హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 3వ అధ్యాయం: సహనం, ఓర్పు. ఈ అధ్యాయంలో 6 ఖుర్ఆన్ ఆయతులు, 29 హదీసులు (హదీసు 25 – 53) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
3. సహనం, ఓర్పు
باب الصبر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا} [آل عمران: ٢٠٠]
అల్లాహ్ సెలవిచ్చాడు : "విశ్వాసులారా! సహనంతో వ్యవహరించండి. అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి." (ఆలి ఇమ్రాన్ : 200)
{وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ} [البقرة: ١٥٥]
మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : "మేము మిమ్మల్ని తప్పకుండా భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన, ప్రాణ, ఆదాయాల నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనఃస్థయిర్యంతో ఉండేవారు, కష్టకాలం దాపురించినపుడు, "మేమంతా అల్లాహ్‌కే చెందినవారము. అల్లాహ్ వైపునకే మరలిపోవలసిన వారము" అని అనేవారికి శుభవార్తలు తెలుపు." (అల్ బఖర : 155)
{إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ} [الزمر: ١٠]
ఇంకొకచోట అల్లాహ్ అంటున్నాడు : ఓర్పు వహించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది." (అజ్ జుమర్ – 10)
{وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ} [الشورى: ٤٣]
వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని." (అష్ షూరా – 43)
{اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلاةِ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ} [البقرة: ١٥٣]
ఇంకొకచోట ప్రభువు ఆదేశించాడు : "విశ్వాసులారా! సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు." (అల్ బఖర : 153)
{وَلَنَبْلُوَنَّكُمْ حَتَّى نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنْكُمْ وَالصَّابِرِينَ} [محمد: ٣١]
మరోచోట దేవుడు అంటున్నాడు : "మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్ మార్గంలో గట్టిగా కృషిచేసేవారు ఎవరో, స్థిరచిత్తులు ఎవరో చూస్తాము." (ముహమ్మద్ : 31)
సహనం వహించమని ఆజ్ఞాపించే, దాని ఘనతను వివరించే భావాన్ని కలిగిన సుప్రసిద్ధమైన సూక్తులు ఇంకా అనేకం వున్నాయి.
English
“O you who believe! Endure and be more patient..”. [Āl ‘Imrān 3:200]
“And certainly, We shall test you with something of fear, hunger, loss of wealth, lives and fruits, but give glad tidings to As-Sabirun (the patient)”. [Al-Baqarah 2:155]
“Only those who are patient shall receive their reward in full, without reckoning.” [Az-Zumar 39:10]
“And verily, whosoever shows patience and forgives, that would truly be from the things recommended by Allah.” [Ash-Shūrā 42:43]
“Seek help in patience and As-Salat (the prayer). Truly, Allah is with As-Sabirun (the patient).” [Al-Baqarah 2:153]
“And surely, We shall try you till We test those who strive hard (for the Cause of Allah) and As-Sabirun (the patient)” [Muḥammad 47:31] There are numerous Verses of the Noble Qur’an inculcating patience and extolling it.
హదీసు 25
وعن أبي مَالِكٍ الْحَارِثِ بْنِ عَاصِم الأشْعريِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الطُّهُورُ شَطْرُ الإِيمَان، وَالْحَمْدُ للَّه تَمْلأَ الْميزانَ وسُبْحَانَ الله والحَمْدُ للَّه تَمْلآنِ أَوْ تَمْلأ مَا بَيْنَ السَّموَات وَالأَرْضِ وَالصَّلاَةِ نورٌ، والصَّدَقَةُ بُرْهَانٌ، وَالصَّبْرُ ضِيَاءٌ، والْقُرْآنُ حُجَّةُ لَكَ أَوْ عَلَيْكَ. كُلُّ النَّاس يَغْدُو، فَبِائِعٌ نَفْسَهُ فمُعْتِقُها، أَوْ مُوبِقُهَا" رواه مسلم.
అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిం అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "శుచీశుభ్రతలు సగం విశ్వాసం. అల్ హమ్దు లిల్లాహ్ (ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే) అనే పలుకు త్రాసును నింపివేస్తుంది. ఇంకా సుబ్హానల్లాహ్ (అల్లాహ్ పవిత్రుడు) మరియు అల్ హమ్దు లిల్లాహ్ అనే పలుకులు భూమ్యాకాశాల మధ్య ఖాళీని (పుణ్యంతో) నింపుతాయి. నమాజు వెలుగు వంటిది. (తద్వారా అతనికి ప్రపంచంలో సన్మార్గ దర్శకత్వం లభిస్తుంది. పరలోకంలో 'పుల్సిరాత్'ను దాటుతున్నప్పుడు కూడా ఈ వెలుగు విశ్వాసికి తోడ్పడుతుంది.) దానం (విశ్వాసానికి) నిదర్శనం వంటిది. సహనం తేజస్సు వంటిది. ఖుర్ఆన్ (పై అమలు చేస్తే అది) నీ కొరకు ఆధారంగా నిలుస్తుంది. లేకపోతే అదే నీ పాలిట ప్రతివాదనగా పరిణమిస్తుంది. మనుషలంతా ప్రతి రోజూ ఉదయం బయలుదేరి తమ స్వయాన్ని విక్రయిస్తూ ఉంటారు. కొందరు తమ ఆత్మల్ని (దైవశిక్షనుండి) కాపాడుకుంటే, మరికొందరు వాటిని నాశనం చేసుకుంటూ ఉంటారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం).
English
Abu Malik Al-Harith bin Asim Al-Ash`ar (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said: “Wudu’ is half of Salah; the utterance of (Al-hamdu lillah – all praise belongs to Allah) fills the Scales of good actions; the utterance of (Subhan Allah wa Al-hamdu lillah) (Allah is far removed from every imperfection and all praise belongs to Allah) fills the space between the heavens and the earth, and Salat (prayer) is light; and charity is the proof of Faith; and endurance is light, and the Qur’an is a plea in your favour or against you. Every person departs; he either ransoms it or puts it into perdition”.[Muslim].
ముఖ్యాంశాలు
- పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైనది. అన్నిరకాల పరిశుభ్రతలూ ఇందులోకి వస్తాయి. విశ్వాసం అంటే దాని వాస్తవికత. కొందరి దృష్టిలో ఇక్కడ విశ్వాసం అంటే నమాజు అని అర్థం. నమాజు కోసం పారిశుద్ధ్యం అవసరం కాబట్టి పారిశుద్ధ్యాన్ని సగం నమాజుగా అభివర్ణించటం జరిగిందని వారి అభిప్రాయం.
- ఈ హదీసు ద్వారా దైవధ్యానం (జిక్ర్) ఘనత వెల్లడౌతోంది.
- ఈ హదీసులో ఎక్కువగా నమాజులు చేస్తుండమని పురికొల్పడం జరిగింది. ఎందుకంటే నమాజు వెలుగుతో ముస్లింకు అడుగడుగునా మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది. సిగ్గుమాలిన పనులు, నీతి బాహ్యతల నుండి అది మనిషిని రక్షిస్తుంది.
- దానధర్మాలు (సదఖాలు) విశ్వాసి సత్యసంధతకు, అతని సంకల్పశుద్ధికి, శ్రేయోభిలాషలకు నిదర్శనాలు.
- సహనం మహాత్మ్యం ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. విశ్వాసి చేతిలో అదొక అస్త్రం వంటిది. దానివల్ల అతనికి స్థయిర్యం లభిస్తుంది.
- దివ్య ఖుర్ఆను మనిషి విముక్తికి సాధనమూ కావచ్చు లేదా (దానిపై ఆచరించడం వదిలేస్తే) అది అతని నాశనానికి కారణభూతమూ కావచ్చు. దాని అవలంబనలో ముక్తి ఉంది. వైముఖ్యం కనబరిస్తే మూడుతుంది.
- మానవుడు తన ఆత్మను ఊరికే వదిలేయకూడదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. సదాచరణలోనే ఉంచాలి. లేకపోతే అది దురాగతాలకు ఒడిగట్టి వినాశాన్ని కొనితెచ్చుకుంటుంది.
- మానవుడు తన తాత్కాలిక జీవితాన్ని దైవ విధేయతలో వెచ్చించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 25
హదీసు 26
وَعَنْ أبي سَعيدٍ بْن مَالِك بْن سِنَانٍ الخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ نَاساً مِنَ الأنصَارِ سَأَلُوا رَسُولَ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فأَعْطاهُم، ثُمَّ سَأَلُوهُ فَأَعْطَاهُمْ، حَتَّى نَفِد مَا عِنْدَهُ، فَقَالَ لَهُمْ حِينَ أَنَفَقَ كُلَّ شَيْءٍ بِيَدِهِ: "مَا يَكُنْ مِنْ خَيْرٍ فَلَنْ أدَّخِرَهُ عَنْكُمْ، وَمَنْ يسْتعْفِفْ يُعِفَّهُ اللهُ وَمَنْ يَسْتَغْنِ يُغْنِهِ اللَّهُ، وَمَنْ يَتَصَبَّرْ يُصَبِّرْهُ اللَّهُ. وَمَا أُعْطِىَ أَحَدٌ عَطَاءً خَيْراً وَأَوْسَعَ مِنَ الصَّبْرِ" مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ సయీద్ సాద్ బిన్ సినాన్ ఖుద్రీ (రదియల్లాహు అన్హుమా) కథనం : కొంతమంది అన్సారులు దైవప్రవక్త ﷺను యాచించారు. దైవప్రవక్త ﷺ వారడిగింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచించారు. అప్పుడు కూడా ఆయన వారికి (ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి దైవప్రవక్త ﷺ దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన చేతిలో ఉన్నదంతా అయిపోయిన తరువాత ఆయన వారితో ఇలా అన్నారు: "నా వద్దకు ఏ కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షాభావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్ సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైన, విశాలమైన కానుక మరొకటి లేదు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం).
English
Abu Sa’id Al-Khudri (radiyallahu anhu) reported that: Certain people of the Ansar asked the Messenger of Allah ﷺ and he gave them; then they again asked him and he gave them until all what he possessed was exhausted. Then the Prophet ﷺ said, “Whatever wealth I have, I will not withhold from you. Whosoever would be chaste and modest; Allah will keep him chaste and modest and whosoever would seek self-sufficiency, Allah will make him self-sufficient; and whosoever would be patient, Allah will give him patience, and no one is granted a gift better and more comprehensive than patience”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దైవప్రవక్త ﷺగారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 26
హదీసు 27
وَعَنْ أبي يَحْيَى صُهَيْبِ بْنِ سِنَانٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عَجَباً لأمْرِ الْمُؤْمِنِ إِنَّ أَمْرَهُ كُلَّهُ لَهُ خَيْرٌ، وَلَيْسَ ذَلِكَ لأِحَدٍ إِلاَّ للْمُؤْمِن: إِنْ أَصَابَتْهُ سَرَّاءُ شَكَرَ فَكَانَ خَيْراً لَهُ، وَإِنْ أَصَابَتْهُ ضَرَّاءُ صَبَرَ فَكَانَ خيْراً لَهُ".رواه مسلم.
హజ్రత్ అబూ యహ్యా సుహైబ్ బిన్ సినాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అతను చేసే ప్రతి పనిలో అతని కొరకు మేలు ఉంటుంది. విశ్వాసికి తప్ప మరెవరికీ ఈ భాగ్యం ప్రాప్తించలేదు. అతనికి ఆనంద ఘడియలు ఎదురైతే అందుకు అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఈ కృతజ్ఞత వల్ల అతనికే మేలు కలుగుతుంది. (అంటే దానిపై పుణ్యం లభిస్తుంది). ఒకవేళ అతనికి కష్టాలు ఎదురైతే అతను సహనం వహిస్తాడు. ఈ సహనం కూడా అతనికి మేలే కలుగజేస్తుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం).
English
Abu Yahya Suhaib bin Sinan (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said, “How wonderful is the case of a believer; there is good for him in everything and this applies only to a believer. If prosperity attends him, he expresses gratitude to Allah and that is good for him; and if adversity befalls him, he endures it patiently and that is better for him”.[Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసులో చెప్పబడినట్లు విశ్వాసి వ్యవహారం కష్టసుఖాల్లో, కలిమి లేముల్లో – అన్నివేళలా మేలుతో కూడుకొని ఉంటుంది. అంటే కలిమిలో అల్లాహ్‌ను విస్మరించడం, ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత పాటించడానికి బదులు అవిధేయతకు పాల్పడటం, అదేవిధంగా కష్టాలు, ఆపదల సమయాల్లో సహనానికి బదులు ఆందోళనకు గురికావడం, దేవుని విధిరాతను తూలనాడటం, నిందించడం లాంటి చేష్టలు ఒక విశ్వాసికి ఎంతమాత్రం శోభించవని దీని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 27
హదీసు 28
وعنْ أَنسٍ رضِيَ الله عنْهُ قَالَ: لمَّا ثقُلَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جَعَلَ يتغشَّاهُ الكرْبُ فقَالتْ فاطِمَةُ رَضِيَ الله عنْهَا: واكَرْبَ أبَتَاهُ، فَقَالَ: "ليْسَ عَلَى أَبيكِ كرْبٌ بعْدَ اليَوْمِ "فلمَّا مَاتَ قالَتْ: يَا أبتَاهُ أَجَابَ رَبّاً دعَاهُ، يَا أبتَاهُ جنَّةُ الفِرْدَوْسِ مأوَاهُ، يَا أَبَتَاهُ إِلَى جبْريلَ نْنعَاهُ، فلَمَّا دُفنَ قالتْ فاطِمَةُ رَضِيَ الله عَنهَا: أطَابتْ أنفسُكُمْ أَنْ تَحْثُوا عَلَى رسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم التُّرابَ؟ روَاهُ البُخاريُّ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ వ్యాధి తీవ్రరూపం దాల్చి, ఆరోగ్యం ఆందోళనకరంగా మారినప్పుడు, (ఆయన కుమార్తె) హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) "అయ్యో! నా తండ్రి బాధను చూడండి" అంటూ వాపోయింది. అది విని దైవప్రవక్త ﷺ "ఈ రోజు తరువాత నీ తండ్రి ఇంకెన్నడూ బాధకు గురికాడమ్మా!" అన్నారు. ఆయన మరణించిన తరువాత ఆమె "అయ్యో నా తండ్రి! ప్రభువు పిలవగానే హాజరయ్యానంటూ వెళ్ళిపోయారు. అయ్యో నా తండ్రి, (ఇకపై కనిపించరు). ఫిరదౌసు ఉద్యానవనం (స్వర్గం) ఆయన నివాస స్థలం అయిపోయింది. అయ్యో నాన్నా! మేము జిబ్రయీల్ దూతకు మీ మరణవార్త గురించి తెలియజేస్తాము" అంటూ బాధపడ్డారు. ఆయన ఖననం చేయబడిన తరువాత హజ్రత్ ఫాతిమా (ప్రవక్త సహచరులనుద్దేశించి) "దైవప్రవక్త (సమాధి)పై మన్ను పోయడానికి మీకు మనసెలా వొప్పింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం).
English
Anas (radiyallahu anhu) reported: When the last illness of Messenger of Allah ﷺ made him unconscious, Fatimah (radiyallahu anha) exclaimed: “Ah, the distress of my dear father.” He ﷺ said, “There will be no distress for your father after today”. When he died she said: “My father, Allah has called you back and you have responded to His Call. O father! Garden of Firdaus is your abode. O father! We announce to Jibril your death.” When he was buried, she said: “Are you satisfied now that you put earth over (the grave of) Messenger of Allah ﷺ?”[Al-Bukhari]
ముఖ్యాంశాలు
మృత్యువు ఆసన్నమయిన సమయంలో కలిగే బాధను, ఆందోళనను వ్యక్తం చేయవచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అదేవిధంగా ఎవరైనా చనిపోయినప్పుడు సహజమైన రీతిలో దుఃఖాన్ని, ఖేదాన్ని వెల్లడించడంలోనూ తప్పులేదు. అయితే అతిగా రోదించడం, ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, జుత్తు పీక్కోవడం, బట్టలు చించుకోవడం లాంటి అవాంఛనీయమైన పనులు మాత్రం చేయరాదు. మృతుని గుణప్రశస్తుల్ని గురించి చెప్పడం ధర్మసమ్మతమే. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) చివరగా పలికిన పలుకులు కూడా ఒక రకంగా ఆవేదనాభరిత వాక్యాలే. దైవప్రవక్త ﷺ ఖననం చేయబడటంలో అభ్యంతరమేముంది? ఎందుకంటే అది షరీఅత్ ఇచ్చే ఆజ్ఞ. దాన్నుంచి ఎవరికీ (ఆఖరికి దైవప్రవక్తకు కూడా) మినహాయింపు ఉండదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 28
హదీసు 29
وعنْ أبي زيْد أُسامَة بن زيد حَارثَةَ موْلَى رسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وحبَّهِ وابْنِ حبِّهِ رضيَ اللهُ عنهُمَا، قالَ: أَرْسلَتْ بنْتُ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: إنَّ ابْنِي قَدِ احتُضِرَ فاشْهدْنَا، فأَرسَلَ يقْرِئُ السَّلامَ ويَقُول: "إنَّ للَّه مَا أَخَذَ، ولهُ مَا أعْطَى، وكُلُّ شَيْءٍ عِنْدَهُ بأجَلٍ مُسمَّى، فلتصْبِر ولتحْتسبْ" فأرسَلَتْ إِليْهِ تُقْسمُ عَلَيْهِ ليأْتينَّها. فَقَامَ وَمَعَهُ سَعْدُ بْنُ عُبادَةَ، وَمُعَاذُ بْنُ جَبَلٍ، وَأُبَيُّ بْنَ كَعْبٍ، وَزَيْدُ بْنِ ثاَبِتٍ، وَرِجَالٌ رَضِيَ اللَّهُ عَنْهُمْ، فَرُفِعَ إِلَى رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الصبيُّ، فأقعَدَهُ في حِجْرِهِ ونَفْسُهُ تَقعْقعُ، فَفَاضتْ عَيْناهُ، فقالَ سعْدٌ: يَا رسُولَ الله مَا هَذَا؟ فقالَ: "هَذِهِ رَحْمةٌ جعلَهَا اللَّهُ تعَالَى في قُلُوبِ عِبَادِهِ" وفي روِايةٍ:" فِي قُلُوبِ منْ شَاءَ مِنْ عِبَادِهِ وَإِنَّمَا يَرْحَمُ اللَّهُ منْ عِبَادِهِ الرُّحَمَاءَ" مُتَّفَقٌ عَلَيْهِ. وَمَعْنَى"تَقَعْقَعُ": تَتحَرَّكُ وتَضْطَربُ.
