హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 92వ అధ్యాయం: ప్రశాంతత, హుందాతనం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 703) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
92. ప్రశాంతత, హుందాతనం
باب الوقار والسكينة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{وَعِبَادُ الرَّحْمَنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الأَرْضِ هَوْناً وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلاماً} [الفرقان:٦٣]
"కరుణామయుని (అసలు) దాసులు ఎవరంటే, వారు నేలపై వినమ్రులై నడుస్తారు, మూర్ఖులు వారిని పలకరించినప్పుడు 'మీకో సలామ్' అని చెప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోతారు." (అల్ ఫుర్ఖాన్ : 63)
వివరణ :
నేలపై నిక్కుతూ నడవటమనేది మూర్ఖత్వానికి నిదర్శనం. దీనికి భిన్నంగా అణకువతో వినయవినమ్రతలు ఉట్టిపడేలా నడవటం హుందాతనానికి తార్కాణం. అదేవిధంగా మూర్ఖులతో వాదులాటకు దిగటం కూడా హుందాతనానికి విరుద్ధమే. విశ్వాసులైన దాసులు తమకు ఎప్పుడైనా మూర్ఖులు తారసిల్లితే ఉత్తమోత్తమ రీతిలో అక్కణ్ణుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు.
English
“And the (faithful) slaves of the Most Gracious (Allah) are those who walk on the earth in humility and sedateness, and when the foolish address them (with bad words) they reply back with mild words of gentleness.” [Al-Furqān 25:63]
హదీసు 703
وعن عائشة رضي اللَّه عنها قالت: مَا رَأَيْتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مُسْتَجْمِعاً قَطُّ ضَاحِكاً حتَّى تُرى مِنه لَهَوَاتُه، إِنَّما كانَ يَتَبَسَّمُ. متفقٌ عَلَيْهِ. "اللَّهَوَات"جَمْع لَهَاةٍ: وهِي اللَّحُمة الَّتي في أقْصى سَقْفِ الْفَمِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ తన గొంతుక తిత్తులు కనబడేవిధంగా విరగబడి నవ్వటం నేనెన్నడూ చూడలేదు. ఆయన కేవలం చిరునవ్వు చిందించేవారు.
(బుఖారీ – ముస్లిం)
లహవాత్ అనేది 'లహాతున్' అనే పదానికి బహువచనం. గొంతుకలో నోటి చివర పైభాగంలో ఉండే మాంసపు తిత్తిని లహాతున్ అని అంటారు.
English
`Aishah (radiyallahu anhu) reported: I have never seen Messenger of Allah ﷺ laughing so heartily that his uvula could be seen. He used to smile only.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
విపరీతమైన నవ్వు మనిషిని దేవుని విషయంలో ఏమరుపాటుకు గురి చేస్తుంది. అందుకే దివ్య ఖుర్ఆన్లో ఒకచోట, "వారు నవ్వటం తగ్గించాలి, ఏడ్వటం హెచ్చించాలి" అని చెప్పబడింది. అదీగాక బిగ్గరగా, పగలబడి నవ్వటం మూలంగా మనిషి తన గాంభీర్యాన్ని, హుందాతనాన్ని కోల్పోతాడు. సౌమ్యులు, పరువుప్రతిష్ఠలు కలిగివున్న వారెవరూ పగలబడి నవ్వరు. వారి పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వే తొణకిసలాడుతూ ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|92. ప్రశాంతత, హుందాతనం|హదీసు 703
You must be logged in to post a comment.