హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.4 సుత్రా (తెర లేక అడ్డు)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 4వ అధ్యాయం: సుత్రా (తెర లేక అడ్డు). ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 180 – 186) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.4 సుత్రా (తెర లేక అడ్డు)

↑ విషయ సూచిక

باب سترة المصلي

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

180

హదీసు 180

عَنْ أَبِي جُهَيْمِ بْنِ اَلْحَارِثِ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَوْ يَعْلَمُ اَلْمَارُّ بَيْنَ يَدَيِ اَلْمُصَلِّي مَاذَا عَلَيْهِ مِنْ اَلْإِثْمِ لَكَانَ أَنْ يَقِفَ أَرْبَعِينَ خَيْرًا لَهُ مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِلْبُخَارِيِّ. وَوَقَعَ فِي "اَلْبَزَّارِ" مِنْ وَجْهٍ آخَرَ : { أَرْبَعِينَ خَرِيفًا }

హజ్రత్ అబూ జుహైమ్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచిపోయే వానికి, తన ఈ చేష్టవల్ల ఎంత పాపం కలుగుతుందో తెలిస్తే, అలా నడచిపోయేబదులు నలభై (యేండ్లు) అయినాసరే అక్కడ నిలబడటానికే అతను ఇష్టపడతాడు.”

(బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీ లోనివి. బజ్జార్ ఉల్లేఖనంలో-వేరొక సౌజన్యంతో – 40 యేండ్లు అన్న ప్రస్తావన వచ్చింది)

English

Narrated Abu Juhaim bin al-Harith (RA): Allah's Messenger (ﷺ) said: "If the person who passes in front of another person in prayer knew the magnitude of his sin, it would have been better for him to wait for forty than pass in front of him." [Agreed upon. This wording is from al-Bukhari].

It is mentioned in al-Bazzar through another chain with the addition: "forty years."

సారాంశం

‘సుత్రా’ అంటే నమాజ్ చేసే వ్యక్తి తాను సజ్దా చేసే స్థలానికి ముందు అడ్డుగా ఉపయోగించుకునే వస్తువు. అది గోడ కావచ్చు, స్థంభం కావచ్చు, అడ్డు తెర కావచ్చు, కర్ర కావచ్చు లేదా అటువంటిదే మరేదయినా వస్తువు కావచ్చు. ఈ సుత్రా నమాజ్ చేసే వ్యక్తికీ, అతని ముందు నుంచి నడచిపోయే వారికీ మధ్య అడ్డుగా ఉంటుంది.

హదీసు ఉల్లేఖకులు

అబూ జుహైమ్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు అబ్దుల్లాహ్ అని అనబడుతోంది. ఖజ్రజ్ తెగకు చెందిన హారిస్ బిన్ సిమ్మ అన్సారీ కుమారులు. ప్రముఖ సహాబీలలో ఒకరు. అమీర్ ముఆవియ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ వరకు జీవించివున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 180

181

హదీసు 181

وَعَنْ عَائِشَةَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهَا‏- قَالَتْ : { سُئِلَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-‏- فِي غَزْوَةِ تَبُوكَ ‏- عَنْ سُتْرَةِ اَلْمُصَلِّي. فَقَالَ : "مِثْلُ مُؤْخِرَةِ اَلرَّحْلِ } أَخْرَجَهُ مُسْلِمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: తబూక్ యుద్ధ సందర్భంగా ‘సుత్రా’ (ఎత్తు) గురించి దైవప్రవక్త ﷺను అడగటం జరిగింది: దానికి ఆయన ﷺ, “అది ఒంటెపై కట్టబడే పల్లకీ వెనుకభాగపు ఎత్తుకు సమానంగా ఉండాల”ని అన్నారు. (ముస్లిం)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) was asked in the expedition of Tabuk about the Sutra of the person who is offering the prayer; he said , "It is (something) like the back of a saddle." [Reported by Muslim].

సారాంశం

పొలాలు, బహిరంగ స్థలాలు, అటవీ ప్రాంతాలలో ‘సుత్రా’ను ప్రతిష్ఠించాలని హదీసు ద్వారా స్పష్టమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 181

182

హదీసు 182

وَعَنْ سَبْرَةَ بْنِ مَعْبَدٍ اَلْجُهَنِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لِيَسْتَتِرْ أَحَدُكُمْ فِي الصَّلَاةِ وَلَوْ بِسَهْمٍ } أَخْرَجَهُ اَلْحَاكِمُ

హజ్రత్ సబ్ర బిన్ మాబద్ జుహనీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “నమాజ్ (చేసే సమయం)లో మీలో ప్రతి ఒక్కరూ సుత్రాను తప్పక నెలకొల్పుకోవాలి -అది ఒక బాణమైనాసరే!” (ముస్తద్రక్ హాకిమ్)

English

Narrated Sabra bin Ma'bad al-Juhani (RA): Allah's Messenger (ﷺ) said: "Let one of you who is in Salat (prayer) put a Sutra in front of him even if it is an arrow." [Reported by al-Hakim].

