హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 4. సత్యం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 4వ అధ్యాయం: సత్యం. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 54 – 59) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

باب الصدق

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ} [التوبة: ١١٩]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతుల్లో చేరిపోండి." (అత్ తౌబా : 119)

{وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ} [الأحزاب: ٣٥]

మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : "సత్యం పలికే పురుషులు మరియు సత్యం పలికే స్త్రీలు….." (అల్ అహ్‌జాబ్ : 35)

{فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْراً لَهُمْ} [محمد: ٢١]

ఇంకొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "వారు తాము అల్లాహ్‌కు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటంలో తమ నిజాయితీని నిరూపించుకుని ఉంటే, అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది." (ముహమ్మద్ : 21)

English

“O you who believe! Be afraid of Allah, and be with those who are true (in words and deeds)”. [At-Tawbah 9:119]

“…the men and women who are truthful (in their speech and deeds)..”. [Al-Aḥzāb 33:35]

“…then if they had been true to Allah, it would have been better for them”. [Muḥammad 47:21]

54

హదీసు 54

فَالأَوَّلُ: عَن ابْنِ مَسْعُودٍ رضي اللَّه عنه عن النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ الصَّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الجَنَّةِ، وَإِنَّ الرَّجُلَ ليصْدُقُ حَتَّى يُكتَبَ عِنْدَ اللَّهِ صِدِّيقاً، وإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الفجُورِ وَإِنَّ الفجُورَ يَهْدِي إِلَى النَّارِ، وَإِنَّ الرَّجُلَ لَيَكْذِبُ حَتَّى يُكتَبَ عِنْدَ اللَّهِ كَذَّاباً" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "నిస్సందేహంగా సత్యం సత్కార్యం వైపుకు నడిపిస్తుంది. సత్కార్యం స్వర్గం వైపుకు మార్గం సుగమం చేస్తుంది. ఎవడైనా (నిత్యం) సత్యం పలుకుతూ ఉంటే, చివరికి అతడు సత్యసంధుడని అల్లాహ్ వద్ద వ్రాసుకోబడతాడు. నిస్సందేహంగా అసత్యం అవిధేయత (పాపకార్యాల) వైపుకు గొనిపోతుంది. అవిధేయత నరకానికి చేర్చుతుంది. ఎవడైనా (నిత్యం) అసత్యమే పలుకుతూ ఉంటే, అతను అల్లాహ్ వద్ద అసత్యవాదిగా వ్రాసుకోబడతాడు." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం).

English

Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Truth leads to piety and piety leads to Jannah. A man persists in speaking the truth till he is enrolled with Allah as a truthful. Falsehood leads to vice and vice leads to the Fire (Hell), and a person persists on telling lies until he is enrolled as a liar”.’[Agreed upon].

ముఖ్యాంశాలు

హదీసులో వాడబడిన 'సిద్దీఖ్' (నిత్యం సత్యం పలికేవాడు), 'కజ్జాబ్' (నిత్యం అసత్యం పలికేవాడు) రెండు కూడా అతిశయోక్తి పదాలే. ఎల్లప్పుడూ నిజం చెప్పటమే అలవాటుగా చేసుకున్న వ్యక్తిని సిద్దీఖ్‌గానూ, నిత్యం అబద్ధం చెప్పే వైఖరిని అవలంబించిన అబద్ధాలరాయుడిని 'కజ్జాబ్'గానూ వ్యవహరిస్తారు. మనిషి ఇహలోకంలో తాను చేసుకున్న కర్మలవల్ల మంచివాడిగానో లేక చెడ్డవాడిగానో పేరుమోసినట్లే పరలోకంలో అల్లాహ్ వద్ద కూడా అతనికి అదే ముద్రపడుతుంది. అక్కడ సత్యశీలుడు (సిద్దీఖ్)గా వ్రాసుకోబడతాడంటే దానర్థం పరలోకంలో అతని సత్యాలకు ప్రతిఫలంగా పుణ్యం లభిస్తుందని. అక్కడ అబద్ధాలరాయుడు (కజ్జాబ్)గా వ్రాసుకోబడతాడంటే, అబద్ధమాడినందుకు అతను పరలోకంలో శిక్షార్హుడిగా ఖరారు చేయబడతాడని భావం. ఈ సత్యం ఇహపరాల మేళ్ళను పొందటానికి ఉపయోగపడే సాధనమని, అందువల్ల నిత్యం సత్యమే పలుకుతూ ఉండాలని ఈ హదీసులో పురికొల్పడం జరిగింది. అదేవిధంగా అసత్యం అనర్థాలకు దారితీస్తుందని, కనుక ఎల్లప్పుడూ అసత్యానికి దూరంగా ఉండాలని కూడా తాకీదు చేయబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 54

