హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 15వ అధ్యాయం: గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్). ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 401 – 405) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
باب صلاة الكسوف
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 401
عَنِ اَلْمُغِيرَةِ بْنِ شُعْبَةَ - رضى الله عنه - قَالَ: { اِنْكَسَفَتِ اَلشَّمْسُ عَلَى عَهْدِ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -يَوْمَ مَاتَ إِبْرَاهِيمُ, فَقَالَ اَلنَّاسُ: اِنْكَسَفَتِ اَلشَّمْسُ لِمَوْتِ إِبْرَاهِيمَ, فَقَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم - "إِنَّ اَلشَّمْسَ وَالْقَمَرَ آيَتَانِ مِنْ آيَاتِ اَللَّهِ لَا يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلَا لِحَيَاتِهِ, فَإِذَا رَأَيْتُمُوهُمَا, فَادْعُوا اَللَّهَ وَصَلُّوا, حَتَّى تَنْكَشِفَ" } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ: {حَتَّى تَنْجَلِي}. وَلِلْبُخَارِيِّ مِنْ حَدِيثِ أَبِي بَكْرَةَ - رضى الله عنه - { فَصَلُّوا وَادْعُوا حَتَّى يَنْكَشِفَ مَا بِكُمْ }.
హజ్రత్ ముగీరా బిన్ షూబ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: దైవప్రవక్త ﷺ కాలంలో ఇబ్రాహీం చనిపోయిన నాడు సూర్యగ్రహణం పట్టింది. ఇబ్రాహీం మరణం మూలంగానే సూర్యునికి గ్రహణం పట్టిందని ప్రజలు చెప్పుకున్నారు. దీనిపై దైవప్రవక్త ﷺ, “సూర్యచంద్రులు దేవుని నిదర్శనాలలో రెండు నిదర్శనాలు మాత్రమే. ఒకరి జీవన్మరణాలతో వాటి గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు వాటిని ఎప్పుడు ఈ స్థితిలో చూచినా అల్లాహ్‌ను ప్రార్థించండి. సూర్యగ్రహణం వీడిపోయేదాకా నమాజ్ చేయండి” అని బోధించారు. (బుఖారీ, ముస్లిం) బుఖారీలోని ఒక ఉల్లేఖనంలో “అది ప్రకాశించే వరకూ నమాజ్ చేస్తూ ఉండండి” అని ఉంది.
బుఖారీలో అబూబక్రా (రదియల్లాహు అన్హు) హదీసులో ఈ విధంగా ఉంది : “ఆ స్థితి మీ ముందు నుంచి తొలగిపోయేవరకు నమాజ్ చేయండి, దుఆ చేయండి.”
English
Narrated Mughirah bin Shu'bah (RA): That there was a solar eclipse in the time of Allah's Messenger (ﷺ) on the day his son Ibrahim died. The people said, "The eclipse of the sun has happened due to the death of Ibrahim." Allah's Messenger (ﷺ) said: "The sun and the moon are two of Allah's signs; they are not eclipsed due to the death or the life of anyone. So when you see them (the eclipse of the moon or sun) supplicate to Allah and offer prayers until the eclipse is over." [Agreed upon].
In a narration of al-Bukhari it has: "till it becomes bright."
al-Bukhari's narration from Abu Bakrah (RA) has: Pray and supplicate (to Allah) till (the eclipse) is over."
సారాంశం
సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా దైవనిదర్శనాలలో రెండు గొప్ప నిదర్శనాలు మాత్రమే. సూర్యచంద్రులు దేవుడు విధించిన నియమానికీ, ప్రణాళికకు కట్టుబడి ఉన్నాయి. ఈ నియమాన్ని అతిక్రమించి, తమ ఇష్టానుసారం ఉదయించే, అస్తమించే ధైర్యం వాటికి లేదు. అవి అలా చేయలేవు కూడా. దైవశాసనం ముందు అవి ఇంత నిస్సహాయంగా ఉన్నప్పుడు ఇతరులకు లాభనష్టాలు ఎలా కలిగించగలుగుతాయి? ఆలోచించాలి.