దైవప్రవక్త ﷺ చేత విముక్తి నొసగబడిన బానిస, ఆయనకు ప్రియతములు, ఇంకా ఆయన గారి ప్రియశిష్యుని కుమారుడైనటువంటి హజ్రత్ అబూ జైద్ ఉసామా బిన్ జైద్ బిన్ హారిసా (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ కుమార్తె ఒకరు "నా కుమారునికి అంతిమ ఘడియ ఆసన్నమయింది. మీరు వెంటనే మా దగ్గరికి వచ్చేయండి" అంటూ తన తండ్రికి కబురుచేశారు. అయితే దైవప్రవక్త ﷺ దానికి సమాధానంగా సలాం చెబుతూ "అల్లాహ్ వెనక్కి తీసుకున్నది ఆయనదే, తాను ఇచ్చినది కూడా ఆయన సొంతమే. ఆయన ప్రతి వస్తువుకూ ఒక గడువుని నిర్ణయించాడు. అందువల్ల సహనం వహించి పుణ్యాన్ని ఆశించమని ఆమెతో చెప్పు" అని వచ్చిన వ్యక్తిని తిప్పి పంపారు దైవప్రవక్త. ఆమె రెండవసారి కూడా ప్రమాణం చేసి మీరు తప్పకుండా రావాలని కబురు చేసింది.
అప్పుడు దైవప్రవక్త ﷺ బయలుదేరారు. ఆయన వెంట సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), ఉబై బిన్ కాబ్, తదితర సహచరులు కూడా వున్నారు. పిల్లవాడ్ని ఆయన వద్దకు తీసుకువచ్చి ఆయన ఒడిలో పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ పరిస్థితిని చూసి దైవప్రవక్త ﷺ కళ్ళవెంబడి అశ్రుధారలు ప్రవహించాయి. అప్పుడు హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) "దైవప్రవక్తా! ఇదేమిటీ (మీరు కూడా దుఃఖిస్తున్నారు?)" అని అడిగారు. అందుకు దైవప్రవక్త ﷺ "ఇది దేవుడు తన దాసుల హృదయాల్లో ఉంచిన వాత్సల్యం" అని సమాధానమిచ్చారు.
వేరొక ఉల్లేఖనంలో "అల్లాహ్ తాను కోరిన దాసుల హృదయాల్లో (ఈ కారుణ్యాన్ని ఉంచాడు). తన దాసుల్లో జాలిగుండెలుగల వారిపైనే అల్లాహ్ జాలిచూపుతాడు" అని ఉంది.
(బుఖారీ – ముస్లిం)
హదీసులోని "తఖాఖవు" అనే పదానికి వణకడం, కొట్టుమిట్టాడటం అనే అర్థాలు ఉన్నాయి.
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం).
English
Usamah bin Zaid (radiyallahu anhuma) narrated: The daughter of the Prophet ﷺ sent for him as her child was dying, but the Prophet ﷺ returned the messenger and sent her good wishes saying, “Whatever Allah takes away or gives, belongs to Him, and everything with Him has a limited fixed term (in this world), and so she should be patient and anticipate Allah’s reward.” She again sent for him adjuring him for the sake of Allah to come. The Messenger of Allah, accompanied with Sa`d bin `Ubadah, Mu`adh bin Jabal, Ubayy bin Ka`b, Zaid bin Thabit and some other men went to see her. The child was lifted up to the Messenger of Allah while his breath was disturbed in his chest. On seeing that, the eyes of the Prophet ﷺ streamed with tears. Sa`d said, “O Messenger of Allah! What is this?” He replied, “It is compassion which Allah has placed in the hearts of His slaves, Allah is Compassionate only to those among His slaves who are compassionate (to others)”.
Another version says: Messenger of Allah ﷺ said, “Allah shows compassion only to those among His slaves who are compassionate”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు అతని బంధువులంతా హాజరుకావాలన్న నియమం ఏమీ లేదు. అయితే జనాజా (అంత్య క్రియల) నమాజులో అందరూ హాజరు కావడం అభిలషణీయం.
- మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తి దగ్గర పుణ్యపురుషులు కూర్చుంటే, వారి దుఆ చలువతో ఆ వ్యక్తి గడ్డు పరిస్థితి త్వరగా గడిచిపోతుందని కుటుంబ సభ్యులు భావించడంలో తప్పులేదు.
- విశ్వాసమున్న వ్యక్తికోసం ప్రమాణం చేయడం, ఆ వ్యక్తి ఆ ప్రమాణాన్ని నెరవేర్చడం భావ్యమే. దీనివల్ల పరస్పర విశ్వాసం, ప్రేమానురాగాలు పెంపొందుతాయి.
- మృతునిపై సహజమైన రీతిలో దుఃఖించడం, మృతుని బంధువులకు ఈ విషాద సంఘటనపై సహనం వహించమని, అల్లాహ్ నుండి పుణ్యాన్ని ఆశించమని బోధించడం ధర్మసమ్మతమే.
- ప్రేమానురాగాలు దైవానుగ్రహాన్ని, దైవ కారుణ్యాన్ని బడయటానికి ఉపకరించే సాధనాలు. వీటి లేమి మనిషి దౌర్భాగ్యానికి ఆనవాలు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 29
హదీసు 30
وَعَنْ صُهَيْبٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَانَ مَلِكٌ فيِمَنْ كَانَ قبْلَكُمْ، وَكَانَ لَهُ سَاحِرٌ، فَلَمَّا كَبِرَ قَالَ لِلْمَلِك: إِنِّي قَدْ كَبِرْتُ فَابعَثْ إِلَيَّ غُلاَماً أُعَلِّمْهُ السِّحْرَ، فَبَعَثَ إِلَيْهِ غُلاَماً يعَلِّمُهُ، وَكَانَ في طَريقِهِ إِذَا سَلَكَ رَاهِبٌ، فَقَعَدَ إِلَيْهِ وَسَمِعَ كَلاَمهُ فأَعْجَبهُ، وَكَانَ إِذَا أَتَى السَّاحِرَ مَرَّ بالرَّاهِب وَقَعَدَ إِلَيْه، فَإِذَا أَتَى السَّاحِرَ ضَرَبَهُ، فَشَكَا ذَلِكَ إِلَى الرَّاهِبِ فَقَالَ: إِذَا خَشِيتَ السَّاحِر فَقُلْ: حبَسَنِي أَهْلي، وَإِذَا خَشِيتَ أَهْلَكَ فَقُلْ: حَبَسَنِي السَّاحرُ. فَبيْنَمَا هُو عَلَى ذَلِكَ إذْ أتَى عَلَى دابَّةٍ عظِيمَة قدْ حَبَسَت النَّاس فَقَالَ: اليوْمَ أعْلَمُ السَّاحِرُ أفْضَل أم الرَّاهبُ أفْضلَ؟ فأخَذَ حجَراً فقالَ: اللهُمَّ إنْ كَانَ أمْرُ الرَّاهب أحَبَّ إلَيْكَ مِنْ أَمْرِ السَّاحِرِ فاقتُلْ هَذِهِ الدَّابَّة حتَّى يمْضِيَ النَّاسُ، فرَماها فقتَلَها ومَضى النَّاسُ، فأتَى الرَّاهب فأخبَرهُ. فَقَالَ لهُ الرَّاهبُ: أىْ بُنيَّ أَنْتَ اليوْمَ أفْضلُ منِّي، قدْ بلَغَ مِنْ أمْركَ مَا أَرَى، وإِنَّكَ ستُبْتَلَى، فإنِ ابْتُليتَ فَلاَ تدُلَّ عليَّ، وكانَ الغُلامُ يبْرئُ الأكْمةَ والأبرصَ، ويدَاوي النَّاس مِنْ سائِرِ الأدوَاءِ. فَسَمعَ جلِيسٌ للملِكِ كانَ قدْ عمِىَ، فأتَاهُ بهداياَ كثيرَةٍ فقال: ما هاهُنَا لَكَ أجْمَعُ إنْ أنْتَ شفَيْتني، فَقَالَ إنِّي لا أشفِي أحَداً، إِنَّمَا يشْفِي اللهُ تعَالى، فإنْ آمنْتَ بِاللَّهِ تعَالَى دعوْتُ اللهَ فشَفاكَ، فآمَنَ باللَّه تعَالى فشفَاهُ اللَّهُ تَعَالَى، فأتَى المَلِكَ فجَلَس إليْهِ كَما كانَ يجْلِسُ فقالَ لَهُ المَلكُ: منْ ردَّ علَيْك بصَرك؟ قَالَ: ربِّي. قَالَ: ولكَ ربٌّ غيْرِي؟، قَالَ: رَبِّي وربُّكَ اللهُ، فأَخَذَهُ فلَمْ يزلْ يُعذِّبُهُ حتَّى دلَّ عَلَى الغُلاَمِ فجئَ بِالغُلاَمِ، فَقَالَ لهُ المَلكُ: أىْ بُنَيَّ قدْ بَلَغَ منْ سِحْرِك مَا تبْرئُ الأكمَهَ والأبرَصَ وتَفْعلُ وَتفْعَلُ فقالَ: إِنَّي لا أشْفي أَحَداً، إنَّما يشْفي الله تَعَالَى، فأخَذَهُ فَلَمْ يزَلْ يعذِّبُهُ حتَّى دلَّ عَلَى الرَّاهبِ، فجِئ بالرَّاهِبِ فَقيلَ لَهُ: ارجَعْ عنْ دِينكَ، فأبَى، فدَعا بالمنْشَار فوُضِع المنْشَارُ في مفْرقِ رأْسِهِ، فشقَّهُ حتَّى وقَعَ شقَّاهُ، ثُمَّ جِئ بجَلِيسِ المَلكِ فقِيلَ لَهُ: ارجِعْ عنْ دينِكَ فأبَى، فوُضِعَ المنْشَارُ في مفْرِقِ رَأسِهِ، فشقَّهُ به حتَّى وقَع شقَّاهُ، ثُمَّ جئ بالغُلامِ فقِيل لَهُ: ارجِعْ عنْ دينِكَ، فأبَى، فدَفعَهُ إِلَى نَفَرٍ منْ أصْحابِهِ فَقَالَ: اذهبُوا بِهِ إِلَى جبَلِ كَذَا وكذَا فاصعدُوا بِهِ الجبلَ، فإذَا بلغتُمْ ذروتهُ فإنْ رجعَ عنْ دينِهِ وإِلاَّ فاطرَحوهُ فذهبُوا بِهِ فصعدُوا بهِ الجَبَل فَقَالَ: اللَّهُمَّ اكفنِيهمْ بمَا شئْت، فرجَف بِهمُ الجَبَلُ فسَقطُوا، وجَاءَ يمْشي إِلَى المَلِكِ، فقالَ لَهُ المَلكُ: مَا فَعَلَ أَصحَابكَ؟ فقالَ: كفانيهِمُ الله تعالَى، فدفعَهُ إِلَى نَفَرَ منْ أصْحَابِهِ فَقَالَ: اذهبُوا بِهِ فاحملُوه في قُرقُور وَتَوسَّطُوا بِهِ البحْرَ، فإنْ رَجَعَ عنْ دينِهِ وإلاَّ فَاقْذفُوهُ، فذَهبُوا بِهِ فَقَالَ: اللَّهُمَّ اكفنِيهمْ بمَا شِئْت، فانكَفَأَتْ بِهِمُ السَّفينةُ فغرِقوا، وجَاءَ يمْشِي إِلَى المَلِك. فقالَ لَهُ الملِكُ: مَا فَعَلَ أَصحَابكَ؟ فَقَالَ: كفانِيهمُ الله تعالَى. فقالَ للمَلِكِ إنَّك لسْتَ بقَاتِلِي حتَّى تفْعلَ مَا آمُركَ بِهِ. قَالَ: مَا هُوَ؟ قَالَ: تجْمَعُ النَّاس في صَعيدٍ واحدٍ، وتصلُبُني عَلَى جذْعٍ، ثُمَّ خُذ سهْماً مِنْ كنَانتِي، ثُمَّ ضعِ السَّهْمِ في كَبدِ القَوْسِ ثُمَّ قُل: بسْمِ اللَّهِ ربِّ الغُلاَمِ ثُمَّ ارمِنِي، فإنَّكَ إذَا فَعَلْتَ ذَلِكَ قَتَلْتنِي. فجَمَع النَّاس في صَعيدٍ واحِدٍ، وصلَبَهُ عَلَى جذْعٍ، ثُمَّ أَخَذَ سهْماً منْ كنَانَتِهِ، ثُمَّ وضَعَ السَّهمَ في كبِدِ القَوْسِ، ثُمَّ قَالَ: بِسْم اللَّهِ رَبِّ الغُلامِ، ثُمَّ رمَاهُ فَوقَعَ السَّهمُ في صُدْغِهِ، فَوضَعَ يدَهُ في صُدْغِهِ فمَاتَ. فقَالَ النَّاسُ: آمَنَّا بِرَبِّ الغُلاَمِ، فَأُتِىَ المَلكُ فَقِيلُ لَهُ: أَرَأَيْت مَا كُنْت تحْذَر قَدْ وَاللَّه نَزَلَ بِك حَذرُكَ. قدْ آمنَ النَّاسُ. فأَمَرَ بِالأخدُودِ بأفْوَاهِ السِّكك فخُدَّتَ وَأضْرِمَ فِيها النيرانُ وقالَ: مَنْ لَمْ يرْجَعْ عنْ دينِهِ فأقْحمُوهُ فِيهَا أوْ قيلَ لَهُ: اقْتَحمْ، ففعَلُوا حتَّى جَاءتِ امرَأَةٌ ومعَهَا صَبِيٌّ لهَا، فَتقَاعَسَت أنْ تَقعَ فِيهَا، فَقَالَ لَهَا الغُلاَمُ: يَا أمَّاهْ اصبِرِي فَإِنَّكَ عَلَي الحَقِّ" روَاهُ مُسْلَمٌ. "ذرْوةُ الجَبلِ": أعْلاهُ، وَهي بكَسْر الذَّال المعْجمَة وَضَمِّهَا و"القُرْقورُ"بضَمِّ القَافَيْن: نوْعٌ منْ السُّفُن وَ"الصَّعِيدُ"هُنا: الأرضُ البارزَةُ وَ"الأخْدُودُ": الشُّقوقُ في الأرْضِ كالنَّهْرِ الصَّغيرِو"أُضرِمَ"أوقدَ"وانكفَأَت"أَي: انقلبَتْ وَ"تقاعسَت"توقَّفتْ وجبُنتْ.
హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధనం – "పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో "నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను" అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, "మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలస్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు" అని అన్నాడు.
అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాకపోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు. అతను చేతిలో ఒక రాయి తీసుకొని "ఓ అల్లాహ్! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పనికన్నా ప్రీతికరమైనదైతే (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు" అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు "నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!" అని హితవు పలికాడు.
ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టురోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్బారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో "నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే" అన్నాడు. దానికి ఆ అబ్బాయి "నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)" అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్ అతనికి నయం చేశాడు.
ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి "నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?" అనడిగాడు. దానికతను "నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు" అని సమాధానమిచ్చాడు. అందుకు రాజు "ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?" అని ప్రశ్నించాడు. "నాకూ నీకూ ప్రభువు అల్లాహ్ (మాత్రమే)" అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు.
దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు. బాలుణ్ణి రాజు దర్బారుకి తీసుకురావడం జరిగింది. "నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టురోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!" అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు "నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసేవాడు అల్లాహ్ మాత్రమే" అని సమాధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు. మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు.
రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలైపోయింది. ఆ తరువాత రాజ దర్బారులోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది. ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకువచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని ఆ బాలుడు కూడా ససేమిరా అన్నాడు.
రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి "ఇతణ్ణి ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి" అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడ్ని తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, "దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు" అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడిపోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) "నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)" అని అడిగాడు. దానికి ఆ బాలుడు "వారికి ప్రతిగా అల్లాహ్ నాకు తోడ్ప డ్డాడ"ని సమాధానమిచ్చాడు.
రాజు (కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడ్ని ఇంకొంతమందికి అప్పజెప్పి "ఇతణ్ణి పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలిపోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి" అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని "దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు" అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడవచ్చిన వారంతా మునిగిపోయారు.
తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరుకున్నాడు. రాజు అతణ్ణి చూసి "వాళ్ళు ఏమైపోయారు?" అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు "వారికి ప్రతిగా అల్లాహ్ నాకు సహాయపడ్డాడు" అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: "నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు." ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : "ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. ఆ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు."
రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఉరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి "బిస్మిల్లాహి రబ్బిల్ గులామి (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్ నామముతో)" అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి ఆ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరిగాడు.
జరిగినది చూసిన ప్రజలంతా "మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము" అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి "ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు" అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరివేయుమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు "అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు" అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు.
(ముస్లిం)
సదరు హదీసులో వచ్చిన పదం "జర్వతుల్ జబల్" అంటే పర్వతాగ్రం (శిఖరం). దీని 'జ'ను ఇకారం మరియు ఉకారం రెండు విధాలా చదువవచ్చును. 'ఖుర్ఖూర్' (రెండు 'ఖ' లకూ ఉకారమే) అంటే ఇది పడవల్లోని ఒక రకము. 'సయీద్' అనే పదం ఖాళీ ప్రదేశం అన్న అర్థంలో ఉంది. 'ఉఖ్‌దూద్' అంటే భూమిపై ఉండే గుంటలు, కందకాలు. చిన్న కాలువ అని అనవచ్చు. 'ఉజ్రిమ' అంటే "రాజేయబడింది" 'ఇన్కఫఅత్' అంటే "తలక్రిందులైంది" ఇంకా 'తఖాఅసత్' అంటే "తటపటాయించింది" లేక "పిరికితనం చూపింది" అనే అర్థాలు వస్తాయి.
(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత, కారుణ్య ప్రకరణం).
English
Suhaib (radiyallahu anhu) reported that the Messenger of Allah ﷺ said, “There lived a king before you and he had a court magician. As he (the magician) grew old, he said to the king: `I have grown old, so send me a young boy in order to teach him magic.’ The king sent him a young boy to serve the purpose. And on his way (to the magician) the young boy met a monk to whom he listened to and liked it. It became his habit that on his way to the magician, he would meet the monk and sit there and would come to the magician (late). The magician used to beat him because of this delay. He complained about this to the monk who said to him: ‘When you feel afraid of the magician, say: Members of my family detained me. And when you fear your family, say: The magician detained me.’ It so happened that there came a huge beast and it blocked the way of the people, and the young boy said: ‘I will know today whether the magician or the monk is better.’ He picked up a stone and said: `O Allah, if the way of the monk is dearer to You than the way of the magician, bring about death to the animal so that the people be able to move about freely.’ He threw that stone at it and killed it and the people began to move about freely. He then came to the monk and told him the story. The monk said: `Son, today you are superior to me. You have come to a stage where I feel that you would be soon put to a trial, and in case you are put to a trial, do not reveal me.’ That young boy began to heal those born blind and the lepers and he, in fact, began to cure people from all kinds of illnesses. When a courtier of the king who had gone blind heard about him, he came to him with numerous gifts and said, `If you cure me, all these things will be yours.’ He said, `I myself do not cure anyone. It is Allah, the Exalted, Alone Who cures; and if you affirm faith in Allah, I shall also supplicate to Allah to cure you.’ This courtier affirmed his faith in Allah and Allah cured him. He came to the king and sat by his side as he used to sit before. The king said to him, `Who restored your eyesight?’ He said, `My Rubb.’ Thereupon he said, ‘Do you have another lord besides me?’ He said, `My Rubb and your Rubb is Allah.’ So the king kept torturing him untill he revealed the young boy. The young boy was thus summoned and the king said to him, ‘O boy, it has been conveyed to me that you have become so much proficient in your magic that you cure the blind and the lepers and you do such and such.’ Thereupon he said, `I do not cure anyone; it is Allah Alone Who cures,’ and the king took hold of him and began to torture him until he revealed of the monk. The monk was summoned and it was said to him: `You should turn back from your religion.’ But he refused. The king sent for a saw, placed it in the middle of his head and cut him into two parts that fell down. Then the courtier of the king was brought forward and it was said to him: `Turn back from your religion.’ He, too, refused, and the saw was placed in the midst of his head and he was torn into two parts. Then the boy was sent for and it was said to him: `Turn back from your religion.’ He refused. The king then handed him over to a group of his courtiers, and said to them: `Take him to such and such mountain; make him climb up that mountain and when you reach its peak ask him to renounce his Faith. If he refuses to do so, push him to his death.’ So they took him and made him climb up the mountain and he said: `O Allah, save me from them in any way you like,’ and the mountain began to shake and they all fell down (dead) and that young boy came walking to the king. The king said to him, `What happened to your companions?’ He said, `Allah has saved me from them.’ He again handed him to some of his courtiers and said: `Take him and carry him in a boat and when you reach the middle of the sea, ask him to renounce his religion. If he does not renounce his religion throw him (into the water).’ So they took him and he said: `O Allah, save me from them.’ The boat turned upside down and they all drowned except the young boy who came walking to the king. The king said to him, `What happened to your companions?’ He said, `Allah has saved me from them,’ and he said to the king: `You cannot kill me until you do what I command you to do.’ The king asked, `What is that?’ He said, `Gather all people in one place and tie me up to the trunk of a tree, then take an arrow from my quiver and say: With the Name of Allah, the Rubb of the boy; then shoot me. If you do that you will be able to kill me.’ `The king called the people in an open field and tied the young boy to the trunk of a tree. He took out an arrow from his quiver, fixed in the bow and said, `With the Name of Allah, the Rubb of the young boy,’ he then shot the arrow and it hit the boy’s temple. The young boy placed his hand upon the temple where the arrow had hit him and died. The people then said: `We believe in the Rubb of this young boy.’ The king was told: `Do you see what you were afraid of, by Allah it has taken place; all people have believed.’ The king then commanded that trenches be dug and fire lit in them, and said: `He who would not turn back from his (the young boy’s) religion, throw him in the fire’ or `he would be ordered to jump into it.’ They did so till a woman came with her child. She felt hesitant in jumping into the fire. The child said to her: `O mother! Endure (this ordeal) for you are on the Right Path”.[Muslim].
ముఖ్యాంశాలు
- పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్పించడానికి కూడా వెనుకాడరాదు.
- దేవుని ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. దేవుడు తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.
- ఈ హదీసు ద్వారా ఖుర్ఆన్ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.
- హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాథ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్లో చెప్పబడిన 'అస్హాబుల్ ఉఖ్‌దూద్' (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్థం అయ్యేది కాదు. ఖురాన్ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.
- ఇటువంటి గాథలు సత్య సందేశ ప్రదాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 30
హదీసు 31
وَعَنْ أَنَسٍ رَضِي اللَّهُ عَنْهُ قَالَ: مَرَّ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِامْرَأَةٍ تَبْكِي عِنْدَ قَبْرٍ فَقَال: " اتَّقِي الله وَاصْبِرِي"فَقَالَتْ: إِلَيْكَ عَنِّي، فَإِنِّكَ لَمْ تُصَبْ بمُصِيبتى، وَلَمْ تعْرفْهُ، فَقيلَ لَها: إِنَّه النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَأَتتْ بَابَ النَّبِّي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فلَمْ تَجِد عِنْدَهُ بَوَّابينَ، فَقالتْ: لَمْ أَعْرِفْكَ، فقالَ:"إِنَّما الصَّبْرُ عِنْدَ الصَّدْمَةِ الأولَى" متفقٌ عَلَيهِ. وفي رواية لمُسْلمٍ:"تَبْكِي عَلَى صَبيٍّ لَهَا".
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక స్త్రీ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుండగా దైవప్రవక్త ﷺ అటుగా రావటం జరిగింది. ఆమెను చూసి ఆయన "దైవానికి భయపడుతూ సహనం వహించు తల్లీ!" అని ఆమెను ఓదార్చారు. అందుకు ఆ స్త్రీ (ముఖం చిట్లించుకొని) "మీకెందుకు? మీరు ఇక్కణ్ణుంచి వెళ్ళిపోండి. నాపై వచ్చిపడిన ఆపద మీకైతే కలగలేదుగా!" అని అన్నది. వాస్తవానికి ఆమె తనతో మాట్లాడిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేదు.
తరువాత, ఆమెను ఓదార్చినది దైవప్రవక్త అని ఆ స్త్రీకి కొంతమంది తెలియజేశారు. అది తెలుసుకొని ఆమె (పరుగెత్తుకుంటూ) దైవప్రవక్త వాకిలి దగ్గరికి వచ్చింది. అక్కడ ఆమెకు ఒక్క ద్వార పాలకుడయినా కానరాలేదు. ఆ మహిళ (దైవప్రవక్త ﷺను కలుసుకొని) "(క్షమించండి) నాతో మాట్లాడింది మీరని తెలుసుకోలేకపోయాను" అసి విన్నవించుకుంది. కాని దైవప్రవక్త ﷺ (అదేమీ పట్టనట్లుగా) "ఆపద వచ్చిపడినప్పుడు వహించే సహనమే అసలు సహనం" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో "ఆమె తన కుమారుని సమాధిపై రోదిస్తూ కూర్చుంది" అని ఉంది.
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం).
English
Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ passed by a woman who was crying over a grave and said, “Fear Allah and be patient.” She said, “Away from me! My calamity has not befallen you and you are not aware of it.” The woman was later told that it was the Prophet ﷺ (who had advised her). She came to his door where she found no doorkeeper. She said, “(I am sorry) I did not know you.” Messenger of Allah ﷺ said, “Patience is (becoming) only at the first (stroke) of grief”.[Al-Bukhari and Muslim].
Another narration in Muslim says: The woman was crying over her son.
ముఖ్యాంశాలు
పై హదీసు అసలు ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో దైవప్రవక్త ﷺ గారి ఉన్నత నైతిక గుణాలు కూడా పొందుపరచబడ్డాయి. సదరు మహిళ దైవప్రవక్త ﷺతో ఆయన స్థాయికి తగని రీతిలో సంభాషణ జరిపింది. అయినప్పటికీ ఆయన ఆ మహిళపై కినుక వహించలేదు. ఆమెను నువ్వు చాలా కరకుగా మాట్లాడావని కూడా అనలేదు. పైగా ఆమె రెండోసారి తన సన్నిధికి వచ్చినప్పుడు హితబోధ వచనాలతో సాగనంపారు. సత్యసందేశ ప్రదాతలకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. నేటి విద్వాంసులు (ఉలమా), సత్యసందేశ ప్రచారకులు కూడా అలాంటి ఉత్తమ నడవడికను అలవరచుకుంటే ఎంత బాగుంటుంది!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 31
హదీసు 32
وَعَنْ أَبي هَرَيرَةَ رَضي اللَّه عنه أَنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "يَقولُ اللَّهُ تَعَالَى: مَا لِعَبْدِي المُؤْمِنِ عِنْدِي جَزَاءٌ إِذَا قَبضْتُ صَفِيَّهُ مِنْ أَهْلِ الدُّنْيَا ثُمَّ احْتَسَبهُ إِلاَّ الجَنَّة" رواه البخاري.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : అల్లాహ్ అంటున్నాడు: విశ్వాసి అయిన నా దాసుని నుంచి తనకు అత్యంత ప్రియమైన వస్తువుని నేను వెనక్కి తీసుకున్నా అతను దానిపై (సహనం వహించి) పుణ్యాన్ని ఆశిస్తాడు – అలాంటివానికోసం నా దగ్గర స్వర్గం తప్ప మరే ప్రతిఫలమూ లేదు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం).
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah, the Exalted says: ‘I have no reward other than Jannah for a believing slave of Mine who remains patient for My sake when I take away his beloved one from among the inhabitants of the world”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
సాధారణంగా ఆలుబిడ్డలు, తల్లిదండ్రులు మొదలగువారు మనిషికి అత్యంత ప్రియమైనవారై ఉంటారు. అలాంటి వారు మరణిస్తే అది దైవకృతమని భావించి సహనం వహించడం సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం. దీనికి భిన్నంగా అసహనం, అతిగా ఏడ్చి పెడబొబ్బలు పెట్టడం అనాలోచితంగా మాట్లాడటం లాంటి చేష్టలు విశ్వాస బలహీనతకు ఆనవాళ్లు. మొదటి విధానానికి ప్రతిఫలం స్వర్గం కాగా; రెండో విధానం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 32
హదీసు 33
وعَنْ عائشَةَ رضيَ اللَّهُ عنها أنَهَا سَأَلَتْ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَن الطَّاعونِ، فَأَخبَرَهَا "أَنَهُ كَانَ عَذَاباً يَبْعَثُهُ اللَّه تَعَالَى عَلَى منْ يَشَاءُ، فَجَعَلَهُ اللَّهُ تعالَى رحْمةً للْمُؤْمنِينَ، فَلَيْسَ مِنْ عَبْدٍ يَقَعُ في الطَّاعُون فَيَمْكُثُ في بلَدِهِ صَابِراً مُحْتَسِباً يَعْلَمُ أَنَّهُ لاَ يُصِيبُهُ إِلاَّ مَا كَتَبَ اللَّهُ لَهُ إِلاَّ كَانَ لَهُ مِثْلُ أَجْرِ الشَّهِيدِ" رواه البخاري.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺను ప్లేగువ్యాధి గురించి అడిగారు. దానికి ఆయన ఆమెకు ఈ విధంగా తెలియజేశారు – "ఒకప్పుడు ఇదో శిక్షగా ఉండేది. అల్లాహ్ తాను కోరినవారిని దానికి గురిచేసేవాడు. కాని ఇప్పుడు అల్లాహ్ దాన్ని విశ్వాసులపాలిట కారుణ్య ప్రదమైనదిగా మార్చివేశాడు. అందుచేత ఇక ఏ దాసుడైనా ఈ ప్లేగు వ్యాధికి గురైనప్పటికీ సహనంతో పరలోక పుణ్య ఫలాపేక్షతో తనకు వ్యాధిసోకిన నగరంలోనే ఉంటూ, దైవం తన కోసం రాసిపెట్టినదే జరుగుతుందన్న గట్టి నమ్మకాన్ని కల్గివుంటే అలాంటి వ్యక్తికి దైవమార్గంలో అమరగతినొందిన వ్యక్తికి లభించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది." (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వైద్య ప్రకరణం).