55

హదీసు 55

الثَّاني: عَنْ أبي مُحَمَّدٍ الْحَسنِ بْنِ عَلِيِّ بْنِ أبي طَالِبٍ، رَضيَ اللَّهُ عَنْهما، قَالَ حفِظْتُ مِنْ رسولِاللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "دَعْ مَا يَرِيبُكَ إِلَى مَا لاَ يَريبُكَ، فَإِنَّ الصِّدْقَ طُمأنينَةٌ، وَالْكَذِبَ رِيبةٌ" رواه التِرْمذي وَقالَ: حديثٌ صحيحٌ. قَوْلُهُ:"يرِيبُكَ"هُوَ بفتحِ الياء وضَمِّها، وَمَعْناهُ: اتْرُكْ مَا تَشُكُّ في حِلِّه، واعْدِلْ إِلى مَا لا تَشُكُّ فِيهِ.

హజ్రత్ అబూ ముహమ్మద్ హసన్ బిన్ అలీ బిన్ అబూతాలిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నాకు దైవప్రవక్త ﷺ పలికిన ఈ వాక్యాలు గుర్తున్నాయి : "నిన్ను సంశయంలో పడవేసే ఏ పనైనాసరే – దాన్ని వదిలెయ్యి. నిన్ను సందిగ్ధానికి లోనుచెయ్యని పనిని మాత్రమే నెరవేర్చు. నిస్సందేహంగా నిజం చెప్పటం మనసుకు నెమ్మదినిస్తుంది. అబద్ధం మనసులో అలజడిని రేపుతుంది." (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి దృఢమైనదిగా పేర్కొన్నారు.)

హదీసులో వాడబడిన పదం 'యరీబుక', 'య'అకార సమేతంగా మరియు ఉకారంతో కూడా చదువవచ్చు. ఒక విషయం ధర్మసమ్మతమా కాదా అన్న సందేహం ఏర్పడితే దానిని వదలిపెట్టు, నీ మనసులో ఎలాంటి సందేహం కలగని విషయాన్ని మాత్రమే ఆచరించు అని దీని భావం.

English

Hasan bin `Ali (radiyallahu anhuma) said: I remember (these words) from Messenger of Allah ﷺ: “Give up what is doubtful to you for that which is not doubtful; for truth is peace of mind and falsehood is doubt”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దేవుడు నిషేధించిన పనులకు పాల్పడకుండా ఉండేందుకుగాను ధర్మసమ్మతమా కాదా అన్న సంశయాత్మక విషయాలను కూడా వదలిపెట్టడమే మేలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. సందేహాస్పద విషయాల నుండి బయటపడినవాడు తన ధర్మాన్ని, మానాన్ని కాపాడుకున్నాడని వేరొక హదీసు ద్వారా వెల్లడౌతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 55

56

హదీసు 56

الثَّالثُ: عنْ أبي سُفْيانَ صَخْرِ بْنِ حَربٍ. رضيَ اللَّه عنه. في حديثِه الطَّويلِ في قِصَّةِ هِرقْلُ، قَالَ هِرقْلُ: فَماذَا يَأْمُرُكُمْ يعْني النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ أَبُو سُفْيَانَ: قُلْتُ: يقولُ"اعْبُدُوا اللَّهَ وَحْدَهُ لا تُشرِكُوا بِهِ شَيْئاً، واتْرُكُوا مَا يَقُولُ آباؤُكُمْ، ويَأْمُرنَا بالصَّلاةِ والصِّدقِ، والْعفَافِ، والصِّلَةِ". متفقٌ عليه.

