హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 99వ అధ్యాయం: ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 721 – 727) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం
باب استحباب تقديم اليمين في كل ما هو من باب التكريم كالوضوءِ وَالغُسْلِ والتَّيَمُّمِ, وَلُبْسِ الثَّوْبِ وَالنَّعْلِ وَالخُفِّ وَالسَّرَاوِيلِ وَدُخولِ المسجد, والسواك, والاكتحال, وتقليم الأظافر, وَقَصِّ الشَّارِبِ وَنَتْفِ الإبْطِ, وَحلقِ الرَّأسِ, وَالسّلامِ مِنَ الصَّلاَةِ, وَالأكْلِ والشُّربِ, وَالمُصافحَةِ, وَاسْتِلاَمِ الحَجَرِ الأَسْوَدِ, والخروجِ منَ الخلاءِ, والأخذ والعطاء, وغيرِ ذَلِكَ مِمَّا هُوَ في معناه. ويُسْتَحَبُّ تَقديمُ اليسارِ في ضدِ ذَلِكَ, كالامْتِخَاطِ وَالبُصَاقِ عن اليسار, ودخولِ الخَلاءِ, والخروج من المَسْجِدِ, وخَلْعِ الخُفِّ والنَّعْلِ والسراويلِ والثوبِ, والاسْتِنْجَاءِ وفِعلِ المُسْتَقْذرَاتِ وأشْبَاه ذَلِكَ.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
ఉదాహరణకు వుజూ చేయటం, గుసుల్ చేయటం, తయమ్ముమ్ చేయటం, దుస్తులు, పాదరక్షలు, మేజోళ్ళు, షరాయి ఇత్యాదివి ధరించటం, మస్జిద్లోకి ప్రవేశించటం, మిస్వాక్ చేయటం, సుర్మా పూసుకోవటం, గోళ్ళు మీసాలు కత్తిరించుకోవటం, చంకలోని వెంట్రుకలు పెరికివేయటం, శిరోజాలు గొరిగించుకోవటం, నమాజును సలాంతో ముగించటం, తినటం, త్రాగటం, కరచాలనం చేయటం, హజ్రె అస్వద్ను (నల్లరాయిని) చుంబించటం, మరుగుదొడ్డి నుండి వెడలటం, ఏదయినా ఇవ్వటం తీసుకోవటం లాంటి పనులన్నీ కుడి వైపు నుండి ప్రారంభించాలి.
వీటికి భిన్నమైన పనులను ఎడమవైపునుండి ప్రారంభించటం అభిలషణీయం. ఉదాహరణకు ముక్కు శుభ్రం చేసుకోవటం, ఎడమ వైపు ఉమ్మివేయటం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించటం, మస్జిద్నుండి బయటికి రావటం, మేజోళ్ళు, పాదరక్షలు, దుస్తులు ఇత్యాదివి ధరించిన తరువాత వాటిని విడవటం, మూత్రశుద్ధి చేసుకోవటం, అపరిశుభ్రమైన పనులు చేయటం మొదలగునవి.