English
`Aishah (radiyallahu anha) reported: I asked the Messenger of Allah ﷺ about pestilence and he said, “It is a punishment which Allah sends upon whomsoever He wills, but Allah has made it as a mercy to the believers. Anyone who remains in a town which is plagued with pestilence maintaining patience expecting the reward from Allah, and knowing that nothing will befall him other than what Allah has foreordained for him, he would receive a reward of Shaheed”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ప్లేగు లాంటి ప్రాణాంతక అంటువ్యాధులు సోకినప్పుడు దేవుని విధివ్రాతపై విశ్వాసంతో వ్యాధికి గురైన నగరంలోనే ఉంటూ, అలాంటి విపత్కాలంలో కూడా కంగారు పడిపోకుండా, ఆందోళన చెందకుండా నిలకడను ప్రదర్శించిన ఒక విశ్వాసి దైవమార్గంలో అమరగతినొందిన వ్యక్తి స్థాయికి చేరుకుంటాడనడంలో సందేహం లేదు. అదేవిధంగా నీటిలో మునిగి చనిపోయేవాడు, ప్రసవావస్థలో మరణించే స్త్రీలు మొదలైనవారికి కూడా ఇలాంటి పుణ్యమే లభిస్తుంది. ఇకపోతే ప్లేగువ్యాధి సోకినవారు తమ నగరాల్లోనే ఉండాలన్న ఆదేశంలోని మర్మం ఏమిటంటే దీనివల్ల ఆ అంటువ్యాధి ఇతర నగరాలకు, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉంటుంది. అంతేకాదు; అంటువ్యాధి వ్యాపించిన నగర దరిదాపులకు కూడా వెళ్ళరాదని ఇతర ప్రాంతాలవారినీ ఆదేశించడం జరిగింది. దీనిద్వారా అర్థమయ్యేదేమిటంటే, ప్రాణరక్షణ, ఆరోగ్య భద్రతల నిమిత్తం చికిత్సా విధానాలను అవలంబించడం, మందులు తదితర ఔషధాలను వాడటం విధివ్రాతపై విశ్వాసానికి విరుద్ధం కాదు. వ్యాధికి గురైనప్పుడు చూపే సహనం దైవ నిర్ణయాల పట్ల దాసుల అంగీకారానికి, వారి విశ్వాస పరిపూర్ణతకు అద్దం పడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 33
హదీసు 34
وعَنْ أَنسٍ رضي اللَّه عنه قالَ: سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "إنَّ اللَّه عَزَّ وجَلَّ قَالَ:"إِذَا ابْتَلَيْتُ عَبدِي بحبيبتَيْهِ فَصبَرَ عَوَّضْتُهُ مِنْهُمَا الْجنَّةَ" يُريدُ عينيْه، رواه البخاريُّ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు – అల్లాహ్ అంటున్నాడు : "నేను నా దాసుని ప్రియమైన రెండు వస్తువులను (రెండు కళ్ళను) తీసేసుకొని పరీక్షించినప్పుడు అతను గనక సహనం వహిస్తే వాటికి బదులుగా నేనతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాను." (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం).
English
Anas (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ saying, “Allah, the Glorious and Exalted said: `When I afflict my slave in his two dear things (i.e., his eyes), and he endures patiently, I shall compensate him for them with Jannah.”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ ప్రపంచంలో అంధత్వాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. అయితే అంతపెద్ద అభాగ్యానికి ఓర్చుకున్నందుకు అల్లాహ్ తగిన ప్రతిఫలమే ఇస్తాడన్న విషయాన్ని మాత్రం మరువకూడదు. అంధత్వంపై సహనం వహించడమంటే మాటలు కాదు. అంధులు విశ్వాసభాగ్యాన్ని కల్గివుండాలేగాని అల్లాహ్ అలాంటివారికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 34
హదీసు 35
وعنْ عطاءِ بْن أَبي رَباحٍ قالَ: قالَ لِي ابْنُ عبَّاسٍ رضي اللَّهُ عنهُمَا ألاَ أريكَ امْرَأَةً مِن أَهْلِ الجَنَّة؟ فَقُلت: بلَى، قَالَ: هذِهِ المْرأَةُ السوْداءُ أَتَتِ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالَتْ: إِنِّي أُصْرَعُ، وإِنِّي أَتكَشَّفُ، فَادْعُ اللَّه تَعَالَى لِي قَالَ: "إِن شئْتِ صَبَرْتِ ولكِ الْجنَّةُ، وإِنْ شِئْتِ دعَوْتُ اللَّه تَعالَى أَنْ يُعافِيَكِ"فقَالتْ: أَصْبرُ، فَقالت: إِنِّي أَتَكشَّفُ، فَادْعُ اللَّه أَنْ لا أَتكشَّفَ، فَدَعَا لَهَا. متَّفقٌ عليْهِ.
హజ్రత్ అతా బిన్ అబూ రబాహ్ (రహిమహుల్లాహ్) కథనం : ఒకసారి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారు "నేను నీకు (ఇహలోకంలోనే) స్వర్గ ప్రవేశానికి అర్హత పొందిన స్త్రీని చూపెట్టనా?" అని నాతో అన్నారు. దానికి నేను "తప్పకుండా చూపెట్టండి" అన్నాను. అప్పుడాయన నాకీ విషయం తెలియజేశారు : ఈ నల్లటి మహిళ (ఒకసారి) దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, "నాకు మూర్ఛపోయే రోగముంది. దానివల్ల (ఆ సమయంలో) నా ఒంటిపైన ఆచ్ఛాదనం తొలగిపోతోంది. (ఈ వ్యాధి నయం కావాలని) తమరు నా కోసం దుఆ చేయండి" అని విన్నవించుకుంది. అది విని ఆయన "నువ్వు గనక ఈ బాధపై సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది లేదా నువ్వు కోరితే, అల్లాహ్ నీకు ఈ వ్యాధి నుండి ఉపశమనం కలిగించాలని నేను నీ కోసం దుఆ చేస్తాను" అన్నారు. అందుకామె "సరే అలాగయితే (బాధ కలిగినా ఫరవాలేదు) ఓర్పు వహిస్తాను. అయితే (మూర్ఛపోయే సమయంలో) నా ఒంటి ఆచ్ఛాదనం తొలగిపోతోంది. (నేనా సందర్భంలో) నగ్నం కాకుండా ఉండాలని మాత్రం మీరు దైవాన్ని ప్రార్థించండి" అని అన్నది. ఆమె కోరిక మేరకు దైవప్రవక్త ﷺ ఆవిడ కోసం దుఆ చేశారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం).
English
`Ata’ bin Abu Rabah reported: Ibn `Abbas (radiyallahu anhuma) asked him whether he would like that he should show him a woman who is from the people Jannah. When he replied that he certainly would, he said, “This black woman, who came to the Prophet ﷺ and said, `I suffer from epilepsy and during fits my body is exposed, so make supplication to Allah for me.’ He ﷺ replied: ‘If you wish you endure it patiently and you be rewarded with Jannah, or if you wish, I shall make supplication to Allah to cure you?‘ She said, ‘I shall endure it.’ Then she added: `But my body is exposed, so pray to Allah that it may not happen.’ He (Prophet ﷺ) then supplicated for her”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషికి, తాను నిలకడగా బాధల్ని భరించగలనన్న ధీమా ఉన్నప్పుడు వెసులుబాటుకు బదులు ఎలాగైనా సరే పరీక్షలకు తట్టుకుని నిలబడాలనుకోవటమే ఉత్తమం. దీనిపై అతనికి అపారమైన పుణ్యం, ప్రతిఫలాలు లభిస్తాయి. అదేవిధంగా అనారోగ్యానికి లోనైనప్పుడు వైద్యపరమైన చికిత్సలు పొందుతూనే ఆ రోగం నుంచి ఉపశమనం కోసం దైవాన్ని కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఈ రెండింటిలో దేనినీ వదలకూడదు. ఇవి రెండూ తమ తమ వంతు ప్రయోజనాన్ని మనిషికి చేకూరుస్తాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 35
హదీసు 36
وعنْ أَبي عبْدِ الرَّحْمنِ عبْدِ اللَّه بنِ مسْعُودٍ رضيَ اللَّه عنه قَال: كَأَنِّي أَنْظُرُ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يحْكيِ نَبيّاً مِنَ الأَنْبِياءِ، صلواتُ اللَّهِ وسَلاَمُهُ عَليْهم، ضَرَبُهُ قَوْمُهُ فَأَدْموْهُ وهُو يمْسحُ الدَّم عنْ وجْهِهِ، يقُولُ: "اللَّهمَّ اغْفِرْ لِقَوْمي فإِنَّهُمْ لا يعْلمُونَ "متفقٌ عَلَيْه.
హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఇప్పటికీ నాకు – దైవప్రవక్త ﷺ ప్రవక్తల్లో ఎవరో ఒకరి సంఘటనను గురించి వివరిస్తుంటే నేనాయన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానేమోననిపిస్తోంది. (ఈ విషయంపై నాకు అంత నమ్మకముంది) ఆ ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తసిక్తమయ్యేలా కొట్టారు. అప్పుడు ఆ ప్రవక్త "ఓ దేవా! నా జాతి వారు అమాయకులు. వారికేమీ తెలీదు, నువ్వు వారిని క్షమించు" అని ముఖం నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ దైవాన్ని వేడుకోసాగాడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. ఇంకా సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం).
English
`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: I can still recall as if I am seeing the Messenger of Allah ﷺ resembling one of the Prophets whose people scourged him and shed his blood, while he wiped blood from his face, he said: “O Allah! Forgive my people, because they certainly do not know”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసులో చెప్పబడిన ప్రవక్త, హజ్రత్ నూహ్ (అలైహి) అయివుండవచ్చని కొంతమంది పండితులు భావించగా, కాదు ఆయన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లమేనని మరికొంతమంది తలపోశారు. ఏదిఏమైనా ఈ హదీసులో ఒక దైవప్రవక్తలో ఉండే ఉన్నత నైతికత, ఉదాత్తగుణం విశదీకరించబడింది. ధర్మసందేశ ప్రచారకులకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. ధర్మసందేశ ప్రచార మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలకు ఓర్చుకోవాలని ఈ హదీసు మనకు ప్రబోధిస్తోంది. ధర్మసందేశం అందజేస్తున్నప్పుడు ప్రజలు కరకుగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా చిర్రుబుర్రులాడకుండా, నుదురు చిట్లించకుండా మన్నింపుల వైఖరిని అవలంబించాలి. అంతేకాదు, క్షమాపణ కోసం సన్మార్గ భాగ్య ప్రాప్తికోసం అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఇంకా మూర్ఖుల పట్ల మూర్ఖంగా వ్యవహరించే బదులు మంచితనంతో వారిని చేరదీయాలి. ఈ తరహా ఉన్నత నైతికత, నడవడిక ఒక ధర్మ సందేశ ప్రచారకునికి (దాయీకి) ఎంతైనా అవసరం అని ఈ హదీసు పరోక్షంగా సూచిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 36
హదీసు 37
وَعنْ أَبي سَعيدٍ وأَبي هُرَيْرة رضيَ اللَّه عَنْهُمَا عن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا يُصِيبُ الْمُسْلِمَ مِنْ نَصَبٍ وَلاَ وَصَبٍ وَلاَ هَمٍّ وَلاَ حَزَن وَلاَ أَذًى وَلاَ غمٍّ، حتَّى الشَّوْكَةُ يُشَاكُها إِلاَّ كفَّر اللَّه بهَا مِنْ خطَايَاه" متفقٌ عَلَيهِ. و"الْوَصَب": الْمرضُ.
హజ్రత్ అబూ సయీద్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : "ముస్లింకు అలసట కలిగినా, రోగమొచ్చినా, మనోవ్యథ, దుఃఖం, బాధ కలిగినా – చివరికి అతనికి ముల్లు గుచ్చుకున్నాసరే అల్లాహ్ దాని మూలంగా అతని పాపాలను క్షమిస్తాడు." (బుఖారీ – ముస్లిం)
హదీసులో వచ్చిన పదం 'వసబ్' అంటే రోగం అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం).
English
Abu Sa`id and Abu Hurairah (radiyallahu anhu) reported that the Prophet ﷺ said: “Never a believer is stricken with a discomfort, an illness, an anxiety, a grief or mental worry or even the pricking of a thorn but Allah will expiate his sins on account of his patience”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో విశ్వాసి పట్ల అల్లాహ్ కనబరిచే ప్రత్యేక దయాదాక్షిణ్యాల వైఖరి వివరించబడింది. ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు ఆపదలన్నింటినీ అల్లాహ్ విశ్వాసుల కోసం పాపాల పరిహారంగా మార్చివేస్తాడు. అయితే విశ్వాసి వాటిపై సహనం వహించినప్పుడే అది సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా ఆపదలు వచ్చినప్పుడు ఆందోళన పడిపోవడం, విధివ్రాతను నిందించడం లాంటి చేష్టలకు దిగితే అతను ఒకవైపు పుణ్యఫలాన్ని కోల్పోవడమేగాకుండా మరోవైపు మరిన్ని పాపాల భారాన్ని మోయవలసి వస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 37
హదీసు 38
وعن ابْن مسْعُود رضي اللَّه عنه قَالَ: دَخلْتُ عَلى النَبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُو يُوعَكُ فَقُلْتُ يَا رسُولَ اللَّه إِنَّكَ تُوعكُ وَعْكاً شَدِيداً قَالَ: "أَجَلْ إِنِّي أُوعَكُ كَمَا يُوعَكُ رَجُلانِ مِنْكُم"قُلْتُ: ذلِكَ أَنَّ لَكَ أَجْريْن؟ قَالَ:"أَجَلْ ذَلك كَذَلك مَا مِنْ مُسْلِمٍ يُصِيبُهُ أَذًى، شوْكَةٌ فَمَا فوْقَهَا إلاَّ كَفَّر اللَّه بهَا سَيِّئَاتِهِ، وَحطَّتْ عنْهُ ذُنُوبُهُ كَمَا تَحُطُّ الشَّجرةُ وَرقَهَا" متفقٌ عَلَيهِ. وَ"الْوَعْكُ": مَغْثُ الحمَّى، وَقيلَ: الْحُمى.
హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺ వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. నేనాయనతో "దైవప్రవక్తా! మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉన్నట్టుంది" అన్నాను. దానికి ఆయన "అవును. మీలోని ఇద్దరు మనుషులకు వచ్చే జ్వరం నాకొక్కనికే వస్తుంది" అని చెప్పారు. "మరయితే మీకు పుణ్యం కూడా రెండింతలు లభిస్తుంది" అన్నాను. అందుకు ఆయన "అవును. నీవన్నది నిజమే. ఏ ముస్లింకయినాసరే, అతనికేదయినా బాధ కలిగినా, ముల్లు గుచ్చుకున్నా లేక అంతకన్నా పెద్ద ఆపద ఏదైనా వచ్చిపడినా అల్లాహ్ దాన్ని అతని పాలిట పాపపరిహారంగా చేస్తాడు. దానివల్ల అతని పాపాలు చెట్ల ఆకుల మాదిరిగా రాలిపోతాయి" అని చెప్పారు.
(బుఖారీ – ముస్లిం)
హదీసులో ప్రస్తావనకు వచ్చిన పదం "అల్ – వాకు" అంటే "జ్వరం వల్ల జీర్ణాశయంలో, ప్రేగుల్లో కలిగే బాధ" అని అర్థం. మరికొంతమంది అభిప్రాయంలో సామాన్య జ్వరాన్నే 'అల్-వాకు' అంటారు.
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం).
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: I visited the Prophet ﷺ when he was suffering fever. I said, “You seem to be suffering greatly, O Messenger of Allah.” The Prophet ﷺ replied, “Yes, I suffer as much as two persons.” I said, “Is that because you have a double reward?” He replied that that was so and then said, “No Muslim is afflicted by a harm, be it the pricking of a thorn or something more (painful than that), but Allah thereby causes his sins to fall away just as a tree sheds its leaves”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్తలకు సామాన్య మానవులకంటే ఎక్కువగా కష్టాలు ఎదురౌతాయని, అందుకు వారికి లభించే పుణ్యం కూడా రెట్టింపు అయి ఉంటుందని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఒక విశ్వాసికి ఎక్కువగా కష్టాలు ఎదురౌతున్నాయంటే అది అతని పరిపూర్ణ విశ్వాసానికి తార్కాణమేగాని అతనిపట్ల దైవాగ్రహానికి నిదర్శనం కాదని గ్రహించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 38
హదీసు 39
وعنْ أَبي هُرَيرة رضيَ اللَّهُ عنه قال: قال رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْراً يُصِبْ مِنْهُ": رواه البخاري. وضَبطُوا"يُصِب": بفَتْحِ الصَّادِ وكَسْرِهَا.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: అల్లాహ్ తాను మేలు చేయాలనుకున్న వ్యక్తిని కష్టాలకు గురిచేస్తాడు. (బుఖారీ)
'యుసిబ్' అన్న పదంలో 'స' అక్షరాన్ని ఇకారంతోను, అకారంతోనూ (యుసబ్) రెండు విధాలుగా చదవడం సరైనదే. ఎలా చదివినా అర్థం మారదు.
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణంలో 'వ్యాధి పాపపరిహారం' అన్న అధ్యాయంలో ఈ హదీసు పేర్కొనబడింది.)
English
Abu Hurairah (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said: “He whom Allah intends good, He makes him to suffer from some affliction”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ప్రాపంచిక కష్టాలు, కడగండ్లు, బాధలు, విపత్తులు, రోగాలు, పేదరికం, ధనప్రాణ నష్టాలన్నింటిలోనూ విశ్వాసికి మేలే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో కష్టాలు ఎదురైనప్పుడు అతను దైవం వైపుకు మరలుతాడు. తన అశక్తతను, నిస్సహాయస్థితినీ వ్యక్తపరుస్తూ దీనాతిదీనంగా దైవాన్ని వేడుకుంటాడు. దాంతో అతని పాపాలు మన్నించబడతాయి. కనుక పరలోకం దృష్ట్యా కూడా విశ్వాసికి ఇందులో ఎంతో మేలు ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 39
హదీసు 40
وعَنْ أَنَسٍ رضي اللَّهُ عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا يتَمنينَّ أَحدُكُمُ الْمَوْتَ لِضُرٍّ أَصَابَهُ، فَإِنْ كَانَ لاَ بُدَّ فاعلاً فليقُل: اللَّهُمَّ أَحْيني مَا كَانَت الْحياةُ خَيراً لِي وتوفَّني إِذَا كَانَتِ الْوفاَةُ خَيْراً لِي "متفق عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: మీలో ఎవరూ తనకు బాధ కలిగిందని చావుని కోరుకోరాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనైతే ఈ విధంగా వేడుకోవాలి: "దేవా! జీవితం నా కొరకు మేలుతో కూడుకొని ఉన్నంతవరకూ నన్ను సజీవంగా ఉంచు. మరణమే నా కొరకు శ్రేయస్కరమైనప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు." (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం).
