హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 365. పురుషులు కాషాయరంగు దుస్తులు ధరించటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 365వ అధ్యాయం: పురుషులు కాషాయ రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1800 – 1801) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

365. పురుషులు కాషాయ రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم لبس الرجل ثوباً مزعفراً

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1800

హదీసు 1800

عَنْ أنسٍ رضي اللَّه عَنْهُ قالَ: نَهَى النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنْ يَتَزَعْفَر الرَّجُلُ. متفقٌ عَلَيهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: పురుషుడు కాషాయ రంగు దుస్తులు ధరించటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని లిబాస్ ప్రకరణాలు)

English

Anas (radiyallahu anhu) said: The Prophet ﷺ prohibited men from wearing saffron-dyed clothes.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|365. పురుషులు కాషాయ రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం|హదీసు 1800

1801

హదీసు 1801

وعنْ عبدِ اللَّه بنِ عَمْرو بن العاص رضي اللَّه عَنْهُمَا قالَ: رأَى النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَيَّ ثَوْبَيْنِ مُعَصْفَرين فَقَال: "أمُّكَ أمَرَتْكَ بِهَذا؟ "قلتُ: أغْسِلُهُمَا؟ قَالَ:"بلْ أحْرقْهُما ". وفي روايةٍ، فَقَالَ:"إنَّ هَذَا منْ ثيَابِ الكُفَّار فَلا تَلْبسْهَا"رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను రెండు పసుపు పచ్చదుస్తులు ధరించి ఉండగా దైవప్రవక్త ﷺ నన్ను చూసి, "ఈ దుస్తులు తొడుక్కోమని మీ అమ్మ చెప్పిందా?" అని అన్నారు. (దైవప్రవక్త ﷺ అయిష్టతను గ్రహించి) నేను, "వీటిని (రంగుపోయేలా) ఉతుక్కోమంటారా? (దైవప్రవక్తా! )" అని అడిగాను. అందుకాయన "కాదు, వాటిని కాల్చేయి" అన్నారు.

వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన "ఇవి అవిశ్వాసుల దుస్తులు, వీటిని నువ్వు ధరించకు" అని అన్నారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని లిబాస్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) said: The Prophet ﷺ saw me dressed in two saffron-coloured garments and asked, “Has your mother commanded you to wear these?” I asked him, “Shall I wash them out?” He replied, “You had better set them to fire.”

Another narration is: “These are garments of the disbelievers. So do not wear them.”[Muslim].

ముఖ్యాంశాలు

ఉన్‌ఫుర్ రంగు పసుపుపచ్చగా కాషాయ రంగును పోలి ఉంటుంది. సాధారణంగా స్త్రీలే ఈ రంగు దుస్తులు ధరిస్తారు. అదీగాక అవిశ్వాసుల్లో కొందరు తమ మత చిహ్నంగా ఈ రంగు దుస్తులు ధరిస్తారు. పై రెండు వర్గాలను అనుసరించకుండా ఉండటానికి ఈ హదీసులో అలాంటి రంగు దుస్తులు ధరించకూడదని చెప్పటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|365. పురుషులు కాషాయ రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం|హదీసు 1801