హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.6 మస్జిద్ వ్యవస్థ

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 6వ అధ్యాయం: మస్జిద్ వ్యవస్థ. ఈ అధ్యాయంలో 15 హదీసులు (హదీసు 195 – 209) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.6 మస్జిద్ వ్యవస్థ

↑ విషయ సూచిక

باب المساجد

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

195

హదీసు 195

عَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ : { أَمَرَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بِبِنَاءِ اَلْمَسَاجِدِ فِي اَلدُّورِ , وَأَنْ تُنَظَّفَ , وَتُطَيَّبَ.‏ } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ , وَاَلتِّرْمِذِيُّ , وَصَحَّحَ إِرْسَالَهُ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: ఇండ్లల్లో (మరియు పేటల్లో) నమాజ్ చేసే స్థలాలను నిర్ధారించుకోవాలనీ, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ దైవప్రవక్త ﷺ ఆదేశించారు. (అహ్మద్, అబూదావూద్, తిర్మిజీలు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘ముర్సల్’గా ఖరారు చేశారు)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) ordered that the mosques be built in residential districts and that it be cleaned and perfumed. [Reported by Ahmad, Abu Dawud, and at-Tirmidhi. The latter considered it Mursal [missing link in the chain after the Tabi'i (student of a Companion)].

సారాంశం

మస్జిదును, నమాజ్ చేసే స్థలాలను పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. సాధ్యమైనంతవరకు ఆ స్థలాలలో సువాసనను, పరిమళాన్ని వెదజల్లాలి. హదీసులో ‘దువర్’ అనే పదం వచ్చింది. దీని అర్థం వీధి అనీ, పేట అనీ వస్తుంది. అంటే మనం నివసించే పట్టణంలో పెద్ద మస్జిదుతో పాటు చిన్న చిన్న మస్జిదులను కూడా పేటల్లో, బస్తీలలో నిర్మించుకోవాలి. వాటిని చాలా పరిశుభ్రంగా ఉంచాలి. సుగంధద్రవ్యాల గుభాళింపుతో వాటిని అత్యంత పరిశుద్ధంగా ఉంచాలి. మన ఇండ్లల్లో కూడా ఏదో ఒక గదిని లేక మూల ప్రదేశాన్ని నమాజ్ కొరకు కేటాయించి దానిని ఎంతో నీటుగా ఉంచాలి. ఈ స్థలంలో ఇంటి ఆడవాళ్ళు నమాజ్ చేయటంతో పాటు మగవారు కూడా సున్నత్, నఫిల్ నమాజులను ఆచరించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 195

196

హదీసు 196

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ قَاتَلَ اَللَّهُ اَلْيَهُودَ : اِتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ } مُتَّفَقٌ عَلَيْه ِ وَزَادَ مُسْلِمُ { وَالنَّصَارَى } وَلَهُمَا : مِنْ حَدِيثِ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- : { كَانُوا إِذَا مَاتَ فِيهِمْ اَلرَّجُلُ اَلصَّالِحُ بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا } وَفِيهِ : { أُولَئِكَ شِرَارُ اَلْخَلْقِ }

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: దేవుడు యూదులను సర్వనాశనం చేయుగాక! వాళ్ళు దైవప్రవక్తల సమాధులను సాష్టాంగ (సజ్దా) స్థలంగా చేసుకున్నారు. (బుఖారీ, ముస్లిం – ముస్లింలో ‘క్రైస్తవులు’ అన్న పదం కూడా చేర్చబడింది)

బుఖారీ, ముస్లింలలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చే ఇలా ఉల్లేఖించబడింది: “వారిలో పుణ్యపురుషుడు ఎవరయినా మరణిస్తే వాళ్ళు ఆయన సమాధిని ‘సజ్దా’గా చేసుకునేవారు.” ఈ హదీసులో “వాళ్ళు అత్యంత నీచమయిన జీవులు” అన్న వాక్యం కూడా ఉంది.

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "May Allah curse the Jews! They have turned the graves of their Prophets into mosques." [Agreed upon].