English
Anas (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said, “Let not one of you wish for death because of a misfortune which befalls him. If he cannot help doing so, he should say: ‘O Allah, keep me alive as long as You know that life is better for me, and make me die when death is better for me”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషికి భవిష్యత్తు గురించిన జ్ఞానం లేదు. రానున్న కాలం తన కొరకు శ్రేయస్కరమైనదా కాదా అనే విషయం తనకు తెలీదు కాబట్టి జీవితంలో ఎదురైన కష్టాలకు, బాధలకు కళవళపడిపోయి చావుని కోరుకోరాదు. ఇది చీకట్లో కూర్చొని బాణం విసిరే చందాన ఉంటుంది. ఎందుకంటే మిగిలిన జీవితం అతని కొరకు ప్రాపంచికంగా, పారలౌకికంగా కూడా ఎంతో మేలైనది కావచ్చు. అందుకే మృత్యువును కోరుకోవడాన్ని వారించటం జరిగింది. అయితే దైవమార్గంలో అమరగతి నొందాలని, పుణ్యక్షేత్రాలలో మరణం సంభవించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అవి పై హదీసులోని 'వారింపు' పరిధిలోకి రావు. ఒకవేళ మరణాన్ని కోరుకోవడం తప్పదనుకుంటే మాత్రం హదీసులో ప్రస్తావించబడిన వాక్యాలతో దైవాన్ని ప్రార్థించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 40
హదీసు 41
وعنْ أبي عبدِ اللَّهِ خَبَّابِ بْن الأَرتِّ رضيَ اللَّهُ عنه قَالَ: شَكَوْنَا إِلَى رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُو مُتَوسِّدٌ بُردةً لَهُ في ظلِّ الْكَعْبةِ، فَقُلْنَا: أَلا تَسْتَنْصرُ لَنَا أَلا تَدْعُو لَنَا؟ فَقَالَ: قَد كَانَ مَنْ قَبْلكُمْ يؤْخَذُ الرَّجُلُ فيُحْفَرُ لَهُ في الأَرْضِ فيجْعلُ فِيهَا، ثمَّ يُؤْتِى بالْمِنْشارِ فَيُوضَعُ علَى رَأْسِهِ فيُجعلُ نصْفَيْن، ويُمْشطُ بِأَمْشاطِ الْحديدِ مَا دُونَ لَحْمِهِ وَعظْمِهِ، مَا يَصُدُّهُ ذلكَ عَنْ دِينِهِ، واللَّه ليتِمنَّ اللَّهُ هَذا الأَمْر حتَّى يسِير الرَّاكِبُ مِنْ صنْعاءَ إِلَى حَضْرمْوتَ لاَ يخافُ إِلاَّ اللهَ والذِّئْبَ عَلَى غنَمِهِ، ولكِنَّكُمْ تَسْتَعْجِلُونَ" رواه البخاري. وفي رواية:"وهُوَ مُتَوسِّدٌ بُرْدةً وقَدْ لقِينَا مِنَ الْمُشْركِين شِدَّةً".
హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ ఖబ్బాబ్ బిన్ అరత్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒకసారి కాబాగృహం నీడలో ఒక దుప్పటిని దిండుగా చేసుకొని ఆసీనులై ఉండగా మేము ఆయనకు ఈ విధంగా ఫిర్యాదు చేసుకున్నాము : "(ఓ దైవప్రవక్తా!) మీరు మా కోసం దైవసహాయాన్ని ఎందుకు అర్థించటం లేదు? మా కోసం దుఆ ఎందుకు చేయడం లేదు?" అది విని ఆయన "మీకు పూర్వమయితే (విశ్వసించిన) ఒక వ్యక్తిని పట్టుకొచ్చి, భూమిలో అతనికోసం తవ్విన గుంతలో అతణ్ణి నిలబెట్టేవారు. ఆ తరువాత రంపంతో అతణ్ణి రెండు ముక్కలుగా కోసేవారు. ఇనుప దువ్వెనలతో అతని శరీరాన్ని మాంసం, ఎముకలు బయటపడేదాకా రక్కేవారు. అయినాసరే ఈ కఠిన పరీక్షలన్నీ అతణ్ణి తన ధర్మం నుండి మళ్ళించగలిగేవి కావు. (అందుచేత మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు.) దైవసాక్షి! దేవుడు ఈ పనిని (ధర్మాన్ని పూర్తిచేసి తీరతాడు. అప్పుడు ఒక బాటసారి (ఒంటరిగా) 'సన్ఆ' నుండి హజర్మోత్ నగరం వరకూ నిశ్చింతగా ప్రయాణించగలడు. దారిలో అతనికి అల్లాహ్ భయం, ఇంకా తోడేలు వచ్చి తన మేకల్ని తినేస్తుందేమోనన్న భయం తప్ప మరే భయమూ ఉండదు. కాని మీరు తొందరపడుతున్నారు" అంటూ తన సహచరులకు ధైర్యం చెప్పారు.
(బుఖారీ)
వేరొక ఉల్లేఖనంలో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి: ఆ సమయంలో ఆయన దుప్పటిని దిండుగా చేసుకొని సేదతీర్చుకుంటుండగా మేము బహుదైవారాధకుల ఆగడాలకు గురై ఉన్నాము.
(సహీహ్ బుఖారీలోని – దైవదౌత్య చిహ్నాల ప్రకరణం).
English
Khabbab bin Al-Aratt (radiyallahu anhu) reported: We complained to the Messenger of Allah ﷺ regarding the persecution inflicted upon us by the disbelievers while he was lying in the shade of the Ka`bah, having made a pillow of his cloak. We submitted: “Why do you not supplicate for our prevalence (over the opponents)?”. He ﷺ replied, “Among those people before you, a man would be seized and held in a pit dug for him in the ground and he would be sawed into two halves from his head, and his flesh torn away from his bones with an iron comb; but, in spite of this, he would not wean away from his Faith. By Allah, Allah will bring this matter to its consummation until a rider will travel from San`a’ to Hadramout fearing none except Allah, and except the wolf for his sheep, but you are in too much of a hurry”.[Al-Bukhari].
Another narration is: He ﷺ had placed his cloak under his head and we had been tortured by the polytheists.
ముఖ్యాంశాలు
- ధర్మమార్గంలో కష్టాలు ఎదురవడమనేది ఏ ఒక్క కాలానికో, ఏ ఒక్క వర్గానికో పరిమితం కాళేదు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సత్యధర్మాన్ని అవలంబించినవారికి దుర్మార్గుల నుండి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వారిపై కష్టాల కొండలు విరుచుకుపడ్డాయి. అయినాసరే వారు ఏమాత్రం తొణకలేదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎటువంటి చిత్రహింసలకు గురైనా తాము నమ్మిన ధర్మంపై కదలని కొండలా స్థిరంగా నిలబడ్డారు. కష్టాల కొలిమిలో ఎంత కాలితే అంతే కుందనంలా మెరిసిపోయారు. కాబట్టి ధర్మపథంలో పరీక్షలు ఎదురైనప్పుడు కళవళ పడిపోవడం, ఆందోళన చెందడం ఒక విశ్వాసికి ఎంతమాత్రం శోభించదు.
- ప్రపంచంలో ఇస్లాం విజయం సాధిస్తుంది. లోకంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయనే శుభవార్తలు దైవప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల కాలంలోనే నిజమయ్యాయి. ప్రజలు తమ కళ్లారా వాటిని వీక్షించారు. నేటికీ (పాక్షికంగా నయినాసరే) ఇస్లామీయ చట్టాలు అమల్లో ఉన్న దేశాల్లో, ప్రాంతాల్లో శాంతి పరిఢవిల్లుతోందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 41
హదీసు 42
وعن ابن مَسعُودٍ رضي اللَّه عنه قال: لمَّا كَانَ يَوْمُ حُنَيْنٍ آثَرَ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَاساً في الْقِسْمَةِ: فأَعْطَى الأَقْرعَ بْنَ حابِسٍ مائةً مِنَ الإِبِلِ وأَعْطَى عُييْنَةَ بْنَ حِصْنٍ مِثْلَ ذلِكَ، وأَعطى نَاساً منْ أشرافِ الْعربِ وآثَرهُمْ يوْمئِذٍ في الْقِسْمَةِ. فَقَالَ رجُلٌ: واللَّهِ إنَّ هَذِهِ قِسْمةٌ مَا عُدِلَ فِيها، وَمَا أُريد فِيهَا وَجهُ اللَّه، فَقُلْتُ: واللَّه لأُخْبِرَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فأتيتُهُ فَأخبرته بِما قَالَ، فتغَيَّر وَجْهُهُ حتَّى كَانَ كَالصِّرْفِ. ثُمَّ قَالَ: "فَمنْ يَعْدِلُ إِذَا لَمْ يعدِلِ اللَّهُ ورسُولُهُ؟ ثُمَّ قَالَ: يرحَمُ اللَّهُ مُوسَى قَدْ أُوْذِيَ بِأَكْثَرَ مِنْ هَذَا فَصبرَ" فَقُلْتُ: لاَ جرمَ لاَ أَرْفعُ إلَيه بعْدها حدِيثاً. متفقٌ عَلَيهِ. وقَوْلُهُ"كَالصِرْفَ"هُو بِكسْرِ الصادِ الْمُهْملةِ: وَهُوَ صِبْغٌ أَحْمَرُ.
హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : హునైన్ యుద్ధ దినాన దైవప్రవక్త ﷺ యుద్ధప్రాప్తిని పంపిణీ చేసినప్పుడు కొంతమందికి (ఇస్లాంలో వారి హృదయాలు కుదుటపడాలన్న ఉద్దేశ్యంతో) ప్రాధాన్యతనిచ్చారు. అఖ్రా బిన్ హాబిస్కు ఆయన నూరు ఒంటెలు ఇచ్చారు. ఉయైనా బిన్ హిస్న్కు కూడా అన్ని ఒంటెలే ఇచ్చారు. అరబ్బు ప్రముఖులయిన కొందరికి ఆయన కానుకలు ఇచ్చారు. ఈ యుద్ధసంప్రాప్తి పంపిణీలో కూడా ఆ రోజు వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఒక వ్యక్తి (ఇది చూసి) "దైవసాక్షి! ఈ పంపకంలో న్యాయం జరగలేదు. పంపిణీలో దైవప్రసన్నతా ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకోలేదు" అని అన్నాడు. ఇది విని నేను "దైవసాక్షి! తప్పకుండా నేనీవిషయం దైవప్రవక్తకు తెలియజేస్తాను" అని అన్నాను. నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాను. ఈ విషయం విన్న వెంటనే ఆయన వదనంలో మార్పు వచ్చింది. ముఖం ఎర్రబారింది. తరువాత ఆయన "దేవుడు మరియు ఆయన ప్రవక్తే న్యాయం చేయకపోతే ఇంకెవడు న్యాయం చేస్తాడు?" అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇంకా ఇలా అన్నారు : ప్రవక్త మూసాపై అల్లాహ్ దయదలచుగాక! ఆయన (తన జాతి ప్రజలచేత) ఇంతకన్నా ఎక్కువగానే బాధించబడ్డారు. అయినప్పటికీ ఆయన సహనం వహించారు."
ఆ తరువాత ఇంకెప్పుడూ నేను ఆయనకు ఏ విషయమూ తెలియపరచరాదని మనసులో నిశ్చయించుకున్నాను.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని "యుద్ధప్రాప్తిలో ఐదోవంతు ఫర్జ్" అన్న ప్రకరణం. సహీహ్ ముస్లింలో జకాత్ ప్రకరణం).
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: After the battle of Hunain, Messenger of Allah ﷺ favoured some people in the distribution of spoils (for consolation). He gave Al-Aqra` bin Habis and `Uyainah bin Hisn a hundred camels each and showed favour also to some more honourable persons among the Arabs. Someone said: “This division is not based on justice and it was not intended to win the Pleasure of Allah.” I said to myself: “By Allah! I will inform Messenger of Allah ﷺ of this.” I went to him and informed him. His face became red and he said, “Who will do justice if Allah and His Messenger do not?” Then he said, “May Allah have mercy on (Prophet) Musa (Moses); he was caused more distress than this but he remained patient.” Having heard this I said to myself: “I shall never convey anything of this kind to him in future”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సమకాలీన పరిస్థితులు, అవసరాల దృష్ట్యా కొత్తగా ఇస్లాం స్వీకరించినవారికి, సమాజంలో పేరు ప్రతిష్ఠలు, పదవీప్రాబల్యాలు కల్గి నూతనంగా ఇస్లాంలో చేరినవారికి ధర్మపరివర్తన అనంతరం వారి హృదయాలు కుదుటపడాలన్న సదుద్దేశ్యంతో వారికి ఇతర ముస్లింలకన్నా కొంచెం ఎక్కువ మోతాదులో సొమ్మును ప్రదానం చేసే విచక్షణాధికారం ఒక ఖలీఫా లేక ముస్లింల చక్రవర్తికి ఉంటుంది. ఇకపోతే పై హదీసులో దైవప్రవక్త ﷺ గారి పంపకంపై అభ్యంతరం లేవనెత్తిన వ్యక్తి ఒకానొక కపట విశ్వాసి అని ఇతర ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. నిజమైన విశ్వాసులు ఎన్నడూ దైవప్రవక్త అన్యాయం చేశారని నిందించిన పాపాన పోలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, సామాన్య మానవుల్లాగే దైవప్రవక్త ﷺ కూడా ఇతరుల మాటలకు ప్రభావితులై అప్రసన్నులవడమో లేక సంతోషం వెలిబుచ్చటమో చేసేవారని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి ఒక మానవుడే. మానవాతీత వ్యక్తి కారు. పరిస్థితుల ప్రభావం మనోమస్తిష్కాలపై పడటం మానవ సహజం అని మరువరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 42
హదీసు 43
وعن أنس رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا أَرَادَ اللَّهُ بعبْدِهِ خَيْراً عجَّلَ لَهُ الْعُقُوبةَ في الدُّنْيَا، وإِذَا أَرَادَ اللَّه بِعبدِهِ الشَّرَّ أمسَكَ عنْهُ بذَنْبِهِ حتَّى يُوافِيَ بهِ يَومَ الْقِيامةِ". وقَالَ النبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ عِظَمَ الْجزاءِ مَعَ عِظَمِ الْبلاءِ، وإِنَّ اللَّه تَعَالَى إِذَا أَحَبَّ قَوماً ابتلاهُمْ، فَمنْ رضِيَ فلَهُ الرضَا، ومَنْ سَخِطَ فَلَهُ السُّخْطُ "رواه الترمذي وقَالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అల్లాహ్ తన దాసునికి మేలు చేయాలని సంకల్పించుకుంటే (అతని పాపాలకు పర్యవసానంగా) ఇహలోకంలోనే తొందరగా అతణ్ణి శిక్షిస్తాడు. (అంటే కష్టాలు, పరీక్షలకు గురిచేసి అతని పాపాలు సమసిపోయేలా చేస్తాడు.) ఒకవేళ అల్లాహ్ తన దాసునికి కీడు తలపెట్టదలిస్తే అతని పాపాల పర్యవసానాన్ని (ఇహలోకంలో ఇవ్వకుండా) నిలిపి ఉంచుతాడు. చివరికి ప్రళయ దినాన అతణ్ణి పూర్తిగా శిక్షిస్తాడు." ఇంకా ఆయన ఇలా అన్నారు : ప్రతిఫలం (పుణ్యం)లో శ్రేష్ఠత పరీక్ష తీవ్రతను బట్టి ఉంటుంది. (అంటే పరీక్ష ఎంత కఠినంగా ఉంటే దానికి లభించే పుణ్యం కూడా అంతగొప్పగా ఉంటుంది.) అల్లాహ్ ఏ జాతివారినయినా ఎక్కువగా అభిమానించినప్పుడు వారిని కష్టాలకు లోనుచేస్తాడు. అయితే వారిలో ఎవడైతే సహనం ప్రదర్శిస్తాడో అతనికి దైవప్రసన్నత లభిస్తుంది. మరెవడైతే (ఆ కష్టాలకు కళవళ పడిపోయి) దైవంపట్ల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడో అతడికి దైవాగ్రహమే దక్కుతుంది. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు).