సారాంశం

‘సుత్రా’ ఆఖరికి ఒక బాణమైనాసరే అని అనబడటాన్నిబట్టి అది లావుగా వున్నా, సన్నగా వున్నా దాన్ని ప్రతిష్ఠించటం మాత్రం అవసరమని దీన్నిబట్టి విదితమవుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

సబ్ర బిన్ మాబద్ జుహనీ (రదియల్లాహు అన్హు) మదీనా సహాబీ. ‘జీమర్య’లో నివాసం ఏర్పరచుకున్నారు. ఈయన మారు పేరు అబూ సురయ్య. కందక పోరాటంలో తొలిసారిగా పాల్గొన్నారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో అలీ (రదియల్లాహు అన్హు) గారు తన తరపున ఈయన్ని సిరియా వాసుల నుండి ‘బైత్’ స్వీకరించడానికి హజ్రత్ ముఆవియ (రదియల్లాహు అన్హు) వద్దకు పంపించారు. హజ్రత్ ముఆవియ పరిపాలనాకాలం చరమ దశలో ఈయన మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 182

183

హదీసు 183

وَعَنْ أَبِي ذَرٍّ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يَقْطَعُ صَلَاةَ اَلْمَرْءِ اَلْمُسْلِمِ ‏- إِذَا لَمْ يَكُنْ بَيْنَ يَدَيْهِ مِثْلُ مُؤْخِرَةِ اَلرَّحْلِ ‏- اَلْمَرْأَةُ , وَالْحِمَارُ , وَالْكَلْبُ اَلْأَسْوَدُ… " اَلْحَدِيثَ. } وَفِيهِ { اَلْكَلْبُ اَلْأَسْوَدِ شَيْطَانٌ }. أَخْرَجَهُ مُسْلِمٌ. وَلَهُ : عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- نَحْوُهُ دُونَ : "اَلْكَلْبِ" وَلِأَبِي دَاوُدَ , وَالنَّسَائِيِّ : عَنْ اِبْنِ عَبَّاسٍ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- نَحْوُهُ , دُونَ آخِرِهِ. وَقَيَّدَ اَلْمَرْأَةَ بِالْحَائِضِ.

హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రవచించారు: “ముస్లిం పురుషుని నమాజ్‌ను – అతని ముందర, ఒంటెపై కట్టే పల్లకీ వెనుక భాగపు కర్ర ఎత్తుకు సమానంగా ‘సుత్రా’ లేనట్లయితే- స్త్రీ, గాడిద, నల్లకుక్క – భంగపరుస్తాయి.” “నల్లకుక్క షైతాన్ అయి వుంటాడు” అన్న వాక్యం కూడా ఈ హదీసులో ఉంది. (ముస్లిం)

ఇందులో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం కూడా ఉందిగాని అందులో కుక్క ప్రస్తావన రాలేదు. అబూదావూద్, నసాయి కూడా హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఆధారంగా ఇదే విధంగా నకలు చేశారు. అయితే ఇందులో హదీసు ఆఖరి భాగం లేదు. ఇంకా, స్త్రీ గురించి చెబుతూ ‘బహిష్టు అయి ఉన్నప్పుడు’ అన్న నిబంధన ఉంది.

English

Narrated Abu Dhar al-Ghifari (RA): Allah's Messenger (ﷺ), "In case there is not before him (an object) like the back of a saddle, a Muslim's Salat (prayer) would be cut off by (the passing of) a woman, a donkey and a black dog." And it concludes: "the black dog is a devil." [Reported by Muslim].

Muslim also reported through Abu Hurairah (RA) a similar Hadith without the mention of Kalb (dog).

In another narration Abu Dawud and an-Nasa'i reported through Ibn Abbas (RA) a similar report without its end and connected the prohibition of a woman passing in front of a praying person to the state of being in her menstruation period.

