హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 69. ఉపద్రవాల్లో ఏకాంతాన్ని ఆశ్రయించటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 69వ అధ్యాయం: కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 597 – 601) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం

↑ విషయ సూచిక

باب استحباب العزلة عند فساد الناس والزمان أو الخوف من فتنة في الدين أو وقوع في حرام وشبهات ونحوها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{فَفِرُّوا إِلَى اللَّهِ إِنِّي لَكُمْ مِنْهُ نَذِيرٌ مُبِينٌ} [الذريات:٥٠]

"అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నేను ఆయన తరఫున మీకు న్పష్టంగా హెచ్చరిక చేసేవాడుగా వచ్చాను." (అజ్ జారియాత్ : 50)

వివరణ

అల్లాహ్ వైపునకు పరుగెత్తడమంటే, ఆయన్ని విశ్వసించి, ఆయన విధేయతను పాటించడమని అర్థం. గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సూక్తిని ఇక్కడ పొందుపరచటంలోని ఔచిత్యం ఏమిటంటే, సామూహిక జనజీవనంలో కల్లోలాలు చెలరేగి, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తి ధర్మాన్ని ఆచరించడమే దుర్భరమైపోయినప్పుడు మనిషి ఆ కల్లోలభరిత వాతావరణాన్ని వదలిపెట్టి కొండలు, అడవుల్లోకెళ్ళి దైవారాధన చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపుకోవటం మేలు. దానివల్ల మనిషి కనీసం తన ధర్మాన్నయినా రక్షించుకోగల్గుతాడు.

English

“So flee to Allah (from His Torment to His Mercy – Islamic Monotheism), verily, I (Muhammad ﷺ) am a plain warner to you from Him.” [Adh-Dhāriyāt 51:50]

597

హదీసు 597

وعن سعد بن أَبي وقَّاص رضي اللَّه عنه، قالَ: سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُول: "إِنَّ اللَّه يحِبُّ العَبدَ التَّقِيَّ الغَنِيَّ الْخَفِيَّ" رواه مسلم. والمُرَاد ب"الغَنِيِّ": غَنِيُّ النَّفْسِ. كَمَا سَبَقَ في الحديث الصحيح.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాన్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : దైవానికి భయపడుతూ, (ఇహలోకం పట్ల) నిరపేక్షాభావంతో, గుట్టుగా జీవితం గడిపే మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. (ముస్లిం)

ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ 'గనీ' అంటే ఆత్మ సంతృప్తితో, నిరపేక్షాభావంతో ఉండేవాడని అర్థం.

(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah loves a slave who is pious, free of all wants and the unnoticed.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం|హదీసు 597

598

హదీసు 598

وعن أَبي سعيد الخُدريِّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَجُلُ أَيُّ النَّاسِ أفضَلُ يارسولَ اللَّه؟ قَالَ:"مُؤْمِنٌ مجَاهِدٌ بِنَفسِهِ وَمَالِهِ في سَبيلِ اللَّه"قَالَ: ثُمَّ مَنْ؟ قَالَ:"ثُمَّ رَجُلٌ مُعتَزِلٌ فِي شِعْبٍ مِن الشِّعَاب يَعبُدُ رَبَّهِ". وفي روايةٍ "يتَّقِي اللَّه. ويَدَع النَّاسِ مِن شَرّْهِ "متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! ప్రజలందరిలోకెల్లా శ్రేష్ఠమైన వాడెవడు?" అని అడిగాడు. "తన ధనప్రాణాలను దైవమార్గంలో అర్పించే విశ్వాసి" అని చెప్పారు దైవప్రవక్త ﷺ. అతని తరువాత ఎవడు శ్రేష్ఠుడు?" అని అడిగాడా వ్యక్తి. అందుకాయన "ఏదో ఒక పర్వత కనుమలో వెళ్ళి ఒంటరిగా తన ప్రభువును ఆరాధించుకునేవాడు" అని చెప్పారు.

వేరొక ఉల్లేఖనంలో, "దైవానికి భయపడుతూ, ప్రజలకు కీడు తలపెట్టకుండా జాగ్రత్తపడేవాడు" అని ఉంది.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Someone asked Messenger of Allah ﷺ: “Who is the best man?” He ﷺ answered, “A believer who strives in the Cause of Allah with his life and his wealth.’‘ The man asked: “Who is the next?” He said, “One who retires into a narrow valley and worships his Rubb.”