English
Anas (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said, “When Allah intends good for His slave, He punishes him in this world, but when He intends an evil for His slave, He does not hasten to take him to task but calls him to account on the Day of Resurrection.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ప్రపంచంలో విశ్వాసికి ఎదురయ్యే పరీక్షలు కూడా దైవానుగ్రహంతో సమానమని ఈ హదీసులో చెప్పబడింది. పరీక్షల కాఠిన్యతనుబట్టి అతని పాపాలు సమసిపోయి, దేవుని దగ్గర అతని పుణ్యఫలాలు అధికమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కష్టంపై, బాధపై సహనం వహించడం అవసరం. సహనం లేనిదే అలాంటి భాగ్యాన్ని పొందలేము. అంతేకాదు, అసహనం వల్ల పాపాలు మరిన్ని పెరిగిపోతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 43
హదీసు 44
وعنْ أَنَسٍ رضي اللَّه عنه قَالَ: كَانَ ابْنٌ لأبي طلْحةَ رضي اللَّه عنه يَشْتَكي، فَخَرَجَ أبُو طَلْحة، فَقُبِضَ الصَّبِيُّ، فَلَمَّا رَجَعَ أَبُو طَلْحةَ قَالَ: مَا فَعَلَ ابنِي؟ قَالَت أُمُّ سُلَيْم وَهِيَ أُمُّ الصَّبيِّ: هُوَ أَسْكَنُ مَا كَانَ، فَقَرَّبَتْ إِلَيْهِ الْعَشَاءَ فَتَعَشَّى، ثُمَّ أَصَابَ مِنْهَا، فَلَمَّا فرغَ قَالَتْ: وارُوا الصَّبيَّ، فَلَمَّا أَصْبحَ أَبُو طَلْحَة أَتَى رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَخْبرهُ، فَقَالَ: "أَعرَّسْتُمُ اللَّيْلَةَ؟ قَالَ: نَعَمْ، قَالَ:"اللَّهمَّ باركْ لَهُما "فَولَدتْ غُلاماً فقَالَ لِي أَبُو طَلْحَةَ: احْمِلْهُ حتَّى تَأَتِيَ بِهِ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وبَعثَ مَعهُ بِتمْرَات، فَقَالَ:"أَمعهُ شْيءٌ؟ "قَالَ: نعمْ، تَمراتٌ فَأَخَذَهَا النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَمضَغَهَا، ثُمَّ أَخذَهَا مِنْ فِيهِ فَجَعَلَهَا في فِيِّ الصَّبيِّ ثُمَّ حَنَّكَه وسمَّاهُ عبدَ اللَّهِ متفقٌ عَلَيهِ. وفي روايةٍ للْبُخَاريِّ: قَالَ ابْنُ عُيَيْنَة: فَقَالَ رجُلٌ منَ الأَنْصارِ: فَرَأَيْتُ تَسعة أَوْلادٍ كلُّهُمْ قدْ قَرؤُوا الْقُرْآنَ، يعْنِي مِنْ أَوْلادِ عَبْدِ اللَّه الْموْلُود. وَفي روايةٍ لمسلِم: ماتَ ابْنٌ لأبِي طَلْحَةَ مِنْ أُمِّ سُلَيْمٍ، فَقَالَتْ لأهْلِهَا: لاَ تُحَدِّثُوا أَبَا طَلْحَةَ بابنِهِ حتَّى أَكُونَ أَنَا أُحَدِّثُهُ، فَجَاءَ فَقَرَّبَتْ إِلَيْهِ عَشَاءً فَأَكَلَ وشَرِبَ، ثُمَّ تَصنَّعتْ لهُ أَحْسنَ مَا كانتْ تَصَنَّعُ قَبْلَ ذلكَ، فَوقَعَ بِهَا، فَلَمَّا أَنْ رأَتْ أَنَّهُ قَدْ شَبِعِ وأَصَابَ مِنْها قَالتْ: يَا أَبَا طلْحةَ، أَرَايْتَ لَوْ أَنَّ قَوْماً أَعارُوا عارِيتهُمْ أَهْل بيْتٍ فَطَلبوا عاريَتَهُم، ألَهُمْ أَنْ يمْنَعُوهَا؟ قَالَ: لا، فَقَالَتْ: فاحتسِبْ ابْنَكَ. قَالَ: فغَضِبَ، ثُمَّ قَالَ: تركتنِي حتَّى إِذَا تَلطَّخْتُ ثُمَّ أَخْبرتِني بِابْني، فَانْطَلَقَ حتَّى أَتَى رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فأخْبَرهُ بِمَا كَانَ، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "بَاركَ اللَّه لكُما في ليْلتِكُما". قَالَ: فحملَتْ، قَالَ: وكَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في سفَرٍ وهِي مَعَهُ وكَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا أَتَى الْمَدِينَةِ مِنْ سَفَرٍ لاَ يَطْرُقُها طُرُوقاً فَدنَوْا مِنَ الْمَدِينَةِ، فَضَرَبَهَا الْمَخاضُ، فَاحْتَبَس عَلَيْهَا أَبُو طلْحَةَ، وانْطلَقَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. قَالَ: يقُولُ أَبُو طَلْحةَ إِنَّكَ لتعلمُ يَا ربِّ أَنَّهُ يعْجبُنِي أَنْ أَخْرُجَ معَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا خَرَجَ، وأَدْخُلَ مَعهُ إِذَا دَخَلَ، وقَدِ احْتَبَسْتُ بِما تَرى. تقولُ أُمُّ سُلَيْمٍ: يَا أَبَا طلْحةَ مَا أَجِد الَّذي كنْتُ أَجِدُ، انْطَلِقْ، فانْطَلقْنَا، وضَربهَا المَخاضُ حينَ قَدِمَا فَولَدتْ غُلاماً. فقالَتْ لِي أُمِّي: يا أَنَسُ لا يُرْضِعُهُ أَحدٌ تَغْدُوَ بِهِ عَلَى رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فلمَّا أَصْبحَ احتملْتُهُ فانطَلقْتُ بِهِ إِلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. وذَكَرَ تمامَ الْحَدِيثِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : అబూ తల్హా (రదియల్లాహు అన్హు)గారి పిల్ల వాడొకడు జబ్బు పడ్డాడు. అయితే ఆయన (పని నిమిత్తం) ఎక్కడికో బయటికి వెళ్ళి ఉన్న సమయంలోనే ఆ పసివాడు చనిపోయాడు. ఆయన ఇంటికి తిరిగివచ్చిన తరువాత "బాబు ఎలా ఉన్నాడు?" అని ఇంట్లో అడిగారు. దానికి ఆ పసివాడి తల్లి హజ్రత్ ఉమ్మె సులైమ్ "బాబు మునుపుకన్నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు" అని భర్తను సముదాయించి, రాత్రి భోజనం వడ్డించారు. ఆయన తృప్తిగా భోజనం చేశారు. తరువాత భార్యతో సంభోగం కూడా జరిపారు. సమాగమం పూర్తయిన తరువాత ఆవిడ తన భర్తకు (ఆయన బయటికి వెళ్ళివున్నప్పుడు పిల్లవాడు చనిపోయిన సంగతి తెలియజేసి), "ఇక అబ్బాయికి ఖనన సంస్కారాలు చేసి రండి" అని చెప్పింది. (ఆ రాత్రి ఖనన సంస్కారాలు జరిగాయి.) తెల్లవారాక అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి రాత్రి జరిగిన వృత్తాంతమంతా ఆయనకు వివరించారు. ఆ సంగతి విని ఆయన "గత రాత్రి నువ్వు నీ భార్యతో సమాగమం జరిపావా?" అని ప్రశ్నించారు. దానికాయన అవునని సమాధానమిచ్చారు. ఆ సమాధానం విని దైవప్రవక్త ﷺ ఆ దంపతుల కోసం "ఓ దేవా! వీరిద్దరికీ శుభాన్ని కలుగజేయి" అని ప్రార్థించారు.
దైవప్రవక్త ప్రార్థన ఫలితంగా కొంతకాలానికి ఆయన భార్యకు మరో అబ్బాయి పుట్టాడు. (హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అంటున్నారు): అబూ తల్హా నాకు కొన్ని ఖర్జూర పండ్లు ఇచ్చి "ఈ చంటోణ్ణి దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకువెళ్ళు" అని ఆదేశించారు. (తండ్రి ఆజ్ఞ ప్రకారం అనస్ (రదియల్లాహు అన్హు) బాబుని దైవప్రవక్త వద్దకు తీసుకొనివెళ్ళారు.) అప్పుడు ఆయన "బాబుతో పాటు మరేమైనా తెచ్చావా?" అనడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) "అవును, కొన్ని ఖర్జూరపండ్లు తెచ్చానండీ" అని చెప్పారు. దైవప్రవక్త ﷺ ఆ ఖర్జూరాలను నోట్లోవేసుకొని నమిలారు. తరువాత వాటిని తన నోటినుండి తీసి ఆ పసివాడి నోట్లో పెట్టారు. ఈ విధంగా ఆయన ఆ పిల్లవాడికి ఉగ్గుపోసి "అబ్దుల్లాహ్" అని నామకరణం చేశారు.
(బుఖారీ – ముస్లిం)
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇబ్నె ఉయైనా అన్సార్లలోని ఒకరు తనకు ఈ విధంగా తెలియజేశారని అన్నారు : నేను (అబ్దుల్లాహ్ గారి) తొమ్మిదిమంది కుమారులను చూశాను. వారంతా ఖురాన్ చదువుకున్నవారే.
ముస్లింలోని ఒకానొక ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది : ఉమ్మె సులైమ్ ద్వారా పుట్టిన అబూ తల్హా (రదియల్లాహు అన్హా) పిల్లవాడొకడు చనిపోయాడు. ఉమ్మె సులైమ్ తన ఇంట్లో వాళ్ళని బాబు చనిపోయాడన్న సంగతి మీరెవరూ అబూ తల్హాకు చెప్పవద్దనీ, స్వయంగా నేనే ఆయనకు తెలియపరుస్తానని చెప్పారు. (కొంత సేపటికి) అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇంటికి వచ్చారు. ఉమ్మె సులైమ్ (ర.అన్హా) ఆయనకు రాత్రి అన్నం వడ్డించారు. అబూ తల్హా భోజనాదులు ముగించారు. తరువాత ఆమె మునుపటికన్నా బాగా అలంకరించుకొని అందంగా తయారై భర్త దగ్గరికి వచ్చారు. ఆయన ఆమెతో సమాగమం జరిపారు. ఆయన రతిలో పూర్తిగా తృప్తిచెందారని భావించాక ఆమె తన భర్తను "ఓ అబూ తల్హా! మీరే చెప్పండి! కొందరు ఒక ఇంటివారికి ఏదైనా వస్తువు కొంతకాలం పాటు వాడుకోవటానికి ఇచ్చారనుకోండి. ఆ తరువాత వారు తమ వస్తువుని వాపసు చేయమని కోరితే ఆ ఇంటివాళ్ళు ఇవ్వకుండా ఉండటం భావ్యమేనా?" అని చూచాయగా ప్రశ్నిం చారు. దానికి అబూ తల్హా (రదియల్లాహు అన్హు) అది సరైన పద్ధతి కాదని సమాధానం చెప్పారు. వెంటనే ఆమె "మరయితే మీరు మీ బాబు విషయంలో అల్లాహ్ నుండి పుణ్యాన్ని ఆశించండి" అన్నారు. (అంటే మీ అబ్బాయి కూడా దేవుడిచ్చిన అప్పగింతలాంటివాడు. తన అప్పగింతను దేవుడు వాపసు తీసేసుకున్నాడు.) ఈ మాట విని ఆయన కోపంతో మండి పడ్డారు. "నాకీ విషయం ముందుగా చెప్పకుండా ఎందుకు వదిలేశావు? నేను నీతో కలిసి మలినమైన తరువాత బాబు చనిపోయాడన్న సంగతి చెబుతావా?" అని రుసరుసలాడారు. (ఆ తరువాత) ఆయన వెళ్ళిపోయారు. దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు. అది విని దైవప్రవక్త ﷺ "అల్లాహ్ మీరిద్దరూ కలిసిన ఈ రాత్రిలో శుభాన్ని కలుగజేయుగాక!" అని ప్రార్థించారు. ఆ తరువాత (కొంత కాలానికి) ఉమ్మె సులైమ్ మళ్ళీ గర్భవతి అయ్యారు.
అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు : దైవప్రవక్త ﷺ ఒకానొక ప్రయాణంలో ఉన్నారు. ఉమ్మె సులైమ్ కూడా (తన భర్తతో పాటు) దైవప్రవక్త పయన బృందంలో ఉన్నారు. దైవప్రవక్త ﷺ సాధారణంగా ప్రయాణం నుండి మదీనాకు తిరిగొచ్చినప్పుడు రాత్రిపూట వచ్చేవారు కాదు. ప్రయాణీకుల బృందం మదీనా నగర సమీపానికి చేరుకుంటుండగా ఉమ్మె సులైమ్కు పురిటినొప్పులు మొదలయ్యాయి. అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కూడా ఆమె కోసం ఆగాల్సి వచ్చింది. దైవప్రవక్త ﷺ మాత్రం (ఆగకుండా) ప్రయాణం కొనసాగించారు.
అనస్ (రదియల్లాహు అన్హు) ఉవాచ : అప్పుడు అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇలా వేడుకోసాగారు – "ఓ ప్రభూ! దైవప్రవక్త ﷺ మదీనా నగరం నుండి బయటికి వెళ్ళినప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాలనీ, ఆయన మదీనా నగరంలోకి ప్రవేశించేటప్పుడు ఆయనతో పాటే ప్రవేశించాలని నేను కోరుకుంటానని నీకు తెలుసు. కాని ఇప్పుడు నేను (దైవప్రవక్త వెనుక ఆగిపోవటం నీవు చూస్తూనే ఉన్నావు)."
ఉమ్మె సులైమ్ (ర.అన్హా) (ఆయన మాటలు విని) "అబూ తల్హా! ఇంతకు ముందు నాకు కలిగిన నొప్పి ఇప్పుడు లేదు. పదండి, (మనం కూడా వెళ్ళిపోదాం)" అని అన్నారు.
తరువాత మేమందరం కూడా బయలుదేరాము. ఆ దంపతులు మదీనాకు చేరుకోగానే ఆమెకు మళ్ళీ ప్రసవవేదన మొదలయ్యింది. (కొంతసేపటికి) ఆమెకు ఒక బాబు పుట్టాడు. అప్పుడు మా అమ్మ (ఉమ్మె సులైమ్) నాతో "రేపు ఉదయం నువ్వు వీణ్ణి దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకువెళ్ళే వరకూ వీడికి ఏ పాలూ త్రాపించకూడదు" అని చెప్పింది. తెల్లవారగానే నేను ఆ పసికందును దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకువెళ్ళాను. (తరువాత ఏం జరిగిందో క్రితం హదీసులో ప్రస్తావించడం జరిగింది.)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని సంస్కార ప్రకరణం).
English
Anas (radiyallahu anhu) reported: One of the sons of Abu Talhah (radiyallahu anhu) was ailing. Abu Talhah went out and the boy died in his absence. When he came back, he inquired, “How is the boy?”. Umm Sulaim, the mother of the boy, replied, “Better than before”. Then she placed his evening meal before him and he ate it; and thereafter slept with her. At last, she said to him: “Arrange for the burial of the boy”. In the morning, Abu Talhah went to Messenger of Allah ﷺ and informed him of the event. He enquired, “Did you sleep together last night?” Abu Talhah replied in the affirmative, on which the Prophet ﷺ supplicated, “O Allah bless them.” Thereafter, she gave birth to a boy. Abu Talhah said to me: “Take up the boy and carry him to the Prophet ﷺ”; and he sent some dates with him. The Prophet ﷺ enquired, “Is there anything with him?” He said; “Yes, some dates”. The Prophet ﷺ took a date, chewed it and put it in the mouth of the baby and rubbed the chewed date around the baby’s gum and named him `Abdullah.[Al-Bukhari and Muslim].
The narration in Bukhari adds: Ibn `Uyainah relates that a man from the Ansar told him that he had seen nine sons of this `Abdullah, every one of whom had committed the Noble Qur’an to memory.
