హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 91. హితబోధలోనూ మధ్యేమార్గం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 91వ అధ్యాయం: హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 699 – 702) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

91. హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి

↑ విషయ సూచిక

بابُ الوَعظ والاقتصاد فِيهِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ} [النحل:١٢٥]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో." (అన్ నహ్ల్ : 125)

English

“Invite (mankind, O Muhammad ﷺ) to the way of your Rubb (i.e., Islam) with wisdom (i.e., with the Divine Revelation and the Qur’an) and fair preaching.” [An-Naḥl 16:125]

699

హదీసు 699

عن أَبي وائِلٍ شَقِيقِ بنِ سَلَمَةَ قَالَ: كَانَ ابْنُ مسْعُودٍ رضي اللَّه عنه يُذكِّرُنَا في كُل خَمِيسٍ مرة، فَقَالَ لهُ رَجُلٌ: يَا أَبَا عبْدِ الرَّحْمنِ لوددْتُ أَنَّكَ ذَكَّرْتَنَا كُلَّ يَوْمٍ، فَقَالَ: أمَا إِنَّهُ يَمنعني مِنْ ذلكَ أنَّي أكْرَهُ أنْ أمِلَّكُمْ وإِنِّي أتخَوَّلُكُمْ بِالموْعِظةِ، كَما كَانَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَتَخَوَّلُنَا بِهَا مَخافَةَ السَّآمَةِ علَيْنَا. متفقٌ عليه. "يَتَخَوَّلُنَا"يَتَعهَّدُنا.

హజ్రత్ అబూ వాయిల్ షఖీఖ్ బిన్ సలమా (రదియల్లాహు అన్హు) కథనం : ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) ప్రతి గురువారం మాకు హితబోధ చేస్తుండేవారు. ఓ రోజు ఒక వ్యక్తి ఆయనతో, "అబూ అబ్దుర్రహ్మాన్! మీరు మాకు ప్రతి రోజూ హితబోధ చేస్తుండాలని నా కోరిక" అని అన్నాడు. దానికాయన "ప్రతి రోజూ హితబోధ చేసి మిమ్మల్ని విసుగెత్తించటం నాకిష్టం లేదు. అందుకే నేను ప్రతి రోజూ హితబోధ చేయటం లేదు. దైవప్రవక్త ﷺ కూడా మేమెక్కడ విసుగెత్తిపోతా మోనన్న భయంతో మాకు హితబోధ చేయటానికి ఒక దినాన్ని నిర్ణయించారు. అలాగే నేను కూడా మీకు హితబోధ చేయటానికి ఒక దినాన్ని నిర్ణయించాను" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విద్యా ప్రకరణం, సహీహ్ ముస్లింలోని కపటవిశ్వాసుల ప్రకరణం)

English

Shaqiq bin Salamah reported: Ibn Mas`ud (radiyallahu anhu) used to preach to us once every Thursday. A man said to him: “O Abu `Abdur-Rahman, we love your talk and we wish that you preach us every day.” He said: “There is nothing to prevent me from doing so, but I don’t lest I bore you. I follow the same method in preaching to you that Messenger of Allah ﷺ adopted in preaching to us for fear of boredom.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రజలకు ధర్మబోధ చేయటంలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి. లేకపోతే ప్రజలు ధర్మబోధనల పట్ల విసుగెత్తిపోయి అసలు ధార్మిక సమావేశాలకు హాజరుకావటమే మానుకుంటారు. అదేపనిగా హితబోధ చేస్తూపోతే చివరికి ప్రజలు విసుగెత్తిపోతారు. అదేవిధంగా విద్యాశిక్షణల కోసం వేళల్ని నిర్ణయించినప్పుడు కూడా ప్రజలు తమంతటతాము సంతోషంగా ధార్మిక సమావేశాలకు హాజరయ్యే విధంగా సరియైన వేళల్ని గుర్తించి నిర్ణయించాలి. అంతేగాని ప్రజల్ని భయపెట్టిగాని, ఆశ చూపించిగాని ధార్మిక సమావేశాలకు హాజరుపరచటం సమంజసమైన విషయం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|91. హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి|హదీసు 699

700

హదీసు 700

عن أَبي الْيَقظان عَمَّار بن ياسر رضي اللَّه عنهما قَالَ: سمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "إنَّ طُولَ صلاةِ الرَّجُلِ، وَقِصر خُطْبِتِه، مِئنَّةٌ مِنْ فقهِهِ. فَأَطِيلوا الصَّلاةَ، وَأَقْصِروا الخُطْبةَ "رواه مسلم. "مِئنَّةٌ"بميم مفتوحة، ثُمَّ همزة مكسورة، ثُمَّ نون مشددة، أيْ: علامة دَالَّةٌ على فِقْهِهِ.