ఈ సందర్భంగా నమాజ్ చేయటం, దుఆ చేయటం సంప్రదాయం. రెండు రకతుల నమాజును ఆయన ﷺ సామూహికంగా చేసినట్టు ఆధారాలున్నాయి. ఒక్కో రకతులో రెండేసి రుకూలు చేయటం విశేషం. సూర్యగ్రహణం ఎప్పుడు పడితే అప్పుడే నమాజ్ చేయాలి.
ఇంతకీ ఈ నమాజ్ సున్నతా? వాజిబా? సున్నత్ అని కొందరు, వాజిబ్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారు ఈ నమాజ్‌ను వాజిబ్ (తప్పనిసరి)గా తలపోశారు. అత్యధిక ధర్మవేత్తల ప్రకారం ఈ నమాజ్ రెండు రకతులు. ఒక్కో రకతులో రెండేసి రుకూలు, రెండేసి ఖియామ్లు ఉంటాయి. రెండేసిసార్లు ఖిరాత్ కూడా చేయవలసి ఉంటుంది. మొదటి ఖియామ్‌లో ఫాతిహ సూరా పఠించే విషయమై ఏకాభిప్రాయముంది. కాని రెండో ఖియామ్‌లో ఫాతిహ సూరా పఠించటంపై అభిప్రాయభేదం ఉంది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దృష్టిలో ఫాతిహ సూరా రెండవ ఖియామ్లోనూ పఠించవలసిందే. లేకపోతే ఆయన దృష్టిలో నమాజ్ సక్రమం కాజాలదు.
ఖిరాత్ (ఖుర్ఆన్ పారాయణం) బిగ్గరగా చేయాలా? నెమ్మదిగా చేయాలా? అన్న విషయంపై కూడా నాలుగు అభిప్రాయాలున్నాయి. బిగ్గరగా ఖుర్ఆన్ పఠించాలని భావించేవారిలో ఇమామ్ అహ్మద్, ఇమామ్ అబూ హనీఫా, ఇస్హాఖ్ బిన్ రాహ్వే, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె ముంజిర్ తదితరులున్నారు. ఖిరాత్ నెమ్మదిగా పఠించాలని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వక్కాణించారు. ఏవిధంగా తలచుకుంటే ఆ విధంగా పఠించవచ్చు అన్నది మూడవ వాదన. సూర్యగ్రహణమైతే నెమ్మదిగా పారాయణం చేయాలనీ, చంద్రగ్రహణమైతే బిగ్గరగా పారాయణం చేయాలన్నది నాల్గవ దృక్పథం.
హదీసు ఉల్లేఖకులు
ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు). ఈ పిల్లవాడు దైవప్రవక్త ﷺగారి పుత్రుడు. ఈయన తల్లిపేరు మారియ ఖిబ్తియ (రదియల్లాహు అన్హా). అంటే ఈమె దైవప్రవక్త ﷺ ధర్మపత్ని. అలెగ్జాండ్రియా మరియు ఈజిప్టు పరిపాలకుడు ఈమెను దైవప్రవక్త ﷺకు కానుకగా సమర్పించాడు. ఆయన ﷺ కుమారుడగు ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) హిజ్రీ 9వ ఏట జమాది ఉల్ ఊలాలో జన్మించారు. 18 మాసాల అనంతరం – హిజ్రీ 10వ సంవత్సరం షవ్వాల్ మాసంలో – మరణించారు. బఖీ ఖననవాటికలో అంత్యక్రియలు జరిగాయి. “స్వర్గంలో ఒక పాలు త్రాపే మహిళ ఈ అబ్బాయి పాలగడువును పూర్తిచేసింది” అని దైవప్రవక్త ﷺ వ్యాఖ్యానించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)|హదీసు 401
హదీసు 402
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا: { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -جَهَرَ فِي صَلَاةِ اَلْكُسُوفِ بِقِرَاءَتِهِ, فَصَلَّى أَرْبَعَ رَكَعَاتٍ فِي رَكْعَتَيْنِ, وَأَرْبَعَ سَجَدَاتٍ } مُتَّفَقٌ عَلَيْهِ, وَهَذَا لَفْظُ مُسْلِمٍ. وَفِي رِوَايَةٍ لَهُ: فَبَعَثَ مُنَادِيًا يُنَادِي: اَلصَّلَاةُ جَامِعَةٌ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు : “దైవప్రవక్త ﷺ గ్రహణ సమయంలో చేసిన నమాజులో బిగ్గరగా (ఖుర్ఆన్) పారాయణం చేశారు. రెండు రకతులలో మొత్తం నాలుగు రుకూలు, నాలుగు సజ్దాలే చేశారు.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి) ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది – “ఆయన ప్రకటన గావించే వానిని పంపారు. ఆ వ్యక్తి ‘అస్సలాతు జామిఅతున్’ అని ప్రకటించేవాడు.”
