ లేక అబూ ముఆవియ. ఈయన తండ్రి పేరు అల్ఖమ బిన్ హారిస్ అస్లమీ. తండ్రీ కొడుకులిరువురూ సహాబీలే. ఈయన హుదైబియా ఒడంబడిక లోనూ, ఖైబర్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన యుద్ధాల్లో కూడా వచ్చారు. దైవప్రవక్త ﷺ మరణానంతరం కూఫా వైపునకు ప్రస్థానం చేశారు. హిజ్రీ 87లో మరణించారు. కూఫాలో మరణించిన సహాబీలలో అందరికన్నా చివరివారు ఈయనేనని అంటారు. వయసు పెరిగిన కొద్దీ కంటిచూపు తగ్గిపోసాగింది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 223
హదీసు 224
وَعَنْ أَبِي قَتَادَةَ - رضى الله عنه - قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يُصَلِّي بِنَا , فَيَقْرَأُ فِي اَلظُّهْرِ وَالْعَصْرِ - فِي اَلرَّكْعَتَيْنِ اَلْأُولَيَيْنِ - بِفَاتِحَةِ اَلْكِتَابِ وَسُورَتَيْنِ , وَيُسْمِعُنَا اَلْآيَةَ أَحْيَانًا , وَيُطَوِّلُ اَلرَّكْعَةَ اَلْأُولَى , وَيَقْرَأُ فِي اَلْأُخْرَيَيْنِ بِفَاتِحَةِ اَلْكِتَابِ. } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మాకు నమాజ్ చేయించినపుడు – జుహ్ర్, అస్ర్ల మొదటి రెండు రకతులలో ఫాతిహా సూరాతోపాటు మరో రెండు సూరాలు పఠించేవారు. ఒక్కోసారి మాకు ఏదన్నా ఒక ఆయత్‌ను వినిపించేవారు కూడా. మొదటి రకత్ను సుదీర్ఘంగా చేసేవారు. ఆఖరి రెండు రకతులలో కేవలం ఫాతిహా సూరా పఠించేవారు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Qatadah (RA): Allah's Messenger (ﷺ) used to lead us in prayer and recite in the first two Rak'a of the Zuhr and 'Asr prayers Surat Al-Fatiha and two (other) Surah. And he would sometimes recite loud enough for us to hear the Verses. He would prolong the first Rak'a, and would recite in the last two Rak'a Surat Al-Fatiha (only). [Agreed upon].
సారాంశం
ఈ హదీసు ద్వారా కొన్ని విషయాలు చర్చకు వస్తాయి. (1) జుహ్ర్, అస్ర్ నమాజులలో ఖుర్ఆన్ పారాయణం నెమ్మదిగా జరగాలి. ఇందులో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. మరలాంటప్పుడు ఏదన్నా ఒక ఆయత్‌ను వినిపించటంలోని అంతర్యం ఏమై ఉంటుంది?! ఇందులో దాగివున్న ఒక పరమార్థం; ప్రస్తుతం ఆయన నమాజులో ఖుర్ఆన్లోని ఒకానొక భాగాన్ని పారాయణం చేస్తున్నారే తప్ప వేరొక స్మరణలో, దుఆలో నిమగ్నమై లేరు అని సహాబీలకు తెలియజేయటం కావచ్చు! రెండు : ఈ నమాజులో ఫలానా సూరా పఠించబడిందని నమాజీలకు తెలియజేయటం మరో ఉద్దేశ్యం కావచ్చు!!
(2) మొదటి రకత్లో ఖుర్ఆన్ పఠనం రెండవ రకత్లోని పఠనంకన్నా కాస్త అధికంగా ఉండాలన్న అంశం కూడా ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఇమామ్ అహ్మద్, ఇమామ్ షాఫయి, ఇమామ్ మాలిక్‌లతో పాటు ఇమామ్ ముహమ్మద్ దృక్పథం కూడా ఇదే. అయితే ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ అబూ యూసుఫ్‌ల దృష్టిలో మాత్రం రెండు రకతుల్లోనూ ఖుర్ఆన్ పారాయణం సమంగా ఉండాలి. జుహ్ర్, అస్ర్ నమాజుల్లోని మొదటి రకతులు సుదీర్ఘంగా ఉండేవని మూలాంశం ద్వారా రూఢీ అవుతోంది. ఆయన ﷺ అలా ఎందుకు చేసేవారు? ఆలస్యంగా వచ్చే ప్రజలకు కూడా మొదటి రకత్ లభించాలన్నది ఒక పరమార్థం అయి ఉండవచ్చు!
(3) జుహ్ర్, అస్ర్లలోని ఆఖరి రెండు రకతులలో అల్హం సూరా తప్ప మరో సూరా పఠించేవారు కాదని ఈ హదీసు ద్వారా తెలియ వస్తోంది. అయితే మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆఖరి రెండు రకతులలో కూడా మరో సూరా పఠించవచ్చని ఉంది. అందువల్ల ఫాతిహా సూరాతో పాటు మరేదయినా సూరా కూడా ఆఖరి రకతులలో ఎవరయినా పారాయణం చేస్తే అందులో విపరీతం ఏమీ లేదు.
(4) సిర్రీ నమాజులలో (అంటే మెల్లగా చదివే నమాజులలో) ఏదన్నా ఒక వాక్యం (ఆయత్) బిగ్గరగా చదివినంత మాత్రాన “సజ్దా సహూ” తప్పనిసరికాదు. దైవప్రవక్త ﷺ ఒకటి రెండు సార్లు కాదు, అనేకసార్లు ఈ విధంగా చేసినట్లు ఆధారాలున్నాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 224
హదీసు 225
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - قَالَ : { كُنَّا نَحْزُرُ قِيَامَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -فِي اَلظُّهْرِ وَالْعَصْرِ , فَحَزَرْنَا قِيَامَهُ فِي اَلرَّكْعَتَيْنِ اَلْأُولَيَيْنِ مِنْ اَلظُّهْرِ قَدْرَ : (الم تَنْزِيلُ) اَلسَّجْدَةِ. وَفِي اَلْأُخْرَيَيْنِ قَدْرَ اَلنِّصْفِ مِنْ ذَلِكَ. وَفِي اَلْأُولَيَيْنِ مِنْ اَلْعَصْرِ عَلَى قَدْرِ اَلْأُخْرَيَيْنِ مِنْ اَلظُّهْرِ , وَالْأُخْرَيَيْنِ عَلَى النِّصْفِ مِنْ ذَلِكَ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం: మేము జుహ్ర్, అస్ర్లలో దైవప్రవక్త ﷺ ఖుర్ఆన్ పారాయణాన్ని అంచనా వేసేవాళ్ళం. మా అంచనా ప్రకారం ఆయన ﷺ జుహ్ర్ యొక్క మొదటి రెండు రకతులలో ‘సూరె సజ్దా’ పారాయణం చేసినంత సమయం తీసుకునేవారు. ఆఖరి రెండు రకతుల కోసం మొదటి రెండు రకతుల్లోని సగం సమయాన్ని తీసుకునేవారు. కాగా; అస్ర్లోని మొదటి రెండు రకతులకోసం జుహ్ర్లోని చివరి రెండు రకతులకు సమానమైన సమయం తీసుకునేవారు. ఇంకా అస్ర్లోని చివరి రెండు రకతులకై అస్ర్లోని మొదటి రెండు రకతుల్లోని సగం సమయం వెచ్చించేవారు.” (ముస్లిం)
English
Narrated Abu Sa'id Al-Khudri (RA): We used to estimate the length of the standing position of Allah's Messenger (ﷺ) in the Zuhr and 'Asr prayers, and we estimated that he stood in the first two Rak'a of the Zuhr prayer as long as it takes to recite Alif-Lam-Mim, Tanzil (Surat As-Sajdah) and in the last two Rak'a, half the time of that. And in the first two Rak'a of 'Asr, he used to stand as long as the last two of the Zuhr. And the last two Rak'a of 'Asr used to be of about half the time of the first two." [Reported by Muslim).
సారాంశం
ఈ హదీసు ద్వారా జుహ్ర్, అస్ర్ నమాజులలో దైవప్రవక్త ﷺ గారి ఖుర్ఆన్ పారాయణం పరిమాణం తెలియవస్తోంది. చివరి రెండు రకతులలో ఫాతిహా సూరాతోపాటు మరేదయినా సూరా పఠించటం మస్నూన్ అని కూడా దీనిద్వారా స్పష్టమవుతోంది. అలాగే కొన్ని సమయాల్లో పఠించకపోవటం కూడా మస్నూన్యేనని బోధపడుతున్నది. కనుక నమాజీ చివరి రెండు రకతులలో ఫాతిహా సూరాతో పాటు మరేదయినా సూరా చదువుకుంటే అందులో తప్పు పట్టాల్సిన పని ఏమీ లేదు. అలాగే చదవకపోవటం వల్ల వచ్చిన అనర్థం కూడా ఏమీ లేదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 225
హదీసు 226
وَعَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ - رضى الله عنه - قَالَ : { كَانَ فُلَانٍ يُطِيلُ اَلْأُولَيَيْنِ مِنْ اَلظُّهْرِ, وَيُخَفِّفُ اَلْعَصْرَ, وَيَقْرَأُ فِي اَلْمَغْرِبِ بِقِصَارِ اَلْمُفَصَّلِ وَفِي اَلْعِشَاءِ بِوَسَطِهِ وَفِي اَلصُّبْحِ بِطِوَالِهِ. فَقَالَ أَبُو هُرَيْرَةَ : "مَا صَلَّيْتُ وَرَاءِ أَحَدٍ أَشْبَهَ صَلَاةِ بِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -مِنْ هَذَا }. أَخْرَجَهُ النَّسَائِيُّ بِإِسْنَادٍ صَحِيحٍ
హజ్రత్ సులైమాన్ బిన్ యసార్ (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: “ఫలానా వ్యక్తి జుహ్ర్లోని మొదటి రెండు రకతులను సుదీర్ఘంగా చేస్తున్నారు (అంటే వీటిలో సుదీర్ఘంగా ఖుర్ఆన్ పఠిస్తున్నారు). అస్ర్ నమాజ్‌ను సంక్షిప్తంగా చేస్తున్నారు. మగ్రిబ్ నమాజులో చిన్న తరహా సూరాలు పఠిస్తున్నారు. ఇషా నమాజులో మధ్య తరహా సూరాలు పఠిస్తున్నారు. ఉదయం నమాజులో సుదీర్ఘమయిన సూరాలు పఠిస్తున్నారు.” (అని ఆయన చెప్పగా) ఇది విని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నేను ఎవరి ఇమామత్ (సారథ్యం)లో కూడా ఇంతకన్నా ఎక్కువగా దైవప్రవక్త ﷺ నమాజ్‌ను పోలిన నమాజ్‌ను చేయలేదు.” (నసాయి దీనిని ప్రామాణిక ఆధారాలతో ఉల్లేఖించారు).
English
Narrated Sulaiman bin Yasar: So-and-so used to prolong the first two Rak'a of the Zuhr prayer and shorten the 'Asr prayer, and recite the short Surah of Mufassal at Maghrib prayer, its medium Surah at the 'Isha' prayer, and its long ones at the Fajr prayer. Then Abu Hurairah (RA) said: "I never prayed behind anyone whose prayer more closely resembles that of Allah's Messenger (ﷺ) than this person." [Reported by an-Nasa'i with a Sahih (authentic) Isnad].
సారాంశం
దివ్య ఖుర్ఆన్లోని అల్ హుజ్రాత్ సూరా నుండి చివరి వరకు (సూరయె నాస్ వరకూ) గల సూరాలు ‘ముఫస్సలాత్’ అనబడతాయి. ఇందులోనూ మూడు రకాలున్నాయి. (1) చిన్న తరహా (2) మధ్య తరహా (3) పెద్ద తరహా సూరాలు. ఫజ్ర్ నమాజ్‌లో పెద్ద తరహా సూరాలు, ఇషా నమాజులో మధ్య తరహా సూరాలు, మగ్రిబ్ నమాజులో చిన్న తరహా సూరాలు పఠించటం మస్నూన్ (దైవప్రవక్త విధానం).
హదీసు ఉల్లేఖకులు
అసలు పేరు సులైమాన్ బిన్ యసార్ (రహిమహుల్లాహ్). మరోపేరు అబూ అయ్యూబ్. ఏడుగురు (సమకాలీన) అగ్రశ్రేణి ధర్మవేత్తలలో ఈయన కూడా ఒకరుగా పరిగణించబడ్డారు. దైవభక్తి పరాయణులు, ధర్మావగాహనలో సాటిలేని మేటి. అత్యుత్తమశ్రేణి పండితులు. అసంఖ్యాకమయిన హదీసులు ఈయనచేత ఉల్లేఖించబడ్డాయి. ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా)చే స్వేచ్ఛ నొసగబడిన బానిస.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 226
హదీసు 227
وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ - رضى الله عنه - قَالَ : { سَمِعْتَ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقْرَأُ فِي اَلْمَغْرِبِ بِالطُّورِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ జుబైర్ బిన్ ముత్యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం: “నేను దైవప్రవక్త ﷺను మగ్రిబ్ నమాజులో తూర్ సూరా పఠించగా విన్నాను.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Jubair bin Mut'im (RA): I heard Allah's Messenger (ﷺ) reciting at-Tur (the Mountain – Surat No. 52) in the Maghrib (sunset) prayer. [Agreed upon).
సారాంశం
సాధారణంగా దైవప్రవక్త ﷺ మగ్రిబ్ నమాజులో చిన్న సూరాలనే చదివేవారు. అయితే ఎప్పుడయినా ఒక్కోసారి (ఈ హదీసులో వచ్చినట్లు) పెద్ద సూరాలు కూడా పారాయణం చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం అద్దుఖాన్, సాఫ్ఫాత్ లాంటి పెద్ద సూరాలు కూడా మగ్రిబ్ నమాజ్‌లో చదివారని ఉంది. ప్రయాణ సమయాల్లో ఆయన ﷺ ఫజ్ర్ నమాజ్‌లో కేవలం ‘ముఅవ్వజతైన్’ (సూరయే ఫలఖ్, సూరయే నాస్‌లు) పఠించేవారని కూడా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. ఇంతకీ చెప్పవచ్చిందేమంటే, లోగడ వచ్చిన హదీసు (హదీసు నెంబరు 226) ప్రకారమే సాధారణంగా ఆయన ﷺ ఆచరణ ఉండేది. కాకపోతే అప్పుడప్పుడు ఈ ‘మామూలు’లో మార్పు ఉండేది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 227
హదీసు 228
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقْرَأُ فِي صَلَاةِ اَلْفَجْرِ يَوْمَ اَلْجُمْعَةِ : (الم تَنْزِيلُ ) اَلسَّجْدَةَ , و (هَلْ أَتَى عَلَى اَلْإِنْسَانِ) } مُتَّفَقٌ عَلَيْهِ وَلِلطَّبَرَانِيِّ مِنْ حَدِيثِ اِبْنِ مَسْعُودٍ : { يُدِيمُ ذَلِكَ }
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ శుక్రవారం నాడు ఫజ్ర్ నమాజు మొదటి రకత్లో సూరయే సజ్దా (అలిఫ్-లామ్-మీమ్. తన్జీలు), రెండవ రకత్లో సూరయే దహర్ (హల్ అతా అలల్ ఇన్సాని) చదివేవారు (బుఖారీ, ముస్లిం). తబ్రానీలో ఇబ్నె మస్‌వూద్ ఉల్లేఖనంలో – “ఆయన నిత్యం ఇలాగే చేసేవారు” అని ఉంది.
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) used to recite during the Fajr prayer of Friday Alif-Lam-Mim, Tanzil… (as-Sajdab – Surat no. 32) and Hal ata 'alal-Insani… (al-Insan – Surat no. 76), which is also called Surat ad-Dahr). [Agreed upon].
at-Tabarani narrated the Hadith of Ibn Mas'ud which has the addition "… he [the Prophet (ﷺ)] did that constantly."