Muslim added: "and Christians."

Narrated 'Aishah (RA) in al-Bukhari and Muslim [that Allah's Messenger (ﷺ) said], "When a pious person amongst them (the Jews and Christians) died they used to build a place of worship and prostration on his grave." In the same Hadith is: "Those are the worst of creatures."

సారాంశం

దివ్య ఖుర్ఆన్ ప్రకారం వీళ్ళు (యూదులు, క్రైస్తవులు) గ్రంథవహులు. వారికి ఆకాశ గ్రంథాలు ప్రసాదించబడ్డాయి. కాని విచారకరమయిన విషయం ఏమిటంటే వారు గ్రంథజ్ఞానం ఉండికూడా ప్రవక్తల సమాధులను పూజా స్థలాలుగా చేసుకున్నారు. ఆ సమాధుల వద్ద తమ కోరికలు వెలిబుచ్చుతూ మొక్కుకునేవారు. నిషిద్ధమయిన, అధర్మమయిన ఈ చేష్టను యూదులు మొదలెట్టగా, క్రైస్తవులు కూడా వారి పంథాలోనే నడవసాగారు. ఈ విధంగా వీళ్ళు సృష్టికర్త దృష్టిలో అత్యంత తీవ్రమయిన, క్షమార్హం కాని షిర్క్ (బహుదైవోపాసన) కు ఒడిగట్టారు. కాగా; దర్గాల వద్దకు పోయి, సమాధులను ఆరాధనా స్థలాలుగా మారుస్తున్న నేటి సోకాల్డ్ ముస్లిములు, తాము ఎవరిని అనుసరిస్తున్నారో, తమ ఈ చేష్ట సృష్టికర్త ఆగ్రహాన్ని ఏ విధంగా కొనితెస్తుందో కాస్త ఆలోచించాలి. ముస్లింల ఈ చేష్ట కూడా విగ్రహారాధనా పరిధిలోకి వస్తుందనటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ఈ పనిని అన్యులు చేస్తే అది శాపగ్రస్తమూను, ముస్లిములు చేస్తే పుణ్యప్రదమూనా?! ఇదెక్కడి ధర్మం? ఇది ఆత్మ వంచన తప్ప మరేమీ కాదు. అల్లాహ్ ముస్లిములకు ఇలాంటి వికృత చేష్టలకు దూరంగా మెలిగే సద్బుద్ధి నొసగుగాక!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 196

197

హదీసు 197

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { بَعَثَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-خَيْلاً , فَجَاءَتْ بِرَجُلٍ , فَرَبَطُوهُ بِسَارِيَةٍ مِنْ سَوَارِي اَلْمَسْجِدِ } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఒకసారి ఓ చిన్న సైనిక (గస్తీ) దళాన్ని ఏదో ప్రాంతం వైపునకు పంపించారు. ఆ సైనికులు ఒక (ముష్రిక్) వ్యక్తిని నిర్బంధించి దైవప్రవక్త ﷺ సన్నిధిలోకి తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని మస్జిదె నబవీ స్తంభాలలోని ఒక స్తంభానికి కట్టివేశారు (ఖైదీగా బంధించారు). (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): The Prophet (ﷺ) sent an expedition of horsemen who came back with a man, they then tied him to one of the pillars of the mosque. [Agreed upon].