హజ్రత్ అబూ సుఫ్యాన్ సఖ్ర్ బిన్ హర్బ్ (రదియల్లాహు అన్హు) తాను (రోమ్ చక్రవర్తి) హెరిక్లస్‌తో జరిపిన సుదీర్ఘ సంభాషణ గురించి ఈ విధంగా తెలియజేశారు : "అతను (అంటే దైవప్రవక్త ముహమ్మద్ మీకు ఏమని ఆదేశిస్తున్నాడు?" అని హెరిక్లస్ నన్ను అడిగాడు. అందుకు నేను ఇలా జవాబు చెప్పాను: "అతను ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకూడదనీ, మీ తాతముత్తాతల మాటల్ని వదలిపెట్టమని ఆదేశిస్తున్నాడు. ఇంకా నమాజు చేయమని, సత్యం పలకమనీ, సచ్ఛీలతను కల్గి ఉండమని, బంధుత్వ హక్కులను నెరవేర్చమని కూడా ఆదేశిస్తున్నాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని 'దైవవాణి అవతరణ ఆరంభ' ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం).

English

Abu Sufyan (radiyallahu anhu) reported, in course of his detailed narration about Heraclius when the latter questioned him about the teachings of the Prophet ﷺ He said that: He ﷺ told (us): “Worship Allah Alone and do not associate a thing with Him; and give up all that your ancestors said. “He also commands us to perform Salat (prayers), to speak the truth, to observe modesty and to strengthen the ties of kinship.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

శత్రువులు సయితం దైవప్రవక్త ﷺగారి బోధనల్లోని సత్యాన్ని ఒప్పుకునేవారన్న దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. ఎందుకంటే హదీసులోని అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) మాటలు ఆయన ఇస్లాం స్వీకరించక మునుపు హెరిక్లస్ చక్రవర్తి దర్బారులో చెప్పినవి. దైవప్రవక్తకు బద్ధశత్రువుగా ఉన్నప్పుడు కూడా ఆయన దైవప్రవక్త ﷺ సత్యసంధతను కొనియాడటం గమనార్హం. సహీహ్ బుఖారీలో ఈ హదీసు పూర్తి వివరాలతో ఉల్లేఖించబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 56

57

హదీసు 57

الرَّابِعُ: عَنْ أبي ثَابِتٍ، وقِيلَ: أبي سعيدٍ، وقِيلَ: أبي الْولِيدِ، سَهْلِ بْنِ حُنيْفٍ، وَهُوَ بدرِيٌّ، رضي اللَّه عنه، أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ سَأَلَ اللَّهَ، تعالَى الشِّهَادَة بِصِدْقٍ بَلَّغهُ اللَّهُ مَنَازِلَ الشُّهدَاء، وإِنْ مَاتَ عَلَى فِراشِهِ" رواه مسلم.

హజ్రత్ అబూ సాబిత్ సహ్ల్ బిన్ హునైఫ్ కథనం : (ఈయన మారుపేరు విషయంలో కొంత అభిప్రాయ భేదముంది. కొంతమంది దృష్టిలో ఈయన పేరు అబూ సాబిత్ కాగా, మరికొంతమంది దృష్టిలో అబూ సయీద్. ఇంకొంతమంది అబుల్ వలీద్ అంటున్నారు. ఏదిఏమైనా ఈయన మాత్రం బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబీ.) దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : "నిజ హృదయంతో తాను అమరగతినొందాలని అల్లాహ్‌ను వేడుకున్నవాడిని, అతను తన పడకపై మరణించినప్పటికీ అల్లాహ్ అతణ్ణి అమరగతుల స్థానాలకు చేరుస్తాడు." (ముస్లిం)

(ముస్లింలోని నాయకత్వ ప్రకరణంలో ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Abu Thabit from Sahl bin Hunaif (radiyallahu anhu) said: The Prophet ﷺ said: “He who asks Allah for martyrdom, Allah will raise him to the high status of the martyrs, even if he dies on his bed”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో చిత్తశుద్ధి యొక్క శ్రేష్ఠత, ప్రాధాన్యతలు వివరించబడ్డాయి. చిత్తశుద్ధితో దైవమార్గంలో పోరాడి అమరగతినొందాలని సంకల్పించుకున్న వ్యక్తి ప్రపంచంలో ఆ భాగ్యానికి నోచుకోలేక పోయినప్పటికీ పరలోకంలో మాత్రం అల్లాహ్ అతనికి అమరవీరులకు ప్రసాదించబడే ఉన్నత స్థానాలే ప్రసాదిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సంకల్పశుద్ధి లోపించిన కారణంగానే యుద్ధరంగంలో హతులయ్యే వారిని కూడా నరకంలో పడవేయటం జరుగుతుందన్న విషయం గమనార్హం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 57