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{فَأَمَّا مَنْ أوتِيَ كِتَابَهُ بيَمينِهِ فيقول هاؤم اقرؤوا كتابيه} الآيات [الحاقة: ١٩]
తన కర్మల పత్రం తన కుడి చేతికివ్వబడిన వ్యక్తి, "చూడండి, నా కర్మల పత్రాన్ని తీసుకొని చదవండి" అని అంటాడు. (అల్ హాఖ్యహ్ : 19)
{فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ} [الواقعة: ٩,٨]
"కుడి పక్షంవారు; కుడి పక్షంవారి (అదృష్టాన్ని) గురించి ఏమనాలి. ఎడమ వక్షంవారు; ఎడమపక్షంవారి (దురదృష్టాన్ని) గురించి ఏమనాలి." (అల్ వాఖిఅహ్ : 8,9)
వివరణ
ప్రళయదినాన దేవుని కరుణాకటాక్షాలకు అర్హులయ్యే దాసులకు వారి కర్మల పత్రాలు కుడిచేతిలో ఇవ్వబడతాయి. ఇది వారి అదృష్టానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. వీరు దైవ సింహాసనానికి కుడిప్రక్కన ఉంటారు కనుక వీరిని "అస్హాబుల్ యమీన్" అని అంటారని మరికొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) పైన పేర్కొనబడిన సూక్తుల ద్వారా మంచిపనుల కోసం కుడివైపు అవయవాలను ఉపయోగించటం మరియు అవాంఛనీయ పనుల కోసం ఎడమ చెయ్యి, ఎడమ కాలు ఉపయోగించటం పుణ్యప్రదమన్న విషయాన్ని నిరూపించారు. హదీసుల్లో కూడా దీని గురించి విశదంగా బోధించటం జరిగింది. మచ్చుకు కొన్ని హదీసులు గమనించండి:
English
“Then as for him who will be given his Record in his right hand will say: `Take, read my Record!”’ [Al-Ḥāqqah 69:19]
“So those on the Right Hand (i.e., those who will be given their Records in their right hands) how (fortunate) will those be on the Right Hand! (As a respect for them, because they will enter Jannah). And those on the Left Hand (i.e., those who will be given their Record in their left hands) how (unfortunate) will those be on the Left Hand! (As a disgrace for them, because they will enter Hell).” [Al-Wāqi‘ah 56:8–9]
హదీసు 721
وعن عائشة رضيَ اللَّه عنها قالَتْ: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُعْجِبُهُ التَّيمُّنُ في شأنِه كُلِّه: في طُهُوِرِهِ، وَتَرجُّلِهِ، وَتَنَعُّلِه. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రతి పనినీ కుడివైపు నుండి ప్రారంభించటాన్ని ఎక్కువగా యిష్టపడేవారు. చివరికి వుజూ చేసుకోవటం, తల దువ్వుకోవటం, పాదరక్షలు ధరించటమయినా సరే.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని శుచి, శుభ్రతల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ liked to use his right hand in all matters: in combing his hair and wearing his shoes.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 721
హదీసు 722
وعنها قالتْ: كانَتْ يَدُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، اليُمْنى لِطَهُورِهِ وطَعَامِه، وكَانَتْ اليُسْرَى لِخَلائِهِ وَمَا كَانَ منْ أَذىً. حديث صحيح، رواه أَبُو داود وغيره بإِسناد صحيحٍ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ గారి కుడిచేయి వుజూ చేసుకోవటం కోసం, భోజనం చేయటం కోసం ఉపయోగపడేది. ఎడమచేయి మలమూత్రశుద్ధికోసం, ఇతర అపరిశుభ్రమైన పనుల కోసం ఉపయోగపడేది.
(ఈ హదీసు దృఢమైనది, అబూదావూద్ తదితరులు దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు.)
(సుననె అబూదావూద్లోని శుచి, శుభ్రతల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah was used to using his right hand for performing Wudu’ and for eating his food whereas he was used to using his left hand in his toilet and for other similar purposes.[Abu Dawud]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 722
హదీసు 723
وعن أُم عَطِيةَ رضي اللَّه عنها أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ لَهُنَّ في غَسْلِ ابْنَتِهِ زَيْنَبَ رضي اللَّه عنها: "ابْدَأْنَ بِميامِنهَا وَمَواضِعِ الوُضُوءِ مِنْها" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉమ్మె అతియ్యా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ తన కూతురు జైనబ్ (రదియల్లాహు అన్హా)కు (ఆమె భౌతిక కాయానికి) స్నానం చేయించే విషయమై మమ్మల్ని ఉద్దేశ్యించి, "స్నానం కుడివైపునుండి మొదలుపెట్టండి; ముందుగా వుజూలో కడగవలసిన అవయవాలు కడగండి" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)
English
Umm `Atiyyah (radiyallahu anha) reported: The Prophet ﷺ instructed us at the time of washing the dead body of his daughter Zainab (radiyallahu anha) to begin with her right side, and from the parts that are washed in Wudu’.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- మనిషి బ్రతికుండగా తన పనుల్ని కుడివైపునుండి మొదలుపెట్టినట్లుగానే చనిపోయిన తరువాత అతని శవస్నానాన్ని కూడా కుడివైపునుండే మొదలుపెట్టాలి.
- హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) భౌతికకాయానికి స్నానం చేయించిన స్త్రీలలో ఉమ్మె అతియ్యా కూడా ఉన్నారు. శవ స్నానానికి సంబంధించి దైవప్రవక్త ﷺ వారందరికీ సూచనలిచ్చారు. దీనిద్వారా స్త్రీ భౌతిక కాయానికి అత్యంత దగ్గరి మహ్రమ్ బంధువు అయిన భర్తగాని లేక ఇతర స్త్రీలు గాని స్నానం చేయించాలని బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 723
హదీసు 724
وعن أَبي هُريرة رضيَ اللَّه عنه أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا انْتَعَلَ أَحدُكُمْ فَلْيبْدَأْ باليُمْنى، وَإِذا نَزَع فَلْيبْدَأْ بِالشِّمالِ. لِتَكُنِ اليُمْنى أَوَّلهُما تُنْعَلُ، وآخرَهُمَا تُنْزَعُ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు : మీలో ఎవరయినా చెప్పులు తొడుక్కున్నప్పుడు మొదట కుడి కాలికి తొడుక్కోవాలి. విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి చెప్పు విడవాలి. ఇలా తొడుక్కోవటంలో కుడికాలు ఎప్పుడూ ముందుండాలి, వదలడంలో ఎప్పుడూ చివర ఉండాలి.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్ర ధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When any of you puts on his shoes, he should put on the right one first; and when he takes them off, he should begin with the left. Let the right shoe be the first to be put on and the last to be taken off.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 724
హదీసు 725
وعن حَفْصَةَ رضي اللَّه عنها أَنَّ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَجْعَلُ يَمينَهُ لطَعَامِهِ وَشَرَابِهِ وَثِيَابِهِ ويَجَعلُ يَسارَهُ لِمَا سِوى ذلكَ رواه أبو داود والترمذي وغيره.
హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ తన కుడి చేతిని తినటం, త్రాగటం కోసం, బట్టలు ధరించటం కోసం ఉపయోగించేవారు. ఎడమ చేతిని వేరే పనుల కోనం ఉపయోగించేవారు.
(అబూదావూద్, తిర్మిజీ తదితరులు దీనిని ఉల్లేఖించారు)
(సుననె అబూ దావూద్లోని శుచి, శుభ్రతల ప్రకరణం)
English
Hafsah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ used to use his right hand for eating, drinking and wearing his clothes and used to use his left hand for other purposes.[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 725
హదీసు 726
وعن أبي هريرة رضي اللَّه عنه أَنَّ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا لَبِسْتُمْ، وَإِذا تَوَضَّأْتُم، فَابْدؤُوا بِأَيَامِنكُمْ" حديث صحيح. رواه أَبُو داود والترمذي بإِسناد صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు బట్టలు ధరించేటప్పుడు, వుజూ చేసినప్పుడు కుడివైపు నుండి మొదలుపెట్టండి."
(అబూ దావూద్, తిర్మిజీ, దీని ఆధారాలు దృఢమైనవి)
(సుననె అబూ దావూద్లోని వస్త్రధారణ ప్రకరణం, సుననె తిర్మిజీలోని వస్త్రధారణ అధ్యాయం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When you wear your clothes or perform your Wudu’, begin with your right side.”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 726
హదీసు 727
وعن أَنس رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَتى مِنًى: فَأَتَى الجَمْرةَ فَرماهَا، ثُمَّ أَتَى مَنْزِلهُ بِمنًى، ونحَرَ، ثُمَّ قَالَ للِحلاَّقَ "خُذْ" وَأَشَارَ إِلى جَانِبِه الأيمنِ، ثُم الأيسَرِ ثُمَّ جعَلَ يُعطِيهِ النَّاسَ. متفقٌ عَلَيْهِ. وفي روايةٍ: لمَّا رمَى الجمْرةَ، ونَحَر نُسُكَهُ وَحَلَقَ: نَاوَل الحلاقَ شِقَّهُ الأَيْمنَ فَحلَقَه، ثُمَّ دعَا أَبَا طَلحةَ الأَنصاريَّ رضي اللَّه عنه، فَأَعطَاهُ إِيَّاهُ، ثُمَّ نَاوَلهُ الشقَّ الأَيْسَرَ فَقَالَ: "احْلِقْ"فَحلَقَهُ فَأَعْطاهُ أَبا طَلْحَةَ فَقَالَ:"اقسِمْهُ بَيْنَ النَّاس". [كتاب أدب الطعام]
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ (తన వీడ్కోలు హజ్లో) మినా ప్రదేశానికి చేరుకున్నాక 'జమ్రా' దగ్గరికెళ్ళి దానికి కంకర్రాళ్ళు రువ్వారు. ఆ తరువాత మినాలోని తన విడిది గృహానికి చేరుకొని పశుబలి ఇచ్చారు. తరువాత వెంట్రుకలు గొరిగే మనిషిని పిలిచి ఇటుప్రక్క వెంట్రుకలు గొరగమని చెబుతూ కుడివైపు చూపించారు. తరువాత ఎడమప్రక్క వెంట్రుకలు గొరిగించుకొని ఆ వెంట్రుకలన్నీ ప్రజలకు ఇవ్వసాగారు.