English
Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) recited (from the Qur'an) in an audible voice in the prayer at an eclipse, and prayed two Rak'at in which he bowed four times and prostrated four times." [Agreed upon. This is the wording of Muslim].
In another narration of Muslim: "He (ﷺ) sent an announcer to announce: The prayer is (to be offered) in congregation".
సారాంశం
దైవప్రవక్త ﷺ ‘సలాతుల్ కుసూఫ్’లో బిగ్గరగా పారాయణం చేసేవారని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) చే ఉల్లేఖించబడిన ఒక హదీసు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. ఈ నమాజు సాధారణ నమాజుల వంటిది కాదనీ, ఇందులో రుకూలు అదనంగా ఉంటాయని కూడా అర్థమవుతున్నది. ఈ ఉల్లేఖనం ప్రకారం ఆయన ﷺ ఒక్కో రకత్లో రెండేసి రుకూలు చేశారు. ఈ నమాజుకు ఒక వేళ అంటూ ఉండదు. ఎప్పుడు సూర్యగ్రహణముంటే అప్పుడే చేయవలసి ఉంటుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)|హదీసు 402
హదీసు 403
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ : { اِنْخَسَفَتِ الشَّمْسُ عَلَى عَهْدِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَصَلَّى, فَقَامَ قِيَامًا طَوِيلًا, نَحْوًا مِنْ قِرَاءَةِ سُورَةِ اَلْبَقَرَةِ, ثُمَّ رَكَعَ رُكُوعًا طَوِيلًا, ثُمَّ رَفَعَ فَقَامَ قِيَامًا طَوِيلًا وَهُوَ دُونَ اَلْقِيَامِ اَلْأَوَّلِ, ثُمَّ رَكَعَ رُكُوعًا طَوِيلًا, وَهُوَ دُونَ اَلرُّكُوعِ اَلْأَوَّلِ, ثُمَّ سَجَدَ, ثُمَّ قَامَ قِيَامًا طَوِيلاً, وَهُوَ دُونَ اَلْقِيَامِ اَلْأَوَّلِ, ثُمَّ رَكَعَ رُكُوعًا طَوِيلًا, وَهُوَ دُونَ اَلرُّكُوعِ اَلْأَوَّلِ, ثُمَّ رَفَعَ, فَقَامَ قِيَامًا طَوِيلًا, وَهُوَ دُونَ اَلْقِيَامِ اَلْأَوَّلِ, ثُمَّ رَكَعَ رُكُوعًا طَوِيلاً, وَهُوَ دُونَ اَلرُّكُوعِ اَلْأَوَّلِ, ثُمَّ رَفَعَ رَأْسَهُ, ثُمَّ سَجَدَ, ثُمَّ انْصَرَفَ وَقَدِ انْجَلَتِ اَلشَّمْسُ. فَخَطَبَ اَلنَّاسَ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: { صَلَّى حِينَ كَسَفَتِ اَلشَّمْسُ ثَمَانِيَ رَكَعَاتٍ فِي أَرْبَعِ سَجَدَاتٍ }. وَعَنْ عَلِيٍّ مِثْلُ ذَلِكَ. وَلَهُ: عَنْ جَابِرٍ - رضى الله عنه - { صَلَّى سِتَّ رَكَعَاتٍ بِأَرْبَعِ سَجَدَاتٍ }. وَلِأَبِي دَاوُدَ: عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ: { صَلَّى, فَرَكَعَ خَمْسَ رَكَعَاتٍ وَسَجَدَ سَجْدَتَيْنِ, وَفَعَلَ فِي اَلثَّانِيَةِ مِثْلَ ذَلِكَ }.