58

హదీసు 58

الخامِسُ: عَنْ أبي هُريْرة رضي اللَّهُ عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "غَزَا نَبِيٌّ مِنَ الأَنْبِياءِ صلواتُ اللَّه وسلامُهُ علَيهِمْ فَقَالَ لقوْمِهِ: لا يتْبعْني رَجُلٌ ملَكَ بُضْعَ امْرَأَةٍ. وَهُوَ يُرِيدُ أَن يَبْنِيَ بِهَا وَلَمَّا يَبْنِ بِها، وَلا أَحدٌ بنَى بيُوتاً لَمْ يرفَع سُقوفَهَا، وَلا أَحَدٌ اشْتَرى غَنَماً أَوْ خَلَفَاتٍ وهُو يَنْتَظرُ أوْلادَهَا. فَغزَا فَدنَا مِنَ الْقَرْيةِ صلاةَ الْعصْرِ أَوْ قَريباً مِنْ ذلكَ، فَقَال للشَّمس: إِنَّكِ مَأمُورةٌ وأَنا مأمُورٌ، اللهمَّ احْبسْهَا علَينا، فَحُبستْ حَتَّى فَتَحَ اللَّهُ عليْهِ، فَجَمَعَ الْغَنَائِم، فَجاءَتْ يَعْنِي النَّارَ لتَأكُلهَا فَلَمْ تطْعمْهَا، فَقَالَ: إِنَّ فِيكُمْ غُلُولاً، فليبايعنِي منْ كُلِّ قبِيلَةٍ رجُلٌ، فلِزقتْ يدُ رَجُلٍ بِيدِهِ فَقَالَ: فِيكُم الْغُلولُ، فليبايعنِي قبيلَتُك، فلزقَتْ يدُ رجُليْنِ أو ثلاثَةٍ بِيَدِهِ فقَالَ: فِيكُمُ الْغُلُولُ، فَجاءوا برَأْسٍ مِثْلِ رَأْس بَقَرَةٍ مِنْ الذَّهبِ، فوضَعها فَجَاءَت النَّارُ فَأَكَلَتها، فلمْ تَحل الْغَنَائِمُ لأحدٍ قَبلَنَا، ثُمَّ أَحَلَّ اللَّهُ لَنا الغَنَائِمَ لمَّا رأَى ضَعفَنَا وعجزنَا فأحلَّها لنَا" متفقٌ عَلَيهِ. "الخلفاتُ"بفتحِ الخاءِ المعجمة وكسرِ اللامِ: جمْعُ خَلِفَةٍ، وهِي النَّاقَةُ الحاملُ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా తెలియజేశారు : "ప్రవక్తలలో (వారందరిపై దేవుని శాంతి కల్గుగాక) ఒకాయన దైవమార్గంలో యుద్ధానికి బయలుదేరుతూ తన జాతివారితో ఇలా అన్నారు: "మీలో (కొత్తగా) పెళ్ళిచేసుకొని – మొదటిసారి భార్యతో గడపాలనుకుంటున్న వ్యక్తి, ఇల్లు కట్టుకొని ఇంకా కప్పువేసుకోని వ్యక్తి, సూడి మేకలు, ఒంటెలు కొని అవి త్వరలోనే ఈనుతాయని ఎదురుచూస్తున్న వ్యక్తి నాతోపాటు యుద్ధానికి రానవసరం లేదు."

ఆ తరువాత ఆ ప్రవక్త దైవమార్గంలో యుద్ధం చేయటానికి ప్రయాణమయ్యారు. వారు అస్ర్ వేళకు లేక అంతకన్నా కాస్త ముందే (యుద్ధం చేయవలసిన) ఊరికి చేరుకున్నారు. అప్పుడాయన సూర్యుడ్ని సంబోధిస్తూ "నువ్వు కూడా దైవాజ్ఞల్ని పాలించేవాడివే. నేనూ దైవాజ్ఞల్ని పాలించేవాడినే" అంటూ ఓ దేవా! మా కోసం ఈ సూర్యుడ్ని (అస్తమించకుండా) ఆపి ఉంచు" అని దైవాన్ని ప్రార్థించారు. (వారికోసం) సూర్యుడు నిలిపి ఉంచబడ్డాడు. అల్లాహ్ వారికి ఆ ఊరిపై విజయం సాధించి పెట్టేదాకా సూర్యుడు అస్తమించలేదు.