దైవప్రవక్త ﷺ ఇలా అంటుండగా తాను విన్నానని హజ్రత్ అబుల్ యఖ్జాన్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు : సుదీర్ఘమైన నమాజ్ చేయటం, ముక్తసరిగా ఉపన్యసించటం అనేది మనిషి వివేకానికి ఆనవాలు. కనుక మీరు నమాజ్‌ను సుదీర్ఘంగా చేయండి, ఉపన్యాసం ముక్తసరిగా ఇవ్వండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

English

`Ammar bin Yasir (radiyallahu anhuma) reported: I heard Messenger of Allah ﷺ saying, “Prolonging Salat (prayer) and shortening the Khutbah (religious talk) indicate the religious knowledge of the person. Make your Salat long and your sermon short.”[Muslim].

ముఖ్యాంశాలు

సుదీర్ఘంగా నమాజ్ చేయటమంటే ఇమామ్ అయిన వ్యక్తి తన వెనక నమాజ్ చేస్తున్నవారి (ముఖ్తదీల) ఇబ్బందుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా సుదీర్ఘంగా నమాజ్ చేయించటమని అర్థం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే అలా చేయటాన్ని హదీసుల్లో గర్హించటం జరిగింది. వెనక నమాజ్ చేసేవారిలో వృద్ధులు, బలహీనులు, పిల్లలు మొదలైనవారు ఉంటారు. కనుక నమాజ్‌కు సారథ్యం వహించే వ్యక్తి (ఇమామ్) వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికీ భారం అనిపించని విధంగా నమాజ్ చేయించాలి.

రెండో విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు చేసే ఆరాధనలో నమాజ్‌కన్నా ఉపన్యాసం (ఖుత్బా) ముక్తసరిగా ఉండాలి. అంతేగాని సుదీర్ఘంగా ఉపన్యాసం దంచి ఆ తరువాత నమాజ్ దగ్గరికి వచ్చేసరికి తొందరచేయటం మంచిదికాదు. నమాజ్‌ను పూర్తి ఏకాగ్రతతో, అత్యంత భక్తిశ్రద్ధలతో, సక్రమంగా, ప్రశాంతంగా చేయాలి. అవసరమైతే దానికోసం ప్రసంగాన్ని (ఖుత్బాను) ముక్తసరు చేసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|91. హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి|హదీసు 700

701

హదీసు 701

عن مُعاويةَ بنِ الحَكم السُّلَمِيِّ رضي اللَّه عنه قَالَ: "بَيْنَا أَنا أصَلِّى مَع رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، إذْ عطسَ رجُلٌ مِنْ القَوْمِ فَقُلتُ: يرْحَمُكَ اللَّه، فَرَماني القَوْمُ بابصارِهمْ، فقلت: وا ثكل أُمَّيَاه مَا شَأنُكُمْ تَنْظُرُونَ إليَّ؟ فَجَعَلُوا يَضْرِبُونَ بأيديهم عَلَى أفْخَاذِهِمْ فَلَمَّا رَأيْتُهُمْ يُصَمِّتُونني لكِنّي سَكَتُّ، فَلَمَّا صَلّى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَبابي هُوَ وأُمِّي، مَا رَأَيْتُ مُعَلِّماً قَبْله وَلا بَعْدَه أَحْسنَ تَعْلِيماً مِنْه، فَوَاللَّه مَا كَهَرنَي وَلاَ ضَرَبَني وَلا شَتَمَني، قَالَ: "إِنَّ هَذِهِ الصَّلاةَ لاَ يَصْلُحُ فِيهَا شَيءُ مِنْ كَلامِ النَّاسِ، إِنَّمَا هِيَ التَّسْبِيحُ والتَّكْبِيرُ، وقرَاءَةُ الْقُرآنِ "أَوْ كَمَا قَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. قلتُ: يَا رسول اللَّه، إنّي حَدِيثُ عهْدٍ بجَاهِلية، وقدْ جاءَ اللَّه بِالإِسْلامِ، وإِنَّ مِنَّا رِجَالاً يَأْتُونَ الْكُهَّانَ؟ قَالَ: "فَلا تأْتهِمْ"قُلْتُ: وَمِنَّا رِجَالٌ يَتَطيَّرونَ؟ قَالَ:"ذَاكَ شَيْء يَجِدونَه في صُدورِهِم، فَلا يصُدَّنَّهُمْ" رواه مسلم. "الثُّكْل"بضم الثاءِ المُثلثة: المُصِيبة وَالفَجيعة."مَا كَهَرني"أيْ مَا نهرَني.