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ కాలంలో సూర్యగ్రహణం పట్టింది. ఆయన ﷺ నమాజె కుసూఫ్ చేశారు. అందులో సూరయె బఖరా పారాయణం చేసినంతసేపు నిలబడ్డారు. (రుకూ కూడా) సుదీర్ఘమయిన రుకూ చేశారు. మళ్ళీ నిలబడ్డారు. ఈసారి కూడా సుదీర్ఘ సమయం నిలబడ్డారు. అయితే మొదటిసారి ఖియామ్ కన్నా కొంచెం తక్కువ. మళ్ళీ సుదీర్ఘమయిన రుకూ చేశారు. కాని మొదటి రుకూ కన్నా చిన్నది. తరువాత సజ్దా చేశారు. ఆ తరువాత నిలబడి మళ్ళీ పారాయణం చేశారు. కాని ఇది మొదటి రకత్లోని పారాయణంకన్నా తక్కువే. అనంతరం సుదీర్ఘ రుకూ చేశారు. అయితే మునుపటి రుకూ కన్నా స్వల్పం. తరువాత తలపైకెత్తి సుదీర్ఘమయిన ఖియామ్ చేశారు. ఇది అంతకుముందు ఖియామ్ కన్నా కొంచెం చిన్నది. ఆ తరువాత మరో సుదీర్ఘమయిన రుకూ చేశారు. ఇది క్రితంసారి రుకూ కన్నా కాస్త చిన్నది. తరువాత తన తలను పైకెత్తారు. ఆ తరువాత సజ్దా చేశారు. తరువాత సలాం చేశారు. (ఈ లోగా గ్రహణం వీడి) సూర్యుడు ధగధగా ప్రకాశించసాగాడు. అనంతరం ఆయన ﷺ ప్రజలకు ధర్మబోధన చేశారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
ఆయన ﷺ సూర్యగ్రహణ సమయంలో ఎనిమిది రుకూలు, నాలుగు సజ్దాలతో నమాజ్ చేశారని ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఉంది.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)చే కూడా ఈ విధంగానే ఉల్లేఖించబడింది.
ముస్లింలోనే హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనంలో ఇలా అనబడింది : “ఆయన ﷺ ఆరు రుకూలు, నాలుగు సజ్దాలతో ఈ నమాజ్ చేశారు.”
అబూదావూద్లో హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) చే ఈ విధంగా ఉల్లేఖించబడింది- “ఆయన ﷺ నమాజె కుసూఫ్ చేశారు. మొదటి రకత్లో ఐదు రుకూలు, రెండు సజ్దాలు చేశారు. రెండవ రకత్ కూడా అలాగే చేశారు.”
English
Narrated Ibn 'Abbas (RA): There was an eclipse of the sun in the life-time of Allah's Messenger (ﷺ) and then he prayed and stood for a long time, about as long as it would take to recite Surat al-Baqarah. Then, he bowed for a long time, and then he raised his head and stood for a long time, which was less than the first standing. Then, he bowed again for a long time, which was less than the first bowing. Then, he prostrated (twice) and then he stood for a long time, which was less than the first time standing. Then, he bowed for a long time, which was less than the first bowing. Then, he raised his head and stood up for a long time, which was less than the first standing. Then, he bowed for a long time, which was less than the first bowing. Then he prostrated (twice), and then he finished (the prayer), and the sun had become bright. He then delivered a Khutbah (religious talk, sermon). [Agreed upon. And the wording is al-Bukhari's].
In a narration of Muslim: "When there was an eclipse of the sun, Allah's Messenger (ﷺ) performed eight bowings with four prostrations (in a two Rak'ah prayer for Eclipse)".
Muslim reported from 'Ali (RA) similarly.
He also reported from Jabir (RA): "He [Allah's Messenger (ﷺ)] performed six bowings with four prostrations (in a two Rak'ah prayer for Eclipse)."