సారాంశం
దైవప్రవక్త ﷺ శుక్రవారం నాడు ఈ రెండు సూరాలనే ఎందుకు ఎన్నుకున్నారు? దీని గురించి షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “ఈ రెండు సూరాలలో ఆదం సృష్టి గురించి, ప్రళయదినాన హష్ర్ మైదానంలో మానవులంతా సమావేశపరచబడటం గురించి వివరంగా వచ్చింది. ప్రళయం కూడా శుక్రవారం నాడే సంభవిస్తుంది. ఈ కారణంగా దైవప్రవక్త ﷺ శుక్రవారం నాటి నమాజులో ఈ రెండు సూరాలను ప్రత్యేకంగా ఎన్నుకుని తన అనుచర సమాజంలో మానవసృష్టి పరమార్థాన్ని, పరలోక చింతనను పాదుకొల్పాలని తలంచి ఉండవచ్చు.”
అందుచేత శుక్రవారం నాడు ఉదయం ఫర్జ్ నమాజులో ఈ రెండు సూరాలను పఠించటం సంప్రదాయం. ఏ ఆచరణను దైవప్రవక్త ﷺ నిత్యం పాటించారో దానిని మనం కూడా పాటించటం మస్నూన్. అయితే ఈ రెండు సూరాలు తప్ప ఇతర సూరాలు పఠించటం వల్ల నమాజ్ నెరవేరదని దీని భావం ఎంతమాత్రం కాదు. ఏ సూరాలు ఎన్నుకున్నా నమాజ్ నెరవేర్పులో ఎలాంటి దోషం ఏర్పడదు. కాకపోతే దైవప్రవక్త ﷺ నెలకొల్పిన ఒక ఆదర్శాన్ని అవలంబించటంలో అపారమయిన శుభాలు ఇమిడి ఉంటాయి. ఇప్పటికీ అహ్లె హదీసు వారు వీలయినంతవరకు ఫజ్ర్ నమాజ్‌లో శుక్రవారంనాడు ఈ రెండు సూరాలనే పఠిస్తారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 228
హదీసు 229
وَعَنْ حُذَيْفَةَ - رضى الله عنه - قَالَ : { صَلَّيْتُ مَعَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَمَا مَرَّتْ بِهِ آيَةُ رَحْمَةٍ إِلَّا وَقَفَ عِنْدَهَا يَسْأَلُ, وَلَا آيَةُ عَذَابٍ إِلَّا تَعَوَّذَ مِنْهَا } أَخْرَجَهُ اَلْخَمْسَةُ , وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ
హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺతో కలిసి నమాజ్ చేశాను. దైవ కారుణ్య ప్రస్తావన ఉన్న ఆయత్లు వచ్చినపుడు ఆయన ﷺ ఆగి కారుణ్యాన్ని అర్థించేవారు. శిక్షకు సంబంధించిన ఆయత్లు వచ్చినపుడు కొద్దిగా ఆగి దాని బారినుండి దేవుని శరణు కోరేవారు. (అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా ఐదుగురూ దీనిని ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ‘హసన్’గా నిర్ధారించారు)
English
Narrated Hudhaifah (RA): I prayed with the Prophet (ﷺ) and (noticed that) whenever he came to a verse which spoke of mercy, he stopped and made supplication, and whenever he came to a verse which spoke of punishment, he stopped and sought refuge in Allah against it." [Reported by Al-Khamsah, and at-Tirmidhi graded it Hasan (good)].
సారాంశం
ఈ ఆచరణ బహుశా తహజ్జుద్ నమాజ్‌కు సంబంధించినది. ముస్నద్ అహ్మద్‌లో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ద్వారానూ, వేరితర ఉల్లేఖనాల ద్వారానూ, దైవప్రవక్త ﷺ తహజ్జుద్ నమాజ్‌లో ఈ విధంగా చేసేవారని తెలుస్తున్నది. ఒకవేళ ఈ విధంగా ఫర్జ్ నమాజులో చేసినా తప్పులేదు – అయితే ఒంటరిగా నమాజ్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తే ఫరవాలేదు. సామూహిక నమాజులో ఇలా చేయటం వల్ల ఇతరుల్ని ఇబ్బందుల్లో పడవేసినట్లవుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 229
హదీసు 230
وَعَنْ اِبْنِ عَبَّاسٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَلَا وَإِنِّي نُهِيتُ أَنْ أَقْرَأَ اَلْقُرْآنَ رَاكِعًا أَوْ سَاجِدًا , فَأَمَّا اَلرُّكُوعُ فَعَظِّمُوا فِيهِ اَلرَّبَّ , وَأَمَّا اَلسُّجُودُ فَاجْتَهِدُوا فِي اَلدُّعَاءِ , فَقَمِنٌ أَنْ يُسْتَجَابَ لَكُمْ } رَوَاهُ مُسْلِمٌ
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “ప్రజలారా! వినండి. నేను రుకూ, సజ్దాలలో ఖుర్ఆన్ పారాయణం చేయడాన్ని వారించబడింది. కనుక రుకూలో మీ ప్రభువు ఔన్నత్యాన్ని కొనియాడండి. సజ్దాలో దుఆ చేసేందుకు ప్రయత్నించండి – తద్వారా మీ దుఆ స్వీకరించబడవచ్చు.” (ముస్లిం)
English
Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "I have been forbidden to recite the Qur'an while bowing or prostrating; so while in the bowing (position) glorify (the Perfection of) the Rabb (Lord), and while in the prostrating (position) be earnest in supplication, for it is fitting that your supplications may be answered." [Reported by Muslim].
సారాంశం
నమాజ్‌లో వివిధ అర్కాన్ (ముఖ్యాంశాలు)లున్నాయి. వాటిలో ప్రతిదీ వైవిధ్యంతో కూడుకున్నది. ఒక్కో ‘రుకన్’లో దైవధ్యానం చేసే పద్ధతి ఒక్కోవిధంగా ఉంది. తదనుగుణంగానే వాటిని పాటించటం సున్నత్ (సంప్రదాయం). దైవప్రవక్త ﷺ రుకూ, సజ్దాలలో ఖుర్ఆన్ పారాయణం చేయడాన్ని వారించారు. ఖుర్ఆన్ పారాయణం ‘ఖియామ్’ స్థితిలో మాత్రమే జరగాలి. రుకూలో ‘సుబ్హాన రబ్బియల్ అజీమ్’ అంటూ దేవుని ఘనత్వాన్ని కీర్తించాలి. సజ్దాలో దైవాన్ని వేడుకోమని ప్రవక్త ﷺ వారు బోధించారు. కొంతమంది హదీసు వేత్తల మరియు ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ల అభిప్రాయంలో రుకూలో దేవుని ఘనత్వం, సజ్దాలో వేడుకోలు (దుఆ) తప్పనిసరి. అయితే అత్యధిక మంది ఉలమా దీనిని ముస్తహబ్ (అభిలషణీయం)గా భావించారు. దుఆ స్వీకరించబడే సందర్భాలలో ‘సజ్దా’ ముఖ్యమైనది. అందుకే దైవప్రవక్త ﷺ సజ్దా స్థితిలో దుఆ చేయమని ఉద్బోధించారు. ఆయన స్వయంగానూ సజ్దాలో అనేక వేడుకోళ్ళు చేసేవారు. వాటిలో ఒక దుఆ దీని తరువాతి హదీసులో రాబోతున్నది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 230
హదీసు 231
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: فِي رُكُوعِهِ وَسُجُودِهِ : "سُبْحَانَكَ اَللَّهُمَّ]رَبَّنَا] وَبِحَمْدِكَ , اَللَّهُمَّ اِغْفِرْ لِي } مُتَّفَقٌ عَلَيْهِ
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు: దైవప్రవక్త ﷺ రుకూ సజ్దాలలో ఈ విధంగా వేడుకునేవారు – “సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక. అల్లాహుమ్మగ్ఫిర్లీ” (నీవు పవిత్రుడవు. ఓ అల్లాహ్! ఓ మా ప్రభూ! ప్రశంసలు, పొగడ్తలు నీకే తగును. ఓ అల్లాహ్! నన్ను క్షమించు). (బుఖారీ, ముస్లిం)
English
Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) used to say while bowing and prostrating Subhanaka Allahumma Rabbana wa bihamdika, Allahumma ighfir li (How Perfect You are, O Allah, Our Rabb, and praise is to You, O Allah, forgive me)." [Agreed upon].
సారాంశం
రుకూలో ‘సుబ్హాన రబ్బియల్ అజీమ్’, సజ్దాలో ‘సుబ్హాన రబ్బియల్ ఆలా’ అని అనటంతోపాటు పైన పేర్కొనబడిన దుఆ కూడా చేయవచ్చన్న దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. “ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్హు” సూరా అవతరించినప్పటి నుండీ ఆయన ﷺ నిత్యం ఈ ‘దుఆ’ నే రుకూ సజ్దాలలో చేసేవారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ద్వారా తెలుస్తున్నది. కాబట్టి నమాజీలు ఈ మస్నూన్ దుఆలలో ఏదో ఒక దానిని అప్పుడప్పుడూ చదువుతూ ఉండటం మంచిది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 231
హదీసు 232
وَعَنْ أَبِي هُرَيْرَةَ --رَضِيَ اَللَّهُ عَنْهُ-- قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا قَامَ إِلَى اَلصَّلَاةِ يُكَبِّرُ حِينَ يَقُومُ , ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْكَعُ , ثُمَّ يَقُولُ : "سَمِعَ اَللَّهُ لِمَنْ حَمِدَهُ" حِينَ يَرْفَعُ صُلْبَهُ مِنْ اَلرُّكُوعِ , ثُمَّ يَقُولُ وَهُوَ قَائِمٌ : "رَبَّنَا وَلَكَ اَلْحَمْدُ" ثُمَّ يُكَبِّرُ حِينَ يَهْوِي سَاجِدًا , ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ, ثُمَّ يُكَبِّرُ حِينَ يَسْجُدُ ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ , ثُمَّ يَفْعَلُ ذَلِكَ فِي اَلصَّلَاةِ كُلِّهَا , وَيُكَبِّرُ حِينَ يَقُومُ مِنْ اِثْنَتَيْنِ بَعْدَ اَلْجُلُوسِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ కొరకు నిలబడగానే అల్లాహు అక్బర్ అని పలికేవారు. రుకూలోకి వెళుతున్నప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని అనేవారు. రుకూచేసి నిలబడే సమయంలో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అని చెప్పి నిలబడేవారు. అలా నిలబడిన మీదట ‘రబ్బనా వలకల్ హమ్ద్’ అని పలికేవారు. సజ్దా స్థితిలోకి వెళుతున్నప్పుడు తక్బీర్ పలికి సజ్దా కొరకు వంగేవారు. సజ్దా నుండి లేస్తూ కూడా అల్లాహు అక్బర్ అనేవారు. తిరిగి సజ్దాలోకి వెళుతూ అల్లాహు అక్బర్ అనేవారు. మళ్ళీ సజ్దానుండి తల ఎత్తేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అనేవారు. తరువాత నమాజ్ అంతా ఇలాగే చేసేవారు. రెండవ రకత్ (పూర్తయిన) తరువాత తషహ్హుద్ చదివి లేచేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని పలికేవారు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Hurairah (RA): When Allah's Messenger (ﷺ) got up to pray, he would say the Takbir when standing up, then would say the Takbir when bowing, then he would say Sami'Allahu liman hamidah (Allah listens to him who praises Him) when rising up from the bowing position, then he would say while standing Rabbana wa lakal-hamd (our Rabb, the praise is Yours), then he would say the Takbir when going down for prostration, then when raising his head up, then when he prostrated again, then when raising his head up. He would then do that throughout the whole Salat (prayer) and he would say the Takbir when he got up – at the end of two Rak'a – from the sitting position." [Agreed upon].
సారాంశం
నమాజ్‌లో పలకబడే మొట్టమొదటి తక్బీర్‌ను ‘తక్బీరె తహ్రీమా’ లేక ‘తక్బీరె ఊలా’ అంటారు. ఈ తక్బీర్ పలకగానే మనిషి నమాజ్‌లో ప్రవేశిస్తాడు. ఆ క్షణంనుంచి నమాజ్ ముగించే వరకూ సాధారణ సమయాలలో అతని కొరకు హలాల్ అయివున్నవన్నీ ఇప్పుడు ‘హరామ్’ అయిపోతాయి. మిగిలిన తక్బీర్లను ‘తక్బీరాతె ఇన్తిఖాల్’ గా వ్యవహరిస్తారు. అంటే మనిషి నమాజ్‌లో ఒక రుకున్లోనుంచి మరో రుకున్లోకి బదిలీ అవుతూ తక్బీర్ పలకటం వల్ల ‘ఇన్తిఖాల్’ అనే పదం ఉపయోగించబడింది. ఇన్తిఖాల్ అంటే బదిలీ, ప్రస్థానం అనే అర్థాలువస్తాయి. నమాజ్‌లో మొదటి తక్బీర్ ఫర్జ్ (విధి)కాగా, మిగిలిన తక్బీర్లను కొందరు వాజిబ్ (తప్పనిసరి) గా భావించారు. కాని అధిక సంఖ్యాకులు వీటిని మస్నూన్ (సంప్రదాయం)గా భావించారు.
బనూ ఉమయ్య పరిపాలనా కాలంలో కొంతమంది అధికారులు ఈ తక్బీర్లను అప్రస్తుతమైనవిగా భావించి వాటిని పరిత్యజించసాగారు. కాని ఆ కాలంలో తాబయీలు, ధర్మవేత్తలు సంస్కరణకు నడుం బిగించి ఈ తక్బీర్ల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు బోధపర్చారు. ఆ విధంగా వారు దైవప్రవక్త ﷺ ఆచార సంప్రదాయాల పరంపర తెగిపోకుండా కాపాడారు. ఆ మాటకు వస్తే అన్ని కాలాల్లోనూ సత్యప్రేమికులయిన పండితులు, ధర్మవేత్తలు తమ గురుతర బాధ్యతను గుర్తెరిగి, దురాచారాలకు లోనవుతున్న ప్రజాబాహుళ్యాన్ని దైవప్రవక్త ﷺ విధానం వైపునకు మరల్చాలి. ధర్మంలో కొత్త పుంతలు తొక్కే పరిపాలకులకు కళ్ళెం వేయాలి. దీనికొరకు వారు ప్రజాచైతన్యాన్ని మేల్కొలుపుతూ ఉండాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 232
హదీసు 233
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ --رَضِيَ اَللَّهُ عَنْهُ-- قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا رَفَعَ رَأْسَهُ مِنْ اَلرُّكُوعِ قَالَ : " اَللَّهُمَّ رَبَّنَا لَكَ اَلْحَمْدُ مِلْءَ اَلسَّمَوَاتِ وَاَلْأَرْضِ , وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ , أَهْلَ اَلثَّنَاءِ وَالْمَجْدِ , أَحَقُّ مَا قَالَ اَلْعَبْدُ - وَكُلُّنَا لَكَ عَبْدٌ - اَللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ , وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ , وَلَا يَنْفَعُ ذَا اَلْجَدِّ مِنْكَ اَلْجَدُّ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ రుకూ నుండి తన తలను ఎత్తినపుడు ఈ దుఆ పఠించేవారు – “అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ అస్సమావాతి వల్ అర్ది వ మిల్అ మాషీత మిన్ షయ్యిన్ బాదు, అహ్లస్సనాయి వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు – వ కుల్లునా లక అబ్దున్ -అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనాత వలా యన్‌ఫవు జల్జద్ది మిన్కల్ జద్దు.” (ముస్లిం) (అర్థం: ఓ అల్లాహ్! మా ప్రభూ! ప్రశంస కేవలం నీ కొరకే. భూమ్యాకాశాలు నిండిపోయేంత ప్రశంస! ఆ తరువాత నీవు కోరిన ప్రతిదీ నిండిపోయేంత ప్రశంస (నీకు మాత్రమే శోభిస్తుంది). ఓ ఘనతకు, మరియు పొగడ్తలకధిపతీ! దాసులు పొగిడే ప్రతిదానికీ నీవు అర్హుడవు. అందరూ నీ దాసులే. ఓ అల్లాహ్! నీవు ఏది ప్రసాదించినా దాన్ని ఎవరూ అడ్డుకోజాలరు. మరి నీవు దేనిని ఇవ్వకున్నా దానిని ఇతరులెవరూ ఇవ్వజాలరు. ఇంకా – ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం కూడా నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చలేవు)
English
Narrated Abu Sa'id Al-Khudri (RA) Allah's Messenger (ﷺ) used to say while raising his head after bowing: "Allahumma Rabbana lakal-hamdu mil'as-samawati wal-ardi, wa mil'a ma shi'ta min shai'in ba'du, ahlaththana'i wal-majdi, ahaqqu ma qal-al'abdu, wa kulluna laka 'abdun. Allahumma la mani'a lima a'taita, wa la mu'tiya lima man'ata, wa la yanfa'u dhal-jaddi minka-l-jaddu (O Allah, our Rabb (Lord), to You is praise in all the heavens and all the earth, and all that You Will (to create) afterwards, O You, Who are worthy of praise and glory, the most worthy of what a slave says – and we are all Your slaves: no one can withhold what You give, or give what You withhold, and riches cannot avail a wealthy person against You." [Reported by Muslim].