Another narration is: Messenger of Allah ﷺ said, “One who fears Allah and safeguards people against his own mischief.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కూడా దైవమార్గంలో పోరాటం తర్వాత రెండో స్థానంలో కేవలం దైవారాధన చేయటం కోసం, తన మూలంగా ప్రజలకు హాని కలగకూడదనే ఉద్దేశ్యంతో ఏకాంతాన్ని ఆశ్రయించేవాడి గొప్పదనం వివరించబడింది. ఇంకా ధర్మ సందేహాలను గురించి పండితులను అడిగి తెలుసుకోవటం అభిలషణీయమనే విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం|హదీసు 598

599

హదీసు 599

وعنه قالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " يُوشِكَ أَنْ يَكُونَ خَيْرَ مَال المُسْلِم غَنَمٌ يَتَّتبَّعُ بهَا شَعَفَ الجِبَال. وموَاقِعَ الْقَطْرِ يَفِرُّ بِدينِهِ مِنَ الفِتنِ" رواه البخاري. و"شَعَفَ الجِبَالِ": أَعْلاَهَا.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: అతి త్వరలోనే ఒక కాలం రానున్నది. అప్పుడు ముస్లిం యొక్క శ్రేష్ఠమైన సంపద మేకలు అయి ఉంటాయి. వాటిని తోలుకొని అతను పర్వత శిఖరాలపైకి, వర్షం కురిసే (అడవి) ప్రాంతాలకు పోతాడు. వాస్తవానికి అతను తన ధర్మాన్ని ఉపద్రవాల నుండి కాపాడుకోవటానికే అలా ఊరు విడిచి వెళ్ళిపోతాడు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The best possession of a Muslim will be a herd of sheep with which he retires to the top of a mountain or places where rain is expected to fall (pastures) so as to safeguard with his faith from tribulation.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

రానున్న కాలంలో ప్రజల నీతి నడవడికలు ఎంతగా దిగజారిపోతాయంటే మనుషుల మధ్య ఉండి ధర్మాన్ని ఆచరించటం కష్టసాధ్యమైపోతుంది. అలాంటి సమయంలో ధర్మాన్ని కాపాడుకోవటం కోసం జనారణ్యాలను వదలివెళ్ళటం తప్ప గత్యంతరం ఉండదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం|హదీసు 599

600

హదీసు 600

وعنْ أَبي هُريرة رضيَ اللَّه عنْه. عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا بَعَثَ اللَّه نَبِيًّا إِلاَّ رَعَى الْغَنَمَ"فَقَال أَصْحابُه: وَأَنْتَ؟ قَالَ:"نَعَمْ، كُنْت أَرْعَاهَا عَلى قَرارِيطَ لأَهْلِ مَكَّةَ" رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "దేవుడు పంపిన ప్రతి ప్రవక్త మేకల్ని కాసాడు" అని అన్నారు. ఆ మాట విని సహచరులు ఆశ్చర్యంగా "మీరు కూడా కాసారా?" అని అడిగారు. దానికాయన, "అవును, నేను కొన్ని ఖీరాతుల జీతంపై మక్కావాసుల మేకల్ని కాసేవాణ్ణి" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని బాడుగల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Every Prophet has tended sheep”. He was asked: “And did you?” He replied, “Yes, I tended them for a few carats for the Makkans.’‘[Al-Bukhari].

ముఖ్యాంశాలు

మేకల్ని కాయటానికి చాలా ఓర్పు, శ్రద్ధ అవసరం. ఒకవిధంగా ఇది సహనానికి అభ్యాసం లాంటిది. ఈ అభ్యాసం దైవప్రవక్తల లక్ష్యసాధనలో ఉపయోగపడుతుంది. తాము దైవ సందేశం అందజేయబోయే ప్రజలపట్ల తమ వ్యవహార శైలి ఎలా ఉండాలి, ప్రజల నుండి ఎదురయ్యే కష్టాలను ఎలా భరించాలి అన్న విషయం దైవప్రవక్తలకు బోధపడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం|హదీసు 600