Narrated Ubai bin Ka'b (RA): "He [the Prophet (ﷺ)] prayed (the Eclipse prayer) and bowed five times and prostrated twice (in the first Rak'ah), and in the second Rak'a he also did the same." [Abu Dawud]
సారాంశం
మొత్తంమీద రుకూ, సజ్దాల గురించి విభిన్న అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. వీటన్నింటినీ జోడిస్తే ఒక్కో రకత్లో రెండేసి, మూడేసి, నాలుగేసి, ఐదేసి రుకూలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిప్రకారం ఆయన ﷺ జీవిత కాలంలో అనేకసార్లు ‘గ్రహణం’ పట్టినట్లు విదితమవుతోంది. రెండేసి రుకూలతో కూడిన రకతులు ఎక్కువ అనుసరణీయమని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంఘటన పూర్వాపరాలను సంక్షిప్తంగా చర్చించదలిచాము. అసలు విషయం పాఠకులకు బోధపడాలన్నదే దీని ఉద్దేశ్యం –
దైవప్రవక్త ﷺ పుత్రుడు ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) చనిపోయినది హిజ్రీ 10వ సంవత్సరం షవ్వాల్ నెల 28 లేక 29వ తేదీ అనీ, అది క్రీ.శ. 632 జనవరి 27వ తేదీన వస్తుందని పరిశోధకులు, చరిత్రకారులు, ఖగోళ శాస్త్రవేత్తలు, విమర్శకులు, సమీక్షకులు అందరూ ఏకీభవించారు. సూర్యగ్రహణం ఉదయం ఎనిమిదిన్నరకు పట్టింది. దైవప్రవక్త ﷺ జీవితకాలంలో దీని తరువాత మరెన్నడూ సూర్యగ్రహణం పట్టలేదన్న విషయంలో కూడా వీరందరి మధ్య ఏకాభిప్రాయముంది. అయితే అంతకు ముందు పట్టిన గ్రహణాల గురించి ప్రఖ్యాత పరిశోధకుడు అల్లామా ఖాజీ ముహమ్మద్ సల్మాన్ మన్సూర్పూరీ తన విశ్వవిఖ్యాత గ్రంథం “సీరత్ రహ్మతుల్ లిల్ ఆలమీన్”లో ప్రస్తావించారు. దైవప్రవక్త ﷺ మక్కా జీవితంలోనూ, మదీనా జీవితంలోనూ మొత్తం 10సార్లు గ్రహణాలు పట్టాయని, వీటిలో సూర్యగ్రహణాలతోపాటు, చంద్రగ్రహణాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దైవప్రవక్త ﷺ కుమారుడు చనిపోయిన సందర్భంగా పట్టిన సూర్యగ్రహణం కూడా అందులో ఉంది. ఈ గ్రహణం వాటిలో చిట్టచివరిది. అయితే రచయిత ఈ గ్రహణ సమయాలను గానీ, గ్రహణ ప్రదేశాలను గానీ పొందుపరచలేదు.
ఇక హదీసుల ఆధారంగా ఈ అంశాన్ని తరచిచూద్దాం – ‘ముస్లిం’లో అబ్దుర్రహ్మాన్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఆధారంగా ఇలా అనబడింది – (ఆయన ఇలా అన్నారు) – నేను దైవప్రవక్త ﷺ జీవిత కాలంలో మదీనాలో విలువిద్యా విన్యాసాలు చేస్తున్నాను. అంతలోనే సూర్యునికి గ్రహణం పట్టింది. నేను బాణాలు పడేసి, ‘ఈ సూర్యగ్రహణం మూలంగానే కదా ఈ రోజు దైవప్రవక్త ﷺ కు కష్టకాలం వచ్చింది. దైవసాక్షి! నేను దీన్ని తప్పక చూడాల్సిందే’ అని మనసులో అనుకున్నాను.
ఈ పూర్వరంగంలో ఆలోచిస్తే దైవప్రవక్త ﷺ కాలంలో పట్టిన తొలి గ్రహణం ఇదేనని బోధపడుతుంది. అప్పటివరకూ గ్రహణానికి సంబంధించిన ధర్మాదేశం ఏదీ లేదు. కాగా; అబ్దుర్రహ్మాన్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) మక్కా విజయం సందర్భంగా ఇస్లాం స్వీకరించారన్న సంగతి విస్మరించరానిది. కనుక దైవప్రవక్త ﷺ హయాంలో కానవచ్చిన తొలి సూర్యగ్రహణం మక్కా విజయం తరువాత కానవచ్చినదేనని దీని ఆధారంగా స్పష్టమవుతున్నది.