సారాంశం
రుకూ చేసి నిలబడిన తరువాత (ఖౌమ స్థితిలో) ఈ దుఆ చేయటం సంప్రదాయం అన్నదానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ఈ దుఆ కేవలం నఫిల్ నమాజుకే ప్రత్యేకం అని వాదించే వారివద్ద ఏ నిదర్శనమూ లేదు. అది వారు ఏర్పరచుకున్న భావం మాత్రమే. ‘ముస్లిం’లో పొందుపరచబడి వున్న బరా బిన్ ఆజిబ్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖనం ఈ ఊహను పటాపంచలుచేస్తుంది. ఫర్జ్ నమాజులో ఈ దుఆ చేసినట్లు రుజువు ఉందని ఈ ఉల్లేఖనం స్పష్టం చేసింది.
అదీగాక ఈ దుఆలోని “వలా యన్‌ఫవు జల్జద్ది మిన్కల్ జద్దు” వాక్యం ద్వారా తేటతెల్లమై పోయింది- భూమ్యాకాశాల సృష్టికర్త సమక్షంలో మానవుని సిరిసంపదలు, ఆస్తి అంతస్థులు, అధికారాలు, అట్టహాసాలు దేనికీ పనికిరావని! అతని వంశపరంపరగానీ, అతని కులగోత్రాలు గానీ మనిషిని కాపాడలేవు. కేవలం అతని సదాచరణలు, అతనిలోని దైవభక్తి మాత్రమే అతన్ని రక్షిస్తాయి. ఒకరు ఉన్నత కుటుంబీకుడైనంత మాత్రాన, పుణ్యపురుషుని పుత్రరత్నమైనంత మాత్రాన దైవాగ్రహం నుండి తప్పించుకోలేడు. ఒకవేళ అదే సాధ్యమై ఉంటే దైవప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) కుమారుడు, హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) తండ్రి, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ ﷺ గారి పినతండ్రి అబూతాలిబ్లు కూడా దేవుని శిక్షనుండి తప్పించుకోగలిగేవారు. మహాప్రవక్త ﷺ తన కుటుంబీకులను పిలిపించి, సత్కార్యాలు చేయమని, తాను దైవ సమక్షంలో ఏ విధంగానూ సహాయపడలేనని స్పష్టం చేశారు. కన్న కూతురు హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) ను పిలిచి ఆయన ﷺ ఇలా ఉపదేశించారు: “ఫాతిమా! నీవు అంతిమ దైవప్రవక్త ﷺ పుత్రికనన్న భ్రమలో పడి ఉండకు. నేను నిన్ను దైవశిక్షనుండి ఏ విధంగానూ కాపాడలేను. కేవలం నా కూతురైనంత మాత్రాన నీవు దేవుని పట్టునుండి బయటపడలేవు. సదాచరణ చెయ్యి. అది మాత్రమే నిన్ను దైవశిక్షనుండి కాపాడవచ్చు.”
చూశారా ! వజ్రసంకల్పులైన దైవప్రవక్తలే తమ ఆప్తులను దేవుని పట్టునుండి కాపాడలేనపుడు, అంతిమ దైవ సందేశహరులు ﷺ సయితం తన సంతానానికి అభయం ఇవ్వలేనపుడు తమ తాత ముత్తాతల ఘనకార్యాల ఆధారంగా దైవసమక్షంలో ఇట్టే ఉత్తీర్ణులవగలమని ఎవరైనా ఎలా దావా చేయగలరు?
ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే నమాజ్‌లో (ఖౌమాలో) నిటారుగా నిలబడటంతోనే సరిపోదు, మస్నూన్ దుఆలలో ఏదైనా ఒకటి పఠించాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 233
హదీసు 234
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ : عَلَى اَلْجَبْهَةِ - وَأَشَارَ بِيَدِهِ إِلَى أَنْفِهِ - وَالْيَدَيْنِ , وَالرُّكْبَتَيْنِ , وَأَطْرَافِ اَلْقَدَمَيْنِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “నాకు ఏడు ఎముకల (అవయవాల) ఆధారంగా ‘సజ్దా’ చేయమని ఆదేశించబడింది – తన చేతుల సైగతో తెలిపారు- నుదురు మరియు ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "I have been commanded to prostrate on seven bones; on the forehead – and he pointed at his nose, the hands (the palms), the knees and the tips (toes) of the feet." [Agreed upon].
సారాంశం
నుదురు మరియు ముక్కు – రెండూ కలిపి ఒకే ఎముక (శరీరావయవం)గా పరిగణించబడిందని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఒకవేళ వాటిని వేర్వేరుగా లెక్కిస్తే మొత్తం ఎనిమిది అవయవాలు అవుతాయి. అందుచేత ఆ రెంటినీ ఒకే భాగంగా లెక్కించటం జరిగింది. ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, ఇమామ్ షాఫయిలతో పాటు ఇమామ్ అబూ హనీఫా గారి ప్రియ శిష్యులైన ఇమామ్ అబూ యూసుఫ్, ఇమామ్ ముహమ్మద్లు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. కేవలం నుదురు లేక కేవలం ముక్కును నేలకానించి చేసే సజ్దా అసంపూర్ణ సజ్దా అవుతుంది. దీనికి భిన్నంగా ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అవి రెండూ వేర్వేరు శరీర భాగాలని అన్నారు. ఆ రెంటిలో ఏ ఒక్క శరీర భాగం నేలకు ఆనినా సజ్దా అయిపోతుందని, అందులో ఎలాంటి వెలితి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఇది అధికసంఖ్యాకుల అభిప్రాయానికి భిన్నంగా ఉంది. ముగ్గురు ఇమాములు మరియు ఇద్దరు హనఫీ ఇమాములు ఒక వైపు ఉండగా ఒక్క అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారే తనదైన అభిప్రాయంపై నిలిచివున్నారు. పైగా ఆయన అభిప్రాయం పై హదీసుకు విరుద్ధంగా ఉంది. అందుచేత ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి అభిప్రాయం బలహీనమైనది. ఇబ్నె అబీ షైబాలో హజ్రత్ ఇక్రిమ (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడిన ఒక హదీసు ఇలా వుంది: దైవప్రవక్త ﷺ ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్న వైపునుంచి సాగిపోతున్నారు. అతని ముక్కు నేలకు తగలటంలేదు. అప్పుడాయన ﷺ ఇలా అన్నారు – “ఎవరి నుదురు మరియు ముక్కు నేలకు ఆనలేదో వారి నమాజ్ నెరవేరదు” అంటే సజ్దా స్థితిలో నుదుటితో పాటు ముక్కు కూడా నేలకు తగలటం అవసరం అన్నమాట!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 234
హదీసు 235
وَعَنْ اِبْنِ بُحَيْنَةَ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ إِذَا صَلَّى وَسَجَدَ فَرَّجَ بَيْنَ يَدَيْهِ , حَتَّى يَبْدُوَ بَيَاضُ إِبِطَيْهِ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె బుహైన (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ సందర్భంగా సజ్దా చేసినప్పుడు తన రెండు భుజాలను తన రెండు ప్రక్కలనుండి వేరుగా ఉంచేవారు – ఆ స్థితిలో ఆయన ﷺ చంకల తెలుపుదనం సయితం కనిపించేది.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Ibn Buhainah (RA): When the Prophet (ﷺ) prostrated while praying, he used to spread out his arms so that the whiteness of his armpits would be visible. [Agreed upon].
సారాంశం
అంటే దైవప్రవక్త ﷺ సజ్దా స్థితిలో ముడుచుకుపోకుండా తన రెండు చేతులను కొంత విస్తరింపజేసేవారు. ఆ స్థితిలో ఆయన ﷺ చంకల తెలుపుదనం సయితం కానవచ్చేది. ఈ హదీసు ఆధారంగా ఇమామ్ తబ్రీ తదితరులు ఇలా అంటున్నారు: దైవప్రవక్త ﷺ గారి చంకలు శరీరంలోని ఇతర అవయవాల్లా తెల్లగా ఉండేవి – నల్లగా ఉండేవి కావు. ఆయనలోని ఇతర ప్రత్యేకతల మాదిరిగా ఇది కూడా ఒక ప్రత్యేకతే అనుకోవాలి.
హదీసు ఉల్లేఖకులు
ఇబ్నె బుహైన (రదియల్లాహు అన్హు) గారి పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ మాలిక్ బిన్ ఖిష్బ్. బుహైన అనేది ఆయన తల్లి పేరు. తల్లి పేరుతోనే ఆయన ప్రసిద్ధిచెందారు. తండ్రి పేరు మాత్రం మాలిక్. తొల్దొలి కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. కఠోర అభ్యాసాలు జరిపేవారు. అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. ఇహలోకంతో నామమాత్రపు సంబంధం పెట్టుకునేవారు. మదీనాకు 30 మైళ్ళ దూరంలో వున్న రిమ్ లోయలో హిజ్రీ 54 – 58 మధ్య కాలంలో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 235
హదీసు 236
وَعَنْ اَلْبَرَاءِ بْنِ عَازِبٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا سَجَدْتَ فَضَعْ كَفَّيْكَ , وَارْفَعْ مِرْفَقَيْكَ } رَوَاهُ مُسْلِمٌ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “నీవు సజ్దా చేసినపుడు నీ అరచేతులను నేలకు ఆనించు, మోచేతులను పైకి లేపు.” (ముస్లిం)
English
Narrated Al-Bara' bin 'Azib (RA): Allah's Messenger (ﷺ) said: "When you prostrate, place the palms of your hands on the ground and raise your elbows." [Reported by Muslim).
సారాంశం
సజ్దా స్థితిలో రెండు చేతులను నేలపై పరచటంగానీ, మోచేతులను తొడలకు ఆనించి అలసట తీర్చుకోవటం వంటివి గానీ చేయరాదనీ పై హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. దైవప్రవక్త ﷺ గారు ఏ విధంగా నమాజ్ చేశారో ఆ విధంగానే మనం కూడా నమాజ్ చేయాలి.
హదీసు ఉల్లేఖకులు
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) మరో పేరు అబూ అమ్మార. తండ్రి పేరు ఆజిబ్ బిన్ హారిస్ బిన్ అదీ. అన్సార్‌కు చెందిన ఔస్ తెగతో ఈయనకు సంబంధం ఉండేది. తండ్రీ కొడుకులిరువురూ సహాబీలే. బరా బిన్ ఆజిబ్ పిన్న వయస్సు మూలంగా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయారు. ఉహద్ సంగ్రామంలోనో, కందక యుద్ధంలోనో తొలిసారిగా యుద్ధరంగ ప్రవేశం చేశారు. ‘రే’ ను జయించారు. జమల్, సిఫ్ఫీన్, నహర్ వాన్ యుద్ధాలలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మద్దతుదారునిగా నిలిచారు. కూఫాలో హిజ్రీ 72లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 236
హదీసు 237
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ إِذَا رَكَعَ فَرَّجَ بَيْنَ أَصَابِعِهِ , وَإِذَا سَجَدَ ضَمَّ أَصَابِعَهُ } رَوَاهُ اَلْحَاكِمُ.
హజ్రత్ వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ రుకూలో ఉన్నప్పుడు తన (చేతి) వ్రేళ్ళను విప్పి (చాచి) ఉంచేవారు. మరదే సజ్దా స్థితిలో మాత్రం తన (చేతి) వ్రేళ్ళను పరస్పరం కలిపి ఉంచేవారు.” (ముస్తద్రక్ హాకిమ్)
English
Narrated Wa'il bin Hujr (RA): Whenever the Prophet (ﷺ) bowed, he would spread out his fingers and when he prostrated he would bring his fingers together. [Reported by al-Hakim).
సారాంశం
రుకూ మరియు సజ్దాల స్థితిలో చేతివ్రేళ్ళు ఎలా ఉండాలో ఈ హదీసు మనకు చెబుతోంది. రుకూలో నుండగా చేతి వ్రేళ్ళను విడిగా నుంచటం మస్నూన్. మరదే సజ్దాలోనయితే రెండు చేతుల వ్రేళ్ళను పరస్పరం కలిపివేయాలి. ఎందుకంటే ఆ స్థితిలో వ్రేళ్ళు కాబా దిశలో ఉండగలగటానికి అలా చేయాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 237
హదీసు 238
وَعَنْ عَائِشَةَ -رَضِيَ اَللَّهُ عَنْهَا- قَالَتْ : { رَأَيْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يُصَلِّي مُتَرَبِّعًا } رَوَاهُ النَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: “నేను దైవప్రవక్త ﷺ ను కాళ్ళు మడత పెట్టుకుని కూర్చుని నమాజ్ చేయగా చూచాను.” (నసాయి దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు)
English
Narrated 'Aishah (RA): I saw Allah's Messenger (ﷺ) praying while he sat cross-legged. [Reported by an-Nasa'i, and Ibn Khuzaimah graded it Sahib (authentic)].
సారాంశం
దైవప్రవక్త ﷺ గుర్రంపై నుంచి క్రిందపడి కాలికి దెబ్బ తగిలిన తరువాత చేసినప్పటి నమాజ్‌కు సంబంధించినది ఈ హదీసు. దీన్నిబట్టి బోధపడేదేమంటే మనిషి ఏ కారణంగానయినా సాధారణ స్థితిని కోల్పోయినపుడు షరీయత్ అతన్ని తదనుగుణమైన రీతిలో నమాజ్‌ను నెరవేర్చేందుకు అనుమతినిస్తుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 238
హదీసు 239
وَعَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -كَانَ يَقُولُ بَيْنَ اَلسَّجْدَتَيْنِ : { اَللَّهُمَّ اِغْفِرْ لِي , وَارْحَمْنِي , وَاهْدِنِي , وَعَافِنِي , وَارْزُقْنِي } رَوَاهُ اَلْأَرْبَعَةُ إِلَّا النَّسَائِيُّ , وَاللَّفْظُ لِأَبِي دَاوُدَ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ రెండు సజ్దాల మధ్య ఈ దుఆ చేసేవారు : “అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్నీ వహ్దినీ వ ఆఫినీ వర్జుఖ్నీ” (ఓ అల్లాహ్! నన్ను క్షమించు. నాకు సన్మార్గం చూపు. నా తప్పులను మన్నించు. ఇంకా నాకు (ధర్మసమ్మతమయిన) ఉపాధిని ప్రసాదించు) (దీనిని ‘నలుగురి’లో నసాయి తప్ప మిగిలిన వారు ఉల్లేఖించారు. వాక్యాలు మాత్రం అబూ దావూద్ లోనివి. హాకిమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)
English
Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) used to say between the two prostrations: "Allahumma ighfir li, warhamni, wahdini, wa 'afini, warzuqni (O Allah, forgive me, have mercy on me, guide me, grant me health and well-being, and provide sustenance for me)." [Reported by al-Arba'a except An-Nasa'i, and this is the wording of Abu Dawud. Al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
దైవప్రవక్త ﷺ నమాజ్‌లో వివిధ సందర్భాలలో వివిధ వేడుకోళ్ళు చేసేవారు. రెండు సజ్దాల మధ్య – ‘జల్సా’ స్థితిలో – ఆయన ఈ ‘దుఆ’ చేశారు. కనుక మనం కూడా నమాజులో ఈ చిన్న దుఆను చేయటం మస్నూన్ (సంప్రదాయం).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 239
హదీసు 240
وَعَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ - رضى الله عنه - { أَنَّهُ رَأَى اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -يُصَلِّي , فَإِذَا كَانَ فِي وِتْرٍ مِنْ صَلَاتِهِ لَمْ يَنْهَضْ حَتَّى يَسْتَوِيَ قَاعِدًا } رَوَاهُ اَلْبُخَارِيُّ.
