హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 9వ అధ్యాయం: దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి, ప్రపంచ వినాశం, పరలోక ప్రతాపాలు, ఇహపరాల సమస్త వ్యవహారాలు, మనసు వల్ల జరిగే తప్పులు, దాని సంస్కరణ, మనఃస్థిమితం గురించి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు ఉన్నాయి. ప్రతి ఆయతు అరబీ మూలం, తెలుగు అనువాదం, English అనువాదంతో.
9. దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి, ప్రపంచ వినాశం, పరలోక ప్రతాపాలు, ఇహపరాల సమస్త వ్యవహారాలు, మనసు వల్ల జరిగే తప్పులు, దాని సంస్కరణ, మనఃస్థిమితం గురించి……
باب في التفَكُّر في عظيم مخلوقات الله تَعَالَى وفناء الدنيا وأهوال الآخرة وسائر أمورهما وتقصير النفس وتهذيبها وحملها عَلَى الاستقامة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{إِنَّمَا أَعِظُكُمْ بِوَاحِدَةٍ أَنْ تَقُومُوا لِلَّهِ مَثْنَى وَفُرَادَى ثُمَّ تَتَفَكَّرُوا} [سبأ: ٤٦]
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు : "ప్రవక్తా! వారితో ఇలా అను, "నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లాహ్ కోసం, మీరు ఒక్కరొక్కరూ ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను ఉపయోగించి ఆలోచించండి."" (సబా : 46)
{إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآياتٍ لِأُولِي الْأَلْبَاب الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَاماً وَقُعُوداً وَعَلَى جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَذَا بَاطِلاً سُبْحَانَكَ} الآيات [آل عمران: ١٩٠،١٩١]
వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్నివేళలా అల్లాహ్ను స్మరించే వారున్నూ, భూమీ ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు……." (ఆలి ఇమ్రాన్ : 190-191)
{أَفَلا يَنْظُرُونَ إِلَى الْأِبِلِ كَيْفَ خُلِقَتْ وَإِلَىالسَّمَاءِ كَيْفَ رُفِعَتْ وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ فَذَكِّرْ إِنَّمَا أَنْتَ مُذَكِّرٌ} [الغاشية: ١٨، ١٩، ٢٠،٢١]
ఇంకొకచోట ఇలా సెలవీయబడింది: "అయితే వారు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా అది ఎలా పరచబడిందో? సరే అయితే, (ప్రవక్తా!) హితబోధ చేస్తూ ఉండు, నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే." (అల్ గాషియహ్ : 17-21)
{أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا} الآية [محمد:١٠]
వేరొకచోట అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తున్నాడు: "(వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం ఎలా జరిగిందో) చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా?" (ముహమ్మద్ : 10)
ఈ అధ్యాయంలో ఇలాంటి సూక్తులు అనేకం ఉన్నాయి. ఇకపోతే హదీసుల్లో ఇంతకు ముందు ప్రస్తావించబడిన "అల్ కయ్యిసు మన్ దాన నఫ్సహూ" అన్న హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. (5వ అధ్యాయంలో 66వ హదీసు చూడండి.)
English
“I exhort you to one (thing) only: that you stand up for Allah’s sake in pairs and singly, – and reflect (within yourselves the life history of the Prophet ﷺ)”. [Saba’ 34:46]
“Verily! in the creation of the heavens and the earth, and in the alternation of night and day, there are indeed signs for men of understanding. Those who remember Allah (always, and in prayers) standing, sitting, and lying down on their sides, and think deeply about the creation of the heavens and the earth, (saying): ‘Our Rubb! You have not created (all) this without purpose, glory to You! (Exalted be You above all that they associate with You as partners)”. [Āl ‘Imrān 3:190–191]
“Do they not look at the camels, how they are created? And at the heaven, how it is raised? And at the mountains, how they are rooted (and fixed firm)? And at the earth, how it is spread out? So remind them (O Muhammad ﷺ), you are only a one who reminds”. [Al-Ghāshiyah 88:17–21]
“Have they not travelled through the earth, and seen..”. [Muḥammad 47:10] Ayat of the Qur’an and Ahadith on the subject are many. See for example Hadith No. 66 mentioned before.
You must be logged in to post a comment.