సారాంశం

అవసరమైనప్పుడు ముష్రిక్కును మస్జిద్‌లోకి రప్పించటం, మస్జిదును కారాగారంగా ఉపయోగించటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఇందులో అనేక పరమార్థాలు దాగి వున్నాయి. నిర్బంధితుడైన అవిశ్వాసి ముస్లింల ఆరాధనా రీతులను దగ్గరినుంచి గమనిస్తాడు. వాళ్ళు ఏవిధంగా బారులు తీరి, హెచ్చుతగ్గులు లేకుండా నిలబడుతున్నారో, ఏవిధంగా ఒకే సమయంలో దైవ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో, ఏవిధంగా దివ్య గ్రంథపారాయణం చేస్తున్నారో శ్రద్ధగా తిలకిస్తాడు. ప్రభావితుడవుతాడు. హదీసులో నిర్బంధితునిగా తీసుకురాబడిన వ్యక్తి యమామ ప్రాంతపు నాయకుడు సమామ బిన్ ఉసాల్. ఉమ్రా చేసే ఉద్దేశ్యంతో వెళుతూ పట్టుబడ్డాడు. మస్జిదె నబవీ (ప్రవక్త మస్జిద్)లో ఆ వ్యక్తిని దైవప్రవక్త ﷺ మూడు రోజులపాటు బంధించి ఉంచారు. ఎట్టకేలకు అతడు ఇస్లాం మాధుర్యాన్ని ఆస్వాదించాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 197

198

హదీసు 198

وَعَنْهُ ‏- رضى الله عنه ‏- { أَنَّ عُمَرَ مَرَّ بِحَسَّانَ يَنْشُدُ فِي اَلْمَسْجِدِ , فَلَحَظَ إِلَيْهِ , فَقَالَ : "قَدْ كُنْتُ أَنْشُدُ , وَفِيهِ مَنْ هُوَ خَيْرٌ مِنْكَ }. مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు హజ్రత్ హస్సాన్ (రదియల్లాహు అన్హు) కూర్చున్న వైపు నుండి వెళుతున్నారు. ఆయన మస్జిద్‌లో కూర్చుని కవితలు చెబుతున్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన వంక తీక్షణంగా చూచారు. ‘(ఎందుకలా కొరకొరా చూస్తారు?) మస్జిద్‌లో మీకన్నా శ్రేష్ఠులు (దైవప్రవక్త – సఅసం) ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే కవిత్వం చెప్పేవాడిని’ అని ఆయన (రదియల్లాహు అన్హు) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Abu Hurairah (RA)]: Umar came over Hassan while reciting poetry inside the mosque and looked at him sternly, then he (Hassan) said: "I used to recite poetry inside it (the mosque) in the presence of one who is more pious than you [i.e. the Prophet (ﷺ)]". [Agreed upon].

సారాంశం

ఈ హదీసును బట్టి మస్జిదులో కవితలు చెప్పటం సమ్మతమేగాని ఆ కవిత్వం తౌహీద్ (ఏక దైవారాధన) కు వ్యతిరేకంగా ఉండకూడదు. ఇంకా అందులో బహుదైవోపాసనా భావాలుగానీ, మిథ్యావాదాలుగానీ, ద్వంద్వార్థాలు వచ్చే మాటలుగానీ, నమాజీల ఏకాగ్రతను పాడుచేసే పరాచికాలు గానీ ఉండరాదు. హజ్రత్ హస్సాన్ (రదియల్లాహు అన్హు) మస్జిద్‌లో కూర్చుని అవిశ్వాసుల ఆత్మ విశ్వాసాన్ని నీరుగార్చే కవితలు అల్లేవారు. దైవప్రవక్త ﷺ ఈ కవితల్ని విని “పరిశుద్ధాత్మ నీకు తోడ్పడుగాక! నీ కవితలు అవిశ్వాసులకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి” అని దీవించేవారు.

హదీసు ఉల్లేఖకులు

హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) అన్సార్ సహాబీ. ఖజ్రజ్ తెగకు చెందినవారు. ‘ప్రవక్త ﷺ కవి’గా బిరుదు పొందారు. ఆనాటి పట్టణ కవులలో హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) గారే అందరికన్నా గొప్పవారు. హిజ్రీ 54లో హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మరణించారు. హిజ్రీ 55లో మరణించారని మరికొందరు వాదిస్తున్నారు. మరణ సమయంలో ఆయన వయస్సు 120 సంవత్సరాలన్నది గమనార్హం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 198