తాను దైవప్రవక్త ﷺను నమాజ్ చేస్తుండగా చూచానని హజ్రత్ మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) చెప్పారు: “ఆయన ﷺ తన నమాజులోని వితర్ (రకత్)ను చేసినప్పుడు (ముందు కాస్సేపు) కూర్చుని తరువాత తిన్నగా నిలబడేవారు.” (బుఖారీ)
English
Narrated Malik bin Al-Huwairith (RA): He saw the Prophet (ﷺ) praying and when he had prayed an odd number of Rak'a, he did not stand up till he had sat up properly. [Reported by al-Bukhari].
సారాంశం
ఇలా కూర్చోవటాన్ని “జల్సయే ఇస్తిరాహత్” అంటారు. ఇమామ్ షాఫయి దీనికి అనుకూలంగా ఉన్నారు. కాని ఇమామ్ అహ్మద్, ఇమామ్ అబూ హనీఫా దీనికి అనుకూలంగా లేరు. వృద్ధాప్యం వల్ల దైవప్రవక్త ﷺ అలా విరామం పాటించేవారని వీరిద్దరి వాదన. అయితే ఈ హదీసును ఉల్లేఖించిన మాలిక్ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన మిత్రబృందాన్ని ఉద్దేశించి దైవప్రవక్త ﷺ ఖుద్దుగా ఇలా అన్నారు: నేను ఏవిధంగా నమాజ్ చేస్తుండటాన్ని మీరు చూచారో ఆ విధంగానే నమాజ్ చేయండి.” ఈ హదీసు వెలుగులో ఏది మంచిదో మీరే ఆలోచించండి!
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 240
హదీసు 241
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ - رضى الله عنه - { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَنَتَ شَهْرًا بَعْدَ اَلرُّكُوعِ , يَدْعُو عَلَى أَحْيَاءٍ مِنْ أَحْيَاءِ اَلْعَرَبِ , ثُمَّ تَرَكَهُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِأَحْمَدَ وَاَلدَّارَقُطْنِيِّ نَحْوُهُ مِنْ وَجْهٍ آخَرَ , وَزَادَ : { فَأَمَّا فِي اَلصُّبْحِ فَلَمْ يَزَلْ يَقْنُتُ حَتَّى فَارَقَ اَلدُّنْيَا }.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ పూర్తిగా నెల రోజులపాటు రుకూ అనంతరం ‘దుఆయే ఖునూత్’ చదివారు. ఆ తరువాత వదిలేశారు.” (బుఖారీ, ముస్లిం)
అహ్మద్, దారె ఖుత్నీ తదితరులు మరో విధంగా దీనిని ఉల్లేఖించారు. అందులో వారు అదనంగా ఇలా పేర్కొన్నారు – “ఉదయం నమాజ్‌లో దుఆయే ఖునూత్ను జీవితాంతం చేశారు.”
పూర్వాపరాలు
దైవధర్మ ప్రచారం నిమిత్తం పంపబడిన రెండు సహచర బృందాలను శత్రువులు మోసగించి, దగాచేసి చంపినందుకుగాను దైవప్రవక్త ﷺ శోకసంతప్త హృదయంతో – శపిస్తూ చేసిన దుఆ ఇది.
అది హిజ్రీ 4వ సంవత్సరం సఫర్ మాసం – అరేబియాలోని కొన్ని తెగలవారు చేసిన అభ్యర్థనపై- వారికి ధర్మాదేశాలు బోధించడానికిగాను దైవప్రవక్త 70 మంది ఖుర్ఆన్ బోధకులను ఆ తెగలవారి వద్దకు పంపారు. రీల్, జక్వాన్, ఉసైయ వంటి తెగలు నమ్మకద్రోహానికి పాల్పడి ఎంతో విలువైన ప్రవక్త ప్రియ సహచరులను చుట్టుముట్టి నరమేధం సృష్టించారు. వారిలో ఒక్క కాబ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) మాత్రమే ఎలాగో బయటపడగలిగారు.
అలాగే బనూ లిహ్యాన్ దరఖాస్తుపై దైవప్రవక్త ﷺ పదిమంది విద్వాంసులను ధర్మోపదేశం నిమిత్తం పంపగా ఆ తెగకూడా విశ్వాసఘాతుకానికి పాల్పడి హత్యాకాండ చేసింది. ఇద్దరు సహాబీలు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ రెండు విషాదోదంతాల సమాచారం దైవప్రవక్త ﷺకు ఒకే రాత్రి అందింది. ఆయన ﷺ మనసు బాధతో తల్లడిల్లిపోయింది. అందుచేత ఆయన నెలరోజులపాటు వారిని శపిస్తూ దైవాన్ని ప్రార్థించారు. ఇటువంటి దుఆయే ఖునూత్ను ‘ఖునూతె నాజిలా’ అంటారు. ఇటువంటి ప్రార్థనలు వ్యధాభరితమయిన ఉదంతాలు జరిగినపుడు, జాతి భయంకరమయిన విపత్తులకు లోనయినపుడు చేయబడతాయి.
English
Narrated Anas bin Malik (RA): The Prophet (ﷺ) recited Qunut (supplication in the prayer) for one month after (rising up from the) bowing (position), invoking curse on some Arab tribes. Afterwards, he gave it up. [Agreed upon].
Ahmad and ad-Daraqutni narrated something similar, adding that he (ﷺ) continued to recite Qunut (supplication in prayer) in the Fajr prayer till he separated from this world.
సారాంశం
ఈ హదీసు ద్వారా అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఫజ్ర్ నమాజ్‌లో ఆయన ﷺ ‘దుఆయే ఖునూత్’ చేసినట్లు రుజువవుతున్నది. వాగ్దాన భంగానికి పాల్పడి తన సహచరులను హతమార్చినందుకు గాను అవిశ్వాసులను ఆయన ﷺ నెలరోజులపాటు శపించారు. అంటే ఫర్జ్ నమాజులో (సామూహిక నమాజులో) ఆయన ఈ విధంగా చేశారు. రుకూ చేసి నిలబడిన తరువాత ఈ దుఆ చేశారన్నది గమనార్హం.
దీనిద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం మానవులందరికీ పరిచయం చెయ్యవలసిన ధర్మం. ఇందునిమిత్తం ధర్మప్రచారకుల సమూహం (బృందం) ఒకటి నిత్యం సిద్ధంగా ఉండాలి. ఎక్కడెక్కడ దీని అవసరముంటే అక్కడ ఆ జమాఅత్‌ను పంపి సందేశ ప్రచార బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండాలి. ఈ విధి నిర్వహణ నిమిత్తం ఒక జమాఅత్ ఉండాలనీ, దానికొక అమీర్ (నాయ కుడు) ఉండాలని కూడా సంకేతం లభిస్తున్నది.
ఈ హదీసు ద్వారా అవగతమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్త ﷺకు ‘అగోచర జ్ఞానం’ లేదు. కొంతమంది చెబుతున్నట్లు ఆయన ﷺ కు అగోచర జ్ఞానం (ఇల్మె గైబ్) గనక ఉండి ఉంటే తన ప్రియ సహచరులను హంతకులకు ఎందుకు అప్పజెప్పేవారు? తెలిసీ ఆయన ﷺ అలా చేస్తారా? (దైవం మన్నించుగాక!) దేవుని తరపున ఈ సమాచారం అందేవరకు ఆయన ﷺకు హతుల గురించి ఏమీ తెలీదాయె!
హనఫీ మస్లక్ ననుసరించేవారు ఈ హదీసు వెలుగులో అవసరం ఏర్పడినపుడు ‘ఖునూతె నాజిలా’ చేయవచ్చునని అంగీకరిస్తారు. కాగా; ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ఫజ్ర్ నమాజ్‌లో నిత్యం దుఆయె ఖునూత్ చదవాలంటారు. దీన్ని ఆయన ‘మస్నూన్’గా ఖరారు చేశారు. ఈ దుఆచేసే పద్ధతి ఏమిటంటే; ఇమామ్ రుకూ తరువాత చేతులెత్తి ఖునూతె నాజిలా పఠిస్తుండగా వెనుకనున్నవారు ‘ఆమీన్’ పలకాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 241
హదీసు 242
وَعَنْهُ أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -{ كَانَ لَا يَقْنُتُ إِلَّا إِذَا دَعَا لِقَوْمٍ , أَوْ عَلَى قَوْمٍ } وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారి చేతనే మరో ఉల్లేఖనం: “దైవప్రవక్త ﷺ ఏదేని ఒక జాతి కోసం ప్రార్థన చేయవలసివుంటే లేదా ఎవరినయినా శపించవలసి ఉంటేనే ‘ఖునూత్’ పఠించేవారు. లేకుంటే పఠించేవారు కాదు.” (ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated [Anas (RA)]: The Prophet (ﷺ) never used to supplicate [i.e. Qunut in the prayer) except when he prayed for a people or when he prayed against a people. [Ibn Khuzaimah graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసులలో వైరుధ్యం, వ్యాఘాతం ఉన్నట్లు పైకి కనిపిస్తోంది. ఫజ్ర్లో ఖునూత్ నిత్యం పఠించాలని మొదటి హదీసులో చెప్పబడింది. ఏదేని జాతి ప్రయోజనాన్ని ఆశించో, లేక దాని వినాశాన్ని కాంక్షించో ఖునూత్ పఠించేవారని రెండవ హదీసులో ఉంది. రాబోయే హదీసులో – ఫజ్ర్ నమాజ్‌లో ఖునూత్ పఠించటం ‘వినూత్న విషయం’ (కొత్తపుంత) అని వుంది. వీటి మధ్య పొంతన ఈ విధంగా ఉండవచ్చు!
ఆయన ﷺ మరియు ఖులఫాయె రాషిదీన్ ఫజ్ర్ నమాజులో ఖునూత్ను పఠిస్తూ ఉన్నారు. రాబోయే హదీసులో అది ‘కొత్త విషయం’గా పేర్కొనబడిందంటే దాని భావం ఉదయం నమాజులో నిరంతరం – నాగా లేకుండా – అలా జరగలేదన్నది కావచ్చు. అంటే ఈ పద్ధతిని మస్నూన్గా ఖరారు చేయటం ‘కొత్త పోకడ’ అన్నది దీని మతలబు కావచ్చు! అంటే ఫజ్ర్ నమాజులో నాగాలేకుండా – అవసరం లేకపోయినప్పటికీ – ఖునూత్ చదవవలసిన పనిలేదు అని భావం!
అయితే ఏ హదీసులో – ఫజ్ర్ నమాజ్‌లో – నిత్యం ఖునూత్ చదవాలని ఉందో, దాని భావం మాత్రం సుస్పష్టమే – ఖునూత్ ఎప్పటికీ రద్దుకాలేదని ఇది చెబుతోంది. అవసరం ఏర్పడినప్పుడల్లా ఆయన ﷺ ఖునూత్ చదువుతూ ఉండేవారు.
ఏ హదీసులో ఒకరి శ్రేయాన్ని కోరి లేక ఒకరి వినాశాన్ని వాంఛించి ఖునూత్ పఠించేవారని వుందో అది తాత్కాలిక స్థితిని సూచిస్తోంది. అంటే అవసరార్థం దుఆ చేయటమో, శపించటమో చేసేవారన్నమాట! హనఫీ ఫికహా ననుసరించేవారు దీనినే అవలంబిస్తున్నారు. ఒక్క వితర్ నమాజ్‌లో తప్ప మరే నమాజులోనయినా – నిత్యం ఖునూత్ పఠించాలన్న వాదనకు హనఫీ ధర్మవేత్తలు సుముఖంగా లేరు. ముస్లింలపై ఏదన్నా ఆపద ముంచుకువస్తే, ఉదాహరణకు శత్రువు వారి రాజ్యాన్ని కబళిస్తే, ఏదయినా మహామ్మారి ప్రబలిపోతే, దుర్భిక్షం తాండవిస్తే అట్టి పరిస్థితిలో హనఫీలు కూడా ఐదు పూటలా నమాజులో ఖునూత్ పఠించటం ‘మస్నూన్’ గా భావిస్తున్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 242
హదీసు 243
وَعَنْ سَعْدِ بْنِ طَارِقِ الْأَشْجَعِيِّ - رضى الله عنه - قَالَ : { قُلْتُ لِأَبِي : يَا أَبَتِ ! إِنَّكَ قَدْ صَلَّيْتُ خَلْفَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَأَبِي بَكْرٍ , وَعُمَرُ , وَعُثْمَانُ , وَعَلَيَّ , أَفَكَانُوا يَقْنُتُونَ فِي اَلْفَجْرِ ? قَالَ : أَيْ بُنَيَّ , مُحْدَثٌ } رَوَاهُ اَلْخَمْسَةُ , إِلَّا أَبَا دَاوُدَ.
హజ్రత్ సాద్ బిన్ తారిఖ్ అష్జయి (రదియల్లాహు అన్హు) కథనం: “నాన్నా! మీరు దైవప్రవక్త ﷺ, అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), అలీ (రదియల్లాహు అన్హు)ల వెనుక నమాజ్ చేసివున్నారు కదా! వీళ్ళంతా ఫజ్ర్ నమాజ్‌లో దుఆయే ఖునూత్ పఠించేవారా?!” అని నేను నా తండ్రిని అడిగాను. “అబ్బాయి! ఇదొక క్రొత్త విషయం (బిద్అత్)” అని ఆయన నాకు జవాబు ఇచ్చారు.” (‘ఐదుగురి’లో అబూదావూద్ తప్ప మిగిలిన వారంతా దీనిని ఉల్లేఖించారు)
English
Narrated Sa'd bin Tariq al-Ashja'i (RA): I said to my father, "You have prayed behind Allah's Messenger (ﷺ), Abu Bakr, 'Umar, Uthman, and 'Ali. Did they supplicate (with Qunut while standing) in the Fajr prayer?" He replied, "O my son, it is an innovation." [Reported by Al-Khamsah, except Abu Dawud].
సారాంశం
ఈ హదీసును ఆధారంగా తీసుకుని నమాజ్‌లో ఖునూత్ పఠించటం ‘బిద్అత్’ అని ఎవరయినా అంటే అది సరికాదు. దీనికి సంబంధించిన వివరణ మేమింతకు ముందే ఇచ్చాము. నిత్యం, ఎడతెగకుండా ఖునూత్ పఠించనవసరం లేదన్న భావంలో ఈ హదీసు ఉంది. అంతేగాని ఇది పూర్తిగా ఖునూత్ను త్రోసిపుచ్చటం లేదు.