601

హదీసు 601

وعنه عَنْ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنه قَالَ: "مِنْ خَير مَعَاشِ النَّاسِ لهم رَجُلٌ مُمْسِكٌ عِنَانَ فَرسِهِ في سَبِيلِ اللَّه، يَطيرُ عَلى مَتنِهِ، كُلَّمَا سَمِعَ هَيْعَةً أَوْ فَزْعَةً، طارَ عَلَيْهِ يَبْتَغِي الْقَتلَ، أَو المَوْتَ مظَانَّه، أَوْ رَجُلٌ فِي غُنَيمَةٍ في رَأْسِ شَعَفَةٍ مِن هَذِهِ الشَّعَفِ، أَوْ بَطنِ وادٍ مِن هَذِهِ الأَوديَةِ، يُقِيم الصَّلاةَ ويُؤتي الزَّكاةَ، ويَعْبُد رَبَّهُ حتَّى يَأْتِيَهُ اليَقِينُ ليَسَ مِنَ النَّاسِ إِلاَّ فِي خَيْرٍ" رواه مسلم. "يَطِيرُ"أَي يُسرع."ومَتْنُهُ": ظَهْرُهُ."وَالهَيْعَةُ": الصوتُ للحربِ."وَالفَزَعَةُ": نحوهُ. وَ"مَظَانُّ الشَّيءِ": المواضعُ الَّتي يُظَنُّ وجودُه فيها."والغُنَيمَةُ"بضم الغين تصغير الغنم."الشَّعْفَةُ"بفتح الشِّين والعين: هي أَعْلى الجبَل.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ప్రజలందరిలోకెల్లా అత్యుత్తమ జీవి దైవమార్గంలో తన గుర్రపు కళ్ళెం చేతబట్టుకొని దానిపై స్వారీ చేసి మెరుపు వేగంతో (అటూ ఇటూ) వెళుతుంటాడు. ఎక్కడినుంచయినా ప్రేలుళ్ళు, ఆందోళన కలిగించే శబ్దాలేవయినా వినపడితే మెరుపులా అక్కడికి చేరుకుంటాడు. తాను హతమయ్యే, మరణాన్ని పొందే స్థలాల్ని వెతుక్కుంటూ ఉంటాడు.

లేక (అత్యుత్తమ జీవి ఎవరంటే) ఏదయినా పర్వత శిఖరంపైకిగాని లేదా ఏదయినా లోయకుగాని కొన్ని మేకల్ని తోలుకొని వెళ్ళి స్థిరపడతాడు. అక్కడే నమాజును స్థాపిస్తాడు. జకాత్ దానం చెల్లిస్తాడు. తన ప్రభువును ఆరాధిస్తూ ఉంటాడు. ఆఖరికి అతనికి మరణం వచ్చినప్పుడు అతను ప్రజల మధ్య మంచి స్థితిలో ఉంటాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

'యతీరు' అనగా తొందర చేస్తున్నాడని భావం. 'మత్‌నుహూ' అనగా అతని వీపు. 'హైఅతున్' అనగా యుద్ధ శబ్దం (పేలుళ్లు, ఫైరింగులు మొదలగునవి). 'ఫజ్‌అతు' అర్థం కూడా అలాంటిదే. 'మజానుష్షై' అనగా ఒక వస్తువు ఉండగలదన్న నమ్మకం ఉన్నచోట. గునైమా అనగా కొన్ని మేకలు. 'షఅఫా' అంటే పర్వతపు అగ్రభాగం(శిఖరం) అని అర్థం.

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The best of people is a man who is holding his horse’s rein in the way of Allah (in Jihad) and is galloping towards the place wherever he hears a call for war or detects a note of danger; he goes on proceeding, seeking martyrdom or death wherever it is expected. And a man who retires with some sheep in a mountainside or a valley. He performs Salat regularly and pays the Zakat, continues worshipping his Rubb, till death overtakes him. He does not interfere in the affairs of the people except for betterment.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఇద్దరు వ్యక్తుల్ని ప్రజలందరిలోకెల్లా గొప్ప వ్యక్తులుగా అభివర్ణించటం జరిగింది. ఒకతను : జిహాద్ (ధర్మయుద్ధ) సన్నాహాల్లో తలమునకలై ఉండి దైవమార్గంలో పోరాటానికి సదా సిద్ధంగా ఉండే వ్యక్తి. రెండవతను : తన ధర్మాన్ని కాపాడుకోవటానికి, దానిని ఆచరించటానికి సామూహిక జనజీవనానికి దూరంగా కొండల్లో, అడవుల్లో స్థిరపడేవాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|69. కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం|హదీసు 601