199

హదీసు 199

وَعَنْهُ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ سَمِعَ رَجُلاً يَنْشُدُ ضَالَّةً فِي اَلْمَسْجِدِ فَلْيَقُلْ : لَا رَدَّهَا اَللَّهُ عَلَيْكَ , فَإِنَّ اَلْمَسَاجِدَ لَمْ تُبْنَ لِهَذَا } رَوَاهُ مُسْلِم ٌ

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “ఏ మనిషయినా తాను పోగొట్టుకున్న వస్తువును మస్జిద్‌లో వెతుకుతున్నాడని ఎవరైనా వింటే, ‘దైవచిత్తమయితే ఆ వస్తువు దొరకకుండుగాక!’ అని అనండి. మస్జిదులు నిర్మించబడింది ఈ ఉద్దేశ్యం కొరకు కాదు కదా!” (ముస్లిం)

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "Whoever hears a man crying out in the mosque about something he has lost, he should say, 'May Allah not restore it to you', for the mosques were not built for this." [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసులో అందరికీ ఒక హెచ్చరిక ఉంది. ఎక్కడో పోగొట్టుకున్న వస్తువును మస్జిద్‌లో అన్వేషించటంలో అర్థం లేదు. ఇది మస్జిద్ మర్యాదకు విరుద్ధమయిన విషయం. ఈ మధ్య మస్జిదు వేదికలనుండి చేయబడే అనేకానేక ప్రకటనలు కూడా సమంజసమైనవి కావు. అయ్యవారి ఆవులు పోయినా, కామందులవారి కోడిపుంజు కనబడకుండాపోయినా ప్రకటనలు చేయడానికి మస్జిద్ మెంబరే దొరికిందా? ఈ జంతువులు మస్జిద్‌లోకయితే రావుకదా? ఒకవేళ అంతగా అడిగి ఆరా తీయదలచుకుంటే మస్జిద్ గేటు బయట నిలబడి వచ్చేపోయేవారిని అడగవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 199

200

హదీసు 200

وَعَنْهُ : أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا رَأَيْتُمْ مَنْ يَبِيعُ , أَوْ يَبْتَاعُ فِي اَلْمَسْجِدِ , فَقُولُوا : لَا أَرْبَحَ اَللَّهُ تِجَارَتَكَ } رَوَاهُ النَّسَائِيُّ , وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనానుసారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: “మీలో ఎవరినయినా మస్జిద్‌లో క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు మీరు చూస్తే, ‘దేవుడు నీ వర్తకంలో, లావాదేవీలలో లాభం చేకూర్చకుండుగాక!’ అని అనండి.” (ఈ హదీసును తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) said: "If you see someone buying or selling inside the mosque, say: 'May Allah not make your trading profitable!'" [Reported by an-Nasa'i and at-Tirmidhi and the latter graded it Hasan (good)].

సారాంశం

మస్జిదులలో వ్యాపార లావాదేవీలు, కొనుగోలు – అమ్మకాలు జరపరాదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. అంటే మస్జిదులను వాణిజ్య కేంద్రాలుగా, వ్యాపార మండీలుగా మార్చుకోరాదు. మస్జిదులను నిర్మించేది దైవారాధన, దైవనామస్మరణ కోసమే గాని వర్తకం కోసం కాదు. మస్జిద్‌లయొక్క ఈ మర్యాదను మనం ఖాతరు చేయకపోతే అవి తమ ఉద్దేశ్యాన్ని, అసలు లక్ష్యాన్ని కోల్పోతాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 200

201

హదీసు 201

وَعَنْ حَكِيمِ بْنِ حِزَامٍ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تُقَامُ اَلْحُدُودُ فِي اَلْمَسَاجِدِ , وَلَا يُسْتَقَادُ فِيهَا } رَوَاهُ أَحْمَدُ , وَأَبُو دَاوُدَ بِسَنَدٍ ضَعِيف ٍ

హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : “మస్జిదులలో శిక్షలు విధించటంగానీ, వాటిలో ఖిసాస్ (రక్త పరిహారం) తీసుకోవటంగానీ చేయరాదు.” (ఈ హదీసును అబూదావూద్, అహ్మద్ బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Narrated Hakim bin Hizam (RA): Allah's Messenger (ﷺ) said: "Neither the prescribed punishment nor retaliations should be executed inside the mosque." [Reported by Ahmad and Abu Dawud through a weak Sanad (chain)].

