హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 11. జిహాద్ పుస్తకం, 2వ అధ్యాయం: గుర్రపు స్వారీ, విలు విద్య. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1130 – 1134) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
11.2 గుర్రపు స్వారీ, విలు విద్య
باب السبق والرمي
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1130
عَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { سَابَقَ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -بِالْخَيْلِ اَلَّتِي قَدْ أُضْمِرَتْ, مِنْ الْحَفْيَاءِ, وَكَانَ أَمَدُهَا ثَنِيَّةِ اَلْوَدَاعِ. وَسَابَقَ بَيْنَ اَلْخَيْلِ اَلَّتِي لَمْ تُضَمَّرْ مِنْ اَلثَّنِيَّةِ إِلَى مَسْجِد ٍ بَنِي زُرَيْقٍ, وَكَانَ اِبْنُ عُمَرَ فِيمَنْ سَابَقَ } مُتَّفَقٌ عَلَيْه ِ زَادَ اَلْبُخَارِيُّ, قَالَ سُفْيَانُ: مِنْ الْحَفْيَاءِ إِلَى ثَنِيَّةِ اَلْوَدَاعُ خَمْسَةِ أَمْيَالٍ, أَوْ سِتَّةَ, وَمِنْ اَلثَّنِيَّةِ إِلَى مَسْجِدِ بَنِي زُرَيْقٍ مِيل ٍ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ తర్ఫీదు ఇవ్వబడిన గుర్రాలను ‘హఫ్‌యా’ నుండి ‘సనియతుల్‌వదా’ వరకు పరుగెత్తించారు. పూర్తిగా తర్ఫీదు కాని గుర్రాలను ‘సనియా’ నుండి ‘బనూ జురైఖ్’ మస్జిదు వరకు దౌడు తీయించారు. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా పరుగు పోటీలో పాల్గొన్నారు. (బుఖారీ, ముస్లిం)
బుఖారీలో అదనంగా ఇలా వుంది : “హఫ్‌యా నుండి సనియతుల్ వదా వరకు ఐదారు మైళ్ళు ఉంటుంది. బనూ జురైఖ్ మస్జిద్ వరకైతే ఒక మైలు దూరం మాత్రమే” అని సుఫ్యాన్ వివరించారు.
English
Ibn ’Umar (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) held a horse race, with horses that had been made lean by training, from al-Hafiya to Thanyat al-Wada' (names of two places) and he held a race from Thanyat- alWada' to the mosque of Banu Zuraiq between the horses which had not undergone such training.’ Ibn ’Umar was among those who took part in that race. Agreed upon. Al-Bukhari added: Sufian said, ‘From al·Hafiya’ to Thanyat al-Wada' is a distance of live or six miles and from Thanyat- al-Wada‘ to the mosque of Banu Zuraiq is a distance of one mile.’
సారాంశం
దైవమార్గంలో పోరాటం కోసం గుర్రాలకు తర్ఫీదు నివ్వటం, పరుగు పోటీలు పెట్టడం, విలువిద్య విన్యాసాలు నిర్వహించటం, ఈటెల ప్రయోగం వంటివి ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలోని యుద్ధాలలో ఈ అంశాలు చాలా కీలకమైనవి. నేటి ఆధునిక యుద్ధ పద్ధతుల్లో చాలా మార్పు వచ్చింది కదా! శతఘ్నులు, టాంకులు, క్షిపణుల ప్రయోగం, యుద్ధ విమాన విన్యాసాలు, గెరిల్లా విధానాలు నేటి యుద్ధాల్లో కీలకాంశాలు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.2 గుర్రపు స్వారీ, విలు విద్య|హదీసు 1130
హదీసు 1131
وَعَنْهُ; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -سَابَقَ بَيْنَ اَلْخَيْلِ, وَفَضْلِ اَلْقَرْحُ فِي اَلْغَايَةِ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ గుఱ్ఱాల మధ్య పరుగు పోటీలను పెట్టారు. ఈ సందర్భంగా వయసులో, ఊపులో ఉన్న గుర్రాల దూరాన్ని నిర్ధారించటంలో వ్యత్యాసం కనబర్చారు. (దీనిని అహ్మద్, అబూదావూద్‌లు ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Ibn ’Umar (RAA) narrated, ‘ Messenger of Allah (ﷺ) held a horse race and made the destination from the fully grown ones at a longer distance Related by Ahmad and Abu Dawud. Ibn Hibban graded it as Sahih.
సారాంశం
పశువుల శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసి, వాటి శక్తికి తగ్గ పని మాత్రమే వాటిచేత చేయించుకోవాలనీ, శక్తికి మించిన భారం మనుషులపైనే కాదు, పశువులపై సయితం వేయరాదనీ ఈ హదీసు చెబుతోంది. అందుకే దైవప్రవక్త ﷺ గుర్రాల పరుగును నిర్వహించేటప్పుడు ముసలి మరియు బలహీనమైన గుర్రాలను ఒక వరుసలోనూ, బలిష్ఠమైన, మంచి వయసులో వున్న గుర్రాలను మరొక వరుసలోనూ నిలబెట్టారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.2 గుర్రపు స్వారీ, విలు విద్య|హదీసు 1131
హదీసు 1132
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ "لَا سَبْقَ إِلَّا فِي خُفٍّ, أَوْ نَصْلٍ, أَوْ حَافِرٍ" } رَوَاهُ أَحْمَدُ, وَالثَّلَاثَةَ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّان َ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు : “పరుగు పోటీలు కేవలం ఒంటెలు, గుర్రాలకే పరిమితం. గెలుపోటములు కేవలం విలువిద్యలోనే.” (దీనిని అహ్మద్ మరియు ముగ్గురూ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదా ఖరారు చేశారు.)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said ,”Prize money is allowed only for racing camels, shooting arrows or racing horses.” Related by Ahmad and the three lmams. Ibn Hibban graded it as Sahih.