సారాంశం

‘సుత్రా’ నిబంధనలో ఎన్నో పరమార్థాలు అంతర్లీనమై ఉన్నాయి. దాసుడు నమాజ్ కొరకు నిలబడినపుడు హదీసులో చెప్పబడినట్లు అతని ముందర దైవకారుణ్యం ఉంటుంది. దాసుడు నమాజ్‌కు ముందు సుత్రాను స్థాపిస్తే అది ఒక హద్దును ఏర్పరచుకుంటుంది. దాని అవతల నుంచి ఎవరు రాకపోకలు సాగించినా నమాజ్‌లో ఎలాంటి అంతరాయం కలగటంగానీ, దైవకారుణ్య పరిధిలో జోక్యం జరగటంగానీ ఉండవు.

‘నమాజ్ భంగమవుతుంది’ అన్న హదీసులోని వాక్యానికి భావం నమాజ్ పూర్తిగా వృధా అయిందని కాదు, నమాజులోని శుభాలు, మేళ్ళు పుణ్యఫలాలు క్షీణిస్తాయని మాత్రమే దీని మతలబు. సామూహిక నమాజ్‌లో నమాజ్‌కు సారథ్యం వహించే వ్యక్తి (ఇమామ్) తన వెనుకనున్న వారందరి పాలిట – పరోక్షంగా – సుత్రాగా ఉంటాడు.

ఇక హదీసులో స్త్రీ, కుక్క, గాడిదల ప్రస్తావన ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? వారుగాక మరొకరెవరయినా నమాజీ ముందునుంచి నడచిపోతే నమాజ్ భంగమవదా?? అన్న ప్రశ్నలు ఇక్కడ జనిస్తాయి. వాస్తవానికి ఎవరు అలా నడచివెళ్ళినా నమాజులో దోషం తప్పక ఏర్పడుతుంది. ఇంతకు ముందు వచ్చిన ఒక హదీసులో పురుషుని ప్రస్తావన కూడా వచ్చింది. కాకపోతే ఇతరులకన్నా ఈ మూడింటి ద్వారా నమాజ్ ఏకాగ్రతకు మరింత ఎక్కువగా ఆటంకం కలుగుతుందన్నమాట!

అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా తిర్మిజీ ఉటంకించిన ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది – స్త్రీ దాగి వుండవలసిన వస్తువు. ఆమె ఇంటి నుండి బయటికి వస్తే చాలు, షైతాన్ ఆమెను చాటు మాటుగా వెంటాడతాడు. ఇక గాడిద గురించి ఏమనబడిందంటే, అది షైతానును చూసినపుడు గాండ్రుపెడుతుంది. ఇక కుక్క గురించి హదీసు ఉండనే ఉంది – నల్ల కుక్క షైతాన్ అయివుంటుంది. కుక్క అత్యంత చండాలపు జంతువు. అది వున్న చోట దైవదూతలు ప్రవేశించరు. ఎవరయితే షరీయత్ సూచించిన హద్దులలో కాకుండా వేరితర పద్ధతిలో కుక్కను పెంచాడో అతడు అనుదినం తన పుణ్యార్జనలో రెండు యూనిట్ల కోత విధించుకున్నాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 183

184

హదీసు 184

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا صَلَّى أَحَدُكُمْ إِلَى شَيْءٍ يَسْتُرُهُ مِنْ اَلنَّاسِ , فَأَرَادَ أَحَدٌ أَنْ يَجْتَازَ بَيْنَ يَدَيْهِ فَلْيَدْفَعْهُ , فَإِنْ أَبَى فَلْيُقَاتِلْهُ , فَإِنَّمَا هُوَ شَيْطَانٌ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ : { فَإِنَّ مَعَهُ اَلْقَرِينَ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరయినా ‘సుత్రా’ను ప్రతిష్ఠించి నమాజ్ చేయసాగినపుడు ఎవరయినా దాని ముందు నుంచి (అంటే సుత్రాకి-నమాజీకి మధ్య నుండి) నడచిపోతుంటే నమాజ్ చేసే వ్యక్తి అతన్ని ఆపేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ అతను ఖాతరు చేయకపోతే అతనితో పోరాడాలి. ఎందుకంటే అతడు (మానవ రూపంలో వున్న) షైతాన్” (బుఖారీ, ముస్లిం) ‘అతనితో పాటు అతని సావాసి ఒకడున్నాడు’ అని మరో ఉల్లేఖనంలో చెప్పబడింది.