సారాంశం

మస్జిదులు దైవారాధన కోసం నిర్మించబడ్డాయి. అవి పవిత్ర స్థలాలు. అందుచేత వాటిలో హద్దులు (శిక్షలు) విధించటం, రక్తం ప్రవహింపజేయటం వంటివి చేయరాదు. శిక్షల్ని అమలుపరచే స్థానాలను ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి.

హదీసు ఉల్లేఖకులు

హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) మరో పేరు అబూ ఖాలిద్. ఖురైష్ వర్గంలోని అసద్ తెగకు చెందినవారు. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) కు అన్న కుమారులవుతారు. ఖురైషు కులీనులలో ఒకరుగా గుర్తింపుపొందారు. ఏనుగుల వాళ్ళ సంఘటన జరగక 13 సంవత్సరాల క్రితం మక్కాలో జన్మించారు. మక్కా విజయం సందర్భంగా ఇస్లాం స్వీకరించారు. హిజ్రీ 54 తరువాత మదీనాలో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 120 సంవత్సరాలు. అంటే 60 యేండ్లు అజ్ఞాన కాలంలోనూ, మరో 60 యేండ్లు ఇస్లాంలోనూ గడిచాయి. ఆయనకు నలుగురు కుమారులు. నలుగురూ సహాబీలుగా పరిగణించబడ్డారు. మర్యాదస్తులు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 201

202

హదీసు 202

وَعَنْ عَائِشَةَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ : { أُصِيبَ سَعْدٌ يَوْمَ اَلْخَنْدَقِ , فَضَرَبَ عَلَيْهِ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-خَيْمَةً فِي اَلْمَسْجِدِ , لِيَعُودَهُ مِنْ قَرِيبٍ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: కందక యుద్ధ సందర్భంగా హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హా) గాయపడగా దైవప్రవక్త ﷺ ఆయనకు దగ్గరవుండి వైద్యసేవలు చేసే నిమిత్తం మస్జిద్‌లో పందిరి వేయించారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Aishah (RA): On the day of al-Khandaq (battle of the Trench), Sa'd was injured and Allah's Messenger (ﷺ) pitched a tent for him in the mosque to visit him from a close distance. [Agreed upon].

సారాంశం

దీన్నిబట్టి అత్యవసర సమయాల్లో రోగులను, క్షతగాత్రులను పరామర్శించే, వైద్యసదుపాయాలు కల్పించే ఉద్దేశ్యంతో మస్జిదులో ప్రత్యేక క్యాంపులు (శిబిరాలు) స్థాపించవచ్చని ఈ హదీసు ద్వారా అర్థమవుతోంది. అలాగే మస్జిదులో నిద్రించటం, రోగిని పరామర్శించటం, క్షతగాత్రులకు సేవలు చేయటం, వైద్యసదుపాయాలను సమకూర్చటం కూడా ధర్మసమ్మతమే.

హదీసు ఉల్లేఖకులు

ఇక్కడ సాద్ (రదియల్లాహు అన్హు) అంటే సాద్ బిన్ ముఆజ్ అన్నమాట! ఈయన ‘ఔస్’ తెగ నాయకుడు. పెద్ద సహాబీలలో ఒకరుగా పరిగణించబడతారు. రెండు ఉఖబా ప్రమాణాలలో కూడా హాజరయ్యారు. ఈయన ఇస్లాం స్వీకరించిన కారణంగా బనూ అబ్దె అష్హల్ తెగ కూడా ఇస్లాం స్వీకరించింది. ఈయన తన తెగకు సర్దారుగా, మర్యాదస్తుడైన వ్యక్తిగా పేరు సంపాయించారు. ఈయన తెగవారు ఈయన మాటను జవదాటేవారు కాదు. కందక యుద్ధంలో బాణం గుచ్చుకుని శరీరం నుండి రక్తం తీవ్రంగా స్రవించింది. ఈ బాధతోనే ఆయన (రదియల్లాహు అన్హు) బనూ ఖురైజ సంఘటన అనంతరం – హిజ్రీ 5 జీఖఅదలో – మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 202