యుద్ధానంతరం ఆయన యుద్ధప్రాప్తిని ఒకచోట పోగుచేశారు. దాన్ని తినేయడానికి (ఆకాశం నుండి) అగ్ని వచ్చి తినకుండానే వెళ్ళిపోయింది. అది చూసి ఆ దైవప్రవక్త (తన సైన్యంలోని వారితో) "మీలో ఎవరో (యుద్ధప్రాప్తిని అప్పగించే విషయంలో) ద్రోహానికి పాల్పడ్డారు. కాబట్టి మీలోని ప్రతి తెగనుండి ఒక్కొక్క వ్యక్తి వచ్చి నా సమక్షంలో ప్రమాణంచేసి చెప్పండి" అని అన్నారు. సైనికులు ప్రవక్త చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేస్తుండగా ఒక వ్యక్తి చెయ్యి ప్రవక్త చేతికి అతుక్కుపోయింది. ప్రవక్త ఆ వ్యక్తితో "నీ తెగ వాళ్ళలోనే ఎవరో ఈ ద్రోహానికి పాల్పడి ఉండాలి. కాబట్టి నీ తెగవారంతా నా చేతిమీద ప్రమాణం చేయాలి" అని అన్నారు. ఆ తెగవారు ప్రమాణం చేస్తున్నప్పుడు ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తుల చేతులు ప్రవక్త చేతులకు అతుక్కుపోయాయి. వారినుద్దేశించి ఆ దైవప్రవక్త "ఈ ద్రోహానికి పాల్పడింది మీరే" అని అన్నారు. అప్పుడు ఆ ముగ్గురు (తాము దాచిన) బంగారంతో తయారుచేసిన ఆవు తలలాంటి సొత్తును (యుద్ధ ప్రాప్తిలో కలిపి) పెట్టేశారు. అంతలోనే అగ్ని (మళ్ళీ) వచ్చి ఆ విజయప్రాప్తినంతా తినేసింది." (అంటే దైవమార్గంలో చేయబడిన పోరాటం దైవసమక్షంలో ఆమోదించబడిందన్న విషయానికి అది తార్కాణం అన్నమాట!)

దైవప్రవక్త ﷺ ఇంకా ఇలా తెలియజేశారు : మనకు పూర్వం ఎవరికీ ఈ యుద్ధప్రాప్తి ధర్మసమ్మతంగా ఉండేది కాదు. అల్లాహ్ గత్యంతరం లేని మన స్థితినీ, బలహీనతల్ని చూసి దాన్ని మన కోసం ధర్మసమ్మతం చేశాడు.

(బుఖారీ – ముస్లిం)

'ఖలిఫాత్' 'ఖ'పై అకారం, 'ల'పై ఇకారం. ఇది 'ఖలిఫతున్'కు బహువచనం. అంటే 'సూడిది' అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం).