English

Narrated Abu Sa'id al-Khudri (RA): Allah's Messenger (ﷺ) said: "If one of you prays towards an object separating him from the people and someone tries to pass (between him and the object) in front of him, let him turn him away but if he refuses he should fight him for he is a devil." [Agreed upon].

In another narration: "for there is a Satan with him."

సారాంశం

ఒక వ్యక్తి ‘సుత్రా’ను నెలకొల్పి నమాజ్ చేసుకుంటూ ఉండగా అతని ముందర నుంచి వెళ్ళడం అవాంఛనీయమయిన విషయం. అలా నడచివెళ్ళే వానిని ఆపటం తప్పనిసరి (వాజిబ్) లేక అభిలషణీయం (ముస్తహబ్). ముందు నుంచి నడచిపోయే వ్యక్తిని నమాజీ సైగతో ఆపాలి. అప్పటికీ అతను లెక్క చేయకపోతే అతన్ని ప్రతిఘటించాలి. అప్పటికీ అతను నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కొట్టాలి. అంతే. అంతకుమించిన గొడవగానీ, సిగపట్లు పట్టుకోవటంగానీ చేయకూడదు. అయితే నమాజీ ‘సుత్రా’ను ప్రతిష్ఠించినపుడే ఇలా ప్రతిఘటించే హక్కు ఉంటుంది. ఒకవేళ సుత్రాను ప్రతిష్ఠించకపోతే ఆ తప్పు నమాజీది అవుతుంది. ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే ఈపాటి చలనం వల్ల నమాజ్ భంగమవదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 184

185

హదీసు 185

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَجْعَلْ تِلْقَاءَ وَجْهِهِ شَيْئًا , فَإِنْ لَمْ يَجِدْ فَلْيَنْصِبْ عَصًا , فَإِنْ لَمْ يَكُنْ فَلْيَخُطَّ خَطًّا , ثُمَّ لَا يَضُرُّهُ مَنْ مَرَّ بَيْنَ يَدَيْهِ } أَخْرَجَهُ أَحْمَدُ وَابْنُ مَاجَهْ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ , وَلَمْ يُصِبْ مَنْ زَعَمَ أَنَّهُ مُضْطَرِبٌ , بَلْ هُوَ حَسَنٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనానుసారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరయినా నమాజ్‌కు ఉపక్రమించినపుడు తన ముందర ఏదైనా వస్తువు పాతుకోవాలి లేదా నెలకొల్పుకోవాలి. ఏ వస్తువూ దొరక్కపోతే తన కర్రనే నిలబెట్టుకోవాలి. అదీ లేకపోతే కనీసం నేలపై గీత గీసుకోవాలి. ఇక ఇప్పుడు నమాజీ ముందు నుంచి సాగిపోయేవాడు నమాజీకి ఎలాంటి నష్టం కలిగించలేడు.” (దీనిని అహ్మద్, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఈ హదీసు విషయంలో ఎవరయినా సందిగ్ధస్థితికి లోనయితే వారి ఈ స్థితి సరైనది కాదు. పైగా ఈ హదీసు ‘హసన్’ (స్పష్టమయిన) స్థాయికి చెందినది).

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you prays, he should put something in front of him, and if he cannot find something he should set up a stick; but if he has no stick with him he should draw a line, then what passes in front of him will not harm him." [Reported by Ahmad and Ibn Majah. And Ibn Hibban graded it Sahih (authentic). And he who claims it is Mudtarib (inconclusive) is not correct. Rather is Hasan (good)].

సారాంశం

ప్రతి వస్తువూ ‘సుత్రా’గా ఉపయోగపడుతుందని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. ఏ వస్తువూ లభ్యం కాకపోతే నేలపై ఒక గీత గీసుకుని దానినే ‘సుత్రా’గా పరిగణించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 185

186

హదీసు 186

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَقْطَعُ اَلصَّلَاةَ شَيْءٌ , وَادْرَءُوا مَا اسْتَطَعْتُمْ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ , وَفِي سَنَدِهِ ضَعْفٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నమాజ్‌ను ఏ వస్తువూ భంగపరచ జాలదు (అయితే ముందునుంచి) నడచిపోయేవారిని సాధ్యమైనంతవరకు ఆపే ప్రయత్నం చేయండి.” (అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు. ఇది అందిన పరంపర బలహీనంగా ఉంది)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): Allah's Messenger (ﷺ) said: "Nothing interrupts Salat (prayer), but avert as much as you can (things that cut off prayer)." [Reported by Abu Dawud and there is weakness in its chain].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.4 సుత్రా (తెర లేక అడ్డు)|హదీసు 186