203

హదీసు 203

وَعَنْهَا قَالَتْ : { رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَسْتُرُنِي , وَأَنَا أَنْظُرُ إِلَى اَلْحَبَشَةِ يَلْعَبُونَ فِي اَلْمَسْجِدِ… } اَلْحَدِيثَ. مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : నేను దైవప్రవక్త ﷺ ను చూచాను, ఆయన ﷺ నా కొరకు పరదా కట్టారు. నేను, మస్జిదులో క్రీడా విన్యాసాలు చేస్తున్న అబిసీనియన్లను (నీగ్రోలను) చూస్తూ నిలబడ్డాను. (బుఖారీ, ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: I saw Allah's Messenger (ﷺ) at the door of my house screening me while I watched some Abyssinians (Ethiopians) who were playing in the mosque… (the narration). [Agreed upon].

సారాంశం

పండుగలు, పర్వదినాలలో, ఆనంద సమయాలలో మస్జిదు ప్రాంగణంలో కర్రసాము చేయటం, యుద్ధ విన్యాసాలు ప్రదర్శించటం సమ్మతమేనని ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతున్నది. అలాగే అపరిచిత పురుషుల సామూహిక ప్రదర్శనలు కూడా స్త్రీలు తెరచాటున ఉండి చూడవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 203

204

హదీసు 204

وَعَنْهَا : { أَنَّ وَلِيدَةً سَوْدَاءَ كَانَ لَهَا خِبَاءٌ فِي اَلْمَسْجِدِ , فَكَانَتْ تَأْتِينِي , فَتَحَدَّثُ عِنْدِي… } اَلْحَدِيثَ.‏ مُتَّفِقٌ عَلَيْه ِ

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: “ఒక నల్లని ఆడపిల్ల కోసం మస్జిద్‌లో శిబిరం వేయబడింది. ఆ పిల్ల నాతో మాట్లాడటానికి వస్తూ ఉండేది.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: One black slave-girl had a tent in the mosque and she used to come to me and talk (with me) in my house. [Agreed upon].

సారాంశం

స్త్రీ కూడా రాత్రిపూట మస్జిదులో ఉండగలదని ఈ హదీసువల్ల స్పష్టమవుతున్నది. అయితే ఉపద్రవానికి, గొడవలకు ఏమాత్రం అవకాశం లేని శుభప్రదమయిన వాతావరణంలోనే ఇలాంటి దృష్టాంతాలు నెలకొల్పటం సాధ్యమవుతుంది.

ఇది సుదీర్ఘమయిన హదీసులోని ఒక భాగం మాత్రమే. పూర్తి హదీసు బుఖారీలో వుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 204

205

హదీసు 205

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْبُصَاقُ فِي اَلْمَسْجِدِ خَطِيئَةٌ وَكَفَّارَتُهَا دَفْنُهَا } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు – “మస్జిద్‌లో ఉమ్మి వేయటం పాపం. దీని పరిహారం ఉమ్మిని పూడ్చిపెట్టడమే. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) said: "Spitting in the mosque is a sin and its expiation is burying it." [Agreed upon].

సారాంశం

మస్జిద్ దైవారాధన నిమిత్తం నిర్మించబడింది. దైవారాధన జరిగే చోటు పవిత్రంగా ఉండాలి. అశుద్ధతకు, మాలిన్యానికి అక్కడ ఎలాంటి ఆస్కారముండకూడదు. మస్జిద్‌లో ఉమ్మివేయటం మస్జిద్ మర్యాదకు విరుద్ధాంశం. అందులో ఏది జరిగినా సభ్యతా సంస్కారాలకు ప్రతిబింబంగా ఉండాలి. అసభ్యంగా, అమర్యాదకరంగా ప్రవర్తించి పవిత్రమయిన వాతావరణాన్ని పాడు చేయకూడదు. అందుకే మస్జిద్‌లో ఉమ్మటం మహాపాపంగా పరిగణించబడింది. ఎవరయినా తెలియక అలా చేస్తే దానికి పరిహారం (కఫ్ఫారా) పూడ్చిపెట్టడమే. (ఒకవేళ నాపరాయిపై లేక గచ్చుపై ఉమ్మివేస్తే దాన్ని శుభ్రంగా కడిగివేయాలి)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 205