ఇకపోతే, ‘ముస్లిం’ మరియు ‘నసాయి’లలో జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఏమంటుందంటే, గ్రహణం తీవ్రమయిన వేసవి కాలంలో పట్టింది. కాగా; సూర్యగ్రహణం ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) మరణం నాడు పట్టిందనీ, అది జనవరి మాసమని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ మాసంలో తీవ్రంగా వేసవి కాదు, చలి ఉంటుంది. కాబట్టి ఈ సంఘటనలు వేర్వేరని దీన్నిబట్టి అవగతమవుతున్నది.
ఇక మనం అల్లామా ఖాజీ ముహమ్మద్ సల్మాన్ విశదీకరించిన ఖగోళ శాస్త్ర లెక్కల్ని పరిశీలిద్దాం- ఆయన ప్రకారం ‘మక్కా విజయం’ తరువాత మనకు మూడు గ్రహణాల ఆధారాలు లభిస్తున్నాయి. తొలి గ్రహణం హిజ్రీ 9, రబీవుల్ ఆఖిర్ 28వ తేదీన (క్రీ.శ. 630, ఆగస్టు 13వ తేదీ) పట్టింది. అది ఆగస్టు నెల. అరేబియా ద్వీపంలో ఈ నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండవ గ్రహణం హిజ్రీ 9, షవ్వాల్ నెల 29వ తేదీ (క్రీ.శ. 631, ఫిబ్రవరి)న సంభవించింది. మూడవ గ్రహణం హిజ్రీ 10, షవ్వాల్ నెల 28వ తేదీన (క్రీ.శ. 632 జనవరి 27వ తేదీన) పట్టింది.
ఖగోళ శాస్త్ర లెక్కల్ని, హదీసులలో ప్రస్తావనకు వచ్చిన నమాజె కుసూఫ్లను మనం కలిపిచూస్తే గ్రహణాలు కనీసం రెండు అని రూఢీ అవుతుంది. ఒక గ్రహణం ఎండాకాలంలో – ఆగస్టు నెలలో – పట్టింది. రెండవది ఇబ్రాహీం మరణ సందర్భంగా – జనవరి నెలలో – పట్టింది. మూడవ సూర్యగ్రహణం ఫిబ్రవరి నెలలో పట్టింది. ఈ గ్రహణం మదీనాలో కూడా కనిపించిందా? లేదా? అన్నది ఖచ్చితంగా తెలీదు. ఈ సంఘటనలన్నింటి ద్వారా విదితమయ్యేదేమిటంటే ఆ కాలంలో సూర్యగ్రహణం అనేకసార్లు పట్టింది.
ఇబ్రాహీం మరణం నాడు పట్టిన గ్రహణం గురించి కూడా వివిధ ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ఉల్లేఖనాల మధ్య కూడా కొంత వ్యాఘాతం కనిపిస్తుంది. ఆనాటి నమాజె కుసూఫ్ – ఒక్కో రకత్ రెండేసి రుకూలతో చేయబడిందని పెక్కు ఉల్లేఖనాలు చెబుతున్నాయి. కాని ముస్లింలోని ఉల్లేఖనం మాత్రం మూడేసి రుకూలతో ఒక్కో రకత్ నెరవేర్చబడిందని ఉంది. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించిన హదీసులలో ఏర్పడిన వైరుధ్యాన్ని, వ్యాఘాతాన్ని దూరం చేయటం సాధ్యంకాదు. కాకపోతే ఒక్కో రకత్ రెండేసి రుకూలతో చేయబడిందని చెబుతున్న ఉల్లేఖనాలు దృఢమైనవిగా, ఎక్కువ ప్రమాణబద్ధమైనవిగా కనిపిస్తున్నాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్), ఆధునిక ధర్మవేత్తలలో షా వలియుల్లా (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా రెండేసి రుకూలతో కూడిన నమాజె కుసూఫె ఎక్కువ అనుసరణీయమని అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)|హదీసు 403
హదీసు 404
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { مَا هَبَّتْ رِيحٌ قَطُّ إِلَّا جَثَا اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -عَلَى رُكْبَتَيْهِ, وَقَالَ: "اَللَّهُمَّ اجْعَلْهَا رَحْمَةً, وَلَا تَجْعَلَهَا عَذَابًا" } رَوَاهُ اَلشَّافِعِيُّ وَالطَّبَرَانِيُّ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : వేగంగా పెనుగాలులు వీచినపుడు దైవప్రవక్త ﷺ మోకాళ్ళపై కూర్చుని (దైవ సమక్షంలో) ఈ విధంగా వేడుకునేవారు: “దేవా! ఈ గాలిని కారుణ్య పవనంగా చేయి. శిక్షగా మార్చకు.” (దీనిని షాఫయి, తబ్రానీ – ఇరువురూ ఉల్లేఖించారు)
English
Narrated Ibn 'Abbas (RA): No wind ever blew without the Prophet (ﷺ) getting down on his knees and saying, "O Allah, make it a mercy and do not make it a punishment." [Reported by ash-Shafi'i and at-Tabarani].