హజ్రత్ ముఆవియా బిన్ హకమ్ సులమీ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺతో పాటు నమాజ్ చేస్తుండగా అక్కడున్న వారిలో ఎవరో తుమ్మారు. దానికి నేను 'యర్‌హముకల్లాహ్' అని అన్నాను. దాంతో ప్రజలంతా నావైపే చూడసాగారు. నాక్కాస్త ఇబ్బందిగా అనిపించి, "మీ అమ్మ కడుపులు కాల! ఏమయింది మీకు నా వంక అలా చూస్తున్నారు?" అని అన్నాను. దానికి వారు తమ చేతులను తమ తొడలపై చరచి సైగచేయసాగారు. అప్పుడు వారు నన్ను నిశ్శబ్దంగా ఉండమని చెబుతున్నారని అర్థం చేసుకొని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. కాసేపటికి దైవప్రవక్త ﷺ నమాజు ముగించుకున్నారు.

నా తల్లిదండ్రుల్ని ఆయనకోసం అర్పింతును! ఆయనకన్నా ఉత్తమంగా బోధించే గురువుని నేను అంతకు ముందుగాని, ఆ తరువాతగాని ఎన్నడూ చూడలేదు. దైవసాక్షి! ఆయన నన్ను మందలించలేదు. నన్ను కొట్టలేదు. దూషించనూ లేదు. పైగా (ఎంతో ప్రేమగా) ఇలా అన్నారు : "ఇది నమాజ్. ఇందులో ప్రజలు మాట్లాడుకునే (ఇతరత్రా) మాటలు మాట్లాడుకోరాదు. దేవుని పవిత్రతను కొనియాడటం, దేవుని గొప్పదనాన్ని చాటడం, ఖుర్‌ఆన్‌ను పారాయణం చేయటం – వీటి సమాహారమే నమాజ్" అని అన్నారు. లేదా దైవప్రవక్త ﷺ ఇలాంటి మాటలే అని ఉంటారు.

అప్పుడు నేనాయనతో, "దైవప్రవక్తా! నేను నిన్నమొన్నటి వరకూ అజ్ఞాన జీవితమే గడిపాను. (ఇప్పుడే) దేవుడు (మా దగ్గరికి) ఇస్లాం ధర్మం తీసుకొచ్చాడు. (అజ్ఞానకాలంలో) మాలో కొందరు జ్యోతిషుల్ని సంప్రదించేవారు. (అలా సంప్రతించటం ధర్మసమ్మతమేనా?)" అని అడిగాను. దానికాయన, "నువ్వు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళకు" అని అన్నారు. "మరి మాలో కొంతమంది దుశ్శకునాలు కూడా చూస్తారు?" అన్నాను నేను. అందుకాయన, "అవన్నీ మనసుకు నచ్చచెప్పుకునే మాటలే. నిజానికి అవేవీ ప్రజల పనుల్ని పాడు చేయవు" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)

English

Mu`awiyah bin Al-Hakam As-Sulami (radiyallahu anhu) reported: While I was in Salat with Messenger of Allah ﷺ, a man in the congregation sneezed and I responded with: `Yarhamuk-Allah (Allah have mercy on you).’ The people stared at me with disapproving looks. So I said: “May my mother lose me. Why are you staring at me?” Thereupon, they began to strike their thighs with their hands. When I saw them urging to me to remain silent, I became angry but restrained myself. When Messenger of Allah ﷺ concluded his Salat. I have never before seen an instructor who gave better instruction than he, may my father and mother be sacrificed for him. He neither remonstrated me, nor beat me, nor abused me. He simply said,“It is not permissible to talk during Salat because it consists of glorifying Allah, declaring His Greatness as well as recitation of the Qur’an,” or he said words to that effect.” I said: “O Allah’s Messenger, I have but recently accepted Islam, and Allah has favoured us with Islam. There are still some people among us who go to consult soothsayers.” He said, “Do not consult them.” Then I said: “There are some of us who are guided by omens.” He said, “These things which come to their minds. They should not be influenced by them.” (Muslim).