206

హదీసు 206

وَعَنْهُ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقُومُ اَلسَّاعَةُ حَتَّى يَتَبَاهَى اَلنَّاسُ فِي اَلْمَسَاجِدِ } أَخْرَجَهُ اَلْخَمْسَةُ إِلَّا اَلتِّرْمِذِيُّ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَة َ

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు: “ప్రజలు మస్జిదుల (నిర్మాణం)పై గర్వాన్ని చాటనంతవరకూ ప్రళయం సంభవించదు.” (దీనిని ‘ఐదుగురి’లో తిర్మిజీ తప్ప అందరూ ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated [Anas (RA)]: Allah's Messenger (ﷺ) said: "The House (Judgement Day) will not come until people boast (to each other) with (the construction and decoration of) mosques. [Reported by al-Khamsah except at-Tirmidhi, and Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

ప్రళయదినం సమీపించేముందు ఒక కాలం రానున్నది. ఆ కాలంలో ప్రజలు అందమైన మస్జిదులను నిర్మిస్తారు. వాటిని అపురూపంగా తీర్చిదిద్దుతారు. మా మస్జిద్ ఫలానా వారు కట్టిన మస్జిద్‌కన్నా అందంగా ఉందని బడాయి చాటుకుంటారు. కాని శోచనీయమయిన విషయం ఏమిటంటే ఆ మస్జిదులు నమాజీలతో కళకళలాడే బదులు వెల వెల బోతుంటాయి. జనులు మస్జిదులనయితే పోటీపడి నిర్మిస్తారుగానీ నమాజ్ కోసం రారు. తమపట్ల నిర్మాతలు కనబరుస్తున్న నిర్లక్ష్యవైఖరిపై మస్జిదులు విలపిస్తూ ఉంటాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 206

207

హదీసు 207

وَعَنْ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا أُمِرْتُ بِتَشْيِيدِ اَلْمَسَاجِدِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “మస్జిదుల అలంకరణ, ముస్తాబు గురించి నాకు ఆజ్ఞాపించబడలేదు” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు).

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "I was not commanded to build beautified mosques". [Reported by Abu Dawud and Ibn Hibban graded it Sahih (authentic)]

సారాంశం

ఆర్భాటంగా మస్జిదులపై నగిషీలు వేయటం, అట్టహాసంగా విద్యుద్దీపాలతో ముస్తాబు చేయటం సమంజసంకాదని పై హదీసు ద్వారా స్పష్టమవుతోంది. మస్జిదులను దైవ నామస్మరణ ద్వారా, నమాజ్ ద్వారా కళకళలాడేలా చేయమని ఆజ్ఞాపించబడింది. దేవుని దృష్టిలో అసలు కళ ‘ఆరాధనే’. ఈ కళను పట్టించుకోకుండా కృత్రిమమయిన కళాకాంతులపై శ్రద్ధచూపటంలో అర్థం లేదు. మస్జిదులలో మోతాదుకు మించిన అలంకరణ వల్ల నమాజ్‌లో ఏకాగ్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. పైగా అట్టహాసంతో కూడిన నగిషీలు, అలంకరణలు రాజుల, చక్రవర్తుల సున్నత్ (సంప్రదాయం) మాత్రమే గానీ ప్రవక్త సంప్రదాయం కాదు. వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ మస్జిదె నబవీలో తొలిసారిగా నగిషీలు వేయించాడు. దైవప్రవక్త ముహమ్మద్ ﷺ కాలంలోగానీ, ధర్మ ఖలీఫాల పరిపాలనా కాలంలోగానీ ఇలాంటి వినూత్న పోకడలు మస్జిద్‌లలో ఎక్కడా కానరావు. సత్య ప్రేమికులయిన ఉలమా సయితం ఇలాంటి విషయాలపై నోరు విప్పని పరిస్థితి దాపురించింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 207