సారాంశం
నిర్ణీత బహుమానం లేక పారితోషికంపై పరుగు పోటీలలో పాల్గొనటం సమ్మతమే. అయితే జూదం, బ్రాకెట్టు, నేటి గుర్రపు పందాల తరహాలో ఇచ్చే మొత్తం మాత్రం ధర్మ సమ్మతం కాదు. గుర్రాలను, ఒంటెలను యుద్ధానికై తయారు చేసే ప్రయత్నంలో పోటీలు పెట్టడం, ఆ పోటీలో పాల్గొన్న రౌతులకు ముందుగా నిర్ధారించిన దాని ప్రకారం పారితోషికాలు ఇవ్వటం సమంజసమే. కాని పక్షులు, పావురాలను ఎగురవేసి పందాలు కాయటం, ఎనుబోతుల, పొట్టేళ్ళ మధ్య లడాయి పెట్టడం, కోడిపందాలు కాయటం వంటివి అధర్మంగా పరిగణించబడతాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.2 గుర్రపు స్వారీ, విలు విద్య|హదీసు 1132
హదీసు 1133
وَعَنْهُ, عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { " مَنْ أَدْخُلُ فَرَساً بَيْنَ فَرَسَيْنِ - وَهُوَ لَا يَأْمَنُ أَنْ يَسْبِقَ - فَلَا بَأْسَ بِهِ, وَإِنْ أَمِنَ فَهُوَ قِمَارٌ" } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَإِسْنَادُهُ ضَعِيف ٌ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు : “ఎవరయినా రెండు గుర్రాల మధ్య మూడో గుర్రాన్ని తెచ్చిపెడితే, ఆ గుర్రం (మొదటి రెండు గుఱ్ఱాలను) మించిపోతుందన్న నమ్మకం అతనికి లేకుంటే ఫరవా లేదు – కాని ఆ మూడవ గుర్రం ముందుకు దూసుకుపోతుందన్న దృఢ నమ్మకం ఉండి కూడా అతనా పనిచేస్తే అది జూదమవుతుంది.” (దీనిని అహ్మద్, అబూదావూద్ ఉల్లేఖించారు. దీని పరంపర బలహీనమైనది)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “If anyone introduces a horse in a race with two other horses, when he is not certain that it cannot be beaten, there is no harm in it, but when he is certain (it cannot be beaten) it is then considered as gambling.” Related by Ahmad and Abu Dawud with a weak chain of narrators.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.2 గుర్రపు స్వారీ, విలు విద్య|హదీసు 1133
హదీసు 1134
وَعَنْ عَقَبَةِ بْنُ عَامِرٍ - رضى الله عنه - { [ قَالَ ]: سَمِعْتَ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -وَهُوَ عَلَى اَلْمِنْبَرِ يَقُولُ: ﴿ وَأَعِدُّوا لَهُمْ مَا اِسْتَطَعْتُمْ مِنْ قُوَّةٍ ﴾ "أَلَا إِنَّ اَلْقُوَّةَ اَلرَّمْيُ, أَلَا إِنَّ اَلْقُوَّةَ اَلرَّمْيُ, أَلَا إِنَّ اَلْقُوَّةَ اَلرَّمْيُ }. رَوَاهُ مُسْلِمٌ..
హజ్రత్ ఉఖ్‌బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ వేదికపై నిలబడి ఇది (ఈ ఆయత్) పఠిస్తుండగా నేను విన్నాను: “మీరు మీ శక్తిమేరకు అత్యధిక బలాన్నీ, కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోవటానికి సమాయత్తపరచుకోండి.” (అన్ ఫాల్-60). “జాగ్రత్త! అసలు శక్తి విలువిద్యే. జాగ్రత్త! అసలు శక్తి విలువిద్యే.” (అని కూడా అన్నారు). (ముస్లిం)
English
'Uqbah bin 'Amir (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) recite when he was on the pulpit, “And make ready against them all you can of power, including steeds of war( tanks, planes etc.)”(8:60), surely strength is in shooting (arrows); surely strength is in shooting, surely strength is in shooting.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యే దేమిటంటే శత్రు రాజ్యం నుండి తన ప్రజలను కాపాడుకోవటానికి నిత్యం సిద్ధంగా ఉండాలి. సైనికబలాన్ని, వాహనాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ, పరిస్థితుల కనుగుణంగా తర్ఫీదునిస్తూ ఉండాలి. కొంగ్రొత్త ప్రయోగాలు చేయాలి. నేటి ఆధునిక యుద్ధ పరిభాషలో వాహనాలంటే విమానాలు, యుద్ధ టాంకులు, లాంఛర్లు, యుద్ధ నౌకలు వస్తాయి. అలాగే విలువిద్య అంటే కేవలం బాణాలే కావు – లక్ష్యాన్ని ఛేదించే తుపాకులు, ఫిరంగులు, క్షిపణుల్లాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఇరుగు పొరుగు రాజ్యాలు సైనిక బలాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండగా నిస్సహాయంగా లేక నిర్లిప్తంగా ఉండిపోవటం ఏ జాతికైనా శ్రేయస్కరం కాదని హదీసు భావం. నేటి ఆధునిక ప్రపంచ పటాన్ని వీక్షించిన వారికి ఈ సంగతి ఇట్టే బోధపడుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.2 గుర్రపు స్వారీ, విలు విద్య|హదీసు 1134
You must be logged in to post a comment.