సారాంశం
ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే పెను గాలులు వీస్తున్నప్పుడు, భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు దాసులు దైవకారుణ్యాన్ని ఆశిస్తూ, కడు దీనంగా దైవాన్ని ప్రార్థించాలి. పెనుగాలుల వల్ల సంభవించే నష్టం నుండి కాపాడమని వేడుకోవాలి. కురిసే వర్షాన్ని ప్రాణుల కోసం లాభదాయకంగా చేయమని దుఆ చేయాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)|హదీసు 404
హదీసు 405
وَعَنْهُ: { أَنَّهُ صَلَّى فِي زَلْزَلَةٍ سِتَّ رَكَعَاتٍ, وَأَرْبَعَ سَجَدَاتٍ, وَقَالَ: هَكَذَا صَلَاةُ اَلْآيَاتِ } رَوَاهُ اَلْبَيْهَقِيُّ. وَذَكَرَ اَلشَّافِعِيُّ عَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - رضى الله عنه - مِثْلَهُ دُونَ آخِرِهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారిచే ఈ హదీసు కూడా ఉల్లేఖించబడింది. ఈయన భూకంపం వచ్చినపుడు నాలుగు సజ్దాలు, ఆరు రుకూలతో నమాజ్ చేశారు. ‘దైవ నిదర్శనాల నమాజ్ ఈ విధంగానే చేయబడుతుంద’ని ఆయన (రదియల్లాహు అన్హు) అన్నారు. (దీనిని బైహఖీ ఉల్లేఖించారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఆధారంతో షాఫయి కూడా ఇలాగే సంగ్రహించారు. అయితే ఇందులో ఉల్లేఖనంలోని చివరి పలుకులు లేవు)
English
Narrated [Ibn 'Abbas (RA)]: He [the Prophet (ﷺ)] prayed during an earthquake six bowings and four prostrations, and said, "This is the way the Prayer of the Signs (of Allah) is offered. [Reported by al-Baihaqi].
ash-Shafi'i reported a similar Hadith without its end through 'Ali bin Abu Talib (RA).
సారాంశం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, భూకంపాలు, వరదలు, ఉప్పెనలు వచ్చి నష్టం వాటిల్లినప్పుడు ఈ విధంగా నమాజ్ చేయాలని పై హదీసు చెబుతోంది. దీనిని “సలాతుల్ ఆయాత్” గా వ్యవహరిస్తారు. కష్టకాలంలో, పరీక్షా ఘడియలలో తమను సృష్టించిన వాని వైపునకే మరలాలి. ఆయన్నే వేడుకోవాలి. దైవేతరులను వేడుకోవటం, కష్టాలనుండి గట్టెక్కించమని మిథ్యా దైవాలను మొరపెట్టుకోవటం షిర్క్‌గా పరిగణించబడుతుంది. షిర్క్ చాలా పెద్ద అన్యాయం. ఈ అన్యాయానికి పాల్పడిన వారిని దేవుడు సుతరామూ క్షమించడు. కనుక ముస్లింలు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ దైవకారుణ్యం పట్ల నిరాశ చెందకుండా – ఆశావహ దృక్పథంతో – ఆయన్ని ప్రార్థించాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.15 గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)|హదీసు 405
You must be logged in to post a comment.