(బుఖారీ – ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవప్రవక్త ﷺ జమ్రాకు కంకర్రాళ్ళు రువ్వి, పశుబలి ఇచ్చిన తరువాత తల గొరిగించుకోదలచి వెంట్రుకలు గొరిగే మనిషికి తన కుడివైపు శిరోజాలు అందించారు. అతను వాటిని గొరిగేశాడు. అప్పుడాయన అబూ తల్హా (రదియల్లాహు అన్హు)ని పిలిచి ఆ వెంట్రుకలు ఆయనకిచ్చారు. తరువాత ఎడమ వైపు శిరోజాలు అందిస్తూ "ఇప్పుడు వీటిని గొరుగు" అని అన్నారు. అతను వాటిని కూడా గొరిగేశాడు. దైవప్రవక్త ﷺ ఆ వెంట్రుకలు కూడా అబూ తల్హా (రదియల్లాహు అన్హు)కు ఇచ్చి, వాటిని ప్రజలకు పంచిపెట్టమని ఆదేశించారు.
(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: When Messenger of Allah ﷺ went to Mina, he came to Jamrat-ul-`Aqabah and threw pebbles at it. After that, he went to his lodge in Mina and sacrificed. Then he called for a barber and pointed his right side to him, said, “Shave from here.” Then he pointed his left side and said, “Take (hair) from here.” Then he distributed his hair among the people.[Al-Bukhari and Muslim].
Another narration is: After the Messenger of Allah ﷺ had thrown pebbles at Jamrah and sacrificed an animal, he turned the right side of his head towards the barber who shaved it for him. Then he called Abu Talhah Ansari (radiyallahu anhu) and gave his hair to him. Then he turned his head to the left side and asked the barber to shave it. He gave the hair to Abu Talhah and told him, “Distribute it among the people.”
ముఖ్యాంశాలు
- కాబా యాత్రికులు జిల్ హిజ్జా మాసపు పదో తేదీన అరఫాత్ స్థలం నుండి తిరిగొచ్చి 'జమ్రా అఖబా'కు కంకర్రాళ్ళు కొట్టవలసి ఉంటుంది. ఆ తరువాత పశుబలి ఇచ్చి, శిరోజాలు గొరిగించుకోవటంగానీ, కత్తిరించుకోవటం గాని చేస్తారు. చివరగా కాబా గృహం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ప్రదక్షిణాలనే 'తవాఫె ఇఫాజా' లేక 'తవాఫె జియారత్' అని అంటారు.
- తల వెంట్రుకలు గొరిగించుకున్నప్పుడుగాని, కత్తిరించుకున్నప్పుడుగాని కుడివైపు నుండి ప్రారంభించాలి.
- దైవప్రవక్త గుర్తులను శుభప్రదమైనవిగా భావించటం ధర్మసమ్మతమే. అయితే ఈ పద్ధతి ఒక్క దైవప్రవక్త గుర్తులకు మాత్రమే పరిమితం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|99. ప్రతి మంచి పనినీ కుడివైపునుండి ఆరంభించటం అభిలషణీయం|హదీసు 727
You must be logged in to post a comment.