The narration of Muslim says: The son of Abu Talhah (radiyallahu anhu) who was born of Umm Sulaim died. She (Umm Sulaim) said to the members of the family: “Do not tell Abu Talhah about his son until I mention it to him myself.” Abu Talhah came (home) and she gave him supper. He ate and drank. She then beautified herself the best way she ever did and he slept with her. When she saw that he was satisfied after sexual intercourse with her, she said, “O Abu Talhah! If some people borrow something from another family and then (the members of the family) ask for its return, would they refuse to give it back to them.” He said, “No”. She said, “Then hope reward for your son”. Abu Talhah got angry, and said; “You left me uninformed until I stained myself (with sexual intercourse) and then you told me about my son. “He went to Messenger of Allah ﷺ and informed him about the matter. Thereupon Messenger of Allah ﷺ said, “May Allah bless the night you spent together!” He (the narrator) said: She conceived. (One day) Messenger of Allah ﷺ was in the course of a journey and she was along with him. When Messenger of Allah ﷺ used to come back to Al-Madinah from a journey, he would not enter it (during the night). When the people came near Al-Madinah, she felt labour pains. He (Abu Talhah) remained with her and Messenger of Allah ﷺ proceeded on. Abu Talhah said: “O Rubb, You know that I love to go along with Messenger of Allah ﷺ when he goes out and enter along with him when he enters, and I have been detained as You see.” Umm Sulaim then said: “O Abu Talhah, I do not feel (so much pain) as I was feeling earlier, so we better proceed on. So we proceeded on and she felt the labour of delivery as they reached (Al-Madinah). She gave birth to a male child. My mother said to me: “O Anas, none should suckle him until you go to Messenger of Allah ﷺ tomorrow morning.” The next morning I carried the baby with me to Messenger of Allah ﷺ, and narrated the rest of the story. [Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- సామాజిక జీవనంలో మనిషి ఏవిధంగా మసలుకోవాలో ఈ హదీసు బోధపరుస్తోంది. హదీసులో సహనశీలి, సద్గుణ సంపన్నురాలైన ఓ మహిళ పాత్ర అందుకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన కొడుకు చనిపోయినప్పటికీ ఎలాంటి ఏడ్పులు, రోదింపులు లేకుండా దైవం నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ అత్యుత్తమ రీతిలో సహనం ప్రదర్శించిందంటే ఇది ఆమె మనో నిబ్బరానికీ, మొక్కవోని విశ్వాసానికి నిదర్శనం. అంతేకాదు, ఆమె అలసిసొలసి ఇంటికి తిరిగొచ్చిన భర్తను బాబు క్షేమంగా, నిక్షేపంగా ఉన్నాడని సముదాయించింది. ఆయనకు సపర్యలు చేసిన తరువాత గాని అబ్బాయి చనిపోయాడన్న సంగతి చెప్పలేదు. భర్తకు సేవచేయడం, అతనికి మనో ఉల్లాసాన్ని అందించడం ముస్లిం అయిన ప్రతి ఇల్లాలి విధి అన్న సంగతి దీని ద్వారా విదితమవుతోంది.
- భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య అలంకరించుకొని, ముస్తాబై భర్త ముందుకు రావడం అభిలషణీయం.
- శిశువు జన్మించినప్పుడు ఏ సత్పురుషుని వద్దకన్నా తీసుకెళ్ళి శిశువుకు ఉగ్గుపోయించడం ధర్మసమ్మతమే.
- కష్టాలు ఎదురైనప్పుడు దైవ నిర్ణయాలపట్ల తన ఆమోదాన్ని తెలిపే దాసునికి అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు.
- స్త్రీలు కూడా యోధులతోపాటు ధర్మయుద్ధానికి వెళ్ళవచ్చు. అయితే అక్కడ దేవుని హద్దులకు లోబడి ఉండి దైవమార్గంలో పోరాడే యోధుల గాయాలకు కట్లుకట్టడం, రోగుల్ని పరామర్శించడం, అన్నపానీయాలు సమకూర్చడం వంటి సేవలు అందించాలి.
- దంపతులు ఒండొకరిని ఓదార్చే ఉద్దేశ్యంతో అన్యాపదేశంగా శ్లేషభావాలను స్ఫురించే పదజాలాన్ని వాడవచ్చు. దీనినే అరబీలో 'తౌరియా' అంటారు. అది అబద్ధం క్రిందికి రాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 44
హదీసు 45
وعنْ أَبِي هُريرةَ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيْسَ الشديدُ بالصُّرَعةِ إِنمَّا الشديدُ الَّذي يمْلِكُ نَفسَهُ عِنْد الْغَضَبِ "متفقٌ عَلَيهِ. "والصُّرَعَةُ"بِضمِّ الصَّادِ وفتْحِ الرَّاءِ، وأصْلُهُ عنْد الْعربِ منْ يصرَعُ النَّاسَ كثيراً.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : కుస్తీపట్టి ఇతరులను చిత్తుచేసేవాడు పరాక్రమశాలి కాడు. కోపం వచ్చినప్పుడు తన్ను తాను అదుపులో పెట్టుకోగలిగినవాడే నిజమైన పరాక్రమశాలి (పహిల్వాను).
(బుఖారీ – ముస్లిం)
'సురఆ' 'స'పై ఉకారం, 'ర'కు అకారం. అనేకమందిని చిత్తుచేసినవాడిని అరబ్బులు 'సురఆ' అని పిలిచేవారు.
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం. సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం).
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The strong man is not one who is good at wrestling, but the strong man is one who controls himself in a fit of rage.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
కోపం వచ్చినప్పుడు అహంకారంతో ఇతరులపై ప్రతాపం చూపేబదులు సాధ్యమైనంతవరకు ఆ కోపాన్ని దిగమ్రింగడానికి ప్రయత్నించాలని ఈ హదీసు బోధిస్తోంది. కోపం వచ్చినప్పుడు కయ్యానికి కాలుదువ్వి ఇతరులపై బలప్రదర్శన చేయటం బలవంతుల సామాన్య లక్షణం. అయితే ముంచుకువస్తున్న ఆ క్రోధాన్ని అణచుకొని, ఎదుటి వారిని చిత్తుచేసే బలం ఉండి కూడా క్షమించి వదలివేయడమనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మనసులో దేవుని భయమున్న ఒక విశ్వాసి మాత్రమే అలాంటి సంయమనం ప్రదర్శించగలడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 45
హదీసు 46
وعنْ سُلَيْمانَ بْنِ صُرَدٍ رضي اللَّه عنهُ قَالَ: كُنْتُ جالِساً مَعَ النَّبِي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ورجُلان يستَبَّانِ وأَحدُهُمَا قَدِ احْمَرَّ وَجْهُهُ. وانْتفَخَتْ أودَاجهُ. فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنِّي لأعلَمُ كَلِمةً لَوْ قَالَهَا لَذَهَبَ عنْهُ مَا يجِدُ، لوْ قَالَ: أَعْوذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ذَهَبَ منْهُ مَا يجدُ "فقَالُوا لَهُ: إِنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"تعوَّذْ بِاللِّهِ مِن الشَّيَطان الرَّجِيمِ". متفقٌ عَلَيهِ.
హజ్రత్ సులైమాన్ బిన్ సుర్ద్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺ వద్ద కూర్చొని ఉండగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం దూషించుకుంటున్నారు. వారిద్దరిలో ఒకతని ముఖం (ఆగ్రహంతో) కందిపోయింది. నరాలు ఉబ్బుకొచ్చాయి. అది చూసి దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : "నాకు ఒక సూక్తి తెలుసు. ఇతను గనక దాన్ని పఠిస్తే ఇతని కోపం దూరమయిపోతుంది. ఈ వ్యక్తి గనక "అవూజుబిల్లాహి మినష్షైతానిర్రజీం" (శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడు తున్నాను) అని అంటే ఇతని కోపోద్రే కాలు చల్లారిపోతాయి."
(ఆ తరువాత) అక్కడివారు ఆ వ్యక్తినుద్దేశించి "దైవప్రవక్త ﷺ నిన్ను శాపగ్రస్తుడైన షైతాన్ బారినుండి అల్లాహ్ శరణు వేడుకోమంటున్నార"ని చెప్పారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని 'సృష్టి ఆరంభ' ప్రకరణం. సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం).
English
Sulaiman bin Surad (radiyallahu anhu) reported: I was sitting with the Prophet ﷺ when two men began to quarrel and curse each other and the face of one of them turned red and the veins of his neck were swollen (from rage). Messenger of Allah ﷺ said, “I know of a word, if he were to utter that, his rage would vanish and that is: A`udhu billahi minash-Shaitan nir-rajim (I seek refuge with Allah from Satan, the accursed).” So they (Companions) said to him: “The Prophet ﷺ tells you to utter: ‘I seek refuge with Allah from Satan, the accursed”.[Al-Bukhariand Muslim].
ముఖ్యాంశాలు
మనిషి కోపావేశంలో ఉన్నప్పుడు, ఈ కోపం షైతాన్ దుష్ప్రేరణ వల్ల వచ్చిందని భావించి, దాన్నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ఈ మేల్కొలుపే అతని క్రోధానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఆగ్రహోదగ్రులై అదుపుతప్పి ప్రవర్తించేవారు హదీసులో చెప్పబడిన 'తఅవ్వుజ్' (శరణువేడే) సూక్తిని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 46
హదీసు 47
وعنْ مُعاذ بْنِ أَنَسٍ رضي اللَّه عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كظَمَ غَيظاً، وهُو قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللَّهُ سُبْحانَهُ وتَعالَى عَلَى رُؤُوسِ الْخلائقِ يَوْمَ الْقِيامَةِ حَتَّى يُخَيِّرَهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ" رواه أَبُو داوُدَ، والتِّرْمِذيُّ وَقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ ముఆజ్ బిన్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : కోపాన్ని ప్రదర్శించే శక్తిసామర్థ్యాలు ఉండి కూడా ఆ కోపాన్ని దిగమ్రింగేవాణ్ణి దేవుడు ప్రళయదినాన సృష్టి రాసులందరి ముందుకు పిలిచి అతనితో (స్వర్గంలోని) విశాలమైన కన్నులుగల సుందరాంగుల్లో నీకు నచ్చిన ఆమెను ఎంపిక చేసుకోవచ్చని అంటాడు. (ఈ హదీసును అబూదావూద్ మరియు తిర్మిజీలు ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ దీనిని హసన్‌గా ఖరారు చేశారు.)
(అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం. తిర్మిజీలోని "కల్పాంత అభివర్ణన" ప్రకరణం).
English
Mu`adh bin Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The one who suppresses anger and has the power to give effect to it, will be called out by Allah, the Exalted, to the forefront of the creatures on the Day of Resurrection and he will be asked to choose any of the virgins (Hur) of his liking”.[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
- 'హూర్' అనేది 'హౌరా' అనే పదానికి బహువచనం. అత్యంత శ్వేత వన్నె చర్మం కలిగిన స్త్రీ అని దీనర్థం. ఇంకా 'ఈన్' అనేది 'ఐనా' అనే పదానికి బహువచనం. అంటే విశాలమైన కన్నులు కలదని భావం. ఈ రెండు పదాలు కూడా స్వర్గంలో విశ్వాసులకు ప్రసాదించబడే అత్యంత సౌందర్యవతులైన స్త్రీలను సూచిస్తున్నాయి.
కసి తీర్చుకునే శక్తిసామర్థ్యాలు, బలాధికారాలు, అనుకూల పరిస్థితులు ఉండి కూడా కేవలం దైవాజ్ఞను శిరసావహిస్తూ కోపాన్ని దిగమ్రింగి, ఆగ్రహావేశాలను అణచుకొని బలప్రదర్శనకు పూనుకోకుండా సహనం వహించే శక్తి మహత్యం, పరలోకంలో అతనికి లభించే పుణ్యఫలాలు కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 47
హదీసు 48
وعنْ أَبِي هُريْرَةَ رَضيَ اللَّهُ عنهُ أَنَّ رَجُلاً قَالَ للنَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أوْصِني، قَالَ: "لا تَغضَبْ"فَردَّدَ مِراراً قَالَ،"لا تَغْضَبْ" رواه البخاريُّ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺను "నాకేమైనా ఉపదేశించండి" అని కోరాడు. అందుకు ఆయన "కోపగించుకోకు" అన్నారు. అతను పలుమార్లు అదే ప్రశ్నవేశాడు. ప్రతిసారీ ఆయన "కోపగించుకోకు" అనే తాకీదు చేశారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం).
English
Abu Hurairah (radiyallahu anhu) reported: A man asked the Prophet ﷺ for an advice and he ﷺ said, “Do not get angry”. The man repeated that several times and he replied, “Do not get angry”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
- ప్రాపంచిక వ్యవహారాల్లో చీటికిమాటికి చిర్రుబుర్రులాడటం తప్పే అయినప్పటికీ, దేవుడు విధించిన హద్దులు అతిక్రమించబడుతున్నప్పుడు మనిషికి కలిగే ఆగ్రహం, ఉక్రోషం మాత్రం ప్రశంసనీయమే. ఎందుకంటే ఇది ధర్మంపట్ల మనిషికున్న అభిమానాన్ని, విశ్వాసాన్ని సూచిస్తుంది.
- ప్రతి చిన్న విషయానికీ కోపగించుకునే స్వభావమున్న వ్యక్తి తన బలహీనతను తెలుసుకొని దాన్ని దూరం చేసుకునేందుకు ప్రయత్నించుకోవడానికి వీలుగా మాటిమాటికీ అతనికి కోపం వల్ల కలిగే కష్టనష్టాలను గురించి వివరిస్తూ ఉండాలి.
- కోపం వల్ల షైతాన్ ఉద్దేశ్యాలు నెరవేరుతాయి. కాబట్టి కోపగించుకోవడమనేది చాలా చెడ్డ విషయం. అందుకే అలాంటి సందర్భాల్లో షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలని ఆదేశించడం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 48
హదీసు 49
وَعَنْ أَبي هُرَيْرةَ رَضِيَ اللَّهُ عنه قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا يَزَال الْبَلاءُ بِالْمُؤْمِنِ وَالْمؤمِنَةِ في نَفْسِهِ وَولَدِهِ ومَالِهِ حَتَّى يَلْقَى اللَّه تَعَالَى وَمَا عَلَيْهِ خَطِيئَةٌ" رواه التِّرْمِذيُّ وَقالَ: حديثٌ حسنٌ صحِيحٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : విశ్వాసులైన స్త్రీ పురుషుల ప్రాణానికి, సంతానానికి, ఇంకా వారి ధన సంపదలకు కూడా కఠిన పరీక్షలు ఎదురౌతూనే ఉంటాయి. (ఆ విధంగా కష్టాలు ఎదురౌతూ) ఆఖరికి వాళ్ళు (మరణానంతరం) దేవుణ్ణి కలుసుకున్నప్పుడు వారి (కర్మపత్రం)లో ఒక్క పాపం కూడా మిగిలి ఉండదు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్గా ఖరారు చేశారు.)
(సుననె తిర్మిజీలోని 'ఐహిక అనాసక్తత' అనే అధ్యాయంలో ఈ హదీసు పేర్కొనబడింది.)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “A Muslim, male or female, continues to remain under trial in respect of his life, property and offspring until he faces Allah, the Exalted, with no sin record”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఇహలోకంలో ఇతరులకన్నా విశ్వాసులే ఎక్కువగా కష్టాలకు, కఠిన పరీక్షలకు గురవుతూ ఉంటారని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఒక విశ్వాసికి ఇందులో కీడుకన్నా మేలే ఎక్కువగా ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహిస్తూ విశ్వాసంపై నిలకడను ప్రదర్శిస్తే దాని మూలంగా అతని పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 49
హదీసు 50
وَعَنْ ابْن عَبَاسٍ رضي اللَّه عنهما قَالَ: قَدِمَ عُيَيْنَة بْنُ حِصْنٍ فَنَزلَ عَلَى ابْنِ أَخيِهِ الْحُر بْنِ قَيْسٍ، وَكَانَ مِن النَّفَرِ الَّذِين يُدْنِيهِمْ عُمرُ رضِيَ اللَّهُ عنهُ، وَكَانَ الْقُرَّاءُ أَصْحابَ مَجْلِسِ عُمَرَ رضي اللَّهُ عنه وَمُشاوَرَتِهِ كُهولاً كَانُوا أَوْ شُبَّاناً، فَقَالَ عُييْنَةُ لابْنِ أَخيِهِ: يَا ابْنَ أَخِى لَكَ وَجْهٌ عِنْدَ هَذَا الأمِيرِ فَاسْتَأْذِنْ لِي عَلَيْهِ، فاستَأذنَ فَأَذِنَ لَهُ عُمرُ. فَلَمَّا دخَلَ قَالَ: هِيْ يَا ابْنَ الْخَطَّاب، فَوَاللَّه مَا تُعْطِينَا الْجَزْلَ وَلا تَحْكُمُ فِينَا بالْعَدْل، فَغَضِبَ عُمَرُ رضيَ اللَّه عنه حتَّى هَمَّ أَنْ يُوقِعَ بِهِ فَقَالَ لَهُ الْحُرُّ: يَا أَمِيرَ الْمُؤْمِنِينَ إِنَّ اللَّه تعَالى قَال لِنبِيِّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: {خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ} [سورة الأعراف: ١٩٨] وإنَّ هَذَا مِنَ الجاهلينَ، وَاللَّه مَا جاوَزَها عُمَرُ حِينَ تَلاَهَا، وكَانَ وَقَّافاً عِنْد كِتَابِ اللَّهِ تَعَالَى رواه البخاري.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉయైనా బిన్ హిస్న్ వచ్చి తన సోదర కుమారుడైన హుర్ర్ బిన్ ఖైస్ వద్ద బసచేశారు. ఈ హుర్ర్ బిన్ ఖైస్ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) (ఖలీఫాగా వున్నప్పుడు ఆయన) సన్నిహితుల్లో ఒకరు. (ఆ కాలంలో) హజ్రత్ ఉమర్ గారి సభికులు, సలహాదారులు, ఖుర్రాలై (విద్యావంతులై) ఉండేవారు – వారు నడి వయస్కులైనా లేక నవ యువకులైనా సరే; అప్పుడు ఉయైనా గారు తన సోదర కుమారునితో ఇలా అన్నారు : "భాతృజా! ఈ ఖలీఫా వద్ద నీకు మంచి పలుకుబడి ఉంది. కనుక నేనాయన్ని కలుసుకునేందుకు నువ్వు ఆయన వద్ద అనుమతి తీసుకో." హుర్ర్ బిన్ ఖైస్ (తన బాబాయికోసం) ఉమర్ (రదియల్లాహు అన్హు)ని సంప్రతించి అనుమతి కోరగా ఆయన అనుమతినిచ్చారు. లోపలికి ప్రవేశించిన తరువాత ఉయైనా ఖలీఫానుద్దేశించి "ఓ ఇబ్నె ఖత్తాబ్! దైవసాక్షి! నీవు మాకు తగినంతగా (సొమ్ము) ఇవ్వడంగానీ, మా విషయంలో తీర్పులు న్యాయంగా ఇవ్వడంగానీ చేయటం లేదు" అని నిందించారు. ఆయన మాటలు విని ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన్ని (ఆ మాట అన్నందుకు) దండించాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే హుర్ర్ బిన్ ఖైస్ కల్పించుకొని, "ఓ విశ్వాసుల నాయకా! అల్లాహ్ తన ప్రవక్తను ఈ విధంగా ఆదేశించాడు: 'ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు.' (అల్ ఆరాఫ్ : 199) ఇతను (నా బాబాయి) కూడా మూర్ఖుడే. (కాబట్టి క్షమించి వదలిపెట్టండి)" అని విన్నవించుకున్నారు. దైవసాక్షి! హుర్ర్ ఈ సూక్తిని పఠించగానే ఉమర్ (రదియల్లాహు అన్హు) అది విని ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దివ్య ఖుర్ఆన్ ముందు (అంటే దాని ఆదేశాల ముందు) కడు వినయంగా లొంగిపోయేవారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం).