208

హదీసు 208

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ عُرِضَتْ عَلَيَّ أُجُورُ أُمَّتِي , حَتَّى اَلْقَذَاةُ يُخْرِجُهَا اَلرَّجُلُ مِنْ اَلْمَسْجِدِ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَاَلتِّرْمِذِيُّ وَاسْتَغْرَبَهُ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నా అనుచర సమాజం ఆచరణలు నా ముందు సమర్పించబడ్డాయి. (పుణ్యప్రదమయిన) ఈ ఆచరణలలో మనిషి మస్జిద్ నుండి తీసి బయటపారవేసే ఓ చిన్న చెత్తముక్కను కూడా నేను చూశాను.” (ఈ హదీసును అబూదావూద్, తిర్మిజీ ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ‘గరీబ్ (అరుదైనది)గా ఖరారు చేశారు, ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) said: "The rewards of my Ummah (followers) were shown to me, even a peck of dust a man takes out of the mosque." [Reported by Abu Dawud and at-Tirmidhi. The latter graded it Gharib (having a single narrator), and Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

అతి చిన్న సత్కార్యం కూడా లెక్కలోనికి వస్తుందనీ, చిత్తశుద్ధి ఉంటే ఆ చిన్న సదాచరణే ఒక్కోసారి పెద్ద పుణ్యఫలాన్ని ఆర్జించిపెడుతుందనీ ఈ హదీసు భావం. మస్జిదుల పరిశుభ్రత, పరిశుద్ధతల గురించి ఇస్లాం తన అనుయాయులకు గట్టిగా తాకీదు చేస్తోంది. ఒక చిన్న గడ్డిపరక, రద్దీముక్క కూడా మస్జిదులో ఉండకుండా మనం జాగ్రత్తపడాలి. ఎవరయినా ఈ తేలికపాటి పనిని కూడా సంకల్పశుద్ధితో చేస్తే దాని సత్ఫలం అతనికి తప్పక లభిస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 208

209

హదీసు 209

وَعَنْ أَبِي قَتَادَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا دَخَلَ أَحَدُكُمْ اَلْمَسْجِدَ فَلَا يَجْلِسْ حَتَّى يُصَلِّيَ رَكْعَتَيْنِ } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ఉపదేశించారని హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరు ఎప్పుడు మస్జిద్‌లో ప్రవేశించినా కూర్చునే ముందు రెండు రకతుల (నఫిల్) నమాజు చేయాలి.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Qatada (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you enters a mosque, he must not sit until he prays two Rak'ah." [Agreed upon].

సారాంశం

ఈ హదీసులో ప్రస్తావించబడిన నఫిల్ నమాజును ‘తహియతుల్ మస్జిద్’ అనంటారు. షాఫయీల దృష్టిలో ఇది తప్పనిసరి. కాగా; అత్యధికమంది ధర్మవేత్తలు దీనిని అభిలషణీయం (ముస్తహబ్) గా భావించారు. హదీసులోని తాకీదును దృష్టిలో పెట్టుకుని కొంతమంది పండితులు నఫిల్ నమాజులను మక్రూహ్ వేళల్లో కూడా చేసేందుకు అనుమతించారు. ఈ హదీసు దృష్ట్యా మనకు బోధపడే మరో విషయమేమిటంటే; మస్జిద్ వేదికపైనుండి ఖతీబ్ ప్రసంగిస్తున్నప్పటికీ మస్జిద్‌లోకి ప్రవేశించిన వ్యక్తి రెండు రకతుల నమాజ్ చేసి మరీ కూర్చోవాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.6 మస్జిద్ వ్యవస్థ|హదీసు 209