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా నాలుగు విషయాలు బోధపడుతున్నాయి. ఒకటి : నమాజులో మాట్లాడటం నిషిద్ధమైనట్లే ఇతరుల తుమ్ముకు జవాబు చెప్పటం కూడా నిషిద్ధం. అయితే తుమ్మినవాడు స్వయంగా నమాజులో అల్‌హమ్దులిల్లాహ్ అని అంటే అందులో తప్పులేదు. అల్‌హమ్దులిల్లాహ్ అన్న వచనంలో అల్లాహ్ ప్రశంస ఉంది. కనుక నమాజులో ఇది సమ్మతమే. రెండు : ఇందులో దైవప్రవక్త ﷺ ప్రజలకు ధర్మవిషయాలు ఏ విధంగా బోధించేవారో వివరించబడింది. ఏమీ తెలియనివారికి ఆయన ఎంతో ఉత్తమమైన పద్ధతిలో ధర్మ విషయాలు బోధించేవారు. అజ్ఞానం వల్ల వారు చేసే తప్పులపై ఎలాంటి కినుక, కోపం వ్యక్తపరిచేవారు కాదు. ఇస్లాం ధర్మప్రచారకులకు ఇందులో గొప్ప హితబోధ ఉంది. మూడు : భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవటానికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళటం నిషిద్ధం. నాలుగు : దుశ్శకునాలు చూడటాన్ని కూడా దైవప్రవక్త ﷺ వారించారు. అజ్ఞానకాలంలో జోస్యం, దుశ్శకునాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వచ్చి వాటిని అంతమొందించింది. కాని అజ్ఞానులైన ముస్లింలలో నేడు ఈ రుగ్మతలు మళ్ళీ పురుడుపోసుకున్నాయి. అల్లాహ్ అలాంటి ముస్లింలకు సన్మార్గం చూపుగాక!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|91. హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి|హదీసు 701

702

హదీసు 702

وعن العِرْباض بنِ سَاريةَ رضي اللَّه عنه قَالَ: وَعظَنَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَوْعِظَةً وَجِلَتْ مِنهْا القُلُوب. وَذَرِفَتْ مِنْها العُيُون وَذَكَرَ الحدِيثَ، وَقدْ سَبق بِكَمالِهِ في باب الأمْر بالمُحافَظةِ على السُّنَّةِ، وذَكَرْنَا أَنَّ التِّرْمِذيَّ قَالَ إنّه حديث حسنٌ صحيحٌ.

హజ్రత్ ఇర్‌బాజ్ బిన్ సారియా (రదియల్లాహు అన్హు) కథనం : ఓసారి దైవప్రవక్త ﷺ మాకు ఎంతో ప్రభావవంతమైన హితబోధ చేశారు. అది విని మా హృదయాలు భయంతో కంపించిపోయాయి. కళ్ళవెంట అశ్రుధారలు ప్రవహించాయి… (హదీసు చివరిదాకా). ఈ హదీసు పూర్తిగా ఇంతకుముందు 'ప్రవక్త ﷺ సంప్రదాయాన్ని కాపాడాలి' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. అక్కడ మేము ఇమామ్ తిర్మిజీ ఈ హదీసుని హసన్, సహీహ్‌గా నిర్ధారించారని కూడా పేర్కొన్నాం.

(సుననె తిర్మిజీలోని విద్యా విషయక అధ్యాయం)

పై హదీసుని పూర్తిగా చదివితే ప్రసంగం అనేది ముక్తసరిగా, సమగ్రంగా, ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా ఉండాలనే విషయం బోధపడుతుంది.

English

`Irbad bin Sariyah (radiyallahu anhu) reported: One day, Messenger of Allah ﷺ delivered a very effective speech, as a result, eyes shed tears and hearts became softened. A man said: “O Prophet of Allah! It sounds as if this is a farewell speech, so advise us.” He ﷺ said, “I admonish you to fear Allah, and to listen and obey even if a black slave has been appointed as your leader. For whoever among you lives after me will see much discord. So hold fast to my Sunnah and the Sunnah of the Rightly-Guided Caliphs who will come after me. Adhere to them and hold fast to them. Beware of Bid`ah (in religion) because every Bid`ah is a misguidance.”[Abu Da wud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|91. హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి|హదీసు 702