హదీసు ఉల్లేఖకులు
1. సాద్ (రహిమహుల్లాహ్) : పూర్తిపేరు సాద్ బిన్ తారిఖ్ బిన్ అష్యమ్ బిన్ మస్‌వూద్ అష్జయి (రదియల్లాహు అన్హు). మారుపేరు అబూ మాలిక్. విశ్వసనీయులయిన తాబయీన్లలో ఒకరుగా పరిగణించబడతారు. హిజ్రీ 140లో మరణించారు.
2. తారిఖ్ అష్జయి (రదియల్లాహు అన్హు) : అంటే సాద్ (రహిమహుల్లాహ్) గారి తండ్రి. ప్రముఖ సహాబీలలో ఒకరు. ఈయన కేవలం 14 హదీసులు మాత్రమే అందజేశారు. ఈయన గారినుండి ఈయన కుమారుడు తప్ప వేరెవరూ హదీసులను సంగ్రహించలేదు. కూఫా వాసులుగా పరిగణించబడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 243
హదీసు 244
وَعَنْ اَلْحَسَنِ بْنِ عَلِيٍّ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- ; قَالَ : { عَلَّمَنِي رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -كَلِمَاتٍ أَقُولُهُنَّ فِي قُنُوتِ اَلْوِتْرِ : " اَللَّهُمَّ اِهْدِنِي فِيمَنْ هَدَيْتَ , وَعَافِنِي فِيمَنْ عَافَيْتَ , وَتَوَلَّنِي فِيمَنْ تَوَلَّيْتَ , وَبَارِكْ لِي فِيمَا أَعْطَيْتَ , وَقِنِي شَرَّ مَا قَضَيْتَ , فَإِنَّكَ تَقْضِي وَلَا يُقْضَى عَلَيْكَ , إِنَّهُ لَا يَذلُّ مَنْ وَالَيْتَ , تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ } رَوَاهُ اَلْخَمْسَةُ. وَزَادَ اَلطَّبَرَانِيُّ وَالْبَيْهَقِيُّ : { وَلَا يَعِزُّ مَنْ عَادَيْتَ }. زَادَ النَّسَائِيُّ مِنْ وَجْهٍ آخَرَ فِي آخِرِهِ : { وَصَلَّى اَللَّهُ عَلَى اَلنَّبِيِّ } وَلِلْبَيْهَقِيِّ عَنْ اِبْنِ عَبَّاسٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -يُعَلِّمُنَا دُعَاءً نَدْعُو بِهِ فِي اَلْقُنُوتِ مِنْ صَلَاةِ اَلصُّبْحِ } وَفِي سَنَدِهِ ضَعْفٌ.
హజ్రత్ హసన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హుమా) వివరించారు: దైవప్రవక్త ﷺ నాకు కొన్ని వచనాలు నేర్పారు. నేను వాటిని వితర్లో (దుఆయె ఖునూత్గా) పఠిస్తాను. ఆ వచనాలివి: “అల్లాహుమ్మహ్దినీ ఫీమన్ హదైత్. వ ఆఫినీ ఫీమన్ ఆఫైత్. వ తవల్లనీ ఫీమన్ తవల్లైత్. వ బారిక్‌లీ ఫీమా ఆతైత్. వఖినీ షర్ర మా ఖజైత్. ఫ ఇన్నక తఖ్జీ వలా యుఖ్జా అలైక్. ఇన్నహూ లా యజిల్లు మన్ వాలైత్. తబారక్త రబ్బనా వ తఆలైత్.”
(అర్థం: ఓ అల్లాహ్! నాకు సన్మార్గం చూపి నీవు సన్మార్గం చూపిన వారి శ్రేణిలో నన్ను చేర్చు. నాకు రక్షణనిచ్చి నీవు రక్షణనిచ్చిన వారిలో నన్ను చేర్చు. ఎవరినయితే నీవు నీ నేస్తాలుగా ఖరారు చేశావో వారిలో నన్ను కూడా చేర్చి నీ నేస్తంగా చేసుకో. నీవు నాకు ప్రసాదించిన దానిలో వృద్ధి నొసగు. ఏ చెడు మరియు కీడుకు సంబంధించి నీవు నిర్ణయం గైకొన్నావో దాన్నుండి నన్ను సురక్షితంగా ఉంచు. నిశ్చయంగా నిర్ణయాన్ని జారీ చేసేవాడవు నీవే. నీకు వ్యతిరేకంగా నిర్ణయం జారీ చేయటం అసంభవం. ఎవరినయితే నీవు స్నేహితునిగా చేసుకున్నావో అతడు ఎన్నటికీ పరాభవానికి, అవమానానికి గురికాడు. ప్రభూ! నువ్వు మాత్రమే శుభాలు కలవాడవు, సర్వోన్నతుడవు) (దీనిని ఐదుగురు – అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ – ఉల్లేఖించారు. తబ్రానీ మరియు బైహఖీలు “వలా యుయిజ్జుమన్ ఆదైత్” అనే వాక్యాన్ని అదనంగా నకలు చేశారు. నసాయి మరో విధంగా ఈ దుఆ చివరిలో “వ సల్లల్లాహు అలన్నబీ” అనే వాక్యాన్ని అదనంగా ఉల్లేఖించారు.
బైహఖీలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఇలా వుంది – “దైవప్రవక్త -సఅసం- మాకు దుఆ నేర్పేవారు. దానిని మేము ఉదయం నమాజులో ‘దుఆయె ఖునూత్’ రూపంలో చదివేవాళ్ళం.” (దీని ఆధారం బలహీనంగా ఉంది)
English
Narrated al-Hasan bin 'Ali (ﷺ): Allah's Messenger (ﷺ) taught me some words to say when standing in supplication during the Witr, they were: "O Allah, guide me among those You have guided, grant me well-being among those You have granted well-being, take me into Your charge among those You have taken into Your charge, bless me in what You have given, guard me from the evil of what You have decreed, for You decree and none can decree over You. He whom You befriend is not humbled. Blessed and Exalted are You, our Rabb (Lord)." Reported by Al-Khamsah: Authentic. Narrated by Abu Dawood (1425), an-Nasa'i (3/248), at-Tirmidhi (464), Ibn Majah (1178), and Ahmad (1/199-200). at-Tabarani and al-Baihaqi added: "He whom You hold as enemy is not honoured." It is an authentic addition. Narrated by at-Tabarani in "Al-Kabeer" (3/73/2701) and al-Baihaqi in "Al-Kubra" (2/209). an-Nasa'i reported through another chain of narrators, adding at its end: "May Allah the Most High send His Salat on the Prophet (praising him in the highest assemblies of the angels)." It is Weak. Narrated by an-Nasa'i (3/248), with the addition of "Muhammad" and its chain is disconnected, as stated by Al-Hafiz Ibn Hajar al-Asqalani in "At-Talkhees".
Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) used to teach us a supplication to say in the Qunut of the morning prayer. [al-Baihaqi reported it and there is a weakness in its chain of narrators].
సారాంశం
వితర్ నమాజులో ఈ దుఆ చేయాలని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఈ దుఆ రుకూకి ముందు, తరువాత – రెండు తరహాలుగా కూడా చేయవచ్చు. అయితే ముస్తద్రక్ హాకిమ్, బైహఖీలోని మాటల్ని బట్టి రుకూ తరువాత దుఆ చేయటమే సమంజసం. దుఆ చివరిలో నున్న “సల్లల్లాహు అలన్నబీ” వాక్యాన్ని కొంత మంది ‘జయీఫ్’ గా ఖరారు చేశారు. అయితే అల్లామా అల్-బానీ గారు ఈ అదనపు వాక్యాన్ని ప్రమాణబద్ధమైనదిగా వ్యాఖ్యానించారు.
ఇక నమాజె వితర్ స్థాయి ఏమిటి? దాని రకత్లు ఎన్ని? అనే విషయంపై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. హనఫీ ఫుకహా దృష్టిలో ఈ నమాజ్ వాజిబ్ (తప్పనిసరి). కాగా; మిగిలిన వారందరి అభిప్రాయంలో ఇది సున్నత్.
రకతుల సంఖ్య గురించి కూడా అనేక ఉల్లేఖనాలున్నాయి. వివిధ ఉల్లేఖనాల ప్రకారం దీని సంఖ్య ఒకటి నుంచి పదకొండు వరకూ వుంది. హనఫీ ఫుకహా మూడు రకతుల వైపునకు మొగ్గు చూపారు. దీనిని నెరవేర్చే విధానంలో కూడా స్వల్పమయిన వ్యత్యాసం ఉంది.
హదీసు ఉల్లేఖకులు
హసన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి ప్రియతమ మనవడు. స్వర్గలోకపు యువజన నాయకులలో ఈయన కూడా ఒకరు. హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) హిజ్రీ 3లో జన్మించారు. తండ్రి అమరగతి నొందిన తరువాత ఈయన ముస్లిముల ఖలీఫాగా చేయబడ్డారు. కాని ఖలీఫాగా ఎన్నికయిన ఏడు మాసాల తర్వాత హిజ్రీ 41 జమాదుల్ ఊలాలో – హజ్రత్ ముఆవియాకు అనుకూలంగా ఆయన తన పదవిని త్యాగం చేశారు. ముస్లిముల మధ్య అంతర్గత వైషమ్యాలు పెచ్చరిల్లి రక్తపాతం జరగరాదన్నదే ఆయన నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశ్యం. హిజ్రీ 49లో మరణించారు. జన్నతుల్ బఖీలో అంత్యక్రియలు జరిగాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 244
హదీసు 245
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا سَجَدَ أَحَدُكُمْ فَلَا يَبْرُكْ كَمَا يَبْرُكُ اَلْبَعِيرُ , وَلْيَضَعْ يَدَيْهِ قَبْلَ رُكْبَتَيْهِ } أَخْرَجَهُ اَلثَّلَاثَةُ. وَهُوَ أَقْوَى مِنْ حَدِيثِ وَائِلِ اِبْنِ حُجْرٍ : { رَأَيْتُ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -إِذَا سَجَدَ وَضَعَ رُكْبَتَيْهِ قَبْلَ يَدَيْهِ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ. فَإِنْ لِلْأَوَّلِ شَاهِدًا مِنْ حَدِيثِ : اِبْنِ عُمَرَ - رضى الله عنه - وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ , وَذَكَرَهُ اَلْبُخَارِيُّ مُعَلَّقًا مَوْقُوفًا.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “మీలో ఎవరయినా సజ్దా చేసినప్పుడు ఒంటె మాదిరిగా కూర్చోకండి. మోకాళ్ళ కన్నా ముందుగా మీ చేతులను నేలపై ఆనించండి.” (నసాయి, తిర్మిజీ, ఇబ్నె మాజ)
ఈ హదీసు వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) తరపున ఉల్లేఖించబడిన హదీసుకన్నా బలవత్తరమైనది. అందులో (వాయల్ హదీసులో) ఇలా వుంది: “నేను దైవ ప్రవక్త ﷺను సజ్దాలోకి వెళుతుండగా చూశాను – ఆయన ﷺ తన మోకాళ్ళను చేతులకన్నా ముందుగా నేలపై ఆనించారు.” (దీనిని నలుగురు – అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా- ఉల్లేఖించారు. మొదటి హదీసుకు సాక్ష్యం ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) హదీసు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. బుఖారీ దీనిని ‘మౌఖూఫ్’ అని చెప్పారు)
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you prostrates, he should not kneel in the manner of a camel, but should put down his hands before his knees." [Reported by ath-Thalathah]. This Hadith is more authentic than the Hadith narrated by Wa'il bin Hujr (RA).
I saw the Prophet (ﷺ) placing his knees (on the ground) before his hands when he prostrated. [Reported by al-Arba'ah].
The first Hadith has a Shahid (supporting evidence) in the Hadith
of Ibn 'Umar (RA) (coming next), which is authenticated by Ibn Khuzaimah. al-Bukhari mentioned it as a Hadith Mu'allaq (missing links from the side of the Haditb collector) and Mawquf (saying of a companion).
సారాంశం
హజ్రత్ వాయల్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసును ఒంటరిగా వివరించారు. హదీసును ఎవరయినా ఒంటరిగా చెప్పినపుడు – ఆ ఉల్లేఖనంపై హదీసు వేత్తలు తమ వ్యాఖ్యానాలు చేశారు. వాయల్ హదీసును హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఒకటి సమర్థిస్తున్నప్పటికీ, దానిని అందజేసిన వారిలో ఒక వ్యక్తి అంతగా నమ్మకస్తుడు కాడు. కాబట్టి హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడిన హదీసు ఎక్కువ ప్రామాణికమైనదనీ, అనుసరణీయమైనదనీ రూఢీ అయింది.
గ్రంథ రచయిత హాఫిజ్ ఇబ్నె హజర్ కూడా హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) హదీసునే అనుసరణీయమైనదిగా భావించారు. ఎందుకంటే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం దీనిని సమర్థిస్తోంది. హదీసువేత్తలు, హంబలీ ఫికహా ననుసరించేవారు కూడా ఈ హదీసుకు అనుకూలంగా ఉన్నారు. అయితే హనఫీలు, షాఫయిలు మాత్రం హజ్రత్ వాయల్ (రదియల్లాహు అన్హు) హదీసు వైపుకు మొగ్గు చూపారు. మొదట మోకాళ్ళను నేలకు ఆనించాలని ఈ హదీసులో ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 245
హదీసు 246
وَعَنْ اِبْنِ عُمَرَ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -كَانَ إِذَا قَعَدَ لِلتَّشَهُّدِ وَضَعَ يَدَهُ اَلْيُسْرَى عَلَى رُكْبَتِهِ اَلْيُسْرَى , وَالْيُمْنَى عَلَى اَلْيُمْنَى , وَعَقَدَ ثَلَاثَةً وَخَمْسِينَ , وَأَشَارَ بِإِصْبَعِهِ اَلسَّبَّابَةِ } رَوَاهُ مُسْلِمٌ وَفِي رِوَايَةٍ لَهُ : { وَقَبَضَ أَصَابِعَهُ كُلَّهَا , وَأَشَارَ بِاَلَّتِي تَلِي اَلْإِبْهَامَ }
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺతషహ్హుద్ కోసం (ఖాయిదాలో) కూర్చున్నప్పుడు తన ఎడమ చేతిని ఎడమ మోకాలిపై ఉంచేవారు. కుడి చేతిని తన కుడి మోకాలిపై ఉంచి, చేతి (నాలుగు) వ్రేళ్ళను ముడుచుకునేవారు. చూపుడు వ్రేలితో సంజ్ఞ చేసేవారు.” (ముస్లిం)
ముస్లిం ఉల్లేఖించిన వేరొక ఉల్లేఖనంలో ఇలా వుంది: తన (కుడి చేతి) వ్రేళ్ళన్నింటినీ మూసివుంచి, బొటన వ్రేలికి దగ్గరలో వున్న వ్రేలితో (చూపుడు వ్రేలితో) సంజ్ఞ చేసేవారు.”
English
Narrated Ibn 'Umar (RA): When Allah's Messenger (ﷺ) sat for at-Tashahhud, he placed his left hand on his left knee, and his right hand on his right knee, folded its fingers and pointed with his right index finger. [Reported by Muslim].
In another narration of Muslim: 'and he clenched all his (right hand) fingers and pointed with the index finger.'