English

Abu Hurairah (radiyallahu anhu) reported that the Messenger of Allah ﷺ said: “One of the earlier Prophets who was out on an expedition proclaimed among his people that no man should follow him who had married a woman with whom he wished to cohabit but had not yet done so, or who had built houses on which he had not yet put the roofs, or who had bought sheep or pregnant she-camels and was expecting them to produce young. He, then, went on the expedition and approached the town at the time of the ‘Asr prayer or little before it. He then told the sun that both it and he were under command and prayed Allah to hold it back for them, so it was held back till Allah gave him victory. He collected the spoils and it (meaning fire) came to devour these, but did not. He said that among the people there was a man who stole from the booty. He told them that a man from every tribe must swear allegiance to him, and when a man’s hand stuck to his, he said: “There is thief among you and every individual of your tribe must swear allegiance to me”. (In course of swearing of allegiance,) hands of two or three persons stuck to his hand. He said: “The thief is among you”. They brought him a head of gold like a cow’s head and when he laid it down, the fire came and devoured the spoils. Spoils were not allowed to anyone before us, then Allah allowed spoils to us as He saw our weakness and incapacity and allowed them to us”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఇమామ్ సుయూతీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం పై హదీసులో పేర్కొనబడిన ప్రవక్త హజ్రత్ యోషా బిన్ నూన్ (అలైహి). యోధులు పూర్తి ఏకాగ్రతతో, స్థిరచిత్తంతో దైవమార్గంలో పోరాటం చేయాలంటే వారి ప్రాపంచిక అవసరాలను తీర్చడం కూడా చాలా అవసరమని ఈయన వ్యవహార శైలినిబట్టి తెలుస్తోంది.
  2. యుద్ధప్రాప్తి ధర్మసమ్మతం చేయబడటం, ముహమ్మద్ ﷺగారి ఉమ్మత్ (సమాజ) ప్రత్యేకతను చాటుతోంది. ఇంతకు మునుపు విజయ ధనాన్ని ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించివేసేది. అలా అగ్ని వచ్చి విజయప్రాప్తిని దహించిందంటే దైవమార్గంలో వారు చేసిన పోరాటం సఫలీకృతమైనట్లు లెక్క.
  3. ఈ హదీసులో విజయం చేకూరే వరకూ సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడని చెప్పబడింది. ఇది ఆ దైవప్రవక్త మహిమ. దేవుడు తన ప్రవక్తల ద్వారా అప్పుడప్పుడూ వారి దైవదౌత్యానికి నిదర్శనంగా ఇటువంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 58

59

హదీసు 59

السادِسُ: عن أبي خالدٍ حكيمِ بنِ حزَامٍ. رضِيَ اللَّهُ عنه، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الْبيِّعَان بالخِيارِ مَا لَمْ يَتفرَّقا، فإِن صدقَا وبيَّنا بوُرِك لهُما في بَيعْهِما، وإِن كَتَما وكذَبَا مُحِقَتْ بركةُ بيْعِهِما" متفقٌ عليه.

హజ్రత్ అబూ ఖాలిద్ హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు : "అమ్మకందారు కొనుగోలుదారు పరస్పరం వేరుకానంతవరకూ వారిరువురికీ (వ్యవహారాన్ని రద్దుపరచే లేక కొనసాగించే) హక్కు ఉంటుంది. వారిద్దరూ నిజంచెప్పి (ఎలాంటి దాపరికం లేకుండా) వస్తువు నాణ్యతను గురించి వివరిస్తే ఆ వ్యవహారంలో వారిరువురికీ శుభం కలుగుతుంది. ఒకవేళ వారు దాపరికం చేసి అబద్ధాలాడితే ఆ వ్యవహారంలో శుభం లేకుండాపోతుంది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం. సహీహ్ ముస్లింలోని వాణిజ్య ప్రకరణం).

English

Hakim bin Hizam (radiyallahu anhu) reported that: Messenger of Allah ﷺ said: “Both parties in a business transaction have a right to annul it so long as they have not separated; and if they tell the truth and make everything clear to each other (i.e., the seller and the buyer speak the truth, the seller with regard to what is purchased, and the buyer with regard to the money) they will be blessed in their transaction, but if they conceal anything and lie, the blessing on their transaction will be eliminated.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. అమ్మకందారు, కొనుగోలుదారులిద్దరూ హక్కుని కల్గివుంటారంటే అర్థం, వారిరువురూ వ్యవహారం చేస్తున్నంత వరకూ వారికి తమ వ్యవహారాన్ని రద్దుపరచుకొనే అధికారముంటుంది. సాధారణంగా ప్రజలు వ్యవహారానికి సంబంధించిన విషయాలు పూర్తిగా మాట్లాడుకున్న తరువాత ఇక వ్యవహారాన్ని రద్దుపరచటానికి వీలుండదని భావిస్తారు. ఈ భావన సరైనది కాదు. పై హదీసు వారి భావనను త్రోసిపుచ్చుతోంది.
  2. నిజం చెప్పటం వల్ల వ్యవహారాల్లో శుభం కల్గుతుందనీ, అబద్ధం చెప్పి దాపరికంతో వ్యవహరిస్తే అలాంటి వ్యవహారాల్లో శుభం కొరవడుతుందని ఈ హదీసు బోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|4. సత్యం|హదీసు 59