హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 98. ఆరాధనలకు దారులు మార్చి నడవటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 98వ అధ్యాయం: పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించటానికి, హజ్, జిహాద్, జనాజా నమాజ్‌కు లేక మరే ఆరాధనకయినా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యం లభించటంతోపాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 719 – 720) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

98. పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించటానికి, హజ్, జిహాద్, జనాజా నమాజ్‌కు లేక మరే ఆరాధనకయినా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యం లభించటంతోపాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది

↑ విషయ సూచిక

باب استحباب الذهاب إلى العيد وعيادةالمريض والحج والغزو والجنازة ونحوها من طريق والرجوع من طريق آخرلتكثير مواضع العبادة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

719

హదీసు 719

عن جابرٍ رضيَ اللَّه عنه قَالَ: كانَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا كَانَ يَوْمُ عِيدٍ خَالَفَ الطَّرِيقَ. رواه البخاري. قَوْله:"خَالَفَ الطَّرِيقَ"يعني: ذَهَبَ في طَرِيقٍ وَرَجَعَ في طَرِيقِ آخَرَ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పండుగ రోజు (నమాజ్‌కు వెళ్ళినప్పుడు) దారులు మార్చి నడిచేవారు. (బుఖారీ)

అంటే వెళ్ళినప్పుడు ఒక దారిగుండా వెళ్ళి, తిరిగొచ్చినప్పుడు వేరొక దారి గుండా వచ్చేవారని అర్థం.

(సహీహ్ బుఖారీలోని పండుగల ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: On the occasion of the `Eid, the Prophet ﷺ would proceed to the prayer place taking one route and returning from another.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ ప్రార్థనా స్థలాలకు ఒక దారిగుండా వెళ్ళి మరోదారిగుండా తిరిగి రావటంలోని ఆంతర్యం ఏమిటి? దీని గురించి పండితులు అనేక అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజలు ప్రార్థనా స్థలాలకు వెళ్ళివచ్చినప్పుడు దారిలో దేవుని ఏకత్వాన్నీ, ఆయన పవిత్రతను కొనియాడతారు. ఆయన ఔన్నత్యాన్ని స్తుతిస్తారు. దానివల్ల ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుందని గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడుతున్నారు. కొంతమంది పండితులు ప్రళయదినాన ఆ దారులు తమగుండా దైవాన్ని స్తుతిస్తూ నడచిన దాసుల గురించి దైవసన్నిధిలో సాక్ష్యం చెబుతాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా పండుగరోజు ప్రజలు ఇతర రోజుల్లోకన్నా ఎక్కువగా దానధర్మాలు చేస్తారు. కనుక దారులు మార్చి నడవటం వల్ల ఎక్కువమంది అవసరార్థుల అవసరాలు తీరే అవకాశాలున్నాయని మరికొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ప్రార్థనా స్థలాలకు ఒకదారి గుండా వెళ్ళి మరోదారి గుండా తిరిగి రావటం దైవప్రవక్త సంప్రదాయం అనే విషయం మాత్రం సత్యం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|98. పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించటానికి, హజ్, జిహాద్, జనాజా నమాజ్‌కు లేక మరే ఆరాధనకయినా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యం లభించటంతోపాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది|హదీసు 719

720

హదీసు 720

وعنِ ابنِ عُمَرَ رضي اللَّه عنهما أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يَخْرُجُ مِنْ طَرِيقِ الشَّجَرَةِ وَيَدْخلُ مِنْ طَريقِ المُعَرَّسِ، وإِذَا دَخَلَ مَكَّةَ دَخَلَ مِنَ الثَّنِية العُليَا وَيَخْرُجُ مِنَ الثَّنِية السُّفْلى متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ (మదీనా నగరం నుండి) బయటికి వెళ్ళదలచుకున్నప్పుడు షజరా మార్గం గుండా బయటికి వెళ్ళేవారు. తిరిగి నగరంలోకి ప్రవేశించేటప్పుడు ముఅర్రస్ దారిగుండా ప్రవేశంచేవారు.

మక్కా నగరంలోకి ప్రవేశించినప్పుడు 'సనియ్యా ఉల్‌యా' (ఎత్తైన గుట్టల) మార్గం గుండా ప్రవేశించేవారు. అక్కణ్ణుంచి 'సనియ్యా సుఫ్‌లా' (పల్లపు గుట్టల) దారి గుండా వెడలేవారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ used to go by way of Ash-Shajarah and return by way of Al-Mu`arras. He would also enter Makkah through the Higher Pass and would leave it through the Lower Pass.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

'సనియ్యా' అంటే కనుమ అని అర్థం. మదీనా నుండి మక్కాకు వెళ్ళినప్పుడు దైవప్రవక్త ﷺ మెరక ప్రాంతం గుండా వెళ్ళి తిరిగొచ్చినప్పుడు పల్లపు ప్రాంతం గుండా తిరిగొచ్చేవారు. షజరా అనేది ఓ ప్రముఖ ప్రాంతం. దైవప్రవక్త ﷺ ఆ ప్రాంతం గుండా జుల్ హులైఫా అనే ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ఒక రాత్రి గడిపేవారు. తిరుగు ప్రయాణంలో ముఅర్రస్ దారిగుండా మదీనా నగరంలోకి ప్రవేశించేవారు. జుల్ హులైఫా ప్రదేశంలో ఉన్న మస్జిదునే ముఅర్రస్ అని అంటారు. అది మదీనా నగరానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ హదీసు కూడా దైవప్రవక్త ﷺ ప్రార్థనా స్థలాలకు ఒక దారిగుండా వెళ్ళి మరొక దారిగుండా తిరిగొచ్చేవారని తెలుపుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|98. పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించటానికి, హజ్, జిహాద్, జనాజా నమాజ్‌కు లేక మరే ఆరాధనకయినా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యం లభించటంతోపాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది|హదీసు 720