సారాంశం
హదీసు మూలంలో ‘53ను పోలిన ముడి వేసేవార’ని ఉంది. చూపుడు వ్రేలిని చాచి, మిగిలిన మూడు వ్రేళ్ళను బొటన వ్రేలితో నొక్కి పట్టుకుంటే, అరబీ అంకెల ప్రకారం 53ను పోలిన రూపం వస్తుంది. ఖాయిదాలో దైవ ప్రవక్త ﷺ ఎలా చేసేవారో మనం కూడా అలాగే చేయాలి. దైవ ప్రవక్త ﷺ అనుసరణలో ఇది కూడా ఒక భాగమే కదా! తషహ్హుద్‌లో చూపుడు వ్రేలితో సంజ్ఞ చేయటంపై ఇమాములందరూ ఏకీభవించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 246
హదీసు 247
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ مَسْعُودٍ - رضى الله عنه - قَالَ : { اِلْتَفَتَ إِلَيْنَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فَقَالَ : " إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَقُلْ : اَلتَّحِيَّاتُ لِلَّهِ , وَالصَّلَوَاتُ , وَالطَّيِّبَاتُ , اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا اَلنَّبِيُّ وَرَحْمَةَ اَللَّهِ وَبَرَكَاتُهُ , اَلسَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اَللَّهِ اَلصَّالِحِينَ , أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ , وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ , ثُمَّ لِيَتَخَيَّرْ مِنْ اَلدُّعَاءِ أَعْجَبُهُ إِلَيْهِ , فَيَدْعُو } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ. وَلِلنَّسَائِيِّ : { كُنَّا نَقُولُ قَبْلِ أَنْ يُفْرَضَ عَلَيْنَا اَلتَّشَهُّدُ }. وَلِأَحْمَدَ : { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -عَلَّمَهُ اَلتَّشَهُّد , وَأَمَرَهُ أَنْ يُعَلِّمَهُ اَلنَّاسَ }. وَلِمُسْلِمٍ : عَنْ اِبْنِ عَبَّاسٍ - رضى الله عنه - قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ يُعَلِّمُنَا اَلتَّشَهُّدَ: " اَلتَّحِيَّاتُ اَلْمُبَارَكَاتُ اَلصَّلَوَاتُ اَلطَّيِّبَاتُ لِلَّهِ... } إِلَى آخِرِهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మా వైపు దృష్టిసారించి ఇలా ఉపదేశించారు – మీలో ఎవరయినా నమాజ్ చేసినపుడు ‘తషహ్హుద్’లో ఇలా అనండి: సమస్త స్తోత్రాలు, పరిశుద్ధతలు, (సమస్త నోటి ఆరాధనలు, శారీరక ఆరాధనలు, ధనపరమైన ఆరాధనలు) కేవలం అల్లాహ్ కొరకే. ఓ ప్రవక్తా! మీ పై శాంతి కలుగుగాక! దైవకారుణ్యం మరియు శుభాలు కలుగుగాక! మాపైన మరియు దేవుని సజ్జనులైన దాసులపైన కూడా శాంతి కలుగుగాక! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ﷺ దేవుని దాసుడు మరియు సందేశహరుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను.” – ఆ తరువాత వారు ‘దుఆ’ను ఎన్నుకోవాలి. తనకు అన్నిటికన్నా మంచిదనిపించిన దుఆ చేయాలి. (బుఖారీ, ముస్లిం- హదీసు వాక్యాలు మాత్రం బుఖారీ లోనివి)
‘నసాయి’లో ఉంది: “తషహ్హుద్ విధించబడక మునుపు మేము ఇది…. పఠించేవారము.” అహ్మద్‌లో వుంది: “దైవప్రవక్త ﷺ వీళ్ళకు తషహ్హుద్ నేర్పారు. ప్రజలకు దీన్ని నేర్పమని ఆజ్ఞాపించారు.” ముస్లింలో ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం ఈ విధంగా ఉంది: “దైవప్రవక్త ﷺ మాకు తషహ్హుద్‌ను నేర్పేవారు. అది ఈవిధంగా ఉండేది-(అత్తహియ్యాతుల్ ముబారకాతు అస్సలవాతుత్తయ్యిబాతు లిల్లాహి…..)”
English
Narrated 'Abdullah bin Mas'ud (RA): Allah's Messenger (ﷺ) looked at us and said, "When one of you is (sitting) in prayer, he should say, 'All services reported by words, by prayers (acts of worship), and all good things are due to Allah, peace be upon you, O Prophet, and Allah's mercy and blessings, peace be upon us and upon Allah's upright slaves. I testify that nothing deserves to be worshipped except Allah and I testify that Muhammad is His slave and Messenger.' Then he may choose any supplication which pleases him most and recite it." [Agreed upon, and this wording is from al-Bukhari].
In the narration of an-Nasa'i: 'We used to say before at-Tashahhud become obligatory on us'.
And in the narration of Ahmad: 'The Prophet (ﷺ) taught him at-Tashahhud and ordered him to teach it to the people.'
In Muslim's narration from Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) used to teach us at-Tashahhud: "All services expressed by words, increase in good, acts of worship and all good things are due to Allah … " till the end.
సారాంశం
తషహ్హుద్ విధించబడక మునుపు ప్రవక్త సహచరులు “అస్సలాము అలల్లాహ్-అస్సలాము అలా జిబ్రయీల్ వ మేకాయీల్…..” అని పఠించేవారు. దైవ ప్రవక్త ﷺ దీనిని వారించి ‘అత్తహియ్యాత్ ……’ నేర్పారు.
తషహ్హుద్ తరువాత దుఆ చేయటం ‘మస్నూన్’ అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఏ దుఆ చేయాలి? అన్న దానిపై ఎలాంటి షరతు లేదు. మనకు నచ్చిన దుఆ ఏదయినా చేయవచ్చు. అయితే దైవప్రవక్త ﷺ గారి దుఆలు చేయటం మంచిది. ఖుర్ఆనీ దుఆలు కూడా చేయవచ్చు. మన అవసరాలు, అక్కరలకు సంబంధించిన దుఆలు కూడా చేయవచ్చు.
తషహ్హుద్ వాజిబ్ (తప్పనిసరి) అని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) కూడా దీనిని వాజిబ్గానే తలంచారు. ఇతర విద్వాంసులు మాత్రం దీనిని ఫర్జ్ (విధి)గా పరిగణిస్తున్నారు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలోని తషహ్హుద్ వాక్యాలను ఇమామ్ అబూ హనీఫా సహా అనేక మంది విద్వాంసులు ఇష్టపడ్డారు. ఎందుకంటే తషహ్హుద్ అధ్యాయం క్రింద వచ్చిన ఉల్లేఖనాలన్నింటిలోకీ ఇది అత్యంత ప్రామాణికమైనది.
ఇమామ్ షాఫయి మాత్రం హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడిన తషహ్హుద్ వాక్యాలను అవలంబించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 247
హదీసు 248
وَعَنْ فَضَالَةَ بْنِ عُبَيْدٍ - رضى الله عنه - قَالَ : { سَمِعَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -رِجْلاً يَدْعُو فِي صَلَاتِهِ , لَمْ يَحْمَدِ اَللَّهَ , وَلَمْ يُصَلِّ عَلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَقَالَ : " عَجِلَ هَذَا " ثُمَّ دَعَاهُ , فَقَالَ : " إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَبْدَأْ بِتَحْمِيدِ. رَبِّهِ وَالثَّنَاءِ عَلَيْهِ , ثُمَّ يُصَلِّي عَلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -ثُمَّ يَدْعُو بِمَا شَاءَ } رَوَاهُ أَحْمَدُ , وَالثَّلَاثَةُ , وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ , وَابْنُ حِبَّانَ , وَالْحَاكِمُ.
హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఒక వ్యక్తిని నమాజులో దుఆ చేస్తుండగా విన్నారు. అతను దైవ స్తోత్రం చేయటంగానీ, దైవ ప్రవక్త ﷺ పై దరూద్ పంపటం గానీ చేయలేదు. “ఇతను తొందరపడ్డాడు” అని దైవప్రవక్త ﷺ వ్యాఖ్యానించారు. తరువాత ఆయన ﷺ ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, “మీలో ఎవరయినాసరే దుఆ చేయసాగినపుడు తొలుత మీ ప్రభువును ప్రశంసించాలి, కొనియాడాలి. తరువాత దైవప్రవక్త ﷺపై దరూద్ పంపాలి. ఆ తరువాత మీరు కోరుకున్నదల్లా అర్థించవచ్చు” అని ఉపదేశించారు. (దీనిని అహ్మద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజాలు ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్లు దీనిని ప్రమాణబద్ధమైనదిగా ఖరారు చేశారు).
English
Narrated Fadalah bin 'Ubaid (RA): Allah's Messenger (ﷺ) heard a man supplicating during his prayer. He did not praise Allah, nor did he invoke blessings on the Prophet (ﷺ). He (ﷺ) said, "He made haste." He then called him and said, "When any of you prays, he should begin with the glorification of his Rabb (Lord) and praise Him; he should then invoke blessings on the Prophet (ﷺ); thereafter he should supplicate Allah for anything he wishes." [Ahmad and ath-Thalathah reported it; a-Tirmidhi, Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic)].
సారాంశం
దుఆలో వేగిరపాటు పనికిరాదని ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతున్నది. అణకువకీ, అశక్తతకీ మారుపేరే దుఆ. ఇందులో వీలయినంత ఎక్కువగా దాసుని నిస్సహాయస్థితి వ్యక్తం కావాలి. అందుకే దుఆ చేస్తున్నప్పుడు ఎంతో నింపాదిగా, ప్రశాంతంగా వ్యవహరించాలి. మొదట దేవుని స్తోత్రం చేయాలి. తరువాత దైవప్రవక్త ﷺపై శాంతి శుభాలు కలుగజేయమని కోరాలి. ఆ తరువాత తమ కోసం దైవాన్ని వేడుకోవాలి. ఈ హదీసు చాలా వరకు అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) గారి ‘హదీసె తషహ్హుద్’ను పోలివుంది.
హదీసు ఉల్లేఖకులు
ఈయన ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు). బిన్ నాఫిజ్ బిన్ ఖైస్. మారు పేరు అబూ ముహమ్మద్. అన్సార్లలోని ఔస్ తెగకు చెందిన వ్యక్తి. ఉహద్ యుద్ధంలో తొలిసారిగా పాల్గొన్నారు. ఆ తరువాత యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ‘బైతె రిజ్వాన్’లో ఈయన కూడా పాలుపంచుకున్నారు. సిరియా వైపునకు ప్రస్థానం చేశారు. డెమాస్కస్‌లో స్థిరపడ్డారు. అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు) సిఫ్ఫీన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన ఆ పట్టణ ఖాజీగా ఉన్నారు. హిజ్రీ 56లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 248
హదీసు 249
وَعَنْ أَبِي مَسْعُودٍ اَلْأَنْصَارِيِّ - رضى الله عنه - قَالَ : { قَالَ بَشِيرُ بْنُ سَعْدٍ: يَا رَسُولَ اَللَّهِ ! أَمَرَنَا اَللَّهُ أَنْ نُصَلِّيَ عَلَيْكَ , فَكَيْفَ نُصَلِّي عَلَيْكَ ? فَسَكَتَ , ثُمَّ قَالَ : " قُولُوا : اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ , وَعَلَى آلِ مُحَمَّدٍ , كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ , وَبَارِكْ عَلَى مُحَمَّدٍ , وَعَلَى آلِ مُحَمَّدٍ , كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ فِي اَلْعَالَمِينَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ. وَالسَّلَامُ كَمَا عَلِمْتُمْ } رَوَاهُ مُسْلِمٌ. وَزَادَ اِبْنُ خُزَيْمَةَ فِيهِ : { فَكَيْفَ نُصَلِّي عَلَيْكَ , إِذَا نَحْنُ صَلَّيْنَا عَلَيْكَ فِي صَلَاتِنَا }.
హజ్రత్ అబూ మస్‌వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం: ‘ఓ దైవప్రవక్తా ﷺ! అల్లాహ్ మమ్ముల్ని మీపై దరూద్ పంపమని సెలవిచ్చాడు కదా! మరయితే మేము మీపై ఎలా దరూద్ పంపేదీ?’ అని బషీర్ బిన్ సాద్ విన్నవించుకున్నారు. కొద్దిసేపు ఆగి దైవప్రవక్త ﷺ, “ఇదిగో ఈ విధంగా చేయండి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్……(అర్థం : ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీంపై కరుణానుగ్రహాలను కురిపించినట్లే ముహమ్మద్ ﷺపై, ముహమ్మద్ ﷺ కుటుంబీకులపై కరుణానుగ్రహాలను కురిపించు. ఇబ్రాహీంపై, ఇరులోకాలలో శుభాలు కురిపించినట్లే నీవు ముహమ్మద్ ﷺపై ఆయన ﷺ కుటుంబీకులపై శుభాలను కురిపించు. నిస్సందేహంగా నీవు స్తుతించదగినవాడవు, మహోన్నతుడవు) ఇక ‘సలాం’ అంటారా అది మీకు నేర్పబడింది కదా!” (ముస్లిం) మరియు ఇబ్నె ఖుజైమ ఇందులో అదనంగా ఇలా నకలు చేశారు: మేము నమాజ్ చేస్తున్నప్పుడు మీపై దరూద్ ఎలా పంపాలి?)
English
Narrated Abu Mas'ud Al-Ansari (RA): Bashir bin Sa'd said, "Allah has commanded us to invoke blessings on you, O Messenger of Allah! But how should we bless you?" Allah's Messenger (ﷺ) kept quiet (a while) and then said, "Say: 'O Allah, bless Muhammad and the members of his family as You have blessed Ibrahim, and grant favours to Muhammad and the members of his family as You have granted favours to Ibrahim. In the worlds You are indeed Praiseworthy and Glorious.' And the Taslim is as you know. [Reported by Muslim].
Ibn Khuzaimah added to it: "How should we invoke blessings on you, whenever we invoke blessing on you in our prayers?"
సారాంశం
నమాజ్‌లో ‘దరూద్’ మరియు ‘సలాం’ పంపటం వాజిబ్ అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. ఇమామ్ షాఫయి సమేతంగా అనేకమంది ఇమాములు దీనిని వాజిబ్గానే తలపోశారు.
ఇక దరూదె షరీఫ్‌లోని వాక్యాలు విభిన్నంగా ఉన్నాయి. వివిధ ఉల్లేఖనాలలో ఈ వైవిధ్యం కానవస్తున్నది. అయితే అన్నింటికన్నా ప్రామాణికమైన ఉల్లేఖనం ఈ హదీసులోనిదే. కనుక దరూద్ పఠించేటప్పుడు ఈ హదీసులోని వాక్యాలకు ప్రాధాన్యత నివ్వటం శ్రేయస్కరం.
హదీసు ఉల్లేఖకులు
(1) అబూ మస్‌వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) : ఈయన అసలు పేరు ఉఖ్బా బిన్ అమ్ర్. అబూ మస్‌వూద్ మారు పేరు. మదీనాలోని అన్సార్ వర్గీయుడవటంచేత అన్సారీగా వ్యవహరించబడ్డారు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్న ప్రముఖ సహచరులలో ఈయన కూడా ఒకరు. రెండవ అఖబా ఒడంబడికలో పాల్గొన్నారు. అయితే అప్పటికి పిన్న వయస్కులు. కూఫాలో స్థిరపడ్డారు. అక్కడే మరణించారు. హిజ్రీ 40 తరువాత మదీనాలో మరణించారని మరొక వినికిడి ఉంది.