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: ‘Uyainah bin Hisn came to Al-Madinah and stayed with his nephew Hurr bin Qais who was among those whom Umar (radiyallahu anhu) showed favour to. The knowledgeable people (Qurra’), whether they were old or young, had the privilege of joining Umar’s council and he used to consult them. ‘Uyainah said to Hurr: “My nephew, the Leader of the Believers shows favour to you. Will you obtain permission for me to sit with him?” Hurr asked `Umar and he accorded permission. When `Uyainah came into the presence of `Umar, he addressed him thus: “O son of Khattab, you neither bestow much on us nor deal with us justly.” `Umar (radiyallahu anhu) got angry and was about to beat him up when Hurr said: “O Leader of the Believers, Allah said to His Prophet ﷺ: ‘ Show forgiveness, enjoin what is good, and turn away from the foolish (i.e., don’t punish them).’ (7:199) This one is from the ignorants. When Hurr recited this, `Umar became quite motionless in his seat. He always adhered strictly to the Book of Allah.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
- పై హదీసులో 'ఖుర్రా' అనే పదం వాడబడింది. ఇది 'ఖారీ' అనే పదానికి బహువచనం. అసలు 'ఖారీ' అంటే చదువరుడు, పాఠకుడు అని అర్థం. హదీసులో ప్రస్తావనకు వచ్చిన 'ఖారీ' అంటే ఈ రోజుల్లో లాగా కేవలం దివ్య ఖురాన్‌ను శాస్త్రోక్తంగా, లయబద్ధంగా, మధురాతిమధురంగా పారాయణం చేసేవారని భావం ఎంతమాత్రం కాదు. పైగా ఇక్కడ ఖారీ అంటే ఖురాన్ యొక్క భావం అందులోని ఆజ్ఞలు, వారింపులు, ఆదేశాలను గురించి తెలిసిన ధర్మవేత్తలు (ఫుకహా), ఖురాన్‌కు భాష్యం చెప్పగల జ్ఞానఖనులు అని అర్థం. 'ఖులఫాయె రాషిదీన్'గా చరిత్రకెక్కిన నలుగురు ఖలీఫాల దర్బారులలో ఇలాంటి గొప్ప మేధావులు పండితులే సభ్యులుగా, సలహాదారులుగా నియమితులయ్యేవారు. దీనిద్వారా తెలిసేదేమిటంటే నాయకులు తమకు సలహాదార్లుగా ధర్మజ్ఞానం కలిగిన వారినే ఉంచుకోవాలి. సిరిసంపదలను కూడబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అవినీతిపరుల్ని సలహాదారులుగా నియమించుకోవడం తగదు. ప్రపంచ వ్యామోహం గల వ్యక్తుల సలహాలు చిత్తశుద్ధి, శ్రేయోభిలాషకు బదులు స్వార్థప్రయోజనాలతో కూడుకుని ఉంటాయి. కనుక వారి సలహాలను పాటించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
- సమావేశాలు, సలహా మండలుల్లో సభ్యులుగా ఉండేందుకు విషయపరిజ్ఞానం దైవభక్తి చాలా అవసరం. అంతేగాని వాటిలో సభ్యత్వానికి ఎక్కువ వయసు ఉండాలన్న నిబంధన లేదు.
- పరిపాలకుడు అత్యంత సహనశీలి, మృదు స్వభావి అయి ఉండాలి.
- అలాగే సత్య స్వీకారంలో కూడా అతడు తడబాటుకు, సందిగ్ధానికి లోనుకాకూడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 50
హదీసు 51
وعَن ابْنِ مسْعُودٍ رضي اللَّه عنه أنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّهَا سَتكُونُ بَعْدِى أَثَرَةٌ وَأُمُورٌ تُنْكِرونَها، قَالُوا: يَا رسُولَ اللَّهِ فَما تَأمرُنا؟ قالَ: تُؤَدُّونَ الْحقَّ الَّذي عَلَيْكُمْ وتَسْألونَ اللَّه الَّذِي لكُمْ" متفقٌ عَلَيهِ. "والأَثَرَةُ": الانفرادُ بالشيْءِ عمَّنْ لَهُ فيهِ حقٌّ.
హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : "నా అనంతరం (అక్రమ రీతిలో) ప్రాధాన్యతనిచ్చే ధోరణి ప్రబలుతుంది. మీరు చెడుగా భావించే దుష్ట కార్యాలు జరుగుతాయి." అది విని సహచరులంతా "దైవప్రవక్తా! మరి అలాంటి పరిస్థితుల్లో మాకు మీరిచ్చే ఆదేశం ఏమిటి?" అనడిగారు.
దానికి ఆయన "మీరు మీపై వున్న బాధ్యతలను సజావుగా నిర్వర్తించండి. కాని (మీకు దక్కవలసిన) మీ హక్కులను గురించి మాత్రం మీరు అల్లాహ్‌నే అడగండి" అని ఉపదేశించారు.
(బుఖారీ – ముస్లిం)
"అల్ అసరా" (ప్రాధాన్యతనివ్వటం) అంటే ఇతరులు కూడా హక్కుదారులుగా వున్న వస్తువుకు తానొక్కడే హక్కుదారుగా చెలామణి అవడం అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. సహీహ్ ముస్లింలో నాయకత్వ ప్రకరణం).
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “You will see after me favouritism and things which you will disapprove of.” They submitted: “What do you order us to do (under such circumstances)?” He replied, “Discharge your obligations and ask your rights from Allah”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ప్రజా నాయకులు, అధికారులు పరిపాలనా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా ప్రజల హక్కులను కాజేస్తూ, ప్రజలకు చెందవలసిన ధనాన్ని తమ జేబుల్లో నింపుకుంటూ బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావిస్తున్న పక్షంలో ప్రజలు వారిపై తిరుగుబాటు ధోరణుల్ని అనుసరించకుండా సహనాన్ని ప్రదర్శిస్తూ, దేవుని సన్నిధిలో తమ వల్ల జరిగిన పారబాట్లపై పశ్చాత్తాపభావంతో కుమిలిపోతూ క్షమాభిక్ష వేడుకోవాలని, అధికార మదాంధుల ఆగడాల నుండి తమను కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలని ఈ హదీసు బోధపరుస్తోంది. అయితే నాయకుల్లో దైవతిరస్కారం, దైవవ్యతిరేక ధోరణులు ప్రస్ఫుటమయితే మాత్రం ప్రజలు వారిని గద్దె దించి దేవుని నేలపై ధర్మాన్ని, న్యాయాన్ని నెలకొల్పడానికి తప్పకుండా ప్రయత్నించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 51
హదీసు 52
وَعن أبي يحْيَى أُسَيْدِ بْنِ حُضَيْرٍ رضي اللَّهُ عنهُ أَنَّ رَجُلاً مِنَ الأَنْصَارِ قَالَ: يَا رسولَ اللَّهِ أَلا تَسْتَعْمِلُني كَمَا اسْتْعْملتَ فُلاناً وفلاناً فَقَالَ:"إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدي أَثَرَةً فاصْبِرُوا حَتَّى تلقَوْنِي علَى الْحوْضِ" متفقٌ عَلَيهِ. "وأُسَيْدٌ"بِضَمِّ الْهمْزةِ."وحُضَيْرٌ"بِحاءٍ مُهْمَلَةٍ مضمُومَةٍ وضادٍ مُعْجَمَةٍ مفْتُوحةٍ، واللَّهُ أَعْلَمُ.
హజ్రత్ అబూ యహ్యా ఉసైద్ బిన్ హుజైర్ (రదియల్లాహు అన్హు) కథనం : అన్సార్లలోని ఒకాయన దైవప్రవక్త ﷺను "ఓ దైవప్రవక్తా! మీరు ఫలానా వ్యక్తిని ఉద్యోగిగా నియమించినట్లు నన్ను కూడా (ప్రభుత్వ) ఉద్యోగిగా ఎందుకు నియమించటం లేదు?" అని అడగ్గా ఆయన "మీరు నా అనంతరం (మిమ్మల్ని వదలిపెట్టి ఇతరులకు ప్రాధాన్యతనిచ్చే) పక్షపాత ధోరణులు చూస్తారు. అయితే మీరు మాత్రం (ప్రళయదినాన) నన్ను సరస్సు వద్ద కలుసుకునేంతవరకూ ఓర్పు వహించండి" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం).
English
Usaid bin Hudhair (radiyallahu anhu) reported that: A person from among the Ansar said, “O Messenger of Allah! You appointed such and such person and why do you not appoint me?” Messenger of Allah ﷺ said, “After me you will see others given preference to you, but you should remain patient till you meet me at the Haud (Al-Kauthar in Jannah)”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- దైవ ప్రవక్త పలికిన భవిష్యవాణి నిజమయింది. ఇది ఆయన మహిమోన్నతులకు, సత్యసంధతకు నిదర్శనం.
- సరస్సు అంటే అల్లాహ్ పునరుత్థానదినాన లేక స్వర్గంలో దైవప్రవక్తకు ప్రసాదించనున్న కౌసర్ సరస్సు. ఆయన తన శుభ కరములతో తన అనుచర సమాజానికి ఆ జలాశయపు పవిత్రమైన పానీయాన్ని త్రాగిస్తారు. ఒకసారి ఆ నీరు తాగితే ఇక దాహం అన్న మాటే ఉండదు.
- పదవీ వ్యామోహం మంచిది కాదు. పైగా పదవుల కోసం ఆశపడేవారికి పదవులు ఇవ్వరాదని హదీసులో తాకీదు చేయబడింది. అయితే ఎవరైనా తాను ఆ పదవికి అర్హుణ్ణని భావిస్తే, దైవభక్తి, ధర్మపరాయణత, వ్యవహార శైలి, విజ్ఞతా వివేచనల్లో తనకు సమ ఉజ్జీ అయిన వ్యక్తులెవరూ లేనప్పుడు, ఆ బాధ్యతను తాను నిర్వర్తించగలనని పై అధికారులకు దరఖాస్తు చేసుకోవడంలో మాత్రం తప్పు లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 52
హదీసు 53
وَعنْ أبي إِبْراهيمَ عَبْدِ اللَّه بْنِ أبي أَوْفي رضي اللَّهُ عنهمَا أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في بعْضِ أَيَّامِهِ التي لَقِيَ فِيهَا الْعَدُوَّ، انْتَظرَ حَتَّى إِذَا مَالَتِ الشَّمْسُ قَامَ فِيهمْ فَقَالَ: "يَا أَيُّهَا النَّاسُ لا تَتَمنَّوا لِقَاءَ الْعدُوِّ، وَاسْأَلُوا اللَّه العَافِيَةَ، فَإِذَا لقيتُموهم فاصْبرُوا، وَاعْلَمُوا أَنَّ الْجَنَّة تَحْتَ ظِلاَلِ السُّيُوفِ" ثُمَّ قَالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اللَّهُمَّ مُنْزِلَ الْكِتَابِ وَمُجْرِيَ السَّحَابِ، وَهَازِمَ الأَحْزابِ، اهْزِمْهُمْ وَانْصُرْنا عَلَيْهِمْ". متفقٌ عليه وباللَّه التَّوْفيقُ.
హజ్రత్ అబూ ఇబ్రాహీం అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔ ఫా (రదియల్లాహు అన్హుమా) కథనం : శత్రువులతో తలపడాల్సి వచ్చిన రోజుల్లో దైవప్రవక్త ﷺ యుద్ధం కోసం నిరీక్షించారు. (అంటే యుద్ధాన్ని కొంతకాలం పాటు దాటవేయటానికి ప్రయత్నించారు.) సూర్యుడు నడినెత్తినుండి క్రిందికి వాలిన తరువాత ఆయన జనం మధ్య నిలబడి ఈ విధంగా ప్రసంగించారు: "ప్రజలారా! మీరు ఎన్నడూ శత్రువుతో తలపడాల్సిన పరిస్థితి రావాలని కోరుకోకండి. నిత్యం శాంతినే కోరుకుంటూ అల్లాహ్‌ను ప్రార్థించండి- అయితే శత్రువులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి గనక ఎదురైతే మాత్రం సహన స్థైర్యాలతో పోరాడండి. స్వర్గం ఖడ్గచ్ఛాయల క్రింద ఉందన్న సంగతిని తెలుసుకోండి." తరువాత దైవప్రవక్త ﷺ ఇలా ప్రార్థించారు : "దేవా! దివ్య గ్రంథాన్ని అవతరింపజేసినవాడా! మేఘాలను నడిపించేవాడా! శత్రుసేనలను ఓడించిన వాడా! ఈ శత్రువుల్ని కూడా ఓటమికి గురిచేసి వీరికి వ్యతిరేకంగా మాకు సహాయపడు."
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం).
English
`Abdullah bin Abu Aufa (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ at one time when he confronted the enemy, and was waiting for the sun to set, stood up and said, “O people! Do not long for encountering the enemy and supplicate to Allah to grant you security. But when you face the enemy, show patience and steadfastness; and keep it in mind that Jannah lies under the shade of the swords.” Then he invoked Allah, saying, “O Allah, Revealer of the Book, Disperser of the clouds, Defeater of the Confederates, put our enemy to rout and help us in over-powering them”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- దైవమార్గంలో పోరాడటం కోసం పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలు చేసుకొని ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనైనా యుద్ధానికి సన్నద్ధులై ఉండాలని తాకీదు చేయబడినప్పటికీ సాధ్యమైనంతవరకు యుద్ధాన్ని నివారించటానికే ప్రయత్నించాలనీ, శత్రువుతో తలపడాల్సిన పరిస్థితిని ఉద్దేశపూర్వకంగా కోరుకోరాదని ఈ హదీసు బోధపరుస్తోంది.
- సహనం విశ్వాసికి గొప్ప ఆయుధం వంటిది. యుద్ధరంగంలో సహనం వహించడమంటే, మృత్యువుకి భయపడి వెన్నుచూపి పారిపోకుండా స్థిరచిత్తంతో ఎదురొడ్డి పోరాడటమని అర్థం.
- ఆయుధాలు, భౌతిక సాధన సంపత్తి. శక్తిసామర్థ్యాలు, సంఖ్యాబలంపైనే పూర్తి నమ్మకంతో ఉండరాదు. దాంతోపాటు యుద్ధంలో విజయం, సహాయం కోసం దైవాన్ని కూడా ప్రార్థిస్తూ ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|3. సహనం, ఓర్పు|హదీసు 53
You must be logged in to post a comment.