(2) బషీర్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) : మరోపేరు అబూ నూమాన్. అన్సారీ. ఖజ్రజీ. బద్ర్ యుద్ధంలోనూ, అఖబా ఒప్పందంలోనూ పాల్గొన్న పెద్ద సహాబీ. ఉహద్ యుద్ధం, కందక యుద్ధం, ఆ తరువాత జరిగిన ముఖ్య యుద్ధాలన్నింటిలో ఈయన పాల్గొన్నారు. ‘ఐనుత్తమర్’లో హిజ్రీ 13లో అమరగతినొందారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 249
హదీసు 250
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ إِذَا تَشَهَّدَ أَحَدُكُمْ فَلْيَسْتَعِذْ بِاَللَّهِ مِنْ أَرْبَعٍ , يَقُولُ : اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ جَهَنَّمَ , وَمِنْ عَذَابِ اَلْقَبْرِ , وَمِنْ فِتْنَةِ اَلْمَحْيَا وَالْمَمَاتِ , وَمِنْ شَرِّ فِتْنَةِ اَلْمَسِيحِ اَلدَّجَّالِ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ : { إِذَا فَرَغَ أَحَدُكُمْ مِنْ اَلتَّشَهُّدِ اَلْأَخِيرِ }
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: – “మీలో ఎవరయినా సరే తషహ్హుద్ పఠించిన మీదట నాలుగు విషయాల నుండి దేవుని శరణు కోరండి. 1) ఓ అల్లాహ్! నరకం నుండి నేను నీ శరణు కోర్తున్నాను. 2) మరియు సమాధి యాతన నుండి నీ శరణు కోర్తున్నాను. 3) జీవన్మరణాల పరీక్ష నుండి నీ శరణు వేడుతున్నాను. 4) ఇంకా – మసీహ్ దజ్జాల్ ఉపద్రవపు కీడు నుండి నీ శరణు కోర్తున్నాను.” (ముస్లిం, బుఖారీ) ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా ఉంది: “మీలో ఎవరయినా సరే ఆఖరి తషహ్హుద్ పఠించటం పూర్తయిన మీదట ఈ నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు కోరండి.”
English
Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you finishes the (last) Tashahhud, he should seek refuge in Allah from four things by saying: 'O Allah I seek refuge in You against the punishment of Jahannam (Hell-fire), the punishment of the grave, the trial of life and death and the evil of the trial of Masih ad-Dajjal (Antichrist)."' [Agreed upon].
In the narration of Muslim: "When any of you finishes the last Tashahhud."
సారాంశం
తషహ్హుద్‌లో దరూద్, సలాం అన్నీ పూర్తయిన మీదట ఈ విధంగా వేడుకోవటం వాజిబ్ అని ఇబ్నె హజమ్ వక్కాణించారు. తాబయీన్లలో ఇమామ్ తావుస్ (రహిమహుల్లాహ్) అభిమతం కూడా ఇదే. కాగా; మిగిలిన పండితులు, విద్వాంసులు దీనిని చివర తషహ్హుద్‌లో – దరూద్ ముగించిన తరువాత పఠించటం అభిలషణీయం (ముస్తహబ్) అని అభిప్రాయపడ్డారు.
సమాధి యాతన అనేది సత్యమని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దీనిని గనక కాదంటే ఖుర్ఆన్, హదీసులను నిరాకరించినట్లవుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 250
హదీసు 251
وَعَنْ أَبِي بَكْرٍ اَلصِّدِّيقِ - رضى الله عنه - { أَنَّهُ قَالَ لِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -عَلِّمْنِي دُعَاءً أَدْعُو بِهِ فِي صَلَاتِي. قَالَ قُلْ : " اَللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا , وَلَا يَغْفِرُ اَلذُّنُوبَ إِلَّا أَنْتَ , فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ , وَارْحَمْنِي , إِنَّكَ أَنْتَ اَلْغَفُورُ اَلرَّحِيمُ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను నమాజ్‌లో చేయగల దుఆ ఏదయినా నాకు ఉపదేశించండి అని నేను దైవప్రవక్త ﷺను విన్నవించుకోగా, ఆయన ﷺ ఇలా అన్నారు- “ఈ దుఆ పఠించండి – అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ…. (అర్థం: ఓదేవా! నేను నా ఆత్మకు ఎంతో అన్యాయం చేశాను. నీవు తప్ప పాపాలను మన్నించగల వాడెవడూ లేడు. కనుక నీ తరపున నాకు క్షమాభిక్షను ప్రసాదించు. నాపై దయజూపు. నిస్సందేహంగా నీవు మాత్రమే క్షమించేవాడవు, నిత్యం కటాక్షించేవాడవు)” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Abu Bakr as-Siddiq (RA): He said to Allah's Messenger (ﷺ), "Teach me a supplication to use in my prayer." He (ﷺ) said: "Say: O Allah, I have greatly wronged myself, and no one forgives sins except You, so grant me forgiveness from You and have mercy on me, You are the Forgiving and the Merciful One." [Agreed upon].
సారాంశం
ప్రతి మనిషీ తన వల్ల జరిగిన పాపాలపై, లోటుపాట్లపై సిగ్గుతో కుమిలిపోతూ క్షమాపణ కొరకు దైవాన్ని ప్రార్థించాలని ఈ హదీసు చెబుతోంది. ఎందుకంటే మానవుని వల్ల నిత్యం తప్పులు, పొరబాట్లు జరుగుతుంటాయి. అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) లాంటి పుణ్యపురుషులే దీనికి అతీతులు కానపుడు ఇతరుల లెక్కెముంది?
హదీసు ఉల్లేఖకులు
అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ ఉస్మాన్. అబూబక్ర్ మారు పేరు. సిద్దీఖ్ అనేది ఆయన బిరుదు. ‘తైమ్’ తెగకు చెందినవారు. దైవప్రవక్త ﷺ పరమపదించిన పిదప తొలి ధర్మఖలీఫాగా ఎన్నికయ్యారు. దైవప్రవక్తల (అలైహిముస్సలాం) తరువాత మానవకోటిలో అత్యుత్తములు. మదీనాకు హిజ్రత్ చేసినప్పుడు దైవప్రవక్త ﷺకు తోడుగా ఉన్నారు. సూర్ గుహలో దైవప్రవక్త ﷺ వెంటవున్న ఘనత ఈయనకు దక్కింది. అందుకే ఈయన్ని ‘గుహవాసి’గా కూడా వ్యవహరిస్తారు. ఎర్రగా, బక్కపలచగా ఉండేవారు. పొగడ్తల కతీతమైన వ్యక్తిత్వం. వజ్ర సంకల్పులు. దైవమార్గంలో ఆయన చూపిన సహనస్థయిర్యాలు అనుపమమైనవి. మిత్రుల పాలిట దయార్ద్ర హృదయులు. ధర్మవిరోధుల పాలిట కొరుకుడు పడని తత్వం. సత్యధర్మం విషయంలో ఎన్నటికీ రాజీ ధోరణి నవలంబించలేదు. హిజ్రీ 13వ సంవత్సరం జమాదివుల్ ఆఖిర్లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 251
హదీసు 252
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍ - رضى الله عنه - قَالَ : { صَلَّيْتُ مَعَ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَكَانَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ : " اَلسَّلَام عَلَيْكُمْ وَرَحْمَةُ اَللَّهِ وَبَرَكَاتُهُ " وَعَنْ شِمَالِهِ : " اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اَللَّهِ وَبَرَكَاتُهُ } رَوَاهُ أَبُو دَاوُدَ بِسَنَدٍ صَحِيحٍ.
హజ్రత్ వాయల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: “నేను దైవ ప్రవక్త ﷺతో కలిసి నమాజ్ చేశాను. ఆయన ﷺకుడివైపుకు సలాం చేస్తూ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అన్నారు. అలాగే ఎడమ వైపునకు సలాం చేస్తూ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అన్నారు.”
(అబూదావూద్ దీనిని ప్రామాణికమయిన ఆధారాలతో ఉల్లేఖించారు)
English
Narrated Wa'il bin Hujr (RA): I prayed with the Prophet (ﷺ) and he would give the Taslim (salutation) to his right side (saying), "Peace be upon you and the mercy and blessings of Allah"; and to his left side (saying), "Peace be upon you and mercy and the blessings of Allah." [Reported by Abu Dawud, with a Sahih (authentic) chain].
సారాంశం
నమాజ్ చివరిలో చేసే ‘సలాం’లో ‘వ బరకాతుహు’ అనే అదనపు పదం సహీహ్ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఈ అంశం క్రింద వచ్చిన అనేక హదీసులలో ఈ అదనపు పదం లేకపోయినప్పటికీ దీని ప్రామాణికతపై ఎలాంటి సంశయానికి తావులేదు. హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) “నతాయజుల్ అఫ్కార్”లో దీనిపై వివరంగా చర్చించారు. అందుచేత ‘అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అని అనటం సమంజసమే.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 252
హదీసు 253
وَعَنْ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةٍ - رضى الله عنه - أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -{ كَانَ يَقُولُ فِي دُبُرِ كُلِّ صَلَاةِ مَكْتُوبَةٍ : " لَا إِلَهَ إِلَّا اَللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ , لَهُ اَلْمُلْكُ , وَلَهُ اَلْحَمْدُ , وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ , اَللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ , وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ , وَلَا يَنْفَعُ ذَا اَلْجَدِّ مِنْكَ اَلْجَدُّ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రతి ఫర్జ్ నమాజు చివర్లో ఈ దుఆ చేసేవారు : “లా ఇలాహ ఇల్లల్లాహు…. (అర్థం : అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఏకేశ్వరుడు, సహవర్తులెవరూ లేనివాడు. రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభాయమానం. ఆయన ప్రతిదాన్నీ చేయగల సమర్థుడు. ఓ అల్లాహ్! నీవు అనుగ్రహించిన దానిని ఎవరూ ఆపలేరు. నీవు ఆపిన దానిని ఇప్పించగల వాడెవడూ లేడు. నీకు వ్యతిరేకంగా ఏ భాగ్యవంతుడికీ అతని భాగ్యాలు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేవు)” (బుఖారీ, ముస్లిం)
English
Narrated al-Mughira bin Shu'bah (RA): The Prophet (ﷺ) used to say after every obligatory prayer: "There is nothing worthy of worship except Allah Alone, Who has no partner. To Him belongs the kingdom, to Him praise is due, and He has power over every thing. O Allah no one can withhold what You have given, or give what You have withheld and riches cannot avail a wealthy person against You." [Agreed upon].
సారాంశం
ఫర్జ్ నమాజ్‌ను ముగించిన వెంటనే ఈ దుఆ చేయాలి. ఈ దుఆలో ఒక వైపు దేవుని వైభవం చాటబడింది – మరోవైపు దాసుని నిస్సహాయస్థితి కూడా వ్యక్తపరచబడింది. యదార్థానికి మనిషి అక్కరలను తీర్చేవాడు, అతన్ని కటాక్షించేవాడు ఆయన మాత్రమే. భూమ్యాకాశాలలో వున్నదంతా ఆయన సొంతం. ఎవరికి ఏది ఇవ్వాలన్నా, ఏది ఇవ్వకూడదనుకున్నా – అది ఆయన ఇష్టాయిష్టాలపై ఆధారపడివుంది. సాటిలేని స్వామి ఆయన. ప్రాపంచిక పదవులు, ఆస్తీ అంతస్తులు ఆయన చలువతోనే మనిషికి ప్రాప్తమవుతాయి. ఆయన కటాక్షం లేనంతవరకూ ఎవరి ఐశ్వర్యం కూడా వారికి అచ్చిరాదు. దేవుని ఏకత్వానికి ఈ దుఆ మచ్చుతునక లాంటిది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 253
హదీసు 254
وَعَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ - رضى الله عنه - أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -كَانَ يَتَعَوَّذُ بِهِنَّ دُبُرَ كُلِّ صَلَاةٍ : " اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ اَلْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ اَلْجُبْنِ , وَأَعُوذُ بِكَ مِنْ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ اَلْعُمُرِ , وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ اَلدُّنْيَا , وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ اَلْقَبْرِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ సాద్ బిన్ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవ ప్రవక్త ﷺ ప్రతి నమాజ్ చివర్లో ఈ ‘తఅవ్వుజ్’ను పఠించేవారు : అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక….. (అర్థం: దేవా! పిసినారితనం నుండి, పిరికితనం నుండి నేను నీ శరణు కోర్తున్నాను. హీనాతి హీనమైన వృద్ధాప్యం వైపునకు మరలించబడటం నుండి నీ శరణు వేడుతున్నాను. ప్రాపంచిక పరీక్ష నుండి, సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను.” (బుఖారీ)
English
Narrated Sa'd bin Abi Waqqas (RA): Allah's Messenger (ﷺ) used to seek Allah's protection by invoking this supplication (Du'a) at the end of every Salat (prayer): "O Allah, I seek refuge in You from stinginess, I seek refuge in You from cowardice, I seek refuge in You from old age (and senility), I seek refuge in You from the temptation of the world and I seek refuge in You from the punishment in the grave." [Reported by al-Bukhari].
సారాంశం
హదీసు వాక్యాలను బట్టి ఈ దుఆ నమాజ్ చివరిలో ‘సలాం’ చేయక మునుపు, సలాం చేసిన తరువాత కూడా పఠించవచ్చునని అర్థమవుతున్నది. ఎంతో అర్థవంతమైన, సమగ్రమైన దుఆ ఇది. దీన్ని సాధ్యమైనంతవరకు చేస్తూ ఉండటం మంచిది.
హదీసు ఉల్లేఖకులు
అసలు పేరు సాద్ బిన్ వఖ్ఖాస్. మరోపేరు అబూ ఇస్హాఖ్. తండ్రి పేరు మాలిక్. ఖురైషు వంశీయులు. ఇస్లాం స్వీకరించిన వారిలో ఐదవవారు. ప్రపంచ జీవితంలోనే స్వర్గలోక శుభవార్త పొందిన పదిమందిలో ఈయనా ఉన్నారు. దైవమార్గంలో విలువిద్యను ఆచరణలో పెట్టిన ప్రథమ వ్యక్తి ఈయన. అంటే మొట్టమొదట ఈయనే బాణం ప్రయోగించారు. యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ఇరాక్‌ను జయించారు. పొట్టివారు. కాని గట్టివారు. గోధుమ వర్ణం ఛాయ. మదీనాకు పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘అఖీఖ్’లో తనువు చాలించారు. అక్కడి నుంచి ఈయన భౌతిక కాయం మదీనా తేబడింది. హిజ్రీ 55లో జన్నతుల్ బఖీలో ఖననం చేయబడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 254
హదీసు 255
وَعَنْ ثَوْبَانَ - رضى الله عنه - قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -إِذَا اِنْصَرَفَ مِنْ صَلَاتِهِ اِسْتَغْفَرَ اَللَّهَ ثَلَاثًا , وَقَالَ : " اَللَّهُمَّ أَنْتَ اَلسَّلَامُ وَمِنْكَ اَلسَّلَامُ. تَبَارَكْتَ يَا ذَا اَلْجَلَالِ وَالْإِكْرَامِ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ సోబాన్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవ ప్రవక్త ﷺ సలాం చేసిన మీదట మూడు సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని పలికేవారు. ఆ తరువాత ‘అల్లాహుమ్మ అన్తస్సలాము, వ మిన్కస్సలాము, తబారక్త యా జల్ జలాలి వల్ ఇక్రామ్” పఠించేవారు. (అర్థం : ఓ అల్లాహ్! నీవు శాంతిగల వాడవు. శాంతి నీ వైపు నుంచే ఉంది. ఓ ఘనత్వం, గౌరవోన్నతులు గలవాడా! నీవు ఎంతో శుభవంతుడవు) (ముస్లిం)
English
Narrated Thauban (RA): Whenever Allah's Messenger (ﷺ) finished his prayer, he used to say after asking Allah's forgiveness three times: "O Allah, You are as-Salam (One Free from every defect), and as-Salam (safety from every evil) is (sought) from You. Blessed are You, O Possessor of glory and honour." [Reported by Muslim].
సారాంశం
ఈ హదీసు ద్వారా నమాజ్ సందర్భంగా చేసే పై దుఆల ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతున్నది. నమాజ్ చేస్తున్నప్పుడు మానవ సహజమయిన దౌర్బల్యాల వల్ల తప్పులు జరగవచ్చు. మరుపుకు గురికావచ్చు. నమాజులో పలు ఆలోచనలు రావచ్చు. మనసు నమాజులో లగ్నం కాలేకపోవచ్చు. వీటన్నింటికీ మందు ఒక్కటే – క్షమాభిక్ష! దాసుడు తన అశక్తతను వెలిబుచ్చి, ప్రభువును క్షమాపణ కోరుకుంటే ఆయన తన దయతో మన్నించి నమాజును స్వీకరించే అవకాశం ఉంది.
దైవప్రవక్త ‘ఇస్తిగ్ఫార్’ ఎలా చేసేవారు? అని ఇమామ్ ఔజాయి (రహిమహుల్లాహ్) ని ఎవరో ప్రశ్నించగా, “దైవప్రవక్త ﷺ అస్తగ్ఫిరుల్లాహ్ -అస్తగ్ఫిరుల్లాహ్ – అస్తగ్ఫిరుల్లాహ్” అని అనేవారని ఆయన జవాబిచ్చారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 255
హదీసు 256
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنْ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ : { مَنْ سَبَّحَ اَللَّهَ دُبُرَ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِينَ , وَحَمِدَ اَللَّهِ ثَلَاثًا وَثَلَاثِينَ , وَكَبَّرَ اَللَّهُ ثَلَاثًا وَثَلَاثِينَ , فَتِلْكَ تِسْعٌ وَتِسْعُونَ , وَقَالَ تَمَامَ اَلْمِائَةِ : لَا إِلَهَ إِلَّا اَللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ , لَهُ اَلْمُلْكُ , وَلَهُ اَلْحَمْدُ , وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ , غُفِرَتْ لَهُ خَطَايَاهُ , وَلَوْ كَانَتْ مِثْلَ زَبَدِ اَلْبَحْرِ } رَوَاهُ مُسْلِمٌ. [وَفِي رِوَايَةٍ أُخْرَى : أَنَّ اَلتَّكْبِيرَ أَرْبَعٌ وَثَلَاثُونَ].
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺఉపదేశించారు – “ఎవరయితే ప్రతి నమాజులో సలాం చేసిన మీదట 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్ హమ్దు లిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్ అని కూడా పలికాడో – ఇవి మొత్తం 99 అవుతాయి – మరియు నూరును పూర్తి చేయడానికి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీకలహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్ అని పలికాడో, అతని పాపాలన్నీ-వాటి సంఖ్య సముద్రంలోని బుడగల సంఖ్యకు సమానంగా ఉన్నాసరే – క్షమించి వేయబడతాయి. (ముస్లిం) వేరొక ఉల్లేఖనంలో 34వ సారి ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి అని వుంది.
English
Narrated Abu Hurairah (RA) Allah's Messenger (ﷺ) said: "Whoever glorifies Allah (by saying Subhan-Allah) after every Salat (prayer) thirty-three times, and praises Allah (by saying Alhamdu-lillah) thirty-three times, and exalts Allah (by saying Allahu Akbar) thirty-three times, those are ninety-nine in all, and says to complete a hundred: La ilaha ill-Allahu, wahdahu la sharika lahu, lahul-mulku wa lahulhamdu, wa Huwa 'ala kulli shai'in Qadir (There is nothing which deserves to be worshipped except Allah Alone Who has no partner; to Him belongs the kingdom, to Him praise is due, and He has power over everything), his sins will be forgiven, even if they are as abundant as the foam of the sea." [Reported by Muslim].
In another narration it is mentioned: "at-Takbir (Allah is the Most Great) is thirty-four times."
సారాంశం
ప్రతి నమాజ్ ఆఖరిలో – అది ఫర్జ్ నమాజయినా, నఫిల్ నమాజయినా – ఈ కలిమాలు (వచనాలు) పలకటం ‘మస్నూన్’ అని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. అయితే కొంతమంది పండితులు ఈ ‘తస్బీహ్’ ఫర్జ్ నమాజులకే వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ తస్బీహ్ పూర్వాపరాలిలావున్నాయి – ఒకరోజు కొంతమంది ముహాజిర్ పేదలు దైవప్రవక్త ﷺ సన్నిధిలోకి వచ్చి ‘ఓ దైవప్రవక్తా! ధనవంతులు పుణ్యకార్యాలన్నీ జుర్రుకుంటున్నారు. వాళ్ళూ మాలాగే నమాజ్ చేస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు. దానధర్మాలు కూడా మాకన్నా ఎంతో ఎక్కువగా చేస్తున్నారు. మేము (దాన ధర్మాలలో) వాళ్ళతో పోటీపడలేకపోతున్నాము (ఎందుకంటే మా దగ్గర సిరి సంపదలు లేవు)’ అని విన్నవించుకోగా ఆయన ﷺ వారికి ఈ తస్బీహ్ గురించి బోధించారు….
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 256
హదీసు 257
وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ - رضى الله عنه - { أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ لَهُ : " أُوصِيكَ يَا مُعَاذُ : لَا تَدَعَنَّ دُبُرَ كُلِّ صَلَاةٍ أَنْ تَقُولُ : اَللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِكَ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ بِسَنَدٍ قَوِيٍّ.
హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺనాకిలా ఉపదేశించారు – ఓ ముఆజ్! ప్రతి నమాజును ముగించిన తరువాత ఈ వచనాలను విస్మరించరాదని నేను నీకు వసీయతు చేస్తున్నాను- “అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక”. (అర్థం : ఓ అల్లాహ్! నాకు నీ ధ్యానం చేసే, నీకు కృతజ్ఞతలు తెలిపే, అత్యుత్తమ రీతిలో నిన్ను ఆరాధించే సద్బుద్ధి నొసగు) (దీనిని అహ్మద్, అబూదావూద్, నసాయి దృఢమయిన ఆధారాలతో ఉల్లేఖించారు).
English
Narrated Mu'adh bin Jabal (RA) Allah's Messenger (ﷺ) told me, "O Mu'adh, I will give you some advice – Never leave the recitation of this supplication after every prayer: 'O Allah, help me to remember You, thank You, and worship You perfectly.'" [Ahmad, Abu Dawud and an-Nasa'i reported it through a strong chain of narrators].
సారాంశం
‘విస్మరించరాదు’ అని తాకీదు చేయడాన్నిబట్టి దీనికెంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నమాజు తర్వాత – ముఖ్యంగా ఫర్జ్ నమాజు ముగించిన తరువాత ఈ దుఆను తప్పక పఠించాలి. దీన్ని విడనాడటం మంచిది కాదు. ఈ దుఆయేగాక హదీసు గ్రంథాలైన ముస్లిం, అబూదావూద్, నసాయి, అహ్మద్, తిర్మిజీలలోని మరెన్నో దుఆలను ఆయన ﷺ చేసినట్లు ఆధారాలున్నాయి. సాధ్యమయినంతవరకు వాటిని కంఠస్థం చేసుకుని పఠిస్తే మన స్వయానికి ప్రయోజనం చేకూరటమేగాక, ప్రవక్త ﷺ గారి సున్నత్‌కు ప్రాచుర్యం ఇచ్చినట్లవుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 257
హదీసు 258
وَعَنْ أَبِي أُمَامَةَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ قَرَأَ آيَةَ اَلْكُرْسِيِّ دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ اَلْجَنَّةِ إِلَّا اَلْمَوْتُ } رَوَاهُ النَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ. وَزَادَ فِيهِ اَلطَّبَرَانِيُّ : { وَقُلْ هُوَ اَللَّهُ أَحَدٌ }
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – ఏ వ్యక్తయితే ప్రతి ఫర్జ్ నమాజ్ తరువాత ‘ఆయతుల్ కుర్సీ’ పఠించాడో అతన్ని స్వర్గంలో ప్రవేశించకుండా మృత్యువు తప్ప మరేదీ అడ్డుకోజాలదు (అంటే మరణించగానే అతనికై స్వర్గం సిద్ధంగా ఉంటుంది. అయితే అతని విశ్వాసంలో ‘తౌహీద్’ ఉండాలి) (దీనిని నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ ప్రామాణికంగా ఖరారు చేశారు – తబ్రానీ ఇందులో ‘ఖుల్‌హు వల్లాహు అహద్’ను కూడా చేర్చారు.)
English
Narrated Abu Umamah (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever recites Ayat al-Kursi at the end of every obligatory prayer, nothing but death will prevent him from entering Paradise." [An-Nasa'i reported it, and Ibn Hibban graded it Sahih (authentic).
at-Tabarani has the addition: "Say [O Muhammad (ﷺ)]: "He is Allah, (the) One. (Surat al-lkhlas – Surat No. 112)
సారాంశం
‘ఆయతుల్ కుర్సీ’ మహాత్మ్యం గురించి ఆయన ﷺ ప్రవచనాలనేకం ఇతర హదీసు గ్రంథాలలో కూడా ఉన్నాయి. దీని మహాత్మ్యానికి గల అనేక కారణాలలో ఒకటి: దేవుని ఏకత్వానికి సంబంధించి ఇందులో స్పష్టంగా చెప్పబడటమే అయివుండవచ్చు. ఇందులో దేవుని ఏకత్వంతోపాటు, ఆయన గుణవిశేషాలు, అపారమయిన అధికారాలు, ఆధిపత్యాల ప్రస్తావన ఉంది. అందుకే ఇది అల్లాహ్‌కు ఎంతో ప్రీతికరమయినది.
సూరయె ఇఖ్లాస్ కూడా అటువంటిదే. అది మూడవ వంతు ఖుర్ఆన్కు సమానంగా పుణ్యం కలిగినది. ఇస్లాం విశ్వాసాలు మౌలికంగా మూడు – (1) తౌహీద్ (2) రిసాలత్ (3) ఆఖిరత్. కాగా; ఈ సూరా (ఖుల్‌హు వల్లాహు అహద్) తౌహీద్ (దేవుని ఏకత్వం) తో నిండి వుంది. అందుచేత ఈ సూరా కూడా అల్లాహ్‌కు ఎంతో ఇష్టకరమయినది. అందువల్ల ఏ మనిషి ఫర్జ్ నమాజ్ తరువాత వీటిని మనస్ఫూర్తిగా పారాయణం చేస్తాడో అతడు మరణించిన వెంటనే స్వర్గంలో పంపబడతాడు – ఇన్షా అల్లాహ్!
హదీసు ఉల్లేఖకులు
అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) మారుపేరు. అసలు పేరు ఇయాస్ బిన్ సాలబ బలవీ. అన్సార్‌కు చెందిన బనూ హరిసా తెగకు మద్దతుదారులు. సహాబీగా గుర్తించబడే భాగ్యం పొందారు. ఈయన చేత అనేక హదీసులు ఉల్లేఖించబడ్డాయి. తల్లి సేవలో ఉండటం వల్ల బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 258
హదీసు 259
وَعَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ మాలిక్ బిన్ హువైరిస్(రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు : “ఏ విధంగా నన్ను నమాజ్ చేస్తుండగా మీరు చూశారో ఆ విధంగానే నమాజ్ చేయండి.” (బుఖారీ)
English
Narrated Malik bin Al-Huwairith (RA): Allah's Messenger (ﷺ) said: "Pray as you have seen me praying." [Reported by al-Bukhari].
సారాంశం
దైవప్రవక్త ﷺ ఆనాడు ప్రత్యక్షంగా తన సహచరులనుద్దేశించి ఈ మాటలన్నప్పటికీ ముస్లిం సమాజ సభ్యుడైన ప్రతి వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. నమాజ్‌లో ఆయన ﷺ ఏ ఏ క్రియను ఏ విధంగా ఆచరించారో సరిగ్గా అదేవిధంగా ఆచరించటం వాజిబ్ అని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నదని అమీర్ యమానీ వ్యాఖ్యానించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 259
హదీసు 260
]وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ -رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : { قَالَ لِي رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -" صَلِّ قَائِمًا , فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا , فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ , وَإِلَّا فَأَوْمِ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
దైవప్రవక్త ﷺ తనకు ఉపదేశించారని హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “నమాజ్‌ను నిలబడి చేయండి. ఒకవేళ నిలబడి చేయలేకపోతే కూర్చుని చేయండి. ఒకవేళ కూర్చుని చేసే శక్తి కూడా లేకపోతే ప్రక్క ఆధారంగా పరుండి చేయండి. వీటిలో ఏ ఒక్కటీ చేయలేకపోతే సైగ ద్వారా (నమాజ్) చేయండి.” (బుఖారీ)
English
Narrated 'Imran bin Husain (RA): Allah's Messenger (ﷺ) said: "Pray standing and if you are unable, pray sitting and if you cannot, pray lying on your side, [otherwise pray by signs]." [Reported by al-Bukhari, (without the final words)].
సారాంశం
ఎట్టి పరిస్థితిలో కూడా నమాజ్ క్షమార్హం కాదనీ, ఒక్క స్పృహ కోల్పోయిన స్థితిలో మాత్రమే దీనినుండి మినహాయింపు లభిస్తుందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. సాధారణంగా నమాజ్‌ను నిలబడి నెరవేర్చటం మంచిది. అస్వస్థత కారణంగా నిలబడలేకపోతే కూర్చుని చేయవచ్చు. అదీ సాధ్యం కాకపోతే పండుకుని చేయవచ్చు. అత్యంత హీన దశలో సైగ ద్వారా కూడా నమాజ్ చేయవచ్చు. అంటే ఏ పరిస్థితిలో కూడా మనిషి నమాజ్‌ను త్యజించరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 260
హదీసు 261
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ لِمَرِيضٍ - صَلَّى عَلَى وِسَادَةٍ , فَرَمَى بِهَا - وَقَالَ : " صَلِّ عَلَى اَلْأَرْضِ إِنْ اِسْتَطَعْتَ , وَإِلَّا فَأَوْمِئْ إِيمَاءً , وَاجْعَلْ سُجُودَكَ أَخْفَضَ مِنْ رُكُوعِكَ } رَوَاهُ اَلْبَيْهَقِيُّ بِسَنَدٍ قَوِيٍّ وَلَكِنْ صَحَّحَ أَبُو حَاتِمٍ وَقْفَهُ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ, ఒక వ్యాధిగ్రస్తుడు దిండుపై నమాజ్ చేస్తుండగా గమనించి ఆ దిండును పారవేశారు. “చేయగలిగితే నేలపై నమాజ్ చెయ్యి. లేకుంటే సైగతో (నమాజ్) చెయ్యి. అయితే సజ్దాను రుకూ కన్నా కాస్త దిగువ ఉండేలా చూసుకో” అని అతనికి ఉపదేశించారు. (దీనిని బైహఖీ దృఢమయిన ఆధారంతో ఉల్లేఖించారు. అయితే అబూ హాతిమ్ దీనిని ‘మౌఖూఫ్’గా ఖరారు చేశారు).
English
Narrated Jabir (RA): The saying of the Prophet (ﷺ) to a sick person who prayed on a cushion: The Prophet (ﷺ) threw it away and said, "Pray on the ground, if you are able to do so; otherwise, pray by gesturing signs and make your prostration lower than your bowing." [al-Baihaqi reported it through a strong chain of narrators, but Abu Hatim regarded it as Mauquf (saying of a Companion)].
సారాంశం
నమాజీ ఎత్తయిన వస్తువుపై సజ్దా చేయటం సమంజసం కాదన్న దానికి ఈ హదీసు ఒక నిదర్శనం. అతడు సజ్దా చేయదలచుకుంటే నేలపైనే చేయాలి. అలా చేయలేకపోవటానికి ఏదయినా బలమైన కారణముంటే, సైగతోనే అతడు నమాజ్ చేయాలి. అయితే సజ్దా చేయవలసి వచ్చినపుడు రుకూ కన్నా కాస్త ఎక్కువగా వంగాలి. ఎట్టి పరిస్థితిలోనూ మనిషి తన సృష్టికర్తతో సంబంధం త్రెంచుకోజాలడనీ, అనుదినం, అనుక్షణం అతని మనో మస్తిష్కాలలో దేవుడు మెదలుతూ ఉండాలనీ ఈ హదీసు ద్వారా సూచన లభిస్తోంది. ఇదే అసలు దైవదాస్యానికి ప్రతీక.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.7 నమాజ్ చేసే విధానం|హదీసు 261
You